Update 17 - Part 1 Ending
* * * * * *
కొంత సేపటికి శివ వాళ్ళు వచ్చారు.. కస్తూరి లేచి పరిగెత్తింది బండి సౌండు విని..
కస్తూరి : అన్నయ్య.. అది ఏదీ..
శివ : కంగారు పడకు.. కనిపించలేదు..
కస్తూరి : మావయ్యా.. అని గగన్ ని చూసింది.
గగన్ : శివా.. సందీప్ ఇవ్వాళ ఆఫీస్ కి కూడా రాలేదట.. శ్రావణి ఇంటికి కూడా వెళ్ళలేదు.
శివ భరత్ వైపు చూసాడు.
భరత్ : నాకు ఏమి అర్ధం కాకుండా ఉంది శివా.. మా ఇంటికి కూడా రాలేదని చెల్లి ఫోన్ చేసింది. నేనూ చెల్లితో తన ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకి పంపించాను కానీ నొ రెస్పాన్స్.
మీనాక్షి : బుజ్జి.. ఏంటిదంతా..
ఇంతలో శివకి ఫోన్ వచ్చింది.. ఎత్తాడు
శివ : హలో
ప్రదీప్ : హలో.. శివా.. ఎలా ఉన్నావ్
శివ : ఎవరు?
ప్రదీప్ : ప్రతాప్ గుర్తున్నాడా
శివ : ప్రదీప్..
ప్రదీప్ : ఇంత టెన్షన్ లో కూడా నీ మైండ్ బాగా పనిచేస్తుంది.. యు ఆర్ గ్రేట్.. ఇంతకీ మీ ఇంట్లో ఎవరో కనిపించడం లేదని కబురొచ్చింది..
శివ : ఇది నీ పనే అని నాకు తెలిసిన గంటలో నీ తల నా ఇంటి గుమ్మానికి వేలాడదీస్తాను.. కోపంగా అరిచేసరికి అందరూ శివ చుట్టు నిలుచున్నారు
ప్రదీప్ : అవును ఎత్తుకొచ్చింది నేనే, ఏం చేస్తావ్.. అయినా నువ్వు నన్ను గంటలో చంపలేవు నేను ఇండియాలో లేను.. ఇక్కడుంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు.. అందుకే మకాం కొలంబియాకి మార్చాను
శివ : ఏం కావాలి నీకు
ప్రదీప్ : నేనే నీకొక గిఫ్ట్ పంపించాను మీ ఇంటి బైట ఉంది చూడు అని కాల్ కట్ చెయ్యగానే శివ బైటికి పరిగెత్తాడు.
శివ వెనకే అందరూ వెళ్లారు.. గేట్ ముందు రెండు శవపేటికలు ఉన్నాయి, ఇంటి సెక్యూరిటీ వాటి దెగ్గరికి వెళుతుంటే శివ కూడా వెళ్లి ఓపెన్ చేసాడు.. మొదటి దాంట్లో సందీప్ ని చూసేసరికి ఏడుపు ఆగలేదు.. వాడిని పట్టుకుని ఏడుస్తూనే సెక్యూరిటీ ఇంకో పెట్టెని తెరిచి అందులో శ్రావణి ఉండటం చూసి బాధ పడ్డాడు.
శివ ఫోన్ మళ్ళీ మోగింది..
ప్రదీప్ : ఎలా ఉంది గిఫ్ట్.. బాగుందా.. ఇంకా అయిపోలేదు.. ఇక్కడ ఈ చిన్నది పాల కోసం ఒకటే ఏడుపు.. మా వాళ్ళు ఫ్లైట్లో తీసుకొస్తున్నారు.. నువ్వే బాలన్స్ వస్తున్నావా లేదా
శివ : వస్తున్నాను..
ప్రదీప్ : చనిపోయిన నా తమ్ముడి మీద ఒట్టు.. నువ్వు వస్తే పాపని నేను తాకను కూడా తాకను.. ఐ స్వేర్.. ఇంతకీ ఈ ఐడియా ఇచ్చింది ఎవరో తెలుసా నీ శత్రువు సుశాంత్.. అని నవ్వాడు.
శివ : (కోపం బాధ ఆగబట్టుకుంటూ ) వస్తున్నాను..
ప్రదీప్ : ఆ.. ఆ.. ఒక్కడివే కాదు.. నీ భార్య మీనాక్షిని కూడా తీసుకురా అని శివకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫోన్ పెట్టేసాడు.
శివ ఎదురుగా ప్రదీప్ మనుషులు నిలుచొని ఉన్నారు.. శివ కస్తూరి దెగ్గరికి వెళ్లి తల మీద చెయ్యి వేసి.. అమ్ములు ప్రాణానికి నా ప్రాణం అడ్డు.. తనకి ఏమి కాదని మాటిస్తున్నాను అని అందరినీ చూసి మీనాక్షిని చూసి చెయ్యి చాపాడు.. మీనాక్షి ఏడుస్తూ శివ చెయ్యి పట్టుకుంది.. ఇద్దరు వెళ్లి ప్రదీప్ పంపించిన కార్ ఎక్కి కూర్చున్నారు.
కారు నేరుగా ఎయిర్పోర్ట్ వైపు కాకుండా మూసేసిన ఒక పాత రన్ వే వైపు వెళ్లి ఆగింది, అక్కడ ఒక ప్లేన్ రెడీగా ఉంది చుట్టు ఇరవై మంది కాపలా ఉన్నారు. అంతా ఫారినర్స్.. వెళ్లి ఫ్లైట్ ఎక్కి కూర్చున్నారు.
మీనాక్షి ఏడుస్తూ శివ భుజం మీద వాలిపోయింది. శివ ధైర్యంగా మీనాక్షి చెయ్యి పట్టుకుని ధైర్యంగా ఉండమని కళ్ళతోనే చెపుతూ నుదిటి మీద ముద్దు పెట్టుకుని పడుకొమ్మని తలని తన గుండె మీద పెట్టుకున్నాడు.
మీనాక్షి : బుజ్జి మాట్లాడట్లేదు
శివ : అరణ్య అస్సలు మనతో మాట్లాడడం లేదు కదా, నీకు మాట ఇచ్చాడు కదా
మీనాక్షి : లేదు పొద్దున ఆ మాటని తీసుకుని బుజ్జిని బతిమిలాడితే మాట్లాడాడు.. కానీ ఇందాకటి నుంచి ఏం మాట్లాడడం లేదు.
శివ : ఇవ్వాళ పౌర్ణమి.. తన శక్తులు పని చేయవని చెప్పాడు.
మీనాక్షి ఏడుస్తూనే కళ్ళు మూసుకుని పొద్దున్న అరణ్య మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చి మౌనంగా కళ్ళు మూసుకుంది.
ఫ్లైట్ స్టార్ట్ అయ్యి రన్ వే మీద పరిగెడుతుంది.. శివ ఆలోచనలు కూడా అదే వేగంతో పరిగెడుతున్నాయి.. సందీప్ జ్ఞాపకాలు కూడా.. కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
సడన్ గా మెలుకువ వచ్చి చూసేసరికి శివ కళ్ళు తెరిచాడు, మీనాక్షి కూడా లేచింది.. పెద్ద పెద్ద శబ్దాలు.. ఫ్లైట్ దక్షిణ అమెరికా సరిహద్ధులు దాటి అమెజాన్ అడవుల మీదగా వెళుతుండగా అన్ని ఉరుములు మెరుపులు పెద్ద పెద్ద శబ్దాలకి మీనాక్షి భయపడి శివ చేతిని గట్టిగా పట్టుకుంది.
లోపల కూర్చున్న ఎవ్వరికి ఏం జరుగుతుందో ఏమి అర్ధం కాలేదు, ఒక్కసారిగా అన్ని శబ్దాలు ఆగిపోయాయి.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. సడన్ గా ఏదో శక్తి.. శక్తి కాదది, పెద్ద మంట ఒకటి ఆగకుండా ఫ్లైట్ మీద పడి దాన్ని పేల్చేస్తూ సరిగ్గా మీనాక్షి కడుపు మీద పడింది. ఆ భాస్మపు మంటకి, ఆ వేడికి అప్పటికే అందులో ఉన్న అందరూ చనిపోయారు శివ, మీనాక్షిలతో సహా.. కానీ అరణ్య మాత్రం లోపలే ఉన్నాడు.
గత కొన్ని రోజులుగా అరణ్య తన అమ్మ కడుపులో నుంచి బైటికి వస్తే ఎక్కడ తను చనిపోతుందో అని వీలైనన్ని రోజులు లోపలే ఉండాలని తన శక్తులన్నీ ఏకం చేసి మీనాక్షి కడుపులోనే ఉండిపోయాడు.. కానీ ఇప్పుడు ఆ మంట ఆగకుండా అరణ్య మీద పడేసరికి ఆ శక్తికి తట్టుకోలేక ఒక్కరిగా పొట్ట చీల్చుకుని బైటికి వచ్చేసాడు.. ఫ్లైట్ నేల కూలుతుంది.. అరణ్య ఇంకా గాల్లోనే మంటతో పాటు దూరంగా విసిరి వేయబడ్డాడు.. ఇంకా కళ్ళు తెరవలేదు.. తనలో చలనం లేదు.. ఇంతలోనే ఒక పెద్ద శబ్దం అరణ్య చెవుల్లో మారు మ్రోగుతుంది.. శంఖపు శబ్దం అది.. దేవుళ్ళు తప్ప ఇంకెవ్వరు అంత గట్టిగా ఊదలేనటువంటి శబ్దం. భూమి మొత్తం కంపించింది ఆ శబ్దానికి..
సరిగ్గా ఇంకో ఇరవై అడుగుల్లో కింద పడిపోతాడనగా అరణ్యలో చలనం వచ్చింది, కళ్ళు తెరవలేదు కానీ.. తను పడే చోట ఒక పెద్ద కమలం విచ్చుకుని ఆ మెత్తని రెక్కలలో అరణ్య పడిపోయాడు.. బిడ్డ మీదకి ఎండ పడకుండా ఆ కమలం తన రెప్పలని మూసేసింది.. ఆ అడవిలోని ఆ ప్రాంతం మొత్తం చెట్లతో వెలుగుని కప్పేసి భయంకరమైన చీకటితో చీమ కూడా దూరలేనంత దట్టంగా చెట్లతో చీకటితో అలుముకుపోయింది.
అరణ్య ముడుచుకుని పడుకుండిపోయాడు కానీ తన కళ్ళు ఇంకా మూసుకుపోయే ఉన్నాయి.. తన కంట్లో నుంచి కన్నీటి ధార కారుతూనే ఉంది...
ఇంతటితో అరణ్య ఆగమన అధ్యాయం ముగిసినది

THANKYOU