Update 18 - Part 2 Starting
అరణ్య
PART 2
PART 2
"అమ్ములు తల్లీ...."
"యే... కళ్ళు తెరిచిందీ....నా ముద్దుల తల్లీ ఉమ్మా..."
"ఇంద పాస్ పోపించు"
"వదినా... లేచిందా నీ అమ్ములు, ఇటివ్వు అంతే దిగ్గున నిద్ర లేచి మళ్ళీ తల పట్టుకుంటూ రగ్గు ముసుగేసుకుని పడుకుంది ఇరవై ఏళ్ల అప్సరస, తెల్లని మేని గల అమ్మాయి.
పని మనిషి ఆ అమ్మాయిని లేపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే అందంగా అటు ఇటు బొర్లుతుంది. శిల్పానికే ప్రాణం పోస్తే ఇలాగే ఉంటుందా అనే అందం తనది కనిపించకుండా రగ్గుతో కప్పేసింది. పనిమనిషి చిన్నగా లాగుతుంటే ముందు మొహం బైటికి వచ్చింది అందమైన గుండ్రటి ముఖానికి అందమైన నుదురు, సన్నని పొడుగాటి ముక్కు.. వయసుతో పాటు వచ్చిన అందానికి గుర్తుగా నవ్వినప్పుడు ఎరుపెక్కే బుగ్గలు, పని మనిషి మాట విననంటూ కళ్ళు తెరిచి మూసుకుంది. ఆ నల్లని కళ్ళు చూస్తే అందమైన చేప కళ్ళే గుర్తుకొస్తాయి నేరుగా చూసే అవకాశం ఎవ్వరికి దక్కకపోయినా మనిషి లోతులకందని లోకమేలే కళ్ళు అవి. తెరిచి మూసిన కను రెప్పలు కావవి కను తెరలు అనొచ్చేమో. పువ్వులా మెరిసే ఆ పెదవుల శోభకి లొంగనివారు ఉండరు. ఎవ్వరూ కనీసం అందుకోలేని ఆ నలభై ఐదు కేజీల శరీరం ఒక్కసారి ఏ రక్షణా లేకుండా బైటికి వచ్చి ఒక్క క్షణం నిలుచున్నా చాలు ఆ తీయని పెదవుల చుట్టూ ముసిరే తేనెటీగలని ఆపడం ఒక దేశపు సైన్యం వల్ల కూడా కాదు. ఇక ఆ పెదవుల నుంచి వచ్చే ఆ నవ్వు ఆ ఇంటికే వెలుగు. క్రిందున్న ఆ మెడ తన సన్నని శరీర సౌష్టవానికి కనిపించి కనిపించని ఎముకల వరస వల్ల మెడ కింద చిన్న గుంట కూడా అందంగా అమరింది.
అమ్మగారు... అమ్మగారు... లేవండి.. పెద్దమ్మ గారికి మీరింకా లేవలేదని తెలిస్తే నా మీద కోప్పడతారు అని రగ్గు మొత్తం లాగేసింది. నిండా తెల్లని దుస్తులలో దేవకన్యలా నిద్ర మత్తులో మునిగినట్టు నటిస్తూ ఇందాక నిద్రలో వినిపించిన ఆ మాటలని పదే పదే తలుచుకుంటుంది. పనిమనిషి కూడా ఆపకుండా అదే పనిగా విసిగించడంతో కళ్ళు తెరిచి చిన్నగా నవ్వుతూ కసురుకుని లేచి కూర్చుంది.
రజిని : అమ్మాయిగారు రోజు రోజుకి మీ అందం అలా పెరిగిపోతుందమ్మా, మీ అందానికి సరితూగే మగాడు ఉన్నారంటారా
దానికి ఆ అమ్మాయి సిగ్గు పడుతుంటే ఆ మోహంలో నుంచి అందం ఇంకా ఉబికిందా అనిపించింది పనమ్మాయికి. ఇంకొక పొగడ్త మనస్ఫూర్తిగా విసురుతుంటే ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో కరెక్ట్ టైంకి వచ్చింది ఆ ఇంటి యజమానురాలు ఉమ.
ఉమ : ఏంటి అరణ్య ఇంకా లేవలేదా, ఎన్ని సార్లు చెప్పాను నీకు పొద్దున్నే లెమ్మని, నిన్ను కాదు ఈ రజిని ని అనాలి, దీన్ని తీసేస్తే కానీ బుద్ధిరాదు.
రజిని : అమ్మ గారు తప్పయిందమ్మా... ఇంకోసారి జరగదు ఈ ఒక్కసారికి క్షమించండి.
ఉమ : వీటికేం తక్కువ లేదు, ఏమన్నా అంటే కాళ్ళ మీద పడతారు సిగ్గులేకుండా... అలగా జనం.. అని నసుగుతూ వెళ్ళిపోయింది.
రజిని మౌనంగా ఉండటం తప్ప ఇంకేం చెయ్యలేదు, తన స్థానంలో ఇంకెవరున్నా చేసేది అలా మౌనంగా తల దించుకుని ఉండాల్సిందే లేకపోతే వారి జీవితాలు తలకిందులైపోతాయి.
అమ్మాయి మౌనంగా లేచి రజిని భుజం మీద చెయ్యి వేసింది.
రజిని : అమ్మాయిగారు
అరణ్య : క్షమించు రజిని, నా వల్లే..
రజిని : అయ్యో అమ్మగారు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి... లేవండి పెళ్లి పనులు మొదలెట్టేసారు పంతులుగారు, ఇందాకే వచ్చి మీ పెళ్లి రోజు నిర్ణయించారు ఈ నెల ఇరవైయ్యో తారీకే మీ పెళ్లి... అందుకే పెద్దమ్మగారు హడావిడి చేస్తున్నారు.
లేచి బాత్రూంకి వెళ్లాను, గీజర్ హాట్ వాటర్ వైపు తిప్పి షవర్ ఆన్ చేసి కళ్ళు మూసుకున్నాను ఇందాక నాకొచ్చిన కల కొంచమైనా ముందుకు జరిగి ఇంకొంచెం ఏమైనా తెలుస్తుందేమో అని నా చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. నాకొచ్చే ఒకే ఒక కల, ఎవరో ఆడ గొంతు నన్నో కాదో తెలీదు కానీ ప్రేమగా అమ్ములు అని పిలవడం, కొన్ని మాటలు.. అంతే ఇంతకు మించి ఒక్క ముక్క కూడా కల ముందుకు జరగదు. రజిని చెప్పినట్టు ఇరవైయ్యో తారీకు నా పెళ్లి అంటే కరెక్ట్ గా ఇరవై రోజులు మాత్రమే ఉంది, ఈరోజే ఆఖరి పరీక్ష ఇదీ అయిపోతే ఇక కాలేజీ మొహం చూడాల్సిన అవసరం లేదు. నా మొహం అస్సలు నన్ను బైటికి రానిస్తే కదా, ఇవన్నీ తరువాత.
ఎవరో డోర్ కొడుతుంటే షవర్ ఆపాను.
రజిని : అమ్మగారు.. కొంచెం త్వరగా కానివ్వండి మీకు పుణ్యం ఉంటుంది, అవతల పరీక్షకి టైం అవుతుంది.
అరణ్య : వస్తున్నానే పరీక్ష నీకో నాకో అర్ధమే కాదు నాకు. అని తనకి వినిపించేలా అరిచి మళ్ళీ షవర్ ఆన్ చేసాను.
వేడి వేడి నీళ్లు పొగలు కక్కుతూ పొడుగాటి కేశాల నుంచి ఒంటి మీదకి, అటు నుంచి భుజాల మీదగా ఇంకా తన చెయ్యి కూడా పడని ఆ సంపద మీద నుంచి దారులు మళ్ళుతూ కిందకి జారుతూ చివరికి ఒకే చోట కలిసిపోయి కింద పడుతున్న ఆ శబ్దాలని ఆ నీళ్ల స్పర్శని ఆస్వాదిస్తూ ఇష్టం లేకపోయినా త్వరగా స్నానం కానిచ్చేసి బైటికి వచ్చింది అరణ్య.
అరణ్యకి తెల్లని దుస్తులంటే ఇష్టం అది చీర అయినా పంజాబీ డ్రెస్ అయినా చోలి అయినా తెల్లని బట్ట అయితేనే కడుతుంది దాని మీద ఇంకెలాంటి రంగు ఉండటానికి ఇష్టపడదు. బట్ట చేతుల నిండా ఉండాలంటుంది ఒకరకంగా పాత కాలపు జపనీయలు చైనీలు ఒళ్ళు కనపడకుండా నిండుగా ఉండే వస్త్రాలంకరణని అరణ్య బాగా ఇష్టపడుతుంది అందులోనూ తెలుపే అయ్యి ఉండాలి.
రెడీ అయ్యి కిందకి వెళ్లి అందరిని నవ్వుతూ పలకరించి తన అమ్మ ఉమకి చెప్పేసి బైట సెక్యూరిటీతో రెడీగా ఉన్న రోల్స్ రాయిస్ కారుని చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ ని చూస్తూ కొంత అసహనంగా ఎక్కి కూర్చుంది. రోజూ చూసేదే అయినా తనకి అలవాటే అయినా అరణ్యకి అదేదో దేశ ద్రోహిని నడిపించుకెళ్లినట్టు ఫీల్ అవుతుంది. అరణ్య ఎక్కడికెళ్తే అక్కడికి తన తోకలా వచ్చేస్తారు ఎవ్వరు తనతో మాట్లాడకూడదు తనూ ఎవ్వరితో మాట్లాడకూడదు. ఈ కట్టుబాట్లకి నియమాలకి అరణ్య చిన్నప్పటి నుంచి చూసి చూసి విసుగెత్తిపోయింది.
కారు ఎక్కి కూర్చున్నాను కొంత ప్రశాంతంగా అనిపించింది నేను ఎక్కడుంటే అక్కడ అందరూ నాతో మాట్లాడాలనుకోవడం నన్ను అదే పనిగా చూడటం చేస్తే నేను చాలా ఇబ్బంది పడతాను. అయినా ఇంకెంతలే ఈ ఒక్క రోజు అయితే అయిపోతుంది. ఇక నాకు ఎలాగో పెళ్లి అయిపోతుంది ఎలాగో అప్పుడు అస్సలు నేను ఇక బైటికి వచ్చే అవకాశం కూడా ఉండదు. ఏంటో ఇరవై ఒకటి పడగానే అమ్మాయికి పెళ్లి చేసెయ్యాలా నా పుట్టిన రోజే నాకు పెళ్లి చేసెయ్యాలి అనుకుంటున్నారు నన్ను ఏంటో.. అనుకుంటూ వెళ్లి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాను. క్వశ్చన్ పేపర్ ముందు పెట్టారు ఆన్సర్ షీట్ మీద పెన్ పెట్టి పొద్దున వచ్చిన కల గురించి ఆలోచిస్తున్నాను.
అస్సలు నా చిన్నప్పటి నుంచి నాకు అన్నీ సందేహాలే, నా జీవితానికి సంబంధించిన ఒక్క విషయం కూడా నాకు నచ్చింది లేదు, అన్నిటికి నవ్వుతూ తల వంచుతూనే ఉన్నాను. ఇంతలో అరగంట పూర్తయ్యిందని ఇన్విజిలేటర్ చెప్పగానే దృష్టి పరిక్ష మీద పెట్టాను. త్వరగానే రాసేసి కూర్చున్నాను పరీక్ష అయిపోయిందని చెప్పలేదు చెపితే ఇంటికి తీసుకెళ్లిపోతారు అందుకే రాస్తున్నట్టు నటిస్తూ ఆలోచిస్తున్నాను.
నాకు ఇష్టమైనవి రెండే రెండు ఒకటి చదవు ఇంకోటి సంగీతం ఆ తరవాత పక్షులు. ఇవే నా లోకం కాళీ పేజీ ఒకటి తీసుకుని నా మిత్ర బొమ్మ గీస్తున్నాను. నా పదవ పుట్టిన రోజున ఒకరోజు ఎగురుకుంటూ వచ్చిందీ హంస. అప్పటి నుంచి నాతోనే ఉంది. మిత్ర అని పేరు పెట్టుకున్నాను. నేనంటే తనకి చాలా ఇష్టం. ఆలోచిస్తు బొమ్మ గీస్తుంటే బెల్లు మోగింది రేపటి నుంచి కాలేజీకి కూడా రాలేను ఇవ్వాళ ఎలాగైనా నా స్నేహితులతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను.
ప్లీజ్ ప్లీజ్ అంటూ తన అరచేతిని కళ్ళకి ఆనించుకుంది, చిన్నప్పుడెప్పుడో జ్యోతిష్యం చెప్పే సాధువు చెప్పాడు అరణ్యకి.. అర చేతిలోనే నీ జీవితం.. జీవిత గమనం ఉందని ఏమి కావాలన్నా దాన్నే అడగమని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అరణ్యకి ఏమి కావాలనిపించినా ఏ బాధ వచ్చినా తన అర చేతిలో ఉన్న గోరింటాకు పెట్టినంత మచ్చని అడుగుతుంటుంది ఇప్పుడు అడిగినట్టు.
ఎగ్జామ్ రాసి బైటికి రాగానే గార్డ్స్ అరణ్య చుట్టూ రక్షణగా నిలబడ్డారు అరణ్య నిరాశగా కారు వైపు కదులుతుంటే మెయిన్ గార్డ్ వచ్చి అరణ్యతో మేడం మీ పెళ్లి అయ్యేంతవరకు నాన్న గారు మీకు ఫ్రీడమ్ ఇవ్వమన్నారు ఇక నుంచి నొ ప్రోటోకాల్స్ కానీ మీకు సెక్యూరిటీగా మాత్రం ఉంటాము అన్నాడు.
ఆ మాటలు వినగానే అరణ్య సంతోషం అంతా ఇంతా కాదు, తన అరచేతి మీదున్న మచ్చని ముద్దు పెట్టుకుని గాల్లోకి ఎగురుతూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ అంటూ ఎగిరి గంతేసింది.. ఇంతలో తన ఫ్రెండ్స్ రావడంతో సంతోషంతో అటు వెళ్ళబోయి అనుమానంగా ఒకసారి వెనక్కి తిరిగింది, మెయిన్ గార్డ్ నవ్వుతూ వెళ్ళమన్నాడు.. అంతే.. నవ్వుతూ పంజరం నుంచి ఎగిరిపోయే చిలకలా పరిగెత్తుతూ తన స్నేహితుల దెగ్గరికి వెళ్ళిపోయింది. ఇక తన స్నేహితులయితే ఆశ్చర్యంగా చూసారు. అందరూ ఒక్కసారిగా అరణ్య అని అరిచేసారు.
అరణ్య మాట్లాడుకుందాం అని నవ్వుతూ ముందుకు పరిగెత్తింది, తన వెనకే స్నేహితులు కూడా.. అందరూ వెళ్లి కాంటీన్ లో కూర్చున్నారు. అందరూ ఆశ్చర్యపోతుంటే అరణ్య నోరు విప్పింది.
అరణ్య : నా పెళ్లి కుదిరింది, ఇంకో వారంలో పెళ్ళైపోతుంది అందుకే కొంచెం ఫ్రీగా వదిలారు
అమ్మాయి : కంగ్రాట్స్ అరణ్య
అబ్బాయి : కంగ్రాట్స్
అమ్మాయి : ట్రీట్ ఏమైనా ఉందా మళ్ళీ కనిపిస్తావో లేదో
అమ్మాయి : ఎన్ని రోజులు అయ్యిందే ఇలా మాట్లాడుకుని
ఆ పక్కనే ఉన్న కేశవ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అరణ్యనే చూస్తున్నాడు. గత మూడేళ్లుగా కేశవ్ అరణ్యతో మాట్లాడాలని చూస్తున్నాడు ఇంతవరకు ఒక్క అవకాశం కూడా రాలేదు, అందరికీ తెలుసు కేశవ్ కి అరణ్య అంటే ఇష్టం అని ఎప్పుడు అరణ్య చుట్టే తిరుగుతుంటాడు, గార్డ్స్ తో ఒకసారి అనవసరంగా దెబ్బలు కూడా తిన్నాడు, అప్పటినుంచి అరణ్య కేశవ్ ని దూరంగా పెడుతుంది. అరణ్య తన పెళ్లి గురించి చెప్పినా కేశవ్ ఇంకా అలానే చూస్తుండడంతో అరణ్యకి కొంచెం విసుగుపుట్టింది.
అరణ్య : కేశవ్.. నువ్వింకా మారలేదా.. అందని చందమామ కోసం ఎందుకు ఇంతలా ఆశపడుతున్నావో నాకు అర్ధం కావట్లేదు, ప్రాణాలు తీసేస్తారు.. ప్లీజ్.. నాకు ఇవ్వక ఇవ్వక ఫ్రీడమ్ ఇచ్చారు దయచేసి దాన్ని చెడగొట్టొద్దు అని చేతులు ఎత్తి దణ్ణం పెట్టి మళ్ళీ దూరం నుంచి తననే గమనిస్తున్న గార్డ్స్ ని చూసి చేతులు దించి నవ్వుతూ ఏం లేదన్నట్టు నటిస్తుంది.
అందరూ కేశవ్ ని కోపంగా చూసారు, ఎందుకంటే అస్సలు కేశవ్ అరణ్య వాళ్ళ గ్రూపులో ఉండేవాడు కాదు, కాలేజీలో కొంచెం లేటుగా జాయిన్ అయ్యాడు. తన వాలకం తన చూపులు అన్నీ అరణ్య మీదే.. అరణ్య కోసమే వాళ్ళ గ్యాంగులో జాయిన్ అయ్యాడని అందరికీ తెలుసు.. అరణ్యకి కూడా తెలుసు కానీ మంచివాడని మంచి ప్రవర్తన కలిగిన వాడని వాళ్లలో కలవనిచ్చారు.
అరణ్య : ప్లీజ్ కేశవ్, వెళ్ళిపో
కేశవ్ : ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి అరణ్య, ఆ తరవాత నీకు జీవితంలో కనిపించను, ఈ ఒక్క నిమిషం నా భవిష్యత్తుకి నీ భవిష్యత్తుకి చాలా ముఖ్యమైనది.. ఒక్కటే నిమిషం ఇక కనిపించను అని బతిమిలాడాడు.
కేశవ్ కళ్ళలో నీళ్లు చూసి అరణ్య తన స్నేహితులని చూసింది.. వాళ్ళు అర్ధం చేసుకుని లేచి పక్కకి వెళ్లారు. కేశవ్ వెంటనే అరణ్య చేతులు పట్టుకునేసరికి అరణ్య కంగారు పడిపోయింది.. దూరం నుంచి చూసిన గార్డ్స్ లో ఇద్దరు కోపంగా అరణ్య వైపు కదిలారు.
అరణ్య : కేశవ్ ఏంటిది...?
కేశవ్ : అక్కా... అని ఏడ్చేసాడు
అరణ్య : ఏంటి...?
కేశవ్ : నేను నీ మేనత్త తమ్ముడి కొడుకుని, మీ అమ్మ ఉమాదేవి కాదు తన పేరు కస్తూరి, మీ మావయ్య పేరు శివ అత్తయ్య పేరు మీనాక్షి.. ఈ పేరు గుర్తుపెట్టుకో మీనాక్షి.. నీకు నీ గురించి నిజం తెలియాలంటే మీనాక్షి అనే పేరుని ఎవరికి డౌట్ రాకుండా మీ నాన్న ముందు ఎత్తు.. తరవాత నువ్వే నన్ను కలుస్తావు.. గుర్తుపెట్టుకో మీనాక్షి.. అంటుండగానే కేశవ్ జుట్టు పట్టుకుని లాగి కడుపులో గుద్దాడు ఒకడు. కేశవ్ కింద పడి కడుపు పట్టుకొగానే వెంటనే ఇద్దరు కలిసి ఎక్కడ పడితే అక్కడ తన్నడం మొదలుపెట్టారు.. అరణ్య ఆపబోతే కేశవ్ వద్దని సైగ చేసాడు.. గార్డ్స్ కేశవ్ ని ఈడ్చి అవతల విసిరేశారు.
అరణ్య : ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లి కారు ఎక్కి కూర్చున్నాను, అంతా అయోమయంగా ఉంది, తల పట్టుకున్నాను ఎంత ప్రయత్నించినా కేశవుడి మాటలు మెదడు లోనుంచి పోవడం లేదు. కేశవ నాతో ఇన్ని రోజులు మాట్లాడుకుంది ఈ మాటలా అంటే తను నన్ను ప్రేమించట్లేదా, నన్ను అక్కా అని పిలిచాడు.. తన కంట్లో ఆ కన్నీరు.. ఏది నిజం ఏది అబద్ధం.. నా అమ్మ పేరు కస్తూరి అన్నాడు కానీ మీనాక్షి అనే పేరుని గుర్తుపెట్టుకోమంటున్నాడు.. పైగా ఎవ్వరి దెగ్గరా ఈ పేర్ల గురించి అడగొద్దని చెప్పాడు.. నన్ను ట్రాప్ చెయ్యాలని చూస్తున్నాడా లేదు.. రెండు నిమిషాల్లో తనని పట్టుకుని చంపేస్తారని తెలుసు, అంత తెలివితక్కువ వాడు కాదు కేశవ.
కారు ఆగగానే అయోమయంగా ఇంట్లోకి వెళ్లిపోయాను అందరూ పలకరించినా పట్టించుకోలేదు.. పని మనిషి మాట్లాడినా ఏం మాట్లాడకుండా మౌనంగా మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నాను. ఏంటిదంతా.. ఛ.. ఛ.. అనవసరంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటున్నాను అని తనకి తానే సర్ది చెప్పుకుని లేచి ఫ్రెష్ అయ్యి తన వేణువు పట్టుకుని గార్డెన్ లోకి వెళ్ళింది. చెట్టు కింద కూర్చుని కృష్ణుడి లీలాగానం ఊదుతుంటే వయ్యారి నడకతో మైత్రి రెక్కలు ఊపుతూ వచ్చి అరణ్య పక్కన కూర్చుంది. మధ్యలో కేశవ మాటలు గుర్తురావడంతో వేణుగానం వేణువు తప్పి తన చేతిలోనుంచి కింద పడింది, తిరిగి తీసుకోబోతుండగా తనకి ఎప్పుడు కలలో వచ్చే ఆ మాటలు గుర్తురాగానే ఆగిపోయింది. కేశవ తన నాన్న ముందు మీనాక్షి పేరు ఎత్తమనడం గుర్తొచ్చి లోపలికి పరిగెత్తింది.
అరణ్య : అమ్మా.. నాన్న ఎక్కడా
ఉమ : ఏదో పని ఉందని వెళ్లారు, రావడానికి రెండు రోజులు పడుతుందట
అరణ్య : అలాగా ఎక్కడికి వెళ్లారు
ఉమ : అమెరికా.. అమెజాన్ ఫారెస్ట్.. ఏదో కాంట్రాక్టు పని అట
• • • • • •
DEEP IN THE AMAZON FOREST
(దట్టమైన అమెజాన్ అడవులలో)
బేస్ నుంచి కమాండర్ : సోల్జర్స్ యు ఆర్ గుడ్ టు గొ
సోల్జర్ : ఎస్ సర్.. ఆన్ మై కమాండ్ అంటూ ముందుకు కదిలాడు సోల్జర్ గన్ భుజాన పెట్టుకుని పొజిషన్లో తన వెనకే అనుసరిస్తూ ఇంకో ఇరవై మంది అమెరికన్ సోల్జర్స్, అందరూ హెవీలీ ఆర్మడ్.
బేస్ లో : ఎవరి మీద ఎటాక్ చేస్తున్నాము
కమాండర్ : సర్ ఇది అమెజాన్ అడవి, ఇక్కడ కనిపిస్తున్న యెల్లో ఏరియానే మీరు తవ్వాలనుకున్న గోల్డ్ మైన్ ఉంది.. కింద ఒక పెద్ద బంగారపు కొండనే ఉంది.. కానీ మన వాళ్ళు ఎంత మంది వెళ్లినా తిరిగి రావడం లేదు, అందుకే ఇవ్వాళ ట్యాగ్ టీంని పంపిస్తున్నాం.. వాళ్ళు చూసేది మనకి కూడా ఆ స్క్రీన్ లో కనిపిస్తుంది.
బంగారపు కొండ ఉన్నది ఎల్లో ఏరియా అయితే దాని మీద థిక్ గ్రీన్ కలర్ ఏంటి అండ్ ఎందుకు దాని చుట్టు ఆ రెడ్ లైన్ గీశారు..?
కమాండర్ : ఆ దట్టమైన అడవి కిందే బంగారపు కొండ దాగుంది, మనుషులు వెళ్ళలేనంత దట్టమైన అడవి అది, దానిని సూచించేదే ఆ గ్రీన్ కలర్
మరి ఎలా తవ్వి తీద్దాం అనుకుంటున్నారు?
కమాండర్ : వేరే ఆప్షన్ లేదు సర్.. మొత్తం నాశనం చెయ్యడమే.. ఇక ఆ రెడ్ లైన్ అక్కడున్న తెగ ప్రజలకి సంబంధించినది.. ఆ దట్టమైన అడవిని వాళ్ళే కాపలా కాస్తున్నారు, మన మీద ఎటాక్ చేసేది కూడా వీళ్ళే.. ఇక్కడ జోక్ ఏంటంటే ఆ దట్టమైన అడవి మధ్యలో దేవుడు ఉన్నాడని ఆ ప్రజల నమ్మకం.. అక్కడికి వెళ్లిన మన వాళ్ళు మాత్రం అక్కడున్న క్రూర జంతువులు మూకుమ్మడిగా ఎటాక్ చేస్తున్నాయని పిచ్చి కూతలు కూస్తునారు సర్ అని నవ్వాడు.. ఇవ్వాల్టితో ఆ గుట్టు రట్టవుతుంది.
బేస్ లో ఉన్న అందరి కళ్ళు స్క్రీన్ మీదె ఉన్నాయి, సోల్జర్స్ అడవి దాటి లోపలికి వెళ్లి తెగ ప్రజలు ఉండే చోటికి వచ్చారు, ఎవ్వరు కనిపించకపోవడంతో ఇంకా అలెర్ట్ గా ముందుకు వెళ్లి దట్టమైన అడవిలోకి వెళుతుంటే ఉన్నట్టుండి ఒక జింకపిల్ల ముందుకు దూకింది. అందరూ గన్స్ అటువైపు పెట్టారు.. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఏమి కనిపించడం లేదు.. ఇంతలో ఒక సోల్జర్ భుజం మీద నీళ్లు పడటంతో పైకి చూసాడు.. ఒక కోతి సుస్సు పోస్తూ సోల్జర్ ని చూసి నవ్వుతుంది.. దానికి సోల్జర్స్ అంతా వాడిని చూసి నవ్వారు.
కమాండర్ బి అలెర్ట్ గయ్స్ అనడంతో అందరూ పొజిషన్లో నిలబడ్డారు, ఉన్నట్టుండి చెట్ల మీద నుంచి బాణాల వర్షం కురిసింది, సోల్జర్స్ పైకి చూసి బుల్లెట్ల వర్షం కురిపించినా లాభం లేకపోయింది, పైనున్న ఆకుల వల్ల పెద్ద పెద్ద చెట్ల వల్ల ఏమి కనిపించడం లేదు.. నలుగురు సోల్జర్స్ చనిపోయారు, బాణాల వర్షం వల్ల అందరూ చెల్లా చెదురు అయ్యి విడిపడ్డారు.. అందరూ పైకి చూస్తుంటే దీనినే అద్దునుగా ఒక ఆడ సింహం గాండ్రిస్తూ మీదకి దూకి ఒకడి మీద వేటు వేసి ఇంకొకడి పీక పట్టుకుని తెరుకునే లోపే లాక్కేళ్ళిపోయింది. బేస్ లో అందరూ అది చూసి ఆశ్చర్యంగా లేచి నిలబడ్డారు.
ఇందాకటి కోతి ఇంకో సోల్జర్ మీదకి దూకి వాడి చేతిలో ఉన్న గన్ లాక్కుని పోయింది, అదే సమయంలో ఒక చింపాంజీ చెట్టు మీద నుంచి దూకి అడవి అదిరేలా గుండెల మీద బాదుకుంటూ ముగ్గురిని కొట్టి వాళ్ళ వీపుల మీద ధబా ధబా గుద్ది చంపేసింది. తెగ ప్రజలు ఓడలు పట్టుకుని శబ్దాలు చేస్తూ కిందకి దిగి మిగిలిన ఇద్దరిని బాణాలు వేసి చంపేస్తుంటే గుర్రాలు, ఏనుగులు, తోడేళ్లు జంతువులన్ని ఒకేసారి దాడి చేస్తూ సోల్జర్స్ ని భయ భ్రాంతులకి గురి చేసి అందరినీ చంపేసాయి.
ఒక సోల్జర్ కెమెరా ఇంకా పని చేస్తుంది, ఇందాక దూకిన ఆడ సింహం గాండ్రిస్తూ ముందుకు వచ్చి ఆ దట్టమైన చెట్లకి అడ్డుగా కూర్చుంది, అడవిలోని జంతువులన్నీ అక్కడికి వచ్చి ఆడ సింహం ముందు వినయంగా కూర్చున్నాయి వాటి వెనకే తెగ ప్రజలు కూడా మోకరిల్లి కూర్చున్నారు.. ఆడ సింహం ఎవరినో పిలిచినట్టు గాండ్రించగానే వెనక నుంచి ఒక పెద్ద గాండ్రింపు అడవితో పాటు అది వింటున్న బేస్ కూడా దద్దరిల్లింది.. తెగ ప్రజలు పాటలు పడుతుంటే పెద్ద జూలుతో ఉన్న ఒక మగ సింహం నడుచుకుంటూ వచ్చి ఆడ సింహం వెనక రక్షణగా నిలుచుంది.
ఆ మగ సింహాన్ని చూడగానే బేస్ లో ఉన్న వాళ్లకి చెమటలు పట్టాయి.. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసిన సింహం కొలతలు పదకొండు అడుగులు మాత్రమే కాని ఈ సింహం దాదాపు పదమూడు అడుగుల పైన మూడు వందల యాభై కిలోల పైన ఉంటుందని చూడగానే అక్కడున్న వాళ్ళు ఒక అంచనాకి వచ్చారు.
ఇంతలో ఫోన్ మొగగానే ఎత్తాడు
అరణ్య : నాన్న.. ఎక్కడున్నారు.. మీతో మాట్లాడాలి
రేపటి లోగా ఇంట్లో ఉంటాను
అరణ్య : అలాగే.. బై
అని కుర్చీ లోనుంచి లేచి స్క్రీన్ లో ఉన్న ఆ సింహాన్ని చూసాడు, ఆ సింహం చూపు ఎలా ఉందంటే చాలా క్రూరంగా ఇంకోసారి మా జోలీ రావద్దు అన్నట్టు ఒక బెదిరింపు ఇస్తున్నట్టుగా అనిపించింది.. వెళ్ళిపోతూ కమాండర్ ని చూసి అవి పిచ్చి కూతలు కావని ఇప్పటికైనా నమ్ముతారనుకుంటా.. మీరేం చేస్తారో నాకు తెలీదు నాకు ఆ బంగారపు కొండ కావాలి.. అది కూడా రోజుల గడువులోనే అయిపోవాలి.. పని పూర్తి అయ్యిందని మీరు కన్ఫర్మ్ చేస్తే మా వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేస్తారు అని సీరియస్ గా చెప్పేసి అక్కడి నుండి బైటికి వెళ్ళిపోయాడు.
రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉందనగా అందరూ షాపింగ్ పనులు పూర్తిచేసి కూర్చుని చీరలు చూసుకుంటుంటే మగవాళ్ళు అంతా ఒక పక్కన కూర్చుని ఆడాళ్ళ ముచ్చట్లు వింటూ అది బాగుంది ఇది బాగుంది అని చెపుతున్నారు.
ఉమ అక్కా నీ కొడుకు ఎక్కడా
అరణ్య : ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు అని నవ్వింది.. అందరూ నవ్వుతుంటే ఉమ అరణ్య వంక కోపంగా చూడటంతో అందరూ సైలెంట్ అయిపోయారు.
మావయ్య వచ్చాడు అంటూ అరుస్తూ వెళ్ళింది పాప.. ఉమ కూడా అది విని లేచి నిలబడింది. అరణ్య తన నాన్న దెగ్గరికి వెళ్లి పలకరించి ఆయన కూర్చున్నాక తన పక్కనే కూర్చుంది.
సుశాంత్ ఇదెలా ఉంది చూడు అని సూట్ పట్టుకుని నిలబడ్డాడు అరణ్య వాళ్ళ తాతయ్య.
ఉమ : బాగుంది
సుశాంత్ : తరవాత చూస్తాను.. అని అరణ్యని పలకరించాడు.. తమ్ముడు ఎక్కడా
అరణ్య : నిన్న నువ్వు వెళ్ళినప్పటి నుంచి కనిపించలేదు నాన్న
అందరూ మాట్లాడుకుంటుంటే.. మాటల్లో మాటగా ఉమ తన ఆడబిడ్డ కూతురుని చూసి పాపకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నావు అని అడిగింది.. దానికి ఆవిడ ఇంకా ఏమి అనుకోలేదు ఒక మంచి పేరు చెప్పు వదినా అనడంతో అరణ్యకి ఇదే సరైన సమయం అనిపించింది..
అరణ్య : నేను చెప్పానా అత్తా మంచి పేరు
చెప్పురా
అరణ్య : హ్మ్మ్.. మీనాక్షి అని పెట్టు చాలా మంచిపేరు
అరణ్య నోటి నుంచి ఆ మాట రాగానే ఉలిక్కిపడ్డారు కొంత మంది. అందులో సుశాంత్ అమ్మా నాన్నా ఇద్దరూ ఉన్నారు.. అరణ్య తన పక్కనే కూర్చున్న సుశాంత్ ని చూసింది.. ఆయన కళ్ళలో ఆశ్చర్యం కాదది భయం.. కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.. నుదిటి నుంచి ఓ పక్కన చెమట పట్టడం కూడా అరణ్య గమనించింది.
అరణ్య : ఏమైంది నాన్నా
సుశాంత్ : హా.. ఏం లేదు.. ఈ పేరు ఎవరిది.. మీ ఫ్రెండ్స్ దా
అరణ్య : లేదు.. మొన్న ఏదో కధలో చదివాను.. ఏ నాన్నా
సుశాంత్ : లేదు.. ఏం లేదు.. అని లేచి లోపలికి వెళ్ళాడు.
అరణ్య వెంటనే తన అమ్మ మొహం చూసింది తన మొహంలో ఏ ఆశ్చర్యము లేదు. లేచి తన రూంలోకి వెళ్లి వేణువు మరియు తన ఫోన్ తీసుకుని చీకటిలోనే గార్డెన్ లోకి వెళ్ళింది.. లైట్లు వేసుకోకుండా వెళ్లి చెట్టు కింద కూర్చుని తరవాత ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ వేణుగానం ఆలపిస్తుంటే హంస అయిన మైత్రి అరణ్యని చూసి తన పక్కన నిలుచుంది.
ఎటు తెల్చుకోలేక తన అరచేతిలో ఉన్న మచ్చని చూస్తూ ఏం అర్ధం కావట్లేదు నాకు దారి చూపించు అని వేడుకుంది అంతే ఆకాశంలో ఒక చుక్క ప్రకాశవంతంగా వెలిగేసరికి హంస గట్టిగా శబ్దం చేసింది.. అరణ్య తల ఎత్తి చూసేసరికి ఆకాశంలో వెలుగుతున్న చుక్క ఆగిపోయింది.. ఒక్క క్షణం అరణ్యకి ఏమి అర్ధం కాలేదు కానీ అది నమ్ముకుండా ఉండలేకపోయింది. చిన్నప్పటి నుంచి తన అరచేతిలో ఉన్న మచ్చని ఏది కోరుకుంటే అది జరుగుతుంది.. అందుకే మళ్ళీ తన అరచేతిని చూసి దారి చూపించు అంది.. అంతే మళ్ళీ అదే నక్షత్రం ప్రకాశంగా వెలిగి మళ్ళీ ఆగిపోయింది.. అరణ్య ఆశ్చర్యంగా నిలుచుని ఈసారి ఏం మాట్లాడకుండా తన అరచేతిని ఆ నక్షత్రం వైపు పెట్టగానే అది మళ్ళీ వెలిగింది.. అరణ్య తన చేతిని మళ్ళీ కిందకి దించేవరకు అలా వెలుగుతూనే ఉందది.. అరణ్య నవ్వుతూ తన అరచేతిని చూసి మళ్ళీ ఏమనుకుందో ఏమో గట్టిగా పిడికిలి బిగించి కింద కూర్చుండిపోయింది.
చాలా సేపటి తరవాత తన ఫోన్ తీసి కేశవ్ కి ఫోన్ చేసింది.
కేశవ్ : హలో ఎవరు
అరణ్య : అరణ్య..
కేశవ్ : అక్కా.. నన్ను నమ్ముతున్నావా
అరణ్య : నీతో మాట్లాడాలి
కేశవ్ : నీకు అన్ని తెలియాలి అక్కా.. కానీ నీ ఫోన్ టాపింగ్లో ఉంటుంది
అరణ్య : రేపు KFC కి వచ్చేయి మాట్లాడుకుందాం.
కేశవ్ : అలాగే అక్కా, తప్పకుండా.. రేపు నువ్వు ఏ డ్రెస్ లో వస్తావ్
అరణ్య : దేనికి
కేశవ్ : కారణం ఉంది
అరణ్య : రేపు నీకు ఫోటో పంపిస్తాను
కేశవ్ : మీ సెక్యూరిటీ KFC లోపలికి రాకపోతే అదే చాలు
అరణ్య : రారు..
కేశవ్ : ఓకే బై
అరణ్య ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూనే ఇక అక్కడ నుంచి లేచి ఇంట్లోకి వెళుతుంటే కుటుంబ సభ్యులంతా బైటే నిలుచొని ఆకాశంలోకి చూస్తున్నారు.
అరణ్య : ఏమైంది
ఉమ : నువ్వు చూడలేదా.. ఆకాశంలో ఏదో వెలుగు.. భూమ్మీద ఏమైనా పడుతుందా లేక ఏలియన్స్ ఏమైనా వస్తున్నారా అని అనుకుంటున్నారు.
అరణ్య లోపలికి వెళుతు వెళుతూ ఒకసారి చెయ్యి పైకి ఎత్తి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది.. అందరూ అదిగో అదిగో మళ్ళీ లైట్ వస్తుంది చూడండి చూడండి అని అరుస్తుంటే అరణ్య అది విని నవ్వుకుంది.
తెల్లారి లేచి రెడీ అయ్యి తన ఫోటో ఒకటి కేశవ్ కి పంపి కిందకి వచ్చింది అందరూ టీవీలో వార్తలు చూస్తున్నారు.. అరణ్య వెళ్లి తన అమ్మ పక్కన నిలబడింది.
అరణ్య : ఏంటి అంతా టీవీలో మునిగిపోయారు. అదీ న్యూస్ ఛానల్లో
ఉమ : రాత్రి ఆకాశంలో వెలుగు వచ్చింది కదా అది.. ఏలియన్స్.. ఉపగ్రహాలు కావట.. అదొక నక్షత్రం అట.. ఎందుకు అంతగా వెలిగిందో ఇంకా కారణాలు తెలియవని చెపుతున్నారు.
అరణ్య : ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారు, వెళ్లి కొంచెం సేపు మాట్లాడి వస్తా అని చెప్పేసి బైటికి వెళ్ళింది.
కారు నేరుగా KFC ముందు ఆగింది.. ముందు సెక్యూరిటీ లోపలికి వెళ్లి అంతా చెక్ చేసాక అప్పుడు అరణ్యని లోపలికి వదిలారు.. అరణ్య సెక్యూరిటీని లోపలికి రావొద్దని చెప్పి తనోక్కటే లోపలికి వెళ్ళింది.. సెక్యూరిటీ అరణ్య వైపు చూస్తూనే ఉన్నారు.. అరణ్య వెళ్లి తన ఫ్రెండ్స్ తో కూర్చుంది.
కేశవ్ : ఆర్డర్ మామ్
అరణ్య : కేశవ్...?
కేశవ్ : మీ వాళ్ళు చూస్తున్నారు.. అక్కడ ఒక లావు వ్యక్తి ఉన్నాడు, తినడం అయిపోయింది. ఆయన డోర్ దెగ్గరికి వెళ్ళగానే అక్కా నువ్వు లేచి అక్కడ కిచెన్ లోకి వచ్చేయి నీ ప్లేస్ లో నా చెల్లెలు నీలాగే కూర్చుంటుంది.. నేను అక్కడ నిలబడి నీకు సిగ్నల్ ఇస్తాను.. అని చెప్పేసి గబగబా వెళ్ళిపోయాడు.
పావుగంటకి ఆ లావు వ్యక్తి లేచి వెళ్ళిపోతూ డోర్ దెగ్గరికి రాగానే కేశవ సిగ్నల్ ఇచ్చాడు వెంటనే అరణ్య లేచి కిచెన్ లోకి వెళ్లడం తన స్థానంలో కేశవ చెల్లెలు అరణ్య వేసుకున్న దుస్తుల్లోనే అచ్చు అరణ్య కూర్చున్నట్టే కుర్చుంది సెక్యూరిటీకి అనుమానం రాకుండా.. కిచెన్ లోకి వెళ్లిన అరణ్యని కేశవ వెనక వైపుకి తీసుకెళ్లి అక్కడ ఉన్న వ్యక్తిని చూపించాడు.
అరణ్య : ఎవరు ఆయన
కేశవ : మా నాన్న.. చందు.. నాన్నా అనగానే వాకింగ్ స్టిక్ తో ఇటువైపు తిరిగాడు చందు.
అరణ్య వెళ్లి నమస్కారం చెయ్యబోతే ఆపి.. టైం లేదంటూ.. తనతో ఇరవై నిముషాలు ఆపకుండా జరిగిన కధ మొత్తం వివరించాడు. అంతా విన్న అరణ్యకి ఏమి మాట్లాడాలో ఏం అర్ధం కాలేదు.
బైట సెక్యూరిటీ
రేయి ఇందాక ఒకడు అరణ్య దెగ్గరికి ఆర్డర్ మేడం అంటూ వచ్చాడు కదా
అవును బాస్
KFC లో సెల్ఫ్ సర్వీస్ మాత్రమే ఉంటుంది.. పదండి లోపలికి వెళదాం అని లోపలికి నడిచి డోర్ తీయబోతే చందు వాకింగ్ స్టిక్ అడ్డం పెట్టి వాళ్ళని అపాడు.. వాళ్ళని విధిలిస్తూ ఒక పది సెకండ్లు టైం వేస్ట్ చేసి బైటికి వెళ్ళిపోయాడు.. ఈ లోగా అరణ్య తన స్థానంలో కూర్చుంది.
సెక్యూరిటీ : మేడం ఇక వెళదాం.. ఎక్కువసేపు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు అని మాట్లాడుతూనే ఇందాక చూసిన కేశవ కోసం వెతికాడు కాని కనిపించకపోవడంతో చుట్టు చూస్తుంటే అరణ్య లేచేసరికి వదిలేసి బైటికి నడిచాడు. అరణ్య కారు ఎక్కి కూర్చుంది.
కారులో కూర్చున్న అరణ్య, చందు చెప్పిన ప్రతీ ఒక్క మాట నెమరువేసుకుంది. ఇన్నేళ్లు తన బతికిన బతుకు, తన అమ్మా, నాన్నా ఆఖరికి తన పేరు కూడా తనది కాదని తెలిసేసరికి ఏమి చెయ్యలేక చున్నీతో కళ్ళు తుడుచుకుంది.
చందు : మా అక్కా బావ చనిపోయాక వాడిని, వాడు చేసే చేష్టలని ఎవరు ఆపలేకపోయారు.. మా బావ ఫ్రెండ్ అయిన సందీప్ ని ముందే చంపేశాడు.. ఆయనే కనక ఉండుంటే వాళ్ళని కాపాడుకునేవాడు.. మా అమ్మా నాన్నని కూడా చంపేశాడు.. నేను మాత్రమే మిగిలాను.. ఇంకా వాడి నుంచి తప్పించుకుని తిరుగుతూనే ఉన్నాం.. మా అక్కా బావ ముందే వాళ్ళ ఆస్తులన్నిటిని వాళ్ళకి పుట్టబోయే బాబు పేరు మీదకి వచ్చేలా రాసేశారు, అలా ఎందుకు చేసారో ఎవ్వరికి తెలీదు.. కానీ బాబు పుడితే మీనాక్షి చనిపోతుందని మాత్రమే మాకు తెలుసు.. కోర్టుకి తప్పుడు సాక్ష్యాలు చూపించి, నువ్వు శివ కూతురువి అని తప్పుడు సాక్ష్యాలు పుట్టించి అందరినీ నమ్మించాడు.. కోర్టు శివ తరపున ఎవ్వరు లేరని నమ్మి ఆస్తులకి గార్డియన్ గా సుశాంత్ ని ప్రకటించింది.. ఎదురొచ్చిన మా అమ్మా నాన్నని మా అమ్మమ్మని కూడా వదల్లేదు.. శివ ఆస్తులు వాడికి కలిసి వచ్చాక ఎవ్వరికి అందనంత దూరానికి వెళ్ళిపోయాడు.. నేను ఒంటి కాలితో ఏమి చెయ్యలేకపోయాను.. అని కన్నీళ్లు తుడుచుకున్నాడు.
అరణ్య : మరి మా అమ్మ..?
చందు : కస్తూరి వదిన తన అన్నయ్యా వదినలు చనిపోయారని తెలిసిన మరుక్షణం మీ అమ్మ, కావేరి అమ్మమ్మ ఇద్దరు పిచ్చి వాళ్ళు అయిపోయారు.. మీ అమ్మ నీ కోసం వాడి ఇంటికి వెళ్ళింది మళ్ళీ తిరిగిరాలేదు.. వాడు చంపేశాడు.. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడు ఎవడో కాదు ఆ ప్రదీప్ కొడుకు.. నీకు ఎంగేజ్మెంట్ జరిగిన తరవాత నీ ఒక్క సంతకంతో శివ సంపాదించినవి ఇన్నేళ్లు వాటికవే పెరిగిన ఆస్తులు మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి.. అవన్నీ కాదు.. ఈ నీకు నిజం తెలియాలి.. నీ వాళ్ళు ఎవరో నీకు తెలియాలి.. నీ జీవితం మొత్తం అబద్ధం అని నీకు తెలియాలి.. ఇందులోనుంచి నువ్వు బైటికి రావాలని చెపుతున్నాను.
అరణ్య : మరి కావేరి అమ్మమ్మ ?
చందు : ఇంకా బతికే ఉంది.. పిచ్చి ఆసుపత్రిలో ఉంది.. ఇంకా శివ, మీనాక్షి, కస్తూరి ముగ్గురు బతికే ఉన్నారని నమ్ముతుంది.. తనలో తనే మాట్లాడుకుంటూ తనలో తనే ఏడ్చుకుంటూ ఉంటుంది.
అరణ్య నేను మా అమ్మని, మా మావయ్యని చూడొచ్చా అని అడగ్గానే చందు ఫోన్ లో ఉన్న అందరి ఫోటోలు చూపించాడు.. తనకి పంపించమని అడిగితే వద్దన్నాడు. బుర్ర అంతా ఆలోచనలతో ఉండగానే కారు గేట్ తీసుకుని ఇంటి ముందు ఆగింది.. అందరూ పిలుస్తున్నా పలకరిస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది.. మంచం మీద పడుకుని ఏడ్చేసింది.
ఏది నిజం ఏది అబద్ధం ఏమి అర్ధం కావట్లేదు. ఇన్నేళ్లు నేను నమ్మింది నేను చూసింది అంతా అబద్ధం అంటున్నారు.. ఎవ్వరికి లేని మచ్చ నా అరచేతిలో మాత్రమే ఎందుకు ఉంది.. ఎందుకు నేను దాన్ని ఏది కోరుకుంటే అది జరుగుతుంది.. అని అరచేతిని చూసుకుంది.
అరణ్య : నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా ఆనందం నువ్వే, నీతోటే నా కష్టాలు సుఖాలు అన్నీ పంచుకున్నాను.. నా దినచర్య మొదలయ్యేది నీతోనే ముగిసేది నీతోనే.. ఎవ్వరిని నమ్మినా ఎవరిని నమ్మకపోయినా నిన్ను మాత్రం నమ్ముతాను. నా గురించిన నిజం నాకు తెలియని కధ మొత్తం నాకు చెప్పు అని మచ్చని తన కళ్ళకి అద్దుకుని ఏడ్చింది.. అరణ్య కళ్ళు చిన్నగా మసక మసకగా మూసుకుపోతూ మంచం మీదె స్పృహ తప్పి పడిపోయింది.
స్పృహలో మొదటగా తనకి కనిపించిన దృశ్యం చీకటిలో జోరు వర్షంలో పట్టాల మీద కడుపు పట్టుకుని పరిగెడుతున్న కస్తూరి.. మైకంలోనే అమ్మా అని కలవరించింది అరణ్య.
అప్పుడే అరణ్యతో మాట్లాడదామని తన రూంలోకి వచ్చిన పనిమనిషి రజిని మంచం మీద పడిపోయి ఉన్న అరణ్యనీ తన కళ్ళ నుండి కారుతున్న నీటిని చూసి దెగ్గరికి వెళ్లి లేపింది, కానీ ఎంతకీ అరణ్య లేవకపోవడంతో భయం వేసి బైటికి పరిగెత్తి అందరినీ పిలుచుకువచ్చింది.
ఇటు అరణ్య స్పృహలో.. మీనాక్షి కడుపులో అస్సలు అరణ్య పడటం.. తల్లీ బిడ్డా ఇద్దరు మాట్లాడుకోవటం నుంచి వాళ్ళ ఆనందాలు.. తన బిడ్డతో మాట్లాడుతూ ఆనంద పడుతుంటే ఇక్కడ అరణ్య కూడా నవ్వుతుంది. ఒక పిండం మాట్లాడడం చూసి ఆశ్చర్యపడుతుంది.. తను స్పృహలో చూస్తున్న కధ మొత్తం ఆ పిండం చుట్టూనే తిరుగుతుంది. శివ ఆ పిండానికి అరణ్య అని పేరు పెట్టడంతో అప్పుడు అర్ధమయ్యింది అస్సలు అరణ్య ఎవరో..
అరణ్య పిండపు దశలో ఉన్నప్పుడే తనకి ఎన్ని శక్తులు ఉన్నాయో తన అమ్మా నాన్నకి తెలియకుండా వాళ్ళని ఎన్నిసార్లు కాపాడుకున్నాడో చూస్తూ ఆశ్చర్యపోయింది.. శివకి మీనాక్షికి కూడా తెలియనివి తనకి కనిపిస్తున్నాయి.
కస్తూరి శివని కలుసుకోవడం.. మొదటి సారి కస్తూరికి కడుపు మీద మీనాక్షి చెయ్యి వేసినప్పుడు కడుపులో ఉన్న అరణ్య తన అమ్మ మీనాక్షితో చెప్పిన పోలికలు.. అరచేతిలో దిక్సూచితో పుడుతుందని చెప్పడం విని ఆశ్చర్యపోయింది.
ఇటు స్పృహ కోల్పోయిన అరణ్య చుట్టూ అందరూ చేరారు, ఎంతమంది ఎన్నిసార్లు ప్రయత్నించినా అరణ్యని లేపలేకపోయారు, అరణ్య మోహంలో కనిపిస్తున్న ముఖ కవళికలు చూసి అస్సలు అరణ్యకి ఏమైందో అర్ధం కాక చివరికి డాక్టర్ కి ఫోన్ చేశారు.
అక్కడ నుంచి ఆ కుటుంబపు సంతోషాలు చూస్తూ మీనాక్షి తన కొడుకు మాట్లాడుకుంటున్న మాటలు వింటూ ఉంది.. కస్తూరికి పుట్టే పాప కోసం అరణ్య మీనాక్షి కడుపులో ఉక్కిరిబిక్కిరి అవడం.. మీనాక్షి తన కొడుకుతో పుట్టే పాప గురించి అరణ్యతో నవ్వుతూ మాట్లాడుతుంటే దానికి అరణ్య నవ్వుతుంటే, ఇదంతా చూస్తున్న అరణ్యకి సిగ్గేసింది.. (డాక్టర్స్ అరణ్య సిగ్గుపడటం చూసి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.. ఇప్పటికే ఒకరోజు గడిచిపోయింది)
స్పృహ కోల్పోయిన అరణ్యకి ప్రతీ రోజూ కనిపిస్తుంది.. కావేరి అమ్మమ్మ తనకి మొదటి సారి స్నానం పొసే వేళ కన్నీటి పర్యంతమవడం చూసి ఇక్కడ స్పృహలో లేని అరణ్య కళ్ళలో తడి చేరింది (అరణ్య కంటి నుంచి కన్నీరు కారుతుంటే నర్స్ అది తుడిచిసింది).
మొదటి సారి అరణ్య తనని చంపెయ్యమని శివని వేడుకోవడం చూసి ఏడ్చేసింది.. కడుపులో నుంచి మాట్లాడుతున్న బిడ్డని, ఇంట్లో పుట్టి కళ్ళేదుట ఉన్న ఆడపిల్లని చూస్తూ ఆ కుటుంబం యొక్క సంతోషం వాళ్ళ నవ్వులని చూస్తూ గడిపేయాలని అనిపించింది అరణ్యకి.. దానితో పాటే తన శక్తులని దాచుకుంటూ తన అమ్మ కడుపు చీలకుండా పిండంలో ఉంటూ అరణ్య పడుతున్న కష్టం కూడా కనిపించింది.
మీనాక్షి పాపని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన కడుపులో ఉన్న అరణ్యకి ఆనించి.. బుజ్జి నీ మరదలు.. నువ్వు పుట్టక ముందే నీ పెళ్ళాన్ని చూసుకున్నావు కదరా.. ఎలా పుడుతుందో ఎలా ఉంటుందో కూడా చెప్పేసావు.. ఇదిగో నీ పెళ్ళాన్ని ముట్టుకో అని మీనాక్షి ఎగతాళి చేస్తుంటే ఇక్కడ స్పృహలో అది చూస్తున్న అరణ్యకి సిగ్గేసింది.
తొమ్మిది నెలలు దాటి ఎన్ని రోజులు అవుతున్నా తన శక్తులని ఉపయోగించి బైటికి రాకుండా ఉండటానికి చూస్తున్న అరణ్యని చూసి ఒకింత గర్వం ఇంకొంత ప్రేమ కలిగింది.. కానీ అంతలోనే కడుపులోనే ఉన్న పిల్లాడితో ప్రేమలో పడుతున్నానా అన్న ఆలోచన వచ్చి అరణ్య తనని తానే తిట్టుకుంటుంటే చూస్తున్న డాక్టర్స్ కి అస్సలు ఏం జరుగుతుందో అర్ధం కాక మతిపోతోంది. (అరణ్య స్పృహ కోల్పోయి ఇప్పటికే నలభై గంటలు దాటింది)
అన్నీ చూస్తున్న అరణ్యకి ఎవ్వరికి తెలియని రహస్యాలు కూడా చూస్తుంది.. అదే అరణ్య తన అమ్మా నాన్నా నిద్రలోకి వెళ్ళాక వాళ్ళని లేవకుండా చేసి ఎవరితోనో మాట్లాడడం.
అరణ్య : ఎందుకు వస్తున్నావ్.. ఇంతకముందే చాలా సార్లు మాట్లాడుకున్నాం.. నీ శక్తులని నా మీద ప్రయోగించకు.. నేను తట్టుకోలేకపోతున్నాను. దాని వల్ల మా అమ్మ ఆరోగ్యం క్షీణిస్తుంది.
విక్రమాదిత్య : ఇంకెంత కాలం, ఇలానే ఉంటావు.
అరణ్య : నా ఇష్టం
విక్రమాదిత్య : సరే జీవితాంతం కడుపులోనే ఉండగలవా.. మీ అమ్మని నీ నుంచి నువ్వే కాపాడుకోగలవా
అరణ్య : తెలీదు, కానీ నాకు కచ్చితంగా దారి దొరుకుతుంది.. వెళ్ళిపో నీ వల్ల నేను శక్తులని ఉపయోగించాల్సి వస్తుంది.. దాని వల్ల మా అమ్మ గర్భం చీలుతుంది.. దయచేసి వెళ్ళిపో
విక్రమాదిత్య : ఇదే ఆఖరు, ఇక నేను నీకోసం నీ స్పృహలోకి రాను.. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.. నువ్వు ఈ పాటికి ఈ భూమ్మీదకి వచ్చి ఉండాలి.
అరణ్య : నా చేతులతోనే నా తల్లిదండ్రులని చంపుకొమ్మని అడుగుతున్నావు.. అదే పని నువ్వు చెయ్యలేదే
విక్రమాదిత్య : నేను నా తండ్రిని నా చేతులతోనే చంపేసాను
అరణ్య : కానీ నా వల్ల కాదు.. నేను ఏ ప్రాణికి హాని తలపెట్టలేను.
విక్రమాదిత్య : నాకు తెలుసు.. అరణ్యా.. అన్నీ తెలిసినవాడవు.. బ్రహ్మ స్వరూపుడవు.. విజ్ఞానానికే పితామహుడవు.. ఓ హిరణ్యగర్భవా.. ఓ చతురనన.. ఓ కమలాసనుడా.. సర్వలోక జీవాదిపతి.. మేము కేవలం వారి అంశలం మాత్రమే కానీ బ్రహ్మవైన నీవే దిగి వచ్చితివి కదా.. సృష్టిని సరైన మార్గంలో నడిపించే నీవే దానికి విరుద్ధంగా పోరాడితే ఎలా.. దయచేసి నా మాట విను
అరణ్య : ఇక చాలు.. భరించలేకున్నాను.. వెళ్ళిపో అని అరిచినట్టు మాట్లాడగానే పడుకున్న మీనాక్షి ఎగిరి పడింది.. అరణ్య తన శక్తిని ఉపయోగించి విక్రమాదిత్యని తన స్పృహ లోనుంచి తీసేస్తుంటే చిన్నగా మీనాక్షి గర్భం చీలుతుంది.
విక్రమాదిత్య : క్షమించు.. నేను వెళ్ళిపోతున్నాను.. కానీ గుర్తుపెట్టుకో.. సృష్టిలో ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు జరిగి తీరుతుంది.. ఓ సృష్టికర్త.. ఇక నేను చెయ్యాల్సింది నేను చేస్తాను.. కలుద్దాం అని మాయమైపోయాడు.
అరణ్య పడుతున్న బాధ మొత్తం ఇక్కడ స్పృహ కోల్పోయిన అరణ్య పడుతుంటే తన కంట్లో నుంచి ఎడతెరపి లేకుండా నీళ్లు కారుతుంటే డాక్టర్స్ అరణ్యకి మెషిన్స్ తగిలించడం మొదలు పెట్టారు. ఆ తరవాత జరుగుతున్న సంఘటనలకి స్పృహ కోల్పోయిన అరణ్య ఏడుస్తూనే ఉంది..
విక్రమాదిత్య ద్వారా రుద్ర వదిలిన భస్మం మీనాక్షి గర్భం మీద ప్రయోగించినప్పుడు అరణ్య తన తల్లిని తండ్రిని కాపాడుకోవడానికి తన శక్తులని అడ్డుగా పెట్టడం.. శక్తులని అడ్డు పెట్టినా పిండపు దశలో ఉన్నందున ఆ శక్తి సరిపోక భస్మపు శక్తికి మీనాక్షి గర్భం చీలడం.. ఫ్లైట్ పేలడం.. అరణ్య అడవిలో నేరుగా పడిపోవడం.. అక్కడ ఆ అడివి దానికి స్పందించి గుబురుగా అల్లుకుని తనని దాయడం.. ఏళ్ల తరబడి అరణ్య ఏడుస్తూనే ఉండటంతో అరణ్య నిద్రలో ఉన్న కమలం చుట్టూ తన కన్నీటితో ఏర్పడ్డ సరస్సు అన్నీ కనిపించాయి.. సరస్సు చుట్టూ జంతువులు.. నిద్రలో ఉన్న అరణ్యని ప్రేమగా చూస్తున్న రెండు సింహాలు.. అంతే ఇంకేం కనిపించలేదు.
కొంతసేపటికి అరణ్య బాడీ దడదడమని కొట్టేసుకోవడంతో అందరూ కంగారు పడ్డారు.. రెండు నిమిషాలకి అరణ్యకి స్పృహ వచ్చి లేచి కూర్చుంది. డాక్టర్స్ అంతా చెక్ చేసి ఓకే అని కంఫర్మ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. అందులో సుశాంత్ కూడా ఉన్నాడు.. ఈ రెండున్నర రోజులు వాడు పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు.. డాక్టర్స్ అందరూ ప్రశ్నలతో అరణ్య మీద పడ్డారు.
అరణ్య గారు.. మీరు ఇంతసేపు కోమాలోకి వెళ్లారు.. మీరు ఏదో చూసారు.. ఏం చూసారు.. మీకు ఏమి కనిపించింది.. మాకు అన్ని వివరాలు తెలియాలి.. చెప్పండి.. చెప్పండి అని అడుగుతుంటే అరణ్య చేతులు అడ్డుపెట్టుకుంది.. అంతా చూసిన సుశాంత్ డాక్టర్స్ మీద అరిచి వాళ్ళని పంపించేసాడు.
సుశాంత్ వెళ్లి అరణ్య పక్కన కూర్చుని ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు.
అరణ్య : బానే ఉంది
సుశాంత్ : అందరినీ కంగారు పెట్టేసావు.. ఇంకాసేపటిలో నీ ఎంగేజ్మెంట్.. ఆరోగ్యం అంతా బానే ఉంది అని డాక్టర్స్ చెప్పారు ఇంకే భయం లేదన్నారు.. నీకు ఓకే అంటే ముందుకు వెళదాం లేదంటే ఎంగేజ్మెంట్ ఇంకో రోజు పెట్టుకుందాం.. ఆ ఇంకోటి మర్చిపోయాను.. హ్యాపీ బర్తడే అని నవ్వుతూ వెళ్ళిపోయాడు.
అరణ్యకి ఏమి అర్ధం కాలేదు, పక్కనే ఉన్న ఇంట్లో వాళ్ళు పలకరింపులని సహించి అందరూ వెళ్ళిపోయాక పనిమనిషిని చూసి దెగ్గరికి రమ్మంది.
రజిని : ఏంటమ్మా అలా అయిపోయారు.. ఎంత భయం వేసిందో తెలుసా
అరణ్య : నేను పడుకుని అదే.. నేను కోమాలోకి వెళ్లి ఎన్ని రోజులు అవుతుంది.
రజిని : ఇవ్వాల్టికి మూడు రోజులమ్మా.. ఏంటి ఆశ్చర్యంగా ఉందా
అరణ్య : లేదులే కానీ కొంచెం సేపు పడుకుంటాను.. నువ్వెళ్లు
రజిని : అలాగే అమ్మగారు..
అందరూ వెళ్ళిపోయాక కొంతసేపటికి ఉమ వచ్చింది..
ఉమ : అరణ్యా.. ఇప్పుడు పరవాలేదా
అరణ్య : చేతిలో ఏంటవి
ఉమ : నాన్న నిన్ను వీటిలో సంతకం పెట్టమని పంపించారు
అరణ్య మనసులో అనుకుంది.. ఇవ్వాల్టితో నాకు ఇరవైరెండేళ్లు నిండిపోయాయి.. ఉమ చేతిలో ఉన్న పేపర్స్ తీసుకుని చూస్తుంటే..
ఉమ : అవన్నీ ఏం అవసరం లేదు.. చివరి పేజీలో సంతకం పెట్టు అని కసిరింది.
అరణ్య పట్టించుకోండా పేపర్లని చదివింది అందులో శివ మీనాక్షిల పేర్లు ఇరవై సార్లు ప్రస్తావించబడి ఉండడం చూసి ఉమ వంక చూడగానే ఉమ కొంచెం జంకింది. అరణ్య గట్టిగా ఉమ చెయ్యి పట్టుకుని కోపంగా చూసింది.
అరణ్య : నువ్వు నా కన్నతల్లివి కాదని నాకు ఎప్పుడో తెలుసు.. ఒక్కసారి నిజం నీ నోటితో వినాలని ఉంది.. చెప్పు
ఉమ : అదీ
అరణ్య : భయపడకు.. నేను ఎవ్వరితో ఏమి అనను ఏమి చెప్పను.. చెప్పు
ఉమ అవును నేను నీ కన్నతల్లిని కాను.. మీ నాన్న నన్ను పెళ్లి చేసుకోకముందే నువ్వు నెలల పిల్లవి.. నీ తమ్ముడు మాత్రమే నా కన్నకొడుకు అనగానే అరణ్య ఉమ చెయ్యి వదిలేసి.. తన చేతిలో ఉన్న పెన్ తీసుకుని సంతకం పెట్టబోతూ స్పృహ తప్పి పడిపోయింది.. కాదు స్పృహ తప్పినట్టు నటించింది.