Update 19
స్పృహలో లేనట్టు నటిస్తున్న అరణ్యకి ఉమ మరియు సుశాంత్ మాటలు వినిపిస్తున్నాయి.
సుశాంత్ : ఎందుకిలా అవుతుంది
ఉమ : ఏమో ఎన్నడూ లేనిది మొన్న KFC కి వెళ్ళింది, అక్కడ ఏమైనా తినిందేమో..
సుశాంత్ : లేదు అరణ్య ప్యూర్ వెజిటేరియన్, పొరపాటున కూడా నాన్ వెజ్ ముట్టుకోదు.. అస్సలు అక్కడికి ఎందుకు వెళ్ళింది..?
ఉమ : ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తానని వెళ్ళింది
సుశాంత్ : ఇంతకీ సంతకాలు చేసిందా ?
ఉమ : ఇంకా లేదు
సుశాంత్ : పేపర్లు చూసిందా.. ఏమైనా అడిగిందా
ఉమ : లేదు
సుశాంత్ : డాక్టర్స్ కి ఫోన్ చేసాను వస్తున్నారు.
వీళ్ళ మాటలు వింటున్న అరణ్యకి చిన్నగా తనకి ఎప్పుడు కలలోకి వచ్చే ఆ మాటలు వినపడుతుంటే వాటి మీద శ్రద్ద పెట్టింది. అమ్ములు తల్లీ అనగానే అప్పుడు తెలిసింది అది తన అత్తయ్య మీనాక్షి గొంతని.. ఎంతగా ఆనందపడిందో అంతే బాధ పడింది. ఉమ మరియు సుశాంత్ వెళ్ళిపోగానే లేచి వెంటనే తన వేణువు అందుకుని బైటికి పరిగెత్తింది.. ఎవ్వరి కంటా పడకుండా గార్డెన్ లోకి చేరుకుని చెట్టు కింద ఉన్న కృష్ణుడి ముందు మోకరిల్లి దణ్ణం పెట్టుకుంది.
అరణ్య : కృష్ణా ఇక నుంచి నేను నిన్ను పూజించబోయేది లేదు, ఇక నా మనసులో నుంచి నిన్ను తీసేస్తున్నాను.. ఇక నుంచి నేను పూజించేది నా బావని మాత్రమే.. నేను లేని ఈ చోట ఎలా ఉంటావో ఏమో.. జాగ్రత్త అని లేచి నిలుచుంది తన వేణువు తీసుకుని నడుము దెగ్గర ఉన్న బొందుకి వేణువుని కట్టి, ఒకసారి తన అరచేతిలోని మచ్చని తన కళ్ళకి అద్దుకుని కళ్ళు మూసుకుంది.
అరణ్య : బావా నువ్వు ఇంతవరకు చెప్పులు తొడగనేలేదు కదా ఇక నుంచి నేను కూడా వేసుకోను.. వస్తున్నాను బావ అని నవ్వుకుని.. నాకు దారి చూపించు అని కళ్ళు తెరిచి చిన్నపిల్లలా నవ్వుతూనే గార్డెన్ నుంచి బైటికి పరిగెత్తింది.. ఇంకేదో లోకంలోకి వెళ్లిపోతున్నానన్న ఆనందం ఆ మొహంలో కనిపిస్తుంది.
ఇంట్లోకి పరిగెడుతూ ఎవ్వరి కంటా పడకుండా పెద్ద పెద్ద పిల్లర్ల వెనక దాక్కుంటూ ఇంటి నుంచి బైటికి వచ్చేసింది.. చూస్తే అందరూ బైటే ఉన్నారు, తెల్లని గుర్రం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఎవ్వరి మాట వినడంలేదు గార్డ్స్ ని ఎగిరి ఎగిరి తంతుంది.. అరణ్యకి అర్ధమయ్యి నవ్వుతూ పరిగెత్తింది.. అందరూ కంగారుగా చూస్తుండగానే వాళ్ళని దాటుకుని వెళ్లి గుర్రం ముందు నిలబడింది.. అంతే గుర్రం ఒక్కసారిగా శాంతించింది.. తెల్లని గుర్రం.. దాని వంటి మీద చిన్న మచ్చ కూడా లేదు.. బలమైన కాళ్లు.. రాజుల కాలం నాటి ఎత్తు.. తెల్లని జుట్టు.. అందాన్ని రాజసాన్ని పెంచుతూ ఉన్న తెల్లని పొడుగాటి తోక.
ఇంట్లో వాళ్లంతా బెదిరిపోయి వద్దని అరణ్య వైపు అరుస్తుంటే అరణ్య పట్టించుకోకుండా గుర్రపు నుదిటి మీద చెయ్యి వేసింది.. అదేంటో తనని ముట్టుకోగానే అరణ్యకి గుర్రం ఏం చెప్పాలనుకుంటుందో అర్ధమవసాగింది, గుర్రం ఒక్క క్షణంలో కిందకి ఒంగగానే అరణ్య బలాన్ని ఉపయోగించి వెంటనే ఎక్కేసింది.. గుర్రం అదే ఊపులో పైకి ఎగిరి రెండు కాళ్లు గాల్లోకి ఎత్తింది.. ఆ ఎగురుడుకి అరణ్య జుట్టు మొత్తం చెదిరి విరబూసుకుంది.. రెండో అంగలో గుర్రం ముందుకు దూకి అందరూ చూస్తుండగానే అక్కడనుంచి వెళ్ళిపోయింది.. అందరూ ఆశ్చర్యపోయారు.
చీకటిలో రోడ్డు మీద తెల్లని గుర్రం, దాని మీద ఒంటి నిండా తెల్లని దుస్తుల్లో గుర్రం వెళుతున్న వేగానికి విచ్చుకున్న అరణ్య పొడుగాటి జుట్టు గాల్లో అలలా ఎగురుతుంటే దేవతే భూమ్మీదకి వచ్చిందా అన్నట్టుంది..
గుర్రం పరిగెడుతున్న వేగానికి ఒక చెయ్యి గుర్రం జుట్టు మీద, కుడి చేత్తో గుర్రం మెడని గట్టిగా పట్టుకుని కూర్చుంది.. చాలా మంది ఫోన్లో వీడియో కూడా తీసుకున్నారు.. ఇంతలో వెనక నుంచి సెక్యూరిటీ కార్లలో తరుముతుంటే అరణ్య భయంగా గుర్రాన్ని గట్టిగా పట్టుకుంది. గుర్రం కూడా అర్ధంచేసుకున్నట్టే పావుగంటకి రోడ్డు దాటి కార్లకి అందకుండా అడవి మార్గం పట్టింది.. సెక్యూరిటీ మాత్రం కారు అడవిలోకి వెళ్లే అవకాశం లేక బైటే ఆగిపోయారు.
హలో సర్
సుశాంత్ : అస్సలు ఏం జరుగుతుంది, అరణ్య ఎక్కడా ?
మేడం గుర్రంతో పాటు అడవిలోకి వెళ్ళిపోయింది సర్, మేము ఇక్కడ ఆగిపోయాము. ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు
సుశాంత్ : అర్ధం కాకపోవడానికి ఏముందిరా ఫూల్.. వెతకండి ఇలా కాదు చాప్పర్స్ తీసుకెళ్లండి అని ఫోన్ పెట్టేసి వెంటనే ప్రదీప్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ తన రూంలోకెళ్ళి డోర్ వేసుకున్నాడు.
చీకటిలో అరణ్య గుర్రం మీద దూసుకెళుతుంది, భయపడుతున్నా కానీ గుర్రం వేగానికి కళ్ళకి ఎదురొచ్చే ఆకులకి, కొమ్మలకి తట్టుకోలేక కళ్ళు మూసుకుంది. ఒక అరగంట తరువాత గుర్రం వేగం తగ్గించి వెళుతుంటే అరణ్య కళ్ళు తెరిచి చూసింది. చిన్నగా లేచి సరిగ్గా కూర్చుంది కొంచెం భయం వదిలేసినట్టు.. కొంతసేపటికి గుర్రం తనంత తానే ఆగిపోగా అరణ్య కిందకి దిగి పక్కనే ఉన్న చిన్న నీళ్ల కుంట చూస్తూ గుర్రం ముందుకు వెళ్లి ముఖం పట్టుకుని చూసింది.
అరణ్య : నిన్ను మా బావే పంపించాడా అని నవ్వుతూ అడిగింది.. దానికి గుర్రం కేరింతలు కొడుతుంటే అరణ్య కూడా నవ్వి పక్కనే ఉన్న చెట్టుకి ఆనుకుని కూర్చుంది.. గుర్రం నీళ్లు తాగడానికి వెళుతూ అరణ్యని చూసింది.. దానికి అరణ్య నవ్వుతూ నీ దాహం తీర్చుకో అని పంపి తన అరచేతిలో ఉన్న మచ్చని కళ్ళకి అద్దుకుని బావా నా మాటలు నీకు వినిపిస్తున్నాయా, నేను అరణ్య.. కాదు కాదు నాకు కూడా పేరుంది, అత్తయ్య పెట్టింది కదా.. అమ్ములు.. అని మాట్లాడుతుండగానే పైనుంచి హెలికాప్టర్ సౌండ్ వినిపిస్తూ లైట్ పడేసరికి గుర్రం పరిగెత్తుకుంటూ వచ్చింది, అరణ్య ఎక్కి కూర్చోగానే వేగం పుంజుకుని ముందుకు కదిలింది.
తెల్లతెల్లారి నాలుగు అవుతుందేమో గుర్రం అడవిని దాటి మళ్ళీ రోడ్డు ఎక్కింది, వెనకాల ఎవరైనా పడుతున్నారేమో అన్న భయంతో అరణ్య దిక్కులు చూస్తుంటే, గుర్రం తన పని తాను చేసుకుపోతుంది, ఉన్నట్టుండి గుర్రానికి ఎటు వెళ్లాలో తెలియక ఆగిపోగా అరణ్యకి అర్ధమయ్యి, దారి చూపించమని చేతిలో ఉన్న మచ్చని కోరుకోగా తన కళ్ళేదురున్న ఆకాశంలో నక్షత్రం ప్రకాశంగా వెలిగింది అంతే గుర్రం ఇకిలిస్తూ ముందుకు కదలగా ఎక్కడి నుంచి వచ్చాయో నాలుగు కుక్కలు గుర్రానికి నాలుగు వైపులా పరిగెడుతూ గుర్రానికి దారి చూపిస్తూ ఇలా రోడ్డు మీద కాదని రోడ్డు నుంచి దూరంగా తీసుకెళతూ రైలు పట్టాల మార్గాన తీసుకెళ్లి వదిలి అక్కడితో ఆగగా గుర్రం వేగం పెంచింది.
అరణ్య వెనక్కి చూస్తూ వాటికి ధన్యవాదాలు తెలిపి మళ్ళీ గుర్రాన్ని గట్టిగా పట్టుకుంది.. తెల్లారుతుంటే వెనక నుంచి ట్రైన్ కూత వినిపించగా అరణ్య తిరిగి చూసింది.. ట్రైన్ వేగంగా అరణ్యని దాటుకుంటూ వెళుతుంటే గుర్రం ట్రైన్ కి పోటీగా ఇంకా వేగం పెంచింది..
ఇటు రాత్రికి రాత్రి రోడ్డు మీద గుర్రంతో వెళుతున్న అరణ్యని ఎవడో ఫోటో తీసి ట్విట్టర్ లో ఫోటో పోస్ట్ చేసాడు #Angelonthehorse అన్న హ్యాష్టాగ్ తో.. పొద్దున్న కల్లా ఒక ప్రముఖ సెలబ్రిటీ రిట్వీట్ తో అది కాస్తా వైరల్ అయ్యి కూర్చుంది.. ఇప్పుడు ట్రైన్ లో వెళుతున్న ఒకడు ట్రైన్ తో పోటీగా పరిగెడుతున్న గుర్రాన్ని దాని మీదున్న అరణ్యని చూడగానే చిన్న వీడియో బైట్ ఒకటి తీసి దానికి హ్యాష్టాగ్ పెట్టేసి వదిలాడు.. సూర్యుడు వచ్చేలోపు ట్విట్టర్లో, న్యూస్ చానెల్స్ లో ఇదే మెయిన్ న్యూస్ అయ్యింది.. ఫోటో తీసిన లొకేషన్ వీడియో పోస్ట్ చేసిన లొకేషన్ వేరు వేరు అని ఎవడో గుర్తులు చెప్పాడు దానతో ఇప్పుడు అందరికీ ఆ గుర్రం మీద ఉన్న అమ్మాయి ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం మొదలయ్యింది. ఎక్కడ అరణ్య కనిపిస్తే అక్కడ ఫోటోలు వీడియోలు తీస్తూ ట్విట్టర్లో పెట్టేస్తున్నారు. కానీ ఇక్కడ అరణ్య మనసు మాత్రం తన బావని చూడాలన్న తన కోరిక మరియు ఆలోచనలు గుర్రం కంటే వేగంగా పరిగెడుతున్నాయి.
అరణ్యకి దారిపొడవునా జంతువులు తోడుగానే ఉన్నాయి, తనకి అవసరం వచ్చినప్పుడల్లా ఏదోరూపంలో సాయం చేస్తూనే ఉన్నాయి. కొంతసేపు కుక్కల రూపంలో కొంతసేపు పక్షుల రూపంలో ఇక అడవి మార్గల్లో అయితే ఒక అడవి నుంచి ఇంకో అడవి సరిహద్దు వరకు జింకలు, కుందేళ్లు, నెమళ్ళు ఇలా అన్ని జంతువులు సాయం చేస్తూనే ఉన్నాయి.
నిశితమైన అడవిలో బైట ఎండ విజృంబిస్తున్నా లోపల మాత్రం చల్లగా నీడగా ఉంది, గుర్రం వేగం తగ్గించి చిన్నగా నడుస్తుంటే అరణ్యకి ఆకలిగా అనిపించి చుట్టూ ఏదైనా తినడానికి దొరక్కపోదా అని చూస్తుంది.. కొంత దూరం వెళ్ళాక ఒకటి సపోటా చెట్టు కనిపించింది దాని నిండా పళ్లే కానీ పండలేదు, గుర్రం మాత్రం ఆపకుండా తినేస్తుంటే అరణ్య ఒకటి తీసుకుని తినగా చేదు కొట్టింది, అయినా తప్పక ఒక రెండు తినేసి చెట్టుకి ఆనుకుని సేద తీరుతూ కళ్ళు మూసుకుంది.
ఇంకోవైపు టీవీల్లో అందరూ ఎదురు చూస్తూ కూర్చున్నారు అమ్మాయి ఎటు వెళుతుందా అని వీడియోల్లో తనకి కాపలాగా ఉంటున్న జంతువులని, అరణ్య వేగవంతమైన ప్రయాణాన్ని చూసి కొంతమంది ఆశ్చర్యపోతే ఇంకొంతమంది మాత్రం అందులో ఏముంది భూమ్మీద ఎంతో మంది ఉన్నారు ఇందులో ఆశ్చర్యం ఏముంది అని కొట్టివేశారు ఇంకొంతమంది అయితే అరణ్యని దేవత అని దైవ కార్యం కొరకు వెళుతుందని తనని వెంబడించడం ఆపమని కోప్పడ్డారు ఇలా ఎవరి స్పందన వారిది.
ఇంకో వైపు సుశాంత్ మరియు ప్రదీప్ కూడా ట్విట్టర్ ని, మీడియా ఛానెల్స్ ని ఫాలో అవుతూ అరణ్యని వెంబడిస్తున్నారు.. అరణ్యని ఆపే శక్తి తనని ఇంటికి తీసుకొచ్చే పవర్ రెండూ ఉన్నా అస్సలు అరణ్య ఎక్కడికి వెళుతుందా అన్న కుతూహలం మొదలయ్యి.. అరణ్య పరుగు ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో తెలుసుకుని ఆ తరవాత తనని ఇంటికి తీసుకురావడానికి అరణ్య వెళుతున్న వైపే తమ మనుషులని పంపించారు.
పెద్ద ఏనుగు ఒకటి ఘీంకరించేసరికి అటు గుర్రానికి ఇటు అరణ్యకి మెలుకువ వచ్చి లేచారు, అరణ్య పక్కన అరటి గెల ఒకటి పెట్టి వెళుతున్న ఏనుగుకి నమస్కరించి దానికి కృతజ్ఞతలు తెలిపింది.
రాత్రి వరకు అక్కడే విశ్రాంతి తీసుకుని ఇద్దరు మళ్ళీ ఆకాశంలో మెరుస్తున్న తారని చూస్తూ ముందుకు వెళుతున్నారు. చీకటిలో వర్షం పడేసరికి మళ్ళీ ఆగాల్సి వచ్చింది. ఎక్కడుందో తనకే తెలీదు తను నమ్ముకుందల్లా ఆ గుర్రాన్ని, తన చేతిలో ఉన్న మచ్చని, బతికే ఉన్నాడు కానీ ఎక్కడున్నాడో తెలియని తన బావని.. గుడ్డిగా వెళుతుంది.. కొంత దూరం నడిచిందో ఏమో సున్నితమైన తన పాదాలు మంట పుడుతుంటే గుర్రం తన కాళ్ళని చూస్తూ పక్కనే నడుస్తుంది. అరణ్య అది గమనించి గుర్రంతో మాట్లాడుతూ తన మీద చెయ్యి వేసి నిమురుతూ వర్షంలో తడుస్తూ వెళుతుంటే అరటి చెట్లు కనపడ్డాయి.. పెద్ద పెద్ద ఆకులని తన ఒంటి మీద కప్పుకుని ఇంకో ఆకు తన తల మీద పెట్టుకోగా గుర్రం కూర్చోమని వంగింది.. అర్ధమైన అరణ్య ఎక్కి కూర్చుని అరటి ఆకులని గట్టిగా గొడుగులా పట్టుకొగా గుర్రం నెమ్మదిగా పరిగెడుతూ ఉంది.
ఐదు రోజుల ప్రయాణం తరవాత అర్ధరాత్రి మిణుగురు పురుగుల సాయంతో అడవిలోనుంచి బైటికి వచ్చి చూస్తే దూరం నుంచి సముద్రం కనిపిస్తుంది. ఆకాశంలో నక్షత్రం మాత్రం వెలుగుతూనే ఉంది.ఇంత వరకు అరణ్య తన బావతో మాట్లాడ్డమే కానీ ఒక్కమాట కూడా అటు వైపు నుంచి వినపడలేదు.
మెయిన్ రోడ్డు దాటి బీచ్ వైపు కాకుండా గుర్రం సముద్రం వైపు అడుగులు వేస్తుంటే అరణ్యకి ఏమి అర్ధంకాక గుర్రం మీద కొడుతూ అడుగుతుంటే గుర్రం మాత్రం పట్టించుకోకుండా వెళుతుంది. అప్పటికే అరణ్యని చాలా మంది చూసేసారు.. వెంటబడి ఫోటోలు వీడియోలు తీస్తుంటే గుర్రం వేగం పెంచి అక్కడ నుంచి పారిపోయి మనుషులు లేని చోట ఇసుకలో సముద్రం వైపు నడుచుకుంటూ వెళుతుంది.
టీవీ న్యూస్ :
ఇప్పుడే అందిన తాజా వార్త భూకక్ష లోకి వచ్చి భూమ్మీద పడుతున్నది ఆస్టరాయిడ్స్ అనుకున్నాం మనమంతా కానీ ఆకాశంలో ఏదో స్పేస్ షిప్ రెండు ముక్కలుగా అగ్నిగోళంలా భూమ్మీదకి విరుచుకుపడుతుందని.. NASA కి సిగ్నల్ అందిందని అందులో ఉన్నది భూవాసి అని ఇప్పుడే సమాచారం అందింది.. ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని భూ కక్షలోకి వస్తే గాని పూర్తి సమాచారం విడుదల చేయలేమని అమెరికా స్పష్టం చేసింది..
అదే రోజు రాత్రి..
సుబ్బు కొడుకు, అక్షిత కూతురు, విక్రమ్ ఆదిత్య వాసుల సంతానం పిల్లలంతా కాలేజీ వయసువారే అర్ధరాత్రి దాటినా ఎవ్వరు పడుకోలేదు కారణం విక్రమ్ కొడుక్కి ఆదిత్య కూతురుకి పెళ్లి జరుగుతుంది.. అందరూ పనులు చేసి అలిసిపోయి తలో దిక్కు పడ్డారు.. పెద్దవాళ్లంతా ఒకదిక్కు చిన్నవాళ్ళంతా ఒక దిక్కు కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు..
అమ్మా ఇది చూసావా అంటూ ఫోన్ పట్టుకుని వచ్చాడు అఖిల కొడుకు..
అక్షిత : ఏంట్రా అని వాడి పక్కన నిలుచుంది.. పిల్లలు వారితోపాటే పెద్దలు అందరూ ఫోన్ చూస్తుంటే అఖిల కొడుకు వీడియో ప్లే చేశాడు.
అరవింద్ : ఎవరు
ఎవరో తెలీదు నాన్నా కానీ కొన్ని వందల కిలోమీటర్లు గుర్రం మీద ప్రయాణిస్తుంది చెప్పులు కూడా లేవు.. తన చుట్టూ జంతువులు, పక్షులు కూడా వెళుతున్నాయి..
అక్షిత : తన డ్రెస్సింగ్ విధానం చూడండి.. ఏదో సాధువులా ఉంది
మానస : ఎంతో సంతోషంగా వెళుతుంది, గత రెండు రోజులుగా వైరల్ అవుతుంది వీడియో
సుబ్బు : గుర్రం చాలా బాగుంది, చాలా వేగంగా వెళుతుంది.
ఆదిత్య : వీడు అమ్మాయి గురించి వదిలేసి గుర్రం గురించి మాట్లాడుతుంటే చూడ్డానికి బాలేదు రా
విక్రమ్ : హ్మ్మ్..
రక్ష : ఏంటి మీరిద్దరూ చెవులు కొరుక్కుంటున్నారు
ఆదిత్య : అదీ.. పెద్దమ్మ ఏం లేదు.. ఇద్దరు జంప్
రక్ష : వయసు పెరిగి కొడుకు కూతుర్ల పెళ్లి జరుగుతున్నా ఆలోచనలు మాత్రం అక్కడే ఆగిపోయాయి.. అందరూ.. వెళ్లి పనులు చూడండి.. అని అక్షితని పక్కకి లాక్కేళ్ళింది... చిన్నా నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా
అక్షిత : ఇంకా లేదు.. అనుమాన పడకు నా మొగుడు చావలేదు.. బతికే ఉన్నాడు.. ఆయన్ని చంపడం ఎవ్వరి వల్లా కాదు.. కచ్చితంగా ఏదో ఒకరోజు నా కోసం వస్తాడు అని కళ్ళు తుడుచుకుంది..
రక్ష అక్షితని ఓదారుస్తూ తన కూతురు వంక చూసింది.. సుబ్బు తనతో మాట్లాడుతున్నాడు.
రక్ష : అమ్మాయి...?
అక్షిత : పాపం దానికి వాళ్ళ నాన్నని చూడాలని ఎంత ఆశగా ఉందొ.. ఎవ్వరిని అడగాలో తెలీదు, ఎవరితో మాట్లాడాలో తెలీదు అలా ఉంటుంది.. చిన్నా గాడు వచ్చేవరకు మాకివి తప్పవులే
రక్ష : చిన్నా బతికే ఉన్నాడని అంత నమ్మకంగా ఎలా ఉండగలుగుతున్నావ్
అక్షిత : నాకు తెలుస్తుంది.. వాడు బతికే ఉన్నాడు.. వాడి కూతురు ఎలా ఉందొ చూసుకోవడానికైనా కచ్చితంగా వస్తాడు.
సుబ్బు అక్షిత మరియు రక్ష మొహాలు చూడగానే చిరంజీవిని గుర్తు చేసుకుంటున్నారని తెలిసి అక్షితా.. ఇలా రా అని అరవడంతో ఇద్దరు తేరుకుని మళ్ళీ పనుల్లో పడ్డారు.
సుబ్బు మాత్రం అందరూ అలిసిపోయి పడుకున్నాక ఒంటరిగా కారు తీసుకుని తన ఫోన్ కి వచ్చిన కొ ఆర్డినేట్స్ మరొక్కసారి చూసాడు అవి కచ్చితంగా చిరంజీవి పంపినవే అని తన గట్టి నమ్మకం.. ఇంతక మునుపు కూడా ఇలాంటివి జరిగాయి అందుకే ఎవ్వరికి చెప్పలేదు ఒంటరిగా కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు.
జన సమూహం నుంచి దూరంగా సముద్రపు ఇంకో వైపుకి వచ్చాక గుర్రం శాంతించి చిన్నగా నడుస్తుంటే అరణ్య గుర్రం దిగి తనని స్పృశిస్తూ ఎందుకలా ఆవేశ పడిపోయావు, ఎవరినైనా చూసి భయపడ్డావా అని అడగ్గా గుర్రం ఏమి లేదన్నట్టు ఇకిలిస్తూ ముందుకు నడవగా అరణ్య చెదిరిన తన జుట్టుని వీచే గాలికి బలంగా సర్దుకుంటూ ముందుకు నడుస్తు అలలని చూస్తుంది.. చిమ్మ చీకటి నుంచి తెల్లారే చీకటికి మారే సమయం అది..
అలల హోరు సంగీతంలా వినపడుతుంటే తన నడుముకి కట్టిన వేణువు తీసి సన్నని నాట్యంతో కూడిన వేణుగానం ఆలపిస్తుంటే వెనకాల నిలుచుని చూస్తున్న గుర్రం కూడా చిన్నగా నాట్యమాడుతుంది, ఇంకో నిమిషానికి పక్షులు వచ్చి చేరాయి.. కొన్ని పాడుతుంటే కొన్ని రెక్కలు వేగంగా కొడుతూ అరణ్య వేణుగానానికి హంగులు జోడిస్తున్నాయి.
ఉన్నట్టుండి గుర్రం ఒక్కసారిగా అరవడంతో అరణ్య వెనక్కి తిరిగింది, ఎక్కడినుంచి వచ్చారో మిలిటరీ సోల్జర్స్ వేగంగా గన్స్ తో వచ్చి అరనిమిషంలో గుర్రాన్ని ఇంకో క్షణంలో అరణ్యని అదుపులోకి తీసుకున్నారు.. గుర్రం మీద వల వేశారు, ఆరుగురు కలిసి పట్టుకున్నా గుర్రం అదుపు కాకపోవడంతో ఆఫీసర్ గన్ తీసి రెండు సార్లు షూట్ చేసాడు.. అరణ్య గట్టిగా అరుస్తూ కళ్ళు తిరిగిపడిపోయింది.. గుర్రం విలవిలలాడుతూ పడిపోతుంటే కారుతున్న రక్తంతో గందరగోళంగా తయారు అయ్యింది అక్కడి వాతావరణం.. ప్రకృతికి కూడా కోపం వచ్చిందేమో ఉన్నట్టుండి అలల తీవ్రత ఎక్కువయ్యింది.. గాలి వేగం అదుపు తప్పింది.. హోరు వర్షం కురుస్తుంటే అరణ్యని వాహనంలోకి ఎక్కించారు.. అరణ్యకి తెలివి వచ్చి కిటికీ లోనుంచి గాయపడిన గుర్రాన్ని చూస్తూ ఏడుస్తుంటే గుర్రం రెండు నిమిషాలకి మౌనంగా పడిపోయింది.. గుర్రాన్ని ఆ స్థితిలో చూడగానే అరణ్యకి తల తిరిగిపోయింది.. వెంటనే స్పృహ కోల్పోయింది..
సోల్జర్ 1 : ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేస్తారు
సోల్జర్ 2 : ముందు విచారిస్తారు.. ఆ తరువాత తెలీదు, ఆ అమ్మాయికి ఆనిమల్స్ కి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసుకోవాలట.. తను ఎక్కడికి వెలితే అక్కడికి పక్షులు ఎలా వస్తున్నాయి అని సైంటిస్ట్ లకి అనుమానాలు ఉన్నాయి.. నేను పూర్తిగా వినలేదు.. ఏంటి నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తున్నావ్ అంటూ గాల్లోకి చూసాడు.. ఆకాశం నుంచి ఏదో స్పేస్ షిప్ రెండు ముక్కలుగా అగ్నిగోళంలా చాలా వేగంగా కింద పడుతున్నాయి..
అరణ్యని గాయపడిన గుర్రాన్ని అక్కడినుంచి తరలించి ఇన్ఫర్మేషన్ అందించారు.. అప్పటికే ప్రెస్ వచ్చేసింది.. స్పేస్ షిప్ సముద్రంలో పడింది.. ఆ ప్రాంతంలో అప్పటికే అందరూ వచ్చేస్తున్నారు.
అరణ్యని గుర్రాన్ని ఆ విధంగా నిర్ధయగా తీసుకెళతున్నా అక్కడే దూరంగా ఉండి అంతా చూస్తున్న సుబ్బు మాత్రం ఏమి చెయ్యలేదు, స్పేస్ షిప్ కింద పడగానే సుబ్బు దాని దెగ్గరికి వెళ్ళిపోయాడు.. అది చూసిన నేవి వాళ్ళు సుబ్బుని మైకులో వారిస్తూనే తన వెనకాలే షిప్స్ లో వెళుతున్నారు.. సుబ్బు అదేమి పట్టించుకోలేదు వేగంగా వెళ్ళిపోయాడు.. అంతా మంటలు.. లెక్కచేయకుండా వెళ్ళాడు.. రెండు నిమిషాలకి స్పేస్ షిప్ నుంచి విరిగిన పెద్ద ముక్క డోర్ తెరుచుకుంది చిన్నగా.. చిరంజీవి గాయాలతో బైట పడ్డాడు.. వెంటనే విజిల్ వేయగానే షిప్ లోపలనుంచి విశ్వ అండ్ టీం వచ్చింది.. విశ్వ మరియు కిరణ్ కిందకి దూకి చిరంజీవిని తీసుకొస్తుంటే సుమన్ మరియు రియా వచ్చే నేవికి ఎవ్వరికి కనిపించకుండా స్మోక్ గ్రనెడ్స్ వేస్తున్నారు..
కావేరి : విశ్వ వచ్చేస్తున్నారు.. త్వరగా రావాలి
వెంటనే సుమన్ చిరంజీవిని పైకి లాగేయడం.. విశ్వ మరియు కిరణ్ బోట్ ఎక్కడంతో సుబ్బు అక్కడి నుంచి ఇంకో వైపుకి షిప్ ని తీసుకెళ్ళిపోయాడు..
అదే రోజు సాయంత్రానికి.. మరో రెండు భయంకరమైన వార్తలు, ఒకటి తుఫాను వల్ల ప్రాణ నష్టం అయితే ఇంకోటి భూ గ్రహం పక్కన ఉన్న ఒక నక్షత్రం నామరూపాలు లేకుండా నాశనం అయిపోయింది..
ఈ విశ్వ అండ్ టీం ఎవరో తెలుసుకోవలనుకుంటే.. దానికి సంబంధించిన కధ లింక్ పెడుతున్నాను.. వీలైతే చదవండి.
స్పృహ కోల్పోయిన అరణ్యకి లీలగా ఏదో కనపడుతుంది.. అది ఎవరో ఆకాశంలో కొట్టుకుంటున్నారు, ఉన్నట్టుండి భస్మం ప్లేన్ మీద పడడం శివ మరియు మీనాక్షిలు ప్రాణాలు కోల్పోవడం అంతా కనిపించింది అప్పటివరకు అన్ని మంటలు తరువాత మొత్తం చీకటి అలుముకుంది అప్పుడు కనిపించిన కొన్ని దృశ్యాలు.. మీనాక్షి మరియు శివ ప్రాణాలని అరణ్య గట్టిగా తన గుప్పిట్లో పట్టుకున్నాడు.. ప్రాణాలని హరించుకుపోవడానికి స్వయంగా యముడే వచ్చినా పసికందు అయిన అరణ్య గుప్పిటని మాత్రం తెరవలేకపోయాడు.
ఆ రెండు ప్రాణాలని అలానే పట్టుకుని కింద పడిపోయాక వదిలాడు, అవి అక్కడ పక్కనే ఆడుకుంటున్న సింహాల గుంపులోకి దూరిపోయాయి.. ఆ తరువాత గుర్రంలోకి శివ స్నేహితుడు సందీప్.. సందీప్ భార్య అయిన శ్రావణి సముద్రంలో తిమింగలంలా జన్మించింది.. గగన్ మరియు తన భార్య రజిత జింకల్లా జన్మించారు..
అరణ్య ఒక్కసారిగా లేచి కూర్చుంది, లేచి నిలబడింది.. అయినా అనుమానం వచ్చి కింద చూస్తే తన శరీరం ఇంకా స్పృహ లేకుండా పడి ఉండడం చూసి కంగారు పడిపోయింది. ఒక సున్నితమైన గొంతు నుంచి తనకి వినపడిన శబ్దం.. అమ్ములు...
అరణ్య(అమ్ములు) : బావా.. నువ్వేనా
అరణ్య : నేనే..
అమ్ములు : బావా ఎందుకు ఇన్ని రోజులు నువ్వు నాతో మాట్లాడలేదు, ఎందుకు నువ్వు నా కోసం రాలేదు, నీకు శక్తులు ఉండి కూడా నన్ను ఇక్కడ ఎందుకు ఉంచావ్
అరణ్య : నా శక్తులు నాలో కలిసిపోవడానికి ఇన్ని వర్షాలు పట్టింది.. నేనూ ఇంకా లేవలేదు ఇరవై ఏళ్ళకి ఇప్పుడే మెలుకువ వచ్చింది.. అయినా నీకు అవసరమైనప్పుడల్లా నేను సాయం చేస్తూనే ఉన్నాగా..
అమ్ములు : అవును..
అరణ్య : బాధ పడకు, సరిగ్గా నాకు మెలుకువ వచ్చే సమయానికి వాళ్ళు వచ్చేసారు అందుకే నిన్ను సందీప్ బాబాయిని కాపాడలేకపోయాను.. ఇక వచ్చేయి నా దెగ్గరికి..
అమ్ములు : అంటే.. సందీప్ మావయ్య..
అరణ్య : ఆయుష్షు తీరిపోయింది..
అమ్ములు : అందరినీ చూపించావ్ మరి అమ్మ.. అమ్మ ఎక్కడా...?
అరణ్య : వస్తుంది..
అరణ్య(అమ్ములు) ఒక్కసారిగా తన శరీరంలోకి ఎవరో నెట్టేసినట్టు వెళ్ళిపోయింది.. అమ్ములు దేనికి భయపడకు నేనున్నాను.. నీ కన్నీరు కారిన చోట, నీ చేత కన్నీరు కార్పించిన ఎవ్వరు బతికి ఉండరు.. ఇది విధి లిఖితం.. అరణ్య ఎమ్మటే లేచి గుర్రం దెగ్గరికి పరిగెత్తింది..
అరణ్య(అమ్ములు) : మావయ్య.. మావయ్య.. అని గుర్రం ముఖాన్ని పట్టుకుని నిమిరింది..
గుర్రం అరణ్యని(అమ్ములు) ప్రేమగా చూస్తూ కళ్ళు మూసుకుంది అంతే మళ్ళీ లేవలేదు.. అరణ్య ఏడుస్తుంటే అక్కడున్న ఎవ్వరు పట్టించుకోలేదు.. కొంతసేపటికి ఎవరో వచ్చి అరణ్య చెయ్యి పట్టుకుని లాక్కెళ్లారు, అరణ్యని బలవంతంగా తీసుకెళుతుంటే.. ఉన్నపళంగా భూమి అదిరింది.. అందరూ తెరుకునే లోపే ఎక్కడినుంచి వచ్చాయో తెలీదు వందల కొద్ది బలమైన గోవులు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఫెన్సింగ్ ని గేట్లని అడ్డొచ్చిన మనుషులని అన్నిటిని గుద్దుకుంటూ వచ్చేసాయి.. అరణ్య చెయ్యి పట్టుకున్నవాడిని ఒక్క కుమ్ముతో వాడి పొట్టలోకి కొమ్ములని దూర్చి ఎగరేసింది.. వందల కొద్ది ఆవులు అరణ్య చుట్టూ కాపలాగా తిరుగుతుంటే మిగతావి సోల్జర్స్ పని పట్టాయి.. అరణ్య ఆకాశంలోకి చూస్తూ నన్ను కాపాడుతున్నావా కృష్ణయ్య అని ప్రేమగా ఒక్క పదంతో ఇన్నేళ్లు కొలిచిన కృష్ణుడి పదానికి అయ్యని చేర్చి కృష్ణయ్య అని పిలుస్తూ తండ్రి స్థానం ఇచ్చేసింది.. పక్కనే నిలబడ్డ ఆవుని ప్రేమగా నిమురుతూ కళ్ళు మూసుకుని తన మొహాన్ని ఆవుకి ఆనించింది.
కొంతసేపటికి ఆకాశంలో పక్షి శబ్దం వినిపించడంతో పైకి చూసింది, అది అరణ్య చిన్నప్పటి నుంచి తను పెంచుకుంటున్న మైత్రి.. చూడగానే దుఃఖం ఆగలేదు.. హంస కిందకి దిగగానే వెళ్లి కౌగిలించుకుని ఏడ్చేసింది గుర్రాన్ని చూస్తూ.. ఆ హంస చనిపోయిన గుర్రాన్ని చూసి అరవగానే గాల్లో నుండి వేల కొద్ది పక్షులు తమ నోటితో పూలని తెచ్చి గుర్రం మీద పోసి దాన్ని కప్పేసాయి.. పక్షులన్నీ హంసకి ప్రణామం చెప్పి ఎగిరి వెళ్ళిపోగానే హంస తిరిగి అరణ్య వంక చూసింది.. అరణ్య ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంది.
ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి రెప్పలు టపటప కొట్టగానే వెంటనే దాని శరీరం బంగారపు రంగులోకి మారింది, దాని శరీరం కూడా ఐదు రెట్లు పెద్దగా అయ్యింది.. అది చూసి అరణ్య నెమ్మదిగా తన దెగ్గరికి వెళుతుంటే.. అరణ్యకి తన బావ మాటలు గుర్తొచ్చాయి..
అరణ్య(అమ్ములు) : అమ్మా.. అమ్మ.. అర్ధమైనట్టు అమ్మా అని పిలుస్తూ వెళ్లి తనని నిలబడే కౌగిలించుకుంది..
ఏదో చప్పుడు కాగానే హంస వెంటనే సైగ చెయ్యగానే అరణ్య కొంచెం భయంగానే బంగారు హంస మీద ఎక్కి కూర్చుంది.. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పరిగెడుతూ రెక్కా రెక్కా కొడుతూ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినట్టు గాల్లోకి ఎగిరింది.. అరణ్యకి కొంచెం భయం వేసినా తన అమ్మ మెడని సున్నితంగా పట్టుకుని ఇంకో చెయ్యి తను కూర్చున్న దెగ్గర వేసి పట్టుకుంది.. సముద్రం మీదగా ఎగురుతూ వెళుతుంటే వినిపిస్తున్న శబ్దానికి కిందకి చూసింది.. అప్పటికే పేద్ద అలలు ఎగిసి ఎగిసి పడుతున్నాయి.. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అసలైన పెద్ద అల సుమారు ఒక ఇరవై అంతస్థుల పొడవు ఉంటుందేమో.. చూసి అరణ్య భయపడింది.. తుఫాను అని అర్ధం అయ్యి వెనక్కి చూసింది.. కానీ హంస ముందుకు చూడమని ఒక జెర్క్ ఇవ్వగానే అరణ్య పడిపోకుండా గట్టిగా పట్టుకుంది.. హంస అరణ్య తుఫాను వల్ల జరిగే పరిణామాలు చూడకముందే ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలని వేగం పెంచింది.. అరణ్య మాత్రం ఆ తుఫాను తీవ్రత చూసి ఎంతమంది చనిపోతారో అని భయపడి బాధపడింది.
చాలా దూరం ప్రయాణించాక గాని తుఫాను తాలూకు ఆనవాలు మాయం కాలేదు, కొంత దూరం వెళ్ళాక హంస చిన్నగా నీళ్లలోకి ల్యాండ్ అయ్యి వెళుతుంటే అరణ్యకి ఆనందం వేసింది.. వెంటనే తన అమ్మని గుర్తు చేసుకుని ప్రేమగా మాటలు చెపుతుంటే హంస అవన్నీ వింటూ ముందుకు ఈదుతు వెళుతుంది.. తెల్లవారుతుండగా చుట్టూ అటు ఇటు డాల్ఫీన్లు అందంగా తన వెంట వస్తుంటే మనసు తేలికపడి ఇందాక చూసిన తుఫానుని మర్చిపోయింది.
కొంత దూరం వెళ్ళాక సూర్యుడి కిరణాలు అంతకంతకు పెరుగుతున్న సమయాన పెద్దగా సౌండ్ వినిపించి వెనక్కి చూసింది, వెంటనే తమ పక్కన ఈదుతున్న డాల్ఫిన్లు, చేపలు అన్ని వెళ్లిపోయాయి.. ఒక పెద్ద తిమింగళం వస్తుంటే అరణ్య భయపడింది కానీ తన అమ్మ హంస భయపడకపోవడంతో తను సందీప్ భార్య అయిన శ్రావణి అని తెలుసుకుని శాంతించింది.. తిమింగలం హంస పక్కకి వచ్చి శాంతించగా.. అప్పటివరకు తిమింగలం వల్ల అల్లకల్లోలం అయిన అలలు కూడా నెమ్మదించాయి.. చేపలు మరియు డాల్ఫిన్లు మళ్ళీ అరణ్య పక్కకి చేరాయి.. అరణ్య తిమింగలం మీద చెయ్యి వేసింది.. తన అమ్మ హంస సైగ చేయగానే నీళ్లలోకి దూకి కష్టపడి తిమింగలం మీదకి ఎక్కింది.. హంస మళ్ళీ మాములు ఆకారంలోకి మైత్రిలా మారి తిమింగలం మీద కూర్చోగా తిమింగలం వేగం పెంచింది.. అరణ్య కూడా అలిసిపోయి వెల్లికలా పడుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది.. ఏదో మెత్తని స్పర్శ తగలి కళ్ళు తెరిచి చూస్తే తన అమ్మ ప్రేమగా చూస్తుంది.. తన అమ్మని పక్కన పడుకోబెట్టుకుంది.. ప్రేమగా హత్తుకుంది.
అమెజాన్ అడవిలో రోజులాగే ఎవరికి వాళ్ళు కాపలాకి ఉపక్రమించారు.. రాత్రి కాపలా కాసే మనుషులు చెట్ల మీద కూర్చోగా, జింకల జంట అరణ్య ఉన్న దట్టమైన అడవి ముందు కాపలాగా కూర్చుని ఉన్నాయి.. లోపల మగ సింహం రోజూ రాత్రి అరణ్య సరస్సు మధ్యలో తామర పువ్వు మీద పడుకున్న ఎదుట కూర్చుని తనని చూస్తూ కాపలా కాస్తుంది, ఆడ సింహం కూడా అలానే అరణ్యని చూస్తూ మగ సింహంని ఆనుకుని ఎప్పటికో నిద్రపోతుంది.. అలానే ఈరోజు కూడా ఆడసింహం నిద్రలోకి జారుకోగానే తనని వాటేసుకుని చిన్నగా కళ్ళు మూసుకుంటుంది మగ సింహం.. ఉన్నట్టుండి చిన్న వెలుగు ఒకటి కళ్ళలో పడగానే మగ సింహం ఉలిక్కిపడి లేచి కూర్చుంది.. ఆ కుదుపుకి ఆడసింహం కూడా లేచి అరణ్య వంక చూసింది.. అరణ్య కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు.. ఇరవై మూడేళ్ల తరువాత అరణ్య మొదటిసారి కళ్ళు తెరిచాడు, లేచి కూర్చున్నాడు..
ఆడసింహం ఒక్క క్షణం కూడా ఆగలేదు ఒక్క దూకులో అరణ్య మీదకి దూకి ప్రేమగా నాకుతుంటే మగసింహం అది చూస్తూ అరణ్య దెగ్గరికి వెళ్ళింది.. ఇద్దరినీ దెగ్గరికి తీసుకుని ప్రేమగా ముద్దాడుతున్నాడు ఆ ఇరవై మూడేళ్ల యువకుడు అందమైన యువకుడు.. కళ్ళు మూసుకుని తెరవగానే ఒంటిమీదకి బట్టలు, పొడుగాటి జుట్టు పిచ్చి గడ్డం అన్ని పోయి ఇంకా అందంగా తయారు అయ్యాడు.. ఆడ సింహాన్ని ఎత్తుకుని లేచి నిలబడ్డాడు..
అరణ్య : నన్ను క్షమించు అమ్మా...