Update 20 - Ending
ఆడ సింహంలో ఉన్న మీనాక్షి ప్రేమగా అరణ్యని నాకుతుంటే మగ సింహంలో ఉన్న శివ పెద్దగా గాండ్రించాడు, అడవి మొత్తం మేలుకుంది. అమ్మని కిందకి దింపి నాలుగు కాళ్ళ మీద ఒంగోని శివ దెగ్గరికి వెళ్ళగా శివ ముందుకు వచ్చాడు, ప్రేమగా అరణ్య తన తలని సింహం తలతో రుద్దుతుంటే మీనాక్షి కూడా దెగ్గరికి వచ్చింది.. ముగ్గురు ప్రేమని పంచుకున్నారు.
అరణ్య లేచి నిలబడగానే, శివ పెద్దగా అడవి మొత్తం దద్దరిల్లేలా మళ్ళీ గాండ్రించాడు.. జింకల జంట గగన్ మరియు అతని భార్యతో పాటు మిగిలిన జంతువులతో పాటు అక్కడ నివసించే ప్రజలు కూడా లోపలికి వచ్చారు.. అరణ్య అందరినీ కృతజ్ఞతగా చూడగా అందరూ మోకాళ్ళ మీద కూర్చుని తల వంచి నమస్కారం చెయ్యగా.. అరణ్య కూడా నీళ్ల నుంచి బైటికి వచ్చి అలానే మోకాళ్ళ మీద కూర్చుని అక్కడున్న అందరికీ ప్రతినమస్కారం చేశాడు.. సింహాల రూపంలో ఉన్న శివ మరియు మీనాక్షిలు కూడా మోకాళ్ళ మీద కూర్చోబోతే వెంటనే వెళ్లి ఆపాడు.
తెల్లవారుతున్న సమయాన ఉన్నట్టుండి పెళ్ళు పెళ్ళుమని శబ్దం వినిపించి అందరూ బైటికి పరిగెత్తారు.. అప్పటికే అడవిని మిలిటరీ విభాగం చుట్టు ముట్టేసింది, చెట్లని మనుషులని అడ్డొచ్చిన జంతువులని అన్నిటిని కొట్టేస్తుంటే అందరూ భయంతో బిక్కుబిక్కుమంటూ పరిగెత్తుకుంటూ అరణ్య దెగ్గరికి వచ్చేసారు.
అరణ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు, చెయ్యి ఎత్తి అటునుంచి ఇటువరకు ఊపగానే అరణ్య పరిధిలో ఉన్న అడవి చుట్టూర ఆకుపచ్చ రంగులో కవచం ఏర్పడింది.. మిలిటరీ విభాగం మొత్తం అది చూసి ఆగిపోయింది.. లోపలికెళ్లడం కాదు కదా కనీసం ముట్టుకోవడం కూడా కుదరలేదు.. ఇక ఇలా కాదని ముందు కాల్చారు, గ్రనెడ్స్ వేశారు, బాంబులు పెట్టారు కానీ ఫలితం మాత్రం సూన్యం.. ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి..
ప్రజలు మరియు జంతువులు అరణ్యచే కాపాడబడ్డామని సంబరపడ్డాయి.. ప్రజలు మాత్రం లోపల నుంచి బాణాలు వేస్తూ ఎవరు కనిపిస్తే వాళ్ళ మీదకి విరుచుకుపడ్డారు.. అరణ్య వద్దని వారించగా ఆగిపోయారు.. మిలిటరీ కూడా వెనక్కి తగ్గింది కొత్త ప్రణాళికతో రావడానికి.
ఆ రోజు రాత్రి సుశాంత్ (ఫోన్లో) : అస్సలేం జరుగుతుందో ఒక్క ముక్క అర్ధం కావట్లేదు, ఏ పని కుదరట్లేదు.. అరణ్య వెంట పడకండి.. ప్రతి ఒక్కరి దృష్టి ఇప్పుడు తన మీదె ఉంది.. కొన్ని రోజులు పోనివ్వండి.. లేకపోతే అనవసరంగా ఇరుక్కోవాల్సి వస్తుంది.. కానీ ఎక్కడికి వెళుతుందో తెలుసుకోండి.. ఆ అడివి సంగతి ఏమైంది.. ఏమైనా తెలిసిందా.. వెంటనే జరిగిపోవాలి.. అలాగే.. ఓకే అంటూ ఫోన్ పెట్టేసి కోపంగా ఫోన్ గోడకేసి కొట్టాడు.
వారం దాటింది అరణ్య(అమ్ములు) జాడ లేదు ఈ లోకానికి.. ఏ న్యూస్ లేకపోయేసరికి టీవీ ముందు కూర్చుని వినోదం కోసం ఎదురు చూసే జనానికి బోర్ కొట్టింది.. చిన్నగా దొంగ బాబాలు, స్వామీజీలు పుట్టుకొచ్చారు.. ఎవరి కధలు వారు అల్లుకుపోతూ రోజూ అరగంట ప్రోగ్రాం దాంట్లో అరగంట ఆడ్స్.
ఇంకోపక్క NaASA, ESA, JAXA, RFSA మరియు ISRO అందరూ టెన్షన్ తో తల పట్టుకుంటున్నారు.. భూ వాతావరణం లోకి వచ్చిన స్పేస్ షిప్ నుంచి ఎవరు దిగారో ఇంతవరకు తెలియలేదు.. అది కాక సోలార్ సిస్టం లోకి ఏదో ఎంటర్ అయ్యింది.. చాలా వేగంగా కదులుతున్నాయి.. అవి ఏంటి.. ఏలియన్స్ ఆ.. లేక అస్టరాయిడ్సా ఇంకేమైననా ఏమి అర్ధం కావడంలేదు.. అవేంటో తెలుసుకోవడానికి నాలుగు రోజులు ముందే రాకెట్ ని ప్రయోగించారు.. కానీ ఆ రాకెట్ ఆచూకి ఇంత వరకు తెలియలేదు.. సాటర్న్ ప్లానెట్ దాటగానే దాని సిగ్నల్స్ కోల్పోయింది.. ఎవరికి ఏం చెయ్యాలో అర్ధం కాక.. మానిటర్స్ చూస్తూ కూర్చున్నారు.
ఇరవై రోజులు తన అమ్మా నాన్నతోనే గడిపాడు, శివ(సింహం) అయినా కొంతసేపు బైటికి వెళ్లడం లాంటివి చేశాడు కానీ మీనాక్షి(సింహం) మాత్రం ఒక్క క్షణం కూడా కొడుకుని విడిచి ఉండలేదు.. అరణ్య తన అమ్మ కడుపులొంచి బైటికి వచ్చాక ఎంత ప్రేమ పంచాలనుకున్నాడో అంతా చూపిస్తుంటే మీనాక్షి ఆనందానికి హద్ధులు లేవు.. తన అమ్మని సంతోష పెట్టడానికి అడవి మొత్తం తన మాయతో అలంకరిస్తుంటే మీనాక్షి సంబరపడింది కానీ తనకి తెలుసుగా.. అరణ్య అంత సంతోషంగా ఉన్నాడంటే కచ్చితంగా కారణం ఉంటుందని అది తనకి తెలియంది కాదు..
అరణ్య : అమ్మా.. నీ కోడలు ఇవ్వాళ వస్తుంది అని మాత్రమే మాట్లాడి, సిగ్గుతో పక్కకి తప్పుకోగా మీనాక్షి అరణ్య చుట్టు పరిగెడుతూ తన మీద పడిపోతూ ఆట పట్టించింది.. దట్టమైన అడవిని కొంత విశాలంగా మార్చాడు.. కళ్ళు మూసుకుని తెరవగానే పెద్ద పెద్ద చెట్లు కూడా దూరంగా జరిగి ఒక క్రమపద్ధతిలో ఎవరో అలంకరించినట్టు అమరాయి.. దట్టమైన అడవి కాస్తా ఇంద్రుడు తిరిగే నందనవనంలా మారిపోయింది..
సుమారు గంట నుంచి అరణ్య తల ఎత్తి అరణ్య(అమ్ములు) రాక కోసం ఎదురు చూస్తున్నాడు. తనతో పాటే శివ మరియు మీనాక్షి(రెండు సింహాలు), గగన్ మరియు రజిత(రెండు జింకలు)
బంగారు హంస మీద అరణ్య(అమ్ములు) అడవిలోకి అడుగుపెట్టి కిందకి దిగుతుంటే తన వెనకె వెంటపడి వస్తున్న డ్రోన్స్ మాత్రం రక్షణ కవచానికి తగులుకుని పగిలిపోయాయి..
ఇప్పుడు భూమ్మీద ఉన్న అందరికీ అరణ్య(అమ్ములు) ఎక్కడుందో తెలిసిపోయింది.. ప్రతీఒక్కరు అటువైపే కదులుతున్నారు.. జనాలు మాత్రం టీవీ ముందు కూర్చుని తరవాత ఏం జరుగుతుందా అని ఆత్రుతతో ఎదురుచూస్తుంటే ఇంకో పక్క సుశాంత్ సమూహం, మిలిటరీ విభాగం, సైంటిస్ట్లు, అరణ్య(అమ్ములు)ని పట్టుకుని కాష్ చేసుకోవాలని తపిస్తున్న వాళ్ళు.. ఎవరి బలం వాళ్ళు ఉపయోగిస్తూ వాళ్ళ వాళ్ళ బలగాలతో సిద్ధం అవుతున్నారు.
అరణ్య(అమ్ములు) తన అమ్మ హంస మీద నుంచి దిగి అరణ్య కోసం ముందుకు పరిగెడుతుంటే గగన్ రజితలు (జింకలు) మరియు శివ మీనాక్షిలు (సింహాలు) చూస్తూ ఉన్నాయి.
అరణ్య(అమ్ములు) ముందుకు ఒక్కో అడుగు వేస్తున్నకొద్ది తన బట్టలు తెల్ల చీర ఎర్రని జాకెట్ గా మారిపోయింది, రెండో అడుగుకి తలలో పూలు, మూడో అడుగుకి మెడలో ముత్యాల హారాలు, నాలుగు చేతికి గాజులు, ఐదు వేళ్ళకి ఉంగరాలు, ఆరు నడుముకి వడ్డాణం, ఏడు కాలికి బంగారు పట్టీలు.. ఆ పై మరో అడుగుకి అరణ్య ఎద మీదకి చేరి తన కౌగిలిలో చేరింది. ఇదంతా చూస్తున్న శివ మరియు మీనాక్షి ఎంతగానో మురిసిపోయారు. గగన్ మరియు రజిత ఇది చూసిన తమ జన్మ ధన్యం అంటూ చూడసాగాయి.
అమ్ములుని కౌగిలించుకున్న అరణ్యకి వెంటనే తన కావేరి అమ్మమ్మ గుర్తొచ్చి ఒక్క క్షణం శివ వంక క్షమించమని వేడుకున్నట్టు చూసి ఆ వెంటనే కళ్ళు మూసుకుని తెరిచాడు అంతే కావేరి ఇక్కడ ప్రత్యక్షమయింది, శివకి తన అమ్మ కనిపించగానే వెంటనే ఒక్క దూకు దూకాడు.. పదమూడు అడుగుల సింహం ముందుకు దూకగానే పిచ్చి పట్టిన కావేరి బెదిరిపోయింది.
అరణ్య దెగ్గరికి వెళ్లి కావేరి అరచేయి పట్టుకుని తిప్పి తన కళ్ళలోకి చూడగానే ఒక్కసారిగా గతమంతా తన కళ్ళ ముందు తిరిగి గట్టిగా అరుస్తూ కొడుకు కోడలిని గుర్తు తెచ్చుకుని ఏడుస్తుంటే శివ దెగ్గరికి వెళ్ళాడు, అరణ్య వెంటనే తన మణికట్టు మీద ఒత్తగానే తన పిచ్చితో పాటు తన వేదన అంతా దూరం చేసి శివ మరియు అరణ్య ముందు నిలబడ్డాడు. అరణ్య శక్తితో అంతా తెలుసుకున్న కావేరి వెంటనే మోకాళ్ళ మీద కూర్చుని శివని, మీనాక్షిని హత్తుకుపోయి ముద్దులు పెడుతుంటే అరణ్య అమ్ములు పక్కన చేరి వాళ్ళ ప్రేమని చూస్తున్నాడు..
ఆకాశం నుంచి హంస ఎగిరి రావడం చూసిన అడవి ప్రజలు వెంటనే అరణ్య దెగ్గరికి వచ్చి దట్టమైన అడవి నందనవనంలా మారడం ఆశ్చర్యంగా చూస్తూ ఆ వెంటనే అరణ్యని తన కౌగిలిలో ఉన్న అరణ్య(అమ్ములు)ని చూసి జేజేలు పలుకుతూ హర్షధ్వనాలు చేశారు, ఆ శబ్దాలకి ఇద్దరు విడిపడగా అమ్ములు సిగ్గుతో తల వంచుకుని తనని తాను చూసుకుని తన బట్ట వేషం మారడం చూసి తన బావ వంక ప్రేమగా చూసింది.
అరణ్య అమ్ములు చెయ్యందుకుని ముందుకు నడిచి శివ మీనాక్షిల సమేతగా నిలుచున్నా కావేరి ముందు నిలబడి మోకాళ్ళ మీద కూర్చోగా రెండు సింహాలు ప్రేమగా వారిరువురిని దెగ్గరికి తీసుకున్నాయి కావేరి మనస్ఫూర్తిగా వారిని దెగ్గరికి తీసుకుని హత్తుకుంది, ఆ వెంటనే జింకల ముందు కూడా అలానే మోకరిల్లి కూర్చుని ఆశీసులు తీసుకోగా శివ బైటికి వెళుతుంటే ఆ వెంటే మీనాక్షి వారి వెంట జింకలు మరియు ప్రజలు అందరూ బైటికి వెళుతుంటే అరణ్య శివని పిలిచాడు శివ, మీనాక్షి మరియు కావేరి ఆగిపోగా అందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోగా అరణ్య పక్కకి వెళ్లి శివతో ఏదో దీర్గంగా చర్చించాడు.. మీనాక్షి మళ్ళీ అరణ్య, శివ కలిసి ఏం వెలగబేడుతున్నారో అని చూస్తుండడం అరణ్య గమనించి అమ్మా అని పిలిచాడు.. మీనాక్షి వెంటనే పరుగుతో అరణ్య మీదకి చేరి నాకుతూ ఉండగా అమ్ములు కూడా తన బావ పక్కన నిలుచుని మీనాక్షి తల మీద చెయ్యి వేసింది, మీనాక్షి అమ్ములుని కూడా అలానే ప్రేమగా తన మొహాన్ని రుద్ది కిందకి దిగి బైటికి పరిగెత్తింది.
అందరూ వెళ్ళిపోయాక అమ్ములు వైపు తిరిగాడు, చుట్టు ఏదో మాయలా జరుగుతుంటే అమ్ములు చుట్టు చూస్తుంది, చెట్లన్ని గోడలా లోపలికి ఎవ్వరు రాకుండా మూసుకుపోతూ గోడలా ఏర్పడుతుంటే వాటికి అలంకరణగా రంగు రంగు పూలు తీగలుగా చెట్లకి అల్లుకుపోతున్నాయి.
అమ్ములు గడ్డం మీద అరణ్య చెయ్యి పడగానే, అమ్ములు తన బావ వంక చూసింది.
అమ్ములు : బావా.. నీతో చాలా మాట్లాడాలి, చాలా...
అరణ్య : నేను కూడా.. ఈ రోజు కోసం కొన్ని ఏళ్లగా ఎదురు చూస్తున్నాను.. ముందు నేనెవరో నీకు తెలియాలి, నా పుట్టుక ఎందుకు జరిగిందో నేను నీకు చెప్పాలి, మనుషులకి తెలియని చాలా దైవ రహస్యాలు నీతో పంచుకోవాలి.. అందుకే ఎవరు రాకుండా ఈ ఏర్పాటు చేసాను.. అని అమ్ములుని ఎత్తుకున్నాడు. అమ్ములు ఇంకా సిగ్గు పడుతూ అరణ్య ఒడిలో ఒదిగిపోయింది.. సిగ్గుతో తల ఎత్తడం లేదు.. కాని జీవితంలో మొదటిసారి తన చేతిలో నుంచి వేణువు కింద పడిపోయింది.. బహుశా ఇక అరణ్య(అమ్ములు)కి ఆ వేణువుతో పని లేదనుకుంటా
అరణ్య అమ్ములుని ఎత్తుకుని నీళ్లలో నడుస్తుంటే అమ్ములు అడిగింది, బావ ఈ నీరు నీ కన్నీటితో ఏర్పడ్డాయి కదా అంటూ కిందకి దిగి దొసిటతో పట్టుకుని తాగింది కానీ ఉప్పగా తగిలేసరికి తల ఎత్తి అరణ్య వంక చూసింది, అరణ్య అమ్ములు తల మీద చెయ్యిపెట్టగానే అమ్ములు కళ్ళు మూసుకుంది. అరణ్య అమ్ములుని దీవిస్తూ ఇంకా నీలో ఉన్న బిడియం, భయాలు, అనుమానాలు అన్ని వదిలేయి అని చెపుతుండగానే అమ్ములు వంగి అరణ్య కాళ్లు మొక్కింది.. అరణ్య ప్రేమగా ఒక భర్తలా అమ్ములుని తన భార్యగా స్వీకరించి ఆశీర్వాదించి తన నుదిటిపై బొటన వేలితో రాయగానే అక్కడ ఎర్రగా కుంకుమ ఏర్పడింది, భార్యని పైకి లేపి తన కౌగిలిలోకి తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టగా పై నుంచి పువ్వుల వర్షం పడింది.
అరణ్య : ఇప్పుడు తాగి చూడు
అమ్ములు వంగి మళ్ళీ నీళ్ళని తీసుకోగా ఈ సారి అమృతంలా అనిపించి నవ్వేసరికి అరణ్య అమ్ములుని ఎత్తుకుని నీళ్లలో నడిచి తామర పువ్వుపై కూర్చోగా అమ్ములు చిన్నగా పడుకునేసరికి అరణ్య కూడా తన పక్కన పడుకుంటుంటే, తామర పువ్వు చిన్నగా ముడుచుకుని ఇరువురినీ కప్పేసింది.
సుమారు ఇరవై రోజులు భార్యభర్తలు ఇద్దరు బైటికి రాలేదు, ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో, ఏం పంచుకున్నారో, అరణ్య తన భార్యకి ఎలాంటి వరాలు ఇచ్చాడో యే యే విద్యలు నేర్పించాడో తన గురించిన నిజాలు తన శక్తుల గురించి ఏం చెప్పాడో ఎవరికి తెలియదు.. ఆ స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళకి మాత్రమే సొంతమయ్యింది.. ఇరవైయొక్క రోజు ఇద్దరు అరణ్యలు బైటికి వచ్చారు.
అరణ్య మెడలో రుద్రాక్ష దండతో పాటు పూదండ, చేతికి కడియం ఉన్నాయి.. ఇక తన భార్య అరణ్య చేతి వేళ్ళకి కాలి వేళ్ళకి గోరింటాకుతో ఎర్రగా పండి ఉంది, తన అరచేతిలోని మచ్చని కూడా గోరింటాకు మచ్చతో కప్పేసింది, తన మెడలో కూడా దండ ఉంది.. ఇద్దరి మొహాలు ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాయి.. ఇద్దరు ఒక్కటయ్యారన్న దానికి ఇంతకన్నా నిదర్శనం ఉండదు..
భార్య భర్తలు ఇరువురు బైటికి వచ్చేసరికి అడవి మొత్తం మంటలతో కాలిపోతుంది, ఒక పక్క విక్రమాదిత్య తన ఆయుధమైన విష్ణు చక్రంతో నిలబడి ఉండగా ఇంకోపక్క రుద్ర త్రిశులంతో నిలబడి ఉన్నాడు. అరణ్య తన భార్యని చూసి తనలో కలుపుకోగా అందరికీ చతుర్ముఖుడై దర్శనం ఇచ్చాడు.
అందరూ నమస్కరించగా అరణ్య ఒకసారి అందరినీ పరికించి చూసాడు.. ఎదురుగా రంగు రాళ్ళని ధరించిన వారు.. విక్రమ్ తన ధనుస్సుతో.. ఆదిత్య గదతో.. వాసు రెండు కత్తులతో.. చిరంజీవి ఆర్మీ సైన్యంతో.. సుబ్బు పెద్ద ట్రక్ లో మరియు అతని వెనక విశ్వ అండ్ టీం కార్లలో చివరిగా డాన్ శీను కొన్ని వేల మంది డాన్స్ మరియు రౌడీలు ఆయుధాలతో.. అందరి వెనకా అక్షిత చిన్న కత్తులు పట్టుకుని నిలుచొగా రక్ష తన గొడ్డలితో ముందు నిలుచుని ఉంది సుమారు పదివేల మంది సైన్యంతో.. వాళ్ళ వెనక కంధర మరియు ఇంద్రుడు సేనాధిపతులుగా వేలల్లో దేవుళ్ళు.. ఆ వెనక లిఖిత మరియు నల్ల కంధర రాక్షసులతో సుమారు లక్ష మంది సైన్యంతో జరగబోయే యుద్దానికి సిద్ధంగా నిలబడ్డారు.
సమాప్తం