Chapter 03


ప్రియ తన ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉండిపోయాను. తనకి ఒక మెసేజ్ చేద్దాం అనుకుని, మళ్ళా ఇప్పుడే వద్దు, ఒక వారం తర్వాత చేద్దాంలే అనుకున్నాను. అయితే ఫేస్బుక్ ఓపెన్ చేసి తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను. నా ఫోన్లో సేవ్ చేసిన తన ఫొటోస్ అలాగే చూస్తూ, అలాగే ఏదో దొరికిన ప్రేమ కథ పుస్తకం online లో డౌన్లోడ్ చేసి చదువుతూ సమయం గడిపేశాను.

మరుసటి రోజు అందరూ ఆఫీస్ లో అందరూ నేనుందుకు ఈ రోజు చాల సంతోషంగా ఉన్నాను అని అడిగారు. నేను స్వీట్స్ తేవటం మరచిపోయాను. లంచ్ టైములో, బయటకు వెళ్లి స్వీట్స్ కొనుక్కొని వచ్చాను. అందరికి ఆఫీస్ లో పంచాను. అందరూ పెళ్లి ఎప్పుడు అని అడిగారు.

ఎంగేజ్మెంట్ కోసం శుభలేఖలు ప్రియ వాళ్ళే తాయారు చేయించి మాకు ఒక 10 కార్డులు పంపిస్తారు. కేవలం 20-30 మంది మాత్రమే వస్తారు. అటు వైపు ఒక 10 మంది ఇటు వైపు ఒక 10 మంది. ఒక చిన్న హోటల్ లో ప్రియ వాళ్ళ ఊరిలో చేసుకుంటున్నాము. పెళ్లి విషయంలో మంచి శుభలేఖలు తయారు చేయించి. అందరికి పంచాలి. కొంచెం గ్రాండ్ గా చేయాలి అనుకున్నాం కాబట్టి, చాలా పనులు ఉంటాయి.

నేను పదే పదే నా ఫోన్ లో ఫేస్బుక్ చూసుకుంటూ ఉండిపోయాను. చివరకి సాయంత్రం ఇంటికి వెళ్లి డిన్నర్ చేసే ముందు నోటిఫికేషన్ వచ్చింది నా ఫ్రెండ్ రిక్వెస్ట్ ప్రియ accept చేసినట్లు. నేనెందుకు ప్రియ గురించి ఇంత ఆతృతగా ఉన్నానో నాకే అర్థం కాలేదు.

ఒక మూడు రోజుల తర్వాత ఆఫీస్ లో ఉన్న టైములో ఫోన్ మోగింది. స్క్రీన్ పై "ప్రియా డార్లింగ్" అని ఉంది. వెంటనే ఫోన్ ఎత్తాను:

"హలో" అని అటు వైపు తీయని గొంతు

"ప్రియ"

"సంజయ్ గారు, ఎంగేజ్మెంట్ కి కార్డ్స్ తాయారు అయ్యాయి, కొంచెం మీ వైపు ఎవరెవరికి పోస్ట్ చేయాలో వారి పేర్లు అడ్రస్ లు ఇవ్వగలరా ??"

నాకు ఎం చెప్పాలో అర్థంకాలేదు.

"సరే ప్రియ, కొంచెం టైం ఇవ్వు, వాట్సాప్ చేస్తాను"

"సరే సంజయ్ గారు" అని ఫోన్ కట్ చేయబోతుండగా.

"ప్రియ ....... " అని అన్నాను

"షాపింగ్ కు ఎప్పుడు అని ఎమన్నా అనుకున్నారా ?? అమ్మ నాన్నను ఊరికి పిలవాలి"

"ఇంకా లేదండి, వచ్చే వారం అన్నారు అమ్మ నాన్న. ఇంకా డబ్బులు అరెంజ్ చేసుకుంటున్నారు"

"మీరు ఏమి అనుకోకపోతే...... టికెట్స్ బుక్ చేయాలి కదా అమ్మ కి నాన్న కి కొంచెం డేట్ చెప్తే..... "

"సరే సంజయ్ గారు...... నేను మీకు మళ్ళా ఫోన్ చేస్తాను"

"సరే ప్రియ"

ఫోన్ కట్ అయ్యింది. ఎందుకో ప్రియ తో మాట్లాడక చాలా ఆనందం కలిగింది. తన గొంతు వినగానే చెప్పలేని అనుభూతి. ప్రేమంటే ఇలాగె ఉంటుందా అనిపించింది.

తాను మళ్ల సాయంత్రం ఫోన్ చేసింది:

"హలొ "

"ప్రియ..... "

"అడిగానండి అమ్మ నాన్న గురువారం చెప్పారు, కానీ నాకు లీవ్ దొరకలేదు, అందుకే శుక్రవారం అనుకుంటున్నాము, మీకు ఓకేనా ??"

"ఒకే....... నో ప్రాబ్లెమ్"

"సంజయ్ గారు, పేర్లు అడ్రస్లు పంపిస్తాను అన్నారు, ఎంగేజ్మెంట్ కార్డ్స్ కోసం"

నేను అసలు వాటి సంగతే మరచిపోయాను.

"రేపటిలోపల పంపిస్తానండి"

"పర్లేదండి....."

"ప్రియ....... నువ్వు ఏమి అనుకోనంటే..... "

"పర్లేదు చెప్పండి......"

"మనం ఒకసారి ఈ వీకెండ్ కలుద్దామా ఎక్కడైనా బయట??"

అటు వైపు సైలెంట్ అయిపోయింది కొంచెంసేపు.

"నేనే నిన్ను పికప్ చేసుకుంటాను డ్రాప్ చేస్తాను......"

"సంజయ్ గారు మీరు ఏమి అనుకోనంటే............"

తను ఏమి చెప్పాలనుకుంటుందో అని నేను వెయిట్ చేసాను

"........ కావాలంటే షాపింగ్ అయ్యాక ఒకసారి కలుధ్ధాం......."

కొంచెం సైలెంట్ అయ్యింది రెండు వైపులు కూడా

"పర్లేదండి....... అర్ధం చేసుకోగలను....... ఏదో ఒకసారి కలిస్తే బాగుంటుంది కదా అని అడిగాను..... అయితే తర్వాత కలుద్దాం"

"సంజయ్ గారు థాంక్స్ అర్థం చేసుకున్నందుకు........ ఒక అమ్మాయి గా నా గురించి కొంచెం మీరు ఆలోచించాలి"

"లేదు లేదు నాకు అర్థమయిందిలెండి....... ఎనీవే థాంక్స్ అండి..... "

"సరే సంజయ్ గారు, నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం"

10 రోజుల తర్వాత ........

ప్రియకి ఫోన్ చేసాను:

"హలో"

"సంజయ్ గారు చెప్పండి"

"అమ్మ నాన్న ఎల్లుండి వస్తున్నారండి............ "

"ఓ మా అమ్మ నాన్న రేపు వస్తున్నారు..... ఎక్కడ కలుద్దాం ఎళ్ళుండి "

".........xxabcxx....లో కలుద్దాం ప్రియ, అక్కడ సెలక్షన్ బాగుంటదంట....... మీరు కూడా ఏమైనా సజెస్ట్ చేయండి...... అక్కడికి కూడా వెళదాం"

"ఒకే సంజయ్ గారు"

"మీరు కొంచెం సంజయ్ గారు అని కాకుండా, సంజయ్ అని పిలవండి ప్లీస్, అండి గిండి, అంటే ఏదో పెద్ద మనిషిని పిలిచినట్లుంది"

ప్రియ ఫోన్ లో నవ్వింది.

"నిజంగా అంటున్నాను.......ప్రియ"

"అలా మిమ్మల్ని పిలిస్తే మనవాళ్ళందరూ అందరూ ఏమనుకుంటారో.... సంజయ్ గారు"

"పర్లేదు...... నీకు ఇబ్బందిగా ఉంటె బయట మాత్రం మామూలుగానే పిలువు, మిగిలిన సమయాల్లో, సంజయ్ అనే పిలువు."

"ఏమో సంజయ్ గారు......... "

"మా చెల్లిని చుడండి, నేను తనకు అన్నయ్య ఐన, ఎరా పోరా, అని పిలుస్తది నన్ను.........నేను కూడా అలాగే పిలుస్తాను దాన్ని. మేము ప్రేమతోనే ఫ్రెండ్స్ లాగా ఆలా పిలుచుకుంటాం...... ఇది కూడా అంతే....... "

ప్రియ నవ్వేస్తోంది ఫోన్ లో.

"అవును చెల్లి రావట్లేదా సంజయ్ ??"

"మొత్తానికి లైన్ లోకి వచ్చారన్నమాట...... "

"అవును...... "

"చెల్లి కాలేజీతో బిజీ. మెడిసిన్ కదా..... మీకు తెలుసు ఎలా ఉంటదో అక్కడ"

"ఆమ్మో మెడిసిన్ చాలా కష్టం....... "

"వస్తే బాగుండేది......సర్లెండి"

"అంత సీన్ లేదు...... తనకు లైవ్ రిలే ఇవ్వాలంటే ఫోన్ లో ఎం కొంటున్నాము అని...... నాకు రీచార్జ్ చేయించమని చెప్పను"

"మీరు ఎప్పుడు అలాగే తన్నుకుంటూ ఉంటారా ??" అని నవ్వుతు అడిగింది ప్రియ

"మరి అంతే కదా......"

"నాకు ఒక తమ్ముడో అన్నో ఉంటే బాగుండేది....... "

నేను నవ్వాను ఫోన్లో.

"సరే సంజయ్, మళ్ళా మాట్లాడుకుందాం..... ఇక్కడ బాస్ ఇటువైపే వస్తుంది..... మళ్ళీ మాట్లాడుకుందాం"

కాల్ కట్ అయ్యింది.

ఇద్దరం చాలా దూరంలో ఉన్నా, ప్రియతో ఫస్ట్ టైం చాలా దగ్గరగా మాట్లాడిన ఫీలింగ్ కలిగింది. తను సంజయ్ అని పిలవటం మొదలుపెట్టింది కాబట్టి, ఇప్పుడు తను నాకు బాగా దగ్గరైనట్లనిపించింది. ఆ రోజంతా ప్రియా గురించే ఆలోచించాను. కళ్ళు తెరిచిన తనే కళ్ళు మూసినా తనే. తనతో అలాగే ఫోన్ లో మాట్లాడుతూ ఉండిపోవాలనిపించింది.

పెళ్ళికి ఇంకా రెండున్నర నెలలు వెయిట్ చెయ్యాలి. ఎంగేజ్మెంట్ అయ్యాక, 2 నెలలు ఉంటాయి కాబట్టి, ఈ టైం లో కొంచెం ప్రియతో పరిచయం ఏర్పరచుకొని దగ్గరవ్వాలి. పెళ్లి అయ్యే ముందు కనీసం ఒకరి గురించి ఒకరకి మంచి పరిచయం ఉండాలి. పెళ్లి అయ్యే సమయానికి మాకు మంచి పరిచయం ఉంటె ప్రియా తో ఫస్ట్ నైట్ అలాగే హనీమూన్ బాగా ఎంజాయ్ చేయవచ్చు లేదంటే ఒక తెలియని వ్యక్తితో సమయం గడిపినట్లుంటుంది.

అయితే ప్రస్తుతానికి ఏదో ప్రియతో బాగానే మాట్లాడుతున్నాను కానీ తనకు ఎలా దగ్గర కావాలో నాకు తెలీదు. ఇదంతా చాలా కొత్తగా ఉంది. కొంచెం సేపు ఆలోచించి, నెట్ లో "డేటింగ్" గురించి చదవటం మొదలుపెట్టాను. అయితే నెట్ లో పుస్తకాలలో ఉన్నదంతా అమెరికాలో ఉండే డేటింగ్ విధానం గురించి. కానీ ఒక అరేంజ్డ్ మ్యారేజ్ విషయంలో ఎలా అమ్మాయికి దగ్గరవ్వాలి అన్నది ఎక్కడ దొరకలేదు. అందుకే ఉన్న పుస్తకాలు, నెట్ లో ఆర్టికల్స్ చదివి ఉపయోగ పడే విషయాలు నేర్చుకుని, మిగిలిన విషయాలు వదిలేద్దాము అని అనుకున్నాను.

రాత్రి 2 దాకా చాల చదివాను. కానీ ఇలాంటి విషయాలు పుస్తకంలో కన్నా నిజ జీవితంలోనే నేర్చుకోగలం అని అర్థం అయ్యింది. అన్ని పుస్తకాలు, నెట్ లో డౌన్లోడ్ చేసిన ఆర్టికల్స్ డిలీట్ చేసేసాను. గట్టిగ ఆలోచిస్తే నాకు తెలిసింది ఏంటి అంటే, కూల్ గా ఉంటె ఇలాంటి విషయాలులో బాగా ముందుకు వెళ్లగలము అని. ఎక్కువ ఆలోచిస్తే అనవసరంగా టైం వేస్ట్.

1 రోజు తర్వాత.........

అమ్మ నాన్న దగ్గరే ఉన్న హోటల్ లో దిగారు. నేను ఒక రిచ్ ఫ్రెండ్ నుంచి ఇన్నోవా కార్ ఒక రోజు వాడుకుంటాను అని తీసుకున్నాను. ఇన్నోవా కార్ లో అమ్మ నాన్నను ఎక్కించుకొని షాపింగ్ కోసం వెళ్ళాము.

షాప్ లోకి ప్రియ వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు. ఇక్కడ మా ఎంగేజ్మెంట్ కు, సంగీత్ కు, పెళ్ళికి, పూజలకు బట్టలు కొనాలి. అయితే ఇద్దరకీ మాచింగ్ బట్టలు మరియు ఫోటోలలో బాగా వచ్చేవి కొనాలి. నాకు బట్టల గురించి పెద్ద మోజు కానీ అవగాహన కానీ లేదు. ఈ రోజు బట్టలేమో కానీ, ప్రియను మాత్రం బాగా చూడొచ్చు. అదేంటో తెలీదు, తన గురించి అస్సలు మరవలేకపోతున్నాను. ఎప్పుడు తన గురించే ఆలోచనలు. పిచ్చెక్కిపోతుంది. మొన్న టీవీ లో ఒక ప్రేమ సినిమా చూస్తూ, ఊహలలో విహరించాను. నా బుర్ర ను లవ్ హైజాక్ చేయినట్లుంది.

ప్రియ ఈ రోజు కూడా మోహంలో నవ్వు దాచుకొని నన్ను ఆలా ఆలా చూస్తూ నా వైపు చూసి కొంచెం కొంచెం సిగ్గుపడుతూ ఉంది. బాగా రెడీ అయ్యి, చాలా మంచి శారీ వేసుకొని చాలా క్యూట్ గా కనిపించింది.

ఆడవాళ్ళూ చీరాల గురించి చాలా సేపు తీసుకుంటారు కాబట్టి, మొదట నా బట్టలు తీసుకోవాలని అనుకున్నారు. మొదట కొన్ని డ్రెస్సులు చూపించారు. అయితే దాంట్లో ఒక డ్రెస్ నచ్చి, ఒకసారి ట్రయిల్ వేసుకోమన్నారు. లోపాలకి వెళ్లి ఆ డ్రెస్సు ను ధరించి, నా ఫోన్ తీసుకొని ప్రియ కి మెసేజ్ పెట్టాను "ఎలా ఉంది" అని. అప్పుడు బయటకు వచ్చాను.

అందరికి డ్రెస్ నచ్చింది. ఒకసారి ముందుకి వెనక్కి తిరగమన్నారు. డ్రెస్ ఒకే అనుకున్నారు. నాకు నచ్చిందా అని అడిగారు. నేను అప్పుడే ఫోన్ పాకెట్ లో నుంచి తీసి చూసాను. ప్రియ "thumbs down" సింబల్ పెట్టింది. నేను డ్రెస్ అంత నాకు నచ్చలేదు అని చెప్పాను. లోపలి వెళ్లి ఇంకోటి ట్రై చేశాను. మల్ల మెసేజ్ పెట్టి బయటకి వచ్చాను. ఈసారి ప్రియ అమ్మకి, నా అమ్మకి నచ్చింది కానీ ఇద్దరి నాన్నలకి పర్లేదు అనిపించింది. ఫోన్ లో "thumbs up" సింబల్ చూసాను. వెంటనే ఒకే చేశాను. ప్రియా కూడా చాలా సైలెంట్ గా ఆలా ఆలా నాకు మెసేజ్ లు పంపింది. మొత్తానికి ఒక మూడు డ్రెస్సులు సెలెక్ట్ చేసాము ఒక గంటలో.

ఇప్పుడు ప్రియ చీరలు కొనాలి. అయితే ఆడవాళ్లది కాబట్టి మేము పక్కకు వచ్చేసి కూర్చున్నాము. మేము దూరంగా జెంట్స్ సెక్షన్ లో ప్రశాంతంగా కూర్చున్నాము. సడన్ గా ఫోన్ వైబ్రేట్ అయ్యింది. ప్రియ తన శారీ పైన కొత్త శారీ భుజం పై వేసుకొని ఒక ఫోటో పంపింది. నాకు అర్ధం కాలేదు, ప్రియ కు ఇంత ధైర్యం ఎప్పుడు వచ్చింది అని. కొంచెం ఆశ్చర్యం వేసి, అమ్మతో మాట్లాడాలని సాకు పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లాను. ఇంకో కొత్త శారీ భుజం పై వేసుకొని తాపీగా ఫోటో తీసుకుంది. అంత ఓపెన్ గా ఎలా చేస్తుందో అర్థం కాలేదు. అక్కడ ఒక నిమిషం ఉంటె అర్థమైంది, ప్రియ వాళ్ళ ఆంటీ ఎవరికో పంపిస్తుంది ఫొటోస్, అలాగే నాకు కూడా.

నేను మల్ల వెనక్కు వెళ్లి. అప్పుడు ఒక్కో ఫోటో కి రిప్లై పెట్టాను. ఒక ఇరవై ఫోటోలు పంపింది. అన్నిటికి thumbs up పెట్టాను. తను నిజంగా అన్నిటిలో చాలా అందంగా కనిపించింది. కొంచెం సేపటి తర్వాత అన్ని మెసేజిలు డిలీట్ చేసేసింది. ఏమనుకుందో నాకు తెలీదు.

ఆ తర్వాత బయట ఒక హోటల్ లో తినేసి ఎంగేజ్మెంట్ ఉంగరాలు కొనటానికి వెళ్ళాము.

రింగ్స్ సెలెక్ట్ చేసుకోవటానికి వేరే షాపుకి వెళ్ళాము. అయితే రెండు మూడు షాపులలో మోడల్స్ చూసి రేట్ కనుక్కొని, రేపే కొనాలని ముందుగానే డిసైడ్ అయ్యాము. అలాగే ప్రియ కి శారీ కూడా ఇంకొకటి తీసుకోవాలి. అయితే, అన్ని మోడల్స్ చూసాము. నాకు ఒక రెండు మోడల్స్ నచ్చాయి కానీ ప్రియ కి ఏమి నచ్చలేదు, నచ్చినవాటికి రేట్లు నచ్చలేదు.

కొన్ని నగలు కూడా తీసుకోవాలని అనుకున్నారు. అందరం ఒకే చోట కూర్చున్నాం. నేను ప్రియని అలాగే చూస్తూ ఉండిపోయాను. తాను చాలా సెట్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ చూసింది. తనను మొత్తం స్కాన్ చేస్తూ ఉండిపోయాను. తను ఆ జ్యువలరీ షాప్ లైట్స్ లో చాలా కళగా కనిపించింది. తను చాలా నాజూకుగా, లేతగా ఉన్నందువల్ల ఇంకా అందంగా కనిపించింది. తన అందమైన కాళ్ళని, పాల బుగ్గలని, ముద్దుగా ఉన్న ముక్కుని, ఎర్రని పెదాలని, లేతగా ఉన్న చేతులని, భుజాలని ఏ ఒక్కటి వదల్లేదు.

ప్రియ అమాయకంగా చూస్తూ తీయని గొంతుతో మాట్లాడే మాటలు నా మనసులో ఆశలు రేకెత్తాయి. మనసు నిండా తన పై ఒక ఉద్రేకంతో కూడిన ఒక బలమైన ఆకర్షణ. మా ఇద్దరి మధ్యలో ఏదో కనపడని తీవ్రమైన ఉద్రిక్తత. చాలా ఇబ్బందిగా అనిపించింది. గత రెండు వారాలుగా తన గురించే అన్ని ఆలోచనలు. ఆలోచనలు వేరే వైపు మళ్ళించాను. చివరకి షాప్ బయటకి వెళ్లి ఒకసారి అటు ఇటు నడిచి ఫోన్ లో ఒక గేమ్ ఆడి లోపాలకి వచ్చాను.

మొత్తానికి ఆ రోజు పని అవ్వలేదు. మరుసటి రోజు కూడా అంతే. చాలా కష్టపడ్డాను తన గురించి ఆలోచించకుండా ఉండటానికి. మొత్తానికి బట్టల పని, ఉంగరాలు కొనటం అయ్యింది. ఆ మరుసటి రోజు పెళ్లి కార్డులు డిజైన్లు చూసి ఒకటి సెలెక్ట్ చేసాము. కానీ అందరికి నచ్చడానికి ఒక రోజంతా రక రకాల డిజైన్లు చూసాము. కానీ ఈ మూడు రోజులు ప్రియా పక్కనే ఉండటంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. రాత్రి నిద్ర లేదు. ఇంకా పెళ్ళికి రెండున్నర నెలలు అంటే పిచ్చెక్కిపోయింది.
Next page: Chapter 04
Previous page: Chapter 02