Update 05

(1977 మార్చి 22)

పాకిస్తాన్ embassy లో మొత్తం అంతా హడావిడి గా ఉన్నారు ఇండియా లో ఉన్న తమ ఏజెంట్లను తిరిగి పాకిస్తాన్ తీసుకొని రావాల వద్దా అనే అంశంపై అక్కడ చర్చ జరుగుతోంది ఒకరు ఇద్దరు అంటే వదులుకుంటారు కానీ ఒకేసారి 45 మంది identity లు బయటకు వచ్చాయి వాళ్లను సేఫ్ గా తిరిగి అప్పగించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ 45 మంది కీ బదులుగా ఒక్కడిని తిరిగి అడిగారు అతనే "అశ్విన్ రుద్ర మార్తాండన్" భారతదేశంలో అతి భిన్నమైన సైంటిస్ట్ ప్రపంచంలో ఎక్కడా లేని ఒక గుడ్డి మిసైల్ సైంటిస్ట్ ఒక చిన్న మిషన్ మీద అతని అవతలికి పంపారు కానీ ఇప్పుడు అతను చాలా క్లిష్టమైన పరిస్థితి లో ఉన్నాడు చావు బ్రతుకు మధ్యలో చీకటి పగలు తెలియని పరిస్థితిలో ఆకలి కేకలు పెడుతూ ఉన్నాడు, పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఒక దేశం మొత్తం ఒకడి కోసం బేరం పెట్టింది అంటే వాడు అంత తెలివైనవాడా లేదా అంత ధైర్యం ఉన్నవాడా అని తలలు పట్టుకున్నారు దాంతో ఇంక అశ్విన్ నీ వదిలిపెట్టాలని అనుకున్నారు మొత్తం పేపర్ వర్క్ అంతా అయిన తర్వాత అశ్విన్ ఒక బాంబ్ పేల్చాడు అది ఏంటి అంటే తనతో పాటు ఆసియా నీ కూడా ఇండియా కీ తన భార్య స్థానం లో పంపాలి అలాగే 5 నెలల నుంచి జైలులో ఉన్న ఇండియన్ కెప్టెన్ శ్రీనివాస్ నీ కూడా ఇండియా కీ తనతో పంపాలి అని.

అశ్విన్ పెట్టిన ఈ ఫిట్టింగ్స్ కీ రెండు దేశ ప్రభుత్వాలు షాక్ లో ఉన్నారు అంతే కాకుండా ఒక పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడం కూడా నచ్చలేదు పైగా కెప్టెన్ శ్రీనివాస్ ఎవరో తమకు సంబంధం లేదని అతని గురించి మా దెగ్గర ఎలాంటి రికార్డ్స్ లేవని భారతదేశం డిక్లేర్ చేసింది దాంతో వస్తే అశ్విన్ ఒక్కడినే తీసుకుంటామని లేక పోతే అతని తో కూడా మాకు సంబంధం లేదు అని ఈ డీల్ కాన్సిల్ చేస్తామని హెచ్చరించారు అయిన కూడా అశ్విన్ వినిపించుకోలేదు దాంతో ఇండియా లో ఉన్న పాకిస్తాన్ ఏజెంట్లను తిరిగి పంపడం వల్ల ఏమీ ప్రయోజనం లేదని అర్థం అయ్యి వాళ్ళని కస్టడీకి తీసుకున్నారు, పాకిస్తాన్ కూడా తమ రికార్డ్స్ నుంచి ఆ 45 మంది identity తొలగించారూ అశ్విన్ నీ శ్రీనివాస్ నీ దూరంగా తీసుకొని వెళ్లి ఎన్కౌంటర్ చేయాలి అని ప్లాన్ చేశారు వాళ్ళతో పాటు గా ఆసియా నీ కూడా తీసుకొని వచ్చారు శ్రీనివాస్ ఆసియా నీ కాపాడాలని పాకిస్తాన్ సైనికుల తో పోరాడాడు దాంతో వాళ్లు శ్రీనివాస్ నీ కాల్చి చంపారు ఆసియా గాయపడిన అశ్విన్ దగ్గరికి తీసుకొని "ఆశ్వథ్థామ్ (అశ్విన్ కీ ఆసియా పెట్టుకున్న ముద్దు పేరు) మనం చనిపోతున్నాం నీ చీకటి జీవితం లో నేను ఒక వెలుతురు లా వచ్చాను అని చాలా సార్లు చెప్పావు కానీ నేను ఒక ఆరిపోయే దీపం అని నీకు చెప్పాను నువ్వు ఎంత వరకు వెళుతూరు ఇస్తే అంత వరకు నేను నీతో ప్రయాణం చేస్తా అన్నావు ఇప్పుడు నేను వెళుతూరు ఇవ్వక పోయినా నువ్వు మాత్రం నీ ప్రయాణం ఆప్పకు" అంటూ అశ్విన్ తన కౌగిలిలో తీసుకొని తన వైపు వస్తున్న బుల్లెట్స్ నీ తను అశ్విన్ కీ కవచం గా మారి కాపాడింది దాంతో అశ్విన్ ఒక సారిగా భీకరం గా అరిచి తన పక్కన ఉన్న గన్ తో ఏటు వైపు కాలుస్తూన్నాడో తెలియకుండా కాల్చాడు అప్పుడు ఆ బుల్లెట్స్ తగిలి కింద పడిన వాళ్ల వైపు వెళ్లాడు అక్కడ పడి ఉన్న ఒక సైనికుడు శవాన్ని తట్టి చూశాడు అతని కాలి దెగ్గర ఒక బాంబ్, ఒక కత్తి దొరికింది అప్పుడు ఆ బాంబ్ నీ బాగా పరిక్ష గా గమనించిన అశ్విన్ తన వైపు వస్తున్న జీప్ యొక్క శబ్దం నీ అంచనా వేసి బాంబ్ దాని పైన వేశాడు ఆ తర్వాత తన మీదకు వచ్చిన సైనికులను తన చేతిలో ఉన్న కత్తితో పొడిచి, గొంతు కోసి చంపాడు ఇది అంతా చూసిన కెప్టెన్ ఖాన్ (ఇప్పుడు కల్నల్) భయం తో దాకున్నాడు కానీ వాడు భయం తో పెడుతున్న శ్వాస శబ్దం విని అతని దగ్గరికి వెళ్లి "నను ISA హెడ్ క్వార్టర్స్ కీ తీసుకొని వెళ్లు నిన్ను వదిలేస్తా" అని మాట ఇచ్చాడు దాంతో ఇండియా కీ వెళ్లడానికి ఏమైనా చేస్తాడు అనుకున్నాడు కానీ అక్కడ జరిగింది వేరు.

(ప్రస్తుతం)

ఆశ్వథ్థామా చేసిన దాని వల్ల ac లో ఉండే ఆ టీ ఆకులు ac లోని freon gas లో కరిగి వాటిలోని theanine అనే రసాయనం నీ వదిలింది దాంతో మొత్తం రూమ్ లోని అందరికీ తుమ్ము దగ్గు రావడం మొదలు అయ్యింది అప్పుడే రమణ సిద్ధు ఇద్దరు సెక్యూరిటీ అధికారి లతో కలిసి హోటల్ కీ వచ్చారు, ఆశ్వథ్థామా మాత్రం ముందే తన ముక్కు కీ ఒక క్లాత్ చుట్టుకొని ఉన్నాడు దాంతో ఆశ్వథ్థామా కొంచెం బాగానే ఉన్నాడు ఆ హడావిడి లో అందరూ బయటికి పరుగులు తీశారు కానీ ఆ టైమ్ లో ఆశ్వథ్థామా పాకిస్తాన్ మినిస్టర్ కూతురు "రుహి సలీమా" నీ వెనుక నుంచి chloroform ఇచ్చి ఫంక్షన్ హాల్ లో ఉన్న కిటికీ నుంచి ఒక కర్టెన్ ద్వారా కింద ఉన్న కార్ మీదకు వెళ్లకుండా దారిలో ఉన్న ఇంకో కిటికీ ద్వారా 3 వ అంతస్తు లోకి వెళ్లి లిఫ్ట్ ద్వారా కిందకు వెళ్లాడు, సెక్యూరిటీ అధికారి లు అంతా మినిస్టర్ సెక్యూరిటీ కోసం వెళ్లారు ఇక్కడ ఆశ్వథ్థామా మాత్రం తీరిక గా బయటికి వెళ్లి సంగీత నీ కార్ తీసుకొని రమ్మని సైగ చేశాడు ఆ తర్వాత సంగీత కార్ తీసుకొని వచ్చి "అమ్మాయి ఎక్కడ సార్" అని అడిగింది దానికి ఆశ్వథ్థామా నవ్వుతూ "ఇంట్లో దొంగలు పడ్డి పారిపోయారు కానీ వాళ్లు ఒక చోట దాకున్నారు ఎక్కడ దాకున్నారు" అని అడిగాడు దానికి సంగీత బాగా ఆలోచించి సమాధానం దొరకడం తో ఆశ్చర్యంగా ఆశ్వథ్థామా వైపు చూసింది అప్పుడు ఆశ్వథ్థామా భీకరం గా నవ్వుతూ బండి పోనివ్వు అని సైగ చేశాడు.

మినిస్టర్ ఉన్న రూమ్ లోకి వెళ్లారు రమణ, సిద్ధు మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లతో కలిసి అక్కడ మినిస్టర్ సేఫ్ గా టీ తాగుతూ ఉన్నాడు అప్పుడు అక్కడ వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు అప్పుడే పాకిస్తాన్ మినిస్టర్ "ఖలీల్ అహ్మద్" తన కూతురు నీ టీ తాగడానికి పిలుచుకొని రమ్మని చెప్పారు అలాగే డాక్టర్ నీ తీసుకొని వెళ్లి తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏమైనా జలుబు, దగ్గు ఎక్కువ అయ్యిందా అని తెలుసుకోవడానికి పంపాడు సిద్ధు మొత్తం ప్రోగ్రాం జరిగినప్పుడు రికార్డ్ అయిన వీడియో ఫూటెజ్ మొత్తం ఒకసారి చూశాడు కానీ అక్కడ ఏమీ రికార్డ్ అవ్వలేదు ప్రోగ్రాం జరుగుతున్న అంత సేపు అవి అని blur లో ఉన్నాయి ఎవరి మొహం స్పష్టంగా తెలియడం లేదు ఇలా వీలు cctv footage లో ఆశ్వథ్థామా కోసం వెతుకుతూ ఉంటే అక్కడ సంగీత నీ తీసుకొని రోడ్డు కీ అటు వైపు ఉన్న బిల్డింగ్ కీ వెళ్లాడు కార్ పార్కింగ్ లో పెట్టిన తరువాత డీక్కి లో ఉన్న బాక్స్ తీసుకొని రమ్మన్నాడు సంగీత వెళ్లి బాక్స్ తీసుకొని వచ్చింది అది తీసుకొని ఇద్దరు బిల్డింగ్ టాప్ ఫ్లోర్ కీ వెళ్లారు అప్పుడు ఆ బాక్స్ తెరిచి చూస్తే ఒక sniper gun ఉంది అది చూసి ఆశ్చర్య పోయిన సంగీత

సంగీత : ఏంటి సార్ ఇది

ఆశ్వథ్థామా : నువ్వు షూటింగ్ లో గోల్డ్ మెడల్ కదా

సంగీత : అయితే ఇప్పుడు ఏంటి

ఆశ్వథ్థామా : నువ్వు ఈ ప్రపంచంలోకి రాక ముందే నీ తండ్రి నీ స్వర్గం కీ పంపిన వాడి పైన నువ్వు పగ తీర్చుకునే అవకాశం ఇప్పుడు నీకు ఇస్తున్నా

సంగీత : ఏంటి సార్ మీరు చెప్పేది

ఆశ్వథ్థామా : నేను ఆ రోజు ప్రాణం తో బయట పడే సమయం లో మీ నాన్న చేతిలో ఉన్న పర్స్ నా చేతిలో పెట్టి నిన్ను మీ అమ్మ నీ జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు అందుకే నేను మీ అమ్మ నీ నా చెల్లిని చేసుకున్న నీకు చదువు చెప్పించా నీ కోసం ఇన్ని చేశాను ఇపుడు నీ తండ్రి త్యాగం కోసం నువ్వు పగ తీర్చుకునే అవకాశం నీకు ఇస్తున్న

అలా ఆశ్వథ్థామా చెప్తుంటే సంగీత కళ్లలో నీళ్లు రావడం మొదలు అయ్యాయి తన ఏడుపు విన్న ఆశ్వథ్థామా తన జుట్టు పట్టుకుని "హే ఎందుకు ఏడుస్తున్నావూ నీ తండ్రి నీ చూడలేక పోయాను అని బాధ పడుతున్నావా ఆ రోజు నీ తండ్రి చావు నీ కూడా చిరు నవ్వుతో స్వీకరించాడు నిన్ను చూడలేను అని తెలిసిన ఏదో రోజు తన త్యాగం కీ నువ్వు సమాధానం ఇస్తావు అని తనకు తెలుసు ఇప్పుడు నువ్వు కార్చిన కన్నీటి బొట్టు విలువ ఆ రోజు నీ తండ్రి కార్చిన రక్తపు బొట్టు తో సమానం అది ధైర్యం కీ నిదర్శనం నీది పిరికితనము " అని చెప్పాడు దానికి కోపం వచ్చిన సంగీత" నేను పిరికి దాని కాదు చెప్పండి ఎవడు వాడు " అని గన్ తీసుకొని గురి చూస్తూ ఉంది అప్పుడు కల్నల్ ఖాన్ కీ ఫోన్ చేసాడు" ఇప్పుడు ఎవడు అయితే బాల్కనీ లోకి వస్తాడో వాడే మీ నాన్న నీ చంపినవాడు " అని చెప్పాడు అప్పుడే ఖాన్ బయటికి వచ్చాడు వాడి గుండెల్లో ఒకటి, నుదుటి లో ఒకటి బుల్లెట్ దింపింది సంగీత ఆ తర్వాత నవ్వుతూ వెనకు తిరిగి చూసింది కానీ అక్కడ ఆశ్వథ్థామా లేడు.

అప్పటికే ఆశ్వథ్థామా లిఫ్ట్ లో కిందకు వెళ్లుతు రమణ కీ ఫోన్ చేసాడు" కల్నల్ ఖాన్ నీ చంపిన వ్యక్తి ఎదురు బిల్డింగ్ లో ఉంది వెళ్లి పట్టుకొండి" అని చెప్పాడు కాకపోతే అప్పుడే డాక్టర్ వచ్చి మినిస్టర్ కూతురు కనిపించడం లేదు అని చెప్పాడు దాంతో మినిస్టర్ షాక్ అయ్యాడు తనతో పాటు అందరూ షాక్ అయ్యారు అప్పటికి ఇంకా లైన్ లో ఉన్న ఆశ్వథ్థామా" ఇప్పుడు తన కూతురు important ఆ లేదా తనకు ఇప్పటి వరకు కాపలా కాసిన ఆ కుక్క important ఆ ఎవరి నీ ముందు వెతకమంటాడు చెప్పు చూద్దాం పోనీ నేను చెప్పన వాడి కూతురు నే వెతకండి అని చెప్తాడు" అని అన్నాడు అప్పుడు మినిస్టర్ "వాడు చస్తే ఏంటి ఉంటే ఏంటి ముందు నా కూతురు నీ వెతకండి" అని చెప్పాడు, అది విన్న ఆశ్వథ్థామా గట్టిగా నవ్వుతూ" అది మీ ప్రాణాలకు వాలు ఇచ్చే విలువ పాకిస్తాన్ మాత్రమే కాదు ఇండియా కూడా అంతే ఇక్కడ మీరు వాళ్లకు కాపలా కుక్కలు అంతే తప్ప ఏమీ కాదు వాడికి ఇన్ని రోజులు నమ్మకం గా సేవ చేసిన వాడి కంటే వాడి కూతురు important అయ్యింది పోనీ వాడు ఎక్కడో చచ్చాడు అనుకో పర్లేదు అనుకోవచ్చు కానీ వాడి కళ్ల ముందు చనిపోయిన వాడి కంటే వాడి కూతురు వాడికి important సరే ఇప్పుడు నేను నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాడికి ఇవ్వు ఏమైనా పాటించుకుంటాడు ఏమో చూద్దాం" అన్నాడు కానీ రమణ కీ అర్థం అయ్యింది అది జరగని పని అని అందుకే సైలెంట్ గా ఉన్నాడు.

అప్పుడు సిద్ధు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో వెతికే పనిలో ఉండగా రూమ్ సర్విస్ వాలు లాండరీ రూమ్ లోకి వెళ్లారు అప్పుడు సిద్ధు కీ ఫోన్ వచ్చింది" హలో సిద్ధు ఆ అమ్మాయి హోటల్ లోనే ఉంది నీ తెలివికి పదును పెట్టి కనుక్కో టేక్ యువర్ టైమ్ కానీ పాపం తనకే టైమ్ లేదు మహా అయితే 5 నిమిషాలు తరువాత ఊపిరి అందక చస్తుంది" అని ఫోన్ పెట్టేసాడు ఇక్కడే ఎక్కడ దాచి ఉంటాడు 5 నిమిషాల లో ఊపిరి అందకుండా చనిపోయే చోటు ఏది అయ్యింటుంది అని బుర్ర పట్టుకొని కూర్చున్నాడు అప్పుడు మళ్లీ ఫోన్ వచ్చింది" రేయి ఎక్కడ ఉంది ఆ అమ్మాయి చెప్పు ప్లీజ్ అని బ్రతిమాలాడు " అప్పుడు

" అది వదిలేసి ఆ కల్నల్ నీ చంపిన వ్యక్తి బయట 3 fl 333 నెంబర్ కార్ లో తప్పించుకొని పారిపోతున్నాడు వెళ్లి పట్టుకో" అని చెప్పాడు దాంతో చిరాకు లో సిద్ధు గట్టిగా అరిచాడూ అప్పుడు అతనికి ఆ కార్ నెంబర్ లో ఏదో క్లూ ఉంది అని అర్థం అయ్యి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు తట్టింది ఏంటి అంటే FL అంటే floor 3rd floor రూమ్ నెంబర్ 333 లో అమ్మాయి ఉంది అని వెంటనే ఆ రూమ్ లోకి వెళ్లాడు ఆ రూమ్ తలుపు తెరవగానే ఆ అమ్మాయి కిటికీ నుంచి కిందకు జారుతూ వెళ్లి సంగీత తెచ్చిన కార్ మీద పడింది అప్పుడు సంగీత ఆ అమ్మాయిని ఎత్తి కార్ లో వేసి తీసుకొని వెళ్లింది, సిద్ధు అసలు ఏమీ జరిగిందో అర్థం కాక చూశాడు అప్పుడు రూమ్ గడియకి ఆ అమ్మాయి కూర్చున్న కుర్చీ కీ కట్టి ఉండటం వల్ల సిద్ధు తలుపు తెరవగానే ఆ కుర్చీ నుంచి స్లిప్ అయ్యి వెళ్లి కింద కార్ మీద పడింది.

ఆశ్వథ్థామా ఆడిన ఆట కీ సిద్ధు బుర్ర పేలినంత పని అయ్యింది కోపం లో తన ముందు ఉన్న అద్దం నీ ఒక గుద్దు గుద్ది పగల గొట్టాడు అప్పుడే లోపలికి వచ్చిన రమణ తన కర్చీఫ్ తో తెగిన సిద్ధు చేతికి రక్తం కారకుండా ఒత్తి పెట్టాడు

రమణ : నీకు ఏమైనా పిచ్చి పట్టిందా వాడి మీద కోపంతో నిన్ను నువ్వు బలహీన పరచుకుంటున్నావు

సిద్ధు : మరి ఏమీ చేయాలి వాడు ఎప్పుడు మన కంటే ఒక అడుగు ముందు ఉంటున్నాడు మన ప్రతి అడుగు నీ క్షుణ్ణంగా లేక వేసి మరీ దెబ్బ కొడుతూన్నాడు

రమణ : కానీ ఇది ఇంకా అవ్వలేదు మనకు ఏదో ఒక దారి ఉంటుంది ప్రయత్నం చేద్దాం

సిద్ధు : ఏమీ మిగిలి ఉంది ఒకటి మాత్రం నిజం వాడికి కళ్లు లేవు కానీ మనల్ని మాత్రం గుడ్డి వాళ్ళని చేసి ఆడుకుంటున్నాడు

రమణ : వాడికి కళ్లు లేవు కానీ వాడికి ఎవరో ఒకరు తన చూపు వాడికి ఇస్తున్నట్లే కదా

సిద్ధు : అంటే ఏమీ చెప్పాలి అనుకుంటున్నావు

రమణ : వాడికి కళ్లు లా పని చేస్తున్న వ్యక్తి మన చుట్టూ పక్కలే ఉండొచ్చు కదా

సిద్ధు : అంటే నువ్వు చెప్పే దాని ప్రకారం వాడికి సహాయం చేసే మనిషి మనకు కూడా తెలిసిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు అంటావు

రమణ : కరెక్ట్ వాడు మనల్ని పిచ్చి వాళ్ళని చేసి ఆడిస్తూన్నాడు అంటే దానికి కారణం వాడి ప్రశాంతం అయిన బుద్ధి బలం అంతేకాకుండా కోల్పోవడానికి వాడి దగ్గర ఏమీ అదే మన దగ్గర

సిద్ధు : ఫ్యామిలీ ప్రాణం గా ఇష్టపడే ఉద్యోగం వీటి కోసం మనం ఏమైనా చేస్తాం కానీ వాడికి ఇవ్వని చేస్తే ఏమీ ఉపయోగం ఉంది

రమణ : వాడు ఇది అంత డబ్బు కోసం లేదా పవర్ కోసం చేయడం లేదు

సిద్ధు : మరి దేన్ని కోసం

రమణ : "ధనం పై ఆశ లేని వాడు, చావు పుట్టక కోసం పాకులాడని వాడు, బ్రతుకు పై తీపి లేని వాడు, దైవంకి చట్టం కీ భయపడని వాడు, ఎటువంటి అధికారం కోసం దిగజారని వాడు తనని తాను జయిస్తాడు ప్రపంచాని కైవసం చేసుకుంటాడు"

సిద్ధు : కొంచెం అర్థం అయ్యేలా చెప్పు

రమణ : simple గా చెప్పాలి అంటే వాడు ఈ ప్రపంచం మొత్తం తగులబడుతున్న ఆ నిప్పు కణం ముందు కూర్చుని వేడుక చూసే రకం వాడికి చావు అంటే భయం లేదు వాడు అనుకున్నది చేస్తాడు తప్ప మరో ధ్యాస ఉండదు

సిద్ధ : అంటే వాడు ఒక సైకో లాంటి వాడు

రమణ : అంతకంటే ఎక్కువ వాడిని మనం తొందరగా పెట్టుకోవాలి

ఇక్కడ ఆశ్వథ్థామా తన ఫోన్ నీ స్పీకర్ కీ కనెక్ట్ చేసి ఒక తమిళ్ సినిమా పాట వింటూ ఉన్నాడు "తని ఒరువన్ నిలుతు విటాల్ ఇంద ఉల్లగమే తలవిటు ఇలైయి" అనే ఆ పాట నీ కచ్చితంగా రోజు వింటూ ఉంటాడు ఆ కిడ్నాప్ చేసిన అమ్మాయి నీ లోపల కట్టేసిన వెంటనే సంగీత బయటికి వచ్చింది ఆశ్వథ్థామా దగ్గరికి వచ్చి

సంగీత : సార్ రోజు మీరు ఈ పాట ఎందుకు పదే పదే వింటూ ఉంటారు

ఆశ్వథ్థామా : చాలా మంచి ప్రశ్న ఈ పాట వింటుంటే ఇది నా కోసమే రాసినట్టు అనిపిస్తుంది

సంగీత : అంతలా ఆ పాట లో మిమ్మల్ని ఆకర్షించిన ఆ విషయం ఏంటి సార్

ఆశ్వథ్థామా : ఆ పాట లోని మొదటి రెండు లైన్ లు

సంగీత : మీ కంటే తమిళ్ వచ్చు సార్ నాకూ కొంచెం చెప్పండి

ఆశ్వథ్థామా : ఒకడు తన మెదస్సు నీ ఒక పని పై నిష్ఠగా తను అనుకున్నది చేయాలి అనుకుంటే ఈ ప్రపంచం మొత్తం తనకు ఎదురు నిలిచిన వాడిని ఎవ్వరూ అప్పలేరు

సంగీత : నిజమే సార్ ఆ పాట మీ కోసమే రాసినట్టు ఉంది మిమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు

ఆశ్వథ్థామా : నిజమే నను ఎవరూ అప్పలేరు కానీ ఒక చిన్న తీగ వదిలేశా ఆ తీగ ఎప్పుడైనా నా పీకకు చుట్టుకోవచ్చు

సంగీత : అయితే అది మీ దాకా వచ్చే లోపు తెంచి పారేయండి సార్

ఆశ్వథ్థామా : అంతే అంటావా అంటూ తన చేతిలో ఉన్న స్టిక్ పక్కకు పెట్టి దాని పక్కనే ఉన్న ఒక రాడ్ చేతిలోకి తీసుకున్నాడు

సంగీత : అంతే సార్ ఆలోచించే పని లేదు అని చెప్పింది

తన మాట పూర్తి కాక ముందే తన వెనుక ఉన్న సంగీత తల పైన రాడ్ తో కొట్టాడు, దాంతో సంగీత నెల పై పడింది నుదుటి నుంచి రక్తం కారుతుంది ఆ వెంటనే తను పడిన వేగం బట్టి ఆశ్వథ్థామా తన దగ్గరికి వెళ్లి "నను క్షమించు సంగీత నువ్వు నాకూ చాలా సహాయం చేశావు కానీ నేను వదిలిన తీగ నువ్వే సిద్ధు ఏ నిమిషంలో అయిన నువ్వు నా మనిషి అని తెలుసుకుంటాడు కాబట్టి నిన్న అన్నది నిన్నే అంతం, రేపు అన్నది ఎవరికి సొంతం, నేడు అన్నది ఉన్న ఊపిరి ఇప్పుడే ఇక్కడే అన్నది నిజం" అంటూ ఇంకో దెబ్బ వేయడానికి రాడ్ పైకి లేప్పాడు అప్పుడు సంగీత ఆశ్వథ్థామా కాలు పట్టుకొని లాగి లోపల ఉన్న అమ్మాయిని కూడా తప్పించాలి అని చూసింది కానీ ఆశ్వథ్థామా లేచిన చప్పుడు రావడంతో అక్కడి నుంచి పారిపోయింది.

ఇక్కడ సిద్ధు, రమణ ఇద్దరు ఆశ్వథ్థామా గురించి క్లూ కోసం స్టేషన్ కీ వెళుతు ఆలోచిస్తూన్నారు అప్పుడు మాటలో మాట గా విజయ తనకు సుమా కీ పెళ్లి చెయ్యాలి అనుకుంటున్న విషయం చెప్పాడు అప్పుడు సిద్ధు ఆలోచన లో పడ్డాడు అంటే అక్క సుమా తో తనకు పెళ్లి చెయ్యాలి అనుకుంటే సంగీత మధ్య లో ఎందుకు వచ్చింది పైగా ఆ రోజు ఫోటో లో వచ్చింది సుమా లేదా సంగీత అని ఆలోచిస్తూ ఉండగా రోడ్డు మీద జనం రోడ్డు పైన పడి ఉన్న సంగీత నీ చూస్తూ ఉన్నారు అప్పుడు సిద్ధు సంగీత నీ తీసుకొని హాస్పిటల్ కీ వెళ్లాడు దారిలో వెళుతున్నప్పుడు సంగీత "సిద్ధు నేను ఉంటానో లేదో నాకూ తెలియదు కాబట్టి ఆ పాకిస్తాన్ మినిస్టర్ కూతురు ఎక్కడ ఉందో చెప్తాను" అని అడ్రస్ చెప్పి సృహ కోల్పోయింది అప్పుడు సిద్ధు రమణ సంగీత ఇద్దరిని హాస్పిటల్ లో వదిలి తను చెప్పిన అడ్రస్ కీ వెళ్లాడు, అక్కడ సిద్ధు లోపలికి వెళ్ళాడు కానీ అక్కడ ఎవ్వరూ లేరు అప్పుడు ఎవరో అమ్మాయి గొంతు విన్న సిద్దు లోపలికి వెళ్ళాడు అక్కడ మినిస్టర్ కూతురు బదులు సుమా ఉంది తన దగ్గరికి వెళ్లుతుంటే తను రావద్దు అని తల అడ్డంగా ఊప్పింది దాంతో బయట ఉన్న ఆశ్వథ్థామా తన ఫోన్ తో కనెక్ట్ చేసిన బాంబ్ నీ పేల్ఛాడు.​
Next page: Update 06
Previous page: Update 04