Update 03

ఒకరోజు గౌతం సాయంత్రం 7:00 ఎప్పుడు ఇంటికి వచ్చేసరికి నందు సోఫాలో కూర్చుని ఏడుస్తూ టీవీ చూస్తూ ఉంటుంది.....

గౌతమ్ వెంటనే కంగారుగా వెళ్లి నందు పక్కన కూర్చుని తనని దగ్గరికి తీసుకొని ఏమైంది నందు ఎందుకు ఏడుస్తున్నావ్??? మా అమ్మ నాన్న మీ అమ్మ నాన్న బాగానే ఉన్నారా??? ఏం జరిగింది???" అని కంగారుగా అడుగుతాడు

నందు చేయి తిప్పి ఎటువైపో చూపిస్తుంది.....

గౌతమ్ అటు వైపు చూసి షాక్ అయిపోతాడు.....

గౌతమి ఎందుకు షాక్ అయ్యారు అంటే టివి సీరియల్ లో మన కార్తీక దీపం లోని వంటలక్క ఏడుస్తూ ఉంటుంది.....

అది చూసి గౌతమ్ అయోమయంగా "అందుకు ఏడుస్తున్నావా???" అని అడుగుతాడు

"అవును గౌతమ్ మన వంటఅక్క ఎలా ఏడుస్తుందో!!!! డాక్టర్ బాబు ఇప్పటివరకు వంటలక్క ని ఏడిపించాడు..... ఇప్పుడు ఆ డాక్టర్ పిల్ల ఏడిపిస్తుంది..... దాన్ని ఏం చేసినా పాపం లేదు....." అని ఏడుస్తూ ముక్కు చేతి గౌతం షర్ట్ కి రాస్తూ అంటుంది

గౌతమ్ వెంటనే కోపంగా పైకిలేచింది " ఛీ ఛీ ఏంటి ఇది???"అని తన షర్ట్ కర్చీఫ్ తో తుడుచుకొని నందు వైపు కోపంగా చూస్తూ "నీకు బోర్ కొడుతుందేమోనని టీవీ కొన్ని పెద్ద తప్పు చేశాను..... నువ్వు ఇలా సీరియల్స్ కి ఎడిక్ట్ అయి అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఇలా ఏడుస్తావు అనుకోలేదు.... ఇప్పుడే ఈ టీవీ పగలగొట్టేస్తాను.... అప్పటికి కాని నాకు ఈ తలనొప్పి తగ్గుతుంది...." అని కోపంగా చెప్పి టీవీ దగ్గరికి వెళుతూ ఉంటే

నందు వెంటనే కోపంగా పైకి లేచి "ఆ పని చేసావ్ అంటే నీకు ఫుడ్ బెడ్ రెండు కట్ చేస్తాను.... నేను సీరియల్స్ కూడా చూడకూడదా ఏంటి???? ఇలా నాకు రిష్ట్రిక్షన్స్ పెట్టకూడదు అని పెళ్లికి ముందే చెప్పాను కదా!!!! నాకు ఇలాంటివన్నీ నచ్చవు గౌతమ్...."అని అంటుంది

"మరి నేను వచ్చేసరికి నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేనేం అనుకోవాలి???? నువ్వు అలా ఏడుస్తూ ఉంటే ఇంకా ఏం జరిగిందో అని నేను ఎంత టెన్షన్ పడ్డాను??? ఒకపక్క ఆఫీసులో టెన్షన్స్ మరోపక్క ఇదంతా ఏంటి?????నాకు ఇంటికి రావాలంటే నా తల నొప్పి పుడుతుంది...." అని అసహనంగా అంటాడు

నందు వెంటనే ఏడుస్తూ "అంతేలే నేనంటే నీకు అప్పుడే ప్రేమ తగ్గిపోయింది.... పెళ్లయి కనీసం 2 నెలలు కూడా కావట్లేదు అప్పుడే ఇలా మాట్లాడుతున్నావు??? ఇప్పుడే ఇలా ఉంటే రేపు నువ్వు నన్ను కొట్టావు అని గ్యారెంటీ ఏంటి??? నాకు నీ మీద నమ్మకం లేదు ... నేను నా పుట్టింటికి వెళ్ళి పోతాను...." అని అంటుంది

గౌతమ్ షాక్ అయ్యి "ఇంత చిన్న మాటకి అంత పెద్ద డెసిషన్ ఎందుకు నందు??? సరేలే నీ ఇష్టం వచ్చింది చేసుకో!!!" అని కోపంగా అంటాడు

"అయితే నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా వంట చేస్తాను...." అని అంటుంది

గౌతమ్ ఇక ఏమీ చేయలేక సైలెంట్ గా లోపలికి వెళ్ళి పోయి మనసులో "ఏంటి ఇది జస్ట్ సీరియల్ కోసం ఏడుస్తుంది??? రియల్ లైఫ్ లో ఇలాంటివి జరిగితే తట్టుకుంటుందా???? ప్రపంచంలో రోజు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి.... ఈ టీవీ లో సీరియల్స్ చూస్తూ డైలీ ప్రపంచంలో జరిగే వాటిని పట్టించుకోవట్లేదు.... ఒక్కసారి అవి చూస్తే కనీసం లోకజ్ఞానం అయినా వస్తుంది కదా!!!! ఇలాంటివి చూసి మమ్మల్ని ఏడిపించడం కాకపోతే!!!!" అనుకుంటూ ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి నందు నవ్వుతూ వంట చేసి గౌతమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది

గౌతమ్ ముభావంగా వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే నందు గౌతమ్ అలా ముభావంగా ఉండటం నచ్చక బాధగా గౌతమ్ తో "ఇంకొకసారి నీతో ఇలా మాట్లాడడానికి గౌతమ్.... నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నేను ఇలా సీరియల్స్ చూస్తూ నీతో అలా బిహేవ్ చేయను ప్రామిస్..... నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చడం లేదు..... ప్లీజ్ గౌతమ్ మనం మునుపటిలా ఉందాము...." అని బాధగా అంటుంది

గౌతమ్ అనుమానంగా నందు వైపు చూస్తూ "నిజంగానే అంటున్నావా నందు??? ఇకనుంచి నేను వచ్చేసరికి సీరియల్స్ చూడకుండా ఉంటావా???" అని అడుగుతాడు

"ఆది మాత్రం చెప్పలేను గౌతమ్.... సీరియల్స్ చూస్తాను కానీ ఇలా నిన్ను మాత్రం ఇబ్బంది పెట్టను ప్రామిస్....." అని అంటుంది

"సరేలే ఏం చేస్తాం చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు నువ్వు చెప్పిందే నేను వినాలి కానీ నేను చెప్పింది నువ్వేమైనా వింటావా ఏంటి???? మమ్మల్ని మీ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నారు...." అని నిష్టూరంగా అంటాడు

నందు వెంటనే గౌతమ్ బుగ్గ మీద ముద్దు పెట్టి "నువ్విలా డల్ గా ఉంటే నాకు నచ్చడం లేదు గౌతమ్.... ఇప్పుడు నువ్వు హ్యాపీ గా అవ్వాలంటే నేను ఏం చేయాలి????" అని అడుగుతుంది

"నేను వచ్చేసరికి నువ్వు అందంగా రడీ అయ్యి నవ్వుతూ నన్ను పలకరించాలి.... అప్పుడే కదా మేము ఆఫీసులోని టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఇంటికి వచ్చాక సంతోషంగా మీతో టైం స్పెండ్ చేసేది...." అని అడుగుతాడు

నందు కొంచెం సేపు ఆలోచించి "సరే గౌతమ్ నువ్వు చెప్పినట్టే చేస్తాను.... ఇక సంతోషమా ముందు భోజనం చెయ్యి అన్నం చల్లారి పోతుంది....." అని నవ్వుతూ అంటుంది

గౌతమ్ సరే అని నందుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తన నోటి దగ్గర అన్నం కలిపి పెట్టగానే నందు కంగారుగా "నువ్వు తిను గౌతమ్ ఇప్పటికే చాలా అలసిపోయి వచ్చావు కదా!!!!" అని ప్రేమగా అంటుంది

"నువ్వు కూడా ఆ సీరియల్స్ లో పడి సరిగా తినటం లేదు నందు... ముందు అవి తగ్గించు చూడు ఎంత సన్నగా అయిపోతున్నావో!!! ఇలా అయితే నిన్ను నేను సరిగా చూసుకోవడం లేదని మీ అమ్మ నాన్న అనుకుంటారు... అది నీకు ఇష్టమా???" అని ప్రేమగా తనకి తినిపిస్తూనే అడుగుతాడు

నందు ఒకసారి తనని తాను చూసుకుని అది నిజమే అనిపించి "సరే గౌతమ్ చెప్పాను కదా సీరియల్ పూర్తిగా మానేయను కానీ అవి చూడటం తగ్గించి టైం టూ టైం భోజనం చేస్తాను.... నావల్ల నీకు ఎప్పుడు చెడ్డపేరు రానివ్వను ప్రామిస్.... ఇప్పుడైనా నీ అలకమాని భోజనం చెయ్యి...." అని ఇప్పటికీ మూతి ముడిచి ఉన్న గౌతమ్ ని చూస్తూ అంటుంది

"ముందు నువ్వు' అంటూ నందుకు తినిపిస్తూ తను తిని హ్యాపీగా నైట్ ఈ చేసుకొని ఉదయానికి ఎప్పుడో పడుకుంటారు...‌‌.

అలా నందు తనకి కావాలి అనుకున్నది గౌతమ్ చేత కొనిపించుకోవటానికి ఒకసారి గౌతమ్ తో గొడవ పడుతూ ఒకసారి గౌతమ్ కోరికలు తీరుస్తూ తన కోరిక కూడా తీర్చుకుంటూ చిన్న చిన్న చిలిపి తగాదాలు గిల్లికజ్జా లతో తమ లైఫ్ ని హ్యాపీగా ఉంచుకుంటారు....

అలా చూస్తూ ఉండగానే మరో నాలుగునెలలు గడిచిపోతాయి.... కానీ డైలీ నందు మాత్రం తన అమ్మానాన్నలతో చెల్లెళ్లతో గౌతమ్ అమ్మానాన్నలతో మాట్లాడుతూ ఉంటుంది....

గౌతమ్ మాత్రం ఆఫీస్ పనుల్లో ఉండి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు....

అలాంటి టైమ్లోనే అపార్ట్మెంట్లోని పక్క ఫ్లాట్ ఆంటీ షాపింగ్ కి వెళుతూ నందుని కూడా తీసుకు వెళ్తుంది..... నందు కూడా సరే అని వెళ్లి అక్కడ పది వేల రూపాయల సారీ నచ్చి పట్టుబట్టి గౌతమ్ చేత కొనుక్కుంటుంది.....

ఇది జరిగింది....

ఇప్పుడు మనం ప్రెసెంట్ లోకి వచ్చేద్దాం....

ఉదయాన్నే లేచిన గౌతమ్ తన కౌగిలిలో నే పడుకొని ఉన్న నందుని చూసి "పడుకున్నప్పుడు ఎంత అమాయకంగా కనిపిస్తావు నందు!!!! కానీ నిద్ర లేచినప్పుడు అంత గయ్యాళి గా మారిపోతావు.... కానీ నాకు ఈ నందు కూడా నచ్చింది....." అని నవ్వుకుంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి నందు అని తన భుజం తడుతూ లేపటానికి చూస్తాడు

"ఇంకొంచెం సేపు నిద్ర పోనివ్వడి గౌతమ్.... రాత్రంతా మీరు నన్ను వదిలారా???? అసలు నిద్ర పోనివ్వకుండా మళ్ళీ వెంటనే లేపుతున్నారు....నాకు చాలా అలసటగా ఉంది..... ప్లీజ్ గౌతమ్ కొంచెం సేపు పడుకో నివ్వండి...." అని పక్కకి వొత్తి గిల్లి మళ్ళీ పడుకుంటుంది

గౌతమి నవ్వుతూ "సరే అయితే నువ్వు నిద్రపో నేను ఫ్రెష్ అయి బయటకు ఏదో ఒకటి తినేసి ఆఫీస్ కి వెళ్ళి పోతాను...." అని చెప్పి నందు బుగ్గ మీద ముద్దు పెట్టి తనని పక్కన పడుకోపెడుతూ పైకి లేస్తూ ఉంటే నందు వెంటనే కళ్ళు తెరిచి గౌతమ్ వైపు చూస్తూ "టైం ఎంత అవుతుంది గౌతమ్???" అని ఆశ్చర్యంగా అడుగుతుంది

"ఆల్రెడీ 7 అయ్యింది ఇంకో వన్ అండ్ ఆఫ్ అవర్ లో నేను బయలుదేరాలి.... ఈ ట్రాఫిక్ లో ఆఫీస్కి వెళ్ళే సరికి 9:30 అవుతుంది అని నీకు తెలుసు కదా!!!"అని నవ్వుతూ అంటాడు

నందు వెంటనే పైకి లేచి జారిపోతున్న చీర సరి చేసుకుని జుట్టు ముడి వేసుకుంటూ "ఇంతసేపు పడుకున్నానా??? అయ్యో మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి రండి గౌతమ్ మీకు కాఫీ ఇచ్చి టిఫిన్ చేసి క్యారేజ్ ప్రిపేర్ చేస్తాను...." అని హడావిడిగా పైకి లేచి గౌతమ్ కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కిచెన్ లోకి వెళ్లి పోతుంది

గౌతమ్ నవ్వుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్లి బయటికి వచ్చేసరికి నందు కాఫీ కప్పుతో నవ్వుతూ గౌతమ్ ఎదురుగా నిలబడి ఉంటుంది....

గౌతమ్ నవ్వుతూ కాఫీ తీసుకుని "నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి రా.... లేకపోతే లేచిన తర్వాత ఉదయాన్నే చాలా అనీజీ గా ఉంటుంది....." అని అంటాడు

నందు భర్త ఏది చెప్తే అది వినే భార్యలా తల ఊపి ఫ్రెష్ అయ్యి రావడానికి వెళ్ళిపోతుంది....

"నిన్న దీనికి ఇష్టమైన చీర కొనే సరికి ఈ రోజంతా కూడా నేను ఏది చెప్తే అదే చేస్తుంది.... ఇది ఎప్పుడూ జరిగేదే కదా!!!"అని అనుకుంటా నవ్వుకుంటూ కాఫీ తాగి టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు

నందు ఫ్రెష్ అయి బయటకు వచ్చి "హాఫ్ n అవర్ గౌతమ్ టిఫిన్ చేస్తాను..."అని హడావిడిగా కిచెన్ లోకి వెళ్తుంది

గౌతమ్ కూడా నందు వెనకాలే వెళ్లి "నేను నీకు హెల్ప్ చేస్తాను.... వంట కూడా చేయాలి కదా!!!! అసలే నువ్వు తెల్లగా ఉంటావు ఇంత పని చేస్తే నీ చేతులు ఎర్రగా కందిపోయి నొప్పి పుడతాయి..." అని చెప్పి గౌతమ్ నందు తో మాట్లాడుతూనే కూరగాయలు కట్ చేసి ఇస్తాడు.....

నందు అవి తీసుకొని టిఫిన్ ప్రిపేర్ చేస్తూనే కర్రీ కూడా ప్రిపేర్ చేస్తూ గౌతమ్ ని చూసి మురిసిపోతూ "నీలాంటి హస్బెండ్ ఎవరికీ దొరకరు గౌతమ్.... ఎంత హెవీ వర్క్ ఉన్న నా మీద చిన్న చిరాకు కూడా చూపించవు.... పెళ్లి అయినప్పటినుంచి ఇంతవరకు నాకు ఇలా హెల్ప్ చేస్తూనే ఉన్నావు..... నువ్వు నా భర్తగా దొరకడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం....." అని గౌతమ్ ని ఆకాశానికి ఎత్తేస్తుంది

గౌతమ్ నందు మాటలకి భయపడుతూనే "ఇప్పుడు నీకు ఏం కావాలి నందు??? నన్ను ఇలా ఐస్ చేస్తున్నావు???" అని అడుగుతాడు

నందు వెంటనే అలక గా మొహం పెట్టి "నేను మిమ్మల్ని అంతలా సతాయిస్తున్నానా??? జస్ట్ చిన్న చిన్నవి కొనిపించమని అడుగుతున్నాను..... అందుకే కదా మీ దృష్టిలో నేను లోకువ అయ్యాను..... మీకు నేనంటే లెక్కేలేదు ప్రతిసారి ఇలాగే మాట్లాడుతారు...." అని అంటుంది

గౌతమ్ నవ్వుతూ నందుని వెనక నుంచి హగ్ చేసుకొని "నువ్వు ఇలా అలిగితే చాలా అందంగా ఉంటావు నందు.... నువ్వు అలిగినప్పుడు నీ ముక్కు కోపంతో ఎర్రగా ఉంటుంది చూడు అప్పుడు అది అచ్చం చిలకముక్కు లానే ఉంటుంది...."అని నందు మొహం తనవైపు తిప్పుకొని తన పెదవులు అందుకుని ఐదు నిమిషాలు ముద్దు పెట్టి తన ముక్కు మీద కూడా ముద్దు పెట్టి వదిలేసి నవ్వుతూ నందు వైపు చుస్తాడు

నందు చిరుకోపంగా గౌతమ్ వైపు చూస్తూ "ఇప్పుడేంటి ఈ అల్లరి గౌతమ్..... ఇప్పటికే చాలా లేట్ అయింది ఇక మీరు వెళ్లి స్నానం చేయండి నేను రైస్ వండి క్యారేజ్ రెడీ చేసి పెడతాను...." అని అంటుంది

గౌతమ్ గారంగా "నువ్వు కూడా నాతో పాటు స్నానానికి రావచ్చు కదా నందు ఇద్దరం కలిసి స్నానం చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా???' అని తన మెడమీద ముద్దులు పెడుతూ అడుగుతాడు

"ప్చ్ మీ అల్లరి ఉదయాన్నే మొదలు పెట్టకండి గౌతమ్ ప్లీజ్ నాకు చాలా పని ఉంది...." అని అంటూనే బియ్యం కడిగి రైస్ కుక్కర్ లో పెట్టేస్తుంది

"ఏమి కాదు నందు ఆల్రెడీ అన్నీ అయిపోయాయి కదా నాతో మాట్లాడుతూనే చేసేసావు కదా!!!! ఇంకేం పని ఉంది కర్రీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది.... నువ్వు వస్తేనే నేను స్నానానికి వెళతాను లేకపోతే ఇలాగే ఉంటాను.... నువ్వు ఇలా చేస్తూనే ఉంటే నాకు లేటవుతుంది చూసుకో మరి...." అని అంటాడు

"మీరు స్నానానికి వెళ్ళకుండా లేట్ చేస్తూ పైగా నన్ను అంటున్నారా నా వల్ల లేట్ అవుతుందని???" అని చిరు కోపంగా గౌతమ్ వైపు చూస్తూ నడుము మీద చేతులు పెట్టుకుని అడుగుతుంది

"అది నిజమే కదా నీ వల్లే నాకు లేట్ అవుతుంది.... నువ్వు నేను అడిగినప్పుడు నాతోపాటు వస్తే నాకు లేట్ అవుతుందా చెప్పు??? అందుకే రా ఇద్దరం కలిసి స్నానానికి వెళ్దాం...." అని గారంగా తన కొంగు పట్టుకొని లాగుతూ కొంటె కృష్ణుడిలా అడుగుతాడు

నందు నవ్వుతూ తన వైపు చూస్తూ "ఏంటి కృష్ణయ్య వేషాలు వేస్తున్నారు???? మనకి ఇప్పుడు వీటికే తక్కువ అయింది..... మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి గౌతమ్" అని గౌతమ్ వెనక నుంచి తోస్తూ ఉంటుంది.

గౌతమ్ వెంటనే నందు చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కొని తన రెండు చేతుల మధ్య లో లాక్ చేసి "నువ్వు ఇలా చెప్తే ఎందుకు వింటావు నందు??? నా స్టైల్ లోనే చెప్పాలి..." అని అంటూ నందునీ ఎత్తుకొని గ్యాస్ ఆఫ్ చేసి నందుని డైరెక్టుగా వాష్ రూం లోకి తీసుకెళ్లి షవర్ ఆన్ చేసి షవర్ కింద నిల్చోబెట్టి తనని కదలకుండా కౌగిలించుకుని నవ్వుతూ నందు వైపు చూస్తూ ఉంటాడు

నందు చిరుకోపం గౌతమ్ వైపు చూస్తూ "మిమ్మల్ని" అని తన భుజం మీద కొట్టి వెంటనే గౌతమ్ గుండెల మీద వాలిపోయి "ఏంటి గౌతమ్ మీరు రానురాను చిన్నపిల్లాడిలా తయారవుతున్నారు.... చూడండి నేను ఎలా తడిసిపోయానో!!! నేను బయటికి వెళ్తాను మీరు త్వరగా స్నానం చేసి రండి...." అని అంటుంది

"చెప్పాను కదా నువ్వు ఉంటేనే నేను స్నానం చేస్తాను అని..." అంటూ తనని గట్టిగా కౌగిలించుకొని మెడ మీద ముద్దులు పెడుతూ చీరని నందు నుంచి వేరు చేస్తూ ఉంటాడు

నందు గౌతమ్ చేసే పనులకి మనసు వశం తప్పుతుంటే "ప్లీజ్ గౌతమ్ నన్ను వదిలేయండి ఇప్పటికే మీకు చాలా లేట్ అయింది..." అని అడుగుతూ ఉంటుంది

"ఇప్పుడు నిన్ను వదిలే ప్రసక్తే లేదు.... ఈ గౌతమ్ గాడి మనసు ఇప్పుడు నిన్ను కోరుకుంటుంది....." అని చెప్పి నందు నుంచి తన బట్టలు వేరుచేసి గౌతమ్ కూడా వివస్త్రగా మారిపోయి నందుని తన చేతులతో పెదవులతో తడిమేస్తూ పూర్తిగా తడిసిపోయిన నందు అందాలని‌ చూస్తూ చివరికి తనని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి పూర్తిగా ఆక్రమించుకొని తనలో కలిపేసుకుంటాడు

నందు కూడా సంతోషంగా గౌతమ్ కలిసిపోతుంది....

అలా ఒక అరగంటకి ఇద్దరూ విడువడి ముందు గౌతమ్ వెళ్లి ఫ్రెష్ అయి వస్తే తర్వాత నందు వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి "చూడండి మీ వల్ల ఎంత లేట్ అయిందో మళ్ళీ మీకు లేట్ అవుతుంది అని నన్ను అంటారు...."అని అంటుంది

గౌతమ్ తన వాచ్ లో టైం చూసి 8:30 చూపిస్తుంటే "నిజంగానే చాలా లేట్ అయింది నందు త్వరగా టిఫిన్ పెట్టు నేను వెంటనే బయలుదేరాలి...." అని అంటాడు

"ఇదంతా చేసేటప్పుడు గుర్తుకు రాలేదా మీ ఆఫీస్ కి లేట్ అవుతుందని పదండి పెడతాను..." అని చిరు కోపంగా చెప్పి గౌతమ్ కి టిఫిన్ పెట్టి నవ్వుతూ గౌతమ్ వెళ్లేంత వరకు గుమ్మం దగ్గరే ఉండి గౌతమ్ వెళ్ళగానే లోపలికి వచ్చి గౌతమ్ చేసిన అల్లరి ని గుర్తు చేసుకుని నవ్వుకుంటూ టిఫిన్ చేసి టీవీ చూస్తూ ఉంటుంది.....

గౌతమ్ ఉదయాన్నే నందు ఇచ్చిన ఎనర్జీతో హుషారుగా ఆఫీస్ లోకి వెళ్లి తన వర్క్ చేసుకుంటూ ఉండగానే మేనేజర్ గౌతమ్ ని పిలిచి "ఏంటిది గౌతమ్ నీకు ఇచ్చిన వర్క్ ని ఇలా డిలే చేస్తావా??? నీ వల్ల మన కంపేనీకి ఎంత రిమార్క్ వస్తుందో తెలుసా???? నీకు వర్క్ చేయటం రాకపోతే ఇంట్లో కూర్చుని ఉండాలి అంతే కానీ వేలకి వేలు జీతాలు తీసుకుంటూ ఇలా వర్క్ చేయకుండా ఉంటే క్లైంట్స్ కి ఏం సమాధానం చెప్పాలి??? ఇప్పుడు నీకు ఇచ్చిన ప్రాజెక్టు డేడ్ లైన్ కూడా ఈ పాటికి అయిపోవాలి కానీ నువ్వు మాత్రం ప్రాజెక్ట్స్ సడ్మిట్ చేయలేదు..... ఇప్పుడు నీకేమీ కాదు కానీ నేను కదా పై ఆధారిటీ కి సమాధానం చెప్పాలి..... ఇప్పుడు నువ్వు చెప్పు అసలు ఇలా వర్క్ చేయకుండా ఎందుకు ఉన్నావు???? ఇప్పటివరకు నేను నుంచి ఈ నెగ్లిజెన్సీ నేను ఎప్పుడూ చూడలేదు.... ఈ రోజు ఈ ప్రాజెక్టు ఇచ్చేయాలి కదా మరి అది ఇంకా పూర్తి కాలేదు నువ్వు ఏం చేస్తున్నావు???? నీ టీమ్ మెంబర్స్ ఏం చేస్తున్నారు????" అని గౌతమ్ ఎడాపెడా వాయించేస్తాడు

గౌతమ్ బాధగా మనసులో "అసలు అలా ఎలా మర్చిపోయాను??? జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ఒకరి రిమార్క్ లేదు కానీ మొదటి సారి ఇలా జరిగింది...." అని అనుకుంటూ మొన్న వర్క్ చేద్దామని లాప్టాప్ తీసినప్పుడు నందు చేసిన అల్లరి గుర్తుకువచ్చి "నందు చేసిన పని వల్ల అనవసరంగా వర్క్ ఆగిపోయింది.... అదే ఆ రోజు తను నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండి ఉంటే ఈరోజు ఇలా మేనేజర్ చేత తిట్లు తినే వాడిని కాదు...." అనుకుంటూ గిల్టీగా తలదించుకుని "సారీ సార్ ఒక వన్ అవర్ టైం ఇస్తే వర్క్ కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ డైరెక్ట్ గా క్లైంట్స్ కి సబ్మిట్ చేస్తాను...." అని చెప్పి బయటికి వచ్చి కోపంగా ఎవరితో మాట్లాడకుండా తన పని చేసుకుంటూ ఉంటాడు

అలా గౌతమ్ చెప్పినట్టుగానే వన్ అవర్ లో వర్క్ కంప్లీట్ చేసేసి క్లైంట్స్ కి సబ్మిట్ చేస్తాడు..... కానీ మేనేజర్ అన్న మాటల్ని ఈజీగా తీసుకోలేక కోపంగా ఎవరితో మాట్లాడకుండా లంచ్ కూడా చేయకుండా అంతే సిస్టం ముందు కూర్చుని మిగిలిన వర్క్ అంతా చేసుకుంటూ ఉంటాడు.....

నందు ఉదయం నుంచి కంటిన్యూస్గా గౌతమ్ కి ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకుండా అంతే ఉంటాడు.....

సాయంత్రం నందు అందం గా రెడీ అయ్యి గౌతమ్ కి ఏదో చెప్పాలని ఆతృతగా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.....

గౌతమ్ కోపంగా ఇంటికి వచ్చి కనీసం నందు వైపు చూడకుండానే ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకువెళ్లి బెడ్ మీద విసిరేసి టవల్ తీసుకొని బాత్ రూం లోకి వెళ్ళి పోతాడు....

నందు అయోమయంగా గౌతమ్ వైపు చూస్తూ "ఎప్పుడు నేను నవ్వుతూ ఎదురు రావాలని కోరుకునే గౌతమ్ ఈరోజు ఏంటి తనకోసం నేను గుమ్మంలోనే వెయిట్ చేస్తున్నా కనీసం చూడకుండా వెళ్ళిపోయాడు???? పైగా అంత కోపంగా ఉన్నాడు ఏమైంది???" అని అనుకుంటుంది

గౌతమ్ ఫ్రెష్ అయి నందు తో మాట్లాడాలి అనిపించక సైలెంట్ గా బెడ్ మీద వెల్లకిలా పడుకొని కళ్ళ మీద చేతులు పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు.....

నందు నవ్వుతూ గౌతమ్ పక్కనే పడుకుని తన మీద చేయి వేసి "గౌతమ్" అని ప్రేమగా పిలుస్తుంది

గౌతమ్ వెంటనే నందు చెయ్యి పక్కకి తోసి పైకి లేచి "ఇప్పుడు ఏం కావాలి నందు ఎందుకు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావ్???? నువ్వు ప్రేమగా మాట్లాడిన ప్రతిసారీ ఏదో ఒక దాని కోసమే కదా ఇలా చేస్తూ ఉంటావు???? పెళ్లయినప్పటి నుంచి ఎన్ని సార్లు చూడలేదు!!!! ఎందుకు ఇలా ఉన్నావు నందు??? నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది..... నేను నిన్ను ఏమి అడిగాను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు నాకు నవ్వుతూ కనపడు అన్నాను కాని నువ్వు ఆ టీవీ సీరియల్స్ చూస్తూ నన్ను అసలు పట్టించుకున్నావా??? కొంచమైనా నాతో మాట్లాడుతావా???? ఎప్పుడు ఏదైనా అవసరమైతే తప్ప ఇలా ప్రేమగా దగ్గరికి రావు..... ఎందుకు నన్ను ఇలా తింటున్నావు నందు??? నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది..... నిన్ను నా జీవితంలోకి తీసుకు రావటమే నేను చేసిన పెద్ద తప్పు అని నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది.... ప్లీజ్ కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదిలేసి బయటికి వెళ్ళు....." అని ఫ్రస్టేషన్ లో కోపంగా అరుస్తాడు

నందు గౌతమ్ మాటలన్నీ విని "గౌతమ్ నీకసలు అర్థమవుతుందా నువ్వు ఏం మాట్లాడుతున్నావో???? ఈరోజు ఏమైంది నీకు ఇలా బిహేవ్ చేస్తున్నావు????" అని కోపంగా అడుగుతుంది

గౌతమ్ కోపంగా నందు వైపు చూస్తూ "నందు నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళక పోతే నాకు వచ్చే కోపానికి నిన్ను కొడతాను ఏమో అనిపిస్తుంది..... ప్లీజ్ నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలెయ్..... అది కూడా నీకు ఇష్టం లేకపోతే చెప్పు నేనే బయటికి వెళ్లిపోతాను నువ్వు ప్రశాంతంగా ఇంట్లోనే ఉండు...." అని చెప్పి పైకి లేచి బైక్ కీస్ తీసుకొని రోడ్డుమీద పడిపోతాడు

నందు గౌతమ్ వెళ్ళాక తను అన్న మాటలని మళ్లీ నెమరు వేసుకొని ఏడుస్తూ "నేనంటే అంత ప్రేమ లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు గౌతమ్??? ఇలా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది???? ఎందుకు ఇలా చేశావు గౌతమ్??? నీతో ఒక విషయం సంతోషంగా షేర్ చేసుకోవాలి అని ఎదురు చూస్తుంటే నా సంతోషాన్ని అంతా ఆవిరి చేసావు.... ఐ హేట్ యు ఐ హేట్ యు గౌతమ్ ఫస్ట్ టైం నువ్వు నాకు నచ్చడం లేదు...." అని ఏడుస్తూ అంతే నిద్రపోతుంది

గౌతమ్ అలా సిటీ అంతా తిరుగుతూ నైట్ తొమ్మిదింటి వరకు బయటే ఉండి 9 ఇంటికి వచ్చి నందు ఎక్కడా కనిపించక పోయేసరికి రూమ్ లోకి వెళతాడు..... రూమ్ లో నందు ఒక సైడ్ కి తిరిగి పడుకొని గౌతమ్ అయోమయంగా " నందు ఈ టైం లో పడుకుంది ఏంటి???" అనుకుంటూ తన దగ్గరికి వెళ్లి తన మొహం చూసేసరికి బాగా ఏడవటం వలన తన కళ్ళు, మొహం మొత్తం ఉబ్బి పోయి కనిపిస్తుంది.....

గౌతమ్ నందు ని అలా చూసి బాధగా అనిపించి వెంటనే నందు దగ్గరికి వెళ్లి "ఐ యాం సారీ నందు ఏదో ఆఫీస్ లో మేనేజర్ నన్ను అలా అనటం వలన ఆ ఫ్రస్టేషన్లో నీమీద తెలియకుండానే అరిచేశాను...." అనుకుంటూ తన కడుపు లోపలికి పోయి ఉండటం చూసి "నందు ఇంకా భోజనం చేయలేదా????" అనుకుంటూ నందు అని తన భుజం మీద తడుతూ లేపుతాడు

నందు పైకి లేచి గౌతమ్ వైపు చూడకుండానే సైలెంట్గా బయటికి వెళ్ళి పోతూ ఉంటుంది.....

గౌతమ్ నందు కి కోపం వచ్చింది అని అర్థమై వెంటనే తన చెయ్యి పట్టుకుని "ఐయామ్ సారీ నందు ఏదో ఫ్రస్టేషన్లో నీ మీద అరిచేశాను..... రియల్లీ సారీ నువ్వు ఇంత బాధ పడతావు అనుకోలేదు....." అని బాధగా అంటాడు

నందు గౌతమ్ తన చేయి పట్టుకున్న కనీసం తన వైపు కూడా తిరగకుండానే తన చేయి విడిపించుకుని వెంటనే బయటికి వెళ్లి పోయి డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్లి కిచెన్ లో ఉన్న డిషెష్ అన్ని తెచ్చి పెడుతూ ఉంటుంది.....

గౌతమ్ అసహనంగా నందు వెనకే వెళ్లి "ఏమైంది నందు ఎందుకు నాతో మాట్లాడటం లేదు????" అని అడుగుతాడు

నందు అయినా మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటే గౌతమ్ కోపంగా నందుని తన దగ్గరికి లాక్కుని తన కౌగిలిలో బిగించి "ఎందుకు నందు నాతో మాట్లాడటం లేదు?? అసలు నా వైపు కూడా చూడటం లేదు ఏమైంది???" అని అడుగుతుంటే

నందు గౌతమ్ తో మాట్లాడకుండా తన కౌగిలి నుంచి విడిపించుకోవడానికి గింజుకుంటూ కనీసం గౌతమ్ వైపు కూడా చూడదు.....

నందు అలా చేస్తుంటే గౌతమ్ కి కోపం వచ్చి తన బుగ్గలు గట్టిగా పట్టుకుని పైకి లేపి "నా వైపు చూడు నందు.... ఎందుకు నాతో మాట్లాడటం లేదు ముందు అది చెప్పు????" అని కోపంగా అడుగుతాడు

నందు అయినా కళ్ళు కిందకి దించి గౌతమ్ వైపు చూడకుండా "నేనంటే నీకు ఇష్టం లేదు కదా గౌతమ్!!! నీతో మాట్లాడితే నీకు నచ్చుతుందో?? లేదో??? అని నేనే మాట్లాడటం లేదు.... ముందు భోజనం చెయ్యి.… " అని చెప్పి బలవంతంగా గౌతమ్ కౌగిలి నుంచి విడిపించుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం పెట్టుకుంటూ ఉంటే గౌతమ్ కోపంగా నందు వైపు చూస్తూ ఉంటాడు

నందు అది గమనించి "నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడకుండా భోజనం చేయకపోతే నేను భోజనం చేయకుండా ఇక్కడనుంచి వెళ్ళిపోతాను గౌతమ్.... అది నీకు ఇష్టమైతే చెప్పు ఇప్పుడే వెళ్ళిపోతాను...." అని కోపంగా అంటుంది

గౌతమ్ వెంటనే కోపంగా వచ్చి చైర్ లో కూర్చోగానే నందు తనకి కూడా వడ్డించి ఏడుపు వస్తుంటే కష్టంగా ఆపుకుంటూ ఒక్కో ముద్ద మింగుతూ ఉంటుంది.....

గౌతమ్ తింటూ నందు వైపు చూస్తూనే నందు అలా కష్టంగా తినటం చూసి తన మాటల వల్ల ఎంత హర్ట్ అయ్యిందో అర్ధమవుతూ ఉంటే బాధగా తినాలని అనిపించక వెంటనే తింటున్న ప్లేట్ లోనే చేయి కడిగేసుకుని నందు దగ్గరికి వెళ్ళటానికి పైకి లేస్తాడు.....

నందు అది గమనించి వెంటనే తను కూడా చేయి కడుక్కొని గౌతమ్ కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా గబగబా మరొక బెడ్ రూం లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని బెడ్ మీద పడిపోయి తన కడుపు మీద చేయ్యి పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది....

గౌతమ్ నందు అలా వెళ్ళిపోవడం చూసి అది వాళ్ల రూమ్ లోకి కాకుండా వేరే బెడ్ రూమ్ లోకి వెళ్లడం చూసి తన వెనకే వెళ్ళి డోర్ కొడుతూ "నందు ఓపెన్ ద డోర్ ప్లీజ్ మనం కూర్చుని మాట్లాడుకుందాం..... నేను నీతో అలా మాట్లాడి ఉండకూడదు.... ఐ యాం రియల్లీ సారీ రా ప్లీజ్ నందు డోర్ ఓపెన్ చెయ్యి...." అని కంటిన్యూస్గా డోర్ కొడుతూ ఉంటాడు

నందు కష్టంగా ఏడుపు ఆపుకుంటూ "ప్లీజ్ గౌతమ్ నన్ను ఈ నైట్ కి ఒంటరిగా వదిలెయ్..... నేను ఒంటరి గా ఉండాలి అనుకుంటున్నాను ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో....." అని కష్టంగా ఏడుపు ఆపుకుంటూ బొంగురుపోయిన గొంతుతో అంటుంది

గౌతమ్ అది విని "నందు ప్లీజ్ రా నేను చెప్పేది విను..... నువ్వు నా పక్కన లేకపోతే నాకు ఏమీ తోచదు.... ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్....." అని అంటూ ఉండగానే

"ప్లీజ్ గౌతమ్ ఇప్పుడు నువ్వు నీ రూమ్ లోకి వెళ్లి పడుకో నన్ను డిస్టర్బ్ చేయకు...." అని చాలా బాధగా అడుగుతుంది

గౌతమ్ కూడా ఇక నందుని కదిలించలేక "ఐ యాం రియల్లీ సారీ నందు నేను అలా మాట్లాడి ఉండకూడదు..... ప్రశాంతంగా నిద్రపో...ఏది ఆలోచించకు.... నేను ఏమీ కావాలని అనలేదు జస్ట్ కోపం లో అనేసాను..... అవన్నీ పట్టించుకోని నువ్వు ఇలాగే ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేను.... నేను బయట సోఫాలో పడుకున్నాను.....మనం రేపు ఉదయం మాట్లాడుకుందాం‌...‌. గుడ్ నైట్..." అని చెప్పి బయట హాల్లో ఉన్న సోఫాలో పడుకుని నందు ఉన్న రూమ్ వైపు చూస్తూ నందు ఎప్పుడు డోర్ తీస్తుందా??? అని ఎదురు చూస్తూ ఉంటాడు

నందు ఏడుస్తూ "నువ్వు అన్నప్పుడు గుర్తుకు రాలేదా గౌతమ్ ఈ మాటలన్నీ??? ఎలా అన్న నువ్వు అన్న మాటలు నా మనసుకి గుచ్చుకున్నాయి.....ఇప్పుడు ఆ మాటలన్ని నీ మనసులో నుంచి రాలేదు అంటే నేను ఒప్పుకోలేను..... నేను నిన్ను అంత ఈజీగా క్షమించలేను గౌతమ్..... నీ నుంచి అలాంటి మాటలు నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు....." అనుకుంటూ నిద్రపోతుంది

ఉదయాన్నే లేచిన నందు డోర్ తీసి బయటకు వచ్చేసరికి నందు రూమ్ వైపే చూస్తూ ఎప్పుడో ఉదయాన్నే నిద్ర పోయినా గౌతమ్ సోఫా సరిపోక కాళ్ళు ముడుచుకొని పడుకొని నిద్ర పోతూ ఉంటాడు.....

నందు గౌతమ్ వైపు ఒక్క క్షణం చూసి వెంటనే తన పనిలో పడి పోతుంది.....

ఇల్లంతా క్లీన్ చేశాక ఫ్రెష్ అవడానికి వెళ్లి వచ్చి దేవుడి గదిలో దీపం పెడుతూ హారతి ఇచ్చేటప్పుడు గంట కొడుతూ ఉంటే ఆ సౌండ్ కి గౌతమ్ కి మెలకువ వచ్చి టైమ్ ఎంతయింది అని గోడ గడియారం చూసుకొని 7:30 చూపిస్తుంటే వెంటనే పైకి లేచి "ఇంత టైం నిద్రపోయానా??? నందు!!! నందు" అనుకుంటూ నందు నైట్ నిద్ర పోయిన రూమ్ వైపు చూసే సరికి ఆ రూమ్ ఓపెన్ లోనే వుండడం చూసి "నందు లేచిందా???" అని రూమ్ దగ్గరికి వెళ్తూ ఉండగానే నందు పూజ కంప్లీట్ చేసుకొని పూజ గది నుంచి బయటకు వస్తుంది.....

గౌతమ్ వెంటనే నందు వైపు చూసి తన మొహం చూసి రాత్రంతా ఏడ్చింది అని అర్థమై బాధగా నందు దగ్గరికి వెళ్తూ "రియల్లీ సారీ నందు ఎక్స్ట్రీమ్లీ సారీ ప్లీజ్ నువ్వు ఇంతలా హర్ట్ అవుతారు అనుకోలేదు..... నువ్వు ఇలా నాతో అంటి ముట్టనట్టు గా ఉంటే నాకు నచ్చడం లేదు.... ప్లీజ్ నందు నాతో మాట్లాడు...." అని నందు కి ఒక అడుగు దూరంలో ఉండగా

నందు చెయ్యి అడ్డం పెట్టి గౌతమ్ ని ఆపేసి "ప్లీజ్ గౌతమ్ ఇప్పుడు నాకు నీతో మాట్లాడే టైం లేదు..... నాకు చాలా పని ఉంది.... నువ్వు ఫ్రెష్ అయి టిఫిన్ తినేసి ఆఫీస్ కి వెళ్లిపో...." అని చెప్పి వెంటనే కిచెన్ లోకి వెళ్లిపోతుంది​
Next page: Update 04
Previous page: Update 02