Update 08
అన్నానికి లేపుదామని లావణ్య లోపలికి వచ్చి చూస్తే చిన్నా ఎంత లేపినా లేవలేదు, వెంటనే డాక్టర్ ని పిలిచింది వచ్చి మాములు పరీక్ష చేసి టెన్షన్ పడ్డాడని కంఫర్మ్ చేసి రెండు టాబ్లెట్లు రాసిచ్చి వెళ్ళిపోయాడు. డాక్టర్ వెళ్ళిపోయాక లావణ్య వచ్చి పక్కన కూర్చుంది. కొంతసేపటికి చిన్నా లేచి అటు ఇటు చూసుకున్నాడు అంతా ప్రశాంతం, తన అమ్మ మధుమతి కనిపించలేదు, బాధపడ్డా చివరిగా తన మాటలు గుర్తొచ్చి ప్రేమగా శృతి వంక చూసాడు. లావణ్య చిన్నా వంక చూసి పిలిచేసరికి తనతో మాట్లాడదామని శృతిని చూడగా అర్ధంచేసుకుని బైటికి వెళ్ళిపోయింది.
చిన్నా : ఎలా ఉన్నావ్
లావణ్య : బాగున్నా..
చిన్నా : ఒకసారి నిన్ను ముట్టుకోనా..?
ఆ ప్రశ్న వినగానే లావణ్య ఏడుస్తూ గట్టిగా వాటేసుకుని కళ్ళు మూసుకుంది, అంతే ప్రేమగా చిన్నా కూడా ఓదార్చి లావణ్య తలని తన గుండె మీద పెట్టుకున్నాడు.
చిన్నా : లావణ్యా.. చెప్పు, ఏం చేస్తున్నావ్.. ఎంత మంది పిల్లలు.. నీ వాళ్ళని నీ బిడ్డలని నాకు పరిచయం చెయ్యి.. అస్సలు నేనెవరో వాళ్ళకి తెలుసా అని మాట్లాడుతూ గతం గురించి ఎత్తవద్దని చెప్పకనే చెప్పాడు.
లావణ్య : ముందు తిందువు పదా
చిన్నా : తిందాంలే.. వాళ్లంతా తిన్నారా
లావణ్య : తిన్నారు.. అక్షిత, శృతి కూడా తినలేదు.
చిన్నా : అలాగ అయితే మనం ముగ్గురం కలిసి తిందాం, అప్పట్లో లాగే.. ఏది ఆ రాక్షసి..?
లావణ్య : అది ఏడుస్తూనే ఉందిరా.. నువ్వు కనీసం తన వంక చూడనైనా చూడలేదని కుమిలిపోతుంది.. నీకు చాలా చెప్పాలి.. అస్సలు ఇదంతా నా వల్లే
చిన్నా : అప్పుడు నా బుర్ర నా అధీనంలో లేదులే.. ఇంకో రాక్షసి కంట్రోల్లో ఉంది అని తన అమ్మని తలుచుకున్నాడు. పదా అని లావణ్య చెయ్యి పట్టుకుని లేపగానే.. లావణ్య చిన్నానే చూస్తుంది.. ఏంటే..?
లావణ్య : నీకు మా మీద కోపం లేదా
చిన్నా : మీ మీద కోపం నాకు ఎప్పటికి రాదు, మీ ఇద్దరే కదా నా లోకం.. పదా అని బైటికి వస్తుంటే లావణ్య చిన్నా చెయ్యి పట్టుకుని బైటికి నడిచింది.
లావణ్య, చిన్నా బైటికి రాగానే, గోడకి ఆనుకుని కూర్చున్న అక్షిత లేచి నిలుచుంది.
చిన్నా : లావణ్యా.. ఏంటిది ఇంత మర్యాద చేస్తుంది, మన రాక్షసేనా..?
లావణ్య : హహ.. మన రాక్షసే అని నవ్వుతూనే కళ్ళు తుడుచుకుంది.
చిన్నా : బాగున్నారా.. అని లావణ్య చెయ్యి వదిలి లావణ్య మరియు అక్షితల భర్తల దెగ్గరికి వెళ్లి మాట్లాడుతూ కూర్చున్నాడు. అంతకముందు సరిగ్గా మాట్లాడలేదని నచ్చచెపుతుంటే వాళ్ళు పరవాలేదని కబుర్లలో పడ్డారు.. లావణ్య తన పిల్లలని తీసుకొచ్చింది.
లావణ్య : చిన్నా.. నా కొడుకు కూతురు.. ఇద్దరు చిన్నా ఆశీర్వాదం తీసుకుందామని వంగగానే వెంటనే లేపాడు.
చిన్నా : రండి.. కూర్చోండి.. నీకింత పెద్ద పిల్లలున్నారా అని ఆశ్చర్యపోతూనే మీ పేరు..?
చిరంజీవి, మధుమతి అని చెప్పగానే లావణ్య వంక సిగ్గుగా చూసి మళ్ళీ వాళ్ళతో మాట్లాడటం మొదలు పెట్టాడు.
లావణ్య : వీడు అక్షిత కొడుకు.. పేరు వేణు
చిన్నా : హో.. అనుకున్నాను కానీ పోలికలన్ని వాళ్ల నాన్నవిలా ఉన్నాయే.. సైలెంట్ గా ఉన్నాడు
లావణ్య : కొత్త కదా.. లేకపోతే ఇంటి టాప్ లేపుతాడు.. అని వేణు భుజం మీద చెయ్యి వేసింది.
చిన్నా : ఏం చదువుతున్నారు
వేణు, చిరంజీవి : బీ టెక్
మధుమతి : నేను ఇంటర్ అంకుల్
చిన్నా : శృతి గారు.. మీ పిల్లలు ఎక్కడా కనిపించలేదు
ఆ మాట వినగానే శృతి కోపంగా.. ఆ.. గాడిదలు కాయడానికి వెళ్లారు సాయంత్రం అవుతుంది రావడానికి అని విసురుగా వెళ్లిపోయింది.
చిన్నా : అబ్బో అని నవ్వుకుని.. సరే ఇక మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి.. అని అందరి వైపు చూసి.. నాకోసం చాలా రోజులు మీ ఆఫీస్, పనులు అన్నీ వదులుకుని వచ్చేసారు.. మీరు కూడా అని పిల్లలని చూసి థాంక్స్ చెప్పాడు.
లావణ్య కూడా అక్షిత మరియు చిన్నా ఏకాంతంగా మాట్లాడుకోవడానికి బలవంతంగా అందరిని పంపించేసింది. చిన్నా తన చెల్లెలు సంజన దెగ్గరికి వెళ్ళాడు.
చిన్నా : సంజు.. తిన్నావా
సంజు : ఇందాకే.. వద్దన్నా వాళ్ళు వినలేదు.. నీకెలా ఉంది..?
చిన్నా : ఇప్పుడు బాగుంది, పిచ్చి కూడా నయం అయిపోయింది.. అమ్మ కనిపించడంలేదు
సంజు : సాయిరాం అని దణ్ణం పెట్టుకుని.. అన్నయ్యని వాటేసుకుంది.
చిన్నా : రెస్ట్ తీసుకో.. నేను వీళ్ళతో చాలా మాట్లాడాలి
సంజు : అవును.. నీ గురించి చాలా విషయాలు తెలిసాయి.. అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది.
ఇంట్లో నుంచి అందరూ వెళ్ళిపోగానే అక్షిత ఉదుటున లేచి చిన్నాని వాటేసుకుని మొహం అంతా ముద్దులు పెట్టేసింది. గట్టిగా కరుచుకుపోయింది. చిన్నా కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని అంతా మర్చిపోయి గట్టిగా పట్టుకున్నాడు.. అక్షిత ముద్దులు పెడుతూ చిన్నా పెదాలు అందుకునేసరికి ఏం చెయ్యాలో తెలీక వెనక్కి నెట్టేసాడు.
అక్షిత : చిన్నా.. నన్ను ఎందుకు బలవంతం చెయ్యలేదు, ఎందుకు నన్ను ఒక్కటి పీకి పెళ్లి చేసుకోలేదు.. నా ఇష్టానికి నన్ను ఎందుకు వదిలేసావ్.. బాధ పడింది నువ్వొక్కడివే కాదురా.. ఇన్ని సంవత్సరాలు నేను నరకం అనుభవించాను. నా పెళ్ళైయ్యేదాకా నాకేం అర్ధం కాలేదు, కానీ నువ్వు కనిపించని ఆ తెల్లారి నుంచి మొదలయ్యింది నాలోని బాధ మళ్ళీ నిన్ను టీవీలో చూసే వరకు కానీ నేను నీ అక్షితలా మారలేదు.
నీ పాటికి నువ్వు నన్ను వదిలేసి వెళ్లిపోయావ్.. నువ్వే కాదురా నేను కూడా నిన్ను ప్రేమించాను, కానీ తెలుసుకోలేకపోయాను పిచ్చి దాన్ని పిచ్చి దాన్ని అని లెంపలు వాయించుకుంది.. చిన్నా నేనన్ని నా జీవితానికి సంబంధించి లెక్కలు వేసుకుంటూ పోయాను.. నా మనసు మాట వినకుండా బుర్ర ఏది ఆలోచిస్తే అది చేసుకుంటూ పోయాను.. దాని ఫలితం రోజూ రాత్రి పడుకునేముందు గత ఇరవై సంవత్సరాలుగా నరకం అనుభవిస్తూనే ఉన్నాను.. ఎవరితో పంచుకోలేక నా పక్కన నువ్వు లేక.. రాత్రి పూట నా మీద పడుతున్న చెయ్యిని చాలా సార్లు నీ చెయ్యనే అనుకున్నాను.. అన్నిటికి తలవంచి బతికేసాను.
లావణ్యకి ఒకటి రెండు సార్లు చెప్పుకున్నాను కానీ దానికి ఇవేమి అర్ధం కావని నాకు తెలుసు.. నా గుండెలో ఎంత నొప్పిని భరిస్తున్నానో నాకే తెలుసు.. చిన్నా.. తప్పు చేసేసాను.. నా జీవితాన్ని నేనే అంధకారంలోకి నెట్టేసాను.. ఆశ, కోరికలు నన్ను నీ మీదున్న ప్రేమని నాకు కనపడనివ్వలేదు.. రోజూ క్షమించమని అమ్మని వేడుకునేదాన్ని.. నన్నెటైనా లేవదీసుకుపో.. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను.. నన్ను తీసుకుని పో.. నాకెవ్వరు వద్దు.. ఈ మాట నీకు చెప్పడానికి ఎంత అల్లాడిపోయానో నాకే తెలుసు.. అని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే వెనకే వచ్చిన లావణ్య ఏడుస్తూనే ఇద్దరినీ వాటేసుకుంది.
లావణ్య : పెళ్ళైన రెండో రాత్రి వచ్చి నా తలుపు కొడితే సర్ది చెప్పాను, తెల్లారే వచ్చి ఒకటే ఏడుపు.. ఏమంటే.. నువ్వు కావాలని గొడవ.. భర్తని కనీసం ఒంటి మీద చెయ్యి వెయ్యనివ్వలేదు.. ఇదంతా ముందు చెప్పకుండా తప్పు చేసేసావని నేనే కోప్పడి బలవంతంగా నీకు ఫోన్ చెయ్యకుండా జాగ్రత్త పడ్డాను.. ఆ తరువాత నీ మీద నేనూ బెంగ పెట్టుకునేసరికి జ్వరం వచ్చేసింది.. నీకోసమని అక్షిత ఇంటికి వస్తే అప్పుడు తెలిసింది.. నువ్వు కూడా అక్షితని ప్రేమించావని.. దాని కంటే ఎక్కువగా
ఇద్దరం కలిసి కుక్కలా వెతుక్కున్నాం నిన్ను.. ఇంట్లో గొడవలు మొదలు వేరు కాపురాలు పెట్టుకున్నాం.. మా మీదున్న ప్రేమతో వాళ్ల అమ్మనాన్నలని టార్లకి వెళ్ళమని పంపించారు.. కానీ ఎంత వెతికినా లాభం లేకపోయింది.. అక్షితని నేను దెగ్గరికి తీసుకున్నాను.. నచ్చజెప్పాను.. బతిమిలాడి.. కోప్పడి.. కాళ్లు పట్టుకుంటే కొన్ని రోజులకి కడుపుతో ఉందని తెలిసాక అప్పుడు నెమ్మదించింది.. ఇదే అవకాశంగా అక్షితని బిజీగా ఉంచుతూ కొన్ని రోజులు ఏమార్చాను.. ఆ తరువాత ఏమనుకుందో ఏమో నటిస్తూ వచ్చింది.. రాత్రంతా ఏడవటం పగలంతా సంతోషంగా ఉన్నట్టు నవ్వుతూ నటిస్తూ అందరినీ నమ్మించింది.. అలా ఇరవై ఏళ్ళు నెట్టింది.. ఒక రకంగా మీరు కలవకుండా చేసింది నేనే అనిపిస్తుంది.. అని ఏడ్చింది.
చిన్నా : లావణ్యా.. ముందు అన్నం పెట్టుకురా అని అక్షిత చెయ్యి పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టాడు.
లావణ్య ప్లేట్లో అన్నం పెట్టుకొచ్చింది, చిన్నా లేచి చెయ్యి కడుక్కుని అన్నం ప్లేట్ అందుకుని కింద కూర్చుని అక్షితని లావణ్యని ఇరు పక్కలా కూర్చోబెట్టుకున్నాడు. అన్నం ముద్ద కలిపి లావణ్యకి తినిపించి ఇంకో ముద్ద అక్షిత నోటి దెగ్గరికి తీసుకురాగానే ఏడుస్తూనే నోరు తెరిచింది.
చిన్నా : అక్కి.. తప్పులు నువ్వు మాత్రమే కాదే నేను కూడా చేసాను.. ఇక మన ప్రేమ విషయానికి వస్తే జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని మనం మార్చలేం కదా
అక్షిత : అ..
చిన్నా : నేను చెప్పేది పూర్తిగా విను.. అని తీపిస్తూనే మళ్ళీ మాట్లాడాడు.. నేను నిన్ను ప్రేమించింది నిజం అలానే నువ్వు నన్ను ప్రేమించింది నిజం.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కలవడం సాధ్యం కాదురా తల్లీ.. ఇంకో రెండేళ్లు పోతే నీ కొడుక్కి పెళ్లి వయసు వస్తుంది..
అక్షిత : నాకు అవన్నీ..
చిన్నా : చెప్పేది వినమన్నాను ముందు.. అని లావణ్య నోట్లో అన్నం పెడుతూ.. నువ్వు ఇరవైయేళ్ళ క్రితం ఏదైతే చేసావో ఇప్పుడు అదే చేస్తున్నావ్.. అప్పుడూ తొందరపడ్డావ్ ఇప్పుడూ తొందరపడుతున్నావ్.
అక్షిత : నిన్ను ప్రేమించింది మాత్రం నిజంరా
చిన్నా : నేను కాదనలేదే.. ఇంకో పదేళ్ళు పోతే మంచాన పడే వయసే మనది, ఒకడిని కన్నావ్.. మీ ఆయనతో ఇన్నేళ్లు గడిపావ్.. అలా అని ఆయనేమి చెడ్డవాడు కాదుగా, మన స్నేహం గురించి అన్నదమ్ములు ఇద్దరు అర్ధం చేసుకున్నారు.. ఏరోజైనా మిమ్మల్ని అవమానించేలా అనుమానించేలా మాట్లాడారా..?
ఇద్దరు లేదని తల ఊపారు
చిన్నా : కదా.. ఎంత సంస్కారం.. మీరంటే ఎంత నమ్మకం.. నేను కూడా తప్పు చేసాను.. నువ్వు నా దానివి కావాలని రోజూ గణపతిని మొక్కుకునే వాడిని, అదొక్కటి తప్ప ఆయన్ని నేనేమి అడగలేదు.. అలాంటిది నువ్వు నాకు దక్కలేదని ఆయన మీద అందరి మీద, ఆఖరికి నా మీద కూడా కోపం పెంచుకున్నాను.. మీరు సంతోషంగా ఉండాలని నా ప్రేమని చంపుకుని మరీ మీకు పెళ్లిళ్లు చేసాను కానీ చివర్లో నేను చేసిందేంటి.. మీకు నేను తప్ప ఎవరున్నారు.. మీకు అమ్మాయినా నాన్నైనా నేనే కదా.. అలాంటిది మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్లిపోయాను.. ఒక పిచ్చిలో దేవుడంటే నా శత్రువు అన్న భ్రమలో బ్రతికాను.. దానికి తోడు కొంచెం పిచ్చి ఎక్కింది కదా, అమ్మ కనిపించేది.. అలా నన్ను నేనే మోసం చేసుకుంటూ కాలం గడిపేసాను.
ఒక్కటి మాత్రం నిజం.. మీరంటే నాకు ప్రాణం.. ఎంత ప్రాణం అంటే మీరు ఏడిస్తే నేను ఏడ్చేంత.. అందుకే మీకు ఏ కష్టం రాకూడదని ఇష్టం లేకపోయినా దేశం కానీ దేశంలో ప్రాణం అరిచేతిలో పట్టుకుని పని చేసాను. అలాంటిది మీరు ఇలా ఏడిస్తే నాకెలా ఉంటుంది చెప్పండి.. ఇంతా చేసింది మీ ఇద్దరు సంతోషంగా ఉండాలనే కదా.. అవునా కాదా
అక్షిత : అవును.. ముక్కు చీదరించింది
చిన్నా : ఇప్పుడు మీరేం చెయ్యాలి
లావణ్య : బుద్ధిగా కాపురం చేసుకోవాలి
చిన్నా : అక్షితా..
అక్షితా : హా..
చిన్నా : మా రాక్షసే ఇవన్నీ మాకు చెప్పి మమ్మల్ని దారిలో పెడుతుంది.. అలాంటిది ఇవన్నీ నీకు చెప్పాలా.. రాచ్చసి
అక్షిత : నువ్వెన్ని చెప్పినా..
చిన్నా : అలా కాదు నాన్నా.. నువ్వు ఇలా వచ్చేసి నేను తీసుకెళ్లిపోతే మొన్నటి దాకా ప్రపంచం అంతా నా గురించిన అబద్దాన్ని నమ్మింది ఇప్పుడు అదంతా నిజమైపోదూ.. అస్సలు ఒకరు అనుకుంటారని కాదు, నిన్నే నమ్ముకున్న నీ కొడుకు, మొగుడు, లావణ్య పిల్లల ముందు తప్పుడు దానివిగా మిగిలిపోవా చెప్పు.. మరి వాళ్ళేమై పోవాలి.. స్నేహితులుగా ఉందామే.. అయినా ఈ వయసులో నేనేమి చేస్తా చెప్పు.. మీ ఆయన అయితే ఫుల్ ఫిట్ గా ఉంటాడు నన్ను చూడు, నీ కున్న కోరికలకి నేనెక్కడ సరిపోతానే
అక్షిత : పోరా.. ఏదేదో చెప్పి నన్ను..
చిన్నా : నా బంగారు బొమ్మవి రా నువ్వు.. నువ్వు బాధ పడితే ఆ బాధ నీ ఒక్కదానిదే కాదు, మా ఇద్దరిది కూడా
అక్షిత : మరి నువ్వు ఒంటరిగా మిగిలిపోయావుగా..?
చిన్నా : ఎవరు చెప్పారు నీకు.. నేను చెప్పానా.. నాకొక చెల్లెలు ఉంది.. లవర్ కూడా ఉంది అని నవ్వాడు
లావణ్య : ఎవరు..?
చిన్నా : శృతి.. ఆ ముసలిదే..
అక్షిత : హహ..
చిన్నా : నా మీద చాలా ఆశలు పెట్టుకుంది, చూసారుగా అని లేచి చెయ్యి కడుక్కుని ఇద్దరి మూతి తుడిచాడు.
అక్షిత : అవును..
లావణ్య : నువ్వు తినలేదు..
చిన్నా : పాపం అది తినలేదుగా..
అక్షిత : కోపంగా వెళ్ళిపోయింది.
చిన్నా : ఎక్కడికి వెళ్లిందో నాకు తెలుసులే
లావణ్య : ఎక్కడికి..?
చిన్నా : తిన్నారు కదా.. ఇక దొబ్బెయ్యండి.. నేను ప్రేమించుకోవాలి.. ఈ వయసులో ఒక కుర్రాడు పడాల్సిన పాట్లు అన్నీ పడాలి నేను
అక్షిత : అబ్బో.. అని లేచింది..
లావణ్య, అక్షిత చిన్నా బోలెడన్ని ముచ్చట్లు.. తమ జీవితం కష్టాలు సంతోషాలు, ఘనతలు అన్నీ చెప్పుకుని లేచారు.. అక్షిత లావణ్య వెళ్లిపోతుంటే ఇద్దరినీ పిలిచాడు.. ఇద్దరినీ దెగ్గరికి తీసుకుని చెరొక బుగ్గ మీద ముద్దు పెట్టి వాటేసుకున్నాడు.
చిన్నా : ఇద్దరి మనస్సులో భారం అంతా దిగినట్టేగా..?
ఇద్దరు ఊ కొట్టారు
చిన్నా : ఏమైనా ఉంటే ఈ మెకానిక్ గాడికి చెప్పండి, రిపేర్ చేసి పెడతాడు.. సరేనా
ఇద్దరు నవ్వుతూ అలాగే అన్నారు.. ఇద్దరి బాధ తీర్చి వాళ్లని శాంతింపచేసి నవ్వించి ఇంటికి పంపించి, శృతి కోసం రోడ్డు మీదకి వచ్చాడు.
రోడ్డెక్కిన చిరంజీవి నేరుగా థియేటర్ కి వెళ్ళాడు, సినిమా నడుస్తూనే ఉంది. టికెట్ తీసుకుని లోపలికి వెళ్లి చూస్తే శృతి చివరన పడుకుని ఉంది. వెళ్లి పక్క సీట్లో కూర్చున్నాడు. అప్పుడెలా ప్రవర్తించేదో ఇప్పుడు అలానే చేసేసరికి నవ్వుకున్నాడు.
చిన్నా : నటించడం అయిపోతే వెళదాం.. ఆకలేస్తుంది.. అంతా విన్నావని నాకు తెలుసు
శృతి : ఏంటి..?
చిన్నా : వెళదామా
శృతి లేచి బైటికి నడిచింది, వెనకాల చిన్నా నడుస్తుంటే తన పిర్రల గురించి గుర్తొచ్చి నవ్వుకుని పక్కన నడవమని గట్టిగా చెప్పింది. ఇద్దరు ఇంటికి వచ్చారు. చేతులు కడుక్కో అని చెపుతూనే చిన్నా కిచెన్ లోకి వెళ్లి అన్నం ప్లేట్ తెచ్చాడు.
శృతి : వాళ్ళకి మాత్రం తినిపించి.. చీ.. నేనంటే ఎప్పుడు ఇష్టం లేదు..
చిన్నా : ఏంటి..?
శృతి : ఏం లేదు.. అని చేతులు కడుక్కుని వచ్చి కూర్చుంది.
చిన్నా : ఇదిగో అని ప్లేట్ చేతికిచ్చాడు.
అందుకుని కోపంగా తింటుంటే, పక్కన కూర్చుని తననే చూస్తున్నాడు.
శృతి : ఏంటి..??
చిన్నా : నేను కూడా తినలేదు.. అని నోరు తెరిచాడు..
ఒక్కసారిగా కళ్లెమ్మటి నీళ్లు తిరిగాయి శృతికి, అన్నం తినిపించింది. ఇద్దరు అన్నం తినేసి మౌనంగా కూర్చున్నారు.
శృతి : సంజన ఏది కనిపించలేదు
చిన్నా : అక్షిత తీసుకెళ్లింది..
శృతి : ఏమంటుంది నీ అక్షిత, తెగ మాట్లాడుకున్నారు ముగ్గురు..
చిన్నా : చూసావా
శృతి : హా.. నేనే కాదు.. ఆ పిల్లలు కూడా.. అదే లావణ్య, అక్షిత పిల్లలు మళ్ళీ వెనక్కి వచ్చారు.. వాళ్ళు రాగానే నేను అక్కడి నుంచి వచ్చేసా
చిన్నా : వాళ్ళు విన్నారా
శృతి : ఏమో నాకు తెలీదు
మళ్ళీ అరగంట మౌనం
చిన్నా : ఎటైనా వెళ్లాలని ఉంది.
శృతి : వెళ్ళు
చిన్నా : నీ సంగతేంటి..?
శృతి : నాకేంటి.. ఎలాగో ఒంటరి బతుకేగా నాది.. చిన్నా దెగ్గరికి రాబోతే.. దెగ్గరికి రాకు.. నన్ను ఒంటరిగా వదిలేసి పోయావ్.. ఆ తరువాత నాన్న ఆయన వెనకాలే అమ్మ.. ఒంటరిదాన్ని అయిపోయాను.. పొద్దున్నే వాకింగ్ కి ఒంటరిగా వెళ్లాలంటేనే భయం నాకు.. అలాంటిది ఇరవై ఏళ్ళు ఒంటరిగా బతికేసాను.. ఇంకో ఇరవై ఏళ్ళు బతకలేనా ఏంటి..
చిన్నా కళ్ళు తుడుచుకుని శృతిని దెగ్గరికి తీసుకున్నాడు, ఏడుస్తూ చిన్నా గుండె మీద కొడుతూనే గట్టిగా వాటేసుకుంది..
శృతి : ఏ తప్పు చేశానని నాకు ఇంత పెద్ద శిక్ష.. నేనేం చేసానని..
చిన్నా : నన్ను క్షమించు.. అని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు.
శృతి చిన్నా గుండె మీద కళ్ళు మూసుకుని ఏడుస్తుంటే అలానే కింద పడుకుని మీద పడుకోబెట్టుకుని జొ కొట్టాడు. కొంతసేపటికి నిద్ర పోయింది. మొహం చూస్తూ జుట్టు సర్దుతూ మధ్యలో నెరిసిన జుట్టు చూసి నవ్వుతూ ఎప్పుడు విరబూసే జుట్టు జడ వేసి ఉండడం, చేతులు పట్టుకుని చూసాడు, శృతివి పొడుగు వెళ్ళు. చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకుని కళ్ళు మూసుకుని వాటేసుకుని పడుకున్నాడు.
మెలుకువ వచ్చి లేచేసరికి బైట చీకటి పడింది. లేచి ఇందాక తిన్న ప్లేట్ తీసి సింకులో వేసి వచ్చి కూర్చున్నాడు. శృతి మొహం చూస్తే చాలా ఏళ్లకి ప్రశాంతంగా నిద్ర పోతున్నట్టు అనిపించింది. శృతి కాళ్ళని తన ఒడిలో పెట్టుకుని తనని చూస్తూ ఆలోచనల్లో పడిపోయాడు. ఎప్పటికో లేచింది శృతి.. కళ్ళు తెరిచి చూస్తే కన్నార్పకుండా చూస్తున్న చిన్నాని చూసి లేవబోతే ఆపాడు. కాళ్లు తీయబోతే గట్టిగా పట్టుకుని అరికాలిని ముద్దాడాడు.
శృతి : ఏంటది..?
రెండు కాళ్ళని మొహం మీద పెట్టుకుని, చాలా బాధ పెట్టాను కదా నిన్ను.. అని ఏడవబోయి మళ్ళీ ఆపేసి కాళ్ళు వదిలి వెళ్లి శృతి నడుము మీద చెయ్యేసి పడుకున్నాడు.
శృతి : లైట్ వెయ్యొద్దా
చిన్నా : వద్దు..
శృతి : చెప్పు అయితే
చిన్నా : ఐ లవ్ యు
శృతి : ఏ వయసులో చెపుతున్నాడో చూడు..
చిన్నా : లేట్ అయినా సరే.. మళ్ళీ ఇంకో తప్పు చెయ్యను.. మాటిచ్చినట్టే వచ్చేసాను.. ఇక నీ కాళ్ళ దెగ్గర కుక్కలా పడుంటా అని గట్టిగా వాటేసుకుంటే శృతి చిన్నా గుండె మీద ఒదిగిపోతూ ఇక్కడ చోటివ్వు చాలు అంది. ఇక్కడ నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు
శృతి : అబద్ధాలకి కూడా హద్దుండాలి
చిన్నా : ఒకప్పుడు అక్కడ అక్షిత ఉండేది..
శృతి : అంటే ఇప్పుడు లేదా
చిన్నా : లేదు.. ఇప్పుడు అక్కడ నా డ్రాయింగ్ టీచర్ మాత్రమే ఉంది..
శృతి : నిజమేనా ఇదంతా
చిన్నా : నమ్మవే..
శృతి : అలా నమ్మే..
చిన్నా : శృతీ... అని ఆపి.. ఎటైనా వెళదామా
శృతి : ఎక్కడికి వెళతావ్
చిన్నా : ఎటైనా.. ముందు పెళ్లి చేసుకుందాం.. కొన్ని రోజులు దూరంగా నువ్వు నేను మాత్రమే..
శృతి : చిన్నప్పటి నుంచి గొడ్డులా కష్టపడి, ఈ శరీరం బండరాయిలా తయారైన తరువాత వయసంతా అయిపోయిన తరువాత ఇప్పుడు కోరికలు బయట పెడుతున్నావ్.. చెప్పాను కదా.. అరుదైన మొక్కవి నువ్వు.. అందుకే నువ్వంటే నాకిష్టం
చిన్నా : చాలా అందంగా ఉన్నావ్
శృతి : ఇంకా రానీ బైటికి రానీ.. ఏమేమి ఉన్నాయి ఆ మనసులో
చిన్నా : నా మీద పడుకోవా
శృతి : చిన్న పిల్లని అనుకుంటున్నావా.. అని సిగ్గు పడుతూనే చిన్నా మీద పడుకుంది
చిన్నా : అప్పట్లో నన్ను ఏవేవో అడిగేదానివి.. అవన్నీ తీర్చడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను
శృతి : ఉండు ఒక్క నిమిషం అంటూ లేచి లోపలికి వెళ్లి చెన్నైలో చిన్నా రూంలో నుంచి తీసిన పేపర్ తీసుకొచ్చి చిన్నా చేతికి ఇచ్చి వాడి గుండె మీద గడ్డంతో గుచ్చుతూ ఆరా తీసింది..
చిన్నా : ఉన్నవేగా నేను గీసింది.. ఇప్పుడు చూడు ఇంకా పెద్దగా ఉన్నాయవి
శృతి : ఏంటవి..?
చిన్నా : అవే.. శృతి ఎద మీద పడుకుని వత్తి.. నేను కిందవాటి గురించి మాట్లాడుతున్నా.. అవే..
శృతి : అవంటే..
చిన్నా : అవంటే.. అవే.. నీ బ్యాక్ టైర్
శృతి : ఏ బండి అనుకున్నవేంటి
చిన్నా : నువ్వు నా బుల్లెట్ బండివి
శృతి : మా చిన్నా గాడికి ఇన్ని మాటలు వచ్చా.. ఆమ్మో..
చిన్నా : ముద్దు పెట్టు
శృతి : ఎక్కడా.. సన్నని గొంతుతో అడిగింది
చిన్నా : నీ ఇష్టం.. మళ్ళీ ఆగి.. ఈ యేడు వినాయక చవితి మనిద్దరి చేతుల మీదగా జరగాలి
శృతి : ఇంకా
చిన్నా : చాలా ఉన్నాయి.. కావాల్సినంత టైం ఉంది.. అన్నీ కోరికలు తీర్చుకుంటా.. అన్నీ అంటే అన్నీ అని ఒత్తి పలికాడు
శృతి ఆఁహాఁ.. అని చిన్నా నడుము గిల్లుతూ ఆట పట్టిస్తుంటే, చిన్నా మెలికలు తిరిగిపోతూ గట్టిగా నవ్వుతుంటే ఆ నవ్వుతో శృతి నవ్వు జత కలిసింది.. చిన్నా నవ్వడం ఆపి తననే చూస్తుంటే శృతి సిగ్గుగా చిన్నా కళ్ళలోకి చూస్తూ తన పెదాలని చిన్నా పెదాలకి దెగ్గరగా తెచ్చింది. రెండు జతల పెదాలు కలుసుకున్నాయి.. మళ్ళీ విడతీయలేనంతగా.. శాశ్వతంగా
అక్షిత మరియు లావణ్య జంటలు కలిసి తెలిసిన వాళ్ళతో తక్కువ మందితో చిరంజీవి మరియు శృతిల పెళ్లి చేశారు. చిన్నా పెళ్లి చూస్తూ ఎప్పుడు లేనంతగా ఆనందపడింది అక్షిత.
వేణు : అంకుల్ మీతో మాట్లాడొచ్చా
చిన్నా : వస్తున్నా
లావణ్య కొడుకు చిరంజీవి : హ్యాపీ మార్రీడ్ లైఫ్ అంకుల్.. మీరు హ్యాపీగా ఉండాలి.. అని ముగ్గురు కలిసి గిఫ్ట్ ఇచ్చారు. తెరిచి చూస్తే అక్షిత, లావణ్య చిన్నాల ఫోటో
వేణు : మిమ్మల్ని పర్సనల్ క్వశ్చన్ అడగొచ్చా అంకుల్
చిన్నా : అడుగు నాన్న
వేణు : అదీ.. మీరు ఎందుకు మా అమ్మని కాదన్నారు.. అదీ మా అమ్మ.. అని తడబడ్డాడు.. మిగతా ఇద్దరు పిలల్లు చిన్నా ఏం చెపుతాడా అని చూస్తున్నారు.
చిన్నా : వేణు.. నువ్వు అడిగాల్సిన ప్రశ్న అది కాదు, మా అమ్మలు అంటే నాకు ఎందుకు అంత ఇష్టం అని.. ఎందుకంటే వాళ్ళు నా స్నేహితులు నన్నే నమ్ముకుని నా చెయ్యి పట్టుకుని వచ్చారు.. మా ముగ్గురి బంధం చాలా గొప్పది.. ఎన్ని ఆటంకాలు వచ్చినా చివరికి కలిసే ఉన్నాం చూసారా.. నాకు సంబంధించినంత వరకు.. ఆ ఇద్దరు నాకు అమ్మలు అంతే.. మా ముగ్గురి కధ నుంచి ఏదైనా మీరు ముగ్గురు నేర్చుకోవాలనుకుంటే అందులోని మంచిని తీసుకోండి, మా తప్పులని క్షమించండి అవి మీరు చెయ్యకుండా ఉండేందుకు జాగ్రత్త పడండి.
చిరంజీవి : థాంక్యూ అంకుల్
వేణు : అవును.. మా చెల్లిని కూడా మీరు మా అమ్మలని చూసుకున్నట్టే చూసుకుంటాం.. ఎప్పుడు కోప్పడం అని నవ్వుతూ ఇద్దరు కలిసి మధుమతిని ఎత్తుకుని ఆడిస్తూ వెళ్లిపోయారు.
ఆ వారం రోజులు ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది, అన్ని పనులు అక్షితే దెగ్గరుండి చూసుకుంది.. ఇద్దరిని అక్షిత బలవంతంగా హనీమూన్ కి పంపించింది.
చిన్నా చెల్లెలు సంజన ఆరు నెలలు చిన్నా దెగ్గర ఉన్న తరువాత, ఎంత మంది చెప్పినా వినకుండా పెళ్లి మీద తన నిర్ణయం చెప్పి మధుమతి ఆశ్రమం నడిపించడమే తన లక్ష్యం అని సెలవు తీసుకుని మళ్ళీ చెన్నై చేరింది.
చిన్నా శృతి ఇద్దరు ఒక ప్రపంచంగా మారిపోయారు.. ఒక కొత్త జీవితం ఆరంభమైంది.
మనం ఏదైనా మంచి చేస్తే ఆ మంచి తిరిగి మనకే మంచి చేస్తుందంటారు, ఈ కధలో చిరంజీవికి అదే జరిగింది.. కానీ కలికాలం కదా.. ఆ మంచి ఎక్కువ కాలం నిలబడలేదు.
చిన్నా శృతిల పెళ్లి జరిగిన తొమ్మిదిన్నర సంవత్సరాల తరువాత, తమిళనాడులో ఒప్పొసిషన్ పార్టీ లీడర్ అయిన కాతిర్ సెల్వన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకి చిరంజీవి మరియు శృతి ఇద్దరు ఆక్సిడెంట్లో చనిపోయారు. మధుమతి ఆశ్రమం నడుపుతున్న సంజన మిస్ అయ్యింది.. ఆ తరువాత ఆశ్రమాన్ని వేరే సంస్థ తనలో కలిపేసుకుంది. మధుమతి బాలికా గృహం కాలంలో కలిసిపోయింది.

సమాప్తం