Update 04

డిసెంబర్ 7 న ఏమీ చేయబోతున్నారు అని కృష్ణ, చంద్రిక, శేఖర్ ముగ్గురు ఆలోచన లో పడ్డారు అప్పుడు ఆ రోజు ఏమీ స్పెషల్స్ ఉన్నాయి అని మొత్తం చెక్ చేయడం కోసం వాళ్లు కంట్రోల్ రూమ్ కీ వెళ్లారు కమిషనర్ ఒక వారం రోజుల పాటు సెలవు పెట్టి ఫ్యామిలీ తో పాటు ట్రిప్ కీ వెళ్లాడు దాంతో చంద్రిక సస్పెండ్ గురించి ఎవరికీ తెలియదు దాంతో వాళ్ళకి రూట్ క్లియర్ అయింది అప్పుడు డిసెంబర్ 7th ఏమీ స్పెషల్స్ ఉన్నాయి అని తెలుసుకుంటు ఉంటే ఆ రోజు DRDO లో అటామిక్ అండ్ న్యూక్లియర్ ప్రొఫెసర్ జావిద్ షరీఫ్ తయారు చేసిన ఒక అటామిక్ హైడ్రో ఎలక్ట్రిక్ missile టెస్ట్ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు దాంతో శేఖర్ మొత్తం ప్లాన్ అర్థం అయ్యింది, ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల పాకిస్తాన్ కీ కాశ్మీర్ మీద ఉన్న కొద్ది పాటి పట్టు కూడా పోయింది దాంతో ఇంక కాశ్మీర్ కోసం ఏదో పెద్దగా చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు అదే సమయంలో 370 రద్దు అప్పుడు అనాధ అయిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేశారు అందులో రజాక్ కూడా ఉన్నాడు వాడు 15 సంవత్సరాల వయసు లోనే ప్రపంచ సైంటిస్ట్ ఎవరికి చేతకాని ఒక కొత్త రకమైన హార్డ్ వేర్ టెక్నాలజీ సృష్టించాడు ఆ టెక్నాలజీ వాడి DRDO లోని ఆ missile నీ అక్కడే బ్లాస్ట్ చేస్తే దేశం మొత్తం ఆ కేసు మీద బిజీ అవుతుంది దాంతో ఎవరూ కాశ్మీర్ నీ పట్టించుకోరు అప్పుడు రక్షణ కోసం బార్డర్ లో ఉన్న సైన్యం కూడా బలహీనం గా ఉంటుంది అప్పుడు కాశ్మీర్ నీ హస్తగతం చేసుకోవడం సులభం అవుతుంది అని జమాత్ మహమ్మద్ లష్కరే ప్లాన్ కాబట్టి ఎలాగైనా ఇది ఆపాలని శేఖర్ డిసైడ్ అయ్యాడు కాకపోతే ఇంత పెద్ద టాస్క్ చేయడానికి వీలకు ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆలోచిస్తూ ఉన్నాడు.

అప్పుడే చంద్రిక పని మనిషి ఫోన్ చేసింది "మేడమ్ ఆ పిల్లగాడు పారిపోయిండు" అని చెప్పింది దాంతో చంద్రిక ఇదే విషయం శేఖర్ కీ చెప్పింది, కానీ శేఖర్ మాత్రం ఏమీ రియాక్షన్ లేకుండా "అవునా" అని చెప్పి ఏదో ఆలోచిస్తూ ఉంటే కృష్ణ వైపు చూసి "ఏంటి ఏమీ రియాక్షన్ లేదు వాడి నుంచి" అని అడిగింది దానికి కృష్ణ "వాడు రియాక్షన్ ఇవ్వడం లేదు అంటే వాడి యాక్షన్ ఎక్కడో మొదలు అయ్యి ఉంటుంది" అని చెప్పాడు అప్పుడు ఇద్దరిని రమ్మని చెప్పాడు శేఖర్ అప్పుడు చంద్రిక ఎక్కడికి అని అడిగింది దానికి శేఖర్ "నీ మృదువైన చేతికి గల గల సౌందర్యం పెంచడానికి చూడి బజార్ కీ వెళ్లి గాజులు కొందాం " అన్నాడు అప్పుడు చంద్రిక కీ అర్థం అయ్యింది రజాక్ చూడి బజార్ లో ఉన్నాడు అని దాంతో ముగ్గురు శేఖర్ దగ్గర ఉన్న GPS ట్రాకర్ ద్వారా అక్కడికి వెళ్లారు అప్పుడు ఆ ట్రాకర్ వాళ్ళని ప్రొఫెసర్ జావిద్ షరీఫ్ ఇంటికి తీసుకు వెళ్లింది దాంతో చంద్రిక, కృష్ణ ఇద్దరిని బయట నుంచి కవర్ చేసి ఫోర్స్ నీ పిలవమని చెప్పి లోపలికి వెళ్ళాడు శేఖర్ ఆ తర్వాత లోపలికి వెళ్లి అక్కడ పడి ఉన్న ఒక ప్లాట్ broucher నీ తీసుకోని డోర్ బెల్ కొట్టాడు అప్పుడు ఆ ప్రొఫెసర్ భార్య బయటకు వచ్చింది ఆమె కళ్ళల్లో ఏదో భయం తెలుస్తుంది శేఖర్ మాట్లాడే ముందే ఆమె మాకు ఏమీ వద్దు అని తలుపు వేసింది ఆ తర్వాత శేఖర్ ఇంట్లోకి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తూ ఉండగా తన కాలి కింద ఉన్న టైల్స్ ఒక్కోటీ ఒక్కో శబ్దం చేస్తూ ఉన్నాయి దాంతో ఆ ఇంటికి అండర్ గ్రౌండ్ ఉంది అని అర్థం అయ్యింది శేఖర్ కీ వెంటనే దానికి బేస్ ఎక్కడ అని వెతుక్కుంటూ వెళితే ఒకడు అండర్ గ్రౌండ్ లో నుంచి బయటకు ఫోన్ మాట్లాడానికి వచ్చాడు.

దాంతో శేఖర్ వాడిని కొట్టి ఆ ప్రొఫెసర్ భార్య నీ కాపాడమని ఒక మెసేజ్ కృష్ణ కీ పంపి తను లోపలికి వెళ్ళాడు లోపల ఇబ్రహీం జావిద్ నీ తన కంట్రోల్ లో పెట్టుకొని జావిద్ ల్యాబ్ లో తన missile కీ సంబంధించిన టెక్నికల్ పనిలో రజాక్ చేసిన చీప్ కీ సంబంధించిన మార్పులు ఏవో చేస్తూ ఉన్నారు అప్పుడు శేఖర్ జరిగేది అంతా వీడియో తీస్తున్నాడు ఆ ప్రొఫెసర్ చేసిన missile అటామిక్ ఎనర్జీ తో హైడ్రో ఎనర్జీ నీ లాగుతుంది ఇప్పడు ఆ చీప్ తో కనుక అది లింక్ అయితే అది అక్కడికక్కడే బ్లాస్ట్ అయి దాని ద్వారా వచ్చే ఎనర్జీ తరంగం వల్ల మొత్తం సిటీ లో ఉన్న గ్రౌండ్ వాటర్ లీక్ అయి సిటీ మొత్తం మునిగి పొత్తుంది అప్పుడే రజాక్ వచ్చాడు అని ఇబ్రహీం వాళ్ల లీడర్ కీ శాటిలైట్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు అప్పుడు ఆ లీడర్ రజాక్ నీ చంపేయమని చెప్పాడు అప్పుడు వాడు రజాక్ నీ కాల్చే సమయంలో శేఖర్ తన గన్ తో ఇబ్రహీం నీ వాడితో ఉన్న నలుగురిని కాల్చి చంపాడు అప్పుడు పైన ఉన్న ఇంట్లో కృష్ణ, చంద్రిక చేరి ఒక వైపు వెళ్లి ప్రొఫెసర్ భార్య నీ సోఫా లో పెట్టి కాపలా కాస్తున్న ఇద్దరిని ఒకేసారి కాల్చి చంపారు.

ఆ తర్వాత జావిద్ నీ ఎంక్వయిరీ చేశారు ఎందుకు ఇలా దేశ ద్రోహం చేస్తున్నారని అడిగితే అప్పుడు ఆయన తన కూతురు వాళ్ల దగ్గర ఉంది అని చెప్పాడు ఎప్పుడో చిన్నప్పుడు తప్పి పోయిన తన కూతురిని వాళ్లు ఒక మానవ బాంబ్ నీ చేశారు ఇప్పుడు నేను వాళ్లు చెప్పినది చేయకుంటే నా కూతురు నీ చంపేస్తారు అని ఏడ్వడం మొదలు పెట్టాడు అప్పుడు ఆయన వెనుక సాదియ చిన్నప్పుడు ఫోటో చూశాడు శేఖర్ అప్పుడు సాదియ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది తను చిన్నప్పుడు ఫ్యామిలీ తో ట్రిప్ కీ వచ్చి కాశ్మీర్ లో తప్పి పోయి అక్కడే ఒక అనాధాశ్రమం లో పెరిగాను అని చెప్పింది అది గుర్తు వచ్చి వెంటనే దేవి ప్రసాద్ కీ వీడియో కాల్ చేశాడు అప్పుడు సాదియ వాడు వంట చేస్తూ ఉన్నారు అప్పుడు సాదియ కీ జావిద్ నీ చూపించాడు అప్పుడు సాదియ తన తండ్రి నీ గుర్తు పట్టింది దాంతో సాదియ కీ వాళ్ల అమ్మ నాన్న కీ ఒకేసారి ఆనందభాష్పాలు రాలాయి.

శేఖర్ సాదియ నీ తన అమ్మ నాన్న తో కలిపేసరికి అందరూ సంతోషంగా ఉన్నారు, కొని సంవత్సరాల క్రితం జావిద్ ఫ్యామిలీ కాశ్మీర్ కీ వెళ్లారు అప్పుడు అక్కడ మత కలహాలు మొదలయ్యాయి దాంతో పాటు టూరిస్ట్ లను కూడా చంపడం మొదలు పెట్టారు అప్పుడు మిలిటరీ వాళ్లు టూరిస్ట్ లను తిరిగి పంపడానికి పెట్టిన లారీ లో ఎక్కుతుండగా ట్రక్ పైన దాడి చేశారు అప్పుడు వెంటనే బండి నీ పోనిచ్చిన సమయంలో ట్రక్ ఎక్కుతున్న సాదియ కింద పడింది ఆ తర్వాత గొడవ గుంపులో కలిసి పోయింది ఆ తర్వాత ఒక షాప్ లో దాకుంది గొడవలు అని సర్దుకున్నాక బయటకు వచ్చి ఏడుస్తు చలికి వణుకుతూ ఉంది అప్పుడు వచ్చిన మిలిటరీ వాళ్లు తనని rescue క్యాంప్ కీ తీసుకుని వెళ్లారు సాదియ నీ ఎప్పుడు బయటికి పంపే వాళ్లు కాదు తన ఊరు హైదరాబాద్ అని తెలుసుకాని అడ్రస్ గుర్తు లేదు దాంతో వాళ్లు తనని ఒక అనాధాశ్రమం లో చేర్పించారు, సురక్షిత ప్రాంతానికి వెళ్లిన తర్వాత జావిద్ వాళ్ల కూతురు గురించి అడిగారు అప్పుడు కొంతమంది పిల్లల శవాలు పేర్చి ఉంటే అందులో ఒక శవం పైన సాదియ కోట్ చూసి తను చనిపోయింది అని అనుకున్నారు, జునైద్ కీ జావిద్ డిటైల్స్ ఇచ్చిన హఫీజ్ తన గురించి ఎంక్వయిరీ చేయమని చెప్పాడు దాంతో వాళ్ల బలహీనత తెలుసుకున్న హఫీజ్ ఇబ్రహీం తో ఒక జూనియర్ ఆర్టిస్టు తో ఒక వీడియో తీయించి వీలను మోసం చేసి missile నీ వాళ్లకు అనుగుణంగా మార్పులు చేస్తూ ఉన్నారు కానీ సమయానికి శేఖర్ వచ్చి అని సరి చేశాడు దాంతో మరుసటి రోజు ఉదయం ఫ్లయిట్ కీ వాళ్లు హైదరాబాద్ వచ్చారు, రెండు సంవత్సరాల క్రితం ఇండియన్ ఆర్మీ బేస్మేంట్ పైన పాకిస్తాన్ వాళ్లు దాడి చేశారు అప్పుడు కాశ్మీర్ లో చాలా గొడవలు జరుగుతున్నాయి అప్పుడు మార్కెట్ కీ వచ్చిన సాదియ మీద ఎటాక్ జరుగుతున్న టైమ్ లో దేవి ప్రసాద్ తనని కాపాడాడు అలా సాదియ దేవి ఇద్దరు లవ్ లో పడి పెళ్లి చేసుకున్నారు, సాదియ రాగానే వాళ్ల సంతోషం కీ అవ్వదలు లేవు తాము లేకుండా తన పెళ్లి జరిగింది అని బాధ పడిన కూతురు తల్లి కాబోతుందని సంతోషం తో తను తిరిగి వచ్చినందుకు గ్రాండ్ గా ఇంట్లో ఫంక్షన్ చేశారు.

ఇలా ఉంటే ఇన్ని రోజులు తనకి మర్యాద ప్రేమ పంచిన వాళ్లు తనని చంపాలీ అనుకోవడం రజాక్ కీ షాక్ ఇచ్చింది దాంతో వాడు డైలమాలో పడ్డాడు అప్పుడు శేఖర్ వాడిని తీసుకోని మసీదు కీ వెళ్లాడు అక్కడ బయట హిందూ '' లు ఎలా ఐకమత్యం తో వ్యాపారాలు చేస్తున్నారో ఎలా సోదర భావంతో కలిసి ఉంటున్నారో చూపించాడు అది చూసి రజాక్ కొంచెం ఆలోచనలో పడ్డాడు ఆ తర్వాత లోపలికి తీసుకోని వెళ్లి రజాక్ తో పాటు శేఖర్ కూడా నమాజ్ చేశాడు అప్పుడు రజాక్ నీ కుర్చోబేటి "నువ్వు మొన్నటి వరకు నా వాళ్లు అనుకున్న వాళ్లు నీ వల్ల వాళ్ళకి ప్రమాదం అని తెలియగానే నిన్ను చంపాలి అని చూశారు సాటి '' అయిన ఆ ప్రొఫెసర్ నీ మోసం చేశారు మొన్నటి వరకు నీతో అవసరం ఉంది కాబట్టి నీ మీద ప్రేమ నటించారు ఇప్పుడు రిస్క్ అని నిన్ను చంపాలీ అని చూశారు నీ లక్ష్యం ఏంటి అబ్దుల్ కలాం గారి లాగే పెద్ద సైంటిస్ట్ అవ్వాలి అని కదా ఇప్పుడు నువ్వు ఈ దేశం కోసం ఉపయోగించిన తెలివి నీ అదే దేశం నీ నాశనం చేయాలి అనుకున్నావు అని ఆయనకు తెలిస్తే ఎంత బాధ పడుతారో ఊహించుకో నా జీవితం మొత్తం ఈ దేశం కోసం త్యాగం చేయడానికి నేను రెడీ అదే దేశం జోలికి వస్తే చంపడానికి కూడా ఆలోచించను " అని చెప్పాడు అది అంత విన్న రజాక్ ఏడుస్తు శేఖర్ నీ కౌగిలించుకున్నాడు.

ఆ తర్వాత అందరి భయం ఇప్పుడు ఆ గ్యాంగ్ లీడర్ ఎవరో ఇంతవరకు తెలియదు అసలు ఆ చీప్ ఎక్కడ అని అందరూ ఆలోచిస్తూ ఉంటే శేఖర్ ఆ చీప్ తీసి చూపించాడు అందరూ షాక్ అయి చూశారు అప్పుడు చంద్రిక అడిగింది "నీకు ఆ చీప్ ఎలా దొరికింది" అని అప్పుడు శేఖర్ చెప్పడం మొదలు పెట్టాడు "సౌమ్యా తన బాయ్ ఫ్రెండ్ కోసం ఈ షూ కొనింది కాకపోతే అతనికి సైజ్ సరిపోలా అందుకే బెంగళూరు వెళుతూ నను కలిసి సారీ చెప్పింది తన వల్ల వచ్చిన misunderstanding కీ నాకూ డివోర్స్ అయ్యాయి అని ఆ తరువాత షూ డిజైన్ నచ్చి నేను తీసుకున్న నాకూ రోడ్డు మీద నడిచే అప్పుడు రాళ్లనీ తనడం అలవాటు అలా కొట్టినప్పుడు షూ తెగింది దాంతో ఈ చీప్ దొరికింది షూ కీ సంబంధించిన ఏదో అనుకున్నా అది ఇక్కడే దాచి పెట్టా ఆ తర్వాత ఆ ముసలాయన చెప్పాడు కదా చీప్ అని అప్పుడే నాకూ అర్థం అయింది ఈ చీప్ అయి ఉంటుంది అని తరువాత కాశ్మీర్ లో దీని నమూనా చూసినప్పుడు కన్ఫర్మేషన్ చేసుకున్నా అంతే కాకుండా ఈ మిషన్ కీ డబ్బులు ఎలా వచ్చాయి అని ఆలోచిస్తూ ఉంటే నాకూ ఇంకో విషయం తెలిసింది ఈ మొత్తం మిషన్ కీ ఫండ్స్ మన గవర్నమెంట్ ఏ ఈ ఉగ్రవాద సంస్థ కీ ఇచ్చింది " అని చెప్పాడు దానికి అందరూ షాక్ అయ్యారు.

శేఖర్ చెప్పినదానికి వాళ్లు షాక్ అవ్వడం చూసి నవ్వి తన laptop లో 2017 లో వచ్చిన ఒక న్యూస్ చూపించాడు అందులో చైనా ప్రధాని ఇండియా వచ్చి ఇండియా లోని స్క్రాప్ machinery నీ కొన్న న్యూస్ గురించి ఉంది అది చూసి అందరూ శేఖర్ వైపు అర్థంకానట్టు చూశారు అప్పుడు శేఖర్ చెప్పడం మొదలు పెట్టాడు "2017 లో చైనా మన దేశంలో కొన్న machinery స్క్రాప్ ఏంటో తెలుసా ప్రింటింగ్ స్క్రాప్ ఆర్బిఐ నుంచి పర్చేస్ చేసిన ఆ machinery ద్వారా మొత్తం ఇండియన్ నోట్లు ప్రింట్ చేస్తున్నారు మనం ఇబ్రహీం డెన్ లో చూసిన ప్రింటింగ్ ప్రెస్ మెషిన్ అదే చైనా మన దెగ్గర machinery కొని అది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు అమ్మింది దాంతో వాళ్లు తెలివిగా వాళ్ల ఫండ్స్ ఆగిపోయాయి కాబట్టి వాళ్ళు మన దేశంలో డబ్బు కోసం కుక్కలు లాగా వచ్చే వాళ్ళని జతగా చేసుకొని ఇంత పెద్ద మిషన్ ప్లాన్ చేసారు నాకూ ఈ విషయం ఎలా తెలిసింది అంటే ఇప్పుడు ఇండియా లో వచ్చే నోట్ల పైన కొత్త ఆర్బిఐ గవర్నర్ సంతకం ఉంటే ఇబ్రహీం గాడి అకౌంటు లో ఉన్న అని నోట్ల పైన పాత ఆర్బిఐ గవర్నర్ సంతకం ఉంది " అని చెప్పాడు దాంతో అందరికీ అర్థం అయ్యింది చైనా వాళ్లు మన వేలు తో మన కను పొడిచేలా ప్లాన్ చేశారు అని దాంతో ఎటాక్ ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది దాంతో ప్రధాని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తనకు బ్యాచ్ మేట్ అని చంద్రిక చెప్పింది దాంతో రజాక్ తో సహా శేఖర్, చంద్రిక ఢిల్లీ వెళ్లారు.

ఢిల్లీ PMO లో సెక్యూరిటీ ఆఫీసర్ మన్సూర్ అలీ ఆఫీసు లోకి వాళ్లు వెళ్లారు అతను 5 నిమిషాలో వస్తాడు అని అక్కడ ఉన్న ఒక గార్డ్ చెప్పాడు దాంతో వాళ్లు వెయిట్ చేస్తున్నారు అప్పుడే మన్సూర్ అలీ లోపలికి వచ్చాడు అతని చూసి రజాక్ షాక్ అయ్యాడు అది శేఖర్ గమనించాడు చంద్రిక వెళ్లి అతని పలకరించింది అతను రజాక్ నీ చూసి కొంచెం కంగారు పడ్డాడు అప్పుడు అతను వచ్చి శేఖర్ కీ షేక్ హ్యాండ్ ఇచ్చి "మీ గురించి చాలా విన్నాను ఇండియన్ ష్రేలాక్ హోల్మస్" అన్నాడు అప్పుడు శేఖర్ వాడికి షేక్ హ్యాండ్ ఇస్తూ మన్సూర్ చేయి పట్టుకుని వెనకు విరిచి టేబుల్ పైకి తోసి వాడి మెడ పైన మోచేతి తో అదిమి పెట్టి "నువ్వు ఎవరినైన మోసం చేయవచ్చు నన్ను కాదు ఇక్బాల్ చౌదరి అలియాస్ గణేష్ సింగ్ చౌదరి " అని అన్నాడు శేఖర్ దాంతో అందరూ షాక్ అయ్యారు ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాద సంస్థ అధ్యక్షుడు యాసిర్ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్ట్ చేసిన తర్వాత వాడి ముఖ్య అనుచరుడు ఈ గణేష్ సింగ్ చౌదరి అలియాస్ ఇక్బాల్ చౌదరి వీడిని ఇండియన్ ఆర్మీ చంపినట్టు ప్రూఫ్ ఉంది కానీ ఎలా బ్రతికి ఉన్నాడు అనేది ఇంకా అర్థం కాలేదు దానికి ఇక్బాల్ నవ్వుతూ "మీ గవర్నమెంట్ కే నా బ్యాక్ గ్రౌండ్ verification లో నా గురించి తెలుసుకోలేక పోయింది నువ్వు ఎలా కనిపెట్టావు రా" అని అడిగాడు "ఇలా టాప్ నేషనల్ సెక్యూరిటీ లో రిక్రూట్మెంట్ చేసుకున్నే వాళ్ళకి దేవుడి చైన్ లు వేసుకున్నే పర్మీషన్ లేదు నువ్వు ఏకంగా నీ మెడ పైన నీ బాస్ యాసిర్ వేసిన మీ సంస్థ tattoo నీ దాచి పెట్టడం మరిచి పోయావు దాంతో పాటు నీ సోఫా టేబుల్ ముందు ఉన్న చెస్ బోర్డు లో ఆ రోజు నువ్వు పెట్టిన ఆర్డర్ లోనే నీ చెస్ కాయిన్స్ ఉన్నాయి రజాక్ నిన్ను చూసి భయపడాడు నువ్వు వాడిని చూసి దాంతో కన్ఫర్మేషన్ చేసుకున్నా " అన్నాడు అప్పుడు ఇక్బాల్ తన టేబుల్ కింద ఉన్న అలారం ప్రెస్ చేశాడు దాంతో సెక్యూరిటీ వాళ్లు వచ్చారు అప్పుడు శేఖర్ వాడిని వదిలేశాడు.

ఆ తర్వాత ఇక్బాల్ ఫైర్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు దాంతో శేఖర్, చంద్రిక ఇద్దరు టేబుల్ కిందకి దూరారు అప్పుడు రజాక్ నీ తీసుకోని ఇక్బాల్ వెళ్లిపోయాడు ఆ టేబుల్ కింద శేఖర్ కీ ఒక grems spray దొరికింది దాని చూస్తే అది 80% ఆల్కహాల్ అని ఉంది దాని గార్డ్స్ పైకి విసిరాడు దాంతో అది పేలి నిప్పులు వచ్చాయి అప్పుడు చంద్రిక తన దెగ్గర ఉన్న రెండు గన్స్ లో ఒక్కటి శేఖర్ కీ ఇచ్చింది "మనం వాళ్ళని చంపకుడదు వాళ్లు వాళ్ల డ్యూటీ చేస్తున్నారు జస్ట్ గాయపరచు" అని చెప్పాడు ఆ మంట రావడంతో తో గార్డ్స్ చెల్లాచెదురుగా పడ్డారు అప్పుడు చంద్రిక, శేఖర్ వాళ్ళని వదిలి అడ్డం వచ్చిన వాళ్ళని గాయపరిచి అక్కడి నుంచి తప్పించుకున్నారు ఆ టైమ్ లో ఇక్బాల్ రజాక్ నీ తనతో పాటు ప్రధాని ప్రైవేట్ ఫ్లయిట్ లో cargo లో పడేసి హైదరాబాద్ కీ వెళ్లాడు చంద్రిక, శేఖర్ ఇద్దరు ఇప్పుడు సెక్యూరిటీ అధికారి లిస్ట్ లో ఉన్నారు ప్రధాని ఆఫీసు పైన దాడి చేశారు అని దాంతో వాళ్ల కోసం హైవే, ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లలో పూర్తిగా సెక్యూరిటీ ఆఫీసర్లు వెతుకుతూ ఉన్నారు వాళ్లు ఒక హైవే లో టివి జనాలు లేని ఒక ఢాబా లో ఉన్నారు అప్పుడు ఎలా హైదరాబాద్ పోవాలి అని ఆలోచిస్తూ ఉండగా ఒక హెలికాప్టర్ వచ్చి ఆ పక్కన ఉన్న గ్రౌండ్ లో దిగింది దాంట్లో నుంచి సౌమ్య, దేవి ప్రసాద్ ఇద్దరు దిగారు "హైదరాబాద్ కీ లిఫ్ట్ కావాలా బావ" అని అడిగాడు దేవి ప్రసాద్ దాంతో శేఖర్ వాడిని గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ తర్వాత నలుగురు కలిసి హైదరాబాద్ కీ బయలుదేరారు.

హైదరాబాద్ చేరుకున్న తరువాత దేవి ప్రసాద్ శేఖర్ తో చెప్పాడు "బావ నేను మా కల్నల్ తో మాట్లాడా ఆయన ఆపరేషన్ కీ పర్మిట్ ఇచ్చారు అంతే కాకుండా సెలవుల మీద ఉన్న మా బెటాలియన్ లోని వాళ్లు మనకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మనం ఈ మిషన్ కచ్చితంగా పూర్తి చేస్తాం" అని చెప్పాడు దాంతో శేఖర్ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆ తర్వాత అందరూ యాక్టింగ్ కాలేజ్ కీ వెళ్లారు అక్కడ శేఖర్ ఆఫీసు లో అందరూ DRDO మ్యాప్ మొత్తం చూస్తున్నారు "హైదరాబాద్ లో మొత్తం మూడు రీసెర్చ్ సెంటర్ లు ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్లాల్సిన సెంటర్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ రిసెర్చ్ లేబొరేటరీస్ చంద్రయాన్ గుట్ట ఇక్కడ ఈ రిసెర్చ్ సెంటర్ కీ రెండు దారులు ఉన్నాయి ఒకటి 2km radius అవతల ఉన్న బస్తీ రోడ్డు ఇంకోటి మామూలు మెయిన్ రోడ్డు కాబట్టి రేపు టాస్క్ ఫోర్స్ తరుపున కృష్ణ సెక్యూరిటీ వింగ్ లో ఉంటాడు నేను, చంద్రిక, నీ బ్యాచ్ మేట్ లో కొంతమంది తో బస్తి రోడ్డు లో ఉంటాము నువ్వు మిగిలిన బ్యాచ్ మేట్ లతో మిలిటరీ డ్రస్ లో వాళ్లతో కలిసిపోయి లోపలికి రండి మీ మామ ఎలాగో లోపల నుంచి మనకు సిగ్నల్ ఇస్తాడు అప్పుడు మేము బ్యాక్ గేట్ నుంచి ఎంటర్ అవుతాం దానికి మీ మామ నీ ఒక access card మాకు వచ్చేలా చేయమని చెప్పు" అని ప్లాన్ పూస గుచ్చినటు చెప్పాడు శేఖర్, అప్పుడు కృష్ణ "లోపలికి వెళ్లడం ఇంత కష్టం ఉంటే మళ్లీ లోపాల ఎమైన తేడా వస్తే ఉద్యోగం సంగతి దేవుడికి ఎరుగు ముందు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ మిషన్ పూర్తి చేయాలి " అన్నాడు.

దాంతో ప్లాన్ కీ తగ్గట్లు అందరూ బయలుదేరారు దారిలో దేవి బ్యాచ్ మేట్ అందరూ కలిశారు కృష్ణ టాస్క్ ఫోర్స్ టీం లీడర్ గా వెళ్లాడు దాంతో ప్రధాని కీ దెగ్గర గా ఉండొచ్చు అని, ఇది ఇలా ఉంటే ఇక్బాల్ రజాక్ కీ కాలేజ్ యునిఫామ్ ఇచ్చి వేసుకో అన్నాడు ఆ తర్వాత తన గ్యాంగ్ లో ఉన్న టేర్రరిస్టలను బ్లాక్ కాట్స్ డ్రస్ లో రెడీ అవ్వమని చెప్పాడు దాంతో నిజమైన బ్లాక్ కాట్స్ వాళ్ళని మత్తు మందు ఇచ్చి పడుకోబెట్టారు ఆ తర్వాత తన గ్యాంగ్ లో కాలేజ్ బస్ డ్రైవర్ కీ టైమ్ కీ రమ్మని చెప్పి రజాక్ నీ వాడికి అప్పజేప్పాడు శేఖర్, చంద్రిక మిగిలిన మిలిటరీ ఆఫీసర్స్ అంతా కలిసి బస్తీ రోడ్డు లో ఉన్న అతి పెద్ద బిల్డింగ్స్ పైన sniper గన్స్ తో రెడీగా ఉన్నారు ఆ తర్వాత లోపల ఉన్న జావిద్ షరీఫ్ బ్యాక్ గేట్ దెగ్గర ఉన్న cctv నీ block చేసి డోర్ తెరిచి బబుల్ గమ్ తో access card అక్కడ అతికించి వెళ్లాడు ఆ శేఖర్ దెగ్గర ఉన్న టీం స్టాఫ్ క్వార్టర్స్ నుంచి ఏదో కార్ బ్యాక్ డోర్ వైపు వస్తుంది అని చూశారు అప్పుడు ఆ కార్ టైర్ కీ కాల్చి చూస్తే అందులో నుంచి కంగారు పడి కొంతమంది ఉగ్రవాదులు దిగారు దాంతో శేఖర్ ఆర్డర్ మీద వాళ్ళని కాల్చి చంపారు ఆ తర్వాత శేఖర్ లోపలికి వెళ్లడం మొదలు పెట్టాడు చంద్రిక నీ అక్కడే ఉండి చూసుకో అని చెప్పాడు, అప్పుడు ఒక కాలేజ్ బస్ లోపలికి వచ్చింది దాంట్లో రజాక్ నీ చూశాడు దేవి అప్పుడు తన టీం లో ఒక్కతనీ చూసి సైగ చేశాడు అప్పుడు అతను తన దగ్గర ఉన్న బుల్లెట్ నీ రజాక్ పాంట్ లో సీక్రెట్ గా వేశాడు దాంతో చెకింగ్ దెగ్గర అలారం మొగి రజాక్ నీ దేవి సైడ్ చేశారు.

అప్పుడు జావిద్ తన టెస్ట్ మొదలు పెట్టే టైమ్ కి ఒక బ్యాచ్ వెనుక డోర్ నుంచి లోపలికి వచ్చి ఎటాక్ చేయాలి కానీ ఎవరూ రావడం లేదు అని ఇక్బాల్ వెనకు వెళుతుంటే ఇక్బాల్ ఫోన్ నీ హక్ చేశారు బయట ఉన్న మిలిటరీ ఫోర్స్ వాళ్లు బయట ఉన్న బ్యాచ్ మెసేజ్ చేసినట్లు ఇక్బాల్ కీ చేశారు తమని సెక్యూరిటీ వాళ్లు పట్టుకున్నారు అని దాంతో కంగారుగా వెళ్లాడు వాడి వెనుక బ్లాక్ కాట్స్ లో ఉన్న ఉగ్రవాదులు కూడా వెళ్లారు అప్పుడు వాళ్లు ఆ డోర్ దగ్గరికి రాగానే శేఖర్ గన్ తో ఎదురు వచ్చాడు దాంతో ఇక్బాల్ నవ్వుతూ తన మనుషులకు ఫైర్ అని ఆర్డర్ వేశాడు కానీ అంతలోనే మిలిటరీ snipers వాళ్ళని కాల్చి చంపారు అప్పుడు ఇక్బాల్ షాక్ అయ్యాడు దాంతో శేఖర్ మీద విరుచుకుపడ్డాడు వాడి బలం ముందు శేఖర్ బలం చాల లేదు దాంతో శేఖర్ నీ కొట్టి లోపలికి వెళ్ళాడు "సార్ మన మీద ఎటాక్ జరుగుతుంది వెళ్లాలి" అని అన్నాడు ఇక్బాల్ అప్పుడు ప్రధాని తన చేతిలో ఉన్న ఫోన్ చూపించాడు అందులో శేఖర్ మొన్న జావిద్ ఇంట్లో తీసిన వీడియో మరి రజాక్ షర్ట్ బటన్ లో ఉన్న కెమెరా తో వాడు రాజ్ భవన్ లో మాట్లడింది హోటల్ రూమ్ లో వాడు చేసిన ప్లాన్ అంతా డీటేల్ గా న్యూస్ లో వస్తుంది (ఒక వేళ తనకు ఏమైనా అవుతుంది అని ముందు సౌమ్యా కీ ఆ ఎవిడెన్స్ పంపి పది గంటలకు అని న్యూస్ ఛానల్ లో ప్రసారం అయ్యేలా చేశాడు శేఖర్) అది చూసి కోపం కట్టలు తెంచుకొని ఇక్బాల్ పక్కనే ఉన్న కృష్ణ గన్ తో కృష్ణ నీ కాల్చి ప్రధాని పైన గన్ పెట్టాడు.

అలా తప్పించుకోని వెళ్లాలి అని చూస్తుంటే గాలి లో ఒక పేక ముక్క ఎగురుతు వచ్చి ఇక్బాల్ మెడ పైన తెగింది అదే ముక్క తిరిగి వెళ్లి శేఖర్ చేతిలో ఆగింది (చిన్నప్పుడు గుణ మ్యాజిక్ నేర్చుకునే వాడు అప్పుడు వాడి బెస్ట్ టెక్నిక్ ఇలా పేక ముక్క నీ boomerang లాగా వాడడం అది నేర్చుకున్న శేఖర్ ఇప్పుడు ఆ పేక ముక్క కీ బ్లేడ్ అతికించి ఇక్బాల్ మీదకు వదిలాడు) తన మెడ తెగిన నొప్పి తో ప్రధాని నీ వదిలాడు ఇక్బాల్ అప్పుడు కృష్ణ లేచి తన షూ లో ఉన్న ఇంకో గన్ తో ఇక్బాల్ నీ కాల్చాడు అప్పుడే దేవి కూడా తన టీం తో వచ్చి ఫైర్ చేశారు (వాడు ఇలా చేస్తాడు అని expect చేసిన శేఖర్ థామస్ తో ఒక డమ్మి గన్స్ తెప్పించి దాని కృష్ణ టీం లో అందరికీ ఇప్పించారు) అలా ఫైనల్ టచ్ లో శేఖర్ తన పేక ముక్క నీ ఇక్బాల్ గొంతు మీదకి వదిలాడు అలా వాడు అక్కడే చచ్చాడు.

ఇక్బాల్ చనిపోయిన తరువాత తన ప్రాణాలు సిటీ నీ కాపాడినందుకు ప్రధాని శేఖర్ నీ అభినందిస్తుంటే శేఖర్ ఇది తన ఒక్కడి గెలుపు కాదు మొత్తం మా టీం గెలుపు అని చెప్పాడు, దాంతో ప్రధాని వాళ్లను అందరినీ కలిపి జనవరి 26 కీ వాళ్ల ధైర్యం కీ మెచ్చి మెడల్స్ ఇచ్చారు దాంతో పాటు శేఖర్ కీ RAW తరుపున ఉద్యోగం ఇచ్చారు కానీ శేఖర్ మాత్రం ఆ ఉద్యోగం వదులుకున్నాడు తనకు ఇలా ఫ్రీ గా ఎవరి అధికారం లేకుండా పని చేయడం ఇష్టం అని చెప్పి తనకు ఇంటర్నేషనల్ లైసెన్స్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత రజాక్ కీ DRDO లోనే జూనియర్ సైంటిస్ట్ ఉద్యోగం దాంతో పాటు తను చదువుకొడానికి స్కాలర్షిప్ అని ఇచ్చారు అలా అందరూ హ్యాపీ అయ్యారు.

ఇది అంత జరిగిన తరువాత ఒక రోజు చంద్రిక వచ్చి శేఖర్ నీ తనను పెళ్లి చేసుకో అని చెప్పింది దాంతో శేఖర్ ఏదో చెప్పబోతే చంద్రిక అతని నోరు మూసి "నాకూ అంతా తెలుసు నువ్వు కాలేజ్ తరువాత కాలేజీ లో అమెరికా లో నువ్వు నడిపిన రాసలీలు అని తెలుసుకున్న దాంతో పాటు చందన కీ జరిగిన దానికి నువ్వు తనకు ఇన్ని రోజులు తోడుగా ఉండి ఎందుకు వదిలేశావు అని ఆలోచిస్తుంటే నీకు వచ్చే రిస్క్ వల్ల వాళ్లు ఎక్కడ బాధపడతారు అని వాళ్ళని దూరం పెట్టావు మామూలుగా నీ గురించి తెలుసుకున్న ఏ అమ్మాయి అయిన చీ అని వదిలేసి వెళుతుంది కానీ నీ మీద నాకూ కోపం కూడా రావడం లేదు ఎందుకు అంటావ్ ఒక వేళ unconditional లవ్ అంటే ఇదే అనుకుంట మన ప్రేమ నీ గాలిపటం లా ఎంత స్వేచ్ఛగా వదిలితే అంతే తొందరగా మన దగ్గరికి వస్తుంది అలాగే మనం ప్రేమించిన వ్యక్తి కీ మన ప్రేమలో నిజాయితీ స్వేచ్ఛ ఇవ్వగలీగీతే అదే ప్రేమ కీ ఇచ్చిన గౌరవం నాకూ నీతో ఏమీ ప్రాబ్లమ్ లేదు నువ్వు మారుతావు అన్న నమ్మకం కూడా నాకూ లేదు కానీ నువ్వే కావాలి మొదటి ప్రేమ తీపి జ్ఞాపకం గా దాచుకొవాలీ అనుకున్న కానీ నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నిన్నే నాలో దాచుకుంటా" అని చెప్పి శేఖర్ మొహం తన అర చేతిలో తీసుకోని పెదవి పైన ముద్దు పెట్టింది, ఆ తర్వాత శేఖర్ చంద్రిక కళ్లలో చూస్తూ "రుక్మిణి కృష్ణుడు తో పెళ్ళి అయ్యే వరకు చూడలేదు అంట తన గురించి విని మాత్రమే ప్రేమించింది అది ఒక్కప్పటి unconditional లవ్ ఇప్పుడు అదే నీలో చూశాను ఇక నుంచి నా సంతోషం కోసం బ్రతికా నేను ప్రేమించిన అమ్మాయి లు అంత జ్ఞాపకం గా మిగిలితే నువ్వు గుండె మీద అచ్చు అయ్యావు ఇప్పటి నుంచి మన సంతోషం కోసం నీతో కలిసి ఉంటా "అని చెప్పాడు శేఖర్.

అంత విన్న చంద్రిక "ఇలా స్వీట్ గా మాట్లాడితే ఏ అమ్మాయి అయిన పడిపోతుంది నువ్వు మాట మాంత్రికుడివి " అని చెప్పింది దాంతో శేఖర్ తనను ఇంకా దగ్గరి గా లాగి "తెలియనిది చెప్పు " అని చెప్పి తన నడుము మీద కితకితలు పెట్టాడు అలా చంద్రిక నవ్వుతూ శేఖర్ ఒడిలో వాలిపోయింది అప్పుడే న్యూస్ లో ఇక్బాల్ బాస్ నూర్ మహ్మద్ అలీ ఖాన్ నీ ఇండియన్ స్పెషల్ ఫోర్స్ వాళ్లు దేవి ప్రసాద్ నాయకత్వం లో చంపారు అని వచ్చింది దాంతో ఇద్దరు తమ 1st కేసు డబల్ హిట్ అయ్యింది అని ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్నారు, అలా చంద్రిక ఫ్యామిలీ నీ ఒప్పించి తన తండ్రి నీ ఒప్పించి చంద్రిక నీ పెళ్ళి చేసుకున్నాడు మొత్తానికి కూతురు పెళ్లి అయింది అని చంద్రిక అమ్మ నాన్న ఆనందం లో ఉంటే కొడుకు కాకపోయినా కోడలు ఐపిఎస్ అని శేఖర్ వాళ్ల నాన్న సంతోషం తో తను పెళ్లి చేసుకోవాలి అనుకున్న పిల్ల నీ శేఖర్ చేసుకుంటే కృష్ణ కీ ఎక్కడో మంట గా ఉంది.

(3 రోజుల తరువాత శేఖర్ ఫస్ట్ నైట్ రోజు)

చంద్రిక కోసం ఎదురుచూస్తున్నాడు శేఖర్ బెడ్ మీద కూర్చుని అప్పుడే చంద్రిక లోపలికి పాల గ్లాస్ తో వచ్చింది అలా తను సిగ్గు పడుతూ వచ్చి బెడ్ మీద కూర్చుంది అలా ఇద్దరు పాలు చెరిసగం తాగి ఇంక షో మొదలు పెట్టాలి అనుకున్న టైమ్ లో ఎవడో ఫోన్ చేశాడు చూస్తే కృష్ణ "నీ అబ్బ ఏంటి రా ఈ టైమ్ లో disturbance" అని చిరాకుగా అన్నాడు శేఖర్ దానికి "ప్రధాన మంత్రి ఆఫీసు నుంచి ఫోన్ రా నిన్ను కాన్ఫరెన్స్ లో పెట్టమన్నారు" అని చెప్పాడు దాంతో శేఖర్, చంద్రిక ఇద్దరు స్పీకర్ ఫోన్ పెట్టి వింటున్నారు అప్పుడు ప్రధాని "శేఖర్ నీ గురించి విన్న ఇంగ్లండ్ మహారాణి ఒక కేసు విషయంలో నీ సహాయం కోరింది కాబట్టి నువ్వు రేపు ఉదయం నీ భార్య తో నీ ఫ్రెండ్ తో కలిసి లండన్ వెళ్లుతున్నావ్ స్పెషల్ ఫ్లయిట్ దాంతో పాటు హ్యాపీ మ్యారిడ్ లైఫ్" అన్నాడు దాంతో శేఖర్, చంద్రిక తో "ఫస్ట్ నైట్ ఫ్లయిట్ లో ట్రై చెదాం పోయి లగేజ్ సర్దు " అన్నాడు దానికి చంద్రిక సిగ్గు పడుతూ వెళ్లింది.

లండన్ నుంచి పిలుపు వచ్చింది అంటే ఇది ఏదో చాలా పెద్ద ఛాలెంజింగ్ కేసు అవుతుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు శేఖర్,ఏది అయితే ఏంటి మొదటి ఇంటర్నేషనల్ కేసు దుమ్ము లేపాలి అని డిసైడ్ అయ్యాడు శేఖర్.​
Previous page: Update 03