Update 01

ముందుగా FLAMES గేం ఏంటీ అన్నది కొంచెం మీకు చెప్పాలీ అనుకుంటున్నా!

F*L*A*M*E*S

F – Friendship

L – Love

A – Affection

M – Marriage

E – Enemy

S - Sibling

చిన్నప్పుడు మీరందరూ ఈ ఆట ఆడే ఉండి ఉంటారు! ఇదేమీ పెద్ద తోప్ గేం కాదులెండి! జరగాలీ అన్న రూల్ కూడా లేదు! కానీ నా విషయంలో కొంత వరకూ జరిగింది లెండి! ఇదేమీ పెద్ద గొప్ప ఆట కాదు! జస్ట్ టైం పాస్ కోసం అన్నమాట! ఎవరైనా శింబు-జ్యోతిక నటించిన మన్మథ సినిమా చూశారా? అందులో చక్కగా వివరించబడిందీ ఆట! ఆ యూట్యూబ్ లింకు మీకోసం ఇక్కడ వేస్తున్నా!

ఇంతకీ ఈ ఆటకీ ఈ కథకీ సంబంధమేంటా అనుకుంటున్నారా? ఉంది ఉంది! ఇందులో రెండు పేర్ల మధ్యన ఆరు రకాల కంపాటబిలిటీ ఇవ్వబడింది! ఒక మగవాడి పేరుతో ఒక్కో రకమైన కంపాటబిలిటీ ఉన్న ఆరుగురు స్త్రీలు వాడినెట్లా ఆడుకున్నారన్నదే ఈ సాహసయాత్రల సారాంశం!

అక్షరానికో సాహస యాత్ర చప్పున ఆరుగురు ఆడవాళ్లు వాడినెట్లా ఫుట్బాల్ ఆడుకున్నారో, వాళ్లనుంచి వాడు తననెట్లా బచాయించుకున్నాడో ఆరు కథలుగా మీకు చెప్పబోతున్నాను! ఇంతవరకూ ఎవరూ టచ్ చెయ్యని సబ్జెక్ట్ కదా అని మొదలెడుతున్నా!

అక్షరానికో భాగం చప్పున ఆరు కథలు ఉంటాయి ఈ FLAMESలో!
Next page: Update 02