Update 46

సామిర్ మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళేసరికి సుజాత రోడ్డుకి అటు ప్రక్కన నించొని అతనిని కన్పించింది.

సామిర్ వెళ్ళి ఆమె ముందర బైక్ ఆపాడు. ఆమె ఓసారి అటు ఇటు చూసి అతని వెనకాల ఎక్కి కూర్చుంది; అటో కాలు, ఇటో కాలు వేసుకునే!

ఆమె చేతులు ముడిపడి వున్నాయి. నిన్నటి రాత్రి నుంచీ సామిర్ తో కలిసి ఏకాంతంగా గడపడం గురించి ఎంతగానో ఆరాటపడినా, సరిగ్గా ఆ సమయం వచ్చేసరికి ఏ విధంగా స్పందించాలో తోచడం లేదామెకు. అటు సామిర్ కి ఆమె తలదించుకుని ఏమి ఆలోచిస్తుందా అనిపించింది.

దాంతో, తమ మధ్యన నిశ్శబ్దానికి తెరదించుతూ —

"ఇవ్వాళ నన్ను పట్టుకోలేదేఁ!?" అనడిగాడామెను.

సుజాత తన ఆలోచనల్లోంచి బైటపడి మెల్లిగా తన చేతులని ముడి నుంచి తప్పించి ఒక చేతిని అతని భుజం మీద వేసి పట్టుకుంది.

"అంతేనా!" అన్నాడతను. ఆతని మాటలో ఒకింత నిరాశ ధ్వనించడంతో ముందురోజున అతని వీపుకి తన ముందరి అందాలను అదమటం చప్పున జ్ఞప్తికి వచ్చి సిగ్గులమొగ్గయింది సుజాత. బహుశా ఆ సిగ్గు తెర కరగాలంటే మరలా బైక్ తో చిన్నగా ఓ కుదుపు పడాలేమో!

అయితే, సామిర్ ఈమారు ఎలాంటి కుదుపులూ గట్రా లేకుండా తన బైక్ ని నిదానంగా, సాఫీగా నడుపుకు పోతున్నాడు. అతనెటు తీసుకెళ్తున్నాడో కూడా ఆమె గమనించట్లేదు. అలా కొంచెం దూరం వెళ్ళాక బైక్ ని ఓ మలుపులోకి తిప్పుతూ, "నిన్నిప్పుడు ఓ చోటుకి తీసుకెళ్తాను," అన్నాడతను.

సుజాత చప్పున తలెత్తి చుట్టూ చూస్తూ, "ఎక్కడికీ?" కంగారుగా అంది.

"సర్ప్రైజ్! నువ్వే చూస్తావుగా...—"

సుజాతకి గుటకపడింది. టెన్షన్ పడుతూ తనకి తెలియకుండానే అతని భుజాన్ని గట్టిగా నొక్కేస్తూ, "ఆలస్యమైతే అమ్మ—" అంటోండగా "—అప్పుడు ఏదో ఒకటి ఆలోచిద్దాం లేఁ... యూ డోన్ట్ వర్రీ, నేనున్నానుగా!" భరోసా ఇచ్చాడతను. ఆమె నించి 'వద్దు', 'వెనక్కి వెళ్ళిపోదాం' అన్న మాటలు రాకపోవడం అతనికి సంతోషంగా అన్పించింది. అయితే, అతని అభయం ఆమెలో కలవరాన్ని పెద్ద తగ్గించినట్లు లేదు. ఆమె కళ్ళలో భయం తొణికిసలాడుతూ వుంది.

ఈలోగా ఏదో చౌరాస్తా దగ్గరకి వచ్చారు వారు. బైక్ ని ఓ పాన్ షాప్ దగ్గర పార్క్ చేసి ప్రక్కనే వున్న లాడ్జి వైపు నడచాడు. సుజాత కూడా బైక్ దిగి అతన్ని అనుసరించింది.

ఆమెను బయటే ఆగమని చెప్పి సామిర్ లాడ్జి లోపలికి వెళ్ళి, రిసెప్షన్ దగ్గర కూర్చుని వున్న మనిషితో—

"రమణ పంపాడు!" అని అన్నాడు.

అ మనిషికి రమారమి గా పాతికేళ్ళుంటాయి. సామిర్ ని ఒకసారి ఎగాదిగా చూసి తలత్రిప్పి బైటకి చూశాడు. రసాలుగారే రకరకాల పండ్ల గుత్తులు కలబోసినట్లు కనిపిస్తున్న సుజాతను చూస్తూ అలా క్షణంసేపు ఉండిపోయాడు వాడు. సామిర్ అది గమనించి అసహనంగా వాడి ముందరున్న బల్లని చరుస్తూ, "ర-మ-ణ పం-పిం-చా-డు" అన్నాడు స్పష్టంగా ఒక్కోమాటనీ వత్తి పలుకుతూ.

ఐనా, తన దృష్టిని మరల్చక చొంగ కార్చుకుంటూనే సొరుగులోంచి ఒక తాళం చెవిని తీసి ఇచ్చాడు వాడు.

సామిర్ దాన్ని తీసుకుంటుండగా, "ఎన్ని గంటలు ఉంటారు?" అడిగాడు వాడు.

బదులిచ్చే ముందు ఒమాటు వాడ్ని చురచురా చూసి, "రెండు గంటలు," అన్నాడు సామిర్.

వాడు చూపు తిప్పకుండా, "రెండు గంటలకి ఐదొందలు!" అన్నాడు.

"అదేంటీ... రమణ రూమ్ మాటాడానన్నాడు!"

"ఔను. రూమేఁ మాటాడాడు. కిరాయి గాదు! నీక్కావాలా వద్దా...?" అన్నాడు వాడు. సామిర్ తో మాట్లాడుతూ వున్నా వాడి కళ్ళు ఇంకా సుజాతని ఆకలిగా చూస్తున్నాయ్.

చిరాగ్గా వాడి వంక చూస్తూ తన వాలెట్ తీసి ఒకటి కాదు, రెండు ఐదు వందల నోట్లు తీసి టేబిల్ మీద పెట్టాడు. అంతే, కీ ఇచ్చిన బొమ్మలా గిరుక్కున వాడి తల సామిర్ వైపు తిరిగింది‌‌. వాడి మొహంలోకి చూస్తూ, "ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు!" అన్నాడు సామిర్ కరుగ్గా.

వాడు ఆ నోట్లని అందుకుని పళ్లికిలిస్తూ 'ఓకే సార్' అంటూ సామిర్ కి సెల్యూట్ చేశాడు.

సామిర్ సుజాత దగ్గరికి వచ్చి తమకి కేటాయించిన గదిలోకి ఆమెను తీసుకెళ్ళాడు.

గది నెంబరు నూటా ఐదు.

ఆ గది గురించి వర్ణించేటంత ప్రత్యేకతలు ఏమీ లేవు. చాలా సాదాసీదాగా ఉంది. లోపలికి వెళ్ళఁగానే అక్కడి దుప్పట్లు, డోర్ కర్టెన్ల ముతక వాసన వారి ముక్కుపుటాలను తాకింది. సింగిల్ కాట్ బెడ్, దాని మీద పరిచిన దుప్పటి నలిగి వుంది (అంతకుముందు ఎవరో దానిపై పొర్లినట్లు). ఇక సీలింగ్ ఫ్యాను అయితే తిరగాలా వద్దా అని మొహమాటం పడుతున్నట్లు ఉంది.

అయితే, ఇప్పుడవన్నీ పట్టించుకునే పరిస్థితి కాదు సామిర్ ది. తనతో పాటు వున్న అపురూప సౌందర్యరాశి మీదనే అతని దృష్టి అంతా వుంది.

చప్పున ఆమె వైపు తిరిగాడు. సుజాత తనను తాను చేతులతో చుట్టుకొని నల్లని గోళీల వంటి తన కళ్ళని బిడియంగా అటు ఇటు తిప్పుతూ ఆ గదిని పరికిస్తోంది.

"సుజాతా..." అని అని పిలిచాడతను. తుళ్ళిపడి వెంటనే అతనివైపు చూసిందామె.

"ఇలా రా!" జీరగా సాగిన ఆతని మాటకి తన వొంటిలో మత్తు అవహించినట్లు అన్పించిందామెకు.

అయిస్కాంతంలాంటి అతని కళ్ళు తనకు కళ్లెమేసి లాగుతున్నట్లు అన్పించి అరేబియన్ ఆడ గుర్రంలా అతని వద్దకి అడుగులేయ సాగిందామె.

సామిర్ ఆపాదమస్తకం అమెను పరీక్షగా చూస్తున్నాడు. అబ్బా! సుజాత సొగసు ముందు ఆ కోహినూర్ వజ్రం కూడా దిగదుడుపే. ఆ యౌవన సౌరభాన్ని ఆఘ్రానించే అవకాశం రావటం నిజంగా తన అదృష్టం. తెల్లగా, మిరుమిట్లు గొల్పే శరీర ఛాయ, మచ్చలేని ముఖ వర్చస్సు, శంఖంలాంటి పొడవైన కంఠం, ఆ క్రింద ఠీవిగా నిలబడిన వురోజాలు, ఆ బరువుని మోయలేక బక్క చిక్కిపోయి, ఇరు ప్రక్కలా వంపులు తిరిగి, సన్నని మెరుపు తీగలా అన్పిస్తోన్న నడుము, ఆమె నడకకి అనుగుణంగా వెనుక వయ్యారంగా వూగేటి నితంబాలు... ఉష్!!! ఊహించుకుంటేనే చేతులు దురదపెట్టేస్తున్నాయి. అమాంతం దొరకబుచ్చుకుని కసిగా ఆమెను పిసికెయ్యాలని కోరిక పుడుతోంది. ఇక కండపట్టిన అమె ముందరి స్తంభాలు కలిసే చోటున ఇప్పటి వరకు ఎవరూ ఈదులాడని తటాకంలో మునకలేసేందుకు అతని జంభం తెగ ఉబలాటపడుతోంది.

ఆమె అడుగులో అడుగేసుకుంటూ తన దగ్గరికి వచ్చేంతవరకు ఆగలేకపోయాడు సామిర్. రెండు అంగల్లో గబగబా ఆమెను సమీపించాడు.

అతని వేగానికి ఆమె అదిరిపడి రెండడుగులు వెనక్కి వేయడంతో వెనుక మూసిన తలుపు ఆమెకు 'ఠాక్'మని తగిలింది.

సామిర్ మరొక అడుగు వేసి ఆమె ముందుకి వచ్చి నిలిచాడు. ఇప్పుడు ఒకరి శ్వాస మరొకరిని వెచ్చగా తాకుతున్నది.

సుజాత యద చప్పుడు క్రమంగా తారాస్థాయికి చేరుతోంది. ఆమె ముఖం మీద చిరు చెమటలు ఏర్పడి ముత్యంలా మెరుస్తున్నాయి. 'ఉఫ్'మంటూ ఆమె ముఖం మీద చల్లని గాలిని ఊదాడతను. 'ఇస్స్....' తన్మయత్వంలో కళ్ళు అరమూతలు పడ్డాయి ఆమెకు. పాపిట నించి విడువడి ఆమె ముఖం మీదకి జారిన ముంగురులను సామిర్ తన వ్రేళ్ళతో ఆమె చెవి వెనుకకి నెట్టుతూ బ్రొటనవేలితో ఆమె చెవి తమ్మెను తాకాడు. ఆమె ఊపిరి సెగలు కక్కుతుంటే యద బరువెక్కి ఒక్కసారి పైకెగిసింది.

సామిర్ సన్నగా నవ్వుతూ తన చేతిని మెల్లిగా ఆమె మెడమీదకి తెచ్చి మునివ్రేళ్ళతో సుతారంగా మీటాడు. చక్కిలిగిలిగా అన్పించి సన్నగా కంపిస్తూ తలని ఒక ప్రక్కకి వాల్చిందామె. సామిర్ కాస్త ముందుకి వంగి ఆమె మెడ వంపులో తన పెదవులతో చిన్న దస్ఖతు చేశాడు.

'స్స్...' ఆమె నోటివెంట ఒక సన్నని మూల్గు వెలువడింది. సామిర్ లో ఉద్రేకం మరో గడిని చేరింది. ఆమె వక్షోజాలను కప్పిన చేతులని తన చేతులతో పట్టుకుని విడదీశాడు.

ఎగసిపడుతున్న సుజాత రొమ్ములను చూడగానే తనకు మరింత దగ్గరవ్వడానికి అవి తొందర పడుతున్నట్లు అన్పించిందతనికి.

ఇక అట్టే ఉపేక్షించలేక ఆమె మీదకి పూర్తిగా వాలిపోయాడు. 'హ్మ్... ష్ష్...' అతని బలమైన ఛాతీ తాకిడికి ఆమె బంగారు బంతులు నొక్కుడుపడి శ్వాస తీసుకోవడం భారమయ్యందామెకు. గమ్మత్తయిన గిలి ఆమె ముందరి భాగమంతా వ్యాపించ సాగింది. ఆమె స్తనాల మెత్తదనాన్ని ఆస్వాదిస్తూ ఆమెను మరింతగా దగ్గరికి లాక్కున్నాడు సామిర్.

ఏదో మత్తు ఆవహించినట్లు అయ్యి ఆమె కళ్ళు పూర్తిగా వాలిపోయాయి. ఊపిరిని బుసలు కొట్టినట్లు నోటి నుంచి వదలసాగిందామె. సామిర్ చప్పున ఆమె తలని పట్టుకుని సన్నగా వణుకుతూ వున్న ఆమె దొండ పెదవులను తన పెదవులతో కప్పేశాడు.

'ఇస్స్' తొలిసారి అధర చుంబనాన్ని చవిచూస్తున్న సుజాత మోహ పరవశానికి లోనయింది. అతని వొంట్లోంచి వస్తున్న అత్తరు సుగంధం ఆమెను నిలువనీయడం లేదు. ఆమె తన చేతులని అతని భుజం చుట్టూ వేసి పట్టుకుంది. అటు సామిర్ లో ఉద్రేకం క్రమంగా అధికమవుతోంది. అతని కళ్ళలో మెల్లగా ఎర్ర జీరాలు ఏర్పడుతున్నాయి. ఆమె పెదవులలోని అమృతాన్ని గ్రోలుతూ నెమ్మదిగా తన చేతులని క్రిందకి దించి ఆమె వెనకెత్తుల వైపు పాకించాడు. మరోవైపు పేంట్లో బిరుసెక్కి నిటారుగా నిలబడిపోయిన అతని దడ్డు ఆమె పొత్తి కడుపు మీద వెచ్చగా పరుచుకుపోతుంటే ఆమెకూ లోపల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.

సామిర్ ఆమె మెత్తని ముద్దలను ఓమారు తన చేతులతో గట్టిగా పిసికాడు. సుజాతకి ఒళ్ళంతా జివ్వుమంటు కరెంట్ పాసయినట్లు అయ్యి ఎగిరిపడింది. ఆమెకు కంతలో ఏదో తియ్యని మంట రేగింది.

వెంటనే అతని భుజాన్ని పట్టుకున్న తన చేతులతో అతన్ని ఒక్కసారి వెనక్కి నెట్టి కళ్ళని పెద్దవి చేస్తూ, "ఎ-ఎ-ఏం-చేస్తున్నా-వ్ సామిర్!" కాస్త జీరాడుతున్న స్వరంతో అన్నది. యుక్త వయసులోని కలిగే సహజమైన తపనకి క్షణకాలం వివసురాలయిన సుజాతకి నెమ్మదిగా మబ్బులు వీడుతున్నాయి.

ఇక సామిర్ మాత్రం బాగా వేడెక్కిపోయాడు. మరలా అమెను చుట్టేయడానికి చేతులు చాపుతూ, "ఏం చెయ్యడానికి వచ్చామో అదే చేస్తున్నాం కదా... !" అంటూ ఆమెను సమీపించబోయాడు. ఐతే, సుజాత తన చేతిని అడ్డు పెట్టి అతన్ని ఆపుతూ, "ల్లేదు... నేను దీని కోసం రాలేదు," అంది.

"అదేం.. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావ్ కదా!"

"నువ్వంటే... నాకిష్టమే! కానీ—"

"ఏంటి కానీ, ఇష్టమైనప్పుడు— అసలు నీకు ఇంకా ప్రాబ్లం ఏమిటి?" అతనిలోని మృగం మెల్లగా ఒళ్ళు విరుచుకుంటున్నది.

"పెళ్ళికి ముందు ఇలా కమిట్ అవ్వడం నాకు ఇష్టం లేదు!" అంది సుజాత‌.

సామిర్ కి కోపం కట్టలు తెంచుకుంటోంది. "అంటే... న్-నా మీద న-నమ్మకం లేదా, నిన్ను... మ్-మోసం చేస్తా ననుకుంటున్నావా?" అంటూ గట్టిగా అరిచాడు.

సుజాతకి ఏం చెప్పాలో తోచలేదు. ఆమె కూడా 'నిజంగా... నాకు నమ్మకం ఉందా?' అని తనను తాను ప్రశ్నించుకుంది. ఐతే, ఏ సమాధానం ఆమెకు దొరకలేదు. ఆమె ఆలోచనల్లో ఉండగా సామిర్ అసహనంగా ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఆమెను ఊపుతూ, "ఏమాలోచిస్తున్నావ్ నువ్వు?" అన్నాడు.

సుజాత అతన్ని ఓసారి చూసి, "న్-నేను ఇ-ఇంటికి వెళ్ళాలి" అంటూ తలుపు వైపు తిరగబోయింది. సామిర్ లో ఆవేశం కట్టలు తెంచుకుంది. "లేదు... ఆగు—!" అంటూ ఆమెను చేతిని విడువకుండా ఆపడానికి ప్రయత్నించాడు. అతని కళ్ళు నిప్పు కణికల్లా మారిపోతున్నాయి. సుజాత అతని పట్టుని విడిపించుకోవడానికి తన చేతిని బలంగా విదిలించింది. ఆ ప్రయత్నంలో అది అనుకోకుండా సామిర్ చెవి దగ్గర గట్టిగా తగిలింది.

గూబ గుయ్యిమందతనికి!

ఒక్క క్షణం కళ్ళు బయిర్లు కమ్మినట్లు అయ్యి దెబ్బకి దెయ్యం దిబ్బ నెక్కేసిందతనికి. చప్పున ఆమె చేతిని వదిలేసాడు. తలని ఓసారి గట్టిగా విదిలిస్తూ చెవులని వేళ్ళతో ఓసారి కెలుక్కున్నాడు. అనుకోకుండా జరిగినదానికి చకితుఁరాలైన సుజాత కొయ్యలా నిలబడి సామిర్ నే చూస్తోంది.

కాసేపటికి మామూలు అయ్యిన తర్వాత తలెత్తి ఆమె వంక కోపంగా చూసాడు సామిర్. ఒక్క క్షణం ఆమెను బలవంతం చెయ్యాలనే తలపు వచ్చినా వెంటనే తమాయించుకుని విసురుగా ఆమెను ప్రక్కకి నెట్టేసి తలుపులు తెరుచుకొని బయటకి వెళ్ళిపోయాడు.

సుజాత కూడా వెంటనే అతన్ని అనుసరిస్తూ వడివడిగా బయటకి వచ్చేసింది.

సామిర్ బైక్ స్టార్ట్ చేశాడు. అతని మొహమ్మీద ఆమె చెయ్యి తగిలిన చోట కందిపోయి వుంది. అతని తెల్లని చర్మం మీద ఎర్రని ముద్ర స్పష్టంగా కనపడుతోంది. సుజాతకి కొంచెం భయం వేసింది అతన్ని అలా చూడగానే. గుటకలు మ్రింగుతూ అలా నించుండి పోయింది.

"వచ్చి ఎక్కు... నిన్ను తీసుకెళ్ళి ఊర్లో పడేస్తాను," గుర్రుగా ఆమెను చూస్తూ అన్నాడు సామిర్.

మౌనంగా అతని వద్దకు వచ్చి రెండు ప్రక్కలా కాళ్ళను వేసి ఎక్కబోతుండగా, "ఒక వైపే కూర్చో! రెండువైపులా వేసి నా వెనక కూర్చునే అర్హత లేదు నీకు!" ఉరిమాడు సామిర్. అంతే, బెదురుగా అతన్ని చూస్తూ అతనికి తగలనంత దూరంగా ఒక ప్రక్కకి కూర్చుందామె.

త్రోవలో ఇద్దరి మధ్యనున్న దూరము తరగలేదు, మౌనం కరిగి సంభాషణ జరుగలేదు.

ఊరి పొలిమేరల్లోకి రాగానే సామిర్ బైక్ ఆపి ఆమెను దిగమన్నాడు. ఆమె దిగగానే, "నాలాంటివాడితో కలిసి ఊర్లోకి వెళ్తే నీకు ఇజ్జత్ బరబాత్ ఔతుంది కదా. ఇక్కణ్ణుంచి నడుచుకుంటూ వెళ్ళు!" అనేసి అతను మరో మాటకి అవకాశమివ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

దాంతో, సుజాత ఉస్సూరుమంటూ మొహాన్ని వేలాడేసుకుంటూ ఎండలో అక్కడి నుంచి రెండు మైళ్ళు నడిచి తన యింటిని చేరింది. ఆమె మనసు నిండా ఒక్కటే చింత — 'సామిర్ (మనసు)ని గాయపరిచానే' అని.!

వాణీ, తన స్నేహితురాలు రమ ఇద్దరూ కాలేజ్ నుంచి బయల్దేరి తమ ఇళ్ళకి తిరిగొస్తున్నారు.

"వాణీ, నీ దగ్గర లాగు (logarithms) పుస్తకం ఉంది కదా?ఒక్కసారి నాకు ఇస్తావా? రేపు మళ్ళా ఇచ్చేత్తాను. నా 'లాగు' మా అన్నయ్య తీస్కున్నాడు—"

రమ అన్న మాటలో మరో అర్ధాన్ని తీసుకున్న వాణీ ముసిముసిగా నవ్వుతూ, "అదేమిటే! మీ అన్నయ్యా నువ్వూ ఒకే 'లా...గు' వాడుతున్నారా!?"అంది వెటకారంగా.

వాణీ లాగి వదిలిన విధానానికి రమకి ఆ 'లాగు'డులోని మతలబు బోధపడి తను పలికిన మాటలోని తప్పిదానికి నాలిక్కరుచుకొని తన స్నేహితురాలి వంక గుడ్లురిమి చూసింది. అయితే, వాణీకి రమని అలా చూసేసరికి నవ్వాగలేదు. పకపకా నవ్వేసింది. వాణీ నవ్వు ఒక భయంకరమైన వైరస్ లాంటిది. ఎదుటివాళ్ళకి ఇట్టే వ్యాపించేస్తుంది. రమ పెదాలపై కూడా నవ్వులు విరిశాయి. అయినా, కళ్ళతో మింగేసేలా చూస్తూ — "ఒసేవ్... వెధవ మాటలు ఆడావంటే సంపేహెత్తాను. నాదగ్గర మా అన్నయ్య పుస్తకం వుండేదే. మనకి చాప్టర్ పడింది కదాని అప్పుడు వాడి దగ్గర తీస్కున్నాను. యిప్పుడు వాడు ఐఐటీ-జేఈఈ ఎగ్జామ్స్ కి ప్రిపర్ అవుతున్నాడూ, అందుకని మళ్ళా నాదగ్గర నుంచి తీఁహేసుకున్నాడు," అని చెప్పింది.

"ఓహో—" అని పైకి అని, "ఐనా నేను అన్నదాంట్లో తప్పేముందే!" అన్నది వాణీ కాస్త గ్రొంతు తగ్గించి. ఐతే, రమకి ఆ మాట వినబడి వెంటనే వాణీ వీపు మీద సరదాగా ఒక్కటిచ్చుకుంది.

ఈలోగా వాళ్లు వాణీ ఇంటి దగ్గరగా వచ్చేయడంతో ఆమె తన సైకిల్ దిగి స్టాండ్ వేసి, బ్యాగ్ లోంచి లాగార్ధమ్ బుక్ ని తీసి రమకి ఇస్తూ, "మ్... ఇదుగోనే; నా బుజ్జి 'లాగు'ని నీ చేతిలో పెడ్తున్నాను. భద్రంగా దాచుకో!" అంది చిలిపిగా కళ్ళని కదుపుతూ.

రమ 'హేఁ!' అని ఓసారి వాణీని కసిరి, "చాలా టాంక్సే, రేపు ఇచ్చేత్తానూ!" అనేసి అక్కణ్ణుంచి బయల్దేరి తన యింటికి వెళ్ళిపోయింది.

వాణి ఇంకా నవ్వుతూనే తన ఇంటివైపు తిరిగి గేట్ ని తెరిచి లోపలికి వెళ్తుండగా అప్పుడే ఒక పో'లీ'సు జీప్ వచ్చి ఇంటి ముందు ఆగింది.

"అన్నయ్యా! ఇదేనా రావడం?" అజయ్ జీప్ లోంచి బైటకి దిగడం చూసి అతన్ని అడిగింది వాణి‌.

అజయ్ ఆమెను చూసి తలూపుతూ పలకరింపుగా నవ్వాడు. "ఇదేమైనా బాగుందా అసలు? ఎప్పుడూ ఒక్కడివే ఇలా ఊపుకుంటూ రాప్పోతే, మా వదినను కూడా నీతో తీసుకు రావచ్చుగా!" అందామె పెళుసుగా.

అజయ్, వస్తున్నవాడు కాస్తా అగిపోయి ఒక్కమాటు వాణీని తేరిపార చూసి, "నీ...కెందుకే, కొత్తెం!" అని ఆమె తల వెనుక భాగంలో ఒక్కటిచ్చి ఆమెను దాటుకుని ఇంటివైపు నడిచాడు. వాణీ వెంటనే పరుగులాంటి నడకతో అతన్ని ప్రక్కకి నెట్టేసి కిలకిలా నవ్వుతూ ఇంట్లో అడుగుపెట్టింది.

లోపల హాల్లో శిరీష్ నేల మీద చాప పరుచుకుని కూర్చున్నాడు. అతని ముందర ఆన్సర్ పేపర్లు గుట్టల్లా పేర్చి ఉన్నాయి.

గుమ్మం దగ్గర సందడి విన్పించి తలెత్తి వాళ్ళని చూసాడు శిరీష్. "మ్... అజయ్, నీకే ఇప్పుడు కాల్ చేద్దాం అనుకున్నాన్రా! నీకు నూరేళ్ళు ఆయుష్షు,"

"ఏమైంది గురూ?!"

"చెప్తాన్లే, దా... ఇలా కూర్చో!" అంటూ సోఫాని చూపిస్తూ తనూ క్రింద నుంచి లేచి వొళ్లు విరుచుకుంటూ వాణీతో — "కాఫీ పెట్టమని చెప్పు మీ అక్కని!" అంటూ సోఫాలో కూర్చున్నాడు.

"ఏంటి గురూ... రాతలు పూర్తయ్యి అప్పుడే కోతలు కూడా మొదలయ్యాయా?" క్రింద చాప మీదు గుట్టలుగా పేర్చి వున్న పేపర్ల కట్టల్ని చూస్తూ.

"ఇది ఇంకా కొసరేలేరా, ముందున్నాయి అసలు పరీక్షలు. అప్పుడుంటాది మాకు జాతర!" మెటికలు విరుస్తూ నవ్వాడు శిరీష్. "సౌమ్యని కలిసి వస్తున్నావా?"

ఔనని తలూపాడు అజయ్.

"తనని ఒకసారి సరదాగా ఇంటికి తీసుకురావచ్చు కదరా... బావుండేది!" శిరీష్ కూడా వాణీకి మళ్ళే అడిగాడు. ఐతే, అజయ్ వాణీతో చెప్పినట్లు కాకుండా— "ఆఁ... మ్... నిజానికీ నేనూ తీసుకొద్దామనే అనుకున్నాను గురూ. ఐతే, తనే ఎందుకో... మ్... కుదరలేదు!" అని అంటూ సౌమ్య మొహంలో తను డ్రాప్ చేస్తానన్నప్పడు వచ్చిన మార్పుని జ్ఞాపకం చేసుకున్నాడు. "అప్పటివరకు బాగానే మాట్లాడింది. తర్వాత నేను నా వెహికల్ లో తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాననగానే తన మొహంలో ఏదో ఇబ్బంది కనబడింది. ఎందుకో అర్ధం కావట్లేదు." శిరీష్ కి చెప్తున్నట్లు కాకుండా అజయ్ తనతో తాను మాట్లాడుకుంటున్నట్లుగా అన్పించింది చూడ్డానికి.

శిరీష్ ఓసారి నిట్టూర్చి — "నీ వెహికల్ లో డ్రాప్ చేస్తానన్నావా? ఏదీ... ఆ పో'లీ'సు జీపులోనేనా?" అని అడిగాడు.

అజయ్ కి అప్పుడు మ్యాటర్ తలకెక్కింది. సౌమ్య ఎందుకు ఇబ్బంది పడిందో అర్ధం అయ్యి అంతకుముందు జీప్ ఎక్కినప్పుడు ఆమె ఎంతగానో అవమానపడి అతని మీద ఉగ్రస్వరూపియై విరుచుకుపడటం చప్పున జ్ఞప్తికి వచ్చి ఉలిక్కిపడుతూ, "ఛ... నేనస్సలు అది ఆలోచించనేలేదు గురూ!" అంటూ తలని కొట్టుకున్నాడు.

"హ్మ్...సర్లే, ఇకమీదట జాగ్రత్తగా ఉండు. కావలిస్తే నా బండి వాడుకో!"

ఈలోగా వాణీ కాఫీలు తీసుకొచ్చి వారికి ఇచ్చింది.

"ఔను గురూ, ఇందాక నాకు ఫోన్ చెయ్యాలని అనుకున్నాను... అన్నావ్!"

"యా... అదే, మన లక్కీగాడు... గుర్తున్నాడుగా, వైజాగ్ లో మీటింగులు పూర్తి చేసుకుని ఇవ్వాళనే ఊర్లోకి దిగాడట. 'ఫ్రైడే నైట్ మన ముగ్గురం టుగెదర్ ప్లాన్ చేద్దాం' అంటున్నాడు. నిన్ను కనుక్కొని కన్ఫర్మ్ చేస్తానని వాడికి చెప్పాను. నువ్వేమంటావ్!?"

"ఏదీ, ఈ వచ్చే ఫ్రైడేనా...? మనం ముగ్గురమేనా?"

"మ్... నాకు తెల్సి మన ఫ్రెండ్స్ లో ఎవరూ దగ్గర్లో లేరు కనుక మనం ముగ్గురమే! "

"అంటే, జస్ట్ అజ్ త్రీ మస్కెటీర్స్ అన్నమాట! నాకు ఓకే... వాడికి చెప్పెయ్— ఐనా, వాడు ఇలా సడన్ గా పొలిటికల్ కి టర్న్ అవ్వడం ఏంటో!"

శిరీష్ భుజాలెగరేస్తూ, "ఏమో మరి! కలుస్తాం కదా... వాణ్ణే అడుగు!"

అజయ్ నవ్వుతూ, "అడుగుతా... అడుగుతా—" అంటూ వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు మొహం పెట్టి, "గురూ, నేను... రావట్లేదని చెప్పేయ్ వాడికి!" అని అజయ్ అనడంతో శిరీష్ భృకుటి ముడివేసి — "అదేం...?" అన్నాడు.

అజయ్ వెకిలిగా నవ్వుతూ, "చిన్న ఝలక్ ఇస్తాను కొడుక్కి..." అని కన్ను కొట్టి, "I am gonna gatecrash the party!" అన్నాడు కాఫీని ఒక్క గుక్కలో ఎత్తేస్తూ!

★★★

"సిలక్కి సెప్పినట్లు సెప్పి పంపిత్తే పెంట పెంట చేసేహేవు కదరా... ఇంక ఆ పిల్ల మళ్ళీ నీకు చాన్స్ ఇత్తాదేటి!" సామిర్ తో కోపంగా అన్నాడు రమణ. సామిర్ తన చేతుల్లో ఉన్న బ్రీజర్ ని మౌనంగా సిప్ చేస్తున్నాడు. అమలాపురం ఎర్రవంతెన క్రింద వున్న కాలువ దగ్గర కూర్చున్నారు ఆ యిద్దరూ.

రమణ తన బీర్ ని రెండు గుక్కలేసి ఇలా అన్నాడు —

"నీకు రూమ్ మాట్టాడిపెట్టి, హెల్మెట్లు సప్లయి చేసి, నీ చెల్లి దగ్గర డ్రామాలాడి పెళ్ళికొడుకులా నిన్ను పంపిత్తే... నువ్వు ఏం చేశావ్!! కనీసం ఆ పిల్లని పక్క ఎక్కించ లేకపోహినావ్! ఏం మగాడివ్రా నువ్వు!?"

చివరి మాటకి సామిర్ కి చిర్రెత్తుకొచ్చింది.

"నోర్మూయ్... యెర్రి పూకా! ఏదో పెద్ద ఫైవ్ స్టార్ హొటల్లో సూట్ బుక్ చేసినట్లు పేల్తున్నావ్! అక్కడ డబ్బులు బొక్కడింది నాకు...—" సామిర్ కోపాన్ని చూసి రమణ కాస్త తగ్గాడు. అసంకల్పితంగా అతని కుడి చెయ్యి ఫేంటు జేబులో ఉన్న ఫోన్ మీద పడింది. పాపం రూమ్ మాట్లాడి పెట్టడమే కాకుండా తన ఫోన్ ని కూడా అక్కడ జరిగేది రికార్డు చేయడం కోసం పెట్టాడు వాడు. "సర్లేరా... ఏదో అలా అనేసాను. మనసులో యెట్టుకోకు!" అన్నాడు రమణ మెల్లగా.

సామిర్ మాత్రం తగ్గలేదు. "రూమ్ మాట్లాడిపెట్టాడంట... యెదవ! మళ్లా పక్క ఎక్కించలేదని తొక్కలో సెటైర్లు—" అంతే పాపం... పక్క మీద జరిగేది మాత్రమే రికార్డు అయ్యేలా మొబైల్ కెమెరా ఆన్ చేసి పొజిషన్లో పెడితే కనీసం మంచం దగ్గరికి కూడా వాళ్ళు రాలేదాయే....!

సామిర్ మాటలకి ఇబ్బందిగా కదులుతూ, "అబ్బా... ఇక వదిలెయ్ రా! ఇకపై ఏం చెయ్యాలో చూద్దాం!" అన్నాడు రమణ.

"ఇంక చేసేది ఏమ్లేదురా...! నన్ను కొడుతుందా... దాని మొహం కూడా చూడనింక. సబ్ కుచ్ ఖతమ్!"

"అహ్-హ్-అట్టా అనకురా రేయ్! ఇట్టాంటి టయిమ్లోనే మనం సానా జాగర్తగా ఉండాలి. రేపు మళ్ళా ఎగ్జామ్ ఉంది కదా! సెలవా?"

"ఉంది! ఏఁ?"

చెప్తాను కానీ కాస్త శాంతంగా వినాలి. కోపం తెచ్చుకోకూడదు." సామిర్ తలూపాడు.

కొంచెం ధైర్యం తెచ్చుకోవడం కోసం అన్నట్లు తన బీర్ ని మరో గుటకేసి, "చూడూ... ఇప్పటివరకు ఆడాళ్ళందరూ నీ పక్కలో ఈజీగా దూరిపోయారు గనుక నీకు కాస్త బలుపెక్కిపోయింది," అని ఆగి సామిర్ మొహంకేసి ఒక్క క్షణం చూశాడు. కామ్ గా వింటున్నాడని రూఢీ చేసుకున్నాక మళ్ళీ మాట్లాడాడు. "ఐతే, ఈ కేసు మాత్రం అట్టాంటిది కాదు అని ఇవ్వాళ జరిగినదాని వల్ల తేలిపోయింది. ఇకపైన మరికాత్త ఓపిక పట్టాలిరా!"

అంతసేపు మౌనంగా బ్రీజర్ ని సిప్పేస్తూ వింటున్న సామిర్ వెంటనే వ్యంగ్యంగా ఇలా అన్నాడు. "అచ్చా...! మరి ఇన్నిరోజులూ నేఁ చేసిందేంట్రా... ఖవ్వాలీనా!?"

"అఁ-అదేరా... నువ్వేం చెయ్యలేదు అని నేననట్లేదు. ఇన్నిరోజులు సానా కష్టపడ్డావ్. ఇప్పుడు పుసుక్కున వదిలెయ్యకుండా ఇంకాత్త ఓపిక పడితే ఈసారి ఆ పిల్ల తప్పక మన వల్లో పడతాది అంటున్నాను! ఒక్కసారి చెప్పేది జాగర్తగా విను. లక్కీగా రేపు పరీక్ష వుందన్నావు గనుక... ఎప్పట్లానే మామూలుగా వెళ్ళు. ఆ పిల్లకి నీమీద కోపంగా ఉందో లేదో గమనించు. ఎందుకైనా పనికొత్తాది కావలిత్తే ఒక 'సారీ' పడేయ్—" సామిర్ చివుక్కున తల తిప్పి రమణని చూశాడు. "నువ్వలా మొఖం పెట్టక. మన పని జరగాలంటే కాత్త తగ్గాలి. పవన్ కళ్యాణే అత్తని తెచ్చుకోవడానికి సానా తగ్గాడు‌. మనం ఈ పిల్లని పక్కలోకి తెచ్చుకోవడానికి ఎంత తగ్గినా తప్పే లేదు. తప్పదు కూడా. అసలే మనకి అట్టే టయం కూడా లేదు. మన సెలవులు కూడా అయిపోతున్నాయి. Just 4 days... అంతే!"

సామిర్ కొద్దిసేపు ఆలోచించి 'సరే'నన్నట్లు తలూపి తన బ్రీజర్ ఖాళీ చేసి పక్కన పడేసి లేచి బ్రిడ్జి ప్రక్కన పార్క్ చేసిన తన బండి దగ్గరకి నడిచాడు. రమణ ఓసారి గాఢంగా నిట్టూర్చి సామిర్ వెనకే నడుస్తూ తన ఫోన్ ని జేబులోంచి బైటకి తీసి ఓసారి తలకేసి కొట్టు కున్నాడు.​
Next page: Update 47
Previous page: Update 45