Chapter 001
నాంది
అవి దివిసీమకి ఉప్పెన వచ్చి ఊళ్ళకి ఊళ్ళని సర్వనాశనం చేసి వెళ్ళిన రోజులు. పెద్దాయన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామరావు గారు నడుముకి బట్టబిగించి సినిమా రంగం మొత్తాన్ని కదిల్చి విరాళాలు పోగుచేస్తున్న రోజులు.
రాత్రి సమయం 1155 నిముషాలు. బయట జోరుగా వర్షం పడుతోంది. ఎదో వాగుపొంగడంతో నెల్లూరుకి పదనాలుగు కిలోమీటర్ల దూరంలోనే పట్టాలపైనే ఆగిపోయిన సర్కార్ ఎక్స్ ప్రెస్. అందులో ఫస్ట్ క్లాసు కంపార్ట్మెంటు లోని ఒక కూపేలో పురిటినెప్పులు పడుతూ ఉన్న ఒక 25 ఏళ్ళ మగువ. ఆత్రుతతో కూపే బయట అటూ ఇటూ తిరుగుతున్న ఆమె భర్త. నిండు గర్భిణీని రైలు ప్రయాణం కట్టాడు చూడండి అంటూ తిట్టుకుంటున్న తోటి ప్రయాణీకులు. వాళ్ళల్లో పురుడుపుణ్యాలు చెయ్యగలిగిన ఇద్దరు పెద్ద వయసు స్త్రీలు మేము చూసుకుంటాం బాబూ అని ఆ భర్తకి ధైర్యం చెప్పి ఆ గర్భిణీ స్త్రీకి పురుడు పోయసాగారు. పక్క కూపేలో ఇవేవీ పట్టనట్టు పంచాంగం చూసుకుంటూ వేళ్ళు మడిచి లెక్కలు కట్టి పుస్తకంలో జాతక చక్రాన్ని వ్రాస్తున్న ఒక మహా పండితుడు..
ఏంటీ కట్టె కొట్టె తెచ్చె లాగా ఉందా. ఉండదు మరీ.. నేను భూమి మీదకు రాబోతున్నానాయే. మహానుభావులు ఊరకరారు అన్న నానుడి నిజం చెయ్యలిగా.. ఈ మాత్రం వైపరీత్యాలు లేకపోతే నా గొప్పతనం మా అమ్మానాన్న కి తెలిసేది ఎలా.
ఇంతలో వ్రాసుకుంటున్న మహాపండితుడు పుస్తకంలొ వ్రాయటం ఆపి బయటకు వచ్చి పుట్టబొయే మీ బిడ్డ మహర్జాతకుడు అవుతాడు. గజకేసరి యోగముతో జన్మించబొతున్నాడు. తను ఏమి తలపెట్టినా ఆ రంగంలో గొప్పవాడు అవుతాడు కానీ....... అని ఒక్కసారి ఊపిరి బిగపెట్టెసరికి... ఎందుకు ఆపాడా అని నాన్న, నాన్నని తిట్టుకుంటున్న తోటి ప్రయణీకులతోబాటు, నాకూ టెన్షనొచ్చి ఇట్లాకాదంచెప్పేసేసి బుడుంగున బయటకొచ్చేసా..
అప్పుడే ఎవరో పన్నెండయ్యింది..హ్యాపీ న్యు ఇయర్.. నూతన సంవత్సర శుభాకంక్షలు, బిడ్డ పుట్టిన శుభాకంక్షలు అని నాన్నతో అన్నారు అప్పటిదాకా విసుకున్న వాళ్ళందరూ. ఒకళ్ళకి ఒకళ్ళు శుభాకాంక్షలు చెప్పుకుంటుంటే... ఏడవడం మర్చిపోయి చూస్తున్నా. పెద్దవయసు స్త్రీలు అబ్బో నిజంగానే వీడు మహర్జాతకుడు. పెద్ద అంగంతో, పెద్ద పెద్ద కాలి వేళ్ళతో పుట్టాడు. పైగా సుతి మీద మచ్చ ఉంది వీర సుడి వీడిది అన్నారు.
నాన్న మాత్రం చెప్పటం ఆపేసి ఎదో ఆలోచనలో పడిన మహాపండితుడి వైపే ఆత్రంగా చూస్తున్నాడు ఈ పెద్దాయన నా నెత్తిమీద ఏ బండ వెయ్యబోతున్నాడా అని. పండితులవారు నాన్న భుజమ్మీద చెయ్యివేసి కూపేలోకి తీసుకెళ్ళి సన్నని గొంతుతో ఏదోచెప్పసాగారు. నాన్నేమోగుడ్లలో నీళ్ళు కుక్కుకుంటూ వినసాగాడు. అమ్మ నీరసం గా పడుకుంది..
ఇంతలో మళ్ళీ నొప్పులు మొదలయ్యాయి అమ్మకి. అమ్మో కవలలా మళ్ళీ అంటూ నన్ను బెర్తు మీద బట్టవేసి పడుకోబెట్టి మళ్ళాపెద్దవయసు స్త్రీలిద్దరూ అమ్మకి సాయం చెయ్యటం మొదలెట్టారు. ఇంకో 5 నిముషాల తర్వాత ఆడపిల్ల పుట్టింది.. లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది అంటూ మళ్ళీ రీలు మొదలెట్టారు ఇద్దరూ అమ్మతో..
సడెన్ గా నాన్న ఖంగారుగా తలుపు తోసుకుంటూ వచ్చి నన్ను అదాటున ఎత్తుకుని పక్క కూపేలో ఉన్న మహాపండితుడి దెగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. ఆ అదురుకి ఉలిక్కిపడి నేను ఏడవసాగను.