Update 06

పొద్దున లేచేసరికి చెల్లి నన్నే చూస్తుంటే లేచి మొహం కడుక్కుని కిచెన్ లోకి వెళ్లి అమ్మని వాటేసుకున్నాను. అమ్మతో మాట్లాడుతుంటే వచ్చి మా ఇద్దరికీ ఎదురుగా నిలుచుని మా మాటలు వింటుంది. ఒకసారి దాన్ని చూసి అమ్మ చేతిలో ఉన్న దోశ ప్లేట్ తీసుకుని హాల్లో సోఫా మీద కూర్చుని టీవీ పెట్టాను. నవ్య కూడా ప్లేట్ తో వచ్చి నా పక్కన కూర్చుంది, నన్నే చూస్తుంది.

అర్జున్ : ఏంటే నీ బాధా.. రాత్రి నుంచి భయపెడుతున్నావ్

నవ్య : కదా.. నీకు తెలుస్తుంది కదా.. మరి ఏం చెప్పట్లేదు నువ్వు

అర్జున్ : ఏం చెప్పాలి

నవ్య : చెప్పడానికి ఏం లేదా.. సరే అయితే అని లేచింది

అర్జున్ : నవ్యా..

నవ్య : నాకు భయంగా ఉంది, ఆ వాచ్ నీ చేతికి ఉండటం నాకు నచ్చలేదు. నీకెదైనా జరిగితే మేము భరించలేము.. నీకెందుకు అర్ధంకావట్లేదు నా బాధ.

అర్జున్ : నేను ట్రై చేసాను.. అది రావట్లేదు. ఏం చెయ్యాలో నువ్వే చెప్పు.. నిన్న నువ్వు కూడా లాగి చూసావ్.. వచ్చిందా

నవ్య : ఏమోరా.. ఏం జరిగినా నాకు చెప్పు, నాకు తెలుసు నువ్వు హ్యాండిల్ చేసుకోగలవని కానీ..

అర్జున్ : ఏం జరిగినా చెప్తాను, సరేనా.. ముందు తిను నీకొకటి చూపించాలి అనగానే నవ్య వేగంగా తింటుంటే నేనూ తినేసాను. ప్లేట్స్ సింక్ లో పడేసి వచ్చి కూర్చుంది.

వాచ్ తిప్పుతుంటే వంగి చూస్తుంది, తన చెయ్యి పట్టుకుని వాచ్ గురించి చెపుతూ మొదటి దాని మీద నొక్కాను.

నవ్య : ఏమైంది.. ఏం కాలేదుగా

అర్జున్ : ఎస్ ఎస్.. అనుకున్నాను

నవ్య : ఏమనుకున్నావ్

అర్జున్ : వాచ్ మీద నొక్కెటప్పుడు నీ చెయ్యి పట్టుకున్నాను, అనుకున్నట్టే ఇప్పుడు నువ్వు కూడా నాతో పాటు టైం స్టాప్ లో ఉన్నావ్.

నవ్య : అంటే..

అర్జున్ : చూపిస్తా పదా అని చెల్లి చెయ్యి పట్టుకుని వంటింట్లోకి తీసుకెళ్ళాను. అమ్మ చెపాతీ తిప్పుతూ అలానే అయిపోయింది.. నవ్యా.. అటు చూడు

నవ్య : ఆ.. అమ్మ.. అందులో ఏముంది

అర్జున్ : అమ్మ కదలట్లేదు చూడు..

నవ్య తన అమ్మను చూస్తూ దెగ్గరికి వెళ్లి కదిలించి చూసింది ఆశ్చర్యంగా, చపాతీ ఎంత సేపు పెనం మీద ఉన్నా మాడట్లేదు.. వెంటనే లోపలికి వెళ్లి నాన్నని నానమ్మ వాళ్ళని చూసి నా దెగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది.

అర్జున్ : ఇప్పుడు నమ్ముతావా

నవ్య : ఏం వాచ్ రా అదీ..

అర్జున్ : ఇది వాచ్ కాదు, టైం స్టాప్పర్.. ఉండు మాములుగా చేస్తాను అని వాచ్ బటన్ మీద నొక్కాను.. టైం స్టాప్ ఆగిపోయింది. లోపల నుంచి అమ్మ అరుపు విని నవ్య నా వైపు నవ్వి లోపలికి వెళ్ళిపోయి కొంచెంసేపు ఆగి వచ్చింది.

నవ్య : ఇంకా ఏమేమి ఉన్నాయి దాంట్లో

అర్జున్ : రెండో ఆప్షన్ గురించి చెప్పాను, వాచ్ లో ఏమేమి చూసానో ఏమేమి తెలుసో అన్ని తనకి నేర్పించాను.

నవ్య : ఆ మూడోది ఏంటి మరి

అర్జున్ : ఏమోనే.. అదే అర్ధం కావట్లేదు, దాని మీద నొక్కితే అందులో మళ్ళీ చాలా ఆప్షన్స్ వస్తున్నాయి.. అది ఏ లాంగ్వేజో కూడా అర్ధం కావట్లేదు. ఇదే మూడో ఆప్షన్

నవ్య నా చెయ్యి తీసుకుని మూడో ఆప్షన్ కి వెళ్లి రింగుని ఎడమ వైపుకి తిప్పి తిప్పి అటు ఇటు చూసి విసుగెత్తిపోయి చూసుకోకుండా ఒక్కసారిగా రింగు మీద నొక్కేసింది.. ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. మేము ఎక్కడున్నామో కూడా మాకు తెలీదు.. మా ఎదురుగా ఆపరేషన్ జరుగుతుంది. డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు. చుట్టూ చూస్తే అర్ధమయ్యింది ఇది హాస్పిటల్ అని.

నవ్య : అన్నయ్యా అది అమ్మ అని ముందుకు వెళ్ళబోయింది.. వాళ్ళు చూస్తారేమో అని చెల్లిని ఆపేసాను. ఇద్దరం చూస్తున్నాం వాళ్ల మాటలు బట్టి తెలుస్తుంది కవలలు అని, అమ్మ స్పృహలో లేదు. ముందు ఆడ పిల్లని బైటికి తీశారు తను ఏడవట్లేదు ఇవన్నీ చూస్తుండగానే మాకు అర్ధమయ్యింది మేము ఏ కాలంలో ఉన్నామో వార్డ్ చివర గోడకున్న క్యాలెండర్ చూసాను తేదీ కనిపిస్తుంది అది మా పుట్టినరోజు.

నేను నా చెల్లి ఇద్దరం ఒకరి చేతిని ఒకరం పట్టుకుని నవ్వుకుంటూ చూస్తున్నాం. మా పుట్టుక మేమే చూస్తున్నాం. కొంచెంసేపటికి ఆడపిల్లని బైటికి తీశారు.. చెల్లి నా వంక చెప్పానా నేనే పెద్దదాన్ని అని నవ్వుతూ చూసింది. ఇంతలో అక్కడున్న డాక్టర్స్ కంగారుపడుతుంటే అటు చూసాం. పుట్టిన పిల్లలో చలనం లేదు డాక్టర్ నోట్లో నోరు పెట్టి ఊదుతూ గుండె మీద వేలితో నొక్కుతూ ప్రయత్నిస్తుంటే చెల్లి చెయ్యి గట్టిగా పట్టుకున్నాను.

నవ్య : నేను బతక్కపోతే ఇప్పుడు ఇలా నీతో ఎందుకు ఉంటానురా.. భయపడకు

ఎంతసేపు చూస్తున్నా ఆ పసిబిడ్డలో చలనం లేదు, ఇంతలో మానిటర్ వేగంగా మొగుతుంటే డాక్టర్ ఆ బిడ్డని వేరే నర్స్ కి ఇచ్చేసి ఇంకో బిడ్డని బైటికి తీసింది అది మగ బిడ్డ అంటే నేను.. డాక్టర్ పక్కనే ఉన్న ఆడబిడ్డని బాధగా చూస్తూ మగ బిడ్డను నర్స్ కి ఇచ్చి ఇంకో బిడ్డ చనిపోయిందని కన్ఫర్మ్ చేస్తుంటే నా వల్ల కాలేదు, చెల్లి వంక చూసాను అయోమయంగా చూస్తుంది.. వెంటనే చెల్లి చెయ్యి వదిలేసి ఒక్క ఉదుటున వెళ్లి నర్స్ చేతిలోనుంచి రక్తపు ముద్దలా ఉన్న నా చెల్లిని తీసుకుని తన గుండె మీద చెయ్యి వేశాను.

ఓ వైపు మగబిడ్డ ఏడుపు వినిపిస్తుంది.. అందరూ నన్ను చూసి అరుస్తున్నారు.. సెక్యూరిటీ సెక్యూరిటీ అని అరుస్తున్నా నాకవేమి వినిపించడంలేదు.. నా గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది, నా గుండె కొట్టుకుంటుంటే దానికి తగ్గట్టే బిడ్డ గుండె మీద బొటన వేలితో నొక్కుతూ నా గాలిని బిడ్డ నోట్లో వదిలాను ప్రశాంతంగా.. ప్రేమగా.. ఒక్కసారి చిన్న దగ్గు వినిపించింది.. తల ఎత్తి చూసాను ఆపకుండా ఏడుస్తుంది నా చెల్లి..

బిడ్డ ఏడుపు వినగానే అక్కడున్నవాళ్ళు అరవడం ఆపేసారు.. డాక్టర్ నా చేతుల్లోనుంచి బిడ్డని తీసుకుంది. ఇవ్వటానికి నా మనసు ఒప్పుకోవట్లేదు.. వెంటనే పక్కనే నా ఎత్తు ఉన్న చెల్లిని చూడగానే అంతా గుర్తొచ్చి వెంటనే బిడ్డని డాక్టర్ కి ఇచ్చేసి చెల్లి దెగ్గరికి వెళ్లి తన చెయ్యి పట్టుకుని వాచ్ చూసాను. బటన్ నొక్కగానే ఒక్క క్షణంలో మళ్ళీ మా ఇంట్లో సోఫాలో ఉన్నాం.

చెల్లి వంక చూసాను, వెంటనే నన్ను వాటేసుకుని ఆపకుండా ముద్దులు పెడుతుంటే ఆపి తన మొహాన్ని చూసాను, ఇందాక నా చేతుల్లో ఉన్న పసిబిడ్డే కనిపించింది. నుదిటి మీద ముద్దు పెట్టి గట్టిగా వాటేసుకున్నాను. చెల్లి కూడా..

ఇంతలో ఏవో కింద పడ్డ శబ్దాలు, ఇద్దరం తల తిప్పి చూసాం.. అమ్మ మమ్మల్నే ఆశ్చర్యంగా చూస్తుంది. తన చేతిలో ఉన్న చపాతీల ప్లేట్ కింద పడింది.

సుభద్ర : అర్జున్.. నవ్యా.. ఏమైంది నాన్న.. అంటూ వెళ్లి ఇద్దరి తలలు పట్టుకుని తన నడుముకి అటుఇటు ఆనించి భయపడుతూ అడిగింది.

అర్జున్ : ఏం లేదు మా.. ఎందుకంత కంగారు

సుభద్ర : మరి.. ఎప్పుడు చిర్రుబుర్రులాడే మీరిద్దరూ అలా ముద్దులు పెట్టుకుంటుంటే ఏమైందోనని కంగారుపడ్డాను. ఇంతకీ ఏం జరిగింది.

నవ్య : అన్నయ్యకి నా మీద ప్రేమోచ్చిందే.. ఇద్దరం కలిసిపోయాం.. ఇక నువ్వు చీటికిమాటికీ మా మీద అరవనవసరం లేదు.

సుభద్ర : నా కొడుకు బంగారం అని నాకు తెలీదా ఏంటి.. అని కొడుకుని వాటేసుకుని ముద్దు పెట్టుకుంది.

అర్జున్ : నువ్వు మా అసలైన బంగారానివి.. అని తిరిగి ముద్దు పెడితే నవ్య కూడా తన అమ్మకి ఇటువైపున వచ్చి అవునంటూ అమ్మని వాటేసుకుని ముద్దు పెట్టింది.

సుభద్ర : నవ్యా.. అర్జున్.. ఏమైనా జరిగిందా

అర్జున్ : ఏంటి మా.. ఎందుకు అలా అడుగుతున్నావ్

సుభద్ర : మీరు కొత్తగా ఉన్నారు.. పెద్దైపోయినట్టు అనిపిస్తుంది.. ఎందుకో కొత్తగా కనిపిస్తున్నారు. ఎప్పుడు ఇలానే ఒకరికి ఒకరు తోడుగా ఉండండి.. ప్రేమగా ఉండండి.. అదొక్కటే నేను కోరుకునేది.

నవ్య : అలానే.. ముందు తిందువు దా అని లేచి కింద పడేసిన ప్లేట్ తీసుకుని లోపలికి వెళ్ళగా.. సుభద్ర కొడుకుని చూసి నవ్వింది.

రాత్రికి అన్నా చెల్లెళ్ళు ఇద్దరు మంచం ఎక్కారు.

నవ్య : అన్నయ్యా.. నాకు అర్ధం కానిది ఏంటంటే టైంలో వెనక్కి వెళ్ళినప్పుడు నువ్వు నన్ను కాపాడుకున్నావ్, మరి అప్పుడు ఎవరు కాపాడారు నన్ను

అర్జున్ : ఏమోనే.. ఆ డౌట్ నాకు కూడా ఉంది.. ఆలోచిస్తుంటే బుర్ర హీట్ ఎక్కిపోతుంది.. పడుకో తరవాత ఆలోచిద్దాం.. ఎల్లుండి ఇంటికి వెళుతున్నాం అని అమ్మ చెప్పింది.

నవ్య : అవును అప్పుడే హాలిడేస్ అయిపోయాయి, కాలేజీ మొదలు

అర్జున్ : కాలేజీ అంటే గుర్తొచ్చింది.. నాకొక అమ్మాయి నచ్చింది.

నవ్య : ఓహ్.. కాలేజీలో ఇవి కూడా వెలగబెడుతున్నావా

అర్జున్ : మంచిది, బాగుంటుంది

నవ్య : ప్రొపోజ్ చేసావా

అర్జున్ : లేదు.. చేస్తాను

నవ్య : ఎవరు

అర్జున్ : పూజ

నవ్య : ఎవరా బక్కదా.. అదేం బాగుంటది రా

అర్జున్ : అవును అంత అందంగా ఉండదు, కానీ తన ఆలోచనలు, పనులు ఎవ్వరిని నొప్పించకుండా ఎవ్వరిని బాధ పెట్టకుండా నడుచుకుంటుంది.. చాలా మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి

నవ్య : నేనెప్పుడూ దానితో అంతసేపు మాట్లాడలేదు.. ఇంతకీ నువ్వు చెపితే ఒప్పుకుంటుందా

అర్జున్ : ఏమో తెలీదు

నవ్య : ప్రేమంటే ఏంటి.. ఎలా పుట్టింది నీకు తన మీదా..?

అర్జున్ : అవన్నీ నాకు తెలీదు, రికార్డు విషయంలో నాకు ఒకసారి హెల్ప్ చేసింది, అప్పుడు గమనించాను.. దారిన పోతూ ఎవరో కూరగాయలు అమ్మే ఒకామెకి అడక్కపోయినా సాయం చేసింది. అప్పుడు నాకు తను నచ్చింది అప్పటి నుంచి చూస్తున్నాను తను చేసే ప్రతి పని నాకు నచ్చేది, అవతలి వాళ్ళతో చాలా మర్యాదగా మాట్లాడుతుంది. నీకంటే నాకంటే మంచిది.

నవ్య : హ్మ్మ్.. చూద్దాం.. సరే గుడ్ నైట్.. ఆ వాచ్ తో జాగ్రత్త, కాల్క్యూలేషన్ మిస్ అయ్యిందంటే ఏమేమి ప్రాబ్లెమ్స్ వస్తాయో ఏమో

అర్జున్ : ఉమ్మ్.. ఉమ్.. గుర్తున్నాయి.. నీకు చెప్పకుండా వాడను సరేనా

నవ్య : గుడ్ నైట్

అర్జున్ : గుడ్ నైట్

మరుసటి రోజంతా నానమ్మ తాతయ్యలతో గడిపి ఆ తెల్లారి ఇంటికి వచ్చేసాం. సెలవలు అయిపోయాయి, ఇద్దరం కాలేజీకి రెడీ అయ్యి వెళ్ళాం. ఇద్దరం క్లాస్ లోకి వెళుతుంటే మా ముందే పూజ వెళుతుంది, నవ్య నన్ను చూసి నవ్వుతూ వెళ్లి తన ప్లేస్ లో కూర్చుంది. రోజంతా తనతో మాట్లాడాలని ట్రై చేసాను కానీ కుదరలేదు.. బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాం.

నవ్య : నన్ను మాట్లాడమంటావా

అర్జున్ : వద్దే ప్లీజ్ అలాంటి ఆలోచనలు కూడా చెయ్యకు, నేనేదో ఒకటి చేస్తా అని ఇంటి గేట్ తీసాను.

నవ్య : సరే సరే.. నువ్వే చుస్కో.. అని తలుపు తీసి లోపలికి వెళ్ళిపోయింది

సుభద్ర : ఏంటి చూసుకునేది

నవ్య : నీ కొడుక్కి ఒక అమ్మాయి నచ్చిందే.. ప్రొపోజ్ చేద్దాం అనుకుంటున్నాడు

అర్జున్ : నీయమ్మ

సుభద్ర : నేనిక్కడే ఉన్నారా

అర్జున్ : హీ.. అని నవ్వాను

సుభద్ర : ఎవరా అమ్మాయి

అర్జున్ : అది ఏది పడితే అది వాగిద్ది, అన్ని నమ్ముతావా.. అడ్డు తప్పుకో బైటికి వెళ్ళాలి

సుభద్ర : ఎక్కడికి..

అర్జున్ : పనుంది.. అని చెప్పి రెడీ అయ్యి డ్రెస్ మార్చుకుని ఇంటి నుంచి బైట పడ్డాను.. పెరట్లో గులాబి పువ్వు తెంపుతుంటే నవ్య చూసింది.

నవ్య : అల్ ద బెస్ట్

థాంక్ యు అని నవ్వుతూ పూజ వాళ్ల ఇంటికి బైలుదేరాను.

పూజ ఇంటి గేట్ ముందు నిలుచున్నాను, లోపల ఎవరున్నారో ఏంటో.. ఏమోలే ఎవరుంటే నాకేంటి మన దెగ్గర టైం స్టాప్పర్ ఉందిగా అని వెంటనే వాచ్ మీద నొక్కాను, ఐదు నిమిషాలు టైం ఉంది.. వెంటనే లోపలికి వెళ్లి తలుపు తెరిచాను పూజ వాళ్ల అమ్మ అనుకుంటా మల్లెపూలు కడుతుంది, పూజ వాళ్ల ఇల్లు చూస్తూ లోపలికి వెళ్లాను, రూం కనిపించింది డోర్ తెరిచే ఉంది మంచం మీద పూజ బ్యాగ్ ఉంది అంటే అది తన రూమే.. లోపలికి వెళ్లాను పూజ కనిపించలేదు కింద మంచం దెగ్గర తన బట్టలు పడేసి ఉన్నాయి బాత్రూం డోర్ పెట్టి ఉంది.. స్నానం చేస్తుందేమో అని కంప్యూటర్ టేబుల్ పక్కన చైర్లో కూర్చుని టైం స్టాప్పర్ ఆపేసాను. టేబుల్ మీద డైరీ ఉంటే తీసి చదువుతూ కూర్చున్నాను.

బాత్రూం డోర్ తెరిచిన సౌండ్ విని తల ఎత్తి చూసాను.. మైండ్ బ్లాక్ అయ్యింది పూజని చూసి.. నీళ్లు కారుతున్న నగ్న శరీరంతో గెంతుతూ వచ్చి మంచం మీదున్న టవల్ అందుకుంది.. ఒక అమ్మాయిని పూర్తి నగ్నంగా చూస్తున్నాను.. టవల్ అందుకుని వీపు చుట్టూ కప్పుకుని ఒళ్ళు తుడుచుకుంటూ ఇంకో టవల్ తీసి తల మీద వేసుకుంది తల తుడుచుకోవడానికి. నాకు చెమటలు పడుతున్నాయి.. ఇంక నా వల్ల కాదు.. పూజా.. ప్లీజ్ బట్టలేసుకోవా అన్నాను వణుకుతూనే..

ఒక్కసారి వెనక్కి తిరిగి నా వైపు చూసి కెవ్వుమంది అంతే వాళ్ల అమ్మ లోపలికి వచ్చేసింది.. ఆంటీ ఆంటీ అంటున్నా భయంతో.. వాళ్ల అమ్మ వెంటనే పూజ నాకు కనిపించకుండా అడ్డం నిలబడింది వెంటనే వాచ్ మీద రెండో ఆప్షన్ పెట్టి నొక్కాను.. మళ్ళీ రివైండ్.. ఈ సారి పూజ వెనక్కి తిరుగుతుంటే వెంటనే లేచి ముందు తన నోటి మీద చెయ్యి పెట్టి తన కళ్ళలోకి చూసాను. అరవబోయి ఆగిపోయింది.. నన్ను ఒక్క నెట్టు నెట్టి ముందు బైట తొంగి చూసి తలుపు పెట్టి లాక్ చేసింది.. ఆ తరువాత నా వైపు తిరిగి కళ్ళ ముందు కనపడుతున్న తన నగ్న అందాన్ని ఇంత దెగ్గరగా నోరు తెరిచి సొంగ కార్చుతూ చూస్తున్న నన్ను చూసి తనని చూసుకుని జారిపోయిన టవల్ తీసి ఒళ్ళు కప్పుకుంది.. వెంటనే తల తిప్పాను..

పూజ : అర్జున్.. నువ్వెంటిక్కడా..

అర్జున్ : అది.. అది.. ఐ లవ్ యు అని గట్టిగా కళ్ళు మూసుకుని మోకాళ్ళ మీద కూర్చుని పువ్వు తన ముందు పెట్టాను. కళ్ళు తెరవాలంటే భయం వేసింది.. ఏదో అనుకున్నాను ఏదేదో జరుగుతుంది. ఒక కన్ను తెరిచి చూసాను.. అయోమయంగా నన్నే చూస్తుంది.. వెంటనే లేచి నిలబడ్డాను.. తనకి ఇష్టం లేదేమో అనిపించింది.. పూజా సారీ అని చెయ్యి వెనక్కి తీసుకున్నాను.. చెయ్యి వెనక్కి తీసుకుంటుంటే పూజ నా చెయ్యి పట్టుకుని నా చేతిలో ఉన్న పువ్వు తీసుకుంది..

అర్జున్ : పూజా.. నీకు ఇష్టమేనా

పూజ : ఇష్టమే.. కానీ ఎవరైనా ఇలా ప్రొపోజ్ చేస్తారా.. రేపెప్పుడైనా ఎవరైనా కానీసం ఎలా ప్రొపోజ్ చేశాడు అని అడిగితే చెప్పుకునేలా ఉందా ఇది.. అని నవ్వింది..

అర్జున్ : పూజా.. అంటే.. నీకు.. ఎస్ ఎస్ ఎస్.. వావ్.. ఏదైనా ఫెయిల్ అవ్వకుండా ఫస్ట్ అట్టెంప్ట్ లో పాస్ అయ్యాను అంటే అది ఇదే.. థాంక్స్.. థాంక్స్.. పూజా అని తన చెయ్యి పట్టుకున్నాను.. ఇంతలో తనకి గుర్తుకువచ్చిందేమో తాను ఉన్న అవతారం చూసుకుని సిగ్గు పడిపోయి.. వెంటనే నా నుంచి తప్పించుకుని బాత్రూంలోకి పరిగెత్తి డోర్ పెట్టుకుని తొంగి చూసింది.

పూజ : అర్జున్.. ముందు ఆ బట్టలు ఇవ్వు

బట్టలు ఇస్తూ తల వేరే వైపుకి తిప్పాను ఏదో బుద్ధిమంతుడిలా.. అది చూసి పూజ నవ్వింది.. ఛ ఆనుకుని కూర్చున్నా.. రెండు నిమిషాల్లో బట్టలు వేసుకుని బైటికి వచ్చింది నాకు మాత్రం ఇందాక చూసిన నగ్న రూపమే గుర్తొస్తుంది. ఇద్దరం మంచం మీద కూర్చున్నాం.. మౌనం రాజ్యమేలుతుందా అనిపించింది.. మొన్నేక్కడో చదివా ఈ పదం అందుకే ఇప్పుడు వాడుకలోకి వచ్చింది.. ఇలానే ఏదేదో ఆలోచిస్తున్నా.. మధ్యలో అప్పుడప్పుడు పూజని చూస్తున్నా.. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్ధం కాలేదు.. ఇంతలో

పూజా : అర్జున్ ఒక్కసారి అటు తిరుగు

తను చెప్పినటల్ వెంటనే అటు వైపు తిరిగా.. వీపు మీద చెళ్ళుమని పీకింది.. అబ్బా అని తిరిగాను వీపు పట్టుకుని అయోమయంగా

పూజ : నన్ను అలా చూసినందుకు.. ఎలా ఉంటుంది తెలుసా.. సిగ్గుతో చచ్చిపోయాను.. తప్పు కదా

అర్జున్ : సారీ.. నాకేం మాట్లాడాలో కూడా అర్ధం కావట్లేదు పూజా.. నేను వెళతాను.. రేపు కాలేజీలో కలుద్దాం

పూజ : బైట మా అమ్మ ఉంది.. అస్సలు నువ్వు లోపలికి ఎలా వచ్చావ్

అర్జున్ : కళ్ళు మూసుకో వెళతాను..

పూజ : కళ్ళు మూసుకోవాలా.. సరే.. అంది నవ్వు మొహంతో

అర్జున్ : ఇలా కాదు అటు తిరుగు.. అని అటువైపు తిప్పి వెంటనే టైం స్టాప్పర్ ఆన్ చేసి.. బైటికి వెళ్ళిపోతూ ఎందుకో మళ్ళీ వెనక్కి వచ్చి పూజ బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి ఇంటికి వచ్చేసాను.

ఇంటికొచ్చి మంచం మీద పడేవరకు అస్సలు ఏమి అర్ధం కాలేదు.. అంతా కలలా ఉంది.. చెల్లి నన్ను చూసి వచ్చి పక్కన పడుకుంది.. దాన్ని పట్టుకుని నలిపేసాను ఆనందంలో

నవ్య : ఎహె.. ముందు ఏమైందో చెప్పు

అర్జున్ : అంతా చెప్పలేను కానీ.. తను ఒప్పుకుంది

నవ్య : అమ్మనీ.. ఒప్పుకుందా అని లేచి కూర్చుంది

అర్జున్ : అంటే ఏంటే నీ ఉద్దేశం.. హా..

నవ్య : అరేయి నువ్వే చెప్పు.. పూజ లాంటి ఫిగర్ అందులోనూ బాగా చదువుతుంది.. అలాంటిది నువ్వు ప్రొపోజ్ చెయ్యగానే ఒప్పుకుందంటే.. నిజంగానే తను చాలా మంచిది.. బుద్ధిగా లవ్ చేస్కో.. అస్సలు పోగొట్టుకోకు

అర్జున్ : నీయమ్మ.. ఇంకా మొదలేపెట్టలేదు అప్పుడే పోగొట్టుకోవద్దు అంటావ్

సుభద్ర : ఒరేయి.. నిన్ను అని వీపు మీద ఒక్కటి చరిచింది వెనక నుంచి

అర్జున్ అబ్బా అనడం.. ఇద్దరు తల తిప్పి చూసారు.. నవ్య గట్టిగా నవ్వింది.

అర్జున్ : అమ్మా.. ఇందాక ఇప్పుడేనే తిట్టింది.. ఆ రెండు సార్లు నువ్వు విన్నావ్.. నా టైం బాలేదు

సుభద్ర : నవ్యా.. అంతేనా

నవ్య : అవునే.. వదిలేయి.. అన్న ప్రతీసారి నీకే దొరుకుతున్నాడు

సుభద్ర : అయితే ఒప్పుకుందా తను

నవ్య : మొత్తం విన్నావా

సుభద్ర : హా.. ఏంటి నేను వినకూడదా.. నేనేమైన వద్దన్నానా

అర్జున్ : లవ్ యు మా

సుభద్ర : సరే పాయసం చేస్తాను.. తిందురు.. రేయి ముందు ఫ్రెష్ అవ్వుపో..​

The End
Previous page: Update 05