Update 09


చిన్న చిట్టడివి లాగా ఉంది పక్కనంతా , రోడ్డుకు ఇరువైపులా చిన్న చిన్న పొదలు అక్కడక్కడా పెద్ద పెద్ద చెట్లు , చుట్టూ కీచురాళ్ళ అరుపులు, కారులో అందరు సైలెంట్ గా ఉన్నారు ఒక్కా కార్ సౌండ్ , బయట కీచురాళ్ళ సౌండ్ తప్ప ఇంకేమి లేదు , సగం దూరం వచ్చిన తరువార ఓ మలుపు తిరిగుతుంటే ఓ పెద్ద ఎండిపోయిన చెట్టు దారికి అడ్డంగా ఉంది . అది కావాలని ఎవరో వేసినట్టు వుంది , పక్కనుంచి పోదామంటే దారిలేదు , పోనీ బండి దాని మీదనుంచి ఎక్కిద్దమంటే పెద్ద మొద్దు కింద అడ్డ పడుతుంది , వేరే దా రి లేదు దిగి తీయల్సిందే,
"ఏమైంది అబ్బి బండి ఆపావు "
"రోడ్డుకు అడ్డంగా పెద్ద మొద్దు ఉందమ్మా, దాన్ని తియందే పోలేము , మీరు బండిలోనే ఉండండి నేను దిగి తీస్తా "
"నేను దిగగానే బండి ని సెంట్రల్ లాక్ చేసుకొండి , మల్లి నేను తియమనేంత వరకు తియకండి "
"సరేలే జాగ్రత్త , నేను దిగనా నీకు హెల్ప్ గా " అంది శాంతా
"వద్దు , మీ రు రావద్దు నేను తతీస్తా " అని కాళ్ళ కింద కవర్ పైకి లేపి లంచ్ టైం లో డిక్కి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన ఓ చిన్న అయుదాన్ని తెసుకొని వెనుక వైపు బెల్ట్ లోకి తొసి కిందికి దిగి డోర్ క్లోజ్ చేశా , వెంటనే శాంతా డోర్ లాక్ చేసుకుంది.

కార్ హెడ్ లైట్ లో రోడ్ క్లియర్ గా కనబడుతుంది , కాని చుట్టూ పొదలు మూలంగా పక్కన ఏమున్నది కనపడడం లేదు.
నేను ఎప్పుడైతే మొద్దు దగ్గరకు వచ్చి దాన్ని ఎటువైపుకు దోర్లిస్తే కార్ వెళ్ళడానికి వీలుగా ఉంటుందో నని చెక్ చేస్తునడగా ఎదురుగ్గా ఇద్దరు , ఇటువైపునుంచి ఒక్కడు చేతిలో చిన్నరాంపురి బాకులు పట్టుకొని చుట్టుముట్టారు.
"మర్యాదగా కారులో ఉన్నా డబ్బు , సొమ్ములు ఇచ్చేసి నీదారిని మీరు వెళ్ళండి ఎవ్వరికి ఏమి కాదు, లేదంటే నిన్ను ఎసేసి ఆతరువాత నిదానంగా మిగిలిన పనులు చూసుకుంటాము "
"అన్నా బండిలో అంతా అడంగులున్నారు ,ఇప్పటికే బాగా లేట్ అయ్యింది , వాళ్ళు పెద్దిరెడ్డి అమ్మా పిల్లల్లన్నా , మీవూరి వల్లే , కావాలంటే నాదగ్గరున్న డబ్బులు తీసుకొని మమ్మల్ని పోనియండి "
"ఎవడా పెద్దిరెడ్డి , మేము చెప్పామా ఈ వూరివాల్లమని , మర్యాదగా కార్ డోర్ తెస్తావా పగలగోట్ట మంటావా "
"అన్న అన్నా ఇదిగో నా దగ్గిర పది వేలు ఉన్నాయి తీసుకోని వాళ్ళని వదిలేయండన్నా, కావాలంటే ఇదిగో నా వాచ్ కుడా తీసికొండి "
"రే , నీకు మాటలతో చెపితే అర్తం కాదురా , రేయి ఆ రాయి తీసుకోని అద్దాలు పగలకోట్టండి "
ఇంతలో అందరికంటే పొట్టిగా ఉన్నాడు పక్కనే ఉన్న పెద్ద రాయి తీసుకోని కార్ వైపు పోసాగాడు , కార్ లోంచి అందరు ఏమిజరుగుతుందో నని భయంగా చూస్తున్నారు.
రెండో సెకండ్లో , రాయి తీసికొని వెళ్ళే పొట్టోడు అబ్బా అంటూ రాయి వదిలేసి అరచేయి పట్టుకొని , కింద కూచుండి పోయాడు. ఏమి జరిగిందో మిగిలిన ఇద్దరికీ ఓ నిమిషం అర్తం కాలేదు.
అర్తం అయిన వెంటనే కత్తులు తీసుకోని నా మీదకు రాసాగారు.
3 ఇయర్స్ రెగ్యులర్ గా ప్రాక్టీసు చేసి ఆపైన , వారానికో తిరికని బట్టి రెండు సార్లు లేదా మూడు సార్లు ప్రాక్టీసు చేసిన విద్య ఈ టైం లో ఆ లా ఉపయోగపడుతుందని అనుకోలేదు . కొద్దిగా వెనక్కు జరిగి రిధమిక్ గా 1...2, 1..2 అంటూ స్టెప్పు లేస్తూ , చేతిలోని నన్ చాకో తో , మొదట వచ్చిన వాడి దవడ పేలి పోయింది , వాడు రాలిపోయిన పళ్ళను చేతిలో పట్టుకొని అలాగే కూచుండి పోయాడు. మొదటి వాడి చేయి మని కట్టుదగ్గర విరిగిపోయి వాడు ఏడుస్తూ చేయిపట్టుకొని మావైపు చూస్తున్నాడు.
మిగిలిన మూడో వాడు , నాదగ్గరకు రావడానికి భయపడి , చేతిలోని కత్తిని నా వైపు విసిరేశాడు , తప్పుకున్దామని పక్కకు జంప్ చేసేలోపల ఎడమ చేయి బుజం దగ్గర చీరుకుంటూ , కింద పడిపోయింది, ఈ గ్యాప్ లో రెండో వాడి దగ్గర కత్తిని తీసి నాకు క్లోసేగా వచ్చాడు , వచ్చిన తరువాత వాడికి అర్తం అయ్యింది వాడి తప్పు ఏంటో, అది సరిదిద్దుకోనీ లోపే , కత్తి ని పట్టుకున్న 4 వెళ్ళు ఎందుకు పనికిరాకుండా పోయాయ. అబ్బా అంటూ కత్తిని వదిలేసి చేయి పట్టుకున్నాడు.
"అప్పుడే చెప్పా కదరా , వదిలేయండన్నా అని విన్నారా, అప్పుడే వేల్లివుంటీ , పదివేలు మరియు పదిహేను వేలుచేసే వాచ్ దొరికేదిగా "
"మర్యాదగా లేచి రోడ్డుకు అడ్డంగా ఉన్న దీన్ని తెసేయండి , లేకుంటే మిగిలిన చేతులు ఎందుకు పనికిరాకుండా చేస్తా "
నామాట కంప్లీట్ అయ్యిందో లేదో మిలిట్రిలో సైనికులులా , వాళ్ళ అవయవాలు పెడుతున్న నొప్పి భరిస్తూ వెంటనే వెళ్లి రోడ్డుకు అడ్డంగా ఉన్న దుంగను పక్కకు దోర్లిచేసారు, దిరికింది ఇదే సందని నేను రెండో మాట మాట్లాడే లోపు పక్కనే ఉన్న పొదలకు అడ్డంపడి పారిపోయారు.

నేను డోర్ దగ్గరకు రావడం చూసి , శాంత డోర్ ఓపెన్ చేసింది ,
"అబ్బీ , నేకేమి కాలేదుగా "
"ఏమి కాలేదు లెండి "
"అయ్యో , ఆ చేతికి రక్తం ఏంటి " అని గట్టిగా అరిచింది రాజి
Next page: Update 10
Previous page: Update 08