Update 101
ఆఫీసు కు వెళ్ళగానే , మేనేజర్ మీటింగ్ కు రమ్మన్నాడు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చిందేమో అనుకుంటూ. మిగిలిన వాళ్లతో కలిసి మీటింగ్ కు వెళ్ళాము. అక్కడ మాతో పాటు HR మేనేజర్ కుడా వచ్చింది. మేనేజర్ మాట్లాడుతూ రాబోయే quarter లో మనకు ఓ పెద్ద సపోర్ట్ ప్రాజెక్ట్ రాబోతుంది దానికి మనకు ఒక్క 200 స్టాఫ్ కావాలి. వాళ్ళని క్యాంపస్ ద్వారా సెలెక్ట్ చేసుకొని వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి, టెస్ట్ చేసి ఆ తరువాత అందులో బెస్ట్ ని ప్రాజెక్ట్ లో తీసుకోవాలి. క్యాంపస్ selection కి , టీం ట్రైనింగ్ నుంచి వాళ్లను final ప్రాజెక్ట్ లోకి తీసుకొనేంత వరకు శివా ను ప్రాజెక్ట్ లీడర్ గా చేస్తున్నాను. తనకు సపోర్ట్ గా HR తో పాటు ఇంకా 5 టెక్ టీం ఉంటుంది. శివా నీకు ఎవరు కావాలంటే వాళ్ళను నీ టీం లో తీసుకో అంటూ . ఆ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేసాడో వివరించాడు.
మేనేజర్ కు థాంక్స్ చెప్పి , ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటో కనుక్కొంటే ఆ తరువాత నా ఇంటర్నల్ టీం లో ఎవరిని ఎవరిని తీసుకోవాలో అలోచించొచ్చు అని ఆ ప్రాజెక్ట్ కు సంబందించిన పేపర్స్ చదవ సాగాను. సాయంత్రం ఎప్పుడు అయిందో తెలియ లేదు. దారిలో కళావతి నుంచి కాల్ , వీలైతే ఈవెనింగ్ కలవమని చెప్పింది సరే అంటూ ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి కళావతిని కలుద్దాం అని బయలు దేరాను. ఇంట్లోంచి బయటకు రాగానే మల్లికార్జున నుంచి ఫోన్,
"హలో సర్ బాగున్నారా "
"శివా బాగున్నావా , నీతో కొద్దిగా మాట్లాడాలి.మా ఆఫీస్ రాగలవా " అన్నాడు. కళావతి ఇంటికి కొద్దిగా లేట్ గా వెళ్ళొచ్చు అనుకొంటూ మల్లికార్జున వాళ్ళ స్టేషన్ కు బయలు దేరాను.
సగం దూరం వెళ్ళగానే అక్కడ బస్సు స్టాప్ లో నీరజ ఉన్నట్లు అనిపించింది. అంతా నా బ్రమ లేకుంటే మంత్రి కూతురు ఏంటి బస్సు స్టాప్ లో ఉండడం ఏంటి ? అనుకొంటూ తనను పట్టిచ్చు కోకుండా క్రాస్ చేసాను. కానీ లీలగా ఎవ్వరో నన్ను పిలుస్తున్నట్లు అనిపించింది. అది కుడా పట్టిచ్చు కోకుండా అక్కడ నుంచి వచ్చేసాను.
కొద్ది దూరం వచ్చే కొద్దీ ఫోన్ మోగింది , బైక్ ను ఓ పక్కకు ఆపి ఎవరా అని చుస్తే పార్వతి ,
"హాయ్ పార్వతి , ఏంటి ఈ టైం లో ఫోన్ , ఎలా ఉంది కాలేజి "
"నీకు ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేసాను"
"ఏమైంది ఏంటి , అంతా ఓకేనా "
"మనం ఇంతకూ ముందు కలిసిన హోటల్ లో కలుద్దామా , నేను దారిలో ఉన్నాను , నీకు వీలైతే వెంటనే అక్కడికి రాగలవా "
"నేను సెక్యూరిటీ అధికారి స్టేషన్ కు వెలుతున్నా "
"నన్ను కలిసి ఆ తరువాత వెళ్ళు , నేను చెప్పేది , వాళ్ళు చెప్పేది ఒక్కటే "
"సరే , నేను దారిలోనే ఉన్నాను , అక్కడే కలుద్దాం " అని చెప్పి బైక్ ను మేము ఇంతకు ముందు కలిసిన హోటల్ వైపుకు తిప్పాను.
నేను వెళ్లేకొద్ది తను కుడా అప్పుడే ఎంటర్ అవుతుంది హోటల్ లోకి నా బైక్ చూసి గేటు ముందర ఆగింది నా కోసం. నేను బైక్ పార్క్ చేసి తనతో లోనకు వెళ్లి ఇద్దరికీ టీ ఆర్డర్ చేసి అప్పుడు అడిగాను
"ఏంటి అంత అర్జెంటు , అంతా ఒకే నే నా "
"నేను ok కానీ , నీరజా తో నో ప్రోబ్లమ్ వచ్చింది "
"నీరజా కు ఏమైంది ఏంటి ?"
"ఆ రోజు మనం ఇద్దరం వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చామా , ఆ రోజు నుంచి తను ఇంట్లో ఎవ్వరితోను మాట్లాడ లేదంట , ఆ తరువాతి రోజు కాలేజికి వచ్చింది కానీ చాలా డల్ గా ఉంది. మరుసటి రోజు కాలేజి నుంచి ఇంటికి వెల్ల లేదు అంట ఆ రోజు సాయంత్రం వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసాడు తను ఇంటికి రాలేదు అని , నేను ఎక్కడో ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఉంటుంది లే అని సర్ది చెప్పాను. మరుసటి రోజు తను కాలేజి కి వచ్చినప్పుడు రాత్రి ఎక్కడి కి వెళ్లావు ఇంటికి వెల్ల లేదంట మీ నాన్న ఫోన్ చేసాడు నాకు అని అడిగాను. దానికి అది అంది. నువ్వు ఫోన్ చేసిన తరువాత నేను నాన్నతో మాట్లాడాను , నీకు ఓ విషయం చెప్పాలి అంటూ నన్ను క్లాసు బంకు కొట్టిచ్చి కాంటీన్ లోకి లాక్కెళ్ళి చెప్పింది. ఆ రోజు నువ్వు దాన్ని అన్న మాటలు serious గా తీసుకొంది , తనంత తానుగా ఓ నెల స్వతంత్రంగా వాళ్ళ నాన్న పేరు , పరపతి , డబ్బులు వాడ కుండా బ్రతకాలి అని నిర్ణయించు కొంది అంట అందుకే మొన్న వాళ్ళ ఇంటికి వెల్ల లేదు. మా క్లాస్ లో ఇద్దరు అమ్మాయిలు పల్లె నుంచి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకోని ఉంటున్నారు తను కుడా వాళ్లతో ఉంటాను, రూమ్ లో కర్చులు అన్నీ షేర్ చేసుకొందాము అని వాళ్లతో వప్పించి వాళ్ళ రూమ్ కు మారి పోయింది. నిన్న వాళ్ళ నాన్నకు ఈ విషయం కుడా చెప్పింది."
"అబ్బో , చాలా తతంగమే జరిగింది, అది సరే ఇంతకీ వాళ్ళ నాన్న ఏమన్నాడు అంట"
"వాళ్ళ నాన్నకు ఓ వైపు సంతోషం , ఇంకో వైపు బాధ పడుతున్నాడు"
"అది సరే , ఇంతకూ నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మనావు? ”, ఇందాకా నేను వచ్చే దారిలో తనను బస్సు స్టాప్ లో చూసాను , తను కాదులే అనుకోని వచ్చేసాను , కొద్ది దూరం వచ్చిన తరువాత నాకు అనిపించింది నన్ను ఎవరో నా పేరు పెట్టి పిలుస్తున్నారు అని , నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చేసా , బహుశా తనే అయి ఉంటుందా ? " నేను అన్న ఆ మాటకు తను నవ్వ సాగింది.
"ఎందుకు నవ్వు తున్నావు ?"
"నిన్ను పిలిచింది ఎవ్వరో కాదు నిరజే , అది కుడా ఇక్కడికి రావడానికి బయలు దేరింది , అది రమ్మంటే నే నేను ఇక్కడి కి వచ్చాను , నిన్ను కుడా అదే రమ్మంది , తను నీకు సారీ చెప్పాలంట"
"అనాల్సిన వన్నీ అని ఇప్పుడు సారీ ఎవరికీ కావాలి "
"ప్లీజ్ శివా , నా కోసం , అది ఇప్పుడు ఎదో మారడానికి ట్రై చేస్తుంది, కొద్దిగా హెల్ప్ చెయ్యి ప్లీజ్ "
"సరే , నువ్వు అంతగా చెబుతున్నావు కాబట్టి ok , నేనేం చేయాలి ఇప్పుడు ? ఆవిడగారు సారీ చెపితే , నవ్వుతూ its ok అని shake ఇవ్వాలా ??" అన్నాను కొద్దిగా కోపంగా
"అంత వెటకారం వద్దులే , నీకు తోచినట్లు దాని సారీ ని accept చెయ్యి చాలు " మా కాఫీ టేబిల్ మీదకు రాగానే , నీరజా వాకిట్లో ప్రత్యక్షం అయ్యింది. తను చేతిని పైకి లేపగా గుర్తించి మా టేబుల్ దగ్గరకు వచ్చింది.
తన పక్కన కుచోంటు
"సారీ శివా , మిమ్మల్ని ఇందాకా బస్సు స్టాప్ లో చూసి మీ పేరు కూడా పిలిచాను , మీరు నన్ను గమనించి కూడా వచ్చేసారు , నాకు తెలుసు మీకు నా మీద పీకల దాకా కోపం ఉంది అని."
"మా ఫ్రెండ్ అంతా చెప్పే ఉంటుంది, నేను అన్న మాటలు ఆ తరువాత నేను గుర్తుకు చేసుకొన్నాను , అవి మిమ్మల్ని ఎంత బాధ పెట్టి ఉంటాయో నాకు తెలుసు, నేను ఎదో మూడ్ లో ఉండి మాకు హెల్ప్ చేసిన మిమ్మల్ని బాధ పెట్టాను. అది నా తప్పే , నా తప్పు ఒప్పుకోవడానికి నేను సిగ్గు పాడడం లేదు , మనస్పూర్తిగా am very very sorry " అంటూ నా రెండు చేతులు పట్టుకొంది తన కంటి నిండా నీటితో.
ఆడపిల్ల అలా అడిగే సరికి , మనసులో అది నిజమో కాదో అనే సంశయం ఉన్నా తన కంటిలో నీటిని చూసి
"its ok " అన్నాను.
"we are friends now" అంది నాకు shake హ్యాండ్ ఇస్తూ ,
"yes " అంటూ తనతో చేతులు కలిపాను.
"దీన్ని coffe తో సెలెబ్రేట్ చేసుకొందాము " అంది పార్వతి నవ్వుతూ . నేను బేరార్ ను పిలిచి ఇంకో ఎంప్టీ కప్పు తెమ్మని చెప్పి మా coffe ని తనతో షేర్ చేసుకోన్నాము.
"నేను స్టేషన్ కు వెళ్ళాలి , మనల్ని కలిపినా ఆ సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ ను కలవాలి"
"అతను , నా గురించి అడగడానికే మిమ్మల్ని రమ్మని ఉంటాడు , నాకు తెలుసు మా నాన్న అతనికి చెప్పి ఉంటాడు. "
"నీవు మీ నాన్నతో మాట్లాడావు కదా , మరి ఇంకా ఎందుకు వీళ్ళను వాళ్ళను అడగడం ??" అన్నాను
"మా నాన్నకు నేను ఎక్కడ ఉండేది ఇంకా చెప్పలేదు , ఫ్రెండ్ దగ్గర ఉన్నా అన్నాను కానీ ఎ ఫ్రెండ్ దగ్గర అనేది చెప్పలేదు అందుకే ఆ అంకుల్ కి చెప్పి ఉంటాడు. "
"మీ నాన్నకు నువ్వు చెప్పు , నువ్వు ఇంట్లోంచి పారి పోలేదు కదా ? మరి ఇంకా ఎందుకు చెప్పక పోవడం , తండ్రి అన్నాకా అయన భయాలు ఆయనకు ఉంటాయి, మీ నాన్నకు నువ్వు ఎక్కడ ఉండేది చెప్పు తను కూడా హ్యాపీ గా ఫీల్ అవుతాడు. "
"థాంక్స్ శివా , నా కళ్ళు తెరిపించావు , ఎందుకో ఆ రోజు నుంచి మా నాన్న మీద కోపంతో ఉన్నాను అనిపించింది , కానీ ఇప్పుడు తెలుస్తుంది. ఈ కోపం ఆయన మీద కాదు. నిన్ను మా ఇంటిలోంచి పంపించిన దగ్గర నుంచి నా మీద నాకే కోపంగా ఉంది. ఇప్పుడు అంతా క్లియర్ అయ్యింది , ఒన్స్ అగైన్ థాంక్స్ శివా , నా ఇగో తో ఓ మంచి ఫ్రెండ్ ని పోగొట్టు కొనే దానిని , ఇప్పుడే ఇంటికి వెళ్లి మా నాన్న పర్మిషన్ తో మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కు వెళతాను." అంటూ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది.
"సరే నేను వెళ్ళొస్తా" అంటూ వాళ్ళకి బాయ్ చెప్పి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కు వెళ్లాను. నేను వెళ్ళే కొద్దీ ఇక నేను రాను ఏమో అనుకోని తను ఇంటికి వెళ్ళడానికి బయటకు వస్తున్నప్పుడు నేను వాళ్ళ ఆఫీస్ లో అడుగు పెట్టాను. నన్ను చూసి
"నేను ఇప్పుడే ఇంటికి వెళదాం అని బయలు దేరాను "
"సారీ సర్ , కొద్దిగా లేట్ అయ్యింది "
"పరవాలేదులే " అంటూ నన్ను తన రూమ్ లోకి తీసుకోని వెళ్ళాడు.
"ఎం లేదు శివా , నువ్వు మంత్రి గారి ఇంటికి చివరి సారి వెళ్లి వచ్చిన తరువాత అక్కడ కొన్ని విచిత్ర పరిణామాలు జరిగాయి, మంత్రి గారు నన్ను పిలిచి నీకు చెప్పమన్నాడు. "
"నేను మీకు చెప్పా కదా సార్, వాళ్ళ అమ్మాయి ఆ రోజు నన్ను insult చేసింది అని"
"అవును , చెప్పావు , కానీ ఆ తరువాత ఆ అమ్మాయి బాగా ఫీల్ అయ్యింది అంట, నీకు ఎప్పుడైనా వీలు అయితే ఓ సారి వెళ్లి సార్ ను కలిసిరా , పెద్దాయన నిన్ను రమ్మనాడు, ఆ రోజు నుంచి ఆ అమ్మాయి ఇంట్లోంచి బయటకు వెళ్లి తను ఇండిపెండెంట్ గా బ్రతకాలని అనుకోంటుంది అంట , అదంతా నీ వల్లనే జరిగింది అని పెద్దాయన అనుకుంటున్నాడు"
"నేను సార్ ను కలుస్తాలెండి " అని చెప్పి తన దగ్గర వీడ్కోలు తీసుకోని కళావతి వాళ్ళ ఇంటికి వెళ్లాను.