Update 192
"మీరు పడుకోండి , నేను వెళుతున్నా" అంటూ నారి అక్కడ నుంచి వెళ్లి పోయింది.
తను వెళ్ళగానే , నా దగ్గరకు వచ్చి "సారీ శివా నేను పిచ్చి దాన్ని , నిన్ను నానా మాటలు అన్నా, ఓ నిమిషం నేను ఎం మాట్లాడుతున్నా నో నాకే తెలియడం లేదు , ఇక్కడ వీళ్ళకు దొరికి పోయాము అనే బాధ నన్ను అలా మాట్లాడించింది. ఇప్పటి నుంచి నా నోటిని అదుపులో ఉంచు కోవడానికి ప్రయత్నిస్తాను." అంటూ నన్ను గట్టిగా కౌగలించు కొని ఏడవ సాగింది.
కసేక్కిస్తున్న తన రొమ్ములు నా ఛాతికి గుచ్చు కొంటుండగా తనను నా భుజం మీద తల పెట్టి నన్ను కరచుకొని కుచోంది నాకు దగ్గరగా.
"తొందరలో నోరు జారడం ఆ తరువాత నువ్వే ఏడవడం, సారీ చెప్పడం నీకు బాగా అలవాటు అయ్యింది, ఇంకా రా పడుకుందాము " అంటూ శ్రీ పడుకోండి పోయింది.
"నేను వస్తున్నాలే నువ్వు పడుకో అక్కా " అంటూ తను నాకు ఇంకా దగ్గరగా జరిగింది.
"ఇంక పడుకో పో"
"పొద్దున్నే ఎం జరుగుతుందో తలచు కొంటే భయం వేస్తుంది , మనం ఇక్కడ నుంచి తప్పించు కో లేమా"
"తెల్లవారని , ఎదో ఒకటి చేద్దాం, పారిపోలేము కానీ వాళ్ళను వొప్పించి ఎలాగోలా బయట పడదాము లే "
"నాకైతే భయంగా ఉంది , ప్లీజ్ ఎదో ఒకటి చేసి ఇక్కడ నుంచి క్షేమంగా బయట పడేటట్లు చెయ్యి" అంటూ దీనంగా నా వైపు చూసింది.
వెన్నల వెలుతురులో నిగ నిగా మెరుస్తున్న తన పెదాలను ముద్దపెట్టు కోవాలని కోరిక పుడుతుంటే దాన్ని అదుపులో పెట్టుకొని "పడుకో తెల్ల వారనీ అప్పుడు ఎం చేయాలో చూద్దాం " అంటూ తనను తన స్లీపింగ్ బ్యాగ్ దగ్గరకు పంపాను.
అలాగే గుంజకు అనుకోగా నిద్ర పట్టేసింది , ఉదయపు సూర్య కిరణాలు మొహం మీద పడుతుంటే లేచి వాళ్ళ ఇద్దరినీ లేపాను. నేను లేచిన కొద్దిసేపటి కి నారి వచ్చి మమ్మల్ని ఉరి బయటకు తీసుకొని వెళ్ళింది, ఉదయం పూట కార్యక్రమాలు ముగించు కొని గూడెం లోకి వచ్చాము. తను వెళ్లి చిన్న ముంతల్లో మేక పాలు తెచ్చింది వాటిలో తేనే కలిపి , రోజు తాగే పాలకంటే కొద్దిగా టేస్ట్ వేరుగా ఉన్నా అందులో తేనే కలపడం వల్ల తియ్యగా ఉన్నాయి.
"ఈరోజు సాయంత్రం పోటీలు జరుగుతాయి , అంత లోపల నేను మా నాయనను వొప్పిస్తాను నువ్వు నాకోసం పోటిలలో కొట్లాడతావని " అని చెప్పి వెళ్ళింది.
"దాన్ని పెళ్లి చేసుకొని ఇక్కడే ఈ గూడెం లో సెటిల్ అవుతున్నా వా ఏంటి " అంది వర్షా
"ఎదో ఒకటి చెయ్యాలి కదా లేకుంటే వాళ్ళు కొట్టే 100 కొరడా దెబ్బలకు టపీ మని పోతాను అప్పుడు నువ్వు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుంది"
"అమ్మే వద్దు లే , ఎదో ఒకటి చేసి ఇక్కడ నుంచి వెళ్ళే టట్లు ప్లాన్ చెయ్యి "
రేపు పౌర్ణమి , ఈ రోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పోటీలు ఉంటాయి , గూడెం వాసుల ఆచారం ప్రకారం ప్రతి పౌర్ణమి కి పోటిలలో గెలిచిన వారు , ఎవరి కోసం పోటీ పడ్డారో వాళ్లతో పెళ్ళిళ్ళు జరిపిస్తారు , వాళ్ళల్లో బహు భార్యా తత్వం తప్పు కాదు, పెళ్లి చేసుకొన్న వాళ్లని వాళ్ళ పిల్లలని పోషించే శక్తి ఉంటే ఎంత మంది నైనా చేసుకోవచ్చు.
మద్యానం తరువాత నాకు గూడెం పెద్దతో పిలుపు వచ్చింది , ఆ పిలుపు తెచ్చింది నారి , తన మొహం సంతోషం తో వెలిగి పోతుంది. అంటే తన కోసం గూడెం లో వాళ్లతో నేను కూడా పోటికి దిగొచ్చు అని వాళ్ళ నాన్న ఒప్పుకున్నట్లు ఉంది .
మమ్మల్ని ముగ్గరిని రచ్చ బండ దగ్గర కి తీసుకొని వెళ్ళింది , అక్కడ గూడెం పెద్దతో పాటు ఇంకొందరు పెద్దలు ఉన్నారు, తన మనవడిని తోడ మీద కుచో పెట్టుకొని ఉన్నాడు. ఆ పిల్లాడి అమ్మ రచ్చ బండకు కొద్ది దూరం లో కూచుని ఉంది.
మేము వెళ్ళే కొద్ది వాళ్లలో వాళ్ళు ఏవో మాట్లాడుకొంటు ఉన్నారు , కానీ మమ్మల్ని చూసి వాళ్ళ మాటలు ఆపేసి అందరూ నా వైపు చూడ సాగారు. వీళ్ళు చర్చిస్తున్నవి నా గురించే అన్న మాట అనుకొంటూ ఉండగా గూడెం పెద్ద
"రాత్రి నా మనుమడిని కాపాడి మా గూడేనికి వారసుడిని నిలబెట్టావు , అందుకే నీకు శిక్ష తగ్గించాము, నా కూతురు నీ మీద ఇష్టపడింది, నువ్వు గూడెం లో వాళ్లతో పోటీ పడి గెలిస్తే నాకుతుర్ని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాము అప్పుడు నువ్వు గూడెం లో ఒకడివి అవుతావు కాబట్టి నీకు శిక్ష ఉండదు."
"మరి వీళ్ళ ఇద్దరి సంగతి ఏంటి ? "
"వాళ్ళు కోసం కూడా గూడెం లో పోటీలు జరుగుతాయి వాళ్ళను ఎవరు గెలుచు కుంటే వాళ్లతో వీళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తాము , మాతో పాటు ఇక్కడే ఉంటారు. "
"నేను గూడెం లో వాళ్లతో పోటీ కి రెడీ నారి కోసం " అంటూ నా సమ్మతం చెప్పాను
పోటీలు ఫ్రీ స్టైల్ లో జరుగుతాయి, బాక్సింగ్ రింగ్ లాగా ఓ తాడును కట్టి ఇద్దరినీ లోపలి కి వదులు తారు, అందులో ఎవరో ఒకరు పోటీ నుంచి తప్పుకోనేంత వరకు కొట్టుకోవచ్చు.
ఓ 10 మంది పోటిలో ఉంటే వారిని 5 జతలుగా విడగొట్టి పోటీ పెడతారు అందులో గెలిచిన వాళ్లకు మాత్రమే మల్లి పోటీ ఉంటుంది చివరికి ఎవరు నెగ్గుతారు వాళ్ళను వరిస్తుంది కోరుకున్న అమ్మాయి.
గూడెం కూతురు , వర్షా , శ్రీ వీల్లు ముగ్గురే కాకుండా ఇంకో ముగ్గరికి పోటీ ఉంది మొత్తం 6 మంది అమ్మాయిలకు స్వయం వరం అన్నట్లు ఉంది. కాకుంటే మామూలు స్వయం వరం లో అమ్మాయి నచ్చిన వాడికి దండ వేసి వాళ్ళను చేసుకుంటుంది. కానీ ఇక్కడ అమ్మాయి కోసం పోటీ పడ్డ వాళ్ళల్లో గెలిచిన వాన్ని వరిస్తుంది.
రచ్చ బండ దగ్గర నుంచి మా గుడిసె లోకి రాగానే వర్షా ఏడుపు మొదలు పెట్టింది. "నా జీవితం ఈ అడవిలోనే ముగిసేటట్లు ఉంది, వీళ్ళల్లో ఎవరికో ఒకడికి పెళ్ళాం గా ఉండాల్సి వస్తుంది. ఎన్ని అనుకోని వచ్చాను , ఎం జరుగుతుంది ఇక్కడ మనల్ని రక్షించే వాల్లే లేరా ? " అంటూ ఏడవ సాగింది.
"అవును శివా , ఇంకో రెండు గంటల్లో పోటీలు జరుగుతాయి ఆ తరువాత మనం చేసే ది ఎమీ లేదు , ఎదో ఒకటి చెయ్యి , నాకు కుడా ఇప్పుడు భయంగా ఉంది " అంటూ తనకు వత్తాసు పలికింది శ్రీ
"పోటీలు జరగ నీ , ఎదో ఒక దారి దొరుకుతుంది , మనం పారిపోవాలంటే ఇక్కడ వీళ్ళు కాదు , వాళ్లకు తెలిసినట్లు మనకు అడివి తెలియదు తొందరగా దొరికి పోతాము , ఆ తరువాత శిక్ష మరణమే , దాని కంటే ఎదో ఒక దారి దొరుకుతుంది అంత వరకు ఓపికగా ఎదురు చూడాలి"
"ఎన్ని రోజులు ఎదురు చూడాలి , ఈ లోపునా మాకు వీళ్లతో పెళ్లి అయ్యి పిల్లలు కూడా పుట్టే ట్లు ఉన్నారు."
"అంత వరకు అవసరం లేదు ఈ పోటీలు కానీ , ఈ లోపున ఎదో దారి దొరకక పొతే అప్పుడు గన్ కి పని చెప్దాం" అంటూ పడకేసాను. రాత్రి మేలుకోవడం వలన వెంటనే నిద్రలోకి జారుకున్నాను.
ఓ రెండు గంటల సేపు నిద్రపోయా క నారి వచ్చి "పోటీలు జరిగే సమయం అయ్యింది పదండి అక్కడికి వెళ్దాం అంటూ మమ్మల్ని తొందర పెట్ట సాగింది."
మేము తెచ్చిన రంగు రంగుల పూసలు , మిగిలిన వాటిని ఒక బ్యాగ్ లో పెట్టి శ్రీ కి ఇచ్చి తన దగ్గర పెట్టుకొని పోటిల దగ్గరకు తీసుకొని రమ్మన్నాను.
ముగ్గురం తన వెంట అక్కడికి వెళ్ళాము.
రచ్చ బండ పక్కన ఓ చిన్న బాక్సింగ్ ఏరినా లా తయారు చేసారు , చుట్టూ తాడు కట్టారు , కింద పడినా తగలకుండా ఇసుక వేసారు.
గూడెం లో జనం అంతా అక్కడే ఉన్నారు. పెళ్లి కోసం వచ్చిన అమ్మాయిలు కొద్దిగా ప్రత్యేకంగా రెడీ అయ్యారు. వీళ్ళు ఇద్దరినీ నారీ తనతో పాటు తీసుకొని వెళ్లి వాళ్ళ ఆచారం ప్రకారం మొహానికి ఏవో రంగులు పూసి తయారు చేసింది , వీళ్ళు వేసుకున్న బట్టలు మాత్రం టచ్ చేయలేదు.
మొత్తం 6 గురికి పోటీ , వాళ్లలో మొదటి ముగ్గరికి పెద్ద పోటీ లేనట్లు ఉంది. అందులో ఒక అమ్మాయి చాలా సన్నగా ఉంది ఆ అమ్మాయి కోసం ఇద్దరు మాత్రమే పోటికి వచ్చారు. ఇంకో టి మద్య రకంగా ఉంది తన కోసం 6 మంది పోటీ లో ఉన్నారు , ఇంకో అమ్మాయి కొద్దిగా లావుగా ఉంది తన కోసం ఎవ్వరు పోటీలో లేరు ఒక్కడే అబ్బాయి , వాడికి పోటీ లేకుండా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు.
వారి తరువాత గూడెం కూతురు కోసం దాదాపు 12 మంది పోటిలో ఉన్నారు నాతొ కలిపి. గూడెం పెద్దలు నిర్ణయిస్తారు ఎవరు ఎవరు ఎరినాలోకి దిగాలి అనేది. వర్షా కోసం , శ్రీ కోసం ఎంత మంది వస్తా రో ఇంకా తెలియడం లేదు , బహు శా వీళ్ళ పోటీలు ముగిసిన తరువాత ఈ ఇద్దరి కోసం ప్రత్యేకంగా పోటీలు నిర్వహించే టట్లు ఉన్నారు.
మొదటి పోటీ కి రెడీ అయ్యారు , గోదాలోకి దిగే ముందు అక్కడ ఓ పెద్దాయన ఉన్నాడు రెఫరీ అన్నట్లు గా. వాళ్ళను ఇద్దరినీ లోపలి పంపాడు. ఇద్దరు దాదాపు ఒకే వయసులో , ఒకే సైజులు ఉన్నారు. చిన్న బెల్ లాంటిది కొట్టి స్టార్ట్ చేసాడు.
వాల్లు ఏవిధంగా పోటీ పడతారు అని చూడ సాగాను.
ఒకరి కొకరు పట్టుకొని కింద పడే వేయడానికి చూస్తున్నారు , మద్యలో ఒకరి కొకరు ముష్టి ఘాతాలు విసురు కో సాగారు.
ఓ 10 నిమిషాలు ఒకరు కొకరు ముష్టి ఘాతాలు విసురు కొని , అందులో ఒకడు టెక్నిక్ గా రెండో వాడిని కింద పడేసి వాడి మీద కుచోన్నాడు భూమికి అనగ బట్టి. రెండో వాడు వొడి పోయినట్లు చేయి ఎత్తగానే పోటీ అయిపోయినట్లు ప్రకటించారు.
గెలిచిన వాన్ని అందరూ పొగుడుతూ ఉండగా , వాడిని వరించే అమ్మాయి వాడి దగ్గరకు వచ్చి అడివి పూలతో చేసిన దండ వాడి మేడలో వేసి తన వెంట తీసుకెళ్లింది.
ఆ తరువాత batch రింగ్ లోకి దిగింది. బెల్ కొట్టిన రెండో నిమిషం లో అందులో ఒకడు రెండో వాడిని తన వీపు మీద వేసుకొని గిర గిరా రింగు అంతా తిప్పి నెల విసిరేశాడు. కింద పడ్డ వాడు తిరిగి లేయలేదు.
తరువాత బ్యాచ్ వచ్చింది ఇద్దరు హోరా హోరిన కొట్టు కొన్నారు ఓ 8 నిమిషాలు సేపు. 9 నిమిషం లో ఒకడు రెండో వాడిని రెజ్లింగ్ లో లా భూమికి నొక్కి పట్టి వాడి కాళ్లు చేతులు రెంటిని తన అదుపులో పెట్టుకొని వాడి వీపు మీద తిష్ట వేసాడు. ఓ నిమిషం పాటు గమనించిన రెఫరీ పడుకున్న వాడికి ఓడిపోయినట్లు ప్రకటించాడు.
ఆ బ్యాచ్ లో చివరికి 3 మిగిలారు , పెద్దలతో మాట్లాడి వాళ్లలో ఇద్దరినీ లోపలికి పంపారు వాళ్లలో గెలిచిన వాడు బయట ఉన్న వాడితో పోటీ పడతాడు. , కానీ లోపల గెలిచిన వాడికి కొద్దిగా టైం ఇవ్వబడుతుంది పోటికి.
లోనకు వెళ్ళిన వాళ్లలో ఒకడు తొందరగా లొంగి పోయి బయటికి వచ్చేశాడు. చివరలో మిగిలింది ఇద్దరే వాళ్ళకు ఇద్దరికీ ఇంకో గంట తరువాత పోటీ పెడతారు .
ఈ లోపున నారికి పోటికి వచ్చిన వాళ్ళను గోదాలోకి పంప సాగారు బ్యాచ్ లు పరంగా.