Update 193
నేను కుడా నా ప్లేస్ నుంచి వాళ్ళ ఉన్న దగ్గరి కి వెళ్లాను . నాతో పోటీ పడే వాడితో జత కలిపి పక్కన కుచో మన్నారు. నాతో రింగ్ లోకి దిగే వాడు నా కంటే దిట్టంగా ఉన్నాడు. నా వైపు కోపంగా చూస్తూ , నారి వైపు చేతిని చూపిస్తూ అది నాది అన్నట్లు సైగ చేసాడు వాడి మాటలకు నవ్వుతూ , సరే అన్నట్లు నవ్వుతూ వాడి వైపు చూస్తుండి పోయాను. వాడి పేరు బాలన్న అని తెలిసింది
చూస్తుండగానే మా వంతు వచ్చింది గోదాలోకి వెళ్ళడానికి , ఇంతకూ ముందు వాళ్ళు పోరాడే విధానం తెలియడం వలన నా మనస్సులో ఒక విదమైన టెక్నిక్ రూపు దిద్దుకొంది ఆ రింగ్ లోంచి గెలుపుతో బయటికి రావడానికి.
మేము ఇద్దరం లోపలి కి వెళ్తుండగా చాలా మంది వెనుక నుంచి కేకలు వేయసాగారు. మిగిలిన వారు ఆసక్తితో ఎదురు చూడసాగారు ఎం జరుగుతుందో అని.
రెఫరీ బెల్ కొట్టి కొట్టగానే , మత్తెక్కిన మత్తే భం లా నా మీదకు దూకాడు బాలన్న. అలాంటిది ఎదో చేస్తాడని ఊహించడం వలన వెంటనే పక్కకు దూకాను. హుంకరిస్తూ నా వైపు రాసాగాడు. వాడి చేతులకు అందకుండా రింగు చుట్టూ రౌండ్ వెయసాగాను. వాడు కోపంతో నన్ను పట్టుకొని ఇసుకలో తొక్కి పెట్టాలని నా వెంట పరిగెత్త సాగాడు. 5 రౌండ్స్ కి వాడికి ఆయాసం రాసాగింది , ఇంకో రౌండ్ వేసి వేగంగా నా వెనుకే వస్తున్న వాడి కాళ్ల మీద పోకస్ పెట్టి కాళ్ల మీద కిక్ కొట్టాను కింద కూచుని.
ఆ వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక నేను కొట్టిన కిక్ వాడి కాళ్లను అన్ బాలన్స్ చేస్తుండగా ముందుకు బోర్లా పడి ఓ పల్టి కొట్టాడు. తన నోరు ముక్కు నిండా ఇసుక దొరకిపోయి వాడికి ఉపిరి అడ్డం కష్టం అయిపోయింది.
వాడి దగ్గరకు వెళ్లి వాడి చేతిని పట్టుకొని పైకి లేపి వాడి ని కొద్దిగా ముందుకు వంచి వాడి నోటిలోకి , ముక్కులోకి పోయిన ఇసుకను విదిలించే సరికి కొద్దిగా ఆయాసం తగ్గి ఊపిరి పీల్చుకోసాగాడు.
రెండో మాట మాట్లాడకుండా తను ఏరినా నుంచి బయటకు వెళ్ళిపోయాడు. రెఫరీ ఆ బ్యాచ్ లో నన్ను విజేతగా ప్రకటించగా బయటకు వచ్చాను.
ఆ తరువాత ఓ 5 batch ల లోంచి 5 గురిని సెలెక్ట్ చేయడానికి దాదాపు 45 నిమిషాలు పట్టింది. గెలిచినా 6 గురిని 3 batch లుగా విడగొట్టి మరో మారు రింగు లోకి పంపారు.
నా టర్న్ చివరగా వచ్చింది. రెండో సారి నాతొ పోటికి వచ్చిన వాడు ఇంతకూ ముందు వాన్ని రెండే నిమిషాలలో బయటికి పంపాడు తన ముష్టి ఘాతాలతో. అది గుర్తుకు పెట్టుకొని లోనకు దిగాను.
ఇంతకూ మునుపు నేను పోరాడిని విధానము వాడికి అర్థం అయినట్లు ఉంది. బెల్ కొట్టగానే నన్ను కార్నర్ చేసి నా పైన ముష్టి ఘాతాలు విసర సాగాడు. వాడి పంచ్ లను గాళ్లో అడ్డపెడుతూ ఛాన్స్ కోసం వెయిట్ చేయసాగాను.
డిఫెన్స్ లో వాడి దెబ్బలు కాచుకోం టు వాడిలో కోపాన్ని రెచ్చ కొట్టే సరికి వాడికి ఆవేశం ఎక్కువ అయ్యి బా లెన్స్ కోల్పోయాడు. ముందుకు పంచ్ లు విసిరేటప్పుడు వాడి బరువు అంతా కుడి కాలు మీద ఉండడం చూసి వడుపుగా నా కాలుతో వాడి కుడి కాలు మీద కొట్టాను. ఫట్ మంటూ కాలు విరిగింది ఆ కిక్ కు . వాడు కింద పడి తిరిగి పైకి లేయలేదు.
రెండో రౌండ్ విజేతగా బయటకు వచ్చాను.
తరువాతి రౌండ్స్ లో విజేతలతో అందరూ బలంగా బాగా పోరాట పటిమతో గెలుపొందారు.
చివరి రౌండ్ లో ముగ్గురం మిగిలాము. ఇద్దరికీ ఓ సారి పోటీ పెట్టి అందులో గెలిచిన వాన్ని చివరి వాడితో పోటీ పెడతారు. అంత లెట్ ఎందుకు అని నారి ని దగ్గరకు రమ్మని నా మనసులో మాట తనకు చెప్పాను. అది వెళ్లి వాళ్ళ నాన్నకు చెప్పింది. వాళ్ళ నాన్న రెఫరీ ని పిలిచి నేను ఎం చెప్పా నో అది ఆయనకు చెప్పాడు.
వాళ్ళ గూడెం లో ఎవరు ఈ విధంగా చేయలేదు అనుకుంటా రెఫరీ నా మనసులోని కోరిక వెల్లడి చేయగానే అందరూ తమలో తాము గుస గుస మాట్లాడుకో సాగారు.
నా మనసులో ని కోరిక కు అనుగుణంగా నా పోటీ దారులు ఇద్దరు ఒప్పుకోగానే అందరిలో ఎదో చెప్పడానికి వీలు కానటమువంటి టెన్షన్ బిల్డుప్ కా సాగింది.
ముగ్గరిని ఒకే సారి రింగ్ లోకి దింపారు .
నేను నారి కి చెప్పాను వాళ్ళ ఇద్దరితో ఒకే సారి తలపడతాను వాళ్లకు సమ్మతమైతే అని. గెలుపు ఓటముల గురించి చర్చించకుండా ఇద్దరు ఒకరితో తలపడటం అనే ఆలోచన వాళ్ళ ఇద్దరికీ బాగా నచ్చి నట్లు ఉంది అందుకే ఇద్దరు ఒప్పుకొని బరిలోకి దిగారు.
ఇటువంటి గేమ్ రెఫరీ కుడా ఎప్పుడు చూచినట్లు లేదు కాబట్టి మమ్మల్ని లోనకు వదిలేసి ఎం జరుగుతోందా అని గూడెం ప్రజలతో కలిసి పోయాడు.
ఇద్దరు ముందే మాట్లాడు కొన్నట్లు కుడి వైపు ఒకడు ఎడం వైపు చేరి ఒకడు నా మీదకు రాసాగారు.
రెండో రౌండ్లో నా కాలి దెబ్బ తిని కాలు విరగ్గొట్టు కొన్న వాడి స్థితి బాగా దగ్గర్నుంచి చూచినట్లు ఉన్నారు , నా కాలికి అంద నంత దూరం లో ఉంటూ నా మీదకు ముష్టి ఘాతాలు విసర సాగారు.
ఓ రెండు నిమిషాలు వాళ్ళ ముష్టి ఘాతాలను ఎదుర్కొంటూ వారి పోరాట పద్దతిని గమనించ సాగాను. ఇద్దరి లో ఒక విధమైన వరుస క్రమం అనుసరిస్తూ నా మీదకు దాడి చేస్తున్నారు , వారి వరుస క్రమాన్ని ఛేదించి వారి మీద దాడి చేయాలి అని నిశ్చయించు కొంటూ.
ఓ భీకరమైన కుంగుఫు షౌట్ చేస్తూ వాళ్ళల్లో బెదురు పుట్టించి కుడివైపు నున్న వాడు నా మీదకు విసిరిన చేతి మని కట్టు పట్టుకొని కొద్దిగా కిందకు వంగి కుచోనే వాడి బొడ్డు దగ్గర నా అరికాలు పెట్టి వాడిని గాళ్లో లేపుతూ ఓ చిన్న బేసిక్ జూడో టెక్నిక్ తో 10 అడుగుల దూరంలో పడేట్టు విసిరాను.
వాడు దాదాపు 90 కిలోల బరువు ఉంటారు నేను ఉపయోగించిన టెక్నిక్ కు దూదే పింజలా గాళ్లో లేచి అంత దూరం లో ఇసుక బస్తాలా పడ్డాడు , పడ్డవాడు తిరిగి లేవకుండా వాడి జాయింట్లు జారిపోయినట్లు ఉన్నాయి అక్కడే ఉండి పోయాడు.
తనతో పాటు బరిలో దిగిన వాడు వాడి మీదుగా గాళ్లో తేలుతూ ఏరినా బయట పడ్డం చుసిన రెండో వాడు , నాతొ పోరాటానికి స్వస్తి చెప్పి నన్ను విజేతగా చేశాడు.
వాడి ఎప్పుడైతే ఏరినా లోంచి బయటకు ఒడి పోయి బయటకు వచ్చా డో గూడెం జనాలు చెప్ప ట్లు కొడుతూ నా విజయాన్ని పొగడ సాగారు. నారి తన చేతులోని పూల దండ నా మేడలో వేసి , ఇంకో దండ నా చేతికి ఇచ్చి తన మేడలో వేయించు కొని తన పెనిమిటి చేసే సు కొంది.
వాళ్ళ ఆచారం ప్రకారం నేను ఇప్పుడు గూడెం లో ఒకడిని అయ్యాను.
మిగిలిన అన్ని పోటిల చివర వర్షా , శ్రీ కోసం పోటీ పెట్టారు. దానిలో గూడెం పెద్ద కొడుకు ఉండడం వలన వాడి బలం ముందు ఎవ్వరూ పనికి రారు అని గూడెం ప్రజలకు ముందే తెలుసు అందుకే పెద్ద పోటీ ఉండదు అనుకున్నారు.
ఆ పోటీ జరగడానికి కొద్ది ముందు నారి ని కొద్దిగా పక్కకు తీసుకొని వెళ్లి తనతో కొన్ని మాటలు మాట్లాడి తన సమ్మతం తీసుకొని వచ్చి అక్కడ నిలబడ్డాను.
వీళ్ళ ఇద్దరి కోసం పోటీలు అనౌన్సు చేయగానే నారి వాళ్ళ నాన్న దగ్గరి కి వెళ్లి ఎదో చెప్పింది.
వీళ్ళ ఇద్దరి కోసం ఎవరు ఎవరు బరిలోకి దిగుతారో రండి అని అనౌన్సు చేసాడు. గూడెం పెద్ద కొడుకు లేచి తను రెడీ అన్నట్లు ముందుకు వచ్చాడు వాడు లేచి రాగానే మరో మారు గూడెం లోని జనాల్లో ఓ విదమైన అలజడి మొదలైంది. అందరు వాడి వైపు చూస్తుండగా నారి నా దగ్గరకు వచ్చి నన్ను వాళ్ళ అన్న ఉన్న చోటుకు తీసుకొని వెళ్లి నేను కూడా పోటీ లో పాల్గొంటు ఉన్నట్టు చెప్పింది.
నారి స్వయంగా తన చేతుల మీదుగా వాళ్ళ అన్నకు పోటీగా నన్ను పంపడం కొందరికి సంతోషం కలగగా , మరి కొందరికి కంటి కింపు గా తయారయ్యంది. నేను వాడి పక్కన నిలబడగానే తన బిడ్డను ఎత్తుకొని మా వైపు చూస్తున్న గూడెం పెద్ద కోడలు మొహం లో ఓ విదమైన మెరుపు కనిపించింది. దాని అర్థం ఏంటో అనుకొంటూ వీళ్ళ ఇద్దరి వైపు చూసాను.
అంత వరకు ఎప్పుడు ఎం జరుగు తుందో అనే టెన్షన్ ఓ వైపు , మా భవిష్యత్ ఏంటి అనే భయం తో ఉన్న వాళ్ళ మొహం లో చిరునవ్వు గమనించాను నేను కూడా పోటిలోకి రావడం.
మేము ఇద్దరం మాత్రమే మిగిలాము పోటిలో . అంతకు ముందే గూడెం పెద్ద కొడుకు గురించి తెలిసిన వాళ్ళు ఆ పోటికి వెనకడుగు వేయగా , మిగిలిన వాళ్ళు నేను కుడా పోటిలోకి దిగే సరికి మమ్మల్ని ఇద్దరిని పోటికి సరియైన అర్హత గల వెళ్ళమని నిర్ణయించి అందరూ తప్పుకున్నారు.
నారి కోసం పోరాడడం ఒక ఎత్తై తే వీళ్ళ కోసం పోరాడడం ఇంకో ఎత్తు అసలు పోటీ ఇక్కడే , వీళ్ళు గెలవాలంటే నేను గూడెం లో ఒకడిని అయితే గానీ పోటికి రాలేను.
ఆ అర్హత పొంద దానికే నారి ని లైన్ లో పెట్టి వాళ్ళ నాన్న వైపు నుంచి ఎటువంటి ఆటంకం లేకుండా నారి ని గెలుచు కొన్నాను. ఎప్పుడైతే నారి పెనిమిటిగా నేగ్గానో గూడెం లో ఒకడిని అయిపోయాను. గూడెం లో ఒకరి కంటే ఇద్దరినీ చేసుకోవడం ఆచారం కాబట్టి వీళ్ళ కోసం పోటిలో పాల్గొనడం తప్పు కాదు , దానికి తోడూ నారి నే స్వయంగా నన్ను అక్కడికి పంపడం అందరికి బాగా నచ్చింది.
గూడెం పెద్ద కొడుకు గురించి అందరికి తెలియడం వళ్ళ వాడికి పట్నం చిలకలు దక్క కుండా ఉంటే బాగుండు అని కోరుకునే చాలా మంది గూడెం వాసులు ఉండడం వలన వారి కళ్ళు అన్నీ నా మీదే ఉన్నాయి.
ఇద్దరం ఎరినాలో కి రాగానే రెఫరీ బెల్ కొట్టి మా ఇద్దరినీ పోటికి సిద్దం చేసాడు.
బెల్లు కొట్టగానే వాడు నా మీదకు దూకాడు. అంతకు ముందు రోజు భల్లూకం గుర్తుకు వచ్చింది వాడి దూకిన విధానం చూడగానే. ఆ ఎలుగు ను అగ్గి చూపి భయపెట్టి నట్లు వీడిని ఎం చూపి భయపెట్టాలి అనుకొంటూ వాడి నుంచి తప్పించు కొన్నాను.
వాడి చేతికి దొరికితే ద్రుతరాస్ట్రుని కోగిట్లోకి వెళ్లి నట్లే , వాడు తీవ్రంగా నన్ను తన కోగిట్లోకి లాక్కోవాలని నా వెంట పడ సాగాడు , వాడికి దొరకకుండా ఏరినా లోపల రౌండ్లు కొట్టసాగాను.
ఇంతకు ముందు ఓ ప్రత్యర్థిని అలా రౌండ్లు కొట్టించి అలసిపోయే ట్లు చేసి ఓడించిన విధానం వాడికి గుర్తుకు వచ్చి నట్లు ఉంది , ఆగిపోయి మీదకు రాసాగాడు. ఇంక లాభం లేదనుకొని ఎదురు దాడికి దిగాను.
ఎప్పుడో రేర్ గా ఉపయోగించే టెక్నిక్ ను ఉపయోగించాను. షావాలిన్ లోని ఓ గురువుకి అనుంగ శిష్యుడిగా ఉండడం వలన ఆ టెక్నిక్ ను ప్రత్యేకంగా నేర్పించాడు.
కుడి కాలు బొటన వెలి మీద శరీరాన్ని మోపి బొంగరం లా గిర్రున తిరుగుతూ , ఆ చుట్లు ఓ స్థాయికి చేరు కొంటుండగా ఎడమ కాలిని ప్రత్యర్థి మీదకు ప్రయోగించడం , ఈ లోపల ప్రత్యర్థి ఉత్సాహంతో దగ్గరకు వచ్చినా జరగ వలసిన డ్యామేజు జరిగి పోతుంది.
వేగంగా తిరిగే ఫ్యాన్ బ్లేడుల దేన్నైనా పెడితే ఫలితం ఎలా ఉంటుందో ఇంచు మించు ఇక్కడ కూడా అదే ఫలితం ఉంటుంది ఇందులోకి ఎంటర్ అయ్యే వారికి కూడా.
కంఠం నుంచి ఓ విధమైన పొలికేక బయటికి వస్తు దానికి అనుగుణంగా నా శరీరం చుట్లు తిరగ సాగింది. చూసే వాళ్లకు నా శరీర బాగాలు కనబడడం లేదు కానీ అక్కడ ఎదో సుడిగాలి తిరుగుతూ ఉన్నట్లు అనిపిస్తుండగా కింద ఉన్న ఇసుక నా చుట్టూ తిరగ సాగింది.
కొద్దిగా వేగం అందుకోగానే , నా చుట్టూ ఎం జరుగు తుంది అనే ఉత్సాహం తో తనే కొద్దిగా ముందుకు వచ్చాడు , అప్పుడే ఆ టెక్నిక్ లో రెండో భాగం ప్రయోగించాను. ఎడమ కాలును ఏటవాలు గా పైకి లేపుతూ స్టిఫ్ గా ముందుకు చాచాను.
సరిగ్గా అదే సమయానికి వాడు ముందుకు రావడంతో ఆ వేగం తో కాలు వాడి మొహానికి కనెక్ట్ అయ్యింది. ఎదో నల్ల మొద్దు తన మొహం మీద విరిగి పడ్డట్లు ఫీల్ అవుతూ ఎగిరి 4 అడుగుల దూరం లో పడ్డాడు.
తన దవడ పక్కకు తిరిగి పోయింది. తన పై పళ్ళు కొన్ని స్థానభ్రంశం చెందినట్లు ఉన్నాయి , మొహం అంతా రక్తం తో తడిచి పోయింది. వాడి మీద కిక్ అప్లై కాగానే నా స్పీడ్ తగ్గిచ్చు కొంటూ నిశ్చల స్థితికి వచ్చి వాడి దగ్గరకు వెళ్లాను.
ఆవరేజీ మనిషి ఆ దేబ్బకు పైకి వెళ్లి పోయే వాడు కానీ ఒక విధంగా వాడికున్న బలం వాడిని రక్షించగా, వాడిని ఓడించడమే నాకు కావలసింది అంతే కానీ వాడికి హాని చేయడం నా ఉద్దేశం కాక పోవడం కూడా వాడిని రక్షించింది.
వాడు ఉన్న స్థితిని చూసి, వెంటనే వాడిని అక్కడ నుంచి లేపి ఏరినా బయటికి తీసుకొని వెళ్లాను , బయటికి వెళ్ళగానే ఇంకా నలుగుతూ తోడు రాగా గూడెం లోని వైద్యుడు వాడికి సపర్యలు చెస్తుండగా నేను గూడెం పెద్ద దగ్గరకు వెళ్లాను.
వర్షా , శ్రీ ఇద్దరు , గూడెం ఆచారం ప్రకారం నా వాళ్ళు , అంటే నా భార్యలు.
"వాళ్ళ మాటలకు ఎం ఎదురు చెప్పకండి , వాళ్ళు ఎం చేయమంటే అదే చేయండి , మనం ఇక్కడ నుంచి బయట పడాలి అంటే , వాళ్లలో మనం కూడా ఒక బాగం అన్నట్లు గా ప్రవర్తించాలి అప్పుడే మనం ఇక్కడ నుంచి తొందరగా బయటకి వెల్ల వచ్చు. " అంటూ వాళ్ళకు మాత్రమే అర్థం అయ్యే భాషలో చెప్పాను.
సరే అన్నట్లు ఇద్దరు తలలు ఉ పారు.
గూడెం పెద్ద మూడు దండలు తెప్పించి మా ముగ్గరి చేత మార్పించారు. ఆ దండల మార్పిడి ముగియగానే , అక్కడ అంతా ఓ పండగ వాతావరణం ఏర్పడ్డ ది.
అడవిలో దొరికే ఇప్ప పూలతో కాచిన సారా అందరికి తలా ఒక ముంత ఇచ్చారు తాగడానికి . తాగే వాల్లు తాగుతూ అక్కడున్న విగ్రహం ముందు గంతులే సాగారు. నా వంతుకు వచ్చిన సారాని తాగే సి వాళ్లతో చేరాను.
శ్రీ , వర్షా వాళ్ళ చేతుల్లోని ముంతలు సగం తాకి అక్కడ పెట్టే సి వచ్చి మాతో చేరారు.
దాదాపు రెండు గంటల పాటు సాగిని ఆ సామూహిక నృత్య ప్రదర్శన. ఆ తరువాత తాగి తాగి తలకెక్కిన వాళ్ళు అక్కడే పడిపోయారు , ఓపిక ఉన్న వాళ్ళు తమ గుడిసెలకు వెళ్లి తొంగున్నారు.
వాళ్ళు తాగిన సగం ముంత సారాకి శ్రీ , మరియు వర్షా సగం హాష్ లో ఉండగా , నారి నేను ఇద్దరం వాళ్ళను మేము ఉంటున్న గుడిసెకు మోసుకొని వెళ్ళాము.
"అక్కా , ఇప్పుడు మనకు పెళ్లి అయ్యింది కదా , మరి ఇప్పుడు శోభనం కూడా అవుతుందా " అంటూ ముద్దు ముద్దుగా వర్షా శ్రీ ని అడుగుతుంది.
"ఏమో , నే , మన మొగుడి గారిని అడగాలి " అంటూ శ్రీ అదే ముద్దు ముద్దు మాటలతో రిప్లై ఇచ్చింది.
"ప్రస్తుతానికి పడుకోండి , శోభనం తరువాత చేసుకొందాము " అంటూ ఇద్దరినీ వాళ్ళ వాళ్ళ స్లీపింగ్ బ్యాగ్ లోకి నెట్టి నారి నేను నిన్న రాత్రి సరసాలాడిని గుడిసెలోకి వెళ్లి తలుపు వేసుకున్నాము.