Update 26
పొలం గేటు కిర్రు మన్న చప్పుడికి వేలుకవ వచ్చింది. లేచి చుస్తే 4.30
కొట్టం లోంచి బయటకు వస్తుంటే , మల్లన్న కనబడ్డాడు
"ఎ మల్లన్న ఎబ్బుడో చ్చినారు టౌన్ నుంచి "
"ఓ గంటైంది , అమ్మేల్లు , నీకోసం సుపిట్టుకొండా రు "
"ఆ గుడికి వెళ్ళా లంట పోతున్నా లే " బోరు దగ్గరికి వెళ్లి మల్లి ఓ సారి మొహం కడుక్కొని ఇంటిదారి పట్టా
ఇంటిముందర ఓ గుంపు ఉన్నారు , ఏమి జరిగింది అన్ని , పరేగెత్తు కుంటు వెళ్ళా
అక్కడ పెద్దాయన ఎవరితోనో గొడవ పడుతున్నాడు గేటు ముందర
ఇంట్లో ఆడోల్లు అందరు బయటికి వచ్చి చుపెట్టుకొని ఉన్నారు
పెద్దాయన , అయన భార్య , పక్కనే నల్లప్ప గుడ్డలు చినిగి ఉన్నాయి ఏడుస్తున్నాడు
అటువైపున ఎవరో ఐదు ఆరు మంది వున్నారు. నేను నల్లప్ప పక్కకు వెళ్లి
"ఏమైంది, ఎందుకు ఏడుతున్నావు "
"అదిగో ఆయప్ప , వాళ్ళ దోవంటా ట్రాక్టర్ తోలనని కొట్టినాడు " అంటూ ఓ 30, 32 వయసున్న అతని వైపు చేయి చూపెట్టాడు
"నా దోవంటా , బండ్లు పోనిస్తే నరికి పేగులు పెడతా" అంటూ అరుస్తున్నాడు.
"ఆయనే కొట్టి , మల్లీ ఇంటిమిదకు ఎందుకు వచ్చినాడు ?"
"వాళ్ళకు ఈల్లకు పడదు , అందుకే రొంత సందు దొరికినా , కొట్లాటకు వత్తాడు "
అటువైపు అతను , పెద్దాయనను తిట్టడం నాకు నచ్చాలా , పెద్దాయన సర్ది చెప్పాడానికి ప్రయత్నిస్తున్నాడు కాని అటు వైపు ఇంకా గొంతు పెంచాడు
"రేయ్ , ముసిలోడా ? అప్పుడెప్పుడో MLA గెలిచినావాని విర్ర విగుతున్నావో , ఇప్పుడు అంతా మాదే , నోరు మూసుకొని పడుండండి " అంటూ తిట్ట సాగాడు
నేను దగ్గరకు వెళ్లి
"ఏందన్నా , పెద్దాయనను పట్టుకొని అంత మాటలు , ఇప్పుడు ఏమి నష్టం జరగ లేదుగదా ? ఇంకో సారి మీ దోవ గుండా రాడులే "
"ఎవడ్రా నువ్వు " అంటూ వచ్చి నా కాలర్ పట్టు కున్నాడు. రెండో నిమిషం కింద మన్నులో దోర్లాడాడు
వాడు ఎప్పుడైతే కింద పడ్డాడో వాని పక్కనున్న ఇదు మంది పరుగెత్తు కుంటు వచ్చి నా మింద కలబడ్డారు.
"అయ్యో అబ్బి , ఎందుకు కొట్లాటకు పోతావు వాళ్ళ మీదకు " అంటూ పెద్దాయన దగ్గరకు రా సాగాడు .
"మల్లన్నా , పెద్దయ్యను ఇంట్లోకి తిసికేల్లు , వీళ్ళ సంగతి నేన్ చూసుకుంటా " అంటూ వాళ్ళ మద్యలోకి దూరి
నాలుగే నాలుగు నిమిసాలు వచ్చినోల్లు ఐదు మంది మెదతోని జతకు చేరుకున్నారు
కాని నా కొడుకులు నాకు నాలుగు ముచ్చు దెబ్బలు కొట్టారు. ఓ కన్ను వాచింది నాకు మిగిలినవి పెద్ద దెబ్బలేమీ కాదు.
వాళ్ళలో ఇద్దరికీ చేతులు విరిగాయి , ఒకడికి ముముందర పళ్ళు 4 కింద పడ్డాయి, ఇంకోడికి మోకాలి చిప్ప ఉందొ , వుసిపోయిందో తెలిదు
ఇంకోడు మూలుగుతూ పడుకొన్నాడు
"ఏయ్ నువ్వు ఎవరో నాకు తెలిదు నన్ను కొట్టి పెద్ద తప్పు చేసినావు నేను ఏంటో చుపిత్తా నా కోడాకా " అంటూ లేచాడు నా వైపు తినేసేటట్టు చూస్తూ
"ఇదిగో , నువ్వు కుడా ఎవ్వరో నాకు , తెలిదు మా పెద్దయ్యను నా ఎదురుగా తిట్టి పెద్ద తప్పు చేసావు , నేను సర్ది చేబుదా మంటే కాలరు పట్టుకొని రెండో తప్పు చేసావు.
ఇక్కడే , ఈ ఊర్లో ఇంకా నాలుగు రోజులుంటా, ఎం పిక్కుంటావో పిక్కో "
"వెళ్లి నీ వాళ్ళకు ఆ చేతులకు , కాళ్ళకు కట్లు కట్టిచ్చు లేకుంటే , చస్తారు ఇక్కడే " అన్నా
అందరు నావైపు రుస రుసా చుస్తే వెళ్ళారు.
నేను ఇంట్లో కి వచ్చాకా అందరి మొహాల్లో ఆందోళన చూసాను.
"ఇప్పుడు ఏమైంది , పెద్దయ్యా ఆ నా కొడుకులు ఇంకో సారి ఇటువైపుకు రావడానికి కుడా ఆలోచించరు"
"అది కాదు అబ్బి , వాడు ఎవుడను కున్నావు , సర్పంచ్ కొడుకు "
"అయితే వాడికేమన్నా కొమ్ములోచ్చినయా , వాడు పెద్దా చిన్నా చూడకుండా అంతంత మాటలు అంటుంటే నావల్ల కాదు పెద్దయ్యా"
"ఎమన్నా నట్టం జరిగింటే కట్టిత్తాము , ఊరికే బండి పోయిందని కొడతాడా , సర్ది చెబుదామని పొతే కాలరు పట్టుకొంటాడు "
"మంచి పని చేసినావురా అబ్బి , కాని ఏమైతుందో సూసు కుందాము " అంటూ సపోర్ట్ చేసింది పెద్దాయన భార్య
"నా కొడుక్కు పోను చేసి చెప్తా వుండు , వాడు వచ్చి ఈ నాకొడుకుల చేమ్మడాలు తిత్తాడు "
"ఏయ్ , వాని కెందుకు పోను ఇప్పుడు , ఎట్టాగు రేపు వత్తాడు గదా తిరణాలకు అప్పుడు చెప్పుడువులే " అన్నాడు పెద్దాయన
"అయ్యో అబ్బీ , నీకు దెబ్బలేమీ తగల్లెదుగా "
"పెద్ద దెబ్బలేమీ లేదులెమ్మా , ఇదిగో ఈ కన్ను దగ్గర కొద్దిగా తగిలింది " అంటూ వచ్చిన కన్ను చూపెట్టాను.
"ఒమ్మి , రొన్ని నీళ్ళు యెచ్చ బెట్టు , కన్ను మింద కాపడం పెడితే తగ్గి పోతుంది "
నేను దగ్గరున్న తొట్టి దగ్గరకు వెళ్లి చల్లని నీళ్ళతో మొహం కడుకొని కారు దగ్గరకు వచ్చాను.
నేను అక్కడ లేనను కొని పెద్దాయన తన భార్యతో మాట్లాడడం నాకు విన బడింది.
"ఈ యబ్బి ఎవురోగాని , మాంచి పోగురున్నోన్ని పంపినాడు సబ్బిరు గాడు , మనము ఇక్కన్నే పెట్టుకుందామా "
"ఇక్కడ ఎం పని చేత్తాడు , మనకు రోజు డ్రైవర్ అవసరం పడదుగా ? "
"మనోడు రానీ మా ట్లాడ దాము , మీరంతా రెడినా గుడికి ఎలతాము అన్నారు కదా , మల్లా మొబ్బు అయితాది బయల్దేరండి "
మల్లన్న నా దగ్గరకు వచ్చి
"అన్నా , మంచి పని చేసినావు నా కొడుకులని కొట్టి "
"సరే , మల్లన్నా నీకు పెద్ద దెబ్బలేమీ తగల్లెదుగా "
"ముచ్చు దెబ్బలు కోట్టాడు ,ఆ సర్పంచ్ కొడుకు , పెద్దోల్లయ్య మల్లా కొడితే బాగుండదని గమ్మున వున్నా , కాని నీవు తన్నేవుగా వాన్ని "
"నాదగ్గర నొప్పుల మాత్రలు వున్నాయి యాదమ్మ నడిగి కాఫీ పెట్టిచ్చుకొని వేసుకో తగ్గి పోతాది " కారు డాష్ బోర్డ్ లో వున్నా రెండు టాబ్లాటే తీసి తనకు ఇచ్చాను
ఆ లోపున పెద్దాయన " అబ్బి , రా వచ్చి కాపీ తాగి వీళ్ళను గుడికంట తీసుకెళ్ళు "
పెద్దాయన చేతిలో ఉన్న ఓ పెద్ద స్టీల్ గ్లాసు " తీసుకో " అంటూ నా చేతికిచ్చాడు
ఇంత వరకు , అన్ని యాదమ్మ చేతుల నుంచి తీసుకొనే వాన్ని , కానీ ఇప్పుడు పెద్దాయన చేతుల మీదుగా ఇస్తున్నాడు.
గ్లాసు తీసుకోని పక్కనే అరుగు మీద కుచుందా మని వెళుతుంటే
"పరవా లేదులే , దా ఇక్కడ కుచో " అంటూ తన పక్కన చూపించాడు
"ఇక్కడ అరుగు మీద కుచుంటాలే పెద్దయ్యా " అంటూ అరుగు మీద కోచొని కాఫీ తాగి కారు దగ్గరికి వెళ్ళా
"ఏందీ సారూ , ఓ రోజు లోనే అందరు నిన్నే పెగిడేత్తాండారు , ఇంట్లో పెద్దయమ్మను పట్టె దానికి కాకుండా వుంది "
"ఎందుకు యాది , ఏమంది "
"పెద్దాయన్ను అంటుంటే , మీరు ఆయప్పను కొట్టారు కదా , అందుకు ఆయమ్మ కు మీరు బాగా నచ్చేసారు " అంటూ అక్కడే తొట్టి దగ్గర గ్లాసులు కడుక్కొని వెళ్ళింది.
ఓ రెండు నిమిషాలకు అందరు వచ్చారు
పెద్దల్లేమో పట్టుచీరలు కట్టుకొచ్చారు , అడ పిల్లలు అందరు లంగా వోని వేసుకొచ్చారు.
శాంతా దారి చూపుతుండగా కారు ముందుకు పోనిచ్చా
గుడేమో ఊరికి రెండో చివర వుంది , కారు వుర్లోంచి వెళ్ళాలి అన్ని చిన్న ఇరుకు దారులు
కారుకు ఎదురుగా ఏమొచ్చినా , ఎవరో ఒకరు కొద్దిగా ప్లేస్ వున్న చోట ఆగి చూసుకొని వెళ్ళాలి
సరిగ్గా నడి ఊరిలోకి వెళ్ళాము , మా ముందు పెద్ద గుంపు అంతా అరుపులు కేకలు పక్కనే పెద్ద పొగ లేస్తుంది.
"మీరు కార్లోనే ఉండండి , నేను చూసి వస్తా " అంటూ కారును పక్కకు నిలిపి గుంపులో కి వెళ్ళా.
రోడ్డు పక్కనే ఓ బిల్డింగ్ వుంది , ఆ బిల్డింగ్ వెనుక కొట్టం వున్నట్లు వుంది , ఆ కొట్టం అంటుకుంది
బోద కొట్టం అనుకుంటా , సాయంత్రం గాలికి ఫేళ ఫేళ మంటూ పైకి లేస్తుంది అగ్గి , అందరు బక్కిట్లు బిందెలతో ఆర్పడానికి ట్రై చేస్తున్నారు.
అంతలోనే
"పక్క సందులోంచి ఓ ఆవిడ ఏడుస్తూ అయ్యో , నా కొడుకు ఉన్నాడు లోపల , అంటూ బిల్డింగ్ లోపలికి వెళ్ళింది "
అక్కడున్నోల్లు అందరు ఆమెనూ ఆపేశారు
ఆ సెగకు బిల్డింగ్ లోపలకు వేల్లడానికి లేకుండా వుంది
"బాత్రూం లోకి వెళ్ళడానికి ఇంకో దారి లేదా " అంటూ నేను అటువైపు వెళ్లాను
"బాత్రూం వాకిలి కొట్టం లోకి వుంది, కొట్టం లోంచి బయటకు రావాలంటే బిల్డింగ్ లోపలనుంచి వెళ్ళాలి" అంటూ ఎవరో అరిచారు
"బాత్రుం కో పైన ఖాలిగా ఉంది , ఎనక పక్క నుంచి ఎక్కి తే బాబుని తీసుకు రావచ్చు " అంటూ సలహా ఇచ్చారు ఎవరో.
ఏడుస్తున్నమే కూతురు వయస్సు 7 సం. తనేమో బాబుని స్నానానికి పంపి , పొయ్యి మీద నునే పేట్టి పక్కింటి వెళ్లి నట్టు వుంది.
ఆ నునే బాగా మరిగి ఎలాగో సూరు ముట్టుకోన్నట్లు వుంది , కొట్టం మెత్తం అంటుకుంది . ఆ బిల్డింగ్ చుట్టు పక్కల అంతా కొట్టాలు వున్నాయి
గాలి బాగా వేస్తుంది అలాగే ఇంకొద్ది సేపు వదిలేస్తే అగ్గి పక్క కొట్టాల మీదకు వచ్చేట్టు వుంది. పక్కన కోట్టాలు అంటుకుంటే అక్కడున్న ఓ 50 , 60 ఇల్లు కాలి పోతాయి
వాళ్ళు చెప్పిన వెనుక వైపు వెళ్లాను , అక్కడ బాత్రుం గోడ బిల్డింగ్ అంత ఎత్తు వుంది ఎక్కడానికి విలు లేదు అటు ఇటు చూసాను పక్కనే
మిద్దే కు పెద్ద వెదురు బొంగు అనిచ్చి వుంది. ఆలోచించే టైం లేదు లోపల పిల్లోడు ఎలా ఉన్నాడో తెలిదు
కాలేజి లో ఉన్నప్పుడు ఓ నాలుగు అయిదు సార్లు పోల్ వాల్ట్ చేసాము స్నేహితులతో కలిసి , అది గుర్తుకు తెచ్చుకుంటూ
ఆ వెదురు బొంగు తీసుకోని కొద్ది దూరం వెళ్లి పరుగెత్తుకుంటూ వచ్చి వెదురు బొంగును ముందుకు తాటించి పైకి లేచాను
ప్రాక్టిసు లేనందు వలన సరిగ్గా గోడ దగ్గరకు వచ్చి ఆగి పోయింది. బొంగు వదిలేసి రెండు చేతులతో గోడ అంచు పట్టుకొన్నా
ప్రాణాలు ఉగ్గ పట్టుకొని చిన్నగా కాలు గోడ మీదకు వేసి కుచోన్నా. వేడి అక్కడి దాకా కొడుతుంది
బాబు ఆ వేడికి స్పుహ తప్పినట్లు వున్నాడు బకెట్టు పక్కనే పడున్నాడు. నేను గోడ మీద పైకి లేచి అటు పైపు దిగడం ఎలా అని చూస్తుంటే.
"అదిగో ఎవరో , ఎనక పక్క బాత్రుం గోడ మీద " అంటూ అరిచారు
పోలో మంటూ ఓ గుంపు వెనుక పక్కన వచ్చారు
"నిచ్చెన , ఓ పెద్ద తాడు ఉంటే పట్రండి అంటూ వారికీ చెప్పి" అటు పైపు సబ్బులు పేట్టడానికని గోడలో ఓ బండ పెట్టారు
నేను దానిమిదకు దుంకితే తట్టుకుంటుందా అనే అనుమానం వచ్చింది. అయినా ఇప్పుడు టెస్ట్ చేసు టైం ఎక్కడుంది అనుకోని
దాని మీదకు దుకేసా. ఓ మందాన ఉన్న బండ తట్టుకుంది . అక్కడనుంచి లోనకు దూకి , పిల్లోడి పక్కన కూచొన్న. విపరీతమైన సెగ కొడుతుంది
కొట్టం వైపు కుడా గోడ బిల్డింగ్ అంత ఎత్తున ఉన్నందు వలన కొద్దిగా వేడి తగ్గింది కానీ పిల్లాడికి ఆ మాత్రం తట్టుకోవడం గొప్ప.
పిల్లగానికి టవల్ చుట్టి అలాగే ఎత్తుకొని తొట్టెలో ముంచాను. అప్పు డే తొట్టెలో నిల్లు కుడా కొద్దిగా వేడెక్కు తున్నాయి
పిల్లాడు నీల్లు తగిలే సరికి , కెవ్వు మంటూ అరిచి నన్ను గట్టిగా పట్టు కొని ఏడ్చబట్టాడు.
ఈ లోపున ఎలాగో పైకి ఇద్దరు కుర్రాలు గోడ మీద కనబడ్డారు , వాళ్ళ చేతిలో పెద్ద తాడు కనబడింది. నన్ను చూస్తూనే తాడు కిందకు విసిరారు.
తాడు పిల్లాడి చంక కింద కట్టి , వాళ్ళను పైకి లాగ మన్నాను , సునాయాసంగా పిల్లాడు పైకి చేసుకున్నాడు.
అటువైపు ఎవ్వరో ఉన్నట్లు ఉన్నారు , వెంటనే పిల్లాని లాక్కున్నారు.
అగ్గి ఇంకా పైకి లేస్తుంది అలాగే వదిలేస్తే , పక్కనున్న కొట్టాలకు అంటుకోవడం ఖాయం. ఆ కొట్టం ఓ సుట్టిల్లు , మద్యలో ఓ పెద్ద గుంజ పాతి
ఆ గుంజ చుట్టూ పైన బోద వేసి కప్పారు , ఆ గుంజను పడ కొట్టేస్తే అంతా బిల్డింగ్ కు బాత్రుం కు మద్యలో పడిపోతుంది , అప్పుడు అగ్గి పక్కకు
పాకే ఆస్కారం తక్కువ , గుంజను పడ కొట్టాలంటే గొడ్డలి కావాలి. అందులోనా పైన మంట మండుతుంది.
"అన్నా , నువ్వు కుడా పైకి వచ్చేయ్ "
"ఓ గోడ్లి ఇమ్మను తొందరగా , నేను లోకలికేల్లి నాలుగేటు ఆ గుంజను కొడతా , తాడు కట్టి లాగితే , గుంజ పడి పోతుంది " అని గట్టిగా అరిచా
వెంటనే వాళ్ళు అటువైపు వాళ్ళకు నా మాటలు చేరవేసి నట్లు వున్నారు. ఓ రెండు నిమిషాలకు పైనుంచి గొడ్డలి కింద పడ్డది గోడ మీద నుంచి
బక్కెట్టు తో తొట్టిలో నీళ్ళు తీసికొని నా మీద పోసుకొని , ఆ గొడ్డిలి తీసుకోని బాత్రుం తలుపు తీసి లోన కెల్లా
బాత్రుం తలుపు తీస్తానే వేడి ఒక్కా సారిగా కొట్టింది. ఇంకో బక్కెట్టు నీళ్ళు పోసుకొని వెళ్ళా. మంట పొయ్యి వున్నవైపు మొదలైంది ఇంకా పైకి పాక లేదు
అయినా విపరీతమైన వేడి , గొడ్డలి తో గబ గబా నాలుగు వైపులా నాలుగు గాట్లు పెట్టి , బిల్డింగ్ వైపుకు వెళ్లి ఆ గుంజను సగానికి నరికా
ఈ లోపున గోడ మీద వున్నా ఇద్దరు కుర్రాళ్ళు , కిందకు దుంకి నాలాగే నీల్లు నెత్తిన పోసుకొని , ఒకడు బక్కేట్టుతో నీల్లు తెచ్చి నా మింద పోసాడు
ఇంకోడు తెచ్చిన తాడును ఆ గుంజ కు నేను కొట్టిన దాని పై బాగాన కట్టి. "అన్నా ఇంక రా , లేకుంటే కాలి పోతాము " అంటూ నన్ను బాత్రుం వైపు పీకాడు
గొడ్డలితో ఇంకో రెండేట్లేసి వాళ్లతో పాటు బాత్రుం లోకి జంప్ చేశా , అప్పటికే నేను వేసుకున్న టి షర్ట్ సిగరెట్టూ తో అక్కడక్కడా అంటించి నట్లు
అగ్గి నిప్పులు పడి కాలింది .
ముగ్గురు బాత్రుం లోకి వచ్చి తలుపు దగ్గిరిగా వేసి , కట్టిన తాడు రెండో కోన పట్టుకొని , బాత్రుం గోడను తంతూ పట్టి గుంజాము.
తాడు సరిగ్గా , గాటు పెట్టిన పైన కట్టినందున , మేము ముగ్గరము గుంజిన గుంజుకు , గుంజ విరిగి , సుట్టిల్లు అలాగే బిల్డింగ్ కు , బాత్రుం కు మద్యన
కుసన బడింది. ఎప్పుడైతే , గుంజామో అప్పుడు సరిగ్గా నా వీపును బాత్రుం డోరుకు అడ్డపెట్టి అది లోనకు రాకుండా అడ్డ పడ్డాను. లేకుంటే డోరు ఓపెన్ అయి
మండుతున్న బోద లోనకోచ్చేది. అప్పటికే బాగా వేడెక్కి వున్న డోరు నా వీపుకు చర్ మని మంట పుట్టించింది. ఆ మంటకు నేను ఆటోమేటిగ్గా ముందుకు తులాను.
చురుకైన పిల్లలు ఇద్దరు , తమ దగ్గరున్న మోకు ను దోరుకు అడ్డపెట్టి అడ్డు కొన్నారు తలుపు లోపలకు రాకుండా. ఈ లోపున గోడ మీద ఇంకా నలుగురు చేరారు.
"అన్నా పద ఇక్కడుంటే , వేడికి తట్టుకోలేము అంటూ " పైన ఉన్న వాళ్ళ సహాయంతో , పైకి చేరుకొని అటువైపున వున్నా నిచ్చాన ద్వారా కిందకు దిగాము.
కింద నుంచి , బిందెలతో , కొందరు బకెట్లతో గోడ మీద వున్నవాళ్ళకు నిల్లు అందియడం వలన , పైనుంచి సరిగ్గా నిప్పు మీద నిల్లు పోయడం వలన. మంటలు
అదుపులోకి వచ్చాయి ఇక మన వసరం ఇక్కడ లేదు . అక్కడ కారులో విల్లు ఏమి చేస్తున్నారో అని పరుగెత్తు కుంటు వెళ్ళా నా అవతారం చూసి
"ఏమైంది , నువ్వు ఎందుకు అలా మసి బారి పోయావు , పద ఇక వెళదాము " అని అసహనంగా అంది శాంత.