Update 39


ఆ రూమ్ కు తాళం వేసి వుంది , "హమీద్ ఇప్పుడేలాగా ?" పగల కొడితే సౌండ్ వస్తుంది సౌండ్ రాకుండా ఎలా ఓపెన్ చేయడం ? ఆ రూమ్ కు ఓ కిటికీ వున్నట్లు గుర్తు , అది పక్కరూంలోకి ఓపెన్ అయి వుంది. అక్కడకి వెళ్లి చూస్తూ , పల్లవి ని black మెయిల్ చేసిన వాడు అప్పుడే లేస్తూ వున్నాడు. నన్ను చూసి "కొంన్ హాయ్ తు అందర్ కైసా ఆయా"అంటూ నా వైపు రాసాగాడు. వాడు ఎక్కువ సౌండ్ చేస్తే అంతా లేస్తారు సారూ , ఎదో ఒకటి చేయండి అంటూ హమీద్ వెనుక నుంచి గుస గుస లాడాడు. పిల్లల మీద వాతలు చూసిన దగ్గర నుండి దాచుకున్న కోపమంతా వాడిని చూస్తూనే కట్టలు తెంచుకొని సైడ్ కిక్ రూపంలో బయటికి వచ్చింది. ఫట్ మంటూ నా కుడి కాలు వాడి గడ్డం కింద తగిలించి , వాడికి అరిచే టైం కుడా లేకుండా వాడి దవడ ఎముక విరిగి పోయింది. వాడెల్లి నాలుగు అడుగుల దూరంలో పడ్డాడు. వెళ్లి వాడి చేబులు చెక్ చేస్తే , వాడి ఫోన్ ,పర్సు దొరికింది వాటితో పాటు తాళం చెవి గుత్తి దొరికింది , వాటిని నా జేబులోకి తోస్తూ, " వీడిని నేను దాపెడతాను నీవు వీటితో ఆ తలుపులు తెరుచు కుంటాయేమో చూడు " అంటూ వాడిని ఈడ్చుకొంటు గుడ్డలు వేసి వున్నా రూమ్ లోకి వెళ్ళాము , ఇంకో మూడు మూటలు పక్కకు పికి , ఇట్లాంటి వాళ్ళు బ్రతకడం భూమికి భారం అని చెప్పి వాడి మెడ చుట్టూ చేతిని వేసి పక్కకు వంచాను , పచ్చి కొమ్మ విరిగినట్లు సౌండ్ చేస్తూ స్పుహలోనే ప్రాణాలు వదిలేసాడు మూలకు తోసి వాడి మీద మూటలు కప్పి హమీద్ ను కలిసాను.

ఎలాగో తంటాలు పడి తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. అక్కడున్న రెండు పెట్టలు కిందకు దింపి మూడో పెట్టెను తన దగ్గర ఉన్న కీస్ తో నిలువునా ప్యాకింగ్ వెంట గిసి ఓపెన్ చేసాడు. లోపల RDX కొద్దిగా సాంపిల్ పెపర్ లో పొట్లం కట్టి జేబులో వేసుకొన్నాడు. ఆ పెట్టెలు అనుమానం క్లోజ్ చేసి వాటి మీద ఇందాక దించిన రెండు పెట్టెలు పెట్టేసాడు. ఇంకో ముల నున్న గొనె సంచుల ప్యాక్ లోంచి ఓ దానిని బయటకు లాగి. దీనిని ఓపెన్ చేయద్దు అలాగే తీసుకోని వెళదాం పద అని చెప్పి మేము వచ్చిన దారినే గోడ దూకి మా బైక్ దగ్గరకు వచ్చి ప్రతాప్ ఇంటి కి వెళ్ళాము. దారిలోనే వాడికి ఫోన్ చేసి లేపి మేము వస్తున్నాము అర్జెంటు గా మాట్లాడాలి బయటకు రమ్మన్నాను.

మేము ఇంటికి వెళ్ళేగానే గేటు లోనే ఎదురోచ్చాడు
"ఏమైందిరా ఇంత రాత్రప్పుడు" అంటూ ఎదురోచ్చాడు,
"ఇంతకీ రవింద్ర ఎక్కడున్నాడురా "
" సాయంత్రమే ఫోన్ చేసాడు ఇక్కడే టౌన్ లో ఉన్నాడంట, మా వాళ్లకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఏమో గాని వాడు ఏడుస్తున్నాడు ఎక్కడెక్కడికో చెకింగ్ కు పంపుతున్నారని "
"వాడిని వెంటనే ఫోన్ చేసి , కంట్రోల్ రూమ్ కు వచ్చేయమను , మీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కరెక్టే , సరుకు మొత్తం గోడౌన్లో వుంది , వెంటనే రైడ్ చేస్తే మొత్తం దొరుకుతుంది " అంటూ మేము తెచ్చిన పేపర్ పొట్లం , గొనె సంచి ప్యాక్ వాడి ముందు పెట్టాము. గబా గబా ఆ గోనే సంచి ప్యాక్ చించి చూస్తూ , AK.47 అది చూస్తూనే మా ప్రతాప్ గాడికి నోట్లో మాట రాలేదు. రెండు నిమిసాలు తేరుకొని వెంటనే రవీంద్రకు ఫోన్ చేసి , 15 నిమిషాలలో ఆఫీస్ కు రమ్మన్నాడు. రెండు నిమిషాల్లో వాడు డ్రెస్ చేసుకొని, అందరం కంట్రోల్ రూమ్ కు వచ్చాము. మేము అక్కడు ఉండగానే హమీద్ ఆఫీస్ కు ఫోన్ చేసి , ఇక్కడున్న పెట్రోలిం వ్యాన్స్ అన్నిటిని కంట్రోల్ రూమ్ కు రమ్మని చెప్పేసాడు.

మేము వచ్చేసరికి రవీంద్ర , 4 జీపులు అక్కడ రడిగా ఉన్నాయి
"ఏమైందిరా ఇప్పుడు పిలిపించావు , విడేంది ఇక్కడ "
"నువ్వు కష్టపడుతున్నావు అని , నీకు బరువు తగ్గిచ్చడానికి ఈ రోజు నీ డ్యూటీ వాడు , మా హమీద్ కలిసి చేసారు " అంటూ మేము తెచ్చిన గన్, పౌడరు వాడి ముందు పెట్టాడు.
"ఇవి సాంపిల్ అంట ఓ లారి సరుకు చూసి వచ్చారు ఇద్దరు" అంటూ నా వైపు చూసాడు.
"పొద్దున్నే , జోకు లేంది భే " అంటూ తీసి పారేయాలని చూసాడు.
"సార్ కేం పట్టింది పొద్దున్నే జోక్ లేయడానికి , రాత్రంతా ప్రాణాలకు తెగించి సాంపిల్స్ తెస్తే ఆ లా తిసేస్తారెంటి సార్ " అంటూ గట్టిగా అన్నాడు హమీద్
ఆ సౌండ్ చూసి రవీంద్ర నవ్వు ఆపేసి "ఇప్పుడు ఎం చేద్దాం" సేరియస్ గా సాంపిల్స్ చూడ సాగాడు.
"వాళ్ళకు డౌట్ వచ్చే లోపు మనము ఎటాక్ చేయాలి" అంటూ ముగ్గారిని కట్టి పడేసిన సంగతి చెప్పాము ( చివరి వాడి సంగతి చెప్పలేదు )
"అది కాలేజీ అందులోనా సెన్సిటివ్ ఏరియా , ఎలారా "
"సరకు దొరికితే ఎట్లాంటి ఏరియా అయినా పరవాలేదు , నేను మేనేజ్ చేస్తాను , దొరక్క పోతేనే గొడవ " అన్నాడు ప్రతాప్
"సార్ , మనం ఇక్కడే వుంటే , వాళ్ళకు ఓ గంట చాలు సరుకు ట్రాన్స్ఫర్ చేయడానికి " అన్నాడు హమీద్
"పదరా అక్కడకి వెళ్లి మాట్లాడు కుందాము " అంటూ మూడు జీపుల్లో 15 మంది వెపన్స్ తో వెళ్ళాము . జిప్ లు కొద్ది దూరంలో ఆపి
అందరు అలెర్ట్ గా వెళ్ళాము.
మెయిన్ గేటు దగ్గరకి హమీద్ వెళ్లి తలుపు తట్టాడు , అటు ఇటు ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు గన్స్ తో రెడీగా ఉన్నారు.
"కోన్ హాయ్ భే ఇత్నా శుభే "
"దూద్ వాలా హు , తోడా జల్దీ జనా హాయ్ ఆజ్ "
"సాలా తెరేకో నింద్ నహి ఆతా హాయ్ క్యా " అంటూ తలుపు తీసి తల బయట పెట్టాడు

పక్క నున్న ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు వాడి నోట్లోంచి ఇంకో మాట రాకుండా బయటకు లాగేసి , వాడి నోటికి ప్లాస్టర్ వేసి వ్యాన్లో వేసారు. తలుపు దగ్గర ఒక్కన్ని వుంచి అందరం లోపలి వెళ్లాం. ఎటువంటి గొడవ లేకుండా ఎక్కడ పడుకున్నవాల్లను అక్కడే కట్టి పడేసి , గోడౌన్స్ ఓపెన్ చేసి లైట్స్ వేసాము. ఆ వెలుగులో ఆ సరకు చూసి రావింద్ర కైతే నోట్లో మాట రాలేదు. ప్రతాప్ వెంటనే ఆక్షన్ లోకి దిగిపోయి , వాళ్ళ పై ఆఫీసర్స్ కి విషయం చెప్పి , వెంటనే మీడియా ను పిలిపించాడు. కడప నుంచి ఓ బెటాలియన్ CRPF బయలుదేరారు , హైదరాబాదు నుంచి హోం మినిస్టర్ , IG హెలికాప్టర్ లో ఇంకో గంటలో అక్కడ ఉంటామన్నరంట.

లోపల ముగ్గరిని కట్టి పడేసిన విషయం ప్రతాప్ కి చెప్పాను, వాడు నేను మేనేజ్ చేస్తాలే , యు డోంట్ వర్రీ అంటూ మాట ఇచ్చాడు. పెన్ డ్రైవ్ లో దొరికిన అడ్రస్ లన్నింటి మీదా దాడి చేయమని ఇమ్మిడియట్ ఆర్డర్స్ పాస్ చేసాడు. ఉదయం ఆరు గంటలికి స్టేట్ మొత్తం లైవ్ టెలికాస్ట్ అవసాగింది ప్రోగ్రాం. దేశంలో ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తం అయుధాలు దొరకలేదని. ఆ క్రెడిట్ అంతా హమీద్, ప్రతాప్ , రవింద్ర దే అంటూ వాళ్ళకు అక్కడే ప్రమోషన్స్ ఇచ్చేసాడు హోం మినిస్టర్.

అక్కడున్న పిల్లలను ఒక్కరోక్కరిని ఇంటర్వు చేస్తూ , ఆ స్కుల్లల్లో వాళ్ళును ఎలా సూసైడ్ స్క్వాడ్ గా తయారు చేస్తారో చెప్పించారు. T.V వాళ్లకు ఓ వారం రోజులకు కావాల్సిన మేత దొరికింది.

11 గంటలకు ప్రెస్ మీట్ తరువాత హోం మినిస్టర్ , IG వెళ్లి పోయారు , కడప నుంచి వచ్చిన బేటాలియాన్ కాలేజీ మొత్తం హ్యాండ్ఓవర్ చేసుకుంది. 12 గంటలకు నేను , ప్రతాపు, రవీంద్ర , హమీద్ ప్రతాప్ వాళ్ళ ఇంటికి వచ్చాము. మేము అక్కడికి వచ్చేసరికి , ఓ రెండు ట్రాక్టర్స్ నిండా జనాలు వున్నారు అక్కడ , ఏంటి అంతా ప్రతాప్ ఇంటి మీద దాడికి వచ్చారేమో నని బయపడ్డాము. కాని ముందు ట్రాకర్ లో పల్లవి వాళ్ళ అన్నా , అంగిడి ఓబులేసు , నల్లప్ప , మల్లిగాడు అంతా పల్లె వాళ్ళే నన్ను చూస్తూనే
"ఏమప్పా ? నీకేం కాలేదు గదా , మా ఆడది నా చెల్లెలు ఇంటికొచ్చి ఇక్కడ నువ్వు గడ్డ మోల్లతో గొడవ పెట్టుకున్నవని చెప్పినారు , ఉక్కడే నువ్వు ఎం అగచాట్లు పడతాన్దావోనని నేను బయలు దేరితే , నా యనకే అందరు బయలు దేరితే , సరే అని వచ్చేస్తిమి " అంటూ గబా గబా వాళ్ళు అక్కడికి వచ్చిన కారనాన్ని చెప్పాడు. వాళ్ళ అబిమానానికి నాకైతే నోట్లో మాట రాలేదు. దాదాపు 50 మంది వచ్చివుంటారు , ప్రతాప్ కు చెప్పి వాళ్ళ అందరికి అక్కడే భోజనాలు ఏర్పాటు చేసి , సాయంత్రం వాళ్లతో పాటు నేను పల్లెకు వెళ్లాను.
Next page: Update 40
Previous page: Update 38