Update 44
వెళ్ళిన వెంటనే , అందరు చుట్టు ముట్టారు తాతకు ఎలా వుందని . వాళ్లకు శాంతా వాళ్ళ నాన్న ఫోన్ చేసి చెప్పాడు అయినా నేను ఏమి చేపుతానో అని వాళ్ళ ఆత్రుత.
"తాతకు బాగేనే ఉంది , కాలు ఎక్కడా విరగ లేదు , కొన్ని రుజులు రెస్ట్ తీసుకొంటే బాగా తిరగ గలడు" మేము మాట్లాడుతుండగా సర్పంచ్ వచ్చాడు కోడలు, పల్లవితో
"శివా, మా అన్నకు ఎట్లా వుంది , లేచి తిరుగుతున్నాడా ? ఎప్పుడు వస్తాడు ఊరికి " అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇందాక వాళ్ళకు చెప్పిన మాటలే విల్లకీ చెప్పాను. దా సుట్టిల్లు రెడీ చేసాము , దా వచ్చి చూడు ఎట్లా వుందొ అంటూ వాళ్ళ ఇంటికి తిసికేల్లారు.
సుట్టిల్లు మొత్తం రెడీ చేసారు , కాలి నల్లగా అయిన గోడలకు సున్నం కొట్టించాడు , పూర్తిగా వంటిల్లు రూపమే మారిపోయింది ఇప్పుడు. నేను వెళ్ళంగానే పల్లవి కాఫీ తెచ్చి ఇచ్చింది. కాఫీ తాగుతూ వాళ్ళ అన్నాను గురించి అడిగాను.
"పొద్దున్న వరకు ఇక్కడే ఉన్నాడు , ఇప్పుడు ఎక్కడో ఉరి మీద పడి తిరుగుతుంటాడు బేవార్స్ నాకొడుకు " అని వాళ్ళ నన్న తిట్ల దండకం అందు కున్నాడు. అయన దండకానికి అడ్డు కట్టు వేస్తూ " ఏదైనా పనిలో పెట్టండి పెద్దయ్యా , లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టియండి తనే సెట్ అయితాడు "
"ఎం పని చేస్తాడు ఈడు , ఇంక ఏదైనా బిజినెస్ బెటర్ వాడికి, మొన్న మనురికి వచ్చిన నీ జతగాళ్ళు వాళ్ళను అడుగప్పా వాళ్ళకు తెలిసిన ఏదైనా బిసునేస్స్ వుంటే అది పెట్టిడ్డాము , డబ్బులకు బయపడాల్సిన పని లేదు"
"సరే నేను వాళ్ళతో మాట్లాడి చెప్తాలే " అంటూ వాళ్ళ ఇంటి నుంచి బయలు దేరి ఓబులేసు అంగడి దగ్గరకు వచ్చి ఓ సిగరెట్ ముట్టిచ్చుకొని అతనితో బాతా ఖాని వేసుకొన్నా. ఈ లోపుల నా ఫోన్ మోగింది , చుస్తే ప్రతాప్
"హలో , నూరేళ్ళు రా నీకు , ఇప్పుడే నీ గురించే అనుకుంటూ వున్నాను. "
"అన్నేళ్ళు వద్దురే అన్ని సక్రమంగా పని చేస్తే 60, 70 చాలు అంటూ నవ్వుతూ , నీ ప్రైజ్ మని వచ్చింది , వచ్చి కాలేక్ట్ చేసుకో "
"నాకేం ప్రైజ్ వచ్చింది భే ? "
"అదేరా వాణ్ణి పట్టిచ్చావుగా , అది నీకు , హమీద్ కు సగం సగం , నీ భాగం వచ్చి తిసికెల్లు "
"వస్తాలే గాని , నా కో హెల్ప్ కావాలిరా , అక్కడ నీకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా ఎజెన్సీ దొరుకుతుందా, మా సర్పంచ్ కొడుకు ఇక్కడ బేకార్ గా ఉన్నాడురా, వాళ్ళ నాయన వాణ్ణి దొబ్బెస్తున్నాడు , ఎదో హెల్ప్ చేసినట్లు వుంటుంది "
"నువ్వు రా , వచ్చేటప్పుడు అతన్ని తీసుకోని రా రేపే పొద్దున్నే వచ్చేయండి , ఇక్కడో importent వ్యక్తిని పరిచయం చేస్తాను. "
"సరే రా , ఉంటాను రేపు ఉదయం 9. 9.30 కు అక్కడ ఉంటాము " అక్కడ నుంచి తిరిగి సర్పంచ్ దగ్గరకు వెళ్లి , మీ అబ్బాయిని నేను రేపు టౌన్ కు తిసుకేలతాను , కొద్దిగా పని ఉంది ,పొద్దున్నే వెళతాము
"తిసికేల్లు ,వాడు ఇంటికి వస్తనే నిన్ను కలవ మంటాను" .
నేను అక్కడ నుండి ఇంటికి వచ్చాను . శాంతా నడవ గలుగుతుంది కానీ గాయం మనుతూ వుంది కట్టేమి అవసరం లేదు.
ఈ రాగి రేకులు మూడే ఉన్నాయి , నాలుగోది దొరికితే గాని , పూర్తీ సమాచారం తెలిదు , నాలుగో రాగి రేకు కావాలంటే , వీల్ల బందువుల ఇళ్ళల్లోనే ఎక్కడో ఉంటుంది. ఇక మిగిలింది లతా వాళ్ళ ఇల్లే , లాతా నాకు పరిచయం కాని వాళ్ళ ఇంట్లో వాళ్లతో పరిచయం పెంచుకోవాలి , కానీ ఎలా ? పోనీ శాంతాకు విషయం చెప్పేసి తన హెల్ప్ తీసుకొంటే అని ఆలోచిస్తూ వుండగా రామి రెడ్డి వచ్చాడు .
"మనాయన చెప్పినాడు , నువ్వు రమ్మన్నావంట "
"చిన్న పని పడింది , రేపు రాయచోటికి వేల్లాల్లి , వెళదాము , వస్తావా ?"
"పోదాంలే , ఎంపని అక్కడ "
"పద అలా బయటకు వెళ్లి మాట్లాడు కొందాము " అంటూ తనతో కలిసి ఓబులేసు అంగడి దగ్గరకు వచ్చాము అక్కడే ఉన్న బెంచి మీద కుచోంటు , రెండు సిగరెట్లు తీసికొని తనకోటి ఇచ్చి నేను ఓటి అంటిచ్చా. వాళ్ళ నాన్న చెప్పిన విషయం తన దగ్గర చెప్పాను , ఏదైనా ఏజెన్సి ఇప్పిస్తే చేసుకోగలవా ? టౌన్ లో ఆ విషయం మీదే నేను మా ఫ్రెండ్ తో మాట్లాడాను వాడు రేపు పొద్దున్నే రమ్మన్నాడు.
"ఇంతవరకు బెకారుగా తిరిగాను ,ఇంట్లో మా నాయన చూసావుగా ఎలా తిడుతున్నాడో నన్ను, ఎదో ఒకటి నీకు తెలిస్తే తప్పకుండా చేసుకుంటా, రేపు పొద్దున్నే పోదాము" . మేము అక్కడ మాట్లాడుతుండగా ఎదురింటి లత రామిరెడ్డిని పిలిచింది
"అన్నా మా నాయన పిలుస్తున్నాడు , రా "
"శివా , రా అది కుడా మా చిన్నాయన వాళ్ళదే " అంటూ ఇద్దరం కలిసి లతా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. లతా వాళ్ళ నాన్న లతాకు కాఫీ పెట్టమన్నాడు. ఏవో కసువాల్ గా మాట్లాడుతూ , తనకు ఏవో మాత్రలు కావాలంట ఎవరన్నా వెళుతుంటే టౌన్ కు తీసుకు రమ్మని చెప్తూ చీటి ఇచ్చాడు.
"మేము వేలుతున్నాములే , నేను తెస్తా అంటూ తన ఆ చీటి తీసుకొన్నాడు." మేము పిచ్చిపాటి మట్లాడుతుండగా , లతా కాఫీ తెచ్చింది.
వీళ్ళ ఇంట్లో ఆ రాగి రేకు లాంటిది ఉందేమో ఎలా తెలుసుకొనేది అని ఆలోచిస్తూ కాఫీ తగేసాము. కానీ ఆ లాకెట్టు విషయం ఎటూ తేలలేదు.
అటునుంచి ఇంటికొచ్చి తిని మిద్దేక్కా పడుకుందామని.
"అమ్మా , నేను కుడా పైన పడుకుంటా " అంది రాజి
"నువ్వు ఒక్కదానివే వద్దులే ?" అంది
"నిర్మలా నీవు కుడా వెళ్ళు , ఇద్దురు పైకి వెళ్లి పడుకోండి " నాతొ పాటు వాళ్ళు ఇద్దరు పైకి వచ్చి పడుకున్నారు.