Update 48


"కొద్ది సేపు పల్లవీని చూడ కుండా వుండలేవా ?"
"అదిగో మల్లీ మొదలు పెట్టావా నీ మాటలు , నేను వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిజం కానీ పల్లవి లేదు అక్కడ , వాళ్ళ వదిన రమ్మంటే వెళ్లాను. కాఫీ తాగి వచ్చేసాను., ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది . దొరికిందా ? "

"అది వాళ్ళ ఇంట్లోనే దొరికింది అది కుడా నా మెళ్ళో వుండే తాయత్తులాగా ఉంది , వాళ్ళ ఇంట్లో దాని దేవుడి దగ్గర పెట్టి పుజిస్తుంటారు. వాళ్ళకు తెలీకుండా తెచ్చాను, వాళ్ళు దాన్ని గమనించే లోగా అక్కడే పెట్టాలి"
"ఎదీ ఇటువ్వు " అంటూ నా చేతిలోకి తీసుకోని అటు ఇటు తిపీ ఓ వైపున ఎత్తుగా ఉన్న చేత కొద్దిగా గోకాను, అక్కడున్న మైనం వుండగా చేతిలోకి వచ్చేసింది. పర్సులో వున్నా బ్లేడ్ ముక్క తీసుకోని స్క్రూ ను తీసి , అందులోని రాగిరేకును తీసి లాకెట్ ను అలాగే బిగించేసి తన కిచ్చేసి వాళ్ళ ఇంట్లో పెట్టేసేయ్ అని చెప్తూ నా దగ్గర వున్న మిగిలిన మూడు రేకులు నాలుగో రేకుతో జత కలిపి ఓ టేబుల్ మీద పెట్టి చుస్తే ఓ చదరంగం ఆకారం లో వున్న రేకు మీద పూర్తిగా నిధి వున్నా ప్రదేశాన్ని చిత్రీకరించి తరువాత దానిని 4 బాగాలుగా చించి ఒక్కోదానిని ఒక్కో లాకెట్ లో పెట్టి ఆ నాలుగు లాకెట్లు వాళ్ళ మిగిలిన తరాలకు అందేటట్లు చేసి బాద్ర పరిచారు. పూర్తీ చిత్రాన్ని ఫోటో తీసి నల్లకుంట లో ఉన్న ప్రొఫెసర్ కు పంపించి తనకు ఫోన్ చేసి మిగిలిన డిటైల్స్ తెలుగులో కి transalate చేసి పంపమని అడిగా. ఓ రెండు గంటలు తరువాట ఫోన్ చేస్తే మిగిలిన విషయాలు చెప్తా నన్నాడు. సరే నంటూ ఫోన్ పెట్టెసి అక్కడ రేకులో ఉన్న బొమ్మలు చూస్తూ , అవి వేటిని సుచిస్తాయా అని ఆలోచించ సాగాను. నా పక్కనే శాంతా కుడా వాటిని చూస్తూ,
"ఇవి అప్పుడు ఎప్పుడో ఉన్న గుర్తులు , మరి ఇప్పుడు ఎలా వాటిని కనుక్కోవడం "
"చూద్దాం అప్పటి వాళ్ళు ఏది చేసినా , ముందు దృష్టితో చేస్తారు అలాగే ఈ గుర్తులు కుడా , ప్రొఫెసర్ నుంచి మెసేజ్ రానీ , చూద్దాం " అంటూ అయన మెసేజ్ కోసం వైట్ చేయ సాగాము.
"ఓ 30 నిమిషాలకు ఫోన్ చేసాను కాని ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది " ఇందాకే ఫోన్ చేసినప్పుడు రిప్లై ఇచ్చాడు ఇప్పుడేమైంది ఈయనకు అనుకుంటూ ఓ గంటాగి మల్లీ ఫోన్ చేసాము కాని అదే సమాదానం , ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది అని.
"ఇప్పుడు మనం ఎం చేసిది లేదు రేపటి వరకు వెయిట్ చేద్దాం , లేకుంటే నేను మా ఫ్రెండ్ ని అతని ఇంటికి పంపుతాను చూద్దాం" అని రాత్రి కుడా మద్యలో ఫోన్ చేసాము కానీ లాభం లేదు.

రాగి రేకు ముందర పెట్టుకొని ఆ గుర్తులు చూసాము. ఓ పక్కన పెద్ద గుట్ట , ఆ గుట్ట మీద కోట లాంటి కట్టడాలు వున్నాయి. కాని అక్కడ నుంచి కొద్దిగా దూరంగా ఉన్న అడివిలాంటి ప్రాంతంలో దారి చూపిస్తుంది. అక్కడి నుండి ఇంకొద్ది దూరంలో గుడి చూపిస్తుంది. అది ఈ ఉరి గుడి లాగే ఉంది. అక్కడ గుడి దగ్గర కొన్ని గుర్తులు , పోతురాజు , అమ్మవారు ఎక్కి కూర్చొన్న పులి , అమ్మవారు చేతిలోని సూలం పోతురాజును సూచిస్తుంది. అక్కడికి ఇంకా చాలా దూరంలో ఇంకో గుడి అక్కడ కుడా ఇలాంటి అమ్మవారు, అక్కడ అమ్మవారి సూలం పులివైపు సూచిస్తుంది రేపు పొద్దున్నే మల్లి ఓ సారి గుడికి వెళ్లి అక్కడ పోతురాజును ఓ సారి చెక్ చేయాలి అంతే కాకుండా ఇక్కడ చుట్టూ పక్కల ఇలాంటి గుది ఏదైనా ఉందేమో చూడాలి అనుకుంటూ నిద్రపోయాను.
ఉదయం నిద్ర లేచిన వెంటనే మల్లి ఓ సారి ప్రొఫెసర్ కు ఫోన్ చేసాను , కాని ఆ ఫోన్ ఆఫ్ చేసి వుందని ఫోన్ వచ్చింది. ఇంకా వెయిట్ చేస్తే బాగుండదు అనుకుంటూ వెంటనే షబ్బిర్ కు ఫోన్ చేసి ఆ ప్రొఫెసర్ అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్లి నాకు ఫోన్ చేయమని చెప్పాను. వాడు ఓ 2 గంటలకు ఫోన్ చేస్తానని చెప్పి స్విచ్ ఆఫ్ చేసాడు. ఈ లోగా నేను టిఫిన్ చేసి షబ్బిర్ ను ప్రొఫెసర్ ను ఇంటికి పంపించిన విషయం చెప్పాను. అక్కడ నుండి ఓ సారి గుడికి వెళ్లి వస్తాను అని చెప్పాను
"ఉండు , నేను కుడా వస్తాను గుడికి " అంటూ ఓ పది నిమిషాలలో తను కుడా రెడి అయ్యి నాతొ పాటు గుడికి వచ్చింది. మేము వెళ్లేసరికి పూజారి అప్పుడే గుడిలో దీపం వెలిగించి నైవేద్యం పెట్టి ఇంటికి వెళ్లడాని కి రెడీ అవుతున్నాడు. మమ్మల్ని చూసి
"మీరు తాలం వేసుకొని రండి నాకు ఇంటి దగ్గర కొద్దిగా పని వుంది తొందరగా వెళ్ళాలి" అంటూ మాకు తాలం చెవి ఇచ్చి హడావిడిగా వెళ్లి పోయాడు. తనేమో గుడి లోకి వెళ్లి పూజ చేసుకోసాగింది. నేను అక్కడున్న పోతురాజును చెక్ చేసాను . కానీ ఉల్లో వాళ్ళు చెప్పినట్లు ఇది కొత్త పోతురాజు పాతది ఎక్కడుందో అనుకుంటు చుట్టూ చూడసాగాను. ఈ లోపున శాంతి పూజ ముగించుకొని వచ్చింది. అప్పుడు నా డౌట్ తనకు తెలియ చేసాను. దేవుడికి సంబందించిన ఎ పాత సామానులు అయినా గుడిలో వున్న ఇంకో గదిలో బద్రపరుస్తారు అంటూ ఆ గది తలుపు తీసి లోనకు తీసి కెళ్ళింది.

ఆ గదంతా ఎక్కడ చూసినా పాత సామానులు, అక్కడ పాడైపోయిన బోలెడన్ని పోతురాజులు ఉన్నారు. ఇంతకూ దేన్ని వెతకాలి అనుకుంటూ దాదాపు 30 దాకా ఉన్న వాటిని చూడసాగాము. మల్లీ వోసారి ఆ బొమ్మ చుస్తే బాగుంటుంది అని సెల్ ఓపెన్ చేసి గుడిలో ఉన్న ఫోటోను కొద్దిగా జుమ్ చేసి చూస్తూ , అక్కడ ఉన్న పోతురాజులు కంపేర చేయ సాగాను. అక్కడున్న వాటిలో ను ఫోటోలోని వాటిలోనూ ఓ డిఫరెంట్ గమనించాము.

పోతురాజులు కుచోవడానికి ఓ పీట లాంటిది ఉంటుంది ఆ పిటకు బొమ్మలో కుడి పక్క ఓ పద్మమం లాంటి బొమ్మ వుంది కాని ఇక్కడ వున్న వాటిలో అలాంటి బొమ్మ కనబడలేదు. ఒక్కొక్క దాన్ని చూస్తూ వుండగా చివర మూల బాగా శిధిల మైన ఉన్న ఓ పోతురాజు పీట మీద ఆ బొమ్మ చూసాము. అది చూస్తూనే అదో లాంటి ఆత్రం తొంగి చూసింది మనస్సులో మిగిలిన వాటిని దాటుకుంటూ దాని దగ్గరకు వెళ్లి చుస్తే ఫోన్ లో చుసిన పద్మం అక్కడ చెక్క బడింది. దగ్గరకెళ్ళి చేతులతో వాటిని ముట్టుకొని చుస్తే గట్టి చెక్కతో చేసిన పీట దిట్టంగా ఉంది. అక్కడ చేత్తో తడిమే కొద్దీ తెలిసింది అది ప్రత్యేకంగా చేసిందని. పద్మం లో ఉన్నట్లు మూడు వరుసలు వున్నాయి వాటిని పట్టుకొని చుస్తే వాటికీ బేరింగ్ లు ఉన్నట్లు అనిపించింది. అంటే ఇందులో ఎదో సీక్రెట్ ఉన్నట్లు అనిపించింది. దాని ముందు బాసిం పట్టు వేసుకొని కూచొని కొద్దిగా వాటిని అంటూ ఇటూ తిప్ప సాగాను. మొదటిది ఓ డైరేక్సన్ లో తిరిగితే రెండోది డానికి వ్యతిరేక దిశలో తిరుగుతుంది. మూడవది రెండో డానికి వ్యతిరేక దిశలో తిరుగుతుంది. వాటి మీద ఏమైనా నంబర్లు ఉన్నాయేమో నని చూసాను , కాని ఏమి కనబడలేదు వాటి మీద రక రకాల గుర్తులు వున్నాయి. పువ్వుల మీద గుర్తులు దేన్ని సుచిస్తాయో తెలిదు. మల్లీ ఓ సారి ఫోన్ ఓపెన్ చేసి దానికి సంబందించిన క్లూ ఏమైనా దొరుకు తుందే మోనని చూసాను. అక్కడ గుడిలో ఎ గుర్తు లేదు కాని ఆ పాటం కింద వరుసగా మూడు గురుతులు వున్నాయి ఒకటేమో బాణం , రెండోడి త్రిశూలం, మూడోది కత్తి వాటిని మనసులో గుర్తు పెట్టుకొని. ఒక్కో దానిని అవి తిరిగే వైపుకు తిప్పుతూ మ్యాప్ చుసిన గుర్తులు ఎక్కడైనా వాటి మీద కనిపిస్తాయో నని ఒక్కోటి తిప్పసాగాను. నా పక్కనే ఉన్న శాంతి కుడా చివర వున్నా బాగాన్ని తిప్పుతుంటే క్షణం ఆపమని కొద్దిగా దూరం నుంచి చుస్తే ఆక్కడ నాలుగు కత్తులు కనబడ్డాయి నాలుగు దిక్కులా పిడి బయట వైపు కత్తి మొన లోపలి వైపు నలుగు కత్తుల మొనలు మద్యలో ఉన్న పద్మం తొడిమ వైపు చూపిస్తున్నట్లు అగుపించి మద్యలో తొడిమ లాంటి బాగాని పట్టుకొని కొద్దిగా గట్టిగా నొక్కేకొద్ది కిర్రు మంటూ ఓ సౌండ్ వచ్చింది ఎక్కడా అని చుస్తే పీట వెనుక వైపు ఓ డ్రా లాంటిది ఓపెన్ అయ్యింది , చుస్తే అందులో ఓ తుప్పు పట్టిన తాలం చెవి కనబడ్డది. అది దాదాపు ఓ పదిహేను సెంటిమీటర్లు పొడవుంది. ఇంకా ఆ డ్రాలో ఏమైనా ఉన్నాయోమో నని చూసాను కాని ఏమీ కన బడ లేదు. ఆ తాళం చెవి తీసుకోని బయటకు వచ్చి ఆ రూం తాలం వేస్తూ గుడి బయటకు వచ్చాము.

దాదాపు మేము లోపల ఓ గంట పైగా గడిపాము. ఇద్దరికీ అంటిన దుమ్ము దులుపుకొంటూ ఇంటిదారి పట్టాము. దారిలో ఉండగా షబ్బిర్ నుంచి ఫోన్ వచ్చింది.
"శివా నేను సార్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను , ఇటు వైపు నిన్నటి నుంచి కరెంటు లేదు , సార్ ఫోన్ చార్జ్ అయిపొయింది అందుకే నీ ఫోన్ కు దొరక లేదు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కాలి పోయింది ఈ రోజు ఈవెనింగ్ కి బాగావుతుంది" అంట అని చెప్పాడు. సార్ తో మాట్లాడు అని తన కి ఫోన్ ఇచ్చాడు. సార్ తో మాట్లాడి నేను పంపిన ఇంతో 4 గవ బాగం ను తెలుగులో కి తర్జమా చేసి పంపమని చెప్పా సాయంత్రం కరెంటు రాగానే పంపుతానని చెప్పి ఫోన్ పెట్టేసాడు.

దారిలో పూజారి ఇంటికి వెళ్లి గుడి తాళం చెవి ఆయనకు ఇస్తూ , ఇలాంటి గుడే ఈ చుట్టూ పక్కల ఎక్కడైనా ఉందా అని అడిగాము. దగ్గర అంటే దగ్గర కాదు , ఇట్లాంటి గుడే రాయచోటిలో ఒకటి ఉంది డానికి పూజారి మా అన్నే తిప్పా రెడ్డి , ఒకప్పుడు ఆ గుడికి చాలా మంది బక్తులు వచ్చేవారు , కాని ఇప్పుడు టౌన్ లో బక్తులు అందురు సౌమ్యంగా ఉండే దేవతలా దగ్గరకు వెళుతున్నారు అందు చేత రౌద్రం గా ఉండే ఈ దేవత దగ్గరకు జనం రావడం తగ్గి పోయింది. అంటూ ఈ రెండు గుళ్ళు ఒకే సారి కట్టారు అంటూ చెపుతూ , ఆ గుడిలో కూడా మా వంశస్తులే పూజారులుగా వస్తున్నారు అని చెప్పాడు.

అంటే మ్యాప్ లో గుర్తుల ప్రకారం ఇంకో గుడి అదే అయివుండ వచ్చు , పటంలో దూరం ఎక్కడా రాయలేదు అందులోనా అప్పటి కాలంలో అక్కడ పెద్ద పట్టణం ఉన్నట్లు కుడా గుర్తులు లేవు. అక్కడికి వెళ్లి చుస్తే గాని తెలియదు , మల్లీ ఓ సారి రాయచోటికి వెళ్ళాలి అనుకుంటూ ఇంటికి చేరుకొన్నాము. ప్రొఫెసర్ దగ్గరనుంచి ఫోన్ వస్తే మిగిలిన విషయాలు తెలుస్తాయి , రేపు ఓసారి రాయచోటికి వెళ్లి వస్తా అని శాంతా కు చెప్పి. బొంచేసి తోట వైపు వెళ్లాను.
Next page: Update 49
Previous page: Update 47