Update 55
కొద్ది సేపటికి యశోద టించరు సీసాతో వచ్చింది , తన చేతిలోంచి దూది , టించరు తీసుకోని గిసుకొన్న చోట దూదితో అద్ది కొద్ది సేపు అక్కడే పెట్టి ఉంచాను. ఈ లోపున భారతి కాఫీ చేసుకొని వచ్చింది, కాఫీ తాగి పెద్దాయనతో కొద్ది సేపు గడిపి ఇంటికి వచ్చేసాను. శాంతా నా కోసం ఎదురుచూస్తుంది.
"ఎక్కడికి వెళ్లావు , ఇక్కడ కుడా ఎదో హిరో గిరీ వెలగ బెట్టావట " అంటూ నా మీద రుస రుస లాడింది.
"ఏమి లేదులే , ఎదో పిల్లోడు బండ్లోంచీ పడుతుంటే పట్టుకొన్నా " అంటూ తన నుంచి తప్పిచ్చుకోవడానికి పక్క రూము లోకి వెళ్ళాను నా కర్మ కొద్ది అక్కడే రమణి పంజాబీ డ్రెస్ విప్పి చీర మార్చు కొంటుంది. నన్ను చుసిన వెంటనే కయ్య మని అరుస్తూ , తిట్ట సాగింది. సారీ చెప్పి అక్కడ నుండి బయటకు వచ్చేసాను.
ఓ రెండు నిమిషాలకు బయటకు వచ్చి నాతొ కొట్లాట పెట్టుకోంది. పొరపాటున అక్కడికి వచ్చాను తప్పై పోయింది అంటూ మల్లి ఇంకో సారి సారీ చెప్పాను. వద్దు వద్దు అనుకుంటూనే ఈమెతో గొడవ అయిపోతుంది ఏంటి అనుకొంటూ బయటకు వెళ్లి దగ్గరలో ఉన్న అంగడిలో ఓ సిగరెట్టూ తీసుకోని అక్కడే వెలిగించి కొద్దిసేపటికి ఇంటికి వచ్చాను. అప్పటికే సాయంత్రం 5 గంటలు అయ్యింది. మల్లి ఓ సారి కాఫీ తాగి లోనకు వెళ్లాను. అక్కడ తన ఫ్రిండ్స్ తో తను ఏవిదంగా నన్ను తిట్టింది నేను తనకు భయపడి సారీ చెప్పింది గొప్పగా చెప్పుకో సాగింది. పోనిలే అనుకోని నేను అక్కడ నుండి వెళ్లి పోయాను. కొద్ది సేపటికి అందరూ ఇల్లంతా హడావిడిగా వేటుక సాగారు నేను వంట చేసే వాళ్ళ దగ్గర ఉంటే రజీ అక్కడికి వచ్చి "అన్నా రమణి అక్క తన వజ్రాల హారం పోగొట్టు కొందట చాలా ఖరీదైన దట వాళ్ళ భర్త మొన్ననే కొని పెట్టాడట" అంటూ తను కుడా వెదక సాగింది. నాకు ఎందుకులే అని నేను అక్కడే వంట దగ్గర కుర్చీ వేసుకొని కుచోన్నాను. కొద్ది సేపటికి తను బయటకు వస్తూ ,
"ఇంట్లోకి అలాగా జనాల ను అందరినీ రాణిస్తారు ,వాళ్ళే ఎవరన్నా తీసి వుంటారు ఇంట్లో వాళ్ళు ఎవరూ తీస్తారు ? " అంటూ నా వేపు చూడ సాగింది.
"ఎక్కడన్న పెట్టి మరిచి పోయావేమో చూడు " అంటూ రాజి వాళ్ళ అమ్మ మల్లి ఓ సారి అన్ని చోట్లా వెతక మంది. బాత్రుం, కిచెన్ తను వున్నా బెడ్రుం అన్ని వెతికారు కాని కనబడలేదు. తనకేమో కచ్చితంగా ఎవరో తీసి ఉంటారు అని అప్పటి నుండి ఒకటే గొణుగుడు. పనోళ్ళు ఎవరన్న తీసి వుంటారు అని.
"ఇంట్లో కి పనోళ్ళు ఎవరూ రాలేదు , శివా ఒక్కడే వాళ్ళకు కావాల్సినవన్నీ అందిస్తున్నాడు" అంటూ రాజీ వాళ్ళ అమ్మ చెప్తుంది
"ఓ సారి మీ డ్రైవర్ ను అడగండి తానేమైనా తిసాడెమో " అంటూ శాంతా వైపు చూసింది రమణి.
"శివా అట్లాంటి వ్యక్తి కాదు , మా ఇంట్లో 10 రోజుల ఉంచి ఉంటున్నాడు అతను గురించి మాకు తెలుసు "
"మీకు అందరు మంచి వాళ్ళ లాగే కనబడతారు , ఓ సారి వెతికి చూస్తూ పోతుంది కాదా " అంటూ పట్టు పట్టింది వాళ్ళ మాటలు వింటూ
"తనకు అంతగా డౌట్ గా ఉంటో నా బ్యాగు , ఆ జేబులు ఓ సారి చూడండి , మేడం గారి డౌట్ తీరిపోతుంది " అంటూ నా బ్యాగు తెచ్చి వాళ్ళ ముందర గుమ్మరించి నా జేబులన్నీ విదిలించి చూపించా.
"సారి శివా ఆవిడ పట్టు పట్టింది అందుకే నేను ఏమి అనలేక పోయాను " అంటూ శాంతా సంజాయషి ఇచ్చింది .
"అది సరే ఇంతకీ ఆ చైన్ ఇక్కడ పడిపోయిందో చూడండి మొదట." అంటూ అందర్నీవెతికే పనిలో పెట్టా ఇల్లంతా జల్లడిలో వేసి గాలించి నట్లు బీరువాలు , అలమారాలు వెతికారు కానీ ఇక్కడా కనబడలేదు. రాత్రి బోజనాలు చేసి ఇంకా దొరకదులే అనుకుంటూ పడుకోండి పోయారు. రమణి , శాంతా వో రూమ్ లో పడుకోండి పోయారు నేనేమో చాపా దిండు తీసుకోని మిద్ది మీదకు వెళ్లాను. పగలంతా పనితో అలసి పోవడం వలన వెంటనే నిద్ర పట్టేసింది.
ఉదయం కాఫీ తాగుతుండగా శాంతా నా దగ్గరకు వచ్చి
"శివా రాత్రంతా రమణి ఏడుస్తూనే వుంది, వాళ్ళ అయన మొదటి సారి చేయించినాడట , వాళ్ళ అత్త గారు ఏమంటారో అని చాలా బయపడుతుంది. "
"ఇంతకూ తను ఎప్పుడూ గమనించింది ఆ హారం లేదని " ఏమో ఉండు నేను తనను పిలుచోకి వస్తాను అంటూ లోనకు వెళ్లి కొద్ది సేపటికి తనతో వచ్చింది.
"రమణీ , నువ్వు ఎప్పుడూ చుసుకున్నావు అది పోయింది అని ?? "
"మద్యానం భోజనం చేసేటప్పుడు కుడా ఉంది , కాని సాయంత్రం చుస్కుంటే లేదు, మా అత్తా ఇక్కడికి వచ్చేటప్పుడే చెప్పింది ఒకదానివె వెళుతున్నావు బంగారం జాగ్రత్త అని , కాని నేనే ఇక్కడ అందరికి చుపిచ్చాలని తెచ్చాను ఇప్పుడీ అది పోయింది " అంటూ ఏడవ సాగింది.
"ఎక్కడికి పోడులెండి ఎక్కడో పెట్టి పరిచి పోయి ఉంటారు అంటే కనబడు తుంది లెండి"
"నేను అసలు తీయలేదు వేసుకొని వచ్చిన దగ్గరనుంచి "
" నేనో సారి మీ రూము చూడొచ్చా "
"శివా నేను తిసికేలతా రా " అంటూ శాంతా లోనకు తీసికొని వెళ్ళింది తన వెంట నేను రమణి ఇద్దరం వెళ్ళాము. తను కచ్చితంగా తీలేదు అంటుంది కాని మెళ్ళో నగ మాయమై పోయింది పగలే ఆనుకొంటుండగా ఓ డౌట్ వచ్చింది.
"మీరు పొద్దున్న పంజాబీ డ్రెస్ వేసుకొన్నారు కదా "
"అవును ఆ తరువాత సాయంత్రం చుట్టాలు వస్తారు అని , డ్రెస్ విప్పేసి చిర కట్టుకొన్నా "
"ఆ డ్రెస్ ఎక్కడుంది ?"
"మాసిపోయింది కదా అందుకే చాకలి వస్తే వుతకదానికని వేసేసా "
"చాకలి వాళ్ళ ఇల్లు ఎక్కడ , వాళ్ళు బట్టలు ఎప్పుడూ ఉతుకుతారు " . ఇంతలో రాజి అక్కడికి వచ్చింది
"అన్నా నాకు తెలుసు వాళ్ళ ఇల్లు , బట్టలు రేపు ఉతుకుతారు "
"రాజీ వాళ్ళ ఇంటికి ఓ సారి వెళదామా "
"ఇంతకీ నీ డౌటే ఏంటి " అంటూ శాంతా అడిగింది
"అది ఓ డౌట్ మాత్రమే సరిగ్గా చుస్తే గాని తెలిదు , ఓ 20 నిమిషాలు ఓపిక పట్టండి " అంటూ నేను రాజి చాకలి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటిముందర అందరి ఇళ్లనుంచి తెచ్చిన బట్టలు మూటలు మూటలు గా కట్ట బడి వున్నవి. అక్కడ వున్నా చాకలి ని బయటకు పిలిచి.
"నిన్న గుడ్డలు తెచ్చావుకదా మా ఇంట్లో బట్టలు ఎక్కడ ?"
"ఏమైంది అమ్మా ? అన్ని వెతికే తెచ్చా ఏమి లేవు "
"ఆయన్న ఎదో చీటి మరిచి పోయాడంట జేబులో , ఓ సారి చుపిచ్చావా" . చాకలి రాజి వాళ్ళ బట్టల ముట చూపించగానే , ఆ ముట విప్పి తను నిన్న వేసుకొన్న డ్రెస్ ను బయటకు తీసాను. మెడ దగ్గర ఉన్న హుక్ కు తన వజ్రాల నెక్లెస్ తగులుకొని డ్రెస్ లోపలి వైపున వేలాడ బడి వుంది. జాగ్రత్తగా దానిని ఆ హుక్ నుంచి వేరు చేసి రాజి చేతికి ఇచ్చాను.
"నిన్న డ్రెస్ విప్పినప్పుడు హుక్ కు తగులు కొని డ్రెస్ తో పాటు వచ్చేసి వుంటుంది తను చూసుకోలేదు , డ్రెస్ లోనే ఉండి పోయింది అందుకే ఎంత వెతికినా కనబడ లేదు". అంటూ చాకలిని పిలిచి తన చేతులో ఓ 1000 నోటు పెట్టాను.
"అయ్యా ? ఎందుకు డబ్బులు ? మా అయ్యగారు నెల నేలా వుతికేదానికి జీతం ఇత్తారు "
"ఇది జీతం కాదులే , ఉంచుకో " అంటూ మేము అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాము . నాకంటే ముందుగా రాజి ఇంట్లోకి పరేగేత్తు కొని వెళ్లి అందరని హాల్లోకి పిలిచి గట్టిగా అరుస్తూ "హారం దొరికింది " అంటూ జరిగింది అంతా చెపుతూ హారం రమణి కి ఇచ్చింది . హారం రమణి తీసుకోగానే నేను అక్కడ నుండి బయటకు వచ్చి ఎంటర్ లో ఉన్న దుకాణం లోకి వెళ్లి వో సిగరెట్ వెలిగించి ఓ పది నిమిసాలు తరువాత ఇంటికి వెళ్లాను.
అందరూ హల్లో నా కోసం చూస్తున్నట్లు కూచొని వున్నారు
"అన్న రమణి అక్క నీ కోసం చూస్తుంది , ఎక్కడికి పోయ్యావు " అంది రాజి
"ఇప్పుడు ఏమైంది హారం దొరికింది కదా "
"నిన్నంతా నిమిద డౌట్ పడింది కదా అందుకే బాధ పడుతుంది " అక్కడ రమణి నా వైపు చూస్తుంది ఆ చూపులో నిన్నటి కోపం , ఈసడింపు కనబడలేదు డానికి తోడూ తన మోహంలో అదో రకమైన కల కనిపిస్తుంది.
"సారి శివా , నిన్న అన్నందుకు ఏమి మనసులో పెట్టుకోవద్దు , ఎదో హారం పోయింది అన్న కోపం లో ఏమి మాట్లాడానో నాకే గుర్తు లేదు , శాంతా అన్నట్లు నువ్వు నిజంగా హిరో వే , థాంక్స్ నువ్వు లేకుంటే నా హారం చాకలి వాళ్ళకో లేకుంటే చేరువులోనో ఉండేది "
"హారం దొరికింది కదా , అవన్నీ ఎందుకు లెండి " అంటూ తన కళ్ళలో కనబడుతున్న ఆ భావాలకు అర్తం ఏంటా అని ఆలోచించ సాగాను.