Update 83


వాళ్ళను ఇంట్లో దింపేసి , నేను ఇంటికి వెళ్లి పోయాను. next వీక్ సోమవారం నుంచి ఆఫీస్ కు వెళ్లాలని డిసైడ్ అయిపోయాను. ఉదయం లేచి ఇంట్లోకి సరుకులు కావాలంటే అమ్మకు హెల్ప్ చేస్తుండగా ప్రతాప్ నుంచి ఫోన్.

"ఒరే మామా , అక్కడ హైదరాబాదులో నా సెక్యూరిటీ అధికారి ట్రైనింగ్ batch mate ఒకడికి నీ హెల్ప్ కావాలి , వాడికి నీ ఫోన్ నంబరు ఇచ్చాను, వాడు ఫోన్ చేస్తే కొద్దిగా హెల్ప్ చేయి రా వాడి పేరు మల్లికార్జున. "
"నేనేం హెల్ప్ చేయాలిరా ? "
"ఓ కేసు లో ఎదో నీ హెల్ప్ కావాలన్నాడు. నేను వాడికి సరే అని చెప్పాను. వాడు వచ్చి అన్నీ వివరంగా చేపుతాడులే , నీకు ఫోన్ చేస్తాడు ఎక్కడ కలవాలో నువ్వు చెప్పు కావాలంటే వాడు వచ్చి నిన్ను పిక్ చేసుకొంటాడు "
"సరే లే , అక్కడ అంతా ok నా ?, హమీద్ ను అడిగినట్లు చెప్పు " అంటూ ఫోన్ పెట్టేసాను. ఓ పది నిమిషాలకు నా ఫోన్ కాంటాక్ట్ లో లేని నంబరు నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేస్తే ప్రతాప్ చెప్పిన ఫ్రెండ్ , తన పేరు మల్లికార్జున అని , ఎక్కడ కలవాలో చెప్పాడు. సాయంత్రం 5 గంటలకు కలుస్తానని చెప్పి ఫోన్ పెట్టేసాను.

మద్యానం బొంచేసి కొద్ది సేపు పడుకొని లేచి ఫ్రెష్ అయ్యి , అమ్మ పెట్టిన టి తాగి తను చెప్పిన ప్లేస్ కు బయలు దేరాను. అదొక హోటల్ లకడికాపూల్ లో. నేను ఆ హోటల్ కి వెళ్లి ఆ నంబర్ కు ఓ రింగ్ ఇచ్చాను.

cornor టేబుల్ దగ్గర కూచొన్న వ్యక్తీ దగ్గర నుంచి రింగ్ టోన్ వినబడ్డది. అతని దగ్గరకు వెళ్లి మీరు మల్లికార్జునా అని అడిగాను ఆటను అవును అంటూ తల వుపగానే నన్ను నేను పరిచయం చేసుకొన్నాను.

తన పక్కనే కూచొని టి కి ఆర్డర్ చేసి. "పొద్దున్న ప్రతాప్ కాల్ చేసి చెప్పాడు మీ గురించి, చెప్పండి ఎ విదంగా నేను మీకు హెల్ప్ చేయగలను "
"నాకు తెలిసిన ఫ్యామిలీ ఓ sensitive issue లో ఓ చిక్కుకోంది, నేను మా ఆఫీస్ హెల్ప్ తీసుకోలేను అందుకే ప్రతాప్ కి ఈ విషయం చెప్పినప్పుడు , నీ పేరు చెప్పాడు."
"issue ఏంటో చెప్పండి , నేను హెల్ప్ చేయగలనో , లేదో"
"మంత్రి వీరా రెడ్డి తెలుసుగా ?"
"పేరు విన్నా, కాని పరిచయం లేదు"
"ఆయనకు డిగ్రీ చదివే ఓ కూతురు ఉంది. ఆమెను బ్లాకు మెయిల్ చేస్తూ రొజూ ఓ మెయిల్ వస్తుంది, మీరు ఆ మెయిల్ ఎక్కడ నుంచి వస్తుందో తెలుసుకోవాలి, మా ఆఫీస్ హెల్ప్ తీసుకొంటే అది పబ్లిక్ అవుతుంది, అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాము. నువ్వు సరే నంటే నేను సారూ దగ్గరికి తీసుకోని వెళతాను , హెల్ప్ చేయగలవా "

"యా , మెయిల్ ఎక్కడినుంచి వచ్చిందో ట్రాక్ చేయగలను" అన్నాను. మెయిల్స్ ట్రాక్ చేయడం చిన్న చిన్న సైట్స్ hack చేయడం డీటెయిల్స్ కనుక్కోవడం పెద్ద విషయం కాదు ఎందుకంటే నేను పని చేసేది అదే లైనే అందులోనా అది నాకు ఇంట్రస్ట్ అయిన సబ్జెక్టు.

ఇద్దరం బంజారా హిల్స్ లో ఉన్న ఓ బలిసిన ఇంటికి వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి వీరా రెడ్డి అనబడే ఆ మంత్రి గారు ఓ చిన్న మీటింగ్ లో ఉన్నారు. మమ్మల్ని పైకి వెళ్లి కుచోమన్నారు.

"సారూ వస్తూనే నేను వెళతాను గురూ , నాకు కొద్దిగా పని ఉంది , నువ్వు handle చేయగలవు కదా"
"పరిచయం చేసిన తరువాత వెళ్ళు బాసు , లేకుంటే నాకు ఇబ్బంది వీళ్ళు ఎవ్వరు తెలియదు."
"సారూ ది నాది ఒకే ఉరు , అందుకే ఎప్పుడు ఎ అవసరం అయినా హెల్ప్ చేస్తాడు , అందుకే నేను పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకోని నిన్ను తీసుకొచ్చా. ఈయన చాలా కింద స్తాయి నుంచి పైకి వచ్చినాడు. అందుకే తన ప్రాంతం వాళ్ళు అంటే చాలా ఇష్టం."

ఇంతలో నౌకరు రెండు కప్పులు టి తీసుకోని వచ్చింది. మేము టి తాగిన ఓ 10 నిమిషాలకు మంత్రి గారు పైకి వచ్చారు. నన్ను పరిచయం చేసాడు మల్లికార్జున. ఎం చేస్తున్నావు , ఎక్కడి నుంచి వచ్చావు అంటూ నా గురించి డిటైల్ గా అడిగాడు.

చికాకు అనిపిస్తున్నా పెద్దాయన కదా అని అన్ని విషయాలు చెప్పాను.

"ఏమనుకో మాకు , అమ్మాయి విషయం కదా అందుకే నిన్ను అన్ని విషయాలు అడిగాను. నేను పెద్దగా చదువుకోలేదు కాని మా నాయన పలుకుబడి వాళ్ళ రాజకీయాలలో వచ్చి ఈ స్తాయికి వచ్చాను , నా పిల్లలు బాగా చదువుకోవాలని వాళ్ళను కాలేజికి పంపితే , ఏవో మాకు తెలియని గొడవలు . నువ్వు కుడా మా ప్రాంతం నుంచే వచ్చావు కదా , మనదంతా ఒకటే దారి , నాలుగు తన్నడమే లేక తన్నిచ్చుకోవడమో "

"నేను అమ్మాయిని పిలిచి విషయం నీకు చెప్పమని చెపుతాను , ఇందులో ఎవరికీ బాగం ఉందొ చెప్పు చాలు మిగిలిన విషయాలు నేను చూసుకొంటా , కానీ ఈ విషయం బయట తెలియ కూడదు. " అంటూ నీరజా అంటూ కేక వేసాడు.

మేము కూచొన్న హాల్ కు పక్కనే ఉన్న రూమ్ లోంచి ఓ ముద్దు గుమ్మ బయటకు వచ్చింది.
"ఇతను శివా రెడ్డి , నీకున్న problem తనకు చెప్పు , వాళ్ళు ఎవ్వరో తెలుసుకొంటాడు . ఆ తరువాత మిగిలిన విషయాలు నేను చూసుకొంటా" అంటూ నన్ను తనకు అప్పగించి వాళ్ళు ఇద్దరు కిందకు వెళ్లి పోయారు.

ఆడపిల్లలతో మాట్లాడడం నాకు కొత్త కాదు , కాని ఇక్కడ ఎదో తెలియని ఇబ్బందిగా ఉంది. బహుశా తను మంత్రి కూతురు కావడం వల్ల అనుకొంటా. తనేమో తన ఫోన్ లో మునిగిపోయింది. ఇక్కడ problem ఎవరికో అర్తం కావడం లేదు.

ఒప్పుకొన్నాకా తప్పదుగా అన్నట్లు . మాటలకు నాంది లాగా చిన్నగా దగ్గాను. ఆ సౌండ్ కు నా వైపు చూసింది. మాటాడకుండా వదిలేస్తే మల్లీ ఎక్కడ తన ఫోన్ లో దురిపోతుందో నని
"హాయ్ " అన్నాను "ఇంతకూ మీరు ఏమి చదువుతున్నారు "
"B.Tech final year" అంది బిరుసుగా
"ఎ బ్రాంచి "
"Biotechnology"
"ఓహ్ గుడ్ , మీరుకూడా technology చదువుతున్నారన్న మాట " ఆ తరువాత తెలిసింది ఎంత చప్పని డైలాగ్ కొట్టానని.
"ఇంతకీ విషయం ఏంటి ? మీకు ఏవో మెయిల్స్ వస్తున్నాయి అన్నారు మీ నాన్నగారు, ఓ సారి చూపిస్తారా". నా మాట విని అక్కడ నుంచి తన రూమ్ కు వెళ్ళిపోయింది. నేను తన వెనుక వెల్లాల లేక అక్కడే ఉండాలా తెలియలేదు .

తను వాకిట్లో వరకు వెళ్లి , నేను వెనుక రాలేదని గ్రహించి , వాకిట్లో నుంచి వెనుకకు తొంగి చూసి రండి అన్నట్లు సైగ చేసింది.
"దీనికి బలుపు నర నరాల్లో పేరుక పోయింది రా బాబు " అని మనసులో అనుకొంటూ తన రూమ్ లోకి వెళ్లాను. విశాలమైన రూమ్ , attached బాత్ రూమ్ కుడా ఉనట్లు ఉంది. రూమ్ లో ఓ పక్కన స్టడీ టేబుల్ మిద laptop ఉంది. తన పక్కన ఇంకో చైర్ లాగి నన్ను అందులో కుచోమన్నట్లు సైగ చేసింది.

"మీరు మౌన వ్రతం ఏమైనా పాటిస్తున్నారా " , ఓ సారి నా వైపు చూసి లేదే "ఎందుకు అడిగారు అలా"
"మీరు మాట్లాడ కుండా అన్నీ సైగలతో చెపుతున్నారు , అందుకే డౌట్ వచ్చింది "
"అదేం లేదు "
"ఇంతకీ విషయం చెప్పలేదు , problem ఏంటి "
"నేను మెయిల్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి , అప్పుడు మికే అర్తం అవుతుంది." అంటూ తన laptop లోకి లాగిన్ అయ్యి తన మెయిల్ ఓపెన్ చేసింది అందులో ఓ ఫోల్డర్ లో ఉన్న మెయిల్ ఓపెన్ చేసి నన్ను చదవమని , laptop నా ముందు పెట్టింది.

ఆ మెయిల్ వైపు , అందులో ఉన్న పిక్చర్స్ వైపు చేసే కొద్దీ నా నోట్లోంచి మాట రాలేదు.
Next page: Update 84
Previous page: Update 82