Chapter 132


- 1 -

MD గారి చేతిలో కంపెనీని మోసం చేసిన వాళ్ళుకి ఎవ్వరికీ బయట నీళ్లు పుట్టనివ్వకుండా చెయ్యవలసిన వాళ్ళ జాబితాలో మొదటి రెండు పేర్లు సుందరం, బ్రహ్మం పేర్లు ఉండడం చూసిన రమణ MD గారిని ఆ గదిలోనించి బయటకు తీసుకువెళ్లి మొట్టమొదటిసారి MD గారికి ఒక నిజం చెప్పాడు. అదేమిటంటే..

రమణ మాటల్లోనే రమణ MD గారికి చెప్పిన విషయం.

సార్, బ్రహ్మం నేను PUC చదువుకునే రోజులుల్లోనించి పట్నంలో ఒక గదిలోనే అద్దెకు ఉండేవాళ్ళం. నేను వాడు కలిసి ఆగదిలోనే ఉంటూ ఒకే కాలేజీలో B. Com. చదువుకున్నాం. వాడు B. Com చదువు అయిపోయేక వాడు ఉద్యోగంలో చేరెడు. నేను పైచదువులు చదువుకుని వేరు వేరు కంపెనీల్లో ఉద్యోగాలు చేసి చివరిగా ఈ కంపెనీలో చేరాను. బ్రహ్మం ఉద్యోగంలో చేరినప్పటినించీ నాకు సుందరం అతని కుటుంబం బాగా తెలుసు. వాళ్లిద్దరూ ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పు చెయ్యరు అని నేను నమ్మకంగా చెప్పగలను. ముందు వాళ్ళిద్దరినీ పిలిపించి వేరే గదిలో విచారించండి.

వాళ్ళిద్దరినీ వేరే గదిలోకి తీసుకువెళ్లి విచారించమని ఎందుకు చెబుతున్నానంటే ఈ కుట్రలో ఇంకా ఎవరెవరు ఉన్నారో మనకి తెలియదు. ఆ సేల్స్ టీమ్ తో పాటు వీళ్ళిద్దరూ ఉన్నారు కనుక మీరు వీళ్ళను పక్కకు తీసుకెళ్లి రహస్యంగా విచారిస్తే మీకు మరికొందరు వెన్నుపోటుదారుల రహస్యం తెలుసుకునే అవకాశం ఉంది. కావాలంటే మీరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను కూడా మీ పక్కన ఉండను. అప్పుడు మీరు నిర్మొహమాటంగా వాళ్ళిద్దరినీ ప్రశ్నించవొచ్చు నమ్మకంగా చెప్పాడు రమణ. MD గారికి కూడా రమణ మీద అతని ఆలోచనా విధానం మీద నమ్మకం ఉండడంతో, అదీ కాక రమణ చెప్పింది కూడా సబబుగా అనిపించడంతో MD గారు బ్రహ్మం, సుందరాలను ఉన్నపళంగా రమ్మని కబురు పెట్టారు. రమణ MD గారి దగ్గరకు వెళ్ళేటప్పుడే వీళ్లిద్దరికీ ఒక మాట చెప్పి వెళ్లడంతో బ్రహ్మం, సుందరాలు ఆరుమేఘాల మీద MD గారిని కలిశారు.

- 2 -

రమణ చెప్పినట్లే MD గారు వాళ్ళిద్దరినీ పక్కగదిలోకి తీసుకువెళ్లి ఆ 6 మంది సేల్స్ అధికారులు చేసిన మోసం గురించి చెప్పి అందులో వీళ్ళ ఇద్దరి పాత్ర గురించి కొంచెం గట్టిగానే అడిగారు. అప్పుడు బ్రహ్మం సుందరం రమణని గూడా గదిలోకి పిలవమని MD గారిని అడిగారు. రమణ గదిలోకి వచ్చేక బ్రహ్మం సుందరాలు MDకి, రమణకు చెప్పిన విషయాలు విని వాళ్లిద్దరూ నిశ్చేష్టులైపోయారు. బ్రహ్మం, సుందరం చెప్పిన విషయాలు పూర్తిగా ఆకళింపు చేసుకోవడానికి వాళ్ళిద్దరికీ చాలా సమయమే పట్టింది. మొత్తం విషయం అర్ధం కావడంతో MD రమణతో నువ్వు చెప్పింది అక్షరాలా నిజం నీస్నేహితులకు కంపెనీ మీద ఉన్న అభిమానం, వాళ్ళు పనిచేసే సంస్థ మీద ఉన్న ప్రేమ వెలకట్టలేనిది. వీళ్ళిద్దరూ కలలో కూడా అన్నం పెట్టె సంస్థకు అన్యాయం చెయ్యలేరు. వీళ్లిద్దరికీ వాళ్ళు పనిచేసే సంస్థ మీద ఉన్న ప్రేమలో పది శాతం ప్రేమ మన సంస్థలో పనిచేసే వాళ్లందరికీ ఉంది ఉంటే ఈరోజు మనం అందరం ఇలాటి ఒక పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చేది కాదు అని బ్రహ్మం, సుందరాలను పొగిడాడు.

ఇంతకూ ఆ బిడ్ వెయ్యడానికి 10 రోజుల పాటు బ్రహ్మం, సుందరం వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది అన్నది వాళ్లిద్దరూ కలిసి రమణకు మరియూ MD గారికి చెప్పింది వాళ్ళ మాటల్లోనే:

ఈ 6 మంది సేల్స్ అధికారులు ఆ బిడ్ వెయ్యడానికి వెళ్ళింది మొదలు అసలు బిడ్ పనులు పక్కకు పెట్టి కంపెనీలో MD గారు సమ్మతితో తెచ్చుకున్న కాగితాలలో లెక్కలు తారుమారు చేసి రకరకాలుగా వేరువేరు విధంగా అకౌంట్స్ ని తెయారు చెయ్యమని వాళ్ళు బ్రహ్మం, సుందరాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అంతే కాకుండా బ్రహ్మం, సుందరాలకు ఈ విషయాలు అన్నీ MD గారి సమ్మతితోనే జరుగుతున్నాయి అని గట్టిగా నమ్మించే ప్రయత్నం చెయ్యడం మొదలుపెట్టారు. పోనీ అదే విషయాన్ని ఒక్కసారి MD గారితో మాట్లాడి నిర్ధారించుకుందాం అనుకుంటే, ఆ సమయంలో MD గారి తల్లిగారు కాలం చెయ్యడంతో ఈ సమయంలో MD గారిని ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ ఆ సేల్స్ అధికారులు వీళ్లిద్దరి నోళ్లు మూయించారు. అదీకాక ఆ 6 మంది సేల్స్ అధికారులూ వీళ్ళకన్నా ఉన్నత పదవుల్లో ఉండటం వలన వాళ్ళ అధికారాన్ని ప్రశించేటంత ధైర్యం వీళ్ళ ఇద్దరికీ లేకుండా పోయింది.

దానితో ఇక్కడ ఏదో మోసం జరుగుతున్నది అన్న విషయం బ్రహ్మం, సుందరాలకు అర్ధమైపోయింది. అది మొదలు ఈ సేల్స్ అధికారులు ఏమి అడిగినా కానీ బ్రహ్మం, సుందరాలు వాళ్ళు అడిగిన ప్రతీ రకమైన లెక్కలు మూడు కాపీలు తెయారుచెయ్యడం మొదలుపెట్టారు.

(1) సేల్స్ వాళ్ళు అడిగిన విధంగా తెయారు చేస్తే తప్పులు లేకుండా తెయారు చేసిన లెక్కల కాపీ.

(2) MD గారి సమ్మతి పొందిన లెక్కలకు ఈ లెక్కలకు ఎటువంటి తేడా ఉంది..? ఎంత తేడా వస్తున్నది అనే వివరాలను జాగ్రత్తగా పొందు పరచిన వివరాలు మరొక రహస్య కాపీ (ఒకవేళ ఈ నేరం / నింద తమ నెత్తికి రుద్దితే తప్పించుకోవడానికి అనువుగా వీళ్ళకి రక్షణ కవచంలా) ..

- 3 -

(3) సేల్స్ వాళ్ళు అడిగిన విధంగా తెయారు చేసిన లెక్కల కాపీ - కానీ ఆ కాపీ సరైన కాపీ కాదు. అదంతా తప్పుల తడకల కాపీ. కానీ పైనించీ చూస్తే అన్నీ సరిగ్గానే ఉన్నట్లు కనిపిస్తాయి. లోతుగా వివరాల్లోకి వెళితే ఆ లెక్కలు ఏ ఒక్క లెక్కకీ సరిపోదు సరికదా.., మొత్తం అంతా గందరగోళంగా ఉండే విధంగా లెక్కలు తెయారుచేసారు. ఇలాంటి లెక్కలతో ఏ కంపెనీ అయినా బిడ్ వేస్తె ఆ బిడ్ తెరిచి చూసిన వాళ్ల లోతుగా ఆ లెక్కలు చూస్తే ఛస్తే ఆ బిడ్ వేసిన కంపెనీకి బిడ్ ఇవ్వరుగాక ఇవ్వరు.

బ్రహ్మం, సుందరాలు ఆ సేల్స్ అధికారులకు ఇచ్చే ప్రతీ కాపీ ఈ 3వ రకం కాపీలనే అందించారు. ఆ సేల్స్ అధికారులు ఆ లెక్కలను వివరించమని అడిగితే వీళ్ళు ఎందులో ఏం మాయ చేశారో వీళ్లిద్దరికీ క్షుణ్ణంగా తెలుసు కనుక వాళ్లకు ఆ లెక్కలు వివరించేటప్పుడు అంతా సవ్యంగానే ఉన్నది అన్నట్లు అన్ని లెక్కలు సరిగ్గా సరిపోయినట్లు వివరించి చెప్పేవాళ్ళు.. సేల్స్ వాళ్లకు అకౌంట్స్ మీద పట్టు లేకపోవడం వలన బ్రహ్మం, సుందరాలు నెంబర్లు సరిపుచ్చి చూపించడం వలన సేల్స్ వాళ్లకు అంతా సవ్యగానే ఉన్నట్లు కనిపించేది.

మన సేల్స్ టీమ్ వాళ్ళు ఆ కాగితాలను తీసుకువెళ్లి మన ప్రత్యర్థి కంపెనీ వాళ్లకు ఇచ్చారు. మన ప్రత్యర్థి కంపెనీ వాళ్ళు ఆ కాగితాలనే వాళ్ళ బిడ్ లో ఉపయోగించారు. ఇంక మన సేల్స్ టీమ్ వాళ్ళు మన కంపెనీ తరఫున వేసే బిడ్ లో అంకెలన్నీ మార్చేసి మన ప్రత్యర్థి కంపెనీ వాళ్ళ బిడ్ కన్నా చెత్తగా ఉండేలా మన బిడ్ వేశారు.. ఆ విధంగా సేల్స్ వాళ్ళు మన కంపెనీకి ఆ బిడ్ రానివ్వకుండా చేసి, వాళ్ళు ప్రత్యర్థి కంపెనీకి మేలు చేశామని అనుకున్నారు. నిజానికి బ్రహ్మం, సుందరం ఎదురు ఈ సేల్స్ టీమ్ నే ముంచేశారు అని గుర్తించలేకపోయారు.

ఇంతవరకూ అంతా బాగానే ఉంది. కానీ మీరు వెళ్ళింది ఆ 300 కోట్ల ప్రోజక్ట్ మనకి వచ్చేలా బిడ్ వెయ్యడానికి కదా..? మీరు సేల్స్ వాళ్లకు ఇచ్చిన బిడ్ లో అకౌంట్స్ అన్నీ గందరగోళం చెయ్యడం వలన ఆ ప్రోజక్ట్ మన ప్రత్యర్థి కంపెనీకి రాదు సరే.., కానీ ఆ బిడ్ మనకి కూడా రాదు కదా..? మరి మీరిద్దరూ కంపెనీకి చేసిన ఉపకారం ఏంటి..? రమణ, MD గారు ఇదే విషయాన్ని బ్రహ్మం, సుందరాలను అడిగారు. అదీకాకుండా ఆ బిడ్ వేసి వెనక్కి తిరిగి వచ్చాకైనా ఈ విషయం MD గారికి ఎందుకు చెప్పలేదు అని అడిగాడు రమణ. అలా అంటూనే రమణ పోనీ మీ ఇద్దరికీ MD గారిని కలిసేంత అవకాశం లేదు. నేను మీ ఇంట్లో మీతోనే ఉంటున్నాను కదా..? పోనీ ఈ విషయాలను రహస్యంగానైనా నాకు చెప్పి ఉండాలి కదా..?? కనీసం మీరు ఈ విషయాలు నాతొ చెప్పి ఉంటే నేనైనా ఈ విషయాలను MD గారికి చెప్పి ఉండేవాడిని కదా..? అడిగాడు రమణ.

దానికి బ్రహ్మం, సుందరం కలిసి, మేము ఊరి నుంచీ తిరిగి వచ్చేసరికి మన ఇంట్లో ఏమేమి జరిగిందో నీకు మాత్రం తెలియదా రమణా..? అందుకే ఆ కుటుంబ సమస్యలలో పడిపోయి ఆ విషయాలు నీతో కూడా అనే అవకాశం దొరకలేదు. అదీ కాక నువ్వు MD గారికి ఎంత దెగ్గర వాడివో మా ఇద్దరికీ తెలుసు. ఆ సేల్స్ వాళ్ళు చెప్పినదాన్ని బట్టి ఈ మోసంలో MD గారికి కూడా భాగం ఉన్నాది అని వాళ్లంతా కలిసి మా ఇద్దరినీ నమ్మించారు. అందుకే ఈ విషయాన్ని నీతో కానీ MD గారితో కానీ చెప్పడానికి మేమిద్దరం ఒక విధంగా భయపడ్డాం, మరో విధంగా వానకాడేము.

- 4 -

కంపెనీని కాపాడవలసిన MD గారే కంపెనీకి ద్రోహం చేస్తున్నారు అని మేము నమ్మినప్పుడు మేమెలా ఈ విషయాలను బయటకు చెప్పగలం చెప్పండి..? ఇప్పుడు MD గారు మమ్మల్ని గదిలోకి పిలిచి మామీద కేకలు వేసేవరకూ ఆ సేల్స్ టీమ్ మొత్తం MD గారికి కూడా తెలియకుండా ఆయన వెనకాల గూడుపుఠాణీ చేసేరని ఇప్పటివరకూ మాకు కూడా అర్ధమవ్వలేదు.

సరే నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఇంతకీ ఆ బిడ్ మన కంపెనీ చెయ్యి జారిపోనీకుండా మీరిద్దరూ ఏం చేశారో అది ముందు చెప్పండి అని అడిగాడు రమణ. రమణ ఆ విషయాన్ని అడిగినప్పుడు బ్రహ్మం, సుందరం నవ్వుతూ.. ఆ బిడ్ మన చేజారిపోకూడదు అని మేము ఇద్దరం కలిసి మన సేల్స్ టీమ్ కి తెలియకుండా రహస్యంగా మన కంపెనీ పేరుమీద ఇంకో బిడ్ దాఖలు చేసాము.

వీళ్ళు చెప్పిన మాట విన్న రమణ తుళ్లిపడుతూ.. ""ఆ"" అదెలా సాధ్యం..? ఒక కంపెనీ పేరు మీద మనం ఒక బిడ్ మాత్రమే వెయ్యగలం కదా..? ఆశ్చర్యంగా అడిగాడు రమణ.

నిజమే, ఆ సంగతి మాలు తెలియదా..? అందుకే మెగా ప్రొజక్ట్స్ డివిజన్ అఫ్ **** (మన) కంపెనీ లిమిటెడ్ అన్న పేరు మీద మేము ఆ రెండో బిడ్ వేసాము. ఆ బిడ్ లో మన MD గారి సంతకాలు ఉన్న అసలు కాగితాలను పెట్టాము. మన సేల్స్ టీమ్ కు ఇచ్చిన బిడ్ కాగితాలలో మన MD గారి సంతకంలా మేమిద్దరం సంతకాలు చేసాము. అలాగే మన MD గారి స్టాంప్ కి దగ్గరగా ఉండేలా మేము అక్కడ ఒక రబ్బర్ స్టాంప్ తెయారు చేయించి ఆ దొంగ స్టాంప్ వేశాము. వాళ్లిద్దరూ చెప్పింది విన్న రమణ గుండె బేజారైపోయింది. మీరిద్దరూ ఎంత పెద్ద తప్పు చేశారో తెలుస్తున్నాదా ..? ఫోర్జరీ కేసు పెడితే మీరిద్దరూ జీవితాంతం జైల్లో చిప్పకూడు తింటారు. మీరిద్దరికీ మతి ఉండే ఇలాంటి పని చేశారా..? ఉగ్రరూపం ధరించిన రమణ కోపంతో ఊగిపోతూ పెద్దపెట్టున బ్రహ్మం, సుందరాల మీద విరుచుకుపడిపోయాడు..

MD గారి కన్నా రెండింతల కోపంతో ఊగిపోతున్న రమణను చూసి బ్రహ్మం, సుందరాలు భయంతో వణికిపోయారు.. ఆఖరికి MD గారే స్వయంగా కల్పించుకుని రమణని శాంత పరచవలసి వచ్చింది. ఆ గదిలో పరిస్థితి కొంచెం నిమ్మదించాక MD గారు కూడా కొంచెం అనునయంగా బ్రహ్మం, సుందరాలను అడిగాడు.. అసలు ఎందుకు మీరిద్దరూ అలా చేశారు..? మీరు చేసిన పనివల్ల మీఇద్దరి ఉద్యోగాలు పోవడమే కాకుండా మీరిద్దరూ జైలు పాలు అవుతారని మీకు తెలియదా అని అడిగేప్పటికి సుందరం, బ్రహ్మం కళ్లనీళ్లు పర్యంతం అయిపోతూ ఈ కంపెనీ మాకు అన్నం పెట్టిన అమ్మ లాంటిది సార్.. మీరు మాకు తండ్రి లాంటి వారు. తండ్రి లాంటి మీరే కంపెనీకి ద్రోహం చేస్తుంటే మేము ఎవరికీ చెప్పాలో ఎవరితో చెప్పుకోవాలో కూడా మాకు తెలియలేదు సార్.. అందుకే ఆ బిడ్ మన కంపెనీకి రావాలి అన్న ధ్యాసే తప్ప ఆ సమయంలో మాకు ఇంకేం చెయ్యాలో తోచలేదు సార్.. ఈ ఒక్కసారికి మా తప్పు కాయండి.. ఇకమీదట ఇంకెప్పుడూ ఇలాంటి పనులను మేము చెయ్యము. మేము చేసిన తప్పుకు మీరు ఎటువంటి శిక్ష వేసినా దాన్ని అనుభవించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ మీరు మమ్మల్ని మా ఉద్యోగాలకు రాజీనామా చేయ్యమంటే మేము ఇద్దరం మా ఉద్యోగాలకు కూడా రాజీనామా చేసేస్తాం.. !! అన్నారు.

- 5 -

బ్రహ్మం, సుందరాలకు కంపెనీమీద ప్రేమ, అభిమానం, అన్నం పెట్టే సంస్థని కాపాడుకోవడానికి తమ జీవితాలను కూడా పణంగా పెట్టగలిగే వాళ్ల త్యాగనిరతి MD గారికి నచ్చాయి. ఇప్పుడు ఆయనలోని మానేజర్ వీళ్ళిద్దరినీ ఏవిధంగా కంపెనీ పురోగతిలో వాడుకోవాలి అన్న ఆలోచన చేస్తూ వాళ్లలో శక్తి సామధ్యాలను, వారిలోని విషయం పరిజ్ఞానాన్ని పరీక్షించాలని నిర్ణయించుకుని వాళ్ళిద్దరినీ రకరకాల ప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టాడు. సాధారణంగా ఏ మేనేజర్ అయినా ఎవరినైనా ఉన్నతస్థాయిలో కూర్చోపెట్టాలి అంటే వాళ్లకు స్వామి భక్తి ఒక్కటే సరిపోదు కదా..? ఆ స్థాయికి తగ్గట్టుగా ఆ బాధ్యతలను నిర్వర్తించగలిగే సామద్యం కూడా ఉండాలి కదా..? అందుకే ఇప్పుడు MD గారు బ్రహ్మం, సుందరాలను ప్రశ్నల పరంపరతో పరీక్షించడానికి నిర్ణయించుకుంటూ వాళ్ళిద్దరినీ ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు.

MD గారి ప్రశ్న: అది సరే మనం ఒక బిడ్ వెయ్యాలి అంటే ఆ బిడ్ లో కొంత శాతం మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ గా ఒక చెక్కు జతచేయాలి ఆ చెక్కు చిన్న మొత్తం ఏమీ కాదు.. ! అది ఎంత మొత్తం..? మరి మీరు దాన్ని ఎలా చేయగలిగారు..?

బ్రహ్మం, సుందరంల సమాధానం (సమాధానం)

సమాధానం: 0. 01% మొత్తాన్ని చెక్కు రూపంలో ఆ బిడ్ కి జత చెయ్యాలి. మన సేల్స్ టీమ్ వేసిన బిడ్ లోని చెక్కు ఆఖరి నిమిషంలో మేము దొంగిలించి ఆ చెక్కును మేము వేసిన బిడ్ కి జత చేసాము.

MD గారి ప్రశ్న: ఇది చిన్న విషయం కాదు. అలా చెయ్యాలి అంటే ఆ బిడ్ తీసుకునే అధికారులకు పెద్ద మొత్తంలో లంచాలు ఇవ్వాలి అదెలా చేశారు..?

సమాధానం: ఆ నెల మా ఇద్దరికీ వచ్చిన నెల జీతాలు, మా అదృష్టవశాత్తు కంపెనీ వాళ్ళు అదే నెలలో మాకు బోనస్ ఇవ్వడం వలన మా ఇద్దరి బోనస్ లు, చివరికి ఆ సేల్స్ టీమ్ దగ్గర డబ్బులు వరదలా పొంగుతున్నాయి బహుశా మన ప్రత్యర్థి కంపెనీ వాళ్ళు ఇచ్చిన లంచం డబ్బులు అనుకున్నాము.. వాళ్ళు ఆడబ్బులతో గుఱ్ఱపు పందాలు, పేకాట, తాగుడులో మునిగి తెలుస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందొ వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో వాళ్ళకే తెలియడంలేదు. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకే తెలియకుండా రోజుకి కొంచెం కొంచెం మొత్తంగా వాళ్ళదగ్గర మేము వాళ్ళదగ్గర కొట్టేసి ఆ డబ్బులకు మా జీతాలు, బోనస్ డబ్బులు జతకలిపి ఆ బిడ్ అధికారులకు లంచం ఇచ్చాము. అంతే కాకుండా ఈ బిడ్ కనుక మాకే వస్తే మన కంపెనీ అధికారులకు చెప్పి వాళ్లకు పెద్ద మొత్తంలో ముట్టచెబుతాం అని మాట ఇచ్చి వచ్చాము..

MD గారి ప్రశ్న: అసలు నేనే ఈ కుట్రలో భాగమై ఉన్నప్పుడు మీరు మాట ఇచ్చిన వాళ్లకు లంచాలు ఇవ్వడానికి నేను ఒప్పుకుంటానని మీరు ఎలా అనుకున్నారు..?

సమాధానం: నిజంగా ఈ విషయం మీద మేము ఆలోచించలేదు.. అంత పెద్ద బిడ్ వచ్చిన ఆనందంలో మేము మీ దగ్గరకు వచ్చి నిజం చెప్పేసి మేము మాట ఇచ్చిన విధంగా మనకు ఉపకారం చేసిన ఆ బిడ్ అధికారులకు తిరిగి సాయం చెయ్యమని అడుగుదాము అనుకున్నాం కానీ మీరు మాకు సాయం చెయ్యరు అన్న ఆలోచన అప్పుడు మాకు రాలేదు..

- 6 -

MD గారి ప్రశ్న: అది సరే, లేని కంపెనీ పేరు మీద ఇప్పుడు మీరు ఆ బిడ్ వేశారు. ఇప్పుడు ఎలా..?

సమాధానం: మనం తక్షణం మనం బిడ్ వేసిన కంపెనీ పేరు మీద కంపెనీస్ లా బోర్డు లో పాత తారీకు మీద ఆ కంపెనీ పేరు రిజిష్టర్ చెయ్యాలి. కుదిరితే మీకు ఇండస్ట్రీస్ మినిష్టర్, కంపెనీ లా బోర్డు మినిష్టర్, కామర్స్ మినిష్టర్లను పిలిపించి ఘనంగా ఆ కొత్త కంపెనీని మన కంపెనీ సబ్సిడరీ కంపెనీగా ప్రకటించి వార్తా పత్రికల్లో మన కొత్త కంపెనీ పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యాలి. ఇలా చెయ్యడం వలన మన కంపెనీకి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి.. అవేమిటంటే...

- ఇలాంటి పెద్ద పెద్ద ప్రోజక్ట్ లను నిర్మించే శక్తి సామధ్యాలు మనకి ఉన్నాయని దేశంలో ఉన్న వాళ్లందరికీ మనం చాటిచెప్పినట్లు ఔతుంది.

- పెద్ద పెద్ద మినిష్టర్లు వచ్చి ఆ కంపెనీని ప్రారంభిస్తారు కనుక మనకు ప్రభుత్వం తరపునించి సహాయం అందుతుంది

- కొత్త కంపెనీ పెట్టడం వలన మన కంపెనీలో వచ్చే లాభాలలో భాగాన్ని 7 సంవత్సరాల పాటు మనం కేపిటలైజ్ చేసుకోవచ్చు

- కొత్త కంపెనీ వల్ల వచ్చే లాభాలను మన కంపెనీ లాభాలలో కలిపి చూపించకపోవడం వలన మన కంపెనీ కట్టవలసిన పన్ను భారం తగ్గుతుంది..

MD గారి ప్రశ్న: ఇంత లోతైన వివరణ విశ్లేషణ బ్రహ్మం, సుందరాల నుంచి MD గారు అస్సలు ఊహించలేదు.. నిజానికి వీళ్లిద్దరికీ కంపెనీ విషయాల మీద ఉన్న అవగాహన, విశ్లేషణా శక్తి చూసి MD గారు ఆశ్చర్యపోయారు. MD గారు తన మనసులో భావనలు బయటకు కనబడనివ్వకుండా.. సరే అయితే. నేను పక్క గదిలో ఉన్న డిపార్టుమెంట్ అధికారుల దగ్గరకు వెళ్లి మొత్తం సమస్య సమసిపోయింది అని మీరు చెప్పిన వివరాలు అన్నీ చెప్పేసి వస్తాను అన్నారు.. (అలా చెప్పడం సరి కాదని MD గారికి కూడా తెలుసు కానీ కావాలనే వీళ్ళ ఇద్దరి ఆలోచనా విధానాన్ని పరీక్షించాలనే అలా అన్నారు)

సమాధానం: అయ్యయ్యో.. అంతపని చెయ్యకండి, ఈ కుట్రలో మన కంపెనీలో ఇంకా చాలా మంది వెనక నుంచి మన సేల్స్ టీమ్ కి సహాయ సహకారాలు అందించి ఉంటారు. ఒక్క 6 మంది సేల్స్ టీమ్ ఇంత పెద్ద కుట్రని నడిపించలేరు. అందువల్ల ముందుగా మనం చెయ్యవలసింది ఏంటంటే ..

- ముందుగా మీరు మా ఇద్దరినీ సస్పెండ్ చేసి ఆ 6 మంది సేల్స్ టీమ్ మేమిద్దరం మాత్రమే ఈ కుట్రలో భాగస్వామ్యులం అని ప్రకటించి ఇక్కడకి ఈ సమస్య ముగిసిపోయినట్లుగా ప్రకటించండి.. దానితో ఈ కుట్రలో భాగమైన వాళ్ళు ధైర్యంగా గుండెలనిండా గాలి పీల్చుకుంటారు. ఈ కుట్ర మీద ఇంక ఎటువంటి దర్యాప్తు జరగడం లేదు అన్న నమ్మకం చిక్కినపుడు ఈ దొంగలు మునుపటిలా యధావిధిగా తప్పులు మీద తప్పులు చేసుకుంటూ పోతారు అలా వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటే ఇంటి దొంగలను పద్దుకోవడం మనకి సులువౌతుంది.

- 7 -

- కానీ మీరు మీకు అత్యంత నమ్మకస్తులైన వాళ్ళతో మాత్రమే ఈ దర్యాప్తు కార్యక్రమాన్ని తెరవెనుక రహస్యంగా నిర్వర్తించి ఈ కుట్రలో ఇంకా ఎవరెవరు భాగస్వామ్యులు ఉన్నారో కనిపెట్టి వాళ్ళని కట్టడి చేయాలి.

- మీరు అత్యవసరంగా ఢిల్లీ కి వెళ్లి మినిష్టర్లను కలిసి ఈ బిడ్ మన కొత్త కంపెనీకి వచ్చేలా ఈ బిడ్ ని ప్రచురించిన సంస్థ మీద ఒత్తిడి తీసుకురావాలి..

- పనిలో పనిగా కుదిరితే ఈ బిడ్ ని ప్రకటించిన సంస్థ అధినేతలను కలిసి మన కంపెనీ ఉద్యోగులతో కలిసి మన ప్రత్యర్థి సంస్థ ఎటువంటి కుట్రకు తెరతీసిందో వివరించి చెప్పి అలాంటి సంస్థకు బిడ్ ఇవ్వడం వలన వాళ్ళకే నష్టం అన్న విషయాన్ని వాళ్లకు అర్ధమయ్యేలా చెప్పగలిగామంటే మనం అడగకుండానే ఆ బిడ్ మనకు వచ్చేస్తుంది..

బ్రహ్మం, సుందరాలతో నడిచిన ఈ ప్రస్నోత్తరాలతో MD గారికి వాళ్ళిద్దరి శక్తి యుక్తుల మీద వాళ్ళ కార్యనిర్వాహణా సామద్యం మీద పూర్తి నమ్మకం చిక్కింది. MD కొద్దినిమిషాల సేపు కళ్ళు మూసుకుని దీర్ఘంగా ఆలోచించి కళ్ళు తెరుస్తూనే MD గారు చెకచెకా ఆజ్ఞలు ఇవ్వడం మొదలుపెట్టారు. మరొక్క గంటలో మీరు ఇద్దరూ మీ దగ్గర ఉన్న ఆ మూడు రకాల బిడ్ కి సంబంధించిన కాగితాల కాపీలతో మా ఇంటికి వచ్చెయ్యండి..

రమణ ఈ శుక్రవారం రాత్రికి మీకు, నాకు, నా భార్య సాన్వికి, బ్రహ్మానికి, సుందరరానికి ఢిల్లీ కి వెళ్లే రైల్ లో 1st క్లాస్ లో టిక్కెట్లు కొనండి మనమందరం మినిష్టర్లను కలవడానికి ఢిల్లీ వెళుతున్నాం.

అఫీషియల్ గా బ్రహ్మం, సుందరాన్ని నేను సస్పెడ్ చేస్తున్నాను మరొక్క గంటలో వాళ్ళిద్దరి సస్పెన్షన్ ఆర్డర్ నా సెక్రటరీ టైప్ చేసి నా చేతికి అందిస్తుంది. ఆ ఉత్తరాలు నా దెగ్గరే ఉంటాయి.. కంపెనీ రికార్డుల్లో ఎక్కడా వీళ్ళ సస్పెన్షన్ రికార్డు అవ్వదు. కానీ ఈ 6 మంది సేల్స్ టీమ్ తో పాటు మిమ్మల్ని కూడా సస్పెడ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇది మీరిద్దరూ భరించక తప్పదు.

మిగతా విషయాలు మనం మా ఇంట్లో మాట్లాడుకుందాం..

మనం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేవరకూ ఈ బిడ్ నూటికి నూరు శాతం మన చేతికి వచ్చేవరకూ మనం నలుగురం కలిసి పనిచేస్తున్నట్లు మూడో కంటికి కూడా తెలియనివ్వకండి.

మీరు మా ఇంటికి వచ్చేటప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ చూడకుండా చూసుకోండి.. ఒకవేళ బ్రహ్మం, సుందరాలు మా ఇంటికి రావడం చూస్తే, మీ సస్పెన్షన్ విషయం మీద నన్ను కలుస్తున్నట్లు గా చెప్పండి.

ఒకవేళ ఏదైనా అత్యవసరంగా నేను మీతో మాట్లాడవలసి వస్తే, రాత్రి చీకటి పడ్డాక కానీ లేదంటే తెల్లవారుఝామున కానీ నేనే ముఖానికి ఏ మఫ్లర్ ఓ కట్టుకుని మీ ఇంటికే తిన్నగా వచ్చేస్తాను.

ఇక్కడకి మన మీటిగ్ అయిపొయింది.. అని చెప్పి MD గారు ఆ గదిలోనించి చెకచెకా నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయారు.

- 8 -

మరొక్క గంటలో కంపెనీ మొత్తం ఈ వార్త మారుమోగిపోయింది.. MD గారు ఆ 6 మంది సేల్స్ టీమ్ రాజీనామాని అంగీకరించకుండా వాళ్ళని ఉద్యోగం నించి సస్పెడ్ చేసి కంపెనీ దర్యాప్తు ముగిసే వరకూ వాళ్ళ రాజీనామాని ఆమోదించేది లేదని ఖరాఖండీగా చెప్పేసారు అన్న తాజా వార్తతో కంపెనీ అంతా అట్టుడిగిపోయింది. అలాగే 300 కోట్ల ప్రాజెక్ట్ కోసం వెళ్లిన సేల్స్ టీమ్ కి సహాయం చెయ్యడానికి వాళ్ళతో పాటూ వెళ్లిన బ్రహ్మం, సుందరాలను కూడా కంపెనీ సస్పెండ్ చేసిందనీ, కానీ వీళ్ళిద్దారూ అమాయకులు అని ఆ సేల్స్ టీమ్ తో పాటు వెళ్లడమే వీళ్ళ కొంప ముంచిందనే వార్త కూడా బయట చెక్కర్లు కొట్టేలా MD గారు జాగ్రత్తలు తీసుకున్నారు. బ్రహ్మం, సుందరంల పేర్లకు మారక అంటుకోకుండా చూసుకోవలసిన అవసరం MD గారికి ఎంతైనా ఉంది. ఎందుకంటే వీళ్ళ ప్రయత్నాలు అన్నీ ఫలించి ఆ 300 కోట్ల ఆర్డర్ గనక ఈ కంపెనీ చేతికి వస్తే ముందుగా ప్రమోషన్ ఇచ్చి పెద్ద పదవుల్లో కూర్చోపెట్టాలి అంటే వీళ్లిద్దరికీ మోసగాళ్లు అన్న మరక అంటుకోకుండా చూసుకోవలసిన అవసరం MD గారికి ఎంతైనా ఉంది. అందుకే MD గారుఈ వార్త ఎలా కంపెనీలో ఎలా ప్రచారం చెయ్యాలో అలా ప్రచారం జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

MD గారితో మాటింగ్ అయిపోయాక, MD గారు మరొక్క గంటలో మీరు ఇద్దరూ మీ దగ్గర ఉన్న ఆ మూడు రకాల బిడ్ కి సంబంధించిన కాగితాల కాపీలతో మా ఇంటికి వచ్చెయ్యండి, అని చెప్పడంతో, బ్రహ్మం, సుందరంలు, ఆఫీసు నుంచి తిన్నగా ఇంటికి వచ్చేశారు. అలా ఇంటికి వస్తూనే బ్రహ్మం ఇంట్లో ఇంకా గౌరి ఉన్నందువల్ల బ్రహ్మం తన భార్య శారదను సుందరం ఇంటికి తీసుకువెళ్లి సుశీల సమక్షంలో బ్రహ్మం, సుందరం ఆఫీసులో జరిగిన విషయాన్ని క్లుప్తంగా వివరించి చెప్పి తమ సస్పెన్షన్ అన్నది పెద్ద దొంగలను పట్టుకోవడానికి MD గారు ఆడుతున్న ఒక నాటకము మాత్రమే కాబట్టి బయటి వాళ్ళదగ్గరనుంచి ఎటువంటి మాటలు మీరు వినవలసి వచ్చినా కంగారు పడవొద్దని శారదకు, సుశీలకు వివరించి చెప్పారు.

ఈ విషయాలన్నీ చెప్పాక, ఈ మొత్తం వివరాలను అత్యంత గోప్యంగా ఉంచామని వాళ్లిద్దరూ వారి వారి భార్యలకు చెప్పారు. ఇదంతా విన్న శారద, సుశీలలు చాలా చాలా కంగారు పడ్డారు. శారద అయితే, ఇదేంటండి కామదేవత వ్రతం చేస్తే మనకి ఐశ్వర్యం, సిరిసంపదలు వస్తాయని కదా చెప్పారు..? ఇప్పుదేమిటండీ అంటా ఇలా వ్యతిరేకంగా జరుగుతున్నది..? చివరకు మీ ఇద్దరికీ సస్పెన్షన్ లు మీ ఇద్దరికీ ఉన్న మంచి పేరుకు మచ్చ కూడా వచ్చిపడింది కదండీ అని బాధపడుతుంటే., బ్రహ్మం, సుందరం వాళ్ళ భార్యలైన శారద, సుశీలాలను ఓదారుస్తూ..,

మీరు అనవసరంగా భయపడుతున్నారు. అసలు ఆఫీసులో మా ఇద్దరి స్థాయి ఏంటి..? మేమిద్దరం అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో సెక్షన్ సూపర్వైజర్స్. మా పైన మా డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ మేనేజర్, వాడి పైన మేనేజర్, వాడి పైన అసిస్టెంట్ జనరల్ మేనేజర్, వాడి పైన జనరల్ మేనేజర్. మా అకౌంట్స్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ మా MD గారికి రిపోర్ట్ చేస్తారు. మా అకౌంట్స్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ ఎవరు..? మన రమణ. మన రమణ మా మా అకౌంట్స్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ అవ్వబట్టే మా ఇద్దరికీ మా డిపార్ట్మెంట్ లో తొందరగా ఎదగాలని మా ఇద్దరినీ ఈ సేల్స్ టీమ్ తో పాటు ఆ బిడ్ వెయ్యడానికి ఆ సేల్స్ టీమ్ కి సహాయకులుగా పంపించాడు.

- 9 -

సాధారణంగా అయితే ఇలాంటి పెద్ద పెద్ద కాంట్రాక్టులకు బిడ్ వెయ్యడానికి సహాయకులుగా మేనేజర్లు కానీ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కానీ వెళతారు. మన రమణ చేసిన ఈ ఒక్క సాయం వల్ల చూడండి ఒక్కసారిగా మేమిద్దరం MD గారికి ఎంత దగ్గరైపోయామో..? అన్నట్లు చెప్పడం మర్చిపోయాం, ఈ శుక్రవారం రోజు మేమిద్దరం, రమణ, MD గారు, ఆయన భార్య సాన్వి అందరం ఢిల్లీ వెళుతున్నాం ఈ కాంట్రాక్ట్ విషయం మీద మినిష్టర్లతో మాట్లాడటానికి ట్రైన్ లో 1st క్లాస్ లో.. ఆనందంగా చెప్పారు బ్రహ్మం, సుందరం.

మినిష్టర్లను తమ భర్తలు కలవబోతున్నారు అన్న మాట విని శారద, సుశీలలు మురిసిపోయారు. అదీ కాక స్వయానా MD గారితో కలిసి ట్రైన్ లో 1st క్లాస్ లో ప్రయాణం చెయ్యబోతున్నారు అన్న మాట ఆడవాళ్లు ఇద్దరినీ ఆనందంలో ముంచెత్తింది. ఇంతలో సుశీల, మీరంతా ఆఫీసు పనిమీద ఢిల్లీ వెళుతున్నారు కదా..? మధ్యలో MD గారి భార్య ఎందుకు..? అనుమానం వ్యక్తపరిచింది..!

ఏమో మాకేమి తెలుసు..? MD గారు, ఆయన భార్య ఉత్తర భారతదేశం వాళ్ళు కదా..? అటునించి అటు MD గారి భార్య తన పుట్టింటికి వెళుతుందేమో చెప్పాడు సుందరం. అదేం కాదు ఇందులో ఇంకేదో మర్మం దాగిఉంది శారద సాలోచనంగా అంది..

ఇంతలో బ్రహ్మం కల్పించుకుంటూ MD గారు మనకి MD ఇచ్చిన టైం ఒక్క గంట మాత్రమే..!! అని శారద ను సుశీలను తొందర పెడుతూ.. సుందరం వైపు చూస్తూ.. నేను ఇంటికి వెళ్లి 10 నిమిషాల్లో భోజనం చేసి నా దగ్గర ఉన్న ఆ బిడ్ కి సంబంధించిన కాగితాలతో సిద్ధంగా ఉంటాను. నువ్వు కూడా భోజనం చేసి సిద్దమై నీ దగ్గర ఉన్న బిడ్ కాగితాలతో మా ఇంటికి వచ్చెయ్ అని సుందరం తో చెబుతూ.. నువ్వేమీ బెంగపడకు సుశీల మన రెండు కుటుంబాలకు మంచి రోజులు వచ్చేశాయి. మా ఇద్దరికీ ప్రమోషన్ లు రావడం, మనకి డబ్బు రావడం ఇంకెంతో దూరంలో లేదు. ఒక్క డబ్బే కాదు సంఘంలో మనకు పరపతి గొప్ప పేరు కూడా వస్తాయి.. ఈ బిడ్ మన కంపెనీకి వస్తే మన కంపెనీ దశ తిరిగిపోతుంది. నా అంచనా నిజమైతే ఇప్పటికి ఈ కంపెనీలో 2000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ బిడ్ కనుక మన కంపెనీకి వస్తే ఎంతలేదన్నా తక్కువలో తక్కువగా చూసుకున్నా మరో 700 - 800 ఉద్యోగులు అదనంగా కంపెనీ చేర్చుకోవలసి వస్తుంది.

అంత మంది ఉద్యోగులు కంపెనీలో చేరితే మాలాంటి వాళ్ళం అందరం ఈ సంస్థలో పెద్ద పెద్ద పదవులకు ఎదుగుతాం.. ఆనందంగా చెప్పాడు బ్రహ్మం.. బ్రహ్మం అన్న మాటలను అందుకుంటూ శారద, సుశీలలు ఒకేసారి అదే కనుక జరిగితే పాపం మన మణి కుటుంబాన్నీ, మన సుదర్శనం గారి కుటుంబాన్నీ మాత్రం మీరిద్దరూ మర్చిపోవొద్దు.. వాళ్ళే కనుక లేకపోతే మీ ఇద్దరి కామదేవత వ్రతం పూర్తి అయ్యేది కాదు. గుర్తు చేశారు శారద, సుశీలలు..

- 10 -

అయ్యో.. అదేం మాట వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని మర్చిపోయే ప్రసక్తే లేదు.. మేమంటూ ఈ కంపెనీలో ఎదగడం మొదలుపెడితే మాతోపాటు ముందుగా చెయ్యి పట్టుకుని పైకి తీసుకు వెళ్ళేది వీళ్ళిద్దరినే.. ఆ విషయంలో మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోవొద్దు. అయినా.. కామదేవత వ్రత నియమాల ప్రకారం మనకి డబ్బులు అంటూ రావడం మొదలుపెడితే, మేము కన్నెరికం చేసిన ఆడపిల్లల కుటుంబాల బాధ్యతని చూసుకోవలసింది, ఆ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చెయ్యవలసింది కూడా మేమె కదా..? ఎట్టిపరిస్థితుల్లో ఆ కుటుంబాలను కానీ, మల్లిక, భవానీలను కానీ మర్చిపోయే ప్రసక్తే లేదు..!! ముక్త కంఠంతో చెప్పారు బ్రహ్మం, సుందరం..

బ్రహ్మం, సుందరం, భోజనాలు ముగించుకుని ఆ బిడ్ కి సంబంధించిక కాగితాలన్నీ పట్టుకుని MD గారి ఇంటికి చేరేప్పటికీ టైం మధ్యాహ్నం 2:00 అయ్యింది.

అక్కడ కాలేజ్లో ఉదయం మొదటి రెండు పీరియడ్ లు అయిన ఇంగ్లీషు, సైన్స్ ముగిసిన తరువాత ఇంట్రవెల్ ఇచ్చారు. కీచక సైన్స్ మాష్టారి మాటల వల్ల చేతల వల్ల మనసు గాయపడ్డ రమణి కోలుకోవడానికి ఆ 15 నిమిషాల ఇంట్రవెల్ ఉపయోగపడింది. ఇంట్రవెల్ తరువాత 2 గంటలు, 2 పీరియడ్స్ లెక్కలు. మరి ఆ లెక్కల పీరియడ్స్ 2 గంటలు ఎలా గడిచిందో వచ్చే భాగంలో చూద్దాము.
Next page: Chapter 133
Previous page: Chapter 131