Update 01
కత్తి
అందరికీ నమస్కారం
ఈ కధని కధలా కాకుండా ఒక సినిమా చూసినట్టుగా మీరు అనుభూతి చెందాలని ప్రయత్నం చేస్తున్నాను.
ఇదో కమర్షియల్ సినిమా కధ
కధలో పాత్రలు సన్నివేశాలు అన్ని నా కల్పన
దయచేసి ఎవరు మనసుకి తీసుకోకుండా బైట సినిమా చూసి ఎలా ఎంజాయి చేస్తారో అలానే ఎంజాయి చేస్తారని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు
పాఠకులే నిర్ణయించాలి
ఈ కధకి ఏ పేరు బాగా నప్పుతుందో
తెలియజేయండి
నచ్చినది పెడతాను
వీరా రెడ్డి + భారతి = పల్లవి, కీర్తి, చిరంజీవి, సిరి
ప్రతాపరెడ్డి + కావ్య = అక్షిత, శివారెడ్డి
అర్ధరాత్రి × ఎక్కడో సిటీకి దూరంగా
చుట్టూ ఎండిపోయిన గడ్డి
పచ్చని పిచ్చి చెట్లు
చచ్చిపోయి వాడిపోయిన పెద్ద చెట్లు
మధ్యలో మట్టి రోడ్డు
꧁ ( వీరా రెడ్డి ) ꧂
వర్షం పడే ముందు వచ్చే ఈదురు గాలులు. ఎటు చూసినా మనిషి జాడ లేదు, అంతా దుమ్ము. దూరం నుంచి ఓ వెలుగు చూస్తే బండి లాగుంది కానీ దెగ్గరికి వచ్చేసరికి తెలిసింది అది ఓ చిన్న ఏస్ బండి అని, దాని ముందు ఒక లైట్ పగిలిపోయి ఉంది.
꧁ ( ప్రతాపరెడ్డి ) ꧂
వర్షం మొదలయింది భీకారంగా. . .
సర్రుమని దూసుకెళ్ళింది టాటా ఏస్ బండి
ఆకాశంలో పెద్ద ఉరుము ఉరిమింది, ఆ వెలుతురు వల్ల ఏస్ బండి నడుపుతున్న అమ్మాయి మొహం కనిపించింది, తన తల నుంచి రక్తం కారుతుంటే తన కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. అప్పుడప్పుడు వెనక్కి చూస్తుంది. ఇరవై నాలుగేళ్లు మించవు ఆ అమ్మాయికి, ప్రాణ భయంతొ ఉంది కానీ ఆ భయం తన ప్రాణం మీద కాదు
꧁( వరదా రెడ్డి )꧂
( మంజులా రెడ్డి ) X•X•X ( శివా రెడ్డి )
టాటా ఏస్ బండి వెళ్లిన అరనిమిషానికి ఆ బండి కంటే రెట్టింపు వేగంతో వెనకాల ఏడు తెల్ల సుమోలు రయ్యి రయ్యి మని ముందుకు దూకుతూ వెళ్ళాయి, సుమో కిటికీల్లో నుంచి కత్తులు చేతబట్టుకుని అటు ఇటు తొంగి చూస్తూ వెతుకుతున్నారు మనుషులు.
దూరం నుంచి చూసిన ఏస్ బండిని చూసి "అదుగోరా బండి.. దూకించరా" అని అరిచాడెవడో.
꧁( పల్లవి ) ( కీర్తి ) ( సిరి )꧂
చంపాలన్న కసితో ఉన్న వరదా రెడ్డి మంజుల గొంతు పట్టుకుని గాల్లోకి ఎత్తి "ఎక్కడే వాడు" అని అరిచాడు. దానికి మంజుల సమాధానంగా కోపంగా చూస్తూ వరదారెడ్డి మొహం మీద ఉమ్మింది.
శాడిస్ట్ వరదా రెడ్డి మంజుల వంక చూసి నవ్వుతూ చెయ్యి చాపగానే కత్తి అందించారు, కుడి చేత్తో మెడ పట్టుకుని గాల్లోకి లేపి ఉంచుతూనే మంజుల కడుపులో ఎడమ చేత్తో నాలుగు సార్లు వెంటవెంటనే పొడిచి కింద పడేసాడు.
꧁( భారతి ) x ( మధు ) x ( లావణ్య )꧂
అప్పటివరకు వెతుకుతున్న ఎవ్వరికి అసలోడు కనిపించలేదు. చీకట్లో టార్చ్ లైట్లు వేసి మరీ వెతుకుతున్నారు, కొన ఊపిరితొ ఉన్న మంజుల ఇదంతా చూస్తూనే ఉంది. ఎక్కడ తన బావని చూస్తారేమోనని భయపడింది.
వరదా రెడ్డి : రేయి శివా, అంగుళం అంగుళం వెతకండి. ఈ రాత్రికి శత్రుశేషం మొత్తం ఈ వానలో కలిసిపోవాలా అని అరిచాడు ఆనందంతొ నవ్వుతూ
నీళ్లతో మొహం కడుక్కున్నాడు.
వెతుకుతున్న శివకి అనుమానం వచ్చి లోయ చివరన చూసాడు, చెట్టు కొమ్మ తన ఛాతిలో గుచ్చుకుని వేలాడుతున్నాడు
ఎక్కడో పిడుగు పడ్డ శబ్దం, తల ఎత్తి చూసాడు శివ
ఉరుము వల్ల పూర్తిగా కనిపించాడు.
ఇంతలో ఎవడో వస్తుంటే వాడికి కనిపించకుండా వాడి కళ్ళలో లైట్ కొట్టి, రేయి అక్కడ చప్పుడు అవుతుంది చూడు అని అరిచాడు. దానితో వచ్చేవాడు వెళ్ళిపోయాడు.
ఒంటి నిండా గాయాలున్నా ఇంకా ఊపిరి ఆడుతుంది, ఆ హైట్ ఆ బాడీ ఒక్కసారి చూడగానే అంత వర్షపు చలిలో శివ చేతుల మీద వెంట్రుకలు నిలుచున్నాయి.
ఎవ్వరు చూడక ముందే వెంటనే చేతిలో ఉన్న కత్తితొ కొమ్మని నరికాడు, చిరంజీవి లోయలో పడిపోయాడు, సౌండుకి అందరు శివ వైపు చూసేసరికి శివ లోయలోకి తొంగి చూస్తున్నట్టు నటిస్తూ ఎవ్వరు లేరు అని చేతిని ఊపాడు.
"అన్నా ఇది మనల్ని దారి మళ్ళించింది" అని ఒకడు కోపంగా చెపుతుంటే వరదారెడ్డి కాలు ఎత్తి మంజుల గొంతు మీద నొక్కి నలుపుతుంటే మంజుల ఆఖరి శ్వాస తీసుకుంటూ రెండు చేతులు దణ్ణం పెడుతున్నట్టుగా శివ వంక చూసి వరదారెడ్డి కాళ్లు పట్టుకుంది. మంజులా రెడ్డి ఊపిరి ఆగిపోయింది.
శివా రెడ్డి : వాడి గుండెలో నాలుగు బుల్లెట్లు, పన్నెండు కత్తి పోట్లు. బతికే అవకాశమే లేదు బావా అయినా బత్తికొచ్చాడంటే ఈ వరదారెడ్డి కత్తిని తట్టుకుని నిలబడాలి కదా అనగానే గర్వంతొ వరదారెడ్డి సల్లబడ్డాడు.
గట్టిగా నవ్వుతూ అంతేలే అని వెనుతిరగగానే అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వరదారెడ్డి తన ఇంట్లోకి వెళ్ళాడు వెనకాలే శివారెడ్డి మిగతా అందరూ ఇంటి గడప బైటే ఆగిపోయారు. లోపల ప్రతాపరెడ్డి కుర్చీలో కూర్చుని శత్రువు చచ్చాడన్న వార్త కోసం ఎదురు చూస్తుంటే కొడుకు ఆనందంగా నవ్వుతూ రావడంతొ పని అయిపోయిందని సంబరపడుతూ కొడుకు వరదారెడ్డిని మేనల్లడు శివారెడ్డిని గట్టిగా వాటేసుకుని ఇద్దరికీ ముద్దులు పెట్టాడు.
ప్రతాపరెడ్డి : రేయి శివారెడ్డి, పొయ్యి నీ కాబోయే పెళ్ళానికి వాడు చచ్చాడని చెప్పు.. పో అనగానే శివారెడ్డి వీరారెడ్డి కూతురి గదిలోకి వెళ్ళాడు.
లోపల దుఃఖం ఉక్కబట్టుకుని కూర్చుని ఉంది అక్షిత. అలికిడి అవ్వగానే తల ఎత్తి చూసింది. లేచి నిలబడి శివ కళ్ళలోకి చూసింది. శివా అక్షిత దెగ్గరికి వచ్చి "బతికే ఉన్నాడు" అని మాత్రమే అన్నాడు. అక్షిత ఆ మాటకి గుండె మీద చెయ్యి వేసుకుని అక్కడే కూలబడి కృతజ్ఞతగా శివ కాళ్లు గట్టిగా పట్టుకుంది. కంట్లో నుంచి నీరు కారి శివ పాదాల మీద పడేసరికి అక్షితని లేపి భుజం తట్టి బైటికి వచ్చాడు.
వరదారెడ్డి : నాయనా శత్రుశేషం ఈ రాత్రితొనే ముగిసిపోవాలి, వెళతాను నాన్న
ప్రతాపరెడ్డి : నీ ఆత్రం పగతోనా లేక ఆ పల్లవి రెడ్డి కోసమా అన్నది నాకు తెలుసులే అని నవ్వుతూ, పో.. పొయ్యి రాపో.. నీ తరవాత నేను కూడా ఒక్కసారి.. అని నవ్వాడు. వరదా రెడ్డి సంబరంగా భుజాలు ఎగరేసుకుంటూ వెళ్ళాడు.
ఇదంతా విన్న శివారెడ్డి వెంటనే లోపలికి వచ్చాడు. ఐదు అడుగుల పది అంగుళాలు ఉన్న అక్షిత అప్పటికే జీన్స్ వేసుకుని గన్ రీలోడ్ చేస్తూ ఉండటం చూసి దెగ్గరికి వెళ్ళాడు.
శివ : అక్షితా...!
అక్షిత : చిన్నా ఒంటి మీద చెయ్యి పడితే నా మీద పడ్డట్టే. అడ్డం వస్తే అమ్మా అబ్బా ఎవ్వడ్ని చూడను. చిన్నా అక్క మీద వాడి నీడ పడ్డా ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని మాట్లాడుతుండగానే ప్రతాపరెడ్డి లోపలికి వచ్చాడు
ప్రతాపరెడ్డి : ఏమే.. బలిసిందా.. వాడు చచ్చాడు. కాసేపట్లో వాడి కుటుంబం కూడా చస్తుంది. అంత నచ్చిందా వాడిది అని నవ్వాడు. సొంత అన్ననే చంపేస్తా అంటున్నావ్. ఇంత ధైర్యం యాడనుంచి వచ్చిందే
అక్షిత : నా చిన్నా ధైర్యం నీకు తెలుసుగా, అమ్మా అబ్బానే చూడను వాడెంత నా దారిలోకి ఎవడోచ్చినా చంపేస్తాను అని గన్ పైకి ఎత్తి ఒక రౌండు గాల్లోకి షూట్ చేసి తన నాన్నకి గురి పెట్టింది. ప్రతాపరెడ్డి నా మీదకే.. అని అంటుండగానే చెవి నుంచి పోయేలా ఇంకో బుల్లెట్ వదిలింది. గన్ తన తండ్రికి పెట్టి అలానే ఇంటి నుంచి బైటికి వచ్చి తన తండ్రి మనుషులని తప్పించుకుని ఇంటి నుంచి బైటికి వచ్చింది.
అప్పటివరకు ఆలోచిస్తున్న శివారెడ్డి ప్రేమించిన అక్షితా రెడ్డికే ఓటు వేసాడు. వెంటనే బైటికి పరిగెత్తి సుమో స్టార్ట్ చేసాడు.
ప్రతాపరెడ్డి : శివారెడ్డి అని గట్టిగా అరిచాడు
శివ : సారీ మావయ్యా అని హారన్ కొట్టగానే అక్షిత ఎక్కి కూర్చుంది, సుమో బైలుదేరింది.
ప్రతాపరెడ్డి : ఆ ఇద్దరినీ చంపెయ్యండి అని అరిచాడు
చెయ్యి అడ్డంగా నరికాడు
అయ్యా అమ్మగారు అన్నాడు ఒకడు
ప్రతాపరెడ్డి : మీ అమ్మ కాదు కద రా
ఒకటే పోటు, ఏసేయ్ అని చెయ్యి అడ్డంగా నరికాడు
అలాగేనయ్యా అని సుమోలు ఎక్కారు
అక్షిత కోసం ఇంకో రెండు సుమోలు వెళ్లాయి వెంబడిస్తూ