Update 02

అర్ధరాత్రి దాటి మూడు కావొస్తుంది.

తండ్రి ప్రతాపరెడ్డి నుంచి తప్పించుకున్న అక్షిత, తన బావతొ కలిసి నేరుగా చిన్నా ఇంటికి వెళ్ళింది. అప్పటికే చిన్నా ఇంటి ముందు అక్షిత అన్నయ్య వరదా రెడ్డి బళ్ళు ఆగి ఉన్నాయి. అక్షిత సుమో దిగి వెంటనే గన్ చేతిలోకి తీసుకుని లోపలికి వెళ్ళింది, అప్పటికే వరదారెడ్డి చిన్నా అక్క పల్లవి రెడ్డి జుట్టు పట్టుకుని బైటికి ఈడ్చుకోస్తుంటే చిన్నా అమ్మ బతిమిలాడుకుంటుంది. మిగతా ఇంట్లో వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. పల్లవి రెడ్డి కంట్లో నీరు కనిపించగానే అక్షిత తన కంటికి అడ్డంగా ఉన్న వాడికి గన్ గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కింది. ఠప్ అన్న సౌండ్ రావడం వరదారెడ్డి మనిషి కిందపడిపోవడం ఒకేసారి జరిగాయి. అందరూ వెనక్కి తిరిగి అక్షిత వంక చూసారు.

అక్షిత : రేయి అన్నయ్యా.. నా చిన్నా నీకు ప్రాణభిక్ష పెట్టాడు, అదీ నన్ను చూసి, ఈ రోజు నువ్వు బతికున్నావంటే అది నా వల్ల. పల్లవిని ఈ ఇంటిని వదిలేసి వెళ్లకపోతే నీ ప్రాణాలు నేనే తీసేస్తాను అని గన్ తన అన్నకి గురి పెట్టింది. అప్పటికే ఒకడిని కాల్చిన అక్షిత మొహం టెన్షన్ తొ ఎర్రబడిపోయి నుదురు మీద నరం గుండె చప్పుడుతొ పాటు కొట్టుకున్నట్టు అనిపించింది.

కానీ ఇదంతా వరదారెడ్డి పట్టించుకోలేదు అక్షితని లెక్క చెయ్యకుండా పల్లవి జుట్టు పట్టుకుని ఇంకా గట్టిగా లాగాడు, ఓపిక నశించిన అక్షిత తన గన్ నుంచి రెండు బుల్లెట్లు వదిలింది, ఒక బుల్లెట్ వరదారెడ్డి భుజానికి ఇంకో బుల్లెట్ తొడలోకి రివ్వున దూసుకుపోయాయి, ఊహించని అందరూ స్థాణువుల్లా నిలబడిపోయారు. చిన్నా అమ్మ భారతికి ఏం అర్ధంకాక చూస్తూ ఉండిపోయింది. ఇద్దరు మనుషులు వరదారెడ్డిని పడిపోకుండా పట్టుకొగా అక్షిత మిగతా మనుషుల మీదకి గన్ పెట్టింది. "సొంత అన్ననే వదల్లేదు, ఎవడైనా పిచ్చి వేషాలేస్తే కాల్చి దెంగుతాను. పొండ్రా" అని అరిచింది. వాళ్ళకి ఏం చెయ్యాలో తెలియక వెంటనే వరదారెడ్డిని తీసుకుని అందరూ బైటికి వెళ్ళిపోతుండగా అక్షితని వెతుక్కుంటూ వచ్చిన తన తండ్రి మనుషులు ఎదురు పడ్డారు, ఏం మాట్లాడుకున్నారో ఏమో కానీ వరదారెడ్డిని తీసుకుని తన మనుషులు తన తండ్రి మనుషులు అందరూ వెళ్లిపోయారు.

చిన్నా అమ్మ భారతి వెంటనే పల్లవిని తన ఒళ్ళోకి తీసుకుంది, చిన్నా రెండో అక్క చిన్నా చెల్లెలు అందరూ ఏడుస్తూ భయంతొ భారతి ఒళ్ళోకి చేరిపోయారు. కాసేపటికి ఎవరో కొంతమంది మంజులారెడ్డి శవాన్ని ఇంటికి చేర్చారు. భారతి మంజుల మీద పడిపోయి ఏడుస్తుంటే చిన్నా అక్కలు చెల్లెలు కూడా ఏడుపు లంకించుకున్నారు. ఆ ఏడుపులో భయం, ఒంటరితనం, నిస్సహాయత అన్ని కనిపించాయి అక్షితకి. ఒక్కటే బైటికి వెళ్ళి ప్రతాపరెడ్డి మనుషులతో మాట్లాడింది, ముందు వాళ్ళు నమ్మకపోయినా మంజులా రెడ్డి కార్యక్రమం కావడంతొ ఎవరూ అడ్డు చెప్పలేకపోయారు. తెల్లారక ముందే కార్యక్రమం పూర్తి చేయించేసింది.

భారతి ఇంకా ఆలోచిస్తూనే ఉంది, పగోడి కూతురు అయిన ఈ అక్షిత ఎందుకు తమని కాపాడింది, ఇంకా ఇక్కడే ఎందుకు ఉంది. అస్సలు చిన్నాకి అక్షితకి ఏంటి సంబంధం. ఎంత ఆలోచించినా అస్సలు ఏమి అర్ధం కాలేదు. పిల్లలు తన ఒళ్ళో పడుకుని ఉన్నారు, అక్షిత వెళ్లి పక్కన నిలుచుంది. భారతి అక్షితని చూసి లేవబోతే అక్షితే కింద కూర్చుని భారతి భుజం మీద చెయ్యేసింది.

అక్షిత : చిన్నా బతికే ఉన్నాడు, మనకోసం వస్తాడు. నేనున్నాను. మీ మీద ఈగ కూడా వాలనివ్వను.

భారతి : నీకు నా కొడుక్కి ఏంటి సంబంధం. మా కోసం నీ కన్నవాళ్ళని ఎందుకు ఎదిరించావ్. నా కొడుకు గురించి నాకు అన్ని తెలుసు, నీ పేరు కూడా ఎప్పుడూ వాడి నోటి నుంచి వినలేదు. సొంత మనుషులే మోసం చేసినవాళ్ళు ఓ పక్క, నా కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసిన నీ కుటుంబం ఓ పక్క. ఆ కుటుంబంలో పుట్టిన నువ్వేమో మా కోసం వచ్చావ్, మమ్మల్ని కాపాడవ్. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని తల పట్టుకుంది భారతి. అక్షిత భారతి తల మీద చెయ్యేసి దెగ్గరికి తీసుకుంది.

అక్షిత భారతి వంక ఒక చూపు విసిరి నీ కొడుకు గురించి నీకు అన్నీ తెలుసు, ఒక్క నా విషయం తప్ప. అన్నీ చెపుతాను. ముందు వాళ్ళని లేపి అన్నం పెట్టు. నాకు కొంచెం పనుంది అని లేచి బైటికి వెళ్ళిపోయింది.

బైటికి వెళ్లిపోయిన అక్షిత తిరిగి మధ్యాహ్నం పదిహేను మంది మనుషులతో వచ్చింది, అక్షిత లోపలికి రాగా వాళ్ళు బైట కాపలా ఉండిపోయారు. ఇదంతా చూసిన భారతి అక్షితతొ మాట్లాడదామని లేచింది.

అక్షిత : అందరూ తిన్నారా

అక్షిత గొంతు వినబడగానే చిన్నా ఇద్దరు అక్కలు పల్లవి, కీర్తి బైటికి వచ్చారు. చిన్నా చెల్లెలు సిరి కనిపించలేదు. అక్షిత నేరుగా భారతి దెగ్గరికి వెళ్లి ముందు నువ్వు తిన్నావా అని అడిగింది, భారతి మెలకుండా ఉండటంతొ తన మొహం చూసి లోపలికి వెళ్లి అన్నం పెట్టుకొచ్చింది. ప్లేట్ చేతికి ఇవ్వబోతుంటే భారతి ఇంత మంది చావుల మధ్యలో నన్ను అన్నం తినమంటావా అని ఏడ్చేసింది. పొద్దున్న లేచిన దెగ్గర నుంచి అమ్మా సాయం, అయ్యా సాయం అని పనివాడి దెగ్గరనుంచి పొలిటిషియన్స్ వరకు అందరూ ఈ గుమ్మం తొక్కేవారే, అలాంటిది ఇంత జరిగితే ఏం జరిగిందని ఒక్క పూళీసోడు రాలేదు, చుట్టాల నుంచి పక్కాల వరకు అందరూ నా సాయం పొందినోళ్లే అలాంటిది ఒక్క పలకరింపు లేదు.. అని మాట్లాడుతూనే ఉంది, తన కన్నీళ్లు అస్సలు ఆగడం లేదు.

అక్షిత మౌనంగా వింటూనే పక్క రూము గడప నుంచి చూస్తున్న పల్లవిని చూసి రమ్మని పిలిచింది, చేతికి ప్లేట్ ఇవ్వగానే పల్లవి మెల్లగా తన అమ్మ పక్కన కూర్చుని ముద్ద కలిపి చెయ్యి చాపితే నోరు తెరవలేదు. పల్లవి బతిమిలాడుతున్నట్టుగా మొహం పెట్టగానే ఏడుస్తూనే నోరు తెరిచింది. అక్షిత లేచి బైటికి వెళ్ళింది. భారతి అన్నం తిన్నాక బైటికి వెళ్లి చూస్తే అక్షిత ఎవరితోనో మాట్లాడుతుంది. భారతిని చూసి లోపలికి వచ్చింది అక్షిత.

భారతి : వాళ్లంతా ?

అక్షిత : మీ మనుషులే, ఎవ్వరూ నన్ను నమ్మట్లేదు. అంతా నా ఖర్మ అని తల కొట్టుకుని చిన్నా రూములోకి వెళ్లి మంచం మీద కూర్చుంది. అరమరలో చిన్నా బట్టలు చూస్తుంటే ఎరుపు రంగు చొక్కా చూసి ఏవో జ్ఞాపకాలు గుర్తుకువచ్చినట్టున్నాయి, చొక్కా తీసింది. వాసన చూస్తూ కళ్ళు మూసుకుంది.

అక్షిత : ఒరేయి ఎవరైనా చూస్తే కొంపలు అంటుకుపోతాయి, ఎందుకు వచ్చావ్. దండం పెడతా పోరా బాబు.

చిన్నా : నువ్వు కొనిచ్చిన షర్టు వేసుకొచ్చా

అక్షిత : ఎవరో ఎందుకు, నువ్వే చంపెయ్యిరా నన్ను

చిన్నా : ఎహె అన్నిటికి బయపడతావ్, మె హునా. దేఖ్లేంగే

అక్షిత : వొంగుంటా దెంగిపోరా బాబు

చిన్నా : ఇప్పుడేమైందే

అక్షిత : ఇది కాలేజీరా, ఎవరైనా చూస్తే.. మా బావ గాడి కంట్లో పడ్డామో

చిన్నా : ఎహె.. ఊరికే బావ బావ.. నన్ను కూడ అన్ని సార్లు తలుచుకోవు కదే

అక్షిత : షర్ట్ బాగుంది. హీరోలా ఉన్నావ్. ఇంక దెంగేయిరా దణ్ణం పెడతా అని ఏడుపు మొహం పెడుతూ మోకాళ్ళ మీద కూర్చుని బతిమిలాడుతూ కళ్ళు మూసుకుంది.

చిన్నా : సర్లే వెళుతున్నా అని వంగి అక్షిత పెదవులపై ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు.

భారతి బైట వాళ్ళతో మాట్లాడి వచ్చేసరికి చిన్నా రూములో అక్షిత నిలుచుని ఉండటం చూసి దెగ్గరికి వెళ్ళింది, చిన్న చొక్కా పట్టుకుని అక్షిత కళ్ళుమూసుకున్నా తన కంటి చివర సన్నగా తడి కనిపించేసరికి అక్షిత భుజం మీద చెయ్యి వేసింది. వెంటనే ఉలిక్కిపడింది అక్షిత. ఇద్దరు మంచం మీద కూర్చుని మాట్లాడుకుంటుంటే పల్లవి మరియు కీర్తి వచ్చి కూర్చున్నారు. సిరి మాత్రం ఎప్పటిలానే ఒంటరిగా కూర్చుంది.
x x x
దిగువలోయ ప్రాంతం
అడవిలో చిన్ని గ్రామం​

చెట్లక్కి తేనె తీసి అమ్ముకుంటారు, ఇదే ఇక్కడివాళ్ళ ప్రధాన వృత్తి.

డాక్టరమ్మ గారిని కలవాలండీ అంటూ తెల్లారక ముందే కొత్తగా బదిలీ అయి వచ్చిన డాక్టర్ ఇంటి ముందున్న కాపలావాడిని వేడుకుంటుంది రాజమ్మ. పొద్దున్నే గోల వినపడిన డాక్టర్ షర్మిల లేచి లోపల నుంచి బైటికి వచ్చి విషయం కనుక్కుంది, రాజమ్మ మాటలు విన్న షర్మిలకి ఎమర్జెన్సీ కేసు అని అర్ధమయ్యి తన దెగ్గర ఉన్న సామానుతొ బైలుదేరి అడవిలో ఉన్న ఊళ్ళోకి వెళ్ళింది. గుడిసెలోకి వెళ్లి చూసి ఛిద్రమైన శరీరం, ఆ మొహం చూసి ఆశ్చర్యపోయి చిరంజీవి అనుకుంది మనసులో, వెంటనే చిరంజీవి కాళ్లు రుద్ధుతున్న రాజమ్మ మొగుడిని బైటికి పంపించి బాడీ మొత్తం పరీక్షగా చూసింది.

ఇన్ని గాయాలు అయ్యాక కూడా ఇంకా ఊపిరి తీసుకుంటున్నాడు. అస్సలు ఎలా బతికి ఉన్నాడో ఏం అర్ధంకాక డాక్టర్స్ భాషలో మిరకల్ ఆనుకుని తన వైద్యం మొదలు పెడుతూనే పట్నంలో ఉండే తన స్నేహితులైన సర్జన్స్ కి ఫోన్ చేసింది. తీక్షణంగా చిరంజీవి వంక చూసింది తన కంటి చివర చిన్న తడి మరక. ఎందుకో సరిగా అనిపించలేదు, రహస్యంగానే చికిత్స జరిపించాలని నిర్ణయించుకుంది. అన్నిటికి లెక్కలు వేసుకుంటూ ఫోన్లో తన బ్యాంకు బాలన్స్ చూసుకుంది.

చిరంజీవి మాత్రం అలానే పడుకుని ఉన్నాడు.​
Next page: Update 03
Previous page: Update 01