Update 05
ఊరంతా వచ్చి చిన్నాని విడతల వారీగా చూసి వెళ్లారు. భారతి అయితే కొడుక్కి దెగ్గరుండి అన్నం తినిపించుకుంది, ఆఖరికి స్నానం చేస్తున్నప్పుడు కూడా కొడుకుని వదల్లేదు భారతి, తలుపు దెగ్గరే టవల్ పట్టుకుని నిలుచుంది. అటు పల్లవికి ఇటు కీర్తికి తన నాన్న వీరారెడ్డికి అస్సలు చిన్నాతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం రాలేదు. చివరికి కొడుకు దెగ్గరే పడుకుంది కూడా.. చిన్నా చెల్లెలు సిరి ఇంతవరకు అస్సలు అన్నకి ఎదురుపడలేదు, చిన్నా హడావిడిలో ఉన్నా విషయం కనుక్కోవాలని అనుకున్నాడు.
x x x
తెల్లారింది.
జోగి రెడ్డి ఇల్లు
తెల్లారింది.
జోగి రెడ్డి ఇల్లు
మొగుడికి టీ ఇస్తూ సోఫాలో కూర్చుని మాటలు కలిపింది సుకన్య.
సుకన్య : నిన్న ఎవరో అబ్బాయి వచ్చాడండి, మీ స్నేహితుడి కొడుకట. మీరు లేరనేసరికి మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు.
జోగిరెడ్డి : అవునా.. ఎవరబ్బా.. ఏమోలే.. అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఊళ్ళోకి అల్లుడు దిగాడంట.
సుకన్య : ఎవరు
జోగిరెడ్డి : మా బావ వీరారెడ్డి కొడుకు. (ఈ మాట వినగానే కిచెన్లో అంట్లు కడుగుతున్న లావణ్యకి నిన్న రాత్రి వచ్చింది చిన్నానే అని అర్ధమయ్యి సంతోషపడింది, రాత్రి చూసిన మొహం గుర్తుతెచ్చుకుని ఎంత బాగున్నాడో అనుకుంది. చిన్నా గురించి ఇంకేమైనా తెలుస్తుందేమోనని దెగ్గరికి వెళ్లి గడప దెగ్గరే చాటుగా నిలుచుంది)
సుకన్య : ఇంకా వరసలు కలుపుతున్నావే..
జోగిరెడ్డి : చుట్టరికం యాడికి పోద్ది.. ఇందాక వస్తుంటే ప్రతాపరెడ్డి కూతురు లావణ్యని పంపించమంది.
సుకన్య : హ్మ్మ్.. దీనికి పండగ ఇక
జోగిరెడ్డి : ఎందుకు
సుకన్య : ప్రతీ రెండు మూడు నెలలకి ఒకసారి లావణ్యని పిలిపించుకుని సేవలు చేయించుకుని పంపించేటప్పుడు తను వాడేసిన బట్టలు ఏమైనా ఉంటే దీనికి ఇచ్చేస్తుంది.
జోగిరెడ్డి : ఏమోలే దాన్ని రమ్మను దించేసి వెళతాను అనగానే లావణ్యని కేకేసింది సుకన్య. జోగిరెడ్డి లావణ్యని ప్రతాపరెడ్డి ఇంట్లో దించి వెళ్ళాడు.
దాదాపు పదేళ్ళు దాటింది జోగిరెడ్డి కూతురితో ఒక్క మాటైనా మాట్లాడి. వీరారెడ్డిని చంపాలని వేసిన ప్లాన్ ని చిన్నాకి చేరేసిందని కోపం. అందుకే ఎలా ఉంది అని గానీ రెండో భార్య పెట్టే హింసలు కానీ అస్సలు పట్టించుకోడు. లావణ్యని అస్సలు నమ్మడు. లావణ్య కూడా చిన్నా కుటుంబాన్ని చంపాలనుకున్న వీళ్లందరి మొహం చూడటం కూడా ఇష్టంలేదు, కానీ తప్పట్లేదు. తన నిస్సహాయత ఏమి చెయ్యనివ్వలేదు. ఇక ఆ సుకన్య ఇంటి నుంచి బైటికి వస్తేనే లావణ్యకి హాయిగా ఉంటుంది, కొంచెం ఊపిరి పీల్చుకుని ప్రతాపరెడ్డి ఇంట్లోకి వెళ్లి కావ్యని కలిసింది.
కావ్య : ఏంటి లావణ్యా
లావణ్య : అదీ.. అక్షిత గారు పిలిచారమ్మా
కావ్య : ఆ రూములో ఉంది వెళ్ళు
లావణ్య సరేనని తల ఊపుతూ లోపలికి వెళ్ళింది.
లావణ్యని చూసిన అక్షిత వెంటనే పలకరించకుండా చిన్నగా లేచి డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్న నేల్ పాలిష్ సెట్ బైటికి తీసింది. లావణ్యకి అక్షిత అంటే కొద్దిగా భయం, దానికి తోడు వీళ్లంతా కలిసి చిన్నా కుటుంబాన్ని చంపబోయారు. కొంత అసహ్యం కూడా ఉంది. ఈ ఇంట్లో ఒక్క ఈ అక్షిత సంగతి మాత్రమే తనకి అర్ధం కాలేదు. అక్షిత అప్పుడప్పుడు వింతగా ప్రవర్తిస్తుంది, అది అస్సలు అర్ధం కాదు.
పదేళ్ళు అవుతుంది ఆ కంచె దాటి ఇటోచ్చి.. గత పదేళ్ళుగా అక్షిత లావణ్యని కనీసంలో కనీసం ఏడాదికి మూడు నుంచి నాలుగు సార్లు ఇంటికి పిలిపించుకునేది. చిన్నప్పుడు కూల్లో ముఖపరిచయం తప్పితే పెద్దగా ఎప్పుడూ మాట్లాడింది కూడా లేదు. ఎప్పుడు పిలిచినా ముందు పని చేయించుకుని ఆ తరువాత భోజనం పెట్టేది, లావణ్యని అక్షిత పిలిచిన రోజల్లా ఆ రోజు లావణ్య నోటికి మటన్ ముక్క తగిలేది. దానితో లావణ్య కడుపునిండా తినేది. వెళ్లేప్పుడు నా బట్టలు కొన్ని లూస్ అయ్యాయి, కోనేప్పుడు చూసుకోలేదాంటూ నాలుగు ఐదు జతల చుడిదార్లు ఇచ్చి పంపేది, కానీ అక్షిత జీన్స్ తప్ప చుడిదార్ వేసుకోవడం లావణ్య ఎప్పుడూ చూడలేదు.. అక్షిత తనకిచ్చే బట్టల్లో పుస్తకాలు కూడా పెట్టి పంపేది.
ఇంటర్లో ఉన్నప్పుడు కూడా లావణ్య bi.p.c తీసుకున్న పది రోజులకి అక్షిత అదే గ్రూప్ తీసుకుంది. ఒక్కో సారి స్టడీ మెటీరియల్ బట్టల్లో పెట్టి ఇచ్చేసి ఆ తరువాత మళ్ళీ పిలిచి నా పుస్తకం కొట్టేసావని అవమానించి కోపంగా మిగతా పుస్తకాలు కూడా లావణ్య మోహన కొట్టి పంపించేసేది. నీట్ రాసి ఆల్ ఇండియా మూడో ర్యాంకులో నిలిచిన లావణ్య ఊళ్ళో హైలైట్ గా నిలిచింది. కానీ ఒక్క ప్రెస్ వాడు, కాలేజీ తరపున నుంచి ఒక్క బ్యానర్ కూడా కట్టలేదు ఎవ్వరు. తన కూతురు కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ప్రతాపరెడ్డికి నచ్చలేదు, అదే విషయం జోగిరెడ్డికి చెప్పాడు. వీటన్నిటికి తోడు లావణ్య ఎదుగుదల తన పిన్ని సుకన్యకి అస్సలు నచ్చలేదు, ఒకటికి రెండు ఎక్కువేసి చెప్పి లావణ్య చదువుని మానిపించేసింది. అప్పటినుంచి లావణ్య ఇంటి పనికి, వంట పనికి పరిమితం అయిపోయింది. ఆలోచిస్తుండగా లావణ్య చేతిలో పెట్టింది నేల్ పాలిష్ సెట్టు.
లావణ్య : ఏ రంగు వెయ్యమంటారండీ
అక్షిత : (నా బొంద నాకే రంగు కనపడుద్దనీ) ఎప్పటిలాగే.. నాకు ఏది బాగా నప్పుతుందో, నీకు నచ్చింది అదే వెయ్యి
లావణ్య : అలాగేనండి
బైటున్న కావ్యకి ఎక్కడో అనుమానం, అక్షిత ఎందుకు అప్పుడప్పుడు లావణ్యని పిలిపించుకుంటుందా అని.. కాసేపాగి చిన్నగా లోపలికి వెళ్లి చూస్తే లావణ్య అక్షిత కాళ్ళకి నేల్ పాలిష్ పెడుతూ కనిపించింది. ఇద్దరు పెద్దగా ఏం మాట్లాడుకోవట్లేదు. అక్షిత మొహం కూడా మాములుగానే ఉండటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
తన అమ్మ వెళ్ళిపోవటం అద్దంలో చూసిన అక్షిత చిన్నగా లావణ్యతో మాటలు కలిపింది.
అక్షిత : మొహం వెలిగిపోతుంది, ఏంటి విశేషం
లావణ్య : ఏంటండీ
అక్షిత : సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తేనూ
లావణ్య : అలా ఏం లేదండి మాములుగానే ఉన్నాను
అక్షిత : తిన్నావా, ఉండు భోజనం చేసి వెళుదువు
లావణ్య : వద్దండి..
అక్షిత : ఏం పర్లేదు, మీ పిన్నికి నేను చెపుతాలే.. నువ్వు భయపడకు. అయినా ఇంకెన్ని రోజులులే అంది చిన్నగా
లావణ్య కూడా అవును అనుకుంది మనసులో, అలా ఆలోచనలో పడగానే అక్షిత తన ఎడమ కాలు తీసి కుడి కాలు పెట్టింది. లావణ్య వెంటనే తేరుకుని మళ్ళీ నేల్ పాలిష్ పెడుతుంటే అక్షిత లావణ్య వంక చూస్తుంది. నాలుగు నెల్ల తరవాత మళ్ళీ ఇప్పుడే లావణ్యని చూడటం.
అక్షిత : రికార్డ్స్ ఉన్నాయి రాసి పెట్టు
లావణ్య : అలాగే నండీ
అక్షిత : అంతక ముందు నేను ఇచ్చిన నోట్స్ చదివావా సమోసాలకి పొట్లాల కింద వాడావా
లావణ్య : ఎప్పుడైనా పనికొస్తుందేమోనని ఉంచానండి.
అక్షిత : నాకెప్పుడైనా డౌట్స్ వస్తే అడుగుతాను, అన్ని చదివి ఉంచుకో
లావణ్య : కానీ..
అక్షిత : ఏంటి టాప్పర్ అని పొగరా.. లేకపోతే నీకు ఎక్కువ మార్కులు వచ్చాయని మా నాయన నిన్ను చదువు మాన్పించాడని కోపమా
లావణ్య : లేదండి
అక్షిత : బలుపు తగ్గించుకుంటే, నేను చెప్పేవి నీ మెదడుకి ఎక్కుతాయి.
లావణ్య : సారీ అండి
అక్షిత : భయపడ్డావా.. ఊరికే జోక్ చేసాను. కొంచెం నువ్వు అర్ధం చేసుకుని సాయం చెయ్యవే.. ఎగ్జామ్స్ దెగ్గరికి వస్తున్నాయి. అస్సలే బ్యాక్లాగ్స్ తో చస్తున్నా అనేసరికి లావణ్య చిన్నగా నవ్వింది. అక్షిత లేచి బట్టలున్నాయి తీసుకెళ్ళు అని కొన్ని జతలు తీసి సర్దిపెట్టింది.
లావణ్యకి మటన్ అంటే చాలా ఇష్టం. అక్షితా లావణ్యా ఇద్దరు కలిసి తిన్నాక థాంక్స్ చెప్పింది.
అక్షిత : ఏంటి భోజనానికా
లావణ్య : నా మొహమాటం పట్టించుకోకుండా.. కూర ఎక్కువ వడ్డించినందుకు
అక్షిత నవ్వి బట్టలు ఇచ్చి పంపించింది. లావణ్య ఇంటికి వెళుతుంటే ప్రతాపరెడ్డి ఎదురు వచ్చాడు, లావణ్య తల దించుకుని వెళ్లిపోతుంటే తన వంక వెటకారంగా ఒక నవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు. ఇదంతా కోపంగా పైనుంచి చూస్తూనే ఉంది అక్షిత. వెనక భుజం మీద చెయ్యి పడేసరికి తల తిప్పి చూస్తే తన అమ్మ కావ్య.
కావ్య : ఏం చూస్తున్నావ్
అక్షిత : నాకేం కనిపిస్తది నా బొంద
కావ్య : అందరూ బట్టలకి సిటీకి వెళుతున్నారు, నీకేం తీసుకురమ్మంటావ్
అక్షిత : ఏదైతే ఏంటి.. నాకంతా బ్లాక్ అండ్ వైటే కదా
కావ్య : విజన్ ఎక్సర్సైస్ చెయ్యిపో
అక్షిత : ఇప్పుడు మూడ్ లేదు.. పడుకోవాలి అని లోపలికి వెళ్ళిపోయింది.
కావ్య : ఏంటి మాటకి మాట బాగా మాట్లాడుతున్నావ్, మళ్ళీ ధైర్యం పెరిగింది. ఏంటి సంగతి
అక్షిత ఏం మాట్లాడకుండా మొహం అటు తిప్పేసి నవ్వు మొహం చూపించకుండా వెళ్ళిపోయింది.
x x x
చిన్నా ఇంట్లో
చిన్నా ఇంట్లో
చిన్నా : అమ్మా.. కొన్ని రోజులు బైటికి వెళ్ళొస్తా
భారతి : ఎక్కడికీ
చిన్నా : అక్కడ తెలిసిన వాళ్ళు కొంతమంది ఇక్కడే సెటిల్ అయ్యారు, ఒకసారి కలిసి వస్తా
భారతి : అబద్ధం.
చిన్నా : ఏంటి అబద్ధం
భారతి : నా దెగ్గర అబద్ధాలు చెప్పడం నీ వల్ల కాదు.. ఇప్పుడు నిజం చెప్పు
చిన్నా : నిజమే.. ఒక నాలుగు రోజులు అంతే
భారతి : ఒక్క రోజు పర్మిషన్ ఇస్తా అంతే
పల్లవి : ఎక్కడికి చిన్నా
చిన్నా : సరే రెండు రోజులు ఇవ్వాళ రాత్రి బైలుదేరుతాను రేపు రాత్రి బైలుదేరి ఎల్లుండి పొద్దున్నే వస్తాను, హెల్ప్ చెయ్యవే అని పల్లవి వంక చూసాడు. పల్లవి కూడ చెప్పేసరికి ఒప్పుకుంది. రాత్రి బైలుదేరుతుంటే అప్పటికీ భారతికి డౌట్ వచ్చి బట్టలు తీసుకెళ్ళవా అని అడిగింది కానీ మాట మార్చి ఏమార్చాడు.
భారతి : మొన్న కూడా ఫణి గాడిని ఏమార్చి ఏటో వెళ్ళావ్. మీ నాన్న ఎంత అడిగినా చెప్పలేదు. ఆయనంటేనే మాకు గుండెల్లో దడ కానీ నువ్వసలు ఆయన్ని లెక్కచేయలేదని ఒకటే గొడవ మీ నాన్న మొన్న, నన్ను బాధపెట్టే, భయపెట్టే పనులు చెయ్యకు చిన్నయ్యా అని బతిమిలాడింది.
చిన్నా : హా సరే.. అని లేచి నాన్నని చూసాడు. ఆయన మోహంలో ఏమి కనిపించలేదు. టాటా అని చెయ్యి ఊపి బైటికి వచ్చి చీకట్లో కలిసిపోయాడు, ఊరి బైటికి వస్తూ వెంటనే ఆగి ఫోన్ తీసి ఫణికి కాల్ చేశాడు.
ఫణి : బావా
చిన్నా : ఫాలో చేస్తున్నావా
ఫణి : లేదు బావా
చిన్నా : అంటే చేస్తున్నావ్.. ఎక్కడున్నావ్
ఫణి : నాకేం తెలీదు, అత్త చెప్పింది
చిన్నా : ఒక్కడివే చీకట్లో మంచిది కాదు, ఇంటికి వెళ్ళిపో
ఫణి : అలాగే బావ, బండి మీదె ఉన్నా
చిన్నా : ఐదు నిమిషాల్లో నీ ఫోన్లో మంజులతో మాట్లాడించు
ఫణి : బావా..?
చిన్నా : వెళ్ళు అన్నాడు కోపంగా
ఫోన్ పెట్టేసి కారు అక్కడే వదిలేసి, ఒక్కడే చెట్ల చాటున నడుచుకుంటూ కంచె దాటి అక్షిత ఊర్లోకి వెళుతుండగా ఎవరో పిలిచారు. చూస్తే నాన్న
వీరారెడ్డి : లావణ్య దెగ్గరికా ?
అవునని తల ఊపాడు
వీరారెడ్డి : పెళ్లి చేసుకుంటావా
చిన్నా ఏమి చెప్పలేదు
వీరారెడ్డి : వెళుతున్నావా
చిన్నా అవునని తల ఊపాడు
వీరారెడ్డి : ఈపాటికి నువ్వెలా ఉంటావో వాళ్ళకి తెలిసే ఉంటుంది. జాగ్రత్తగా ఉంటావా, ఏదైనా తేడా జరిగితే నేను, నా మనుషులు, మన ఊరి వాళ్ళు ఎవ్వరూ నీ పక్కన ఉండరు అని వీరారెడ్డి మాట్లాడుతుండగానే చిన్నా మధ్యలో కలిపించుకుని ఊరు తగలపెట్టేస్తాను నాన్నా అన్నాడు. నాకు తెలుసు (వీరారెడ్డి మనసులోనే అనుకున్నాడు) బైటికి మాత్రం జాగ్రత్త అని వెనక్కి వెళ్ళిపోయాడు.
ఇదంతా అక్కడే ఉండి విన్న మారడుకి ఉచ్చ పడిపోయింది, వెంటనే ఇదంతా ప్రతాపరెడ్డికి చెప్పాలని అనుకున్నాడు. ఎలా అయినా తన మీద పడ్డ మచ్చ తొలిగించుకోవాలని అనుకున్నాడు, కానీ ఈలోపే చిన్నా చెయ్యి మారడు మీద పడింది.
చిన్నా : ఏంది బాబాయి.. ఏటో పోతున్నావ్
మారడు : నన్నేమైనా చేస్తే ఊరంతా నీ మీద పడుద్ది, వెంటపడి నరుకుతారు అని పైకి బెదిరుస్తున్నా, మారడు పూర్తిగా బెదిరిపోయడని తెలిసి నవ్వుతూ వదిలేసాడు. మారడు పారిపోయాడు.
చిన్నా చీకట్లో ఎవ్వరికంటా పడకుండా నేరుగా అక్షిత ఇంటి గోడ దూకాడు, ప్రతాపరెడ్డి మనుషులే కాదు కుక్కలు కూడా పడుకున్నాయి, వెంటనే పైప్ పట్టుకుని కిటికీలకి వర్షం పడకుండా కట్టిన సిమెంటు బిళ్ళలు పట్టుకుని సులభంగా పైకి ఎక్కి అక్షిత రూము కిటికీ మీద పటపటా కొట్టాడు. రెండు నిమిషాలకి మళ్ళీ కొట్టగా కిటకి తలుపులు తెరుచుకున్నాయి, కావ్య కనిపించింది. పాము ముంగీసా ఒకరికొకరు ఎదురు పడ్డట్టు అదిరిపోయారు ఇద్దరు. కావ్య కిటికీలు మూసెయ్యక ముందే గబాగబా ఎక్కి లోపలికి దూరిపోయాడు. లోపల మంచం మీద ప్రతాపరెడ్డి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. గుండె జల్లుమంది కావ్య వైపు చూసాడు, భయంతో ఊపిరి ఆడట్లేదు కావ్యకి.
వెంటనే కావ్య పైట పట్టుకుని తనని వాటేసుకుని పైట వాడి మీద కప్పుకుని వాటేసుకున్నాడు. కావ్యకి అస్సలు మెదడు పని చెయ్యలేదు, ముందు చిన్నాని తోసేస్తూ రూములో నుంచి బైటికి లాక్కొచ్చేసింది. ఎంతకీ తన నడుము వదలకపోవడంతో గట్టిగా గిచ్చింది.
చిన్నా : అబ్బా..
కావ్య : రేయి.. పిచ్చ పిచ్చగా ఉందా
చిన్నా : ప్రతీసారి నీ ఎంట్రీ ఏంటి అత్తా
కావ్య : ఎందుకొచ్చావ్
చిన్నా : నా పని మీద నేనొచ్చా.. అక్షిత రూములో మీరేంటి
కావ్య : అది పదేళ్ళ ముందు.. రేయి ఆగు.. నా ఇంట్లో నాకు పనేంటని అడుగుతావేంటి, అందరినీ లేపేస్తా
ఇంతలో ఏదో చప్పుడు అయితే కావ్య టెన్షన్ తో అటు ఇటు చూస్తుంటే చిన్నా ప్రతాపరెడ్డిని చూసి వెంటనే కిందకి ఒంగి కావ్య పిర్రల మీద చెయ్యి వేసి పట్టుకున్నాడు. పాపం ఏం చెయ్యాలో తెలీక బిగుసుకుపోయింది కావ్య
ప్రతాపరెడ్డి : ఏంటిక్కడా
కావ్య : ఏదో చప్పుడు అయితేనూ.. మెలుకువ వచ్చేసింది
ప్రతాపరెడ్డి : పదా
కావ్య : మంచినీళ్లు తీసుకొస్తాను అనగానే ప్రతాపరెడ్డి వెళ్ళిపోయాడు. కావ్య కోపంగా వెనక్కి తిరిగి చిన్నా చెంప మీద లాగి పెట్టి కొట్టింది. అయినా కావ్య నడుము వదల్లేదు. వదలరా దున్నపోతా అని గింజకుంది.
చిన్నా లేచి నిలబడుతూ అక్షిత కావాలి అన్నాడు.
కావ్య : ఇక్కడే ఉండు పిలుచుకొస్తా
చిన్నా : ఇప్పుడా గుడ్డిదానికి చీకట్లో కనపడక అటు ఇటు గుద్దుకుని అవసరమా.. రూము ఎక్కడుందో చెప్పు
కావ్య : అదిగో అని సైగ చేసి ప్రతాపరెడ్డిని చూసి మళ్ళీ ఇటు తిరిగేలోపల చిన్నా అక్షిత రూము లోపలికి వెళ్ళిపోయాడు, కావ్య పరిగెత్తి వెళ్ళేలోపు చిన్నా తలుపు పెట్టేసి లోపల లాక్ చేసేసాడు. కావ్యకి ఏం చెయ్యాలో తోచలేదు, తలుపు కొడితే అందరూ లేస్తారు, వాళ్ళని ఇలానే వదిలేస్తే ఆమ్మో ఇంకేమైనా ఉందా కానీ ఎక్కువసేపు ఇక్కడ ఉండటానికి కూడా లేదు. కంగారుగా గోళ్లు గిల్లుతూ చీర కొంగు నలుపుతూ చుట్టు తిరిగిపోతుంటే ఇంతలో పెద్ద కేక వినపడింది.
అయ్యా... అని అరుస్తూ గేట్ బాదుతున్నాడు మారడు. వెంటనే ప్రతాపరెడ్డి ఇంట్లో లైట్లు మొత్తం వెలిగాయి. కావ్య పై ప్రాణాలు పైనే పోయాయి. టెన్షన్ తో మూర్చ రాబోతే ఇంతలో అక్షిత రూము తలుపులు కూడా తెరుచుకున్నాయి. అక్షిత బైటికి వచ్చింది. అందరూ ఇంటి బైటికి వచ్చారు. అక్షిత కావ్య పై నుంచి చూస్తున్నారు.
కావ్య : వాడేడి
అక్షిత : ఎవడు
కావ్య : ఆ వీరారెడ్డి కొడుకు
అక్షిత : చిన్నా...!
కావ్య : ఆ చిన్నా దున్నా.. వాడే
అక్షిత : ఎక్కడ మా.. అని అడిగింది ఆత్రంగా
వెంటనే అక్షిత నడుము మీద చెయ్యి పడింది. అటు తిరిగి చూస్తే ఎవ్వరు లేరు.. ఇటు అన్నాడు. అక్షిత ఇటు తిరిగి చూసేవారికి మొహం తన ఎదురుగా ఉంది. హాయి అన్నాడు నవ్వుతూ.
కావ్య : రేయి ముందు చెయ్యి తీ అని అక్షిత నడుము మీద ఉన్న చిన్నా చేతిని కొట్టింది.
ప్రతాపరెడ్డి మనుషులతో సహా ఇంటి నుంచి బైటికి వచ్చాడు. మారడు అయ్యా... అని పెద్ద రాగం తీస్తూంటే.. రేయి.. ఏందో సరిగ్గా చెప్పి సావు అని అరిచాడు.
మారడు : వీరారెడ్డి కొడుకు మన ఊళ్ళోకి అడుగు పెట్టడం కళ్ళారా చూసానయ్యా
ప్రతాపరెడ్డి : ఏందిరా నువ్వు సెప్పేది.. నిజమేనా..
మారడు : అవునయ్యా.. ఆ జోగి రెడ్డి కూతురుని ఇష్టపడినాడంట.. ఆ అమ్మాయి కోసం ఈ ఊళ్ళో అడుగుపెట్టినాడు.. ఒక్కడే వచ్చుండాడు, ఇప్పుడు పోతే దొరుకుతాడయ్యా
ప్రతాపరెడ్డి పదండ్రా అని కేకేసాడు అందరినీ.. మారడు కూడా కర్ర పట్టుకుని సరదాగా ఉత్సాహంగా అలా నడుస్తూ అందరూ హడావిడిగా వెళుతుంటే చిన్నా బాల్కనీ మీద వంగి రెండు చేతులు గోడ మీద పెట్టి నవ్వుతూ చూస్తుంటే అది చూసిన కావ్యకి చిన్నా ధైర్యం అంటే భయం ఏర్పడింది. తన కూతురు వంక చూసింది, అక్షిత చిన్నా వంక కనురెప్ప అయినా వాల్చకుండా అలా చూస్తుంటే కావ్య చూడటం తప్ప ఏమి చెయ్యలేకపోయింది.
చిన్నా అక్షిత కళ్ళ ముందు చేతులు ఊపీ.. కనిపిత్తనానా, వినిపిత్తనానా అని మగధీరలో శ్రీహరి అడిగినట్టు అడిగాడు.. వెంటనే ఓవొయ్ బుల్లెమ్మా అని అరవగానే అక్షిత ఊ కొట్టింది.
చిన్నా : చీకట్లో నా మొహం ఏం కనిపిచ్చిద్ది పద రూములోకి పోదాం అని అక్షిత చెయ్యి పట్టుకుని తన రూములోకి లాక్కెళ్ళాడు, కావ్య వెళ్ళేలోపు తలుపు మూసుకుంది. దబాదబా బాదినా లాభం లేకపోయింది, ఎక్కడ ఇంట్లో ఉన్న తన శాడిస్ట్ అత్త, మిగిలిన మనుషులు వచ్చేస్తారో అని అక్కడే తలుపు దెగ్గర కూర్చుండిపోయింది. తలుపు మీద చెవి ఆనించినా ఏమి వినబడలేదు.. పైకి చూస్తూ.. దేవుడా.. నాకే ఎందుకిలా.. పొయ్యి పొయ్యి వీడిని తగిలించావేంటి స్వామీ అని ఏడుపు మొహం పెట్టింది.