Update 68

ది బాయ్స్

మార్నింగ్ కాజల్ ని తీసుకొని క్రిష్ ఆఫీస్ కి వచ్చాడు. కేశవ్ యునిఫార్మ్ లో వచ్చి తన మనుషులతో వచ్చి అక్కడ సీసీ టీవీ ఫుటేజ్ తీసుకుంటూ, సెక్యూరిటీ రూమ్ లో మానిటర్ చూస్తూ వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు. తనతో పాటు వచ్చిన ఇద్దరు ఆఫీసర్లు కూడా చూస్తున్నారు.

కేశవ్ బయటకు వస్తూనే క్రిష్ మరియు కాజల్ ని చూస్తూ "ప్రైమ్ విట్ నెస్.. ఇంత లేటు గానా వచ్చేది" అన్నాడు.

కాజల్ అతన్ని సివిల్ డ్రెస్ లో చూసి దైర్యంగా ఉన్నా సెక్యూరిటీ ఆఫీసర్ డ్రెస్ లో చూసి కొంచెం భయ పడి క్రిష్ చేతిని పట్టుకుంది.

క్రిష్ మాత్రం అలాగే నిలబడి "సీరియస్ గా ట్రై చేస్తున్నావ్" అన్నాడు.

కేశవ్ "నా జాబ్ చేస్తున్నా... ప్రొటెక్ట్ చేయడం నా జాబ్..."

క్రిష్, కాజల్ వైపు చూస్తూ "దాని అర్ధం, ఇంకా పట్టుకోలేదని..." అన్నాడు.

కేశవ్ కోపంగా "అలా చిటికేస్తే.... ఇలా ఏం జరిగిపోవు... రా..."

క్రిష్ "సర్లే నీ సావ్ నువ్వు సావ్..... ఆ ఎంక్వయిరీ ఎదో తగలబెట్టు"

కేశవ్ సీరియస్ గా "హుమ్మ్...." అన్నాడు.

క్రిష్ "ఎంక్వయిరీ చేస్తాం అని పిలిచారు సర్... అందుకే వచ్చాం...."

కేశవ్ "కాలేజ్ కి వెళ్ళవా..."

క్రిష్ "లేదు... క్లాస్ అందరూ వారం రోజుల టూర్ ప్రోగ్రాం పెట్టుకున్నారు"

కేశవ్ "నువ్వు వెళ్ళలేదా"

క్రిష్ "వెళ్లాను... మధ్యలో వచ్చేశాను"

కేశవ్, క్రిష్ ని చూస్తూ ఉంటే....

క్రిష్ "అందరూ వాళ్ళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో వచ్చి బిల్డ్ అప్ లు దెంగుతున్నారు... అందుకే తన కోసం వచ్చేశాను" అంటూ ఆమె చేతిని తన చేతికి చుట్టుకున్నాడు.

కేశవ్, క్రిష్ చేయి పట్టుకొని కాజల్ నుండి దూరంగా తీసుకొని వచ్చి ఒక గోడ దగ్గర నిలబడి "నీకేమైనా పిచ్చి పట్టిందా..." అని అన్నాడు.

కాజల్ అక్కడ నుండి వెళ్లి పోయి వాళ్ళు ఉన్న గోడకి వెనక నిలబడి వాళ్ళ మాటలు వింటుంది.

క్రిష్ విసురుగా కేశవ్ చేతి నుండి తన చేతిని విడిపించుకొని "ఏమయింది?" అన్నాడు.

కేశవ్ "నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఆమె ఒక జాబ్ హోల్డర్... నువ్వు ఒక స్టూడెంట్ వి..."

క్రిష్ "అయితే... ప్రేమించుకోకూడదా..."

కేశవ్ "మీ ఇద్దరూ లవర్స్ ఏంటి రా..."

క్రిష్ "అవ్వకూదదా..." అని వెక్కిరింపుగా అడిగాడు.

కేశవ్ విసుగ్గా "తను నీ కంటే ఎన్నేళ్ళు పెద్దది... "

క్రిష్ "ఐదేళ్ళు"

కేశవ్ "ఐదేళ్ళు పెద్ద ఆవిడతో నీ సరసాలు ఏంటి? అయినా తనకు వేరే ఎవరూ దొరకలేదా.... నిన్ను వాడుకుంటుంది... బజారు ముండ...." అని చీత్కారంగా మాట్లాడాడు.

క్రిష్, అమాంతం కేశవ్ గొంతు పట్టుకొని గోడకు అదిమి పెట్టి అతని కళ్ళలోకి చూస్తూ "ఇంకొక్క సారి పిచ్చి వాగుడు వాగితే పుచ్చే పగిలిపోతుంది, బావ గాడివి అని కూడా చూడను" అని వార్నింగ్ ఇచ్చి కేశవ్ ని వదిలేశాడు.

కేశవ్ గొంతు పట్టుకొని దగ్గుతూ ఉన్నాడు.

రెండు నిముషాల తర్వాత....

క్రిష్ "తను నా మనిషి...." అన్నాడు.

కేశవ్ "ఓహ్... తను నీ మనిషి.... వెరీ గుడ్... మరి రష్.... తను ఎవరి మనిషి... కొన్ని నెలల క్రితం ఇదే మాట రష్ విషయంలో చెప్పావ్... ఈమెది ఎన్నో నెంబర్?.... చెప్పూ రా తన టోకెన్ నెంబర్ ఎంత?..."

క్రిష్ కోపంగా కేశవ్ చొక్కా పట్టుకొని నేట్టేయబోతే... కేశవ్ మధ్యలోనే అతడిని ఆపి మరో పంచ్ ఇచ్చాడు.

అక్కడ నుండి ఇద్దరి మధ్య చిన్న సైజ్ మార్షల్ ఆర్ట్స్ మ్యాచ్ జరిగింది. చివరికి కేశవ్ , క్రిష్ ని నేల మీదకి విసిరేశాడు.

క్రిష్ వెనక్కి కింద పడి పైకి లేచి ముక్కు చూసుకుంటూ ఉన్నాడు.

కేశవ్ కూడా క్రిష్ ముక్కు చూసి "ఏం కాలేదు... కాని పగులుతుంది... మీద చేయి వేస్తె.... ఎదో బామ్మర్దివి, చిన్నోడివి అని ఊరుకుంటు ఉంటే... పెద్ద హీరో అనుకుంటున్నావా... మీదమీదకి వస్తున్నావ్... హా... నరికేస్తా..." అంటూ వేలు చూపించాడు.

------------------

ఎందుకు అంటే... నేను, హీరో ని కాబట్టి....

కేశవ్, క్రిష్ ఇద్దరూ బావ బామ్మర్దులు, ఎక్కువగా రామ్మోహన్ దగ్గర ఉండడంతో అలాగే స్పోర్ట్స్ లో బాక్సింగ్ లో కలిసి పోటీ చేయడంతో మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు. కొట్టుకోవడం వాళ్ళ ఇద్దరి మధ్య సర్వసాధారణ విషయం.

కేశవ్, క్రిష్ ని పైకి లేపి అతని చొక్కా గుండీలు సరి చేసి, అతని జుట్టు సారి చేస్తూ... "చూడు... మనసు అంటే ఒకళ్ళకు ఇచ్చేది.... తలా ఒక ముక్క చేసి తలా కొద్ది కొద్దిగా పంచేది కాదు..." రా అని చెప్పాడు.

క్రిష్ అతన్ని తోసేసి చొక్కా గుండీలు పెట్టుకుంటూ, కేషవ్ వైపు కోపంగా చూస్తున్నాడు.

కేశవ్ "రష్, నిన్ను అసలు మనిషిలా కూడా లెక్క వేయలేదు... అందరూ తనని దూరం చేసినపుడు మాత్రమె నీ దగ్గరకు వచ్చింది"

క్రిష్ "నేను వెళ్లి కాపాడాను"

కేశవ్ "హా...."

క్రిష్ "మీరందరూ తనని వదిలేసి చేతులు దులుపుకుంటే... నేను వెళ్లి కాపాడాను..."

కేశవ్ "అయితే..."

క్రిష్ "బ్రదర్ వరస అయ్యే.... సెక్యూరిటీ ఆఫీసర్.... ద గ్రేట్ కేశవ్.... సబ్ ఇన్స్పెక్టర్ గారు.... సొంత తండ్రి రామ్మోహన్... నార్కోటిక్ డిపార్ట్మెంట్... ఎవ్వడు ఏం పీకలేక మూసుకొని ఉంటే... నేను వెళ్లి కాపాడాను... ఒక్కడిని వెళ్లి కాపాడాను"

కేశవ్ సైలెంట్ గా ఉన్నాడు.

క్రిష్ "ఊరికే లవ్ లెటర్ యిచ్చేసి... తనను తీసుకొని నేను లేచిపోలేదు రా.... తనని, తన పసికందుని కిడ్నాప్ చేస్తే... వరంగల్ వెళ్లి అందరిని ఎదిరించి... ఒక్కడిని కాపాడుకొని వచ్చాను... పిల్లాడికి బాగోక రెండు లక్షలు అవసరం అయితే చేతిలో డబ్బులు లేక పోతే... ఒకరిని మోసం చేసి తెచ్చి కట్టాను ఆ డబ్బు... ఆ రెండు లక్షలు.... అప్పుడు కూడా రాలేదు... ఏ పెద్ద వాళ్ళు... రాలేదు.. అవునూ రా హీరో నే.... హీరో నే.... " అని ఆవేశంగా చెబుతున్నాడు.

రెండు నిముషాల్ తర్వాత...

కేశవ్, క్రిష్ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకొని "రేయ్, క్రిష్.... అది కాదు రా.... ఇంత చేశాక కూడా... రష్ ఎక్కడుంది"

క్రిష్ సైలెంట్ అయ్యాడు.

కేశవ్ "ఎక్కడుంది.... చెప్పూ..."

క్రిష్ "..."

కేశవ్ "వెళ్లి పోయింది..."

క్రిష్ "..."

కేశవ్ "నిన్ను వాడుకుంది.... నిజాయితీ... కృతజ్ఞత లేని మనుషులు రా..."

క్రిష్ "..."

కేశవ్ "నీ మంచి కోసమే చెబుతున్నా... నువ్వు మళ్ళి అలా అవ్వకూడదు అని చెబుతున్నా...."

క్రిష్ సైలెంట్ అయ్యాడు. అతని ఆవేశం కూల్ అయి మాములు అయ్యాడు.

రెండు నిముషాల తర్వాత...

ఇద్దరూ పక్కపక్కన కూర్చొని ఉన్నారు. కేశవ్, క్రిష్ భుజం చుట్టూ చేయి వేశాడు.

కేశవ్ "ఇంతకీ ఎవరినీ మోసం చేశావ్.... ఆ రెండు లక్షల కోసం.." అన్నాడు.

క్రిష్ పైకి లేచి నిలబడి కేశవ్ ఎదురుగా నిలబడ్డాడు.

క్రిష్, కేశవ్ చేయి చూపిస్తూ "నీ సెక్యూరిటీ ఆఫీసర్ బుద్ది పోగొట్టుకున్నవ్ కాదు..." అన్నాడు.

కేశవ్ "అది కాదు రా.... రేపు ఏదైనా కేసు గీసు వస్తే... హెల్ప్ చేద్దాం అని...."

క్రిష్ "నా బొక్క చేస్తావ్ రా... నెంబర్ వన్ స్వార్ధ పరుడువి నువ్వు.... నిన్ను అసలు నమ్మ కూడదు..." అన్నాడు.

కేశవ్ "అది కాదు రా... నాకు బామ్మర్దివి రా.. అప్పుడు మేం ఎవరం హెల్ప్ చేయలేదు.... మొండిగా వెళ్ళావ్.... సాధించుకొని వచ్చావ్... ఇప్పటికి నువ్వంటే మా అందరికి మంచి ఫీలింగ్... నువ్వు ఇబ్బందుల్లో పడకూడదు అని... అంతే...."

క్రిష్ "అయినా నేను సార్ట్ అవుట్ చేసుకున్నా లే...."

కేశవ్ "ఎవరో చెప్పను అంటావ్.... అంతేలే ఎంతైనా మేం బయట వాళ్ళం...." అని క్రిష్ వైపు దొంగ చూపు చూస్తున్నాడు. క్రిష్ చెబుతాడు అని అర్ధం అయి, చిన్నగా నవ్వుకుంటున్నాడు.

రెండు నిముషాల తర్వాత...

క్రిష్ "తనే..." అంటూ ఏటో చూస్తూ చెప్పాడు.

కేశవ్ "ఏంటి?" అని ఆశ్చర్యంగా లేచి నిలబడ్డాడు.

క్రిష్ కేశవ్ ని చూస్తూ నిలబడ్డాడు.

కేశవ్ పగలబడి నవ్వుతూ "ఏంటి.. అయితే మీ ఇద్దరి పరిచయం మోసంతో మొదలయిందా.... సూపర్ రా బాబు..."

క్రిష్ "నీ సిస్టర్.... రష్ మోసంతో ముగించింది..... కాజల్ తో మోసంతో మొదలయింది..... ఏది బెస్ట్ అంటావ్..." అన్నాడు.

రెండు నిముషాల తర్వాత...

కేశవ్ "రష్ కి నువ్వొక బ్యాక్ అప్ వి... ఇప్పుడు తన మొగుడు ఏమైనా అన్నా, వదిలేసినా నీ దగ్గరకు వస్తుంది... నిన్ను అలా అట్టి పెట్టుకుంది... క్రిమినల్ బ్రెయిన్..." అన్నాడు.

క్రిష్ "ఏం చేయమంటావ్.... దిగిన తర్వాత ఈదడమే.... అలానే ఉంటే మునిగిపోతాం.... రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక తప్పదు బావా... మోయాల్సిందే"

కేశవ్ "ఈ అమ్మాయి ఎలాంటిది? అసలు తక్కువ వయస్సు ఉన్న అబ్బాయిని, అందులోనూ డబ్బు కోసం మోసం చేసిన వాడిని లవ్ చేయాలని తనకు ఎలా అనిపించింది... హౌ ఈజ్ దిస్ పాజిబుల్..."

క్రిష్ పైకి చూస్తూ "ఎందుకంటే తనొక ఏంజెల్..."

కేశవ్ "అబ్బో...."

క్రిష్, తిరిగి కేశవ్ ని చూస్తూ "నిజంగా తనొక ఏంజెల్..."

కేశవ్ "సరే.... నీ ఏంజెల్ ని జాగ్రత్తగా చూసుకో... ఈషాని కిడ్నాప్ చేయబోయిన ఆ కిడ్నాపర్ ఒక సీరియల్ అఫేండర్... ఒక సైకో లాంటి వాడు... వాడిని మేం రెండు నెలల ముందు వేరే కేసులో కూడా వెతుకుతున్నాం... దొరకడంలేదు"

రెండు నిముషాల తర్వాత...
క్రిష్ "రెండు రోజులు..."

కేశవ్ "ఏంటి?"

క్రిష్ "రెండు రోజుల్లో వాడిని తీసుకొచ్చి నీ ముందు నుంచో బెడతా..."

కేశవ్ "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు"

క్రిష్, నవ్వుతూ లేచి నిలబడ్డాడు.

కేశవ్ "ఇన్వాల్వ్ అవ్వకు... ముందుగా చెబుతున్నా, ఇన్వాల్వ్ అవ్వకు..." అన్నాడు, కాని క్రిష్ నవ్వుతూనే ఉన్నాడు.

కేశవ్ "అసలు నీకూ ఎందుకు రా..."

క్రిష్ ఒళ్ళు విరుచుకుంటూ "ఎందుకు అంటే... నేను, హీరో ని కాబట్టి" అని నవ్వుతున్నాడు.

-----------------

నా దైర్యం....

కాజల్ ఆఫీస్ లో కూర్చున్నా క్రిష్ మరియు కేశవ్ ల మాటల గురించే ఆలోచిస్తుంది. క్రిమినల్ ని పట్టుకోవడం గురించి కేశవ్ చూసుకుంటాడు.

కాని తనూ... రష్ గురించి ఆలోచిస్తూ... ఉంది.

ఈషా "ఏమయింది? మేడం... సెక్యూరిటీ ఆఫీసర్లు ఏమైనా ఇబ్బంది పెట్టారా... లేదంటే గాయం నొప్పిగా ఉందా..." అని కన్సర్న్ గా అడిగింది, తనని కాపాడుతూ అయిన గాయం అవ్వడం వల్ల కాజల్ పై తనకు ఇంతకు ముందు ఉన్న నెగిటివ్ ఫీలింగ్ పోయి పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. ఆఫీస్ అందరికి స్పెషల్ రెస్పెక్ట్ వచ్చినా అందరూ మాములుగానే ఉన్నారు.

ఈషా మాటలతో ఈ లోకంలో వచ్చి కాజల్ "బ్యాక్ అప్ రిలేషన్ షిప్ అంటే ఏంటి?" అని అడిగింది.

ఈషా "ఏంటి? మేడం.."

కాజల్ "బ్యాక్ అప్ రిలేషన్ షిప్ అంటే ఏంటి?" అని మళ్ళి అడిగింది.

ఈషా ఫోన్ లో చూస్తూ "బ్యాక్ అప్ రిలేషన్ షిప్ అంటే.... ఒక అమ్మాయి, తన భర్త లేదా బాయ్ ఫ్రెండ్ అందుబాటులో లేనప్పుడు బ్యాక్ అప్ గా పెట్టుకున్న వ్యక్తీతో రొమాంటిక్ రిలేషన్ షిప్ కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు అంటే మరో కొత్త తోడూ.... తన ఎక్సపెక్టేషన్ సంబంధించిన వాళ్ళు దొరికేవరకు...." అని చదివి 'ఛీ... అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారా...' అంది.

కాజల్ కూడా 'ఛీ' అని పక్కకు తిరిగి వర్క్ లోకి వెళ్ళింది.

కాజల్ మనసులో క్రిష్ మొదట్లో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

----- క్రిష్ "మీరిచ్చిన డబ్బు ఉపయోగపడింది, ఒక అమ్మాయిని, మా బిడ్డని సేవ్ చేయడంలో ఉపయోగపడింది"

'మా' బిడ్డ, 'ఒక' అమ్మాయి అన్నాడు...... ఆ రష్... ఆ బిడ్డని అడ్డం పెట్టుకొని క్రిష్ ని కావలసినపుడు, కావలసినట్టుగా బ్లాక్ మెయిల్ చేస్తుంది.

అందుకే క్రిష్ సఫర్ అవుతున్నాడు.

అనుకుంటూ క్రిష్ ఒంటరిగా కూర్చొని ఎదో విషయం బాధ పడుతూ ఆలోచిస్తున్న సమయం గుర్తు చేసుకుంది. అతన్ని ఫీల్ అవుతూ ఉంటే ఎందుకో తనకు కూడా బాధగా అనిపిస్తుంది.

నిత్య విషయంలో, వాళ్ళ ఆంటీ విషయంలో, రష్మిక విషయంలో జలసీ ఫీల్ అయింది, కాని క్రిష్ తరుపు నుండి వాటిని ఆలోచిస్తూ ఉంటే పెయిన్ గా అనిపిస్తుంది.

ఈషా "ఏంటి.. మేడం అలా ఉన్నారు"

కాజల్ ఆలోచిస్తూ "ఇంతకు ముందు వరకు మాములుగా ఉండేది, కానీ ఇప్పుడే పెయిన్ గా అనిపిస్తుంది" అంది.

ఈషా, కాజల్ భుజం గాయం గురించి చెబుతుంది అనుకోని గాయాన్ని దగ్గర నుండి చూస్తూ "హాస్పిటల్ కి వెళ్దామా మేడం" అంది.

కాజల్ ఈ లోకంలోకి వచ్చి, తన భుజం గురించి చెబుతున్నా అనుకోని బాధపడుతున్న ఈషాని చూస్తూ "ఇంత కంటే పెద్ద గాయాలను అనుభవించాను ఈషా... ఇదేమి పెద్దది కాదు" అని చిన్నగా నవ్వింది.

ఈషా, కాజల్ తన మొదటి భర్త డాక్టర్ వివేక్ వల్ల కలిగిన డొమెస్టిక్ వయలెన్స్ గురించి మాట్లాడుతున్నట్టు అర్ధం అయి ఇబ్బందిగా నవ్వింది.

కాజల్ తన భుజంపై దెబ్బని తడుముకుంటూ "మిగిలిన దెబ్బలు నా పిరికితనానికి ప్రతీక అయితే... ఈ దెబ్బ ప్రత్యేకం.. నా దైర్యానికి, నా పోరాటానికి ప్రతీక..." అంటూ తడుముకుంటూ గర్వంగా నవ్వుకుంది.

కాజల్ మనసులో....

అవునూ క్రిష్ నువ్వు నన్ను మార్చేసావ్... ఆ రోజు అతను కత్తి తీసుకొని నా మీదకు వస్తున్నా, నా మనసులో నువ్వే ఉన్నావ్... నా వాడు ఉన్నాడు, ఏదైనా తేడా వస్తే... మొత్తం తను చూసుకుంటాడు. ఆ దైర్యమే నన్ను నడిపించింది. ఆ దైర్యమే నన్ను పోరాడేలా చేసింది.

అవునూ క్రిష్.... నువ్వు నా దైర్యం.... నువ్వు నా వాడివి... నా బాయ్ ఫ్రెండ్ వి... నా లవర్ వి.... నా మొగుడి వి....

అన్నింటికీ మించి నా హీరో వి...

కాజల్ మరియు క్రిష్ కార్ లో ఇంటికి వెళ్తున్నారు.

రెడ్ లైట్ పడడంతో కార్ ఆపారు.

క్రిష్ "నువ్విక భయపడే పని లేదు"

కాజల్ "దేని గురించి"

క్రిష్ "ఆ క్రిమినల్ ని పట్టుకున్నారు"

కాజల్ "అప్పుడేనా...." అని ఆశ్చర్య పోయి మనసులో "రెండు రోజులు అన్నాడు, కనీసం ఒక రోజు కూడా గడవలేదు" అనుకుంది.

క్రిష్ "హుమ్మ్" అని చిన్నగా నవ్వాడు.

కాజల్ "ఎవరు పట్టుకున్నారు"

క్రిష్ "అతనే స్టేషన్ కి వచ్చి సరెండర్ అయ్యాడు అంట"

కాజల్ "కన్ఫర్మ్.... వీడే ఎదో చేశాడు" అని మనసులో అనుకొని "నీకేం కాలేదు కదా.." అని అడిగింది.

క్రిష్ "నాకేం అవుతుంది.."

కాజల్ "నిజం చెప్పూ.."

క్రిష్ "ఏం కాలేదు మేడం గారు.... ఏం కాలేదు"

కాజల్ "ఏదైనా ఉండే చెప్పూ హాస్పిటల్ కి వెళ్దాం"

క్రిష్ "వాడు ఉత్త వెధవ... వాడెం చేస్తాడు నన్ను" అన్నాడు.

కాజల్ "నీకేదైనా అయితే... ఈ పిచ్చిదాని ప్రాణం పోతుంది... రిస్క్ చేసేముందు ఒక్క సారి నా గురించి కూడా ఆలోచించు" అంటూ క్రిష్ ని చూస్తూ అతని భుజం పై వాలిపోయింది.

క్రిష్ "ఏమయింది?"

కాజల్ "జస్ట్... చెప్పాలని అనిపించింది"

క్రిష్, కాజల్ మొహాన్ని చూస్తూ "పొద్దున్న మా మాటలు విన్నావా" అని అడిగాడు.

కాజల్ మరింత గట్టిగా సైడ్ నుండి హాగ్ చేసుకుంది.

క్రిష్ "సరే... గుర్తు పెట్టుకుంటాను... అయినా నాకేం కాదు అని మాటిస్తున్నాను" అన్నాడు.

కాజల్ పైకి లేచి అతనికి ముద్దు పెట్టింది. క్రిష్ ఆమె చుట్టూ చేతులు వేసి ముద్దుని కొనసాగించాడు.

నిషా, కాజల్ తో మాట్లాడిన తర్వాత ఆలోచిస్తూ ఉంది.

సాత్విక్ గురించి ఆలోచించకూడదు అనుకోవడంతో తనకు ఖాళీగా అనిపిస్తూ, కాజల్ మరియు క్రిష్ ల గురించి ఆలోచిస్తూ ఉంది.

నిషా "తక్కువ అంచనా వేశాను క్రిష్, నిన్ను నేను చాలా తక్కువ అంచానా వేశాను. మీ ఇద్దరూ త్వరలోనే విడిపోతారు అనుకున్నా... ఉండే కొద్ది అలా జరగడం లేదనిపిస్తుంది.
టెంపరరీ రిలేషన్ అంటూనే, అక్క గుండెల్లో స్థానం పొందేసావ్..."

నిషా "ఐ యామ్ సారీ అక్కా... ఇది నీ కోసమే... క్రిష్ విషయంలో నీతో పోటీ పడి... మీ ఇద్దరినీ కన్ఫ్యూజ్ చేసి, హార్ట్ బ్రేక్ చేస్తాను.... వెయిట్ అండ్ సీ..."
Next page: Update 69
Previous page: Update 67