Update 03

(ప్రేమ మజిలీ 2)

(ఈ కథ ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ ఒక అమ్మాయి ప్రేమ చుట్టూ తిరిగే ఒక చక్కని ప్రేమ కథ మీకు బాగా నచ్చుతుంది ఒక అమ్మాయి తన జీవితంలో అనుకోకుండా వచ్చిన ఒక రెండు సమస్యలకు ఎలా జవాబు ఇచ్చింది ఆ సమయం లో తన ప్రేమ నీ ఎలా గెలుచుకుంది అన్నది కథ)

(బెంగళూరు)

ఆ రోజు కోర్టు మొత్తం హడావిడి గా ఉంది ఎందుకంటే ఆ రోజు జరుగుతున్న కేసు అలాంటిది పైగా ఆ కేసు లో వాదించుకుంటున్న లాయర్ లు ఇద్దరూ ఒకప్పుడు గురు శిష్యులు ఒక పక్క 15 సంవత్సరాల నుంచి ఎదురు లేకుండా ఉన్న క్రిమినల్ లాయర్ పార్థసారథి గౌడ మరో వైపు 4 సంవత్సరాల లో తను ఏంటో నిరూపించుకోని సిటీ లో టాప్ లాయర్ గా ఎదిగిన స్వీటీ ఈ పోటీ ఇంత ఉత్కంఠ రేగడానికి కారణం స్వీటీ ఒకప్పుడు పార్థసారధి కీ అసిస్టెంట్ ఇప్పుడు జరుగుతున్న కేసు ఒక మార్వాడీ వ్యాపారి కొడుకు తన తండ్రి చనిపోయే ముందు ఇచ్చిన అప్పు తాలూకు బాండ్ పేపర్ తో ఒక కుటుంబం ఇప్పటి వరకు డబ్బు కట్టలేదు అని వాదిస్తున్నాడు అతనిది చాలా పెద్ద ఫైనాన్స్ కంపెనీ బెంగళూరు లో కాబట్టి వడ్డీ లేకుండా అసలు మాత్రం అయిన ఇవ్వమని అది కోర్టు వారు ఇప్పించాలని కోరాడు.

కేసు వాదనలు విన్న తరువాత స్వీటీ అ మార్వాడీ వ్యాపారి చెప్పేది మొత్తం అబద్ధం అని తన క్లయింట్ మొత్తం వడ్డీ అసలు సరైన సమయంలో చెల్లించారు అని పైగా ఆ వ్యాపారి తండ్రి తన క్లయింట్ కళ్ల ముందే ఆ బాండ్ పేపర్ చించేసారు అని చెప్పి అతని క్రాస్ examine చేయడానికి కోరింది దాంతో అతని దగ్గరికి వెళ్లి "నమస్తే మహారాజ్" అని మర్యాద గా చెప్పింది దానికి అతను కూడా మర్యాద గా స్పందించాడు "మా క్లయింట్ మీ నాన్న దెగ్గర 5 లక్షలు తీసుకున్నారు అసలు వడ్డీ మొత్తం కలిపి నాలుగు సంవత్సరాల్లో తీరుస్తారు అని బాండ్ రాసుకున్నారు అది మీరు స్వయంగా చూశారు" అవునా అని అడిగింది దానికి అతను అవును అని తల ఆడించాడు దానికి స్వీటీ "మై లార్డ్ ఈయన చెప్పేది మొత్తం అబద్ధం అసలు గత 7 సంవత్సరాలుగా తన బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయలేక supplies రాస్తూ ఇతను ముంబాయి లోనే ఉన్నాడు కావాలి అంటే ఆ బాండ్ మీద డేట్ చూడండి అంతే కాకుండా మేము కోర్టు వారికి సమర్పించిన ఈయన ఎగ్జామ్ హాల్ టికెట్ లో డేట్ చూడండి ఈ బాండ్ రాసినప్పుడు ఇతను ఆ రోజు ఎగ్జామ్ లో ఉన్నాడు " అని చెప్పి ఒక pen drive ఇచ్చి అందులో వీడియో ఆధారం చూపించింది దాంట్లో అతని ఎవరూ ఎవరూ అప్పు తీర్చారో వాళ్ల చినిగిన బాండ్ పేపర్ లు మళ్లీ తీసుకొని కొత్త గా వేరే బాండ్ పేపర్ లో అవి రాసి అప్పు తీర్చిన వాళ్ల దెగ్గర మళ్లీ అప్పు వసూలు చేస్తున్నాడు అని సాక్ష్యం చూపించింది స్వీటీ దాంతో కోర్టు అతనికి జైలు శిక్ష విధిస్తూ ఆ నష్ట పోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

కేసు గెలిచిన తర్వాత కోర్టు బయటికి రాగానే పార్థసారథి అసిస్టెంట్ శ్యామ్ వచ్చి స్వీటీ తో "మేడమ్ మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు" అని చెప్పాడు దానికి స్వీటీ శ్యామ్ నీ చిన్నగ కొట్టి "మేడమ్ ఏంటి రా మనం ఎప్పుడూ ఫ్రెండ్స్ ఏ గుర్తు పెట్టుకో" అంటూ ఇద్దరు కలిసి పార్థసారథి రూమ్ లోకి వెళ్లారు అప్పుడు ఆయన ఒక చిన్న బాక్స్ తీసి స్వీటీ ముందు పెట్టాడు అందులో రెండు పెన్ లు ఉన్నాయి "ఇవి ఏంటో తెలుసా స్వీటీ" అని అడిగాడు దానికి తల అడ్డంగా ఉప్పింది "మా తాత గారు బ్రిటిష్ టైమ్ లో లాయర్ గా ఉండే వారు ఆయన టాలెంట్ మెచ్చి బ్రిటిష్ వాళ్లు ఇచ్చిన హ్యాండ్ మేడ్ ఫౌంటెన్ పెన్ చాలా rare పీస్ ఇది మా తాత మా నాన్న కీ ఇస్తు మా తాత లాంటి గొప్ప తెలివైన లాయర్ ఎవరైనా కనిపిస్తే బహుమతి గా ఇవ్వమని చెప్పారు అంటా అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఎవ్వరూ దొరక లేదు but you deserve this it is my token of appreciation for you ఆ రోజు నేను ఇదే కోర్టు హాల్లో నిన్ను అన్న ప్రతి మాట ఈ రోజు వెనకు తీసుకుంటున్నా God bless you my child "అని చెప్పాడు దానికి వెంటనే స్వీటీ అయన కాలి కీ నమస్కరించి " నేను ఎన్ని సాధించిన అవి అని మీరు నేర్పిన దాని వల్లే కదా సార్ " అంటూ తన హ్యాండ్ బాగ్ లో నుంచి ఒక invitation కార్డ్ తీసి ఇస్తూ "సార్ నేను ఇన్ని రోజులు గా కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి పెట్టి నా లాంటి అనాధ పిల్లల కోసం ఒక కాలేజ్ కట్టించాను దానికి మీరు కచ్చితంగా రావాలి "అని చెప్పి అయన ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని వెళ్లింది.

మరుసటి రోజు ఉదయం స్వీటీ కాలేజ్ opening function తాలూకు అని పనులు చూసుకుంటు ఉంది అప్పుడే పార్థసారథి తన ఫ్యామిలీ తో సహా వచ్చాడు ఆయన భార్య రమ, కొడుకు శ్యామ్ (తండ్రి దెగ్గరె అసిస్టెంట్ చేస్తున్నాడు) తో కలిసి వచ్చి స్వీటీ నీ మెచ్చుకున్నాడు ఆ తర్వాత స్వీటీ తన అక్క, బావ నీ వాళ్ళకి పరిచయం చేసింది ఆ తర్వాత పార్థసారధి తోనే కాలేజ్ ఓపెన్ చేయించారు ఆ తర్వాత అందరూ మాట్లాడుతూ ఉండగా సడన్ గా స్వీటీ కళ్లు తిరిగి పడిపోయింది, వెంటనే హాస్పిటల్ కీ తీసుకొని వెళ్లారు అక్కడ డాక్టర్ అను వీళ్లకి ఫ్యామిలీ ఫ్రెండ్.

హాస్పిటల్ కీ వెళ్లిన ఒక అర గంటకు స్వీటీ కళ్లు తెరిచింది అప్పుడు అను ఒక్కటే తన పక్కన ఉంది వాళ్ల అక్క, బావ బయట ఉన్నారు, "నీకు ఇప్పుడు చెప్పే విషయం చాలా complicated ఇది ఎలా జరిగింది అని అడగను కానీ కారణం ఎవరో నీకు తెలిస్తే చాలు" అని చెప్పింది అను, స్వీటీ అయోమయంగా చూస్తూ ఉంది అప్పుడు అను "స్వీటీ నువ్వు pregnant అసలు దీనికి కారణం ఎవరో నీకు ఏమైన తెలుసా" అని అడిగింది అప్పుడే టివి లో "వరల్డ్ బైక్ రేసింగ్ చాంపియన్ షిప్ లో కూడా తనకు ఎదురు లేదు అని తన సత్తా చాటిన మన ఇండియన్ రేసర్ శ్రీనివాస్ చక్రవర్తి అలియాస్ శ్రీని" అని చెప్పడం చూసి ట్రోఫీ తీసుకుంటున్న శ్రీని నీ చూసి తన కడుపు పైన మెల్లగ రుదుకుంది స్వీటీ.

తను pregnant అని తెలియగానే స్వీటీ లో కొంచెం కంగారు, కొంచెం భయం వేసింది ఇప్పుడు ఈ విషయం తన అక్క బావ కీ తెలిస్తే ఎలా అని అనుకుంది కానీ ఆ విషయం దాచి పెట్టాలి అని మాత్రం అనుకోలేదు ఎలాగైనా ఇంట్లో చెప్పాలి అని డిసైడ్ అయ్యింది కార్ లో ఇంటికి వెళుతున్న అంత సేపు తను దీని గురించే ఆలోచిస్తూ ఉంది, ఇంటికి వెళ్లాక స్వీటీ తన అక్క సంధ్య, బావ రవి నీ ఇద్దరిని కూర్చోబేటి వాళ్ల కొడుకు లడ్డూ నీ రూమ్ లోకి పంపించి తను pregnant అనే విషయం చెప్పింది దాంతో ఇద్దరు షాక్ అయ్యారు

సంధ్య : ఎమ్ మాట్లాడుతూన్నావు స్వీటీ

స్వీటీ : నిజం అక్క మీకు దీని వల్ల ఏమైన ఇబ్బంది అంటే చెప్పండి నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతా

సంధ్య : పిచ్చి దాన ఇది అంతా నువ్వు సంపాదించిన అస్తి నేను ఆశ్చర్య పోతుంది నువ్వు శ్రీని తప్ప ఎవరినీ లవ్ చేయలేదు కదా మరి ఇది ఎలా

స్వీటీ : దీనికి కారణం కూడా శ్రీని

సంధ్య : అవునా ఎప్పుడు ఎలాగే

స్వీటీ : రెండు నెలల క్రితం నేను చరణ్ పెళ్లి కీ వెళ్లా కదా అప్పుడు జరిగింది

సంధ్య : మరి ఇప్పుడు శ్రీని కీ ఈ విషయం తెలుసా

స్వీటీ : తెలియదు చెప్పాలి అని కూడా అనుకోవడం లేదు

రవి : అది ఏంటి స్వీటీ చెప్పక పోతే ఎలా

స్వీటీ : బావ ఇందులో వాడి తప్పు లేదు ఆ రోజు నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది వదిలేయండి నేను నా బిడ్డ జాగ్రత్తగా ఉంటాం నా ప్రేమ లో నిజాయితీ ఉంటే ఎలాగైనా వాడు నా దగ్గరికి వస్తాడు సరే నేను కొద్ది సేపు పడుకుంటా అని తన రూమ్ లోకి వెళ్లి టివి పెట్టుకొని చూస్తూ ఉంది అప్పుడే టివి లో శ్రీని గురించి ఇంటర్వ్యూ వస్తుంది.

"వరల్డ్ బైక్ రేసింగ్ చాంపియన్ షిప్ లో గెలిచిన శ్రీనివాస్ చక్రవర్తి తో ఈ రోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ" అంటూ ఒక యాంకర్ మాట్లాడుతూ ఉంది,

"శ్రీనివాస్ చక్రవర్తి గారు 4 సంవత్సరాల క్రితం వరకు మీరు ఒక సాధారణ బైక్ మెకానిక్ అప్పుడప్పుడు కొన్ని బైక్ రేస్ లో పాల్గొనడం అంతే తప్ప ఒకేసారి ఇంత సక్సెస్ కీ ఎలా చేరుకో గలిగారు " అని అడిగింది.

దానికి శ్రీనివాస్ నవ్వుతూ "దీనికి కారణం ముగ్గురు నా మేనేజర్ అంతేకాకుండా నా బెస్ట్ ఫ్రెండ్ చరణ్, అంతేకాకుండా ఇంకో స్పెషల్ పర్సన్ తన గురించి నేను ఎలాంటి విషయాలు చెప్పలేను, నా స్పాన్సర్ ప్రమోద్ సిన్హా, వీలు లేక పోయి ఉంటే నేను ఇంకా బైక్ మెకానిక్ గానే ఉండే వాడిని" అని చెప్పాడు దాంతో స్వీటీ శ్రీని చెప్పిన ఆ స్పెషల్ పర్సన్ తనే అని తెలుసుకుంది, అంటే శ్రీని తనని ఎప్పటికీ మరిచిపోలేదు అని అర్థం అయ్యింది.

ఆ తరువాత "మీరు ఎప్పుడు గెలవాడానికి ఏమీ చేస్తారు " అని అడిగింది యాంకర్ దానికి శ్రీని "నేను బైక్ స్టార్ట్ చేసి లాప్ చివర లక్ష్యం వైపు చూడను అక్కడ రేస్ తరువాత నాకూ ఇచ్చే ట్రోఫీ గెలిచే దృశ్యం మాత్రమే చూస్తా అంతే" అని చెప్పాడు అప్పుడు శ్రీని స్పాన్సర్ ప్రమోద్ సిన్హా వచ్చి మీడియా ముందు శ్రీని నీ కౌగిలించుకున్నాడు "మా బిజినెస్ రిలేషన్స్ నీ మేము ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్ గా మార్చుకోబోతున్నాం మా అమ్మాయి లాస్య నీ శ్రీని కీ ఇచ్చి పెళ్లి చేయబోతున్నా" అని చెప్పాడు ఇది జరిగే లోపే స్వీటీ తన pregnancy గురించి చరణ్ కీ మెసేజ్ చేసింది ఎప్పుడైతే ప్రమోద్ తన కూతురి పెళ్లి శ్రీని తో అన్నాడో అప్పుడు స్వీటీ మెసేజ్ డేలిట్ చేయబోయేంది కానీ కుదరలేదు ఇక్కడ ప్రమోద్ చెప్పిన విషయం విని శ్రీని కూడా షాక్ లో ఉన్నాడు.

అప్పుడే కొంతమంది రేసర్స్ శ్రీని తో ఒక friendly రేస్ కీ పిలిచారు కానీ శ్రీని మెదడులో స్వీటీ జ్ఞాపకాలు తను కొని వస్తున్నాయి మొదటి సారి తనని చూసిన రోజు మొన్న చరణ్ పెళ్లి లో తనకు పెట్టిన ముద్దు అని గుర్తుకు వస్తున్నాయి అయిన అలాగే బైక్ నడుపుతూ వెళ్తుండగా లాప్ finishing దగ్గరికి రాగానే తను ట్రోఫీ తీసుకుంటున్నటు కనిపించడం లేదు తన ముందు నుంచి స్వీటీ వెళ్తున్నటు కనిపించింది దాంతో బ్రేక్ వేస్తే బైక్ జారీ ఎగిరి పడ్డాడు డైరెక్ట్ గా వెళ్లి ఆడియన్స్ gallery లో ఉండే బెస్మేంట్ కీ తగులుకున్నాడు.

శ్రీని అలా అనుకోకుండా ఆక్సిడేంట్ కీ గురి అవ్వడం వల్ల చరణ్ వెంటనే మెడికల్ టీం నీ alert చేశాడు వాలు వచ్చి శ్రీని నీ అంబులెన్స్ లోకి ఎక్కిస్తు ఉండగా తనకీ తన గతం తాలూకు జ్ఞాపకాలు తనుకొని వస్తున్నాయి.

(4 సంవత్సరాల క్రితం బెంగళూరు)

ప్రమోద్ సిన్హా కంపెనీ కీ లీగల్ advisor గా ఉండేవాడు పార్థసారథి తన దెగ్గర అసిస్టెంట్ గా స్వీటీ, శ్యామ్ పనిచేసేవారు, ప్రమోద్ కంపెనీ CA గా పని చేసేవాడు చరణ్ ఒక రోజు ఒక బిజినెస్ డీల్ కీ సంబంధించిన చెక్ బౌన్స్ కేసు మీద ప్రమోద్, పార్థసారథి, చరణ్ కోర్టు లో వెయిటింగ్ స్వీటీ ట్రాఫిక్ లో ఇరుకుంది తన దెగ్గర ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి చరణ్ కంగారు గా తనకు ఫోన్ చేసాడు స్వీటీ తన పరిస్థితి చెప్పింది ఇంకో అర గంట లో స్వీటీ ఇక్కడికి రావాలి అంటే తనని తీసుకొని రాగలిగేది ఒకడే దాంతో శ్రీని కీ ఫోన్ చేసి మొత్తం చెప్పాడు దాంతో శ్రీని "అరగంట లో తను కోర్టు లో ఉంటుంది" అని ఫోన్ పెట్టేసి తన గ్యారేజ్ ఓనర్ అయిన షఫీ తో బైక్ ఇప్పించుకోని స్వీటీ ఉన్న అడ్రస్ కీ వెళ్లి తనకు ఫోన్ చేసాడు అప్పుడు స్వీటీ, శ్రీని మొదటి సారి ఒకరినొకరు చూసుకున్నారు స్వీటీ కీ శ్రీని నీ చూడగానే ఏదో తెలియని ట్రాన్స్ లోకి వెళ్లింది అప్పుడు శ్రీని హార్న్ కొడితే ఈ లోకం లోకి వచ్చింది అప్పుడు బైక్ ఎక్కింది అంతే బైక్ నీ చిరుత వేగంతో వెళ్లడం మొదలు అయ్యింది భయం తో శ్రీని నీ గట్టిగా పట్టుకుని కూర్చుంది, శ్రీని వేగంగా రాంగ్ రూట్ లోకి వెళ్లడం వల్ల ఒక కార్ అదుపు తప్పి పోల్ కీ తగులుకొని ఆగింది దాని కూడా పట్టించుకోకుండా అనుకున్న టైమ్ కీ కోర్టు కీ వెళ్లారు.

స్వీటీ వచ్చిన విషయం పక్కన పెట్టి తను లేట్ గా వచ్చింది అనే సాకు పట్టుకొని తనని తిట్టడం మొదలు పెట్టాడు పార్థసారథి "నువ్వు ఎప్పటికీ లాయర్ కాలేవు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే" అని అర్వడం మొదలు పెట్టాడు అప్పుడే చరణ్ శ్రీని తో "ఏమీ రా Duke లో వచ్చావు నీ స్కూటీ ఎక్కడ" అని అడిగాడు ఆ వెనుక షఫీ శ్రీని స్కూటీ మీద తన గర్ల్ ఫ్రెండ్ తో వచ్చి తన బైక్ తను తీసుకొని వాడి స్కూటీ వాడికి ఇచ్చి వెళ్లిపోయాడు, కానీ శ్రీని ఇవి ఏమీ పట్టించుకోవడం లేదు పార్థసారథి స్వీటీ నీ తీడుతు ఉంటే నచ్చలేదు దాంతో చరణ్ తో ఒక ఐడియా చెప్పి పార్థసారథి కోర్టు టైమ్ కీ రాకుండా అతని కాబిన్ లో లాక్ చేశారు అప్పుడు శ్యామ్, స్వీటీ అయోమయానికి గురయ్యారు దాంతో చరణ్ స్వీటీ దగ్గరికి వెళ్లి కావాలి అని చిన్న గొడవ పెట్టుకున్నాడు దాంతో స్వీటీ కీ కోపం వచ్చి పార్థసారథి బదులు తను కేసు వాదించి గెలిచింది దాంతో అందరూ హ్యాపీ అయ్యారు కాకపోతే ఈ విషయం తెలిసి పార్థసారధి స్వీటీ నీ internship నుంచి తీసేశారు స్వీటీ టాలెంట్ గుర్తించిన జడ్జ్ తన firm లో ఒక జాబ్ ఆఫర్ ఇచ్చారు హేగ్డే అసోసియేట్స్ అంటే ఒక బ్రాండ్ అందులో స్వీటీ కీ జాబ్ వచ్చింది.

ఇది అంతా జరగడం తో స్వీటీ చరణ్, కీ శ్రీని కీ పార్టీ ఇవ్వాలి అని తీసుకొని వెళ్లింది అప్పుడు చరణ్ నీ అడిగింది ఎవరూ తను అని "వీడు నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ మేము ముద్దు గా శ్రీని అని పిలుస్తాం రేయి బావ నీకు ఒక బంపర్ ఆఫర్ రా మా బాస్ కొత్త గా స్పోర్ట్స్ స్పాన్సర్ షిప్ పెడుతున్నాడు మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్లకు పేద వాళ్లకు సహాయం కోసం చేస్తున్నాడు" అని చెప్పాడు దానికి శ్రీని స్వీటీ వైపు చూసి "నీకు హెల్ప్ చేయడం వల్ల నాకూ ఒక మంచి జరిగింది ఇక నుంచి నువ్వు నా లక్కీ చార్మ్ అనుకుంటా" అన్నాడు దానికి స్వీటీ నవ్వి "అలా అయితే మీ వల్ల కూడా నాకూ మంచి జరిగింది నా 1st కేసు నేను గెలిచాను అయితే నాకూ కూడా నువ్వు లక్కీ చార్మ్" అని చెప్పింది దానికి అందరూ నవ్వుతూ ఉన్నారు.

(ప్రస్తుతం)

స్వీటీ తన laptop లో ఏదో పని చేసుకుంటూ ఉండగా వాళ్ల అక్క కొడుకు వచ్చి పిన్ని రా పిన్ని ఆడుకుందాం అని పిలిచాడు వాడు ఫుట్బాల్ ఆడుతూ కోడితే అది కరెక్ట్ గా స్వీటీ కీ కడుపు లో తగిలింది ఇది అంతా చూసిన సంధ్య వెంటనే స్వీటీ నీ కార్ లో హాస్పిటల్ కీ తీసుకొని వెళ్లింది.

హాస్పిటల్ కీ వెళుతున్న దారి లో స్వీటీ కీ కొంచెం నొప్పిగా బాధ గా ఉంది దాంతో పాటు కడుపు లో ఉన్న తన బిడ్డ కు ఏమన్న అవుతుంది అన్న భయం వేసింది తనకు ఎప్పుడు భయం వేసిన శ్రీని చెప్పిన ఒక విషయం గుర్తుకు వస్తుంది.

స్వీటీ లాయర్ గా ఎదుగుతున్న రోజులు అవి అప్పుడు తనతో పాటు హేగ్డే అసోసియేట్స్ లో పని చేసే రాకేష్ తో లవ్ లో ఉండేది స్వీటీ, రాకేష్ కొంచెం ఫాస్ట్ వాడికి ఎప్పుడు పార్టీ లాంగ్ డ్రైవ్ ఇలా స్వీటీ ఈ కాలం అమ్మాయి అయిన తనకు కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి చిన్న చిన్న రొమాన్స్ ఓకే కానీ పెళ్లి కీ ముందు ఏమీ అడ్వాన్స్ కాకుడదు అన్నది తన పాలసీ రాకేష్ ఎప్పుడు తనకి గిఫ్ట్ ఇవ్వడం దాని ఆసరాగా తీసుకుని తన ఒంటి పైన చెయ్యి వేయడం చాలా ఇబ్బంది గా అనిపించేది ఒక రోజు కోర్టు దెగ్గర కార్ డెలివరీ చేయడానికి వచ్చి అలా స్వీటీ నీ కలవడానికి వెళ్లాడు శ్రీని అప్పుడు రాకేష్ తో మాట్లాడుతూ వాడు పక్కన ఉంటే తను పడుతున్న ఇబ్బంది అని చూశాడు శ్రీని దాంతో వెళ్లి స్వీటీ నీ పలకరించాడు, దాంతో స్వీటీ కూడా రాకేేష్ నీ పరిచయం చేసింది ఆ తర్వాత శ్రీని కావాలి అని "హే స్వీటీ మీ అక్క కొడుకు నీ హాస్పిటల్ కీ తీసుకొని వెళ్లాలి అని pickup చేసుకొ అని మెసేజ్ చేశావ్ కదా వెళ్లదామా" అని కన్ను కొట్టాడు దాంతో స్వీటీ కీ అర్థం అయ్యి రాకేష్ నీ వదిలించుకోని శ్రీని తో పాటు బస్ లో వెళ్లుతు "Thank God నువ్వు కనుక రాకపోయి ఉంటే వాడు నా తల తినేసేవాడు" అని నవ్వుతుంది

శ్రీని : వాడు నీకు కరెక్ట్ కాదు

స్వీటీ : ఎలా చెప్తున్నావ్

శ్రీని : వాడు నీకు నిజంగా నచ్చితే వాడితో ఇంకా ఇంకా టైమ్ స్పేండ్ చేయాలి అనిపించాలి అంతే కానీ ఇలా తప్పిచుకోవాలి అని చూడవు

స్వీటీ : నువ్వు చెప్పేది కరెక్ట్ ఏ వాడి తో చాలా irritation వస్తుంది అయిన కూడా బాయ్ ఫ్రెండ్ కదా అని క్లోజ్ గా ఉంటే బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు

అలా ఇద్దరు మాట్లాడుతూ ఉంటే శ్రీని స్టాప్ వచ్చి దిగుతున్నాడు తనతో పాటు స్వీటీ కూడా దిగింది అప్పుడు తనని తీసుకొని తను రెగ్యులర్ గా వెళ్లే కేఫ్ కీ వెళ్లాడు శ్రీని లోపలికి వెళ్లుతు "మిర్జా చాచా ధో కటింగ్ ఏక్ సమోసా మిర్చి కాన్సిల్" అన్నాడు దానికి ఆ కేఫ్ ఓనర్ సరే అని సైగ చేశాడు, అప్పుడు స్వీటీ అడిగింది "ఇప్పుడు వాడిని ఎలా వదిలించుకోవాలి నాకూ చాలా భయం గా ఉంది నేనే వాడికి propose చేశా ఇప్పుడు నేనే breakup చెప్పితే నేను వాడిని చీట్ చేశా అనుకుంటారు " అని మొహం దిగులుగా పెట్టింది అప్పుడు "ఒక్కటి గుర్తు పెట్టుకో స్వీటీ నువ్వు చేసేది తప్పు కాదు అని నీకు తెలిసినప్పుడు నిన్ను నువ్వు నమ్మినప్పుడు ఎవరి గురించి ఆలోచించోదు be you to yourself be brave to your heart if you are stood stronger from inside then you will be always stronger" అని చెప్పాడు దాంతో స్వీటీ లో కొంచెం ధైర్యం పెరిగింది.

స్వీటీ : అవును నేను వాడితో హ్యాపీగా లేను అని నీకు ఎలా అర్థం అయ్యింది

శ్రీని : నీకు నచ్చినవాడు నీ ఎదురుగా పక్కన ఉంటే నీ కళ్లలో ఒక మెరుపు ఉంటుంది నీ గుండెల్లో చిన్న vibration ఉంటుంది అది నీలో నాకూ వాడితో ఉన్నపుడు కనిపించలేదు

స్వీటీ : మరి మణిరత్నం సినిమా లో రొమాన్స్ గురించి చెప్తున్నావు

శ్రీని : ఇప్పుడు ఎవరో ఎందుకు నేను నీ ఫ్రెండ్ నీ నాతో మాట్లాడడం నీకు comfort గా ఉంటుంది అంతే కానీ ఇప్పుడు నేను నిన్ను టచ్ చేయగానే నీకు ఫీలింగ్ మారదు కదా అని స్వీటీ చెయ్యి పట్టుకున్నాడు సడన్ గా స్వీటీ బాడి కీ కరెంట్ పాస్ అయ్యినట్లు అయ్యింది అప్పుడు తన గుండెల్లో నిజంగానే ఏదో vibration వచ్చింది కానీ తన మనసు నీ అదుపు చేసుకొని టి తాగి వెళ్లి పోయింది.

(ప్రస్తుతం)

తన కడుపు మీద చెయ్యి పెట్టి "బుజ్జి కన్న అమ్మ నిన్ను ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుతుంది ఈ సారి అమ్మ నీ క్షమించు నీకు నేను ఎప్పుడు ఇంక ఏ problem రానివ్వను" అని చెప్పింది దాంతో కొంచెం నొప్పి తగ్గింది ఆ తర్వాత హాస్పిటల్ లో చెక్ అప్ అయ్యాక, అను నీ కలిశారు "భయపడాల్సిన అవసరం లేదు అంతా బాగానే ఉంది కానీ ఇంకో సారి ఇలా అయితే రిస్క్ అవ్వచ్చు" అని చెప్పింది దానికి స్వీటీ సరే అని తల ఆడించింది ఆ తర్వాత బయటికి వస్తుంటే శ్రీనికి ఆక్సిడేంట్ అయ్యింది అన్న విషయం తెలిసింది దాంతో వెంటనే చరణ్ కీ ఫోన్ చేసింది కానీ switch off అని వచ్చింది దాంతో సంధ్య నీ ఇంటికి వెళ్లమని చెప్పి తను శ్రీని వెళ్లే కేఫ్ కీ వెళ్లింది కేఫ్ లో ఎవ్వరూ లేరు అప్పుడు కేఫ్ ఓనర్ స్వీటీ నీ గుర్తు పట్టి పలకరించాడు తనకి టీ తీసుకొని రావడానికి లోపలికి వెళ్లుతుంటే "మిర్జా చాచా ధో కటింగ్ ఏక్ సమోసా మిర్చి కాన్సిల్" అని వెనుక నుంచి వినిపించింది దాంతో స్వీటీ శ్రీని అనుకోని వెనకు తిరిగి చూస్తే శ్యామ్ ఉన్నాడు, అప్పుడు శ్యామ్ వచ్చి స్వీటీ తో "అలాగే కదా నువ్వు ఆర్డర్ ఇచ్చేది నువ్వు ఎప్పుడు వచ్చిన" అని మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు పైకి లేచి వచ్చి స్వీటీ ముందు నిలబడి ఒక రోజా పువ్వు ఇచ్చి "I love you స్వీటీ" అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీని అది చూసి తన చేతిలో ఉన్న bouquet కింద పడేసి అలాగే చూస్తూ ఉన్నాడు.

అప్పుడు కేఫ్ లో పని చేసే కుర్రాడు శ్రీని గుర్తు పట్టి "భయ్యా ఎలా ఉన్నావు" అని అడిగాడు దానికి అటు వైపు తిరిగిన స్వీటీ శ్రీని నీ చూసి పరిగెత్తుతూ వెళ్లి గట్టిగా కౌగిలించుకోన్ని ఏడుస్తు ఉంది.​
Next page: Update 04
Previous page: Update 02