Update 06

( పెళ్లి)

(ఫ్రెండ్స్ ఈ కథ నీ నేను చండీగఢ్ బ్యాక్ డ్రాప్ లో రాస్తున్నా అప్పుడప్పుడు మన సౌకర్యం కోసం అంతా తెలుగు లోనే రాస్తున్న ఈ కథ లో ఎలాంటి adult content ఉండదు ప్యూర్ లవ్ స్టోరీ ఇంక కథ లోకి వెళితే)

చండీగఢ్ ఎయిర్ పోర్ట్ లో ఫ్లయిట్ దిగి కాబ్ లో ఇంటికి వెళ్తున్నారు విద్య, వినయ్ పేరు కీ కాబ్ లో పకపక నే కూర్చుని ఉన్న విద్య నుంచి దూరం గా జరిగి కూర్చున్నాడు వినయ్, విద్య ఆ దూరం తొందరగా కరిగి పోవాలి అని ఎదురు చూస్తుంది అప్పుడు కార్ కిటికీ నుంచి అలా బయటకు చూసింది చాలా అందమైన సిటీ అంత అందమైన సిటీ తను ఎప్పుడు చూడలేదు అనే కంటే తను తన ఊరు దాటి ఎప్పుడు బయటికి రాలేదు అని అనడం లో న్యాయం ఉంది ఎప్పుడు తన సొంత ఊరు దాటి మహా అయితే తీర్థ యాత్రకు తీసుకొని వెళ్లే వాలు తన అమ్మ నాన్న అప్పుడే కార్ ఒక మంచి posh కాలనీ లో ఆగింది వినయ్ కాబ్ వాడికి డబ్బులు ఇస్తూ ఉంటే విద్య మొత్తం కాలనీ నీ చూస్తూ ఉంది అలాంటి ఒక posh కాలనీ తన జీవితంలో తను చూడలేదు అప్పుడు వినయ్ తన వైపు చూసి చిటికె వేసి లోపలికి పద అని సైగ చేశాడు అప్పుడే వినయ్ పక్క ఇంట్లో ఉండే ఒక సర్దార్జీ అలా వాకింగ్ కోసం బయటికి వచ్చాడు అప్పుడు వినయ్ నీ పలకరించాడు అప్పుడు "ఎవరూ ఆ అమ్మాయి" అని అడిగాడు, దానికి వినయ్ "నా భార్య" అని బదులు ఇచ్చాడు విద్య కూడా ఎంతో మర్యాదగా ఆయనకు నమస్కారం పెట్టింది అంతే ఆ సర్దార్జీ మొత్తం కాలనీ అంతటికి వినిపించేలా "ఏంటి వినయ్ నీ పెళ్ళి కీ పిలవలేదు" అని అన్నాడు దాంతో ఎదురింటి వాళ్లు పక్క ఇంటి వాళ్లు అంత వినయ్ ఇంటి ముందు కీ చేరుకున్నారు అందరూ ఒకటే ప్రశ్న పెళ్లి కీ ఎందుకు పిలవలేదు అని వినయ్ మనసులో "నా పెళ్లి అని నాకూ తెలిస్తే నే కదా మీకు చెప్పడానికి" అని అనుకున్నాడు, కానీ బయటికి మాత్రం నవ్వుతూ ఉన్నారు ఆ సర్దార్జీ భార్య వినయ్ విద్య ఇద్దరికి దిష్టి తీసి లోపలికి పంపింది విద్య కీ ఒక్కసారిగా తన సొంత ఊరు ఫీలింగ్ వచ్చింది.

కానీ ఇంటి లోపలికి వెళ్లగానే బయటి వాతావరణం కీ లోపల చాలా తేడా ఉంది అంత పెద్ద ఇంట్లో మొత్తం నిశబ్దం రాజ్యం ఏలుతుంది ఆ నిశబ్దం విద్య కీ కొత్తగా ఉంది ఎందుకంటే తనది చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబం ఎప్పుడు ఇంట్లో బాబాయ్ పిల్లలు, తన అత్త పిల్లలు అందరితో కలిసి అల్లరి చేస్తూ సందడిగా ఉండే తన ఇంటి వాతావరణం కీ ఈ ఇల్లు చాలా తేడా ఉంది అప్పుడు వినయ్ వచ్చి "నీ రూమ్ అది నా రూమ్ పైన ఉంది ఇంక అది కిచెన్ దాంట్లో మధ్య లో లైన్ వేస్తా నీ సైడ్ వంట నువ్వు చేసుకో నా సైడ్ వంట నేను చేసుకుంటా ఇంట్లో మాత్రం ఫ్రీ గా ఉండు నా రూమ్ లోకి మాత్రం రాకూడదు ఈ 6 నెలల పాటు ఏదైన కోర్సు చేస్తావో లేదా ఇంట్లోనే ఉంటావో నీ ఇష్టం కానీ నాకూ ఇబ్బంది పెట్టోదు"అని చెప్పి పైన తన రూమ్ కీ వెళ్లాడు విద్య కూడా తన రూమ్ లోకి వెళ్లి బాత్రూమ్ లో షవర్ కింద తడుస్తూ రెండు వారాల క్రితం వరకు తన జీవితం ఎలా ఉండేదో ఊహించుకుంటు ఉంది.

(రెండు వారాల క్రితం)

డిగ్రీ లో కాలేజీ టాపర్ అయ్యింది విద్య తనకి పెద్ద కళలు లేవు తన కుటుంబం తో కలిసి అలాగే సంతోషం గా ఉండాలి అని కాకపోతే కొన్ని రోజులు తను ఏమీ చేసిన ఎవరూ పట్టించుకోకుడదు తన బెస్ట్ ఫ్రెండ్ పింకీ లాగా posh గా మాడర్న్ డ్రస్లు వేసుకొని ఒక కార్ లో సొంతం గా షికారు కు వెళ్లాలి అని అనుకుంది దాంతో పాటు తన కుటుంబం తనకి చాలా ముఖ్యం, ఆ మరుసటి రోజు ఉదయం తను లేచి చూస్తే ఇంట్లో హడావిడి గా ఉంది ఎందుకంటే ఆ రోజు విద్య కీ నిశ్చితార్థం అన్నారు తనకి చెప్పకుండా ఇలా పెళ్లి నిశ్చయించడం తనకి అసలు నచ్చలేదు కానీ తన కుటుంబం లో అందరూ సంతోషంగా ఉండడం చూసి తను కొంచెం ఆలోచిస్తూ ఉంది అప్పుడే తన చెల్లి వచ్చి "అక్క బావ ఫోటో కావాల" అని ఏడిపిస్తూ ఉంది కానీ విద్య అది ఏమీ పట్టించుకోకుండా ఉంది ఆ తర్వాత వాళ్ల పిన్ని, అమ్మ, అత్త అందరూ వచ్చి తనని రెడీ చేసారు ఇంతలో అబ్బాయి వాళ్లు వచ్చారు అని అందరూ కిందకి వెళ్లారు అప్పుడు విద్య దొంగ చాటుగా కిటికీ నుంచి కిందకు చూసింది అప్పుడు కార్ లో నుంచి దిగాడు వినయ్ ఒకసారి వినయ్ నీ చూసి షాక్ అయ్యింది అంతే గుండె లో ఆనందం పొంగింది విద్య ఆ నిశ్చితార్థం అయ్యాక వినయ్ తన జీవితంలోకి రావడం ఆనందం గా ఉంది అప్పుడే వినయ్ విద్య కీ ఫోన్ చేసి రేపు కళ్లుదాం అని అడిగాడు విద్య గుడికి రమ్మని చెప్పింది ఇద్దరు గుడి లో కలిశారు.

అప్పుడు వినయ్ ఏమీ చెప్తాడు అని ఆలోచిస్తూన్న విద్య కీ వినయ్ సడన్ గా "నాకూ పెళ్లి ఇష్టం లేదు నాకూ అసలు పెళ్లి అంటేనే ఇష్టం లేదు నేను పెళ్లి చూపులు అంటే రాను అని మా జేనాన్న హార్ట్ ఎటాక్ వచ్చినట్లు నాటకం ఆడి నను పిలిచి బలవంతంగా నిశ్చితార్థం చేశారు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లి నేను నీతో misbehave చేశాను అని చెప్పు తాగుబోతు అని చెప్పు మీ వాళ్లు పెళ్లి కాన్సిల్ చేస్తారు "అని చెప్పాడు వినయ్ చెప్పింది విని విద్య కీ బ్రైన్ ఆగిపోయింది దాంతో కొంచెం తెరుకోని "చూడండి మీ ఫ్యామిలీ కీ మా ఫ్యామిలీ కీ ఊరి లో మంచి పేరు ఉంది కాబట్టి ఇలా చేస్తే పెళ్లి ఆగినందుకు మా ఫ్యామిలీ లో వేరే ఎవరికి పెళ్లి కాదు మీ కారెక్టర్ చెడ్డది అని తెలిస్తే మీ నాన్న పరువు పోతుంది కాబట్టి ఏమీ చేయాలో నువ్వే చెప్పు" అని అడిగింది దానికి వినయ్ తన ఫ్రెండ్ ఒక లేడి లాయర్ కీ ఫోన్ చేసాడు జరిగింది చెప్పి రమ్మని చెప్పాడు అప్పుడు ఆమె వచ్చి ఇద్దరికి రెండు డాక్యుమెంట్ లు ఇచ్చి "మీరు ఇద్దరు ఫ్యామిలీ pressure మీద పెళ్లి చేసుకుంటున్నారు అని మీకు పెళ్లి ఇంటరెస్ట్ లేదు అని పెళ్లి తరువాత ఎలాంటి మానసిక లేదా శారీరక సంబంధం మా మధ్య ఉండదు 6 నెలల తరువాత విడాకులు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఇద్దరం ఇష్ట పూర్వకంగా ఈ అగ్రిమెంట్ లో సంతకం పెడుతున్నాం" అని రాసి ఉంది అది చూసి వినయ్ ఏ మాత్రం ఆలోచించకుండా సంతకం పెట్టాడు దాంతో విద్య కూడా వేరే దారి లేక సంతకం పెట్టింది అలా ఒక వారం కీ వాళ్ల పెళ్లి అయ్యింది మొదటి రాత్రి రోజు కూడా విద్య బెడ్ పైన పడుకుంటే వినయ్ పక్కన సోఫా లో పడుకున్నాడు.

ఇలా ఆలోచిస్తున్న విద్య ఫోన్ మొగడంతో బయటికి వచ్చింది అప్పుడు విద్య వాళ్ల నాన్న ఫోన్ చేసాడు "బుజ్జి మీ ఇల్లు ఎక్కడ అమ్మ" అని అడిగాడు, "ఇది sector 16 అంటారు నాన్న ఇక్కడ గురుమీత్ రెసిడెన్షియల్స్ నాన్న ఎందుకు నాన్న" అని అడిగింది, "ఏమీ లేదు రా నిను చూడకుండా కష్టం గా ఉంది అందుకే బావ గారు మేము అంతా కలిసి వస్తున్నాం ఎయిర్ పోర్ట్ లో బయలుదేరాం" అని చెప్పాడు అది విని విద్య షాక్ అయ్యింది వినయ్ పెట్టిన మొదటి రూల్ ఆ ఇంటికి చుట్టాలు ఎవరూ రాకూడదు.

ఎప్పుడైతే వాళ్ల అమ్మ నాన్న అందరూ వస్తున్నారు అని ఫోన్ చేశారో అప్పుడు విద్య కీ ఏమీ చేయాలో తెలియక రెడీ అయ్యి బయటకు వస్తే అప్పుడే వినయ్ తన రూమ్ నుంచి కిందకు దిగుతు వస్తున్నాడు విద్య నీ "నాకూ ఆఫీస్ కీ టైమ్ అయ్యింది నేను వెళ్లాలి ఇంట్లో సరుకులు లేవు అనుకుంట మన కాలనీ నుంచి అలా ముందుకు వెళితే సూపర్ మార్కెట్ ఉంటుంది ఏమీ కావాలి అన్న తెచ్చుకో నీకు కార్ డ్రైవింగ్ వచ్చు కదా కార్ ఉంటుంది వాడుకో" అని చెప్పి గ్యారేజ్ లో ఉన్న తన బైక్ తీసుకొని ఆఫీసు కీ వెళ్లిపోయాడు వినయ్ దాంతో విద్య కొంచెం ఊపిరి పీల్చుకుంది వినయ్ అలా ఆఫీస్ వెళ్లగానే విద్య ఫ్యామిలీ, వినయ్ ఫ్యామిలీ అంతా ఇంటికి వచ్చారు అసలు నిజానికి వినయ్ అక్కడ 7 సంవత్సరాల నుండి పనిచేస్తున్న తన అమ్మ నాన్న నీ ఏ రోజు తన ఇంటికి రానివ్వలేదు అందుకే మొదటిసారి తన కొడుకు ఇంటికి రావడంతో ఇళ్లు మొత్తం చూసి మురిసి పోయారు, ఇలా ఇళ్లు మొత్తం సందడి సందడిగా మారింది దాంతో విద్య లో కొంచెం ధైర్యం పెరిగింది ఆ తర్వాత తన ఫోన్ లో ఫేస్ బుక్ చూస్తూ ఉంటే తనకి ఒక నోటిఫికేషన్ కనిపించింది దాంతో వెంటనే పక్కింటి సర్దార్జీ దగ్గరికి వెళ్లి "సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్లాలి ఆంటీ నీ తోడు పంపిస్తారా" అని అడిగింది దానికి ఆయన కూడా వాళ్ల భార్య నీ విద్య తో సూపర్ మార్కెట్ కీ పంపారు.

కార్ లో వెళ్తున్నంత సేపు సూపర్ మార్కెట్ లో తిరుగుతున్నంత సేపు ఆమె బాగానే మాట్లాడింది కానీ మాటిమాటికి "ముండియా (పంజాబీ లో అమ్మాయి అని అర్థం)" అని పిలుస్తుంటే విద్య కీ చిరాకుగా అనిపించింది అంటే దాని అర్థం తెలియక ఏదో తీడుతుంది అనుకుంది ఆ తర్వాత ఇంటికి వెళ్లి అందరితో సరదాగా సాయంత్రం వరకు గడిపింది, ఇక్కడ వినయ్ పరిస్థితి వేరేగా ఉంది ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు ఇష్టం లేని ఉద్యోగం ఇష్టం లేని లైఫ్ కాకపోతే ఇంకో రెండు నెలల తరువాత ఆ కంపెనీ తో కాంట్రాక్ట్ అయిపోతుంది దాంతో పాటు ఇప్పుడు తను చేస్తున్న ప్రాజెక్ట్ లో తనకి 40% partnership వస్తుంది అందుకే ఆ ప్రాజెక్ట్ ఎలాగైనా పూర్తి చేయాలని ఉన్న స్టాఫ్ నీ 4 నెలల నుంచి పని రాక్షసుడు లాగా పీడిస్తున్నాడు రెండు వారాలు తను ఆఫీస్ కీ రాక పోయేసరికి ఎక్కడి పని అక్కడే ఆగిపోయింది అసలు trail submission కూడా అవ్వలేదు దాంతో తన స్టాఫ్ సాలరీ సగం కట్ చేసి ఆ submission తనే చేశాడు ఆ తరువాత ఎవరికి రెండు నెలల పాటు సెలవు ఉండదు అని తేల్చి చెప్పాడు ఎవరూ ఎవరూ అయితే పని ఏగోటారో వాళ్ళని పని పూర్తి అయ్యే వరకు రాత్రి ఆయన సరే అక్కడే ఉండి పని చేయాలి అని రూల్ పెట్టాడు.

వినయ్ ఎవరితో ఎంత కఠినంగా ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ శ్రీ రామ్ తో మాత్రం ఎప్పుడు సరదాగా ఉంటాడు వాడితోనే అని పంచుకుంటాడు ఆ రోజు ఆఫీస్ అవ్వగానే హవేలి అనే హోటల్ లో మేనేజర్ గా పనిచేసే శ్రీ రామ్ దగ్గరికి వెళ్లి కలిశాడు ఇద్దరు కొద్ది సేపు మాట్లాడుకున్నాక "జీవితం లో పెళ్లి చేసుకోను అన్నావు ఇప్పుడు ఎమ్ అయ్యింది నీ దరిద్రం కొద్ది నువ్వే పెళ్లి చేసుకున్నావు సరే కానీ ఎప్పుడు పరిచయం చేస్తావ్ తనని" అన్నాడు దానికి వినయ్ "సండే ఇంటికి రా నువ్వు మమత రండి పరిచయం చేస్తా" అన్నాడు ఆ తర్వాత ఇంక ఇంటికి వెళ్లాడు లోపలికి వెళ్లగానే తనకి ఇష్టం అయిన చేపల పులుసు వాసన తగిలింది దాంతో వినయ్ కొంచెం కూల్ అయ్యాడు అంతే కిచెన్ లోకి వెళ్లి రెండు పీస్ లు ప్లేట్ లో వేసుకొని ఎంజాయ్ చేస్తూ తిన్నాడు అప్పటి వరకు ఇంట్లో పరిస్థితి ఏమాత్రం పట్టించుకో లేదు తనకి నచ్చింది తన కళ్ల ముందు ఉంటే ప్రపంచం తో సంబంధం లేకుండా బ్రతికేస్తాడు వినయ్ ఆ తర్వాత అప్పుడు చూశాడు తన ఇల్లు మొత్తం exhibition గ్రౌండ్ లాగా అంత మంది తో నిండిపోయింది దాంతో అంత సేపు ఉన్న ప్రశాంతత మొత్తం పోయింది దాంతో చిరాకు గా తన రూమ్ లోకి వెళ్ళాడు అప్పుడు విద్య బట్టలు మార్చుకుంటు కనిపించింది దాంతో కొద్ది సేపు బయట ఉన్నాడు ఆ తర్వాత విద్య బయటికి భయపడుతూ వచ్చింది.

" సారీ నాకూ తెలియదు వాళ్లు వస్తున్నారు అని సడన్ మార్నింగ్ ఎయిర్ పోర్ట్ లో ఉన్నాము అడ్రస్ చెప్పు అంటే ఇంక ఇలా వచ్చేసారు" అని చెప్పింది అ తరువాత ఆ ఆంటీ అన్న పదం గురించి అడిగింది దానికి వినయ్ అర్థం చెప్తే విద్య కొంచెం cool అయ్యింది ఇంకో రెండు రోజులు అమ్మ నాన్న వాలు ఉంటారు అనింది, దాంతో వినయ్ తన ఫోన్ తీసి రేపు ఉదయం 5 గంటల ఫ్లయిట్ కీ టికెట్ లు బుక్ చేసి వాళ్ల నాన్న కీ పంపించాడు అది చూసి ఆయన షాక్ అయ్యి వినయ్ తో మాట్లాడడానికి వెళ్లాడు "రేయ్ ఏంటి రా ఇది కనీసం రెండు రోజులు అయిన ఉండకుండా వెళ్లిపో అంటున్నావు ఎప్పుడు రానీయకుండా ఇపుడు వస్తే వెనకు పంపుతున్నావు" అని అన్నాడు దానికి వినయ్ "ఏదో పెద్ద నా మీద ప్రేమ ఉన్నట్లు నటించింది చాలు ఈ నెల బ్యాంక్ లోన్ కట్టడం లేట్ అయ్యింది అనే కదా నీ ఏడుపు రేపు కట్టేస్తా ఇంకో సారి నాకూ చెప్పకుండా వస్తే చంపేస్తా నువ్వు మీ నాన్న ఉన్న ఆస్తి మొత్తం దాన ధర్మాలు చేశారు నాకూ తినడానికి తిండి లేక చేశారు పేరు కీ జమీందారు కుటుంబం కాని పైన ఏమీ లేదు నీ వల్ల నా కలలు అని చంపుకొని బతుకుతున్నా మళ్లీ ఇక్కడికి రావ్వోదు ఇక్కడ నను ప్రశాంతంగా ఉండనివ్వు "అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు.

రాత్రి 12 కీ విద్య వినయ్ రూమ్ కొట్టి లేపింది వినయ్ నిద్ర మబ్బులో లేచి డోర్ తీసి చూస్తే అందరూ హ్యాపీ బర్త్ డే అని అరిచారు (పొద్దున ఫేస్ బుక్ లో చూసిన విషయం ఇదే) అప్పుడు వినయ్ అందరినీ చూసి విద్య నీ గట్టిగా లాగి కొట్టి వెళ్లి పడుకున్నాడు,అది చూసి విద్య కుటుంబం వినయ్ అమ్మ నాన్న అంతా షాక్ అయ్యారు పెళ్లి అయిన వారం కీ తన కూతురిని ఏడిపించాడు అని బాధ తో ఉదయం ఫ్లయిట్ కీ అందరూ తిరిగి వెళ్లిపోయారు కానీ విద్య మైండ్ లో ఒకటే ఆలోచన ఉంది.

(కొన్ని రోజుల క్రితం)

ఒక రోజు విద్య గుడికి వెళ్లి "దేవుడా నాకూ ఒక మంచి అబ్బాయి నీ నా జీవితంలోకి పంపు నా ఫ్రెండ్స్ కీ అందరికీ ఉన్నారు నాకూ ఒకడిని ఇవ్వు" అని కళ్లు మూసుకుని దండం పెట్టుకుని ఉంటే అప్పుడే పూజారి "శతమానంభవతి పండంటి పిల్లలతో సంతోషంగా ఉండండి" అని ఆశీర్వదించాడు అప్పుడు కళ్లు తెరిచి చూసిన విద్య పక్కన ఉన్న వినయ్ నీ చూసి అలాగే ఉండి పోయింది దానికి వినయ్ సారీ చెప్పి వెళ్లాడు అప్పటి నుంచి వినయ్ నే దేవుడు తన కోసం పంపాడు అని అనుకుంటుంది విద్య.

రాత్రి జరిగిన విషయం తలుచుకుంటు విద్య అలాగే సోఫా లో పడుకొని ఆలోచిస్తూ ఉంది వినయ్ ఆఫీస్ కీ టైమ్ అయ్యింది అని కిందకి వచ్చి తన వరకు తాను టిఫిన్ వండుకోని తిని వెళ్లిపోయాడు ఇది ఏమీ విద్య పట్టించుకోలేదు, వినయ్ కూడా విద్య గురించి పట్టించుకోలేదు ఆ తర్వాత ఎవరో కాలింగ్ బెల్ కోడితే వెళ్లి తీసింది ఒక డెలివరీ బాయ్ వచ్చి ఒక పార్శిల్ ఇచ్చి వెళ్లాడు అది విద్య పేరు మీదే వచ్చింది తీసి చూస్తే ఒక చీర ఉంది దాంతో పాటు ఒక లెటర్ ఉంది అందులో.

"సారీ రాత్రి జరిగిన దానికి నేను నా పుట్టిన రోజు ఎప్పుడు జరుపుకోను అలాంటిది అసలు నా బర్త్ డే అంటేనే నాకూ చిరాకు అలాంటిది నువ్వు వచ్చి ఒకేసారి అలా surprise ఇస్తే ఏమీ చేయాలో తెలియక అర్థం కాక నిన్ను కోటాను అందుకే దానికి బదులు ఈ గిఫ్ట్ సాయంత్రం ఒక లొకేషన్ పంపుతా నువ్వు అక్కడికి రా నా బర్త్ డే చేసుకుందాం "అని ఉంది ఇది అంతా వినయ్ ఇంటి కిటికీ పక్కన నుంచి drone కెమెరా లో మమతా చూస్తూ ఉంది (వినయ్ ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో తన boutique నుంచి ఒక చీర సెలెక్ట్ చేసి తనే ఆ లెటర్ రాసి పంపింది) ఆ లెటర్ చదివిన తర్వాత విద్య నవ్వడం చూసి ఫోన్ లో లైన్ లో ఉన్న వినయ్ తో "బ్రో పని అయిపోయింది సాయంత్రం పార్టీ కీ తనని మన హోటల్ కీ రమ్మను " అని చెప్పింది ఆ పక్కనే ఉన్న శ్రీ రామ్ (డెలివరీ బాయ్ గా వెళ్లింది శ్రీ రామ్) "నీ అబ్బ అంత innocent అమ్మాయి మీద చెయ్యి ఎలా లేపావ్ రా బుద్ది ఉందా అసలు ఆ అమ్మాయి నిన్ను నమ్మి వచ్చింది నీ భార్య గా తను నీకు భార్య గా వచ్చింది కానీ నీకు తనకి భర్త అవ్వాలి అని లేనపుడు తన మీద చెయ్యి ఏత్తే అధికారం లేదు " అని తిట్టాడు దానికి వినయ్ ఫోన్ పెట్టేసాడు దాంతో శ్రీ రామ్ "psycho నా కోడకా" అని తిట్టాడు దానికి మమతా "మా అన్నయ్య గురించి తెలుసుగా బేబీ పద మనకు పనులు ఉన్నాయి" అని కార్ స్టార్ట్ చేసి వెళ్లిపోయారు.

కానీ ఆఫీస్ లో ఉన్న వినయ్ పని మీద ధ్యాస లేకుండా ఉన్నాడు ఇందాక శ్రీ రామ్ తిట్టినప్పటి నుంచి తన గతం తాలూకు ఆలోచనలు కొడుతున్నాయి.

" వినయ్ చిన్నప్పటి నుంచి వాళ్ల అమ్మ నాన్న ఎప్పుడు గోడవ పడుతూ ఉండటం చూస్తూ పెరిగాడు వాళ్లది ప్రేమ పెళ్లి అయిన కూడా ఇద్దరి మధ్య ప్రేమ లేదు వాళ్ల అమ్మ కీ ఆస్తులు పెంచుకోవాలి అందరి లగ్జరీ గా ఉండాలి అని కాకపోతే వాళ్ల నాన్న చేసే దాన ధర్మాల వల్ల పేరుకి ఒక బంగళా ఉంది కానీ దాని లోపల మాత్రం దయ్యం కొంప లాగా ఉండేది దాంతో వాళ్ల గొడవలు మధ్య వినయ్ ఉండలేక పోయాడు రోజు మంచం కింద దూరి దాకోని బ్రతికే వాడు ఇది చూడలేక వినయ్ వాళ్ల జేనాన్న తన పేరు మీద ఉన్న 10 ఎకరాల భూమిని వినయ్ పేరు మీద మార్చి దాని కౌలు కీ ఇచ్చి ప్రతి నెలా వచ్చే డబ్బుతో వినయ్ నీ హాస్టల్ లో పెట్టి చదివించాడు అక్కడే శ్రీ రామ్ పరిచయం అయ్యాడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు చుట్టూ ఎంత మంది ఉన్న వినయ్ శ్రీ రామ్ ఒక్కడితోనే ఫ్రీ గా ఉండేవాడు ఎందుకంటే వాడికి మాత్రమే వీడి బాధ అర్థం అవుతుంది ఎప్పుడైనా తన కోసం ఎవరైనా వస్తారు అని కళ్లు కాయలు కాచేలాగా చూసేవాడు వినయ్ కీ ఎప్పుడు తను ఒంటరి అనే భావన కలిగేది అలా తన సొంత అమ్మ నాన్న మీద ద్వేషం పెంచుకున్నాడు ఆ తర్వాత స్కాలర్షిప్ లతో చదువుకొని క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ తెచ్చుకొని బెంగళూరు లో రెండు సంవత్సరాలు పని చేసి ఆ తర్వాత ప్రమోషన్ లో భాగంగా చండీగఢ్ వచ్చాడు అక్కడే సెటిల్ అయ్యాడు అప్పుడు తనకు నచ్చిన సిటీ లో తనకు అడ్డు, ఎదురు లేని చోట స్వేచ్ఛా వాయువు పీలుస్తు బ్రతుకుతున్నాడు ఈ ప్రపంచంలో వాడు ఎక్కువగా ప్రేమించేది వాడినే వాడికి ఏది అడ్డు వచ్చిన నచ్చదు అందులో ఈ పెళ్లి చిన్నప్పటి నుంచి వాడి అమ్మ నాన్న నీ చూసి పెళ్లి అంటే చిరాకు అసహ్యం కలిగింది " ఇది వినయ్ జీవితం.

సాయంత్రం పార్టీకి అందరూ ఎప్పుడు తమ రెగ్యులర్ గా కలిసే హోటల్ కీ వెళ్లారు అప్పుడే విద్య వచ్చింది తను అలా పింక్ కలర్ చీర లో నడుస్తూ వస్తుంటే వినయ్ లో కొత్త vibration మొదలు అయ్యింది మమత కీ వినయ్ weakness తెలుసు అందుకే తెలివిగా పింక్ కలర్ డ్రస్ లో అమ్మాయిని చూస్తే వినయ్ అలాగే నిలబడి పోతాడు ఇప్పుడు విద్య వైపు తను చూసే చూపు తో మమత తన ప్లాన్ పని చేస్తుంది అని అనుకుంటుండగా విద్య వెనుక నుంచి పింక్ కలర్ హాఫ్ skirt లో ఒక అమ్మాయి ఇంకా సెక్సీ గా రెడీ వస్తుంది తనని చూసి మమత, శ్రీ రామ్ షాక్ అయ్యారు ఆ వచ్చే అమ్మాయి శిల్పా వినయ్ ఆఫీస్ లో పని చేస్తుంది వినయ్ నీ 7 సంవత్సరాల నుండి లవ్ చేస్తుంది కానీ వినయ్ తనని చూడను కూడా చూడడు అప్పుడు విద్య కంటే ముందే శిల్ప వినయ్ దగ్గరికి వచ్చి గట్టిగా hug చేసుకొని ముద్దు పెట్టింది.

శిల్ప చేసిన దానికి విద్య కంటే మమత, శ్రీ రామ్ బాగా షాక్ అయ్యారు శిల్ప వినయ్ నీ ముద్దు పెట్టుకోగానే శ్రీ రామ్ తన నోట్లో ఉన్న డ్రింక్ షాక్ లో ఉమ్మితే వినయ్ షర్ట్ పాడు అయ్యింది దాంతో క్లీన్ చేసుకోవడానికి వెళ్లాడు అప్పుడు శిల్పా విద్య వైపు చూసి "హే చోరీ తో తూహి క్యా వినయ్ కీ బీవీ" అని హర్యానా యాస లో అడిగింది దానికి విద్య అర్థం కాక చూస్తే రామ్ చెప్పాడు "నువ్వే నా వినయ్ నీ పెళ్ళి చూసుకుంది అని అడుగుతుంది" అని చెప్పాడు దానికి విద్య తల ఊప్పింది దాంతో శిల్పా "అచ్చ అయితే తెలుగు అమ్మాయి వా నేను ఇంకా మా స్టాట్ అనుకున్న "అని చెప్పి విద్య నీ పై నుంచి కింద వరకు చూసి "నాకన్న ఏమీ బాగున్నావు అని నిను చేసుకున్నాడు" అని అడిగింది దానికి విద్య అర్థం కాక చూస్తూంది దాంతో మమత డిన్నర్ ఆర్డర్ ఇచ్చి శిల్పా నీ divert చేసింది.

శిల్పా కౌర్ వినయ్ పని చేసే కంపెనీ CEO అంటే ఆ కంపెనీ వాళ్ల నాన్నది ఆయనకి దాంట్లో 60 percent షేర్లు ఉండటం వల్ల ఆయన తరువాత శిల్పా CEO అయ్యింది తనకి ఏదైనా వెండి పళ్లెం లో దొరకడం తో తనే గొప్ప మిగిలిన వాళ్లు తన బానిసలు అనే మనస్తత్వం తనది దాంతో ఎవరిని లేక చేయదు ఒక సారి ప్రాజెక్ట్ మీటింగ్ బెంగళూరు బ్రాంచ్ కీ వెళ్లినప్పుడు వినయ్ నీ చూసింది అందరూ తనకి లేచి నిలబడి రెస్పెక్ట్ ఇస్తుంటే వినయ్ ఏమీ పట్టనట్లు కూర్చుని ఉన్నాడు దాంతో శిల్పా కీ వాడి పొగరు నచ్చలేదు దాంతో ప్రాజెక్టు మీటింగ్ లో వినయ్ ఇచ్చిన presentation బాగాలేదు అని చెప్పింది దానికి వినయ్ తన ముందు ఉన్న బాటిల్ లో నీళ్లు శిల్పా మీద పోసి వెళ్లిపోయాడు (జాబ్ నుంచి తీసేస్తారు అని అలా చేశాడు కావాలి అనే) కానీ శిల్పా కీ వినయ్ attitude, ధైర్యం అని నచ్చాయి దాంతో ప్రమోషన్ ఇచ్చి చండీగఢ్ కీ తెప్పించింది, అప్పటి నుంచి తన ప్రేమ నీ పొగరు గానే చెప్పింది కానీ వినయ్ పట్టించుకోవడం లేదు దాంతో శిల్పా కీ బాధ అంటే ఏంటో అర్థం అయ్యింది ముందు లాగా ఉండలేక పోతుంది తనని చూసిన వాళ్ల అమ్మ అడిగింది ఏంటి సమస్య అని శిల్పా మొత్తం చెప్పింది దాంతో వాళ్ల అమ్మ "ప్రేమ అనేది నిస్వార్థం తో కూడుకున్నది దాని నువ్వు చెప్పిన అతను అర్థం చేసుకోలేదు అంటే అతనికి నీ పైన కానీ ప్రేమ మీద నమ్మకం ఇష్టం లేదని కాబట్టి నీ ప్రేమ unconditional నువ్వు ఏమీ ఆశించాల్సిన పని లేదు నువ్వు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు తనకు అర్థం అయ్యేలా చూడు అర్థం కాకపోయినా ఒక జ్ఞాపకం లాగా అయిన మిగులుతుంది " అని చెప్పింది శిల్పా అప్పటి నుంచి వినయ్ నీ దూరం నుంచి చూస్తూ ప్రేమించడం మొదలు పెట్టింది తన పద్ధతి పూర్తిగా మారిపోయింది కొత్తగా తనకు తానే కనిపించడం మొదలైంది.

అలా డిన్నర్ చేస్తుండగా వినయ్ ఇంకా రాలేదు అప్పుడు వాళ్లలో వాళ్లే మాట్లాడుతూ ఉండగా శిల్పా విద్య తో

శిల్పా : vidya I pitty you

విద్య : Excuse me what are you talking

శిల్పా : చూడు ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం వినయ్ నీ పెళ్ళి అయిన దగ్గరి నుంచి నిన్ను టచ్ చేశాడా పోనీ ఇలా చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు అని నీకోసం ఏమైనా చేసాడా వాడి కోసం నువ్వు ఎమైన చేస్తే మెచ్చుకున్నాడా వాడికి వాడే ముఖ్యం మనం ఎవ్వరం అవసరం లేదు వాడికి కావాల్సింది వాడి సంతోషం అంతే అని చెప్పింది

దానికి విద్య మమత, శ్రీ రామ్ వైపు చూసింది దాంతో వాళ్లు కూడా అవును అన్నట్లు తల ఊప్పారు "నిజం వదిన అన్నయ్య కీ ఎప్పటికైనా మొదటి preferance వాడే వాడు సంతోషంగా ఉండాలి అంటే ఏమైనా చేస్తాడు" అని చెప్పింది అప్పుడే వినయ్ వస్తే అందరూ సైలెంట్ అయ్యారు అప్పుడు విద్య వినయ్ చేతికి రక్తం రావడం గమనించింది అంతే తన చీర చింపి వినయ్ చేతికి కట్టింది శ్రీ రామ్ "ఏమైందిరా ఆ రక్తం ఏంటి "అని అడిగాడు కానీ వినయ్ సైలెంట్ గానే ఉన్నాడు ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్తుండగా కొంతమంది అబ్బాయిలు దెబ్బలతో పడి ఉన్నారు దాంతో అర్థం అయ్యింది చేతికి రక్తం ఎలా వచ్చిందో (విద్య హోటల్ లోకి వస్తున్నప్పుడు తన పైన కామెంట్ చేయడం వినయ్ చూశాడు అందుకే తరువాత వెళ్లి కొట్టాడు) అప్పుడు శ్రీ రామ్ అక్కడ పడి ఉన్న ఒక్కడిని చూసి షాక్ అయ్యాడు అక్కడ ఉన్న వాడి పేరు ప్రిన్స్ ఇండియన్ బాక్సింగ్ చాంపియన్ అంతేకాకుండా MMA(mixed martial arts) లో కూడా బెస్ట్ ఫైటర్ ఇంటర్నేషనల్ గా ఇండియా నీ represent చేశాడు.

దాంతో వెంటనే శ్రీ రామ్ వినయ్ నీ కార్ లో కూర్చోబేటి వినయ్ బైక్ తీసుకొని వాడి ఇంటికి వెళ్లాడు ఇంట్లోకి వెళ్లగానే "రేయ్ పిచ్చి నా కోడకా నీకు కోపం వస్తే ఎవరినైన కోడతావా వాడు celebrity రా" అని తీడుతు ఉన్నాడు అప్పుడు విద్య వినయ్ తన కోసం ఒక్కడిని కొట్టాడు అని ఆనందం లో వినయ్ కీ పెదవి పైన ముద్దు పెట్టింది దానికి శిల్పా షాక్ అయ్యింది ఈ సారి అప్పుడే కాలింగ్ బెల్ మొగడంతో వెళ్లి తలుపు తీశాడు శ్రీ రామ్ వాడిని పక్కకు తోసి లోపలికి వచ్చింది యశోద ఆమెను చూడగానే మమత "అమ్మ నువ్వు ఏంటి ఇక్కడ" అని అడిగింది కానీ వినయ్ లేచి "పిన్ని ఏంటి లేట్" అని కౌగిలించుకోబోతుంటే కొట్టింది దాంతో వినయ్ నవ్వుతూ hug చేసుకున్నాడు ఆమె నీ అప్పుడు విద్య "మమత మీ అమ్మ బెంగళూరు లో కాకుండా మీతో ఉంటుందా" అని అడిగింది అవును అని తల ఆడించింది మమత "అవును మీ నాన్న ఎప్పుడు కనిపించరు ఎక్కడ ఉంటారు" అని అడిగింది విద్య దానికి మమత తన చిన్నప్పటి ఫోటో చూపించింది అందులో వినయ్ వాళ్ల నాన్న నీ చూసి షాక్ అయ్యింది విద్య "మా ఇద్దరికీ తల్లి వేరు తండ్రి ఒక్కడే "అని చెప్పింది మమత.

మమత చెప్పింది విన్న తర్వాత విద్య కొంచెం షాక్ లో ఉంది ఎందుకంటే వినయ్ వాళ్ల నాన్న రామకృష్ణ అంటే ఊరిలో ఒక ప్రత్యేక మర్యాద ఉంది అలాంటిది ఆయన ఇలా చేయడం చాలా షాక్ ఇచ్చింది విద్యకి.

వినయ్ వాళ్ల అమ్మ దేవకి, పిన్ని యశోద ఇద్దరు సొంత అక్క చెల్లెలు ఇద్దరికి చిన్నప్పటి నుంచి ప్రతి చిన్న దాంట్లో గొడవ ఎప్పుడు తనదే పైచేయి అవ్వాలి అని దేవకి యశోద పై పొట్టి పెంచుకుంది కాకపోతే యశోద కొంచెం తెలివైనది, చదువుకుంది, పైగా అందగత్తె అలా తనకి చదువు అయ్యి పోగానే పెళ్లి చేయాలి అని చూశారు కాకపోతే యశోద తనకి ఒక ఆశయం ఉంది అని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది ఆ తర్వాత సొంతం గా ఒక చిన్న కంపెనీ పెట్టి బెంగళూరు లో సెటిల్ అయ్యింది అప్పుడే దేవకి రామకృష్ణ పెళ్లి చేసుకున్నారు యశోద గొప్పగా సెటిల్ అవ్వడం ఓర్చుకోలేక దేవకి వాళ్లు కూడా తనలాగా డబ్బు సంపాదించాలి అని తన భర్త నీ పీడిస్తు ఉంది కానీ ఆయన చేసిన దాన ధర్మాల వల్ల ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు ఇలా ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవ జరిగేది ఒక రోజు ఏదో పని మీద బెంగళూరు వెళ్లిన రామకృష్ణ పని ఆలస్యం అవ్వడం తో యశోద ఇంటికి వెళ్లాడు అప్పుడు యశోద ఒకటే ఉండేది దాంతో ఇద్దరు మాట్లాడుతూ భోజనం చేయడం మొదలు పెట్టగానే బయట వర్షం మొదలు అయ్యింది కరెంట్ పోయింది ఆ చీకట్లో యశోద కొవ్వతి కోసం వెళ్లి కాలు గోడకి తగిలి కొంచెం వాపు వచ్చింది దాంతో రామకృష్ణ ఆమె కాలికి massage చేస్తూ యశోద అందాలు చూసి తన భార్య కీ ఇలాంటి అందం లేదు అని బాధ పడ్డాడు అలా massage చేస్తుంటే ఇప్పటి వరకు మగ స్పర్శ తెలియని యశోద కూడా రామకృష్ణ వైపు మనసు లాగింది దాంతో ఇద్దరు ఆ రాత్రి ఒకటి అయ్యారు ఆ తర్వాత రామకృష్ణ తనకి దేవకి తో ఎప్పుడు గొడవ అయిన బెంగళూరు వచ్చే వాడు ఆ తర్వాత యశోద తల్లి కాబోతుంది అని తెలిసి abortion చేయించాలి అని చూశాడు కానీ యశోద ఒప్పుకోలేదు దాంతో వేరే దారి లేక తనని పెళ్ళి చేసుకున్నాడు వాళ్ళకి మమత పుట్టింది ఇంత జరిగిన ఆ విషయం వినయ్ ఇంట్లో ఎవరికీ తెలియదు.

వినయ్ బెంగళూరు లో పని చేస్తున్న రోజులో ఒక రోజు రాత్రి బస్ లో రూమ్ కీ వెళ్లుతుంటే ఎవరో కొంతమంది ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉన్నారు ఆ అమ్మాయి మమత (అప్పటికి తనకు ఒక సవతి తల్లి, సవతి చెల్లి ఉంది అని వినయ్ కీ తెలియదు) ముందు పట్టించుకోలేదు ఆ తర్వాత మమత వినయ్ దగ్గరికి వచ్చి "అన్న కొంచెం హెల్ప్ చేయండి" అనింది దానికి కూడా వినయ్ పట్టించుకోలేదు అప్పుడు తన పర్స్ లో నుంచి డబ్బు ఇచ్చింది అసలే నెల ఆఖరి రోజులు డబ్బు లేక ఇబ్బంది లో వినయ్ డబ్బు కోసం ముందు వెనుక చూడకుండా వాళ్ళని కొట్టాడు అప్పుడు మమత తన స్టాప్ రాగానే దిగింది డబ్బులు ఇస్తుంటే వినయ్ వద్దు అన్నాడు సేఫ్ గా ఇంటి వరకు వస్తా ఆ తర్వాత ఇవ్వు అన్నాడు ఆ తరువాత ఇద్దరు వాళ్ల ఇంటికి వెళ్లారు కొంచెం మంచి నీళ్లు అడిగాడు మమత తీసుకొని రావడానికి లోపలికి వెళ్లి యశోద కీ జరిగింది చెప్పి తీసుకొని వచ్చింది యశోద కూడా వినయ్ కీ థాంక్స్ చెప్పింది అప్పుడు బాత్రూమ్ లోనుంచి స్నానం చేసి వచ్చిన రామకృష్ణ నీ చూసి షాక్ అయ్యాడు వినయ్ తన తండ్రి కళ్లలో ఏదో తప్పు చేసిన భావన కనిపించింది అది యశోద కూడా గమనించింది అంతే వినయ్ తన అక్క కొడుకు అని అర్థం అయ్యింది కోపం లో వినయ్ పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ తీసుకొని తన తండ్రి మీదకు లేచ్చాడు కానీ యశోద వచ్చి వినయ్ కాలు పట్టుకుంది దాంతో వినయ్ ఫ్లవర్ వాజ్ కింద పడేశాడూ, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఒక వారం రోజుల వరకు యశోద మమత వినయ్ చుట్టూ తిరిగారు వాళ్ళని క్షమించమని అడగడానీకీ ఆ తర్వాత వినయ్ యశోద వాళ్ల తో కలిసి ఉండటం మొదలు పెట్టాడు. తన తల్లి తో కంటే పిన్ని తోనే వినయ్ కీ ఎక్కువ ప్రేమ కుదిరింది.

(ప్రస్తుతం)

వినయ్ మరుసటి రోజు ఉదయం ఆఫీస్ కీ వెళ్లి తన కాబిన్ కీ వెళ్లడానికి తన I'd card swipe చేస్తే అవ్వలేదు అప్పుడు శిల్పా కొంతమంది బోర్డు సభ్యులు వచ్చి నిన్న రాత్రి వినయ్ కొట్టిన ప్రిన్స్ వాళ్ల మామ కంపెనీ తోనే ఇప్పుడు వాళ్లు ప్రాజెక్ట్ చేస్తున్నారు దాంతో వాళ్లు వినయ్ ఉంటే ఆ ప్రాజెక్ట్ చేయమని కంపెనీ నీ బ్లాక్ లిస్ట్ చేయస్తాం అన్నారు దాంతో బోర్డు సభ్యులు శిల్పా పైన ఒత్తిడి తావడంతో వినయ్ నీ జాబ్ నుంచి తీసేశారు.

ఇంట్లో ఉన్న విద్య వినయ్ రూమ్ లోకి వెళ్లింది ఆ రోజు వచ్చినప్పుడు సరిగా చూడలేదు కానీ రూమ్ చాలా డిఫరెంట్ గా కనిపించింది అప్పుడు ఒక బుక్ చూసింది అందులో "my dreams for my life" అని ఉంది అందులో ఉన్నది చూస్తూ ఒక పేజీ మధ్యలో ఆగింది విద్య నిన్న చీర లో ఉన్న ఫోటో చూసి దాని పక్కనే "kissing with pink angel" అని రాసి ఉంటే చూసి సిగ్గు పడింది ఆ తర్వాత పేజీ లో ప్రిన్స్ ఫోటో చూసింది దాని పక్కనే "fight with a celebrity and insult him" అని రాసి ఉంది అంటే దాని అర్థం వినయ్ విద్య కోసం కాదు తన dreams లిస్ట్ లో ఒకటి పూర్తి చేసుకోడానికి కొట్టాడు అని.​
Next page: Update 07
Previous page: Update 05