Update 11

టగ్ ఆఫ్ వార్

మన సంతోషాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలని అందరం అనుకుంటాం, కాని కొందరు మనల్ని చూసి సంతోషిస్తే, మరి కొందరు ఈర్ష్య చెందుతారు, మన సంతోషాలను మన నుండి దూరం చేయాలని మన లేదా మన వాళ్ళ బలహీనతలతో ఆడుకునే ప్రయత్నం చేస్తారు. మనతోనే ఉన్నట్టు ఉంటూ మన వెనక గోతులు తవ్వుతారు.

ప్రణవ్ కి సుహాసిని నుండి ఫోన్ "నువ్వు మన కొత్త కన్స్ట్రక్షన్ సైట్ కి వెళ్లి విజిట్ చేసి రా!" అంది.

ప్రణవ్ "హుమ్మ్... సరే" అని చెప్పి తపస్యని అక్కడే సుహాసినికి హెల్ప్ కోసం ఉంచి వెళ్ళిపోయాడు. సుహాసినికి గతంలో ఉన్న అసిస్టెంట్ దీప వాళ్ళను చూస్తూ ఉంది, ఆమెకు ప్రణవ్ కి గాని తపస్యకి గాని అటువంటి సంబంధం లేదని అర్ధం అయిపొయింది, మరి ఈ తపస్య ఎందుకు ప్రపోజ్ చేసింది, రావు గారు చెప్పి ఉంటారు అని నవ్వుకుంది.

ప్రణవ్ కార్ లో వెళ్ళిపోయాడు.

సుహాసిని "వెళ్ళిపోయాడా!"

దీప "అవును మేడం"

సుహాసిని "ఫైల్స్ అన్ని సిద్దం చెయ్, మీటింగ్ స్టార్ట్ అవుతుంది"

దీప "ఓకే మేడం"

సుహాసిని "జాగ్రత్తగా స్టడీ చెయ్, అలాగే ప్రణవ్ తిరిగి వస్తే తనను మీటింగ్ హాల్ కి తీసుకొచ్చి మీ ఇద్దరూ మీటింగ్ లీడ్ చేయాల్సి ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో రామ్ దేవ్ మరియు ప్రణవ్ ఎదురుపడకూడదు"

దీప "ఎందుకు మేడం"

సుహాసిని "సిద్దార్ద్ ఎవరో కాదు, రామ్ దేవ్ యొక్క రెండో భార్య కొడుకు"

దీప "వాట్, కానీ ప్రణవ్ సర్... ఆ సిద్దార్ద్ తో"

సుహాసిని "ప్రణవ్ అన్నీ తెలిసే చేశాడు... పైగా రామ్ దేవ్ ని డైరక్ట్ గా ఆ రోజు డీల్ చేశాడు"

దీప "ఆ రోజు ప్రణవ్ సర్ ని చూస్తే భయం వేసింది"

సుహాసిని "వాడికి కోపం వస్తే చివరిదాకా వెళ్తాడు, అంతు చూసి కాని వదలడు"

దీప "ఆ అలవాటు మీ నుండే నేర్చుకున్నాడు"

సుహాసిని "హుమ్మ్"

దీప "మేడం, అలా అయితే ప్రణవ్ సర్ ని రామ్ దేవ్ గారితో మీటింగ్ అరేంజ్ చేయొచ్చు కదా"

సుహాసిని "ప్రణవ్ ని ఎంత నా కూతురు ఇష్టపడుతున్నా, వాడిని చిన్నప్పటి నుండి ఒక కొడుకులా పెంచాను, సడన్ గా వాడిని వాడి శత్రువు ముందు నించో బెట్టలేను"

దీప "సరే మేడం మీటింగ్ కి వెళ్దాం"

శ్రీకాంత్ "నేను ఇవ్వాళ మా నాన్నతొ పాటు తరుపున బోర్డు మీటింగ్ లో కూర్చున్నా, నువ్వు ఎక్కడ"

ప్రణవ్ "కొద్ది సేపటిలో వచ్చేస్తా"

శ్రీకాంత్ "ఇక్కడ నీ కోసం చాలా పెద్ద స్కెచ్ వేశారు"

ప్రణవ్ "అవునా"

శ్రీకాంత్ "సోది దెంగకు.... నీకు ముందే తెలుసు"

ప్రణవ్ "నాకేం తెలియదు"

శ్రీకాంత్ "సరే, మీటింగ్ హాల్ లోకి ఎట్టి పరిస్థితుల్లో రాకూ"

ప్రణవ్ "అలా ఎలా... ఐ లవ్ మీటింగ్స్"

శ్రీకాంత్ "ఇదేమైనా శ్రావ్య గుద్ద అనుకున్నావా"

ప్రణవ్ "ఇంకా నోరు ముయ్"

శ్రీకాంత్ "సరే మీ అమ్మ వచ్చింది, మీటింగ్ స్టార్ట్ అవ్వబోతు ఉంది"

(శ్రీ కన్స్ట్రక్షన్స్ బోర్డు మెంబర్స్ మీటింగ్)

సుహాసిని "హాయ్ గయిస్... హో ఆర్ యు... ఇవ్వాళ మీటింగ్ ఉద్దేశ్యం..."

సాధిక్ "మీరు మీ వారసుడుగా ప్రణవ్ ని ప్రకటించారా"

సుహాసిని "అప్పుడే ఏం చెప్పలేదు... అయినా ప్రణవ్ నా కొడుకు... అయినా ఇవ్వాళ మీటింగ్ ఉద్దేశ్యం..."

జయశ్రీ "అలా కాదు మేడం, మీరు ప్రణవ్ ని కొడుకు అంటారు, అలాగే మీ కూతురుకి పెళ్లి చేస్తా అని కూడా అనేశారు" అని అంది.

చుట్టూ ఉన్న అందరూ ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నారు.

సుహాసిని "ప్రణవ్ నా స్నేహితురాలు ఇంద్రాణి కొడుకు, ఇంద్రాణి, విశ్వక్ ల సంతానం... "

ఇంతలో ఎవరో మాట్లాడ బోతూ ఉంటే మళ్ళి సుహాసిని "నా భర్త పేరు కూడా విశ్వక్, ఇద్దరూ వేరు వేరు... కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు నన్ను కాపాడబోయి ఒక యాక్సిడెంట్ లో చనిపోవడంతో ప్రణవ్ ని తీసుకొచ్చి పెంచుతున్నాను. ఎంత పెంచినా వాడు నా పెంపుడు కొడుకు మాత్రమె, ఒకటి నా కూతురు ఇష్టపడితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి నా వారసుడిని చేస్తా అల్లుడిలా, లేదా వాడిని నా వారసుడుగా ప్రకటిస్తా నా కొడుకు లా" అంది.

రెండు నిముషాలు సైలెన్స్, ఎవ్వరూ ఏం మాట్లాడలేదు.

శ్రీకాంత్ "ప్రణవ్ మంచి వాడేనా.. అతని కాలేజ్ మరియు కాలేజ్ రికార్డ్స్ అంత గొప్పగా ఏం లేవు కదా"

సుహాసిని "ప్రణవ్ ని చిన్నప్పటి నుండి ఈ పొజిషన్ కోసం సిద్దం చేస్తూ వచ్చాను"

శ్రీకాంత్ "ఈ పొజిషన్ అంటే రౌడీయిజమా"

సుహాసిని "ప్రణవ్ చాలా మంచి వాడు"

శ్రీకాంత్ "ప్రణవ్ నేను క్లాస్ మేట్స్, సారీ... సారీ... ప్రణవ్ నేను మాత్రమే కాదు, ఇక్కడున్న మిస్టర్ మనోజ్, నేను, ఇంకా ఇక్కడ లేని శ్రీవిద్య, తపస్య, ప్రణవ్, సిద్దార్ద్ మరియు శ్రావ్య, సంతోష్" అని చెబుతూ ఉన్నాడు.

సుహాసిని, దీప వైపు చూసి "శ్రీ విద్య ఎందుకు ఇంకా రాలేదు"

మనోజ్ సుహాసిని వైపు జరిగి "తను రాలేక నన్ను పంపింది" అన్నాడు.

సుహాసిని "ఉమ్మ్" అని తల ఊపి శ్రీకాంత్ మాటలు వింటుంది.

మనోజ్ కోపంగా ఉన్న మొహం పై మాత్రం నవ్వు అమర్చుకొని ఫోన్ లో శ్రీకాంత్ కి "ఇంకా ఎక్కవ చేసి చెప్పు, లేదంటే మీ బాబు అందరి ముందు బకరా అవుతాడు".

శ్రీకాంత్ తండ్రి వైపు కోపంగా చూశాడు. అతను తల దించుకొని ఉన్నాడు.

శ్రీకాంత్ పంటి బిగువున మనోజ్ పై కోపంని భరిస్తూ అందరి వైపు చూస్తూ "అసలు ప్రణవ్ ఒక రౌడీ, కాలేజ్ రోజుల్లో కూడా అంతే, ఇక అమ్మాయిల విషయంలో ఆ శ్రావ్య" అని అంటూ ఉంటే.

మనోజ్ "సీ మిస్టర్ శ్రీకాంత్.... నీకు ప్రణవ్ మీద ఎదో పర్సనల్ గ్రడ్జ్ ఉన్నట్టు మాట్లాడుతున్నావ్; అతను నచ్చి శ్రావ్య అతనితో తిరిగితే అది ప్రణవ్ తప్పు ఎలా అవుతుంది" అని నవ్వాడు.

శ్రీకాంత్ కి తల కొట్టేసినట్టు ఉంది, నిజానికి తను ఏమి ప్రణవ్ కి సపోర్ట్ చేయాలనో, ఎదురు నిలబడాలనో అనుకోవడం లేదు, తను ఒక బిజినెస్ మ్యాన్, ఒకరి బలవంతం పై నిర్ణయం తీసుకోవడం అనేది తనకు కష్టంగా ఉంది. మనోజ్ పై పీకల దాకా కోపం వచ్చింది.

రావు గారు కూడా మనోజ్ జోక్ కి నవ్వాడు. సుహాసిని కి ఆ మాటలు అసలు నచ్చలేదు, శ్రావ్య విషయ అసలు తనకు పూర్తిగా తెలియదు. శ్రీవిద్యని అడిగితే తప్పించుకుంది. ప్రణవ్ తో ఎప్పుడు ఆ సంభాషణ రాలేదు.

రావు గారు "చూడండి, ప్రణవ్ చాలా మంచి వాడు ఇప్పటి వరకు ఎటువంటి సమస్య లేదు"

జయశ్రీ "అసలు ప్రణవ్ ఈ సంవత్సర సమయం ఎక్కడ ఉన్నాడు, ఎందుకు వెళ్ళాడు ఎందుకు తిరిగి వచ్చాడు"

సుహాసిని "ప్రపంచం నేర్చుకోమని నేనే పంపించాను, నా కొడుకు ప్రపంచం తెలుసుకొని వచ్చాడు, ఇప్పుడు ఈ కంపనీకి నా తర్వాత సీఈఓ అవుతాడు"

సాధిక్ "ఆ పొజిషన్ కి అతనికి అసలు అర్హత ఏమి ఉంది"

సుహాసిని "అసలే నాకేం అర్హత ఉంది, నేను ఈ కంపనీ మొదలు పెట్టినపుడు, అన్నీ సాధిస్తూ వెళ్తున్నప్పుడు అందరూ పక్కనే ఉండి చూస్తూ ఉన్నారు కానీ ఏ సమస్యలలోనూ నాకు తోడు లేరు, కీలక నిర్ణయాలలోనూ, లాభాలలోనూ మాత్రం వచ్చేస్తారు" అని కోపంగా అరిచినంత పని చేసింది.

మనోజ్ పైకి లేచి "మీటింగ్ కి ఒక పది నిముషాలు గ్యాప్ ఇద్దాం" అన్నాడు.

సుహాసిని మాటలకు అందరికీ కోపం వచ్చింది, ఎదో ఒకటి జరిగేది, మనోజ్ చాలా న్యాక్ గా ప్రవర్తించి ఏ గొడవ లేకుండా చేశాడు. కాని కొద్ది మందికి మాత్రమె తెలిసిన నిజం... ఈ గొడవ సృష్టించిందే మనోజ్.

కొంత మంది పైకి లేవడంతో అందరూ పైకి లేచారు. సుహాసిని గ్లాస్ వాటర్ తాగి మనోజ్ వైపు చూసి థాంక్స్ అన్నట్టు సైగ చేసింది. అలాగే చేతి నుండి ప్రణవ్ కి "ఎక్కడున్నావ్" అని మెసేజ్ చేసింది.

ప్రణవ్ "నిన్న రాత్రి నీకు పెట్టిన ముద్దుల్లో" అని రిప్లై పెట్టాడు.

సుహాసిని కి నవ్వు వచ్చింది మనసు కొంచెం తేలిక పడి మీటింగ్ కోసం సిద్దంగా ఉంది.

వాడి వేడిగా చర్చ సాగుతూ ఉంది. మనోజ్ ప్రణవ్ తరుపు మాట్లాడుతూ ఉన్నట్టు, సుహాసినికి హెల్ప్ చేస్తూ ఉన్నట్టు నటిస్తూ ఉన్నాడు. రావు గారు కూడా సుహాసినికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. కాని ఆపోజిట్ గా మాట్లాడుతూ ఉన్న అందరూ రావు గారు లేదా మనోజ్ లేదా వాళ్ళ మనుషులు రెచ్చ గోడితే వచ్చిన వారే, వాళ్ళు అంతా ఒకటే నిర్ణయం "ప్రణవ్ సీఈఓగా మాకు వద్దు" అనేది వాళ్ళ లక్ష్యం.

సుహాసినికి ఒక పక్క టెన్షన్ రామ్ దేవ్ మరియు ప్రణవ్ ఎదురు పడతారు అని, మరో పక్క సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా మీటింగ్ సబ్జెక్ట్; ఎదో ప్రణవ్ సీఈఓ గా ఉంటే అందరూ కంపనీ వదిలి వెళ్లిపోతాం అన్నట్టు మాట్లాడుతున్నారు.

శ్రీవిద్య వస్తే ఎదో ఒకటి అనేది లేదా ఎదో ఒకటి ప్రణవ్ ని హ్యాండిల్ చేసేది కాని ఇప్పుడు పరిస్ధితులలో శ్రీవిద్య గది దాటి బయటకు రావడం లేదు. తన క్యాబిన్ రూమ్ లో ఒక పక్కకు వాలి పోయి ముడుచుకొని పడుకొని ఉంది.

ప్రణవ్ అసలు అక్కడ లేడు.

సరిగ్గా అదే సమయానికి రామ్ దేవ్ శ్రీ కన్స్ట్రక్షన్స్ లోకి అడుగుపెట్టాడు. అదే సమయానికి ప్రణవ్ రామ్ దేవ్ ఎదురుగా నిలబడి షేక్ హ్యాండ్ యిచ్చి నవ్వాడు.

రామ్ దేవ్ కోపంగా ప్రణవ్ వైపు చూశాడు. ఎదో అనబోతూ ఉంటే ప్రణవ్ నవ్వి "మనం మీటింగ్ హాల్ - 2 లో మాట్లాడుకుందాం" అని వెళ్ళిపోయాడు.

రామ్ దేవ్ అసిస్టెంట్ "వెనక్కి వెళ్ళిపోదామా సర్"

రామ్ దేవ్ "మూసుకొని ఫాలో అవ్వు"

---------------------------------

కొద్ది సేపటిలో రామ్ దేవ్ "నీకు ఎంత దైర్యం ఉంటే నా కొడుకుతో అలా ప్రవర్తించి ఇపుడు నా ముందు ఇలా కనపడతావ్"

ప్రణవ్ "మనం కూర్చొని మాట్లాడుకుందామా"

అప్పుడే అక్కడకు వచ్చిన దీప ప్రణవ్ ని రామ్ దేవ్ ని చూస్తూ మనసులో "మిస్టర్ ప్రణవ్.... ఏం ప్లాన్ చేశావ్...."

ప్రణవ్ మొహం పై చిన్న స్మైల్... దీపని చూసి ఒక సారి కళ్ళు మూసి తెరిచాడు. దీప దాన్ని డీకోడ్ చేసుకుంటూ "నేను చూసుకుంటా... నా వాళ్ళ జోలికి ఎవరినీ రానివ్వను, వచ్చిన వాళ్ళను వదలను" అని బయటకు అనేసింది.

రామ్ దేవ్ ఆశ్చర్యంగా దీప వైపు చూశాడు.

దీప ప్రణవ్ వైపే కన్ను కూడా ఆర్పకుండా చూస్తుంది.

ప్రణవ్ మొహం పై చిన్న స్మైల్... ఒక్క సారిగా నవ్వు ఆపేసి సీరియస్ గా చూస్తూ మళ్ళి నవ్వడం మొదలు పెట్టాడు.
Next page: Update 12
Previous page: Update 10