Update 22

సిద్దార్డ్ కధ: మళ్ళి, మళ్ళి, మళ్ళి

రామ్ దేవ్ కన్స్ట్రక్షన్ సీఈఓ రామ్ దేవ్

రామ్ దేవ్ కి ముగ్గురు సంతానం
---మొదటి వారు అరుణ్ అతని భార్య అమృత
---రెండో వారు సునీల్ మరియు అతని భార్య సోనీ
---మూడో వాడు సిద్దార్డ్ (అక్రమ సంతానం)

రామ్ దేవ్ యొక్క రెండో భార్య మృణాళిని దేవి

మృణాలిని దేవి మరియు సిద్దార్డ్ ఇద్దరూ కలిసి ఉంటారు, వేరే ఇంట్లో. రామ్ దేవ్ అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళ్తాడు.

అమృత
అమృత బాగా ధనవంతుల కుటుంబం నుండి వచ్చింది, కాని ఆమె చాలా మంచిది. నిజానికి ఆమె సిద్దార్డ్ యొక్క క్లాస్ మెట్, అప్పటిలో వాళ్ళు కపుల్ అని అనుకునే వారు, ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఫీలింగ్స్ ఉన్నాయి, అమృత ఇంట్లో కూడా ఎటువంటి ప్లాబ్లం లేదు, అరుణ్ నిర్ధాక్షన్యంగా అమృతని పెళ్ళాడుతా అని చెప్పడం పైగా సిద్దార్డ్ అక్రమ సంతానం మరియు అరుణ్ మొదటి సంతానం కావడంతో అమృత తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పి ఆమెను అరుణ్ కి యిచ్చి పెళ్లి చేశారు. సిద్దార్డ్ వచ్చి నవ్వుతూ విష్ చేయడంతో అమృత కూల్ అయింది అలాగే అమృత తల్లిదండ్రులతో నాకు కూడా అమృత అంత మంచి అమ్మాయిని చూడండి ఆంటీ అంకుల్ అనడంతో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయి, చూస్తాం అబ్బాయ్ అంటూ సరదాగా ఫీల్ అవుతారు. అప్పటి నుండి సిద్దార్డ్ అమృతకి దూరంగా ఉండడం మొదలు పెడతాడు.

సోనీ
సోనీ తక్కువ స్థోమత కలిగిన కుటుంబం నుండి వచ్చిన యంగ్ అండ్ డైనమిక్ లేడీ. సోనీ టాలెంట్ చూసిన రామ్ దేవ్ ఆమెకు తన చిన్న కొడుకుని యిచ్చి చేస్తాను అని చెప్పాడు. ఆమె వయస్సు కొంచెం పెద్దది అయినా పర్వాలేదు అని చెప్పాడు. ఆ మాట విన్న సోనీ ఎగిరి గంతు వేసింది అంత పెద్ద కుటుంబానికి కోడలు అవుతున్నందుకు, కాని తన దగ్గరకు వచ్చిన ఫోటో సిద్దార్డ్. ఆమె ఊహల్లో సిద్దార్డ్ ని ఊహించుకుంది, కాని ఎప్పుడైతే పెళ్లి చూపులకు రెడీ అయిందో అక్కడ సునీల్ ని చూసి షాక్ అయింది. అలాగే సిద్దార్డ్ ఇక నుండి మరిది అని చెప్పడంతో తన పోరపాటుకి తనే సిగ్గు పడింది. సిద్దార్డ్ చాలా సరదా మనిషి, అందుకే ఆమెతో ఫ్రెండ్ షిప్ చేసి ఆమెను అమృతతో కలిపాడు. సిద్దార్డ్, అమృత మరియు సోనీ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. యిద్దరు కోడళ్ళు, సిద్దార్డ్ తో కలిసి ప్రవేటుగా ఒక చిన్న క్లాత్ బిజినెస్ కూడా చేస్తున్నారు. అమృత డబ్బు, సోనీ తెలివితేటలు ఉండడంతో పాటు సిద్దార్డ్ నైపుణ్యం తో ముగ్గురు పార్టనర్స్ గా బిజినెస్ కొనసాగుతుంది. సోనీ ఇప్పుడు రామ్ దేవ్ కన్స్ట్రక్షన్ లో ఒక బోర్డు మెంబర్ గా కొనసాగుతుంది.

మృణాలిని దేవి
మృణాలిని దేవి హౌస్ వైఫ్, సిద్దార్డ్ కి మదర్, అతడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చింది. సిద్దార్డ్ కూడా తల్లి చాటు బిడ్డ, అందుకే అందరితో ప్రేమగా కేరింగ్ గా ఉంటాడు.

అరుణ్ మరియు సునీల్
అరుణ్ మరియు సునీల్ ఇద్దరూ సిద్దార్డ్ ని కుక్క కంటే హీనంగా చూస్తారు. అలాగే మృణాలిని దేవిని కూడా అవమానిస్తారు. రామ్ దేవ్ కన్స్ట్రక్షన్ లో వీళ్ళు కూడా బోర్డు మెంబర్స్ కాని అది నామ మాత్రమె. నిజానికి వాళ్ళు సోనీ ఎం చెబితే అది చేస్తారు. అలా చేయమని రామ్ దేవ్ చెప్పాడు. ఇద్దరికీ వాళ్ళ వాళ్ళ వైవ్స్ అంటే చాలా ఇష్టం.

సోనీ "అతని దగ్గర ఇదే ఉందా" అని ఫోన్ లో అంది.

అవతలి నుండి "అవును మేడం"

సోనీ "అతని దగ్గర ఇంకా వెతకండి, ఇదీ చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్, ఒక డిటెక్టివ్ అయి ఉండి తను కలక్ట్ చేసిన విషయం" అంటూ చూస్తూ ఉంది.

అవతలి నుండి "ఇంతకీ ఎవరు కలక్ట్ చేయమన్నారొ తెలుసుకుంటున్నాం మేడం"

సోనీ "త్వరగా కానివ్వండి, ఇంకా మితి మీరితే పెద్ద బావ గారు అరుణ్ కి చెప్పండి, ఆయన ఇలాంటి డీల్ చేస్తారు" ఇప్పటికే ఒకరిని సాక్ష్యం లేకుండా చంపాడు అని ఒక రూమర్ ఉంది, కానీ నిజం ఏంటి అంటే అది ఒక రూమర్ మాత్రమె.

సోనీ తన ఆఫీస్ లో కూర్చొని తన ఫ్యామిలీ పై రాసి ఉన్న బయోడేటాని చూస్తూ ఉంది. లాస్ట్ లైన్ ఇద్దరికీ వాళ్ళ వాళ్ళ వైవ్స్ అంటే చాలా ఇష్టం అనే దగ్గర తన పెన్ పాయింట్ చేస్తూ చిన్నగా నవ్వుకొని పైకి లేచి రంగు గ్లాస్ డోర్ నుండి బయటకు చూసింది. సూర్యుడు వెలుతురు మొహం పై పడుతూ ఉంటే కళ్ళు మూసుకుంది, ఆమె కళ్ళలో నుండి తడి బయటకు రావడానికి సిద్దంగా ఉన్నా తనను తానూ సర్దుకొని కుర్చీలో కూర్చొని కంప్యూటర్ లో ప్రాజెక్ట్ లీగల్ డాక్యుమెంట్ చూడడానికి సిద్దం అయింది.

అప్పుడే ఫోన్ మోగింది సోనీ "హలో" అంది.

వాచ్ మెన్ "మేడం, సిద్దార్డ్ సర్ లోపలికి వచ్చారు" అన్నాడు.

సోనీ తనకే తెలియకుండా నవ్వి ఎదురుగా ఉన్న అద్దంలో తనను తానూ రెడీ అయి చూసుకొని డ్రెస్ సరి చేసుకొని మళ్ళి కూర్చుంది. సిద్దార్డ్ ఎక్కువ ఆడవాళ్ళను పొగుడుతూ ఉంటాడు. నిజానికి ఫ్లర్ట్ చేయడంలో phd చేశాడు. ప్రస్తుతం MBA చదువుతున్నాడు. వర్క్ నేర్చుకుంటా అని అడుగుతూ సపరేట్ బిజినెస్ లో పార్టనర్ అయ్యాడు. ఇప్పుడు ఇక్కడకు వచ్చి వర్క్ డీటెయిల్స్ చూస్తూ ఉంటాడు. సిద్దార్డ్ గురించి ఆలోచిస్తూ ఉంటే తన మనసు చాలా ఉల్లాసంగా ఉంది. దానికి కారణం కూడా ఉంది అదే సునీల్, పెళ్లి, శోభనం తర్వాత తనను పట్టించుకోవడం మానేశాడు. తన భార్య తన కంటే వయస్సులో పెద్దది అనా లేక ఆఫీస్ లో హై పొజిషన్ లో ఉంది అనా తెలియదు కాని సునీల్ తన దగ్గరకు రావడం అచ్చంగా మానేశాడు. గదిలోకి కూడా రాకుండా ఫ్రెండ్స్ తో ఉన్నాను, అంటూ ఇంటికి రావడం మానేశాడు. మొదట్లో ఇద్దరం సపరేట్ గా ఉందాం అన్నప్పుడు చాలా సంతోషించింది, కాని అతను రావడం లేదు కలవడం లేదు. ఆఫీస్ లో కూడా అతని మొహం కనపడకుండా తిరుగుతున్నాడు. సుమారు రెండు వారాలు గడిచాయి తన భర్త మొహం చూసి. ఇంకో నెల ఇలాగే జరిగితే అతన్ని మర్చిపోతానేమో అనిపిస్తుంది.

సిద్దార్డ్ కోసం ఎదురు చూస్తూ అవీ ఇవీ ఆలోచిస్తూ ఉంటే, సిద్దార్డ్ ఇరవై నిముషాలు గడిచినా రావడం లేదు, వద్దు వద్దు అనుకుంటూనే CC కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేసి సిద్దార్డ్ కోసం వెతికింది. తన డౌట్ నిజం అయింది, అతను ఆఫీస్ లో అమ్మాయిలతో మీటింగ్ పెట్టాడు ఎదో జోక్ పేల్చినట్టు ఉన్నాడు, అందరూ నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు, ఫోన్ లో టైం చూసింది నవ్వుకుంటూ "దొంగ సచ్చినోడు, టీ బ్రేక్ లో అంతా చూసుకొని వచ్చాడు" అనుకుంది. మరిది ప్లే బాయ్ నేచర్ చూసి నవ్వుకుంది.

సిద్దార్డ్ టైం చూసుకొని అందరినీ పంపించి తన రూమ్ దగ్గరకు వస్తున్నాడు, సోనీ తనను తానూ సర్దుకొని కంప్యూటర్ లో ఫుటేజ్ క్లోజ్ చేసి రెడీ గా ఉంది. ఇంతలో డోర్ నుండి సౌండ్ టక్ టక్ మని, సోనీకి "కమ్ ఇన్" అంది. వచ్చేది సిద్దార్డ్ అని తెలుసు అయినప్పటికీ తెలియనట్టుగా, ఏ మాత్రం ఎక్సైట్ మెంట్ లేకుండా "ఏంటి దొరవారు ఇలా వచ్చారు" అంది.

సిద్దార్డ్ కుర్చీ సోనీ వీలైనంత దగ్గరగా తీసుకొని వచ్చి "వదినా నీకొకటి చెప్పేదా.." అన్నాడు.

ఎదో సోది చెప్పబోతు ఉన్నాడని తనకు తెలుసు అయినప్పటికీ "ఏంటి?" అంది.

సిద్దార్డ్ "మన అసిస్టెంట్ దివ్య ఉంది కదా"

సోనీ "హుమ్మ్"

సిద్దార్డ్ "వాళ్ళ హస్బెండ్ ఊరికి వెళ్తున్నాడు అంట, నన్ను మళ్ళి ఇంటికి రమ్మని పిలిచింది" అన్నాడు.

సోనీ షాక్ గా "మళ్ళి" అంది. సిద్దార్డ్ కి అఫైర్స్ ఉన్నాయని తెలుసు కాని మరీ తన అసిస్టెంట్ ని లైను పెట్టేశాడు అంటే ఆశ్చర్యం వేసింది.

సిద్దార్డ్ "హుమ్మ్, అప్పుడో సారి వర్షం కురిసిన రాత్రి జరిగింది లే" అన్నాడు.

సోనీ "ఫ్" అని విసుగ్గా అంది.

సిద్దార్డ్ "తన నడుము కేక అసలు, తన నడుము పై పుట్టుమచ్చ ఉంటుంది... అబ్బబ్బా" అన్నాడు.

ఇదీ మొదటి సారి తను గదిలోకి వచ్చి తనను కాకుండా తన అసిస్టెంట్ ని పొగడడం, పైగా ఈ రాత్రి అబ్బాయి గారికి పండగ అనుకుంది. మొహంలో ఎటువంటి ఫీలింగ్ చూపించుకోకుండా "ఇంకా ఏమైనా ముఖ్యమైన విషయం చెప్పాలా" అంది.

సిద్దార్డ్ తల వంచేసి దిగులుగా ఫేస్ పెట్టి "తనకు నేను నో ఎలా చెప్పాలి" అన్నాడు.

సోనీ, సిద్దార్డ్ ని బయటకు వెళ్ళు అని చెప్పాలని అనుకుంది కాని అప్రయత్నంగా "ఎందుకు?" అంది. ఈ ప్రశ్న అడగకూడదు ఎందుకంటే దీని వల్ల సిద్దార్డ్ యొక్క అఫైర్స్ లో తను ఇంట్రెస్ట్ చూపించినట్టు అవుతుంది.

సిద్దార్డ్ దిగాలు ఫేస్ పెట్టి తల పైకెత్తి "రేపు ఎక్సాం ఉంది" అన్నాడు.

సోనీకి సిద్దార్డ్ మొహం చూసి ఎంత ఆపుకోవాలని అనుకున్నా నవ్వు వచ్చేసింది. "హహ్హహ్హా" అని గట్టిగా నవ్వేసి సిద్దార్డ్ తల మీద కొట్టింది, సిద్దార్డ్ తల రాయిలా ఉండే సరికి చనువుగా మళ్ళి మళ్ళి కొట్టింది. అవును తన మరిది దగ్గర తనకు అంత చనువు ఉంది.

సిద్దార్డ్ నవ్వుతూ "ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండు, ఎంప్లాయిస్ అందరూ నువ్వు కోపంగా ఉన్నావు అంటూ ఉన్నారు, అందుకే జోక్ పెల్చాలని ఇలా చెప్పాను" అన్నాడు.

సోనీ "అంటే దివ్య" అంది.

సిద్దార్డ్ "దివ్య నన్ను మళ్ళి రమ్మనలేదు" అన్నాడు.

సోనీ అయిమయంగా సిద్దార్డ్ వైపు చూస్తూ ఉంటే సిద్దార్డ్ "అంటే అంతకు ముందు కుడా రమ్మనలేదు అనుకో.... అంటే అసలెప్పుడు రమ్మనలేదు" అంటూ నవ్వాడు.

సోనీ సిద్దార్డ్ ని చూస్తూ మళ్ళి నవ్వింది.

సిద్దార్డ్ "వదిన... అదీ... అదీ..." అంటూ ఉన్నాడు.

సోనీ కి తెలుసు తను ఏం అడగబోతున్నాడో "ఎంత?" అంది.

సిద్దార్డ్ "మా మంచి వదిన ఐ లవ్ యు... అమృత వదిన కంటే నువ్వు అంటేనా నాకు చాలా ఇష్టం.... ఇరవై వేలు అంతే" అన్నాడు.

సోనీ ఇంకొంచెం సేపు సిద్దార్డ్ ని అక్కడే ఉంచాలని లేవు అందామని అనుకుంది, కాని అలా చెప్పకుండా "దివ్యని అడిగి తీసుకెళ్ళు... మళ్ళి" అని మళ్ళి అనే పదాన్ని వత్తిపలికింది.

సిద్దార్డ్ కూడా నవ్వుతూ చనువుగా సోనీ భుజం పై చరిచి వెళ్ళాడు. సోనీ నవ్వుకుంటూ ఉంది.

సిద్దార్డ్ వెళ్ళిపోయాక ఫోన్ అటెండ్ అయింది.

అవతలి నుండి "మేడం చాలా పెద్ద విషయం"

సోనీ "చెప్పూ"

అవతలి నుండి "ఎంక్వయిరీ చేయమన్న వ్యక్తీ, ఎవరో కాదు మీ మరిది సిద్దార్డ్ దేవ్"

సోనీ షాక్ అయింది. గట్టిగా "వాట్" అని అరిచింది.

అంటే తన దగ్గర తీసుకొని వెళ్తున్న డబ్బులు డిటెక్టివ్ కి ఇవ్వడానికా అనుకుంది. మనసులో ఎక్కడో బాధ, గుండెల్లో చిన్నగా నొప్పి, ఈ ఫీల్డ్ లో ఎవరిని నమ్మకూడదు అని తెలుసు కానీ సిద్దార్డ్ అలా కాదు ప్రత్యేకం, తన మనిషి. తను ఇలా చేస్తున్నాడు అంటే అది నమ్మక ద్రోహంలా అనిపించింది.

అవతలి నుండి "ఎప్పుడు నవ్వుతూ ఉండే మీ మరిది గురించి, చాలా పెద్ద విషయం తెలిసింది" అన్నాడు. సోనీ మొహం ఎర్రగా అయిపోయి కోపంగా ఉంది.

సోనీ గట్టిగా కళ్ళు మూసుకొని "చెప్పూ" అంది.

అవతలి నుండి "సిద్దార్డ్ గారు అతని కన్న తల్లి మరియు తోడబుట్టిన చెల్లి కోసం చాలా డేస్పరేట్ గా వెతుకుతున్నాడు, అందుకోసమే డిటెక్టివ్ ని పెట్టాడు"

సోనీ కోపం అంతా మాయమై పోయింది ఆ స్థానంలో అయోమయం చేరింది.

నోటి నుండి అప్రయత్నంగా "కన్న తల్లి" అంది.

అవతలి నుండి "అవును మేడం, సిద్దార్డ్ మృణాలిని దేవి యొక్క సంతానం కాదు"

సోనీ కి చాలా అయోమయంగా ఉంది "ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉండే సిద్దార్డ్ కి డార్క్ పాస్ట్ ఉండి ఉంటుంది అని తను అసలు అనుకోలేదు"

కుర్చీ నుండి పైకి లేచి అటు ఇటూ తిరిగింది. అవతలి నుండి "మేడం, మీ బావ గారికి అలాగే మీ భర్తగారికి రిపోర్ట్ చేయమంటారా" అని అన్నాడు.

సోనీ ఆలోచనలలో సిద్దార్డ్ ఎప్పుడూ తన అన్నయ్యల దగ్గర భయం భయంగా ఉండడం అలాగే వాళ్ళు అతన్ని పిలిచి డామినేటింగ్ మాట్లాడడం గుర్తుకు వచ్చింది. వెంటనే "చెప్పొద్దూ" అంది.

అవతలి నుండి "ఓకే మేడం" అని కట్ అయింది.

సోనీ "నాకు ఎందుకు ఇదీ అంతా నేను ఎందుకు సిద్దార్డ్ ని సేవ్ చేశాను" అనుకుంటూ ఉంది.

పైగా సిద్దార్డ్ కి రెండు మొహాలు ఉన్నాయి తన క్యారక్టర్ ఒక కాంప్లికేటేడ్ అని అనుకోలేదు. సిద్దార్డ్ ని తను చూసే విధానం పూర్తిగా మారిపోయింది.

అసిస్టెంట్ దివ్య కి కాల్ చేసి "నాకు, సిద్దార్డ్ కి డిన్నర్ బుక్ చెయ్ అలాగే తనకు కాల్ చేసి విషయం కన్ఫర్మ్ చెయ్" అంది.

దివ్య "మళ్ళి అదే ప్లేస్ లోనేనా మేడం" అంది.

'మళ్ళి' అని మనసులో అనుకుంటూ "హుమ్మ్" అంది.

సోనీ " 'మళ్ళి' కాదు ఎందుకంటే ఇప్పటి వరకు నేను చూసింది, కిడ్ సిద్దార్డ్ కాని ఇప్పుడు కలుస్తుంది ఒక మ్యాన్ సిద్దార్డ్" అనుకుంది.​
Next page: Update 23
Previous page: Update 21