Update 27

ఫ్లాష్ బ్యాక్

సిద్దార్డ్ కధ : మొదటి యుద్ధం


ప్రణవ్ మరియు సిద్దార్డ్ ఇద్దరూ దెబ్బలతో రక్తాలు మూతి నుండి ముక్కు నుండి కారుస్తూ తుడుచుకొని పైకి లేచి నిలబడ్డారు.

ప్రణవ్ "వాడు ఎక్కడ"

సిద్దార్డ్ "వాడు నా ఫ్రెండ్.... వాడికి ఏం కానివ్వను అని మాట ఇచ్చాను"

ప్రణవ్ "నాకు అడ్డం పడితే చస్తావ్"

సిద్దార్డ్ "ట్రై చేసి చూడు"

ప్రణవ్ "నీ యబ్బా...." అంటూ ముందుకు దూకాడు.

సిద్దార్డ్ మరియు ప్రణవ్ ఇద్దరూ కొట్టుకుంటూ ఉన్నారు.

సిద్దార్డ్ మనుషులు మరియు ప్రణవ్ మనుషులు కూడా కొట్టుకుంటూ ఉన్నారు.

మనోజ్ వాళ్ళను ఒకటవ అంతస్తు నుండి చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు.

కాలేజ్ ప్రిన్సిపల్ "రిలాక్స్ అవ్వండి..... ఒకడు (ప్రణవ్) సుహాసిని దేవి పెంపుడు కొడుకు, ఒక రకంగా స్లేవ్..... ఇక రెండో వాడు సిద్దార్డ్ ఒక బాస్టర్ద్, అక్రమ సంతానం..... వీళ్ళ కోసం ఏమి అంత పెద్ద సమస్య అవ్వదు. కొట్టుకొని కొట్టుకొని వాళ్ళే వెళ్ళిపోతారు" అంటూ టీ సిప్ చేశాడు.

బాయ్ "సర్ మన కాలేజ్ బయట సుహాసిని గారు తన కార్లతో బ్లాక్ చేశారు. ఏ నిముషంలో అయినా లోపలికి వస్తారు"

కాలేజ్ ప్రిన్సిపల్ "నువ్వు బయటకు వెళ్ళు" అని అతన్ని పంపించి,

మీటింగ్ రూమ్ లో ఉన్న అందరితో, కాలేజ్ ప్రిన్సిపల్ "పజిల్ సాల్వడ్... తప్పు సిద్దార్డ్ చేశాడు"

P1 "ఇదే సిద్దార్డ్ మనుషులు వచ్చి ఉంటే..."

P2 "తప్పు ప్రణవ్ చేసినట్టు... అంతే కదా సర్..."

కాలేజ్ ప్రిన్సిపల్ "చూడు నేను ఇక్కడ ఒక సమస్యని సాల్వ్ చేశాను"

బాయ్ "సర్.... రామ్ దేవ్ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరక్టర్ మిస్సెస్ సోనీ తన మనుషులతో వచ్చారు"

కాలేజ్ ప్రిన్సిపల్ "వాట్"

P1 "కార్లు వచ్చాయా"

బాయ్ "అవును సర్ మన గేటు దగ్గర ఇద్దరూ ఎదురెదురు కార్లలో నుండి దిగి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు"

P2 "సుహాసిని దేవి గారు వర్సెస్ సోనీ గారు"

P1 "కాదు.......... శ్రీ కన్స్ట్రక్షన్ వర్సెస్ రామ్ దేవ్ కన్స్ట్రక్షన్"

------------------------

నలభైలలో ఉన్న ఒక బిజినెస్ వుమెన్ ఒక వైపు చీరకట్టులో హుందాగా ఉంది. సుహాసిని దేవి.

మరో వైపు ముప్పైలలో ఉన్న మరో బిజినెస్ వుమెన్ ప్యాంట్, షర్ట్ పై కోటు ధరించి హుందాగా ఉంది. సోనీ గారు (అలియాస్ సోనాలి బాయి)

------------------------

సుహాసిని మనసులో "నా బిడ్డ జోలికి వస్తారా.... ఒక్కొక్కళ్ళను చంపేస్తాను"

సోనీ తన పొట్టపై చెయి వేసుకొని మనసులో "నా బిడ్డ కోసం వచ్చాను.... ఒక్కొక్కళ్ళను చంపేస్తాను"

P1 "ఇప్పుడు ఏం చేద్దాం ప్రిన్సిపల్ గారు"

కాలేజ్ ప్రిన్సిపల్ తత్తరపడుతూ CC టీవీలో గెట్ దగ్గర ఉన్న ఫుటేజ్ చూస్తూ భయపడుతున్నారు. కాళ్ళు చేతులు చమటలు పడుతున్నాయి.

P2 "గోవిందా గోవిందా "

అప్పుడే లోపలికి వచ్చిన మనోజ్ వాళ్ళ అందరినీ చూస్తూ "అప్పుడేనా.... ఇంకా అసలు సమస్య మొదలవ్వక ముందే"

కాలేజ్ ప్రిన్సిపల్ తో పాటు అక్కడ ఉన్న మిగిలిన అందరూ మనోజ్ ని నోరు తెరుచుకొని చూస్తూ "అసలు సమస్యనా" అన్నారు.

మనోజ్ చుట్టూ అందరినీ మార్చి మార్చి చూస్తూ నవ్వుతున్నాడు.​
Next page: Update 28
Previous page: Update 26