Update 35
ప్రణవ్ కధ - మిస్సింగ్
"అసలు అలా ఎలా అనుకున్నావ్, హా! ఆ సిద్దార్డ్ తో మాట్లాడితే, వాడితో తిరిగి కలిసిపోవాలి అని అనుకుంటూ ఉన్నట్టేనా... అసలు అలా ఎలా అనుకున్నావ్... నా గురించి నవ్వు... అక్కడ నువ్వు అసలు ఏమి అర్ధం చేసుకోకుండా వాడితో గొడవ పెట్టేసుకున్నావ్, అందుకే నిన్ను బయట నిలబడ్డాను. నీకు మాత్రమే అలా చెప్పగలను, ఎందుకంటే నువ్వు నా వాడివి కాబట్టి. ఏమన్నావ్.... నక్షత్రాలు, చందమామ, అర్హత అంటావా... దొంగ నాయాలా.... ఇద్దరం అంత దగ్గరయ్యాం అయినా కూడా నా మనసులో వేరే ఎవరో ఉన్నారని నన్ను అనుమానిస్తావా... అసలు మేడం మేడం అని నన్ను అవమానించినందుకు నిన్నూ... నిన్నూ... ఛీ.... ముందు నువ్వు ఎక్కడున్నా నా ముందుకు రా... నా పిచ్ లో నీ క్యారెట్... "
ప్రణవ్ శ్రీవిద్య నుండి వచ్చిన ఆడియో మెసేజ్ వింటూ ఉన్నాడు.
ఎదురుగా పని మనుషులు అందరు మరియు వాచ్ మెన్ తో కలిపి నిలబడి ఉన్నారు.
ప్రణవ్ "మీలో ఎవరు చూశారు"
వాచ్ మెన్ తో సహా అందరూ "మేం ఎవరం చూడలేదు సర్..."
ప్రణవ్ "మంచిది... అందరూ కొత్త జాబ్ వెతుక్కోండి"
పని మనిషి "అయ్యా గారు... మా కడుపు కొట్టకండి"
ప్రణవ్ "మరీ నీకేం తెలుసో అది చెప్పు"
పని మనిషి "మేడం గారు ఒకబ్బాయితో కలిసి వెళ్ళారు"
ప్రణవ్ "ఎవరు?" అంటూ సిద్దార్డ్ ఫోటో చూపించాడు. పనిమనిషి తల అడ్డంగా ఊపింది.
వాచ్ మెన్ "మీ ఫ్రెండ్ శ్రీకాంత్ కార్ మన ఇంటి వెనక ఆగింది సర్"
ప్రణవ్ "సరే" అంటూ శ్రీకాంత్ కి కాల్ చేశాడు రింగ్ టోన్ "ఏ స్క్వేర్, బి స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్" అని పాట వస్తుంది.
శ్రీకాంత్ "యో మ్యాన్... ఏంటి కాల్ చేశావ్"
ప్రణవ్ "ఎక్కడున్నావ్"
శ్రీకాంత్ "పార్టీ"
ప్రణవ్ "శ్రీవిద్య"
శ్రీకాంత్ "మీ అక్క కూడా ఇక్కడే ఉంది"
ప్రణవ్ "తనకు ఫోన్ యివ్వు"
శ్రీకాంత్ "ఓకే..." అని ఫోన్ కట్ చేశాడు.
ప్రణవ్ తన కార్ తీసుకొని ఆ పబ్ అడ్రెస్ కి బయలు దేరాడు.
ప్రణవ్ లోపలకు వెళ్ళేడప్పటికి శ్రీకాంత్ బయటకు కంగారుగా వచ్చాడు.
ప్రణవ్ "ఏమయింది?"
ఆ గొంతులో కోపం వింటూనే శ్రీకాంత్ కి చమటలు పట్టేశాయి.
ప్రణవ్ మళ్ళి "ఏమయింది?" అని అడిగాడు.
శ్రీకాంత్ భయంగా కళ్ళు మూసుకొని "శ్రీవిద్య కనపడడం లేదు" అన్నాడు.
ప్రణవ్ "హలో"
దీప (సుహాసిని అసిస్టెంట్) "హలో, ప్రణవ్ చెప్పూ... మీ అమ్మ బిజీగా ఉంది"
ప్రణవ్ "పిన్నీ... ముఖ్యమైన విషయం"
దీప "అవార్డు ప్రజంటేషన్ ఇంకా అవ్వలేదు, మనకు లా కాదు ఈ ఢిల్లీలో..."
ప్రణవ్ "నాకు ఆర్మీ కావాలి"
దీప "ఒక్క నిముషం" అని పక్కకు వచ్చి "ఇప్పుడు చెప్పూ ఎం కావాలి?"
ప్రణవ్ "ఆర్మీ"
దీప "ఏమయింది?"
ప్రణవ్ "శ్రీవిద్య మిస్సింగ్"
---------------------------------------------