Update 36

ప్రణవ్ కధ - శ్రీవిద్య మిస్సింగ్ పార్ట్ - 2

దీప "ఒక్క నిముషం" అని పక్కకు వచ్చి "ఇప్పుడు చెప్పూ ఎం కావాలి?"

ప్రణవ్ "ఆర్మీ"

దీప "ఏమయింది?"

ప్రణవ్ "శ్రీవిద్య మిస్సింగ్"

దీప "ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది... అయినా నువ్వు ఉండగా..."

ప్రణవ్ కోపంగా "యాక్సిస్ ఇస్తారా... లేదా నన్నే చూసుకో మంటారా..." అన్నాడు

దీప "ప్రణవ్ ఒక్క మాట వినూ..." అని బ్రతిమలాడుతున్నట్టు అడిగింది.

ప్రణవ్ "వినను, ఏదైనా తను దొరికిన తర్వాతే... ఎవడైనా ఉన్నాడని తెలియాలి... తలలు తెగి పడడమే" అని ఆవేశంగా అన్నాడు.

దీప "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ప్రణవ్... నువ్వు శ్రీ ని ప్రేమిస్తున్నావని... తన కోసమే ఇదంతా చేస్తున్నావని మాకు తెలుసు.... అయినా ఒక్కటి గుర్తు పెట్టుకో... నువ్వే శ్రీ కన్స్ట్రక్షన్ కి కాబోయే సీఈఓ... అలాగే నిన్ను నమ్ముకొని మీ అమ్మ సుహాసిని, అలాగే శ్రీవిద్య ఉన్నారు... ఎం చేసినా ఆలోచించి చెయ్" అంది.

ప్రణవ్ "అమ్మకి తెలుసా..."

దీప "మీ అమ్మకి మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్ గురించి తెలుసు... పైగా మీ అమ్మకి డబుల్ ఓకే"

ప్రణవ్ "..."

దీప "కొద్ది నిముషాలలో ఫుల్ ఫోర్స్ డీటెయిల్స్ నీకు వచ్చేస్తాయి. కంప్యుటర్ అనలిష్టులు, లాయర్లు, కాంబాట్ టీం, వెపన్స్ టీం, స్నైపర్స్ అందరూ గురించి నీకు యాక్సిస్ వస్తుంది. కానీ ఆకతాయి కుర్రాడిలా కాదు, కాబోయే సీఈఓలో ఆలోచించు"

ప్రణవ్ "ఏయ్... నువ్వు ముందు ఈ సోది ఆపి ఎవడో ఒకడిని వచ్చి నన్ను కలవమను" అని కసిరాడు

దీప "ఫ్...ఫక్ మ్యాన్.... భయపెట్టావ్" అని కొంచెం గ్యాప్ తీసుకొని "మిస్టర్ సేతు, ఎక్స్ మిలి*రీ కాంబాట్ టీం లీడర్ వచ్చి నిన్ను కలుస్తాడు"

ప్రణవ్ "ఎంత సేపటిలో"

దీప "వచ్చేసాడు, నీ ముందు ఉంటాడు"

బ్లాక్ డ్రెస్ లో ఒకరు వచ్చారు. ఆరు అడుగుల రెండు అంగుళాల ఒక బలమైన వ్యక్తీ, మొహం చాలా రఫ్ గా ఉంది. మొహం పై కాంబాట్ లో తగిలిన గాయాలు కనిపిస్తున్నాయి.

సేతు "మిస్టర్ ప్రణవ్" అంటూ షేక్ హ్యాండ్ కోసం చేయి ముందుకు జాపాడు.

ప్రణవ్ ఆ చేతిలో పేపర్ ఒకటి పెట్టి "ఇది శ్రీ మేడలోని లాకెట్ జిపియస్ నెంబర్... డీటెయిల్స్ ట్రాక్ చేయించు..."

సేతు ప్రణవ్ ని పై నుండి కిందకు చూసి "యస్ బాస్" అని ఎవరికో ఫోన్ చేయడానికి వెళ్ళాడు.

కొద్ది సేపటికి ఇంకొంత మంది బ్లాక్ డ్రెస్ వ్యక్తులు వచ్చారు. వస్తూనే ఒక వ్యక్తీ ప్రణవ్ దగ్గరకు వచ్చి "మీ వెపన్" అంటూ గన్ చేతికి ఇచ్చాడు. ప్రణవ్ దాన్ని తన నడుము దగ్గర దాచుకొని శ్రీకాంత్ వైపు చూశాడు.

శ్రీకాంత్ భయంతో వణికిపోతూ ప్రణవ్ వైపు చూస్తూ "నన్ను క్షమించు... నన్ను క్షమించు... " అంటూ ఏడుపు మొహం పెట్టాడు.

ప్రణవ్, శ్రీకాంత్ భుజం పై చేయి వేసి పక్కకు తీసుకొని వెళ్లి "రిలాక్స్..." అన్నాడు.

శ్రీకాంత్ ప్రణవ్ చేతిని నెట్టేసి "నువ్వు కాబోయే సీఈఓ, నీ దగ్గర ఒక పర్సనల్ కాంబాట్ టీం, వెపన్స్ టీం ఉన్నాయా" అని నోరు తెరిచాడు.

ప్రణవ్ సమాధానం చెప్పేలొపు శ్రీకాంత్ "నువ్వు శ్రీవిద్య లవర్సా, అందుకేనా తను దిగులుగా ఉంది" అన్నాడు.

శ్రీకాంత్ "శ్రావ్య నాకు ఫోన్ చేసి శ్రీవిద్య ని పిక్ అప్ చేసుకొని రమ్మని చెప్పింది"

ప్రణవ్ సేతు వైపు తిరిగి "శ్రావ్య ఇంటికి వాచ్ చేయండి, తన మొబైల్ ని కూడా హ్యాక్ చేయండి" అని చెప్పి శ్రీకాంత్ వైపు తిరిగాడు.

శ్రీకాంత్ "శ్రావ్య, నేను మరియు శ్రీవిద్య ముగ్గురం కూర్చొని బీర్ ఆర్డర్ చేసి తాగుతున్నాం

శ్రీవిద్య నిన్ను వదలనని, తనకు కావాలని చెప్పింది. అలాగే సిద్దార్డ్ తో కూడా అదే చెప్పి పూర్తిగా బ్రేక్ అప్ చెప్పి క్షమాపణ కూడా చెప్పానని చెప్పింది.

అందుకు శ్రావ్య నవ్వుతూ నువ్వు ఒక స్లేవ్ అని డబ్బులు యిచ్చి నిన్ను కొనుక్కుంటా అని పొగరుగా చెప్పింది.

అందుకు శ్రీవిద్య కోపంగా శ్రావ్యని చెంప పై కొడితే, శ్రావ్య కావాలంటే మీ అమ్మని అడుగు, ప్రణవ్ ఒక బానిస... మీ పెళ్లి జరగదు అని చెప్పింది

పైగా సంతోష్ కి తన పెళ్లి గిఫ్ట్ గా నిన్ను అడుగుతుంది అంట, లేకపోతే తనవి మరియు నీవి సెక్స్ వీడియోస్ చూపించి సెక్యూరిటీ స్టేషన్ లో అందరి మీద అత్యాచారం కంప్లైంట్ ఇస్తా అంది.

శ్రావ్య వెళ్ళిపోయాక, శ్రీవిద్య తనకు ప్రైవసీ కావాలని ఒక్కతే కూర్చొని బాధ పడుతూ బీర్ తాగింది"

ప్రణవ్ "తర్వాత"

శ్రీకాంత్ "తర్వాత నాకు తెలియదు... కానీ నాకు నువ్వు ఫోన్ చేసినపుడు... CC కెమెరా చూశాను. అందులో ఎం లేదు... కొంత మందిని కనుక్కోగా ఒక బార్టేండర్ ఎవరో ముగ్గురు తనని డ్రగ్ యిచ్చి కార్ లో తీసుకొని వెళ్ళారని చెప్పాడు"

ప్రణవ్ ఒక్క క్షణం అలానే ఉండి సేతు వైపు తిరిగి "బార్టేండర్లు అందరూ ఇక్కడ ఉండాలి"

బార్టేండర్లు అందరూ లైనులో నిలబడ్డారు.

ప్రణవ్ వచ్చి వాళ్ళ ముందు నిలబడి "చెప్పండి" అన్నాడు.

వాళ్ళలో ఒకరు "ఎం చెప్పాలి"

ప్రణవ్ చిన్నగా నవ్వాడు, కానీ అది భయంకరంగా అనిపించింది. అందరు గుటకలు మింగారు "ఏం చెబితే... మీ ప్రాణాలు, జీవితాలు మాములుగా ఉంటాయో అది చెప్పండి, లేక పోతే..." అని నవ్వాడు.

సేతు ప్రణవ్ పక్కకు వచ్చి నిలబడి తన గన్ బయటకు తీశాడు.

ఒకరు "మీరు డ్రగ్స్ గురించి అడుగుతున్నారా..."

శ్రీకాంత్ "కాదు కిడ్నాప్ గురించి..."

ఒకరు "నా దగ్గర ఈ బార్టేండర్, ఒక డ్రగ్ కొనుక్కున్నాడు... దాని వల్ల కొత్త వాళ్ళు స్పృహ తప్పుతారు"

ఆ బార్టేండర్ పరిగెత్తబోయాడు. అతన్ని పట్టుకొని అక్కడే నిలబెట్టారు.

ఆ బార్టేండర్ "నా వెనక ఎవరు ఉన్నారో తెలుసా..." అని బెదిరించే ప్రయత్నం చేశాడు.

కొద్ది సేపటికి ఆ బార్టేండర్ రక్తం కక్కుతూ ఆమ్మా అయ్యా అని మూలుగుతూ ఉన్నాడు.

ప్రణవ్ "ఎంత సేపూ ఎవరు వెనక ఉన్నారో అని కాదు, ముందు ఎవడు నిలబడ్డాడు, ఎం చేయగలడు అనేది కూడా చూసుకోవాలి"

ఆ బార్టేండర్ "నా ప్రాణాలు పోతాయ్ సర్"

ప్రణవ్ పెదవి విరిచి కత్తి తీసుకొని అతని చేతిపై పొడిచాడు.

చుట్టూ ఉన్న అందరు కొంచెం భయపడ్డారు. శ్రీకాంత్ ప్రణవ్ లోని కొత్త యాంగిల్ చూసి భయం అనిపించినా అతను ఫ్రెండ్ కాబట్టి హమ్మయ్యా అనుకున్నాడు.

ప్రణవ్ "ఇలాగేనా పోయేది" అన్నాడు. మాట సౌమ్యంగా ఉన్నా గొంతులో భీభత్సం వినపడుతుంది.

ఆ బార్టేండర్ "ప్రకాష్" అని అరిచాడు.

ప్రణవ్ "నాకు ఓపిక లేదు ఏ ప్రకాష్ అనేది చెప్పు" అని అరిచాడు.

ఆ బార్టేండర్ "మీ కాలేజ్ ప్రకాష్, అతను మరియు వంశీ, సల్మాన్" అన్నాడు.

ప్రణవ్ "వాళ్ళ ఫోన్ నెంబర్స్ ట్రాక్ చేయండి"

శ్రీకాంత్ "మరీ వీళ్ళు"

ప్రణవ్ "రేయ్ అందరూ మీ డీటెయిల్స్ యిచ్చి వెళ్ళండి. ఇంకా వీడిని హాస్పిటల్ లో చూపించండి, అయిపోయాక వీడి వెనక ఉన్న వాడి సంగతి కూడా చూద్దాం" అని అక్కడ నుండి వెళ్ళాడు.

బయటకు వచ్చిన ప్రణవ్ కోపంగా "అసలు ఆ నా కొడుకులకు నా శ్రీ.. ని టచ్ చేసే దైర్యం వచ్చిందా..." అని అన్నాడు.

సేతు "మరో పది నిముషాలలో మేడం ఎక్కడ ఉన్నారో తెలిసి పోతుంది సర్"

ప్రణవ్ సేతు వైపు చూసి "వాళ్ళను చంపబోతున్నాం, దానికి ప్రిపేర్ అయి ఎవ్వడు నాతో ఉంటాడో వెల్తాడో డిసైడ్ అవ్వండి" అన్నాడు.

అక్కడున్న బ్లాక్ డ్రెస్ వాళ్ళు అందరూ తనతోనే ఉంటాం అన్నట్టు తల ఊపారు.

శ్రీకాంత్ "నేను ఇక వెళ్తా" అని చిన్నగా అన్నాడు

ప్రణవ్ "నిన్ను అడగలేదు"

శ్రీకాంత్ ఇంకేం మాట్లాడలేదు.

ప్రణవ్ ఫోన్ మరియు ఎదురుగా పది నిముషాలకు గడియారం పెట్టుకొని చూస్తూ ఉన్నాడు.

అతని శ్వాస వేడిగా వేటకు సిద్దంగా ఉన్నా సింహం శ్వాసలా ఉంది. అతని వెనక ఉన్న మనుషులను కూడా కలిపి చూస్తూ పది నిముషాలలో ఆ సల్మాన్ & కో వేట మొదలవుతుంది. దేవుడా వాళ్ళ చావు ఎక్కువ పెయిన్ లేకుండా చూడు తండ్రి అనుకున్నాడు శ్రీకాంత్.

సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ...

సేతు "అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు"

ప్రణవ్ "చావాలన్న కోరిక పుట్టి"

సేతు, శ్రీకాంత్ ఇద్దరూ ఒకరికళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు.

ఇంతలో ఫోన్ మోగింది.

ప్రణవ్ ఫోన్ ఎత్తాడు.

"లొకేషన్ షేర్ చెయ్" అంటూ కార్ దగ్గరకు కదిలారు.

కార్ ఆన్ అవ్వగానే కార్ ఇంజెన్ కూడా "బ్రూం... బ్రూం... " అంటూ సిచ్వువేషన్ కి తగ్గట్టు సౌండ్ చేసింది.

శ్రీకాంత్ మనసులో "నిజంగానే అసలు ఎందుకు కిడ్నాప్ చేశాడు. అసలు ఆ ఆలోచన వాళ్ళకు ఎందుకు వచ్చింది" అనుకున్నాడు.

వెళ్తున్న వాళ్ళ కార్ CC టీవీ ఫుటేజ్ తన లాప్ టాప్ లో చూస్తూ 'రన్ ప్రణవ్ రన్' అంటూ కాఫీ సిప్ చేస్తున్నాడు మనోజ్.​
Next page: Update 37
Previous page: Update 35