Update 40
ప్రణవ్ కధ - మొదటి యుద్ధం - తప్పించుకున్నారు
(హాస్పిటల్)
సుహాసిని "ని.. ని.. నిజం చెప్పూ..." అంటూ దీప చేయి పట్టుకుంది
దీప "అవును మేడం.... ఇది జస్ట్ కిడ్నాప్ కాదు... రేప్ అటెంప్ట్ అండ్ హెరాస్ మెంట్" అంది.
సుహాసిని షాక్ అయి చమటలు పట్టేసి కళ్ళు తిరిగి పడిపోయింది.
సుహాసిని దేవిని కూర్చోబెట్టి బిళ్ళలు వేసి స్పృహలోకి తీసుకోని వచ్చారు "నా కూతురు ఎక్కడ దీప..." అంటూ దీప చేతిని పట్టుకొని ఊపుతూ అడుగుతుంది. మొహం అంతా చమతలతో కళ్ళ నిండా కన్నీళ్ళతో కాళ్ళు తడబడుతూ తట్టుకుంటూ పరుగులాంటి నడకతో శ్రీవిద్య రూమ్ కి చేరుకుంది.
రూమ్ ముందుకు వచ్చాక తలుపు తెరిస్తే ఎటువంటి దృశ్యం ఉంటుందో అని భయం భయంగా అనిపిస్తూ ఉంటె, వెనకే వచ్చిన దీప తలుపు తెరిచింది.
(ఎదురుగా)
సెలైన్ డ్రిప్ పెట్టుకొని మంచం పై శ్రీవిద్య పడుకొని నిద్రపోతూ ఉంటే, పక్కనే ప్రణవ్ ఒక స్టూల్ మీద కూర్చొని ఉన్నాడు.
సెలైన్ డ్రాప్ చిన్నగా డిప్ డిప్ మంటూ ఏ శబ్దం లేకుండా పడుతూ శ్రీవిద్య శరీరంలోకి జేరుతూ ఉంటే, గదిలో ఏ అలికిడి లేని నిశ్శబ్దం ఉంది.
శ్రీవిద్య ఓ పక్కకు పడుకొని ప్రణవ్ చేతిని ఎదో బొమ్మని పట్టుకున్నట్టు గట్టిగా హత్తుకొని పడుకుని నిద్రపోతుంది.
సుహాసిని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ప్రణవ్ పక్కనే నిలబడి భుజం పై చేయి వేసింది. ప్రణవ్ చిన్నగా చేయి కదిలించబోయినా శ్రీవిద్య నిద్రలో కదులుతూ, నొప్పి కలుగుతూ ఉన్నట్టు "మ్మ్" అంటుంది. ప్రణవ్ ఆమె తల పై చేయి వేసి నిమురుతూ "ఇక్కడే ఉన్నాను" అన్నాడు. శ్రీవిద్య దైర్యంగా నిద్రపోయింది.
ప్రణవ్ భుజం పై వేసిన సుహాసిని చేయి బిగుసుకుని అలానే కొద్ది సేపూ ఉంది.
వాళ్ళ మధ్య మాట్లడుకోడానికి, కోప్పడడానికి చాలా ఉన్నా కానీ మౌనంగానే ఉన్నారు. నిశ్సబ్దంగానే ఆ గది ఉంది.
దీప "వెల్లికిలా పడుకోవచ్చు కదా" అని చిన్నగా అంది.
శ్రీవిద్య నిద్రలో మళ్ళి కదిలింది.
ప్రణవ్ ఆమె చెవి దగ్గర "నేను ఇక్కడే ఉన్నాను" అన్నాడు.
శ్రీవిద్య చిన్నగా "ప్రణవ్... ప్రణవ్... వాళ్ళు... వాళ్ళు... " అంటూ ఉంది.
ప్రణవ్ "హుమ్మ్"
శ్రీవిద్య చిన్నగా "వాళ్ళు నన్ను కొట్టారు" అంది.
సుహాసిని ఎప్పుడూ నవ్వుతూ ఉండే తన కూతురు శ్రీవిద్య అలా ఉండే సరికి ఏడుస్తూ దీపను హత్తుకుంది.
ప్రణవ్ కూడా బయటపడకుండా తనను తానూ ఆపుకొని "అయితే త్వరగా నిద్ర లే! వాళ్ళను నేను కొట్టడం చూడవా..." అంటాడు.
శ్రీవిద్య ఏమి మాట్లాడకుండా అలానే నిద్రపోయింది.
గదిలో ఉన్న మిగిలిన ముగ్గురు తననే చూస్తూ ఉన్నారు.
మధ్య మధ్యలో కదులుతూ నొప్పికి "మ్మ్" అంటూ ఉంది.
ఈ లొపు నర్స్ లోపలికి వచ్చి ఆ సెలేన్ మార్చి మరో సెలేన్ పెట్టి "మాములుగా పడుకోవచ్చు కదా... ఎందుకు పక్కకి తిరిగి పడుకుంది" అని అడిగింది.
ఆ గదిలో ఉన్న నిశ్శబ్దానికి నర్స్ మాములుగా మాట్లాడినా అది పెద్ద శబ్దంలా ఉంది. ప్రణవ్ కోపంగా నర్స్ ని చూస్తూ "బయటకు పో" అని సైగ చేశాడు.
దీప ఆమెను బయటకు తీసుకొని వెళ్లి "అమ్మాయికి వీపు మీద దెబ్బలు ఉన్నాయి అందుకని ఒక పక్కకి పడుకొని నిద్రపోతుంది" (వీపు మీద, పిర్రలమీద కర్రతో కొట్టిన దెబ్బలు ఉన్నాయి)
నర్స్ "ఏమయింది?"
దీప "కొంత మంది తన క్లాస్ అబ్బాయిలు, డ్రింక్ లో మందు కలిపి తీసుకొని వెళ్ళారు, సహకరించడం లేదని సరివి కర్రలతో కొట్టారు" అని తలదించుకుంది.
నర్స్ "రేప్ అవ్వలేదు ఆమ్మా, మేం చూశాం కదా, బాగానే ఉంది... "
దీప "మా అబ్బాయి సమయానికి ఫ్రెండ్స్ తో వెళ్లి కాపాడాడు"
నర్సు "అవునా...." అని ఒక్క క్షణం ఉండి "అలా ఒక వైపే పడుకొని ఉంటె చేతులు కాళ్ళు పట్టేస్తాయి... గంటకి ఒక సారి ఇంకో వైపుకి తిరిగి పడుకోమనండి".
(ఉదయం ఆరు గంటలు)
ప్రణవ్ నిద్రలేచాడు.
డాక్టర్ వచ్చి శ్రీవిద్యని పలకరిస్తున్నాడు.
డాక్టర్ "ఎలా ఉంది అమ్మా, పెయిన్ కిల్లర్ అయిట్ మెంట్ ఇస్తున్నాను. చల్లగా ఉంటుంది. రాయించుకొని పడుకో.... రెండు సార్లకి మొత్తం తగ్గిపోతుంది"
శ్రీవిద్య తల ఊపి, వాళ్ళ అమ్మ వైపు చూసింది.
సుహాసిని, తన కూతురు తల నిమురుతూ ఉంది.
డాక్టర్ బయటకు వెళ్ళాక శ్రీవిద్య నవ్వుతూ ప్రణవ్ వైపు చూసి "ఏంటి నువ్వు మేడం గారు అని కాకుండా మళ్ళి శ్రీ అంటున్నావ్" అంది.
శ్రీవిద్య నవ్వు చూసి పిచ్చి కోపం వచ్చి పక్కనే సుహాసిని ఉందని కూడా లేకుండా "బుద్ది ఉందా నీకు అసలు, పనిమనిషిని గదిలో ఉంచి నువ్వు పార్టీకి వెళ్తావా... హ!!" అన్నాడు. వాళ్ళ అమ్మ అక్కడే ఉంది కాబట్టి అంత కంటే ఎక్కువ అనలేక పోతున్నాడు.
శ్రీవిద్య "హా! మరీ నువ్వు ఉంటె తాగకూడదు, డాన్స్ చేయకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అంటావ్... అందుకే నిన్ను తీసుకొని వెళ్ళకుండా పార్టీకి వెళ్ళా" అని నవ్వుతు అంది.
ప్రణవ్ "నిన్నూ" అంటూ రెండు చేతులు గొంతు దగ్గరకు తీసుకొచ్చి "చంపెయాలే నిన్నూ" అని తీసేశాడు.
శ్రీవిద్య "అమ్మా, చూడమ్మా నీ కొడుకు నన్ను చంపేస్తున్నాడు"
సుహాసిని వాళ్ళను చూసి నవ్వుతూ "హుమ్మ్, ఎప్పుడూ కుక్కలు లాగా కొట్టుకుంటునే ఉంటారు... రేపు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటారు రా..." అంది.
శ్రీవిద్య షాక్ అయి వాళ్ళ అమ్మని చూస్తూ ఉంది.
ప్రణవ్ "మధ్యలో గొడవలు తీర్చడానికి నువ్వు ఉంటావ్ కదా"
సుహాసిని "నేను మీ పిల్లలతో బిజీగా ఉంటా... అవునూ వాళ్ళ చేత నానమ్మ అని పిలిపిస్టారా, అమ్మమ్మ అని పిలిపిస్తారా" అంది.
శ్రీవిద్య ఇబ్బందిగా సుహాసిని వైపు చూసింది. సుహాసిని నవ్వులో అర్ధం అర్ధం చేసుకొని సంతోషంగా నవ్వుకుంటూ "నేను ఈ మొరతోడిని పెళ్లి చేసుకోను" అంది.
ప్రణవ్ "నేను కూడా చేసుకోను... ఈ అమ్మాయి పెళ్లి అయ్యాక కూడా పార్టీకి వెళ్లాలని తన బదులుగా వేరే పనిమనిషిని బెడ్ పై ఉంచితే..." అన్నాడు.
శ్రీవిద్య కొంచెం పైకి లేచి "నీ యబ్బా" అంటూ ప్రణవ్ ని చేతులతో కొడుతూ, భుజం పై కొరికింది.
అప్పుడే లోపలి వచ్చిన దీప లోపల జరుగుతుంది చూసి "కొంచెం ఓపిక వచ్చిందే తడవు, మళ్ళి తిట్టుకోవడం, కొట్టుకోవడం మొదలుపెట్టారా... రేయ్ ప్రణవ్ నువ్వు అయినా తగ్గొచ్చు కదా... పాపం శ్రీ..."
సుహాసిని "మా అబ్బాయి తప్పేం లేదు, ఫాక్ట్ మాట్లాడాడు అంతే"
శ్రీవిద్య, దీపతో "చూడు పిన్నీ ఆమ్మా కొడుకులు ఇద్దరూ నన్ను ఒక్క దాన్ని చేసి ఆడుకుంటున్నారు... నువ్వు ఇటూ రా ఇటొచ్చి కూర్చో" అంది.
దీప "వాళ్ళు ఇద్దరూ కలిస్తే ఎవ్వరూ ఆపలేరు... నా మాట విని నువ్వు కూడా వాళ్ళ పార్టీలోకి జంప్ అయిపో" అంది.
శ్రీవిద్య నవ్వుతూ ఉంది.
అప్పుడే లోపలి వచ్చిన నర్సు "మీరందరూ వెళ్ళండి, ఆయిట్ మెంట్ రాయాలి" అంది. అందరూ బయటకు వెళ్ళారు.
శ్రీవిద్య మంచం పై బోర్లా పడుకుంటే నర్సు ఆయిట్ మెంట్ రాస్తూ "ఆ అబ్బాయి ఎవరు? మీ అమ్మని అమ్మ అంటున్నాడు... మీ అన్నయ్యా, తమ్ముడా" అంది.
శ్రీవిద్య చిన్నగా నవ్వి "రెండు కాదు, నాకు కాబోయే వాడు... వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే మా దగ్గరే పెరిగాడు. అందుకే నాతొ పాటు మా అమ్మని కూడా అమ్మ అంటాడు, మా అమ్మ కూడా కొడుకు అనే అంటుంది"
నర్సు "ఓహో... సారీ... రాత్రంతా నీ పక్కనే ఉన్నాడు, పొద్దుగాల పొద్దుగాల నిద్ర తూలుతూ ఉంటె మీ అమ్మ తనని పడుకోమని తను కూర్చుంది"
శ్రీవిద్య "నాకు తెలుసు... " అంది.
(బయట)
దీప "చాలా ముఖ్యమైన విషయం"
ప్రణవ్ "ఏమయింది?"
దీప "రాత్రి సేతు వాళ్ళ మీద ఎవరో స్మోక్ బాంబ్ వేసారు అంట"
ప్రణవ్ "ఆ ముగ్గురు"
దీప "తప్పించుకున్నారు"
ప్రణవ్ "ఇంకెందుకు... కాంబ్యాట్ అని బిరుదులు... సంక నాకమను"
సుహాసిని "షట్ అప్ ప్రణవ్.... అలా మాట్లాడకు... మన వాళ్ళను మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు"
ప్రణవ్ విసురుగా వెనక్కి తిరిగాడు.
సుహాసిని "వాళ్ళకు ఎలా ఉంది"
దీప "హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు, ఆక్సిజెన్ యిచ్చి ఇంటికి పంపించారు"
ప్రణవ్ "నేనే తప్పు చేశాను, వాళ్ళను అక్కడే ఉంచకుండా, ప్లేస్ మార్పించాల్సింది"
సుహాసిని "చూడు... ఏం జరిగిందో కాదు, ఏం చేయాలో ఆలోచించు"
ప్రణవ్ "వాళ్ళను వెతుకుతాను" అంటూ బయటకు కదలబోయాడు.
సుహాసిని అతన్ని ఆపి దీప వైపు తిరిగి "మన సెర్చింగ్ టీం కి చెప్పు... మొత్తం వెతకండి"
ప్రణవ్ "కళ్ళ ముందు ఉన్న వాళ్ళను వదిలేశారు, నువ్వు మళ్ళి వాళ్లనే నమ్ముతున్నావా..."
సుహాసిని "నీకు ఈ మధ్య బాగా ఎక్కువయింది" అంటూ ప్రణవ్ ని తీసుకొని వెళ్లి శ్రీవిద్య పక్కనే ఉన్న బెడ్ పై పడుకోబెట్టి శ్రీవిద్యతో "నువ్వు నిద్రపోతావా..." అని అడిగింది.
శ్రీవిద్య "లేదు అమ్మా, ఇలా పడుకోమన్నారు, కొద్ది సేపూ" బోర్లా పడుకొని ఉంది.
సుహాసిని "సరే, వీడిని చూస్తూ ఉండు... రాత్రి కూడా వీడికి నిద్ర లేదు"
శ్రీవిద్య "హుమ్మ్, సరే..."
ప్రణవ్ కళ్ళు మూసుకొని పడుకున్నాడు.
శ్రీవిద్య అతన్ని చూస్తూ చూస్తూ కళ్ళు మూసుకుంది. కళ్ళు తెరిచేసరికి ప్రణవ్ అక్కడ లేడు.
శ్రీవిద్య ప్రణవ్ అని పిలుస్తూ రూమ్ మొత్తం చూసి బాత్రూంలో కూడా వెతికింది.
శ్రీవిద్య బయట ఉన్న దీపని ప్రణవ్ వచ్చాడా అని అడిగితె దీప "అదేంటి లోపల లేడా" అంది.
ఇద్దరూ మళ్ళి గది మొత్తం వెతకగా, అప్పుడే లోపలకు వచ్చిన సుహాసినికి ఎదురుగా ఉన్న ఓపెన్ అయిన కిటికీ అసలు కధ చెప్పేసింది.
సేతుని కలిసిన ప్రణవ్ రాత్రి అక్కడ CC కెమెరా చూస్తూ రాత్రి వాళ్ళపై ఎటాక్ చేసిన వ్యక్తిని చూస్తూ ఉన్నారు. వచ్చింది ఎక్కువ మంది కాదు, ఒక్కడే... హైట్, మాస్క్, అన్ని చూస్తూ ఉన్నారు.
సిటీలో మరో చోట మనోజ్ కూడా ఎవరు తీసుకు వెళ్ళారో అన్ని CC కెమెరాలు రికార్డ్ ని తన లాప్ టాప్ లో చూస్తూ ఉన్నాడు.
ప్రణవ్ మరియు మనోజ్ ఇద్దరి నోటి నుండి ఒకటే మాట వచ్చింది "సిద్దార్డ్"
(సిటీలో మరొక చోట)
సిద్దార్డ్ ఫోన్ లో "మీరు అడిగినట్టే వాళ్ళను కాపాడాను... మా అమ్మ, చెల్లి ఆచూకి చెబుతా అన్నారు"
అవతలి వ్యక్తీ "ఆచూకి కాదు, నీ కంటి ముందుకు తీసుకొని వస్తాను... "
సిద్దార్డ్ "థాంక్స్ సర్"
అవతలి వ్యక్తీ "ముందు నువ్వు ఈ ముగ్గురును బాగా చూసుకో... ఈ వారం రోజులు"
సిద్దార్డ్ "తప్పకుండా... వీళ్ళు నాకు కూడా ఫ్రెండ్స్... ఎదో తాగిన మత్తులో ఆమె జోలికి వెళ్లి ఉంటారు... జనరల్ గా చాలా మంచి వాళ్ళు"
అవతలి వ్యక్తీ "హహ్హహ్హ" అని నవ్వుతూనే ఫోన్ కట్ చేశాడు.
ఈ అవతలి వ్యక్తీ ముందు ముందు కధలో కీలకమైన వ్యక్తీ... సిద్దార్డ్ యొక్క అమ్మ మరియు చెల్లెలు గురించి అతనికి బాగా తెలుసు.