Update 03

స్వప్న : మౌనికా..

రాజీ : ఇది కూడా మారిపోయింది, ఆస్తి డబ్బులు వచ్చాక ఆ మాధవ్.. వాడిలాగే తయారయ్యింది.. దీని పని అయిపోయింది ఇంక చందు గాడి అవసరం ఏముంది అందుకే గెంటేసింది.

మౌనిక : నేనేమి వాడిని గెంటెయ్యలేదు.. అరిచింది గట్టిగా

స్వప్న : మరి ఎందుకు వెళ్ళిపోయాడు వాడు

రాజీ : నన్ను అడుగు నేను చెప్తా.. ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా వాడితో సరిగ్గా ఉండలేదు, ఎప్పుడైనా వాడితో మాట్లాడటం చూసావా.. వాడు మాట్లాడినా మౌనంగా ఉంటుంది తప్ప నోరెత్తిన పాపాన పోలేదు.. మనిషి అనేవాడు ఎవడైనా ఎందుకు ఉంటాడు అందులో చందు గాడు.. ఇంకెందుకు ఉంటాడు.. వెళ్ళిపోయాడు అని కోపంగా ప్లేట్ పక్కకి నెట్టేసి లేచి వెళ్ళిపోయింది.

స్వప్న : నువ్వు చేసింది ఏం బాగోలేదు మౌనికా అని తను కూడా వెళ్ళిపోయింది.

మౌనిక మాత్రం మౌనంగానే తన అన్నం తను తినేసి ఒక్కటే చందు రూంలోకి వెళ్లి డోర్ గడి పెట్టేసి మంచం మీద పడుకుంది. ఏదేదో ఆలోచిస్తుంటే చందు వాడేసిన టవల్ గోడకి వేలాడుతూ గాలికి ఎగురుతుంటే లేచి టవల్ అందుకుని మొహం తుడుచుకుంటూ కళ్ళు మూసుకుని టవల్ వాసన పీలుస్తూ తన ఒంటి మీద కప్పుకుని చందుని ఊహించుకుంటూ టవల్ తన కళ్ళు మీద కప్పుకుని పడుకుంది. తన ఏడుపు, ఆ కన్నీళ్లు టవల్ పీల్చుతుంది.

పక్క రూంలో రాజీ కోపంగా వెళ్లి వెంటనే చందుకి ఫోన్ చేసింది.

చందు : వదినా చెప్పు

రాజీ : నీకు అది లేకపోతే అనాధ లాగా వెళ్లి ఎక్కడో ఉంటావా, నేను నీకేం కానా.. నువ్వేం చేస్తావో నాకు తెలీదు రేపు నువ్వు ఇంటికి రావాలి, ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే నేను కూడా నీతో వస్తాను మనం ఇద్దరం వేరే ఉందాం.

చందు : వదినా వదినా.. అన్నిటికి ఆవేశమే నీకు.. ముందు నేను చెప్పేది విను

రాజి : చెప్పు.. ఏం చెప్తావ్

చందు : మీరు ముగ్గురు చిన్నప్పటి నుంచి కలిసే ఉంటున్నారు, ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఎక్సట్రా లగ్గేజ్

రాజి : అంటే..

చందు : ముందు విను.. వదిన నేను ఒక రూంలో పడుకుంటున్నాం, పాపం తనకి ఎందుకు ఇబ్బంది చెప్పు.. ఇప్పుడు నేను లేకపోయినా మీరు ఉన్నారు కదా, నాకిక్కడ ఏ ఇబ్బంది లేదు సతీష్ గాడు కూడా నా కుటుంబమే.. గుణ అని నా ఫ్రెండ్.. తన రూంలోనే ఉంటున్నాను.. నాకు ఏ ఇబ్బంది వచ్చినా ముందు నీకే ఫోన్ చేస్తాను సరేనా

రాజీ : నువ్వు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను

చందు : ప్లీజ్.. నన్ను కన్విన్స్ చెయ్యకు.. ప్లీజ్ రాజీ

రాజీ : నాకు రోజూ ఫోన్ చెయ్యాలి, రోజూ చాట్ చెయ్యాలి.. రెండు రోజులకి ఒకసారి కలుస్తానని మాటివ్వు.. ఏడ్చేసింది

చందు : రోజూ రాత్రి కాల్ చేస్తాను, చాట్ చేస్తాను.. సరేనా అప్పుడప్పుడు కలుద్దాం

రాజీ : అకౌంట్లో మనీ వేస్తున్నా

చందు : వద్దు.. ప్లీజ్.. నాకు అలాంటివి నచ్చవు.. నీకు తెలుసు

రాజీ : ఎహె పో.. అని ఫోన్ పక్కన పెట్టేసి ఏడుస్తూ పడుకుంది.

చందు ఫోన్ పక్కన పడేసి మంచం ఎక్కి పడుకున్నాడు, గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేస్తున్న గుణ చందుని చూసి ఫోన్ పక్కన పెట్టాడు.

గుణ : ఏంట్రా ఎలా ఉంది అంతా ఓకే నా

చందు : సూపర్ మామా

గుణ : ఓనర్ టూర్ కి వెళ్ళాడు రావడానికి ఒక పది పదిహేను రోజులు పట్టొచ్చు, అప్పటివరకు నీ ఇష్టం.. వాడు వచ్చాక మాత్రం ఎప్పుడొచ్చావ్ అని అడిగినా ఇవ్వాళే వచ్చానని గట్టిగా మాట్లాడు మిగతాది నేను చూసుకుంటాను. కొంచెం అడ్వాన్స్ వాడి మోహన కొడితే చాలు వాడే ఊరుకుంటాడు. చందు ఓకే.. అని ఒళ్ళు విరిచి ఆవులిస్తూ పడుకున్నాడు. పొద్దునే లేవకముందే స్వప్న నుంచి ఫోన్

చందు : హలో

స్వప్న : నేను నీతో మాట్లాడను.. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, నేనంటే లెక్క లేదు, నేనంటే ప్రే...

చందు : అలా మాట్లాడకు.. నేను బాధపడతా

స్వప్న : మరి నువ్వు చేసిందేంటి

చందు : ఊరుకో వదినా.. ఏమి కాలేదు కానీ ఆమ్మో మర్చిపోయా నేను వెళ్ళాలి మళ్ళీ చేస్తా మళ్ళీ మాట్లాడుకుందాం అని పెట్టేసి లేచాడు. స్వప్న కూడా అలక మొహం వేసుకుని ఆఫీస్ కి వెళ్ళిపోయింది. ముగ్గురి స్నేహితురాళ్ళ మధ్య కొన్ని రోజుల దూరం ఏర్పడింది.

మూడు నెలలు గడిచాయి చందు అన్ని మాటలు చెప్పినా ఎందుకో మళ్ళీ మౌనిక ఇంటికి వెళ్లలేకపోయాడు, తన జీవితం తను చూసుకోగలదు వేరే పెళ్లి చేసుకుని తను హ్యాపీగా ఉంటే అదే చాలు, తన వల్ల ఇబ్బంది కలగకుండా తన వల్ల గతం గుర్తుకురాకుండా ఉండటానికి సాధ్యమైనంతవరకు దూరంగానే ఉండేవాడు. రాజీ మరియు స్వప్న అప్పుడప్పుడు చందుని బైట కలుస్తున్నా మౌనిక మాత్రం కలవలేదు, మౌనిక మళ్ళీ బాగైపోయింది. ముగ్గురు లైఫ్ ని ఎంజాయి చేస్తున్నారు, ఒక్క చందు విషయంలోనే ఇద్దరు మౌనిక మీద కోపం తెచ్చుకునేవారు కానీ తనని బాధ పెట్టడం ఇష్టంలేక వదిలేసేవారు. చందు వద్దన్నా రాజీ మరియు స్వప్న డబ్బు పంపుతునే ఉండేవారు. మౌనిక మాత్రం రోజూ రాత్రి బైటికి వెళ్ళేది.

ఒకరోజు ముగ్గురు స్నేహితురాళ్లు హోటల్ కి వెళ్లారు, పాపం చందు టైం అస్సలు బాగ లేదు, వడ్డించడానికి వెయిటర్ గా వాడే వచ్చాడు. ముందు రాజీ మరియు స్వప్న చూడలేదు. చందు కూడా వాళ్ళు చూడట్లేదులే అని సైలెంట్ గా వడ్డిస్తున్నాడు.. రాజీ అన్నం కలుపుతూ నాకు లెగ్ పీస్ వెయ్యి అని తల ఎత్తి చందుని చూసింది అంతే తన కోపం నషాలానికి అంటినట్టుంది.. కోపంగా లేచి అన్నం తినే చేత్తో చందు చెంప వాచీపోయేలా కొట్టింది.

చందు : ఇస్.. అబ్బా.. వో..

రాజీ టిష్యూ తీసుకుని చెయ్యి తుడుచుకుంటూ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోయింది.. స్వప్న కూడా కోపంగా చందు కాలర్ పట్టుకుని దెగ్గరికి లాక్కుని ఛీ అంటూ వెనక్కి నెట్టేసి అక్కడినుంచి వెళ్ళిపోయింది. మౌనిక లేచి బిల్ కట్టి తను కూడా వెళ్ళిపోయింది.

ఇంటికి వచ్చాక రాజీ గొడవ గొడవ చేసింది, స్వప్న ఏం మాట్లాడలేదు. మౌనిక మాత్రం స్కూటీ కీస్ అందుకుని బైటికి వెళ్ళిపోయింది. స్వప్న రాజీ ఇద్దరు అది చూసారు.

రాజీ : ఏయి స్వప్న బండి తీవే.. ఇవ్వాళ దీని సంగతేంటో తెల్చుదాం అని బైటికి వచ్చింది, స్వప్న కూడా బండి తీసి రాజినీ ఎక్కించుకుని మౌనికని ఫాలో అయ్యింది. దారిలో చందు ఫోన్ చేశాడు. ఎత్తింది

రాజీ : ఏంటి

చందు : పని చెయ్యడం కూడా తప్పేనా

రాజీ : పని చెయ్యడం తప్పు కాదు, మేము డబ్బు పంపిస్తున్నా నువ్వు పని చేస్తున్నావ్ అంటే ఏంటి అర్ధం మేము పంపించేవి నువ్వు వాడట్లేదనే కదా.. అదే మీ అమ్మా నాన్న ఉంటే ఇలా ఎందుకు చేస్తావ్.. మేము పరాయివాళ్ళం అదేగా నీ ఉద్దేశం..

చందు ఏం మాట్లాడలేదు

రాజీ : అంటే నేను అన్నవన్నీ నిజమే అన్నమాట

చందు : ఎందుకు నా మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నారు మీరు

రాజీ : ఎందుకంటే..

మౌనిక స్కూటీ హోటల్ వరకు వచ్చి ఆగిపోయింది. రాజీ చందుతో నేను మళ్ళీ చేస్తా అని పెట్టేసింది. స్వప్న వాళ్ళు మౌనికకి కనిపించకుండా బండి ఆపి తన వెనుకే వెళ్లారు. రాత్రి పదకొండు దాటింది. హోటల్ కట్టేసారు, చందు చిన్న కవర్ తో బైటికి వచ్చాడు వాడు ముందుకు నడుస్తుంటే మౌనిక వాడి వెనకాల నడుస్తుంది తన వెనకాల రాజీ స్వప్నలు వస్తున్నారు.

చందు చీకటిలో ఎవ్వరు లేరని పాట పాడుతూ చేతిలో ఉన్న కవర్ ఊపుతూ నడుచుకుంటూ వెళుతుంటే మౌనిక అది చూసి తనలో తానే నవ్వుకుంటూ పక్కనే ఉన్న స్తంభం పట్టుకుని వాటేసుకుని చందుని చూస్తుంది. ఇదంతా చూసిన రాజీ ఆశ్చర్యపోయింది స్వప్నకి అయితే కళ్ళు తిరిగినంత పని అయ్యింది.

రాజీ : చూసావే.. వాడిని చూసి ఎలా మురిసిపోతుందో.. ఇది కూడా వాడి మీద మనసుపడింది.. మరి ఎందుకు అలా చేసింది.

స్వప్న : సైకో మొహంది, దాని బుర్రలో ఏముందో

చందు ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే బ్రిడ్జి వచ్చింది, పక్కనే చిన్నగా బ్యానర్లతో కట్టిన గుడిసె, చందు వెళ్లి తాతా.. తాతా.. అని పిలిచాడు. లోపల నుంచి ఏడేళ్ల పాప పరిగెత్తుకుంటూ వచ్చింది అన్నయ్యా అంటూ, బైటికి రాగానే పాపని ఎత్తుకుని గిరగిరా తిప్పాడు. పాప నవ్వుతుంటే చందు ఇంకా నవ్వుతున్నాడు అది చూసి మౌనిక తన గుండె మీద చెయ్యి వేసుకుని జరిగేదంతా చూస్తూ మురిసిపోయి నవ్వుతుంది.

అన్నయ్యా ఆకలేస్తుంది

చందు : తల్లి సారీ రా.. ఇవ్వాళ నీ కోసం షవర్మ తెచ్చాను తల్లీ

యే.. తాతయ్య తాతయ్య షవర్మా షవర్మా

లోపల నుంచి ఒక ముసలాయన కర్ర సాయంతో బైటికి వచ్చాడు, రాజీకి స్వప్న కి ఆయన్ని చూడగానే అర్ధం అయ్యింది ఆయన గుడ్డివాడని.. వస్తూనే బాబు అంటూ వచ్చాడు.

చందు : తాతా నీకోసం కూడా తెచ్చాను తిను తాతా

తాత : అమ్మాయి ఇప్పటి వరకు నీ కోసమే చూస్తుంది బాబు

చందు : జ్యోతీ.. అలా కాదు నాన్నా ఇలా తినాలి, ఇదిగో నీ కోసం సాస్ ప్యాకెట్ కూడా తెచ్చాను.

అన్నయ్య సాస్ సాస్

చందు : ఇవ్వాళ నాకు ముద్దు ఇచ్చావా

అయ్యో మర్చిపోయా

పాప దెగ్గరికి వచ్చి ముద్దు పెడుతుంటే చిరిగిన తన జుబ్బా చూసి బాధేసింది చందుకి. రేపు ఎట్టి పరిస్థితుల్లో పాపకి బట్టలు కొనాలి అనుకున్నాడు.

చందు : తల్లీ నేను వెళ్ళనా

పాప : ఓకే అన్నయ్యా, ఇవ్వాళ మేడం కూడా రాలేదు

చందు : ఈ మేడం ఎవరో కానీ నేను ఒకసారి చూడాలి, ఏ టైంకి వస్తుంది తను

పాప : అప్పుడప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలీదు.

మౌనిక ముసిముసిగా నవ్వుకుంది

చందు : సరేలే నేను వెళుతున్న.. గుడ్ నైట్

గుడ్ నైట్ అన్నయ్యా అని కౌగిలించుకోగానే మోకాళ్ళ మీద కూర్చుని తన మొహం అంతా ముద్దులు పెట్టి లోపలికి పంపించి తనూ వెళ్ళిపోయాడు.

చందు వెళ్ళిపోగానే మౌనిక గుడిసె దెగ్గరికి వెళ్ళింది, జ్యోతి అని పిలవగానే మేడం అని బైటికి వచ్చింది.

తాత : ఎవరు

మౌనిక : నేను తాత మేడంని

తాత : బాగున్నావా తల్లీ

మౌనిక : బాగున్నా తాత.. అని తన దెగ్గరికి వచ్చిన జ్యోతి మొహం మీద చందు ఎక్కడెక్కడ ముద్దులు పెట్టాడో అక్కడే ముద్దులు పెట్టింది. ఇదంతా రాజీ కొంచెం కోపంగా అసూయగా చూస్తూనే ఉంది. మౌనికకి పాప జుబ్బా భుజం దెగ్గర చినగగా వెంటనే గుర్తుకువచ్చి, జ్యోతి.. ఇప్పుడేవస్తా ఉండు అని పరిగెత్తింది.

జ్యోతి : ఇప్పుడే మా అన్నయ్య మీ గురించి అడిగాడు, నీ పేరేంటి మేడం

మౌనిక నవ్వుతూ మేడం అని పిలుస్తున్నావ్ గా అలానే పిలు అని స్కూటీ దెగ్గరికి వెళ్ళింది. రాజీ మరియు స్వప్న పాప దెగ్గరికి వెళ్లారు.

జ్యోతి : అక్కలు ఎవరు మీరు

స్వప్న : మేమా.. మీ మేడం స్నేహితులం

జ్యోతి : అలాగా రండి మేడాలు

రాజీ : హాహా.. మేడాలు.. అక్క అని పిలువు సరేనా

జ్యోతి : అక్కలు.. అని నవ్వింది

మౌనిక స్కూటీ సీట్ తెరిచి పాప కోసం తెచ్చిన గౌన్లు తీసుకుని వచ్చేసరికి అక్కడ రాజీ స్వప్న ఉండటంతో ఆగిపోయింది. ఇద్దరు లేచి కొంచెం కోపంగా మౌనిక వంక చూసారు. మనం తరవాత మాట్లాడుకుందాం అన్నట్టు సైగ చేసి, పాపని చూసి నవ్వుతూ తన చేతికి బట్టలు ఇచ్చింది.

జ్యోతి : థాంక్స్ మేడం అని కౌగిలించుకుంది గట్టిగా

మౌనిక పాప తల నిమురుతూ, కొంచెం సేపు అక్కడ ఉండి ఇక వెళదాం అని తన స్నేహితులని చూసింది.

మౌనిక : జ్యోతి ఇక పడుకో, నేను వెళతాను.. అని చెప్పి అక్కడినుంచి స్కూటీ వైపు నడిచింది.

రాజీ మరియు స్వప్న కూడా ఇద్దరు ఇంటికి వచ్చేసారు, ఆ తరువాత మౌనిక వచ్చింది. రాజీ హాల్లోనే సోఫాలో కూర్చుంది.

రాజీ : ఏమైనా చెప్తావా లేదా మూగదానిలా అలానే ఉంటావా

మౌనిక : అదీ.. నేనూ..

రాజి : ముందు పాప గురించి చెప్పు

మౌనిక : పాప గురించచా.. ఏం లేదు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అప్పులకి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు.

ఆ పాప, తాత రోడ్డున పడ్డారు. ఆయనకి కళ్ళు కూడా లేవు. వాళ్ళకి ఇంకెవ్వరు లేరు.

ఒకరోజు చందు మధ్యాహ్నం అటు వెళుతుంటే పాప ఆకలికి తట్టుకోలేక ఏడుస్తుండడం చూసి వాడు బాధ పడిపోయాడు, ఆ రోజు నుంచి వాళ్ళకి రోజూ భోజనం పెడతాడు. నేను కూడా వాళ్ళకి కావాల్సినవి అప్పుడప్పుడు వెళ్లి ఇస్తుంటాను. ఎదురుగా ఒక షాప్ ఉంది వాడికి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తున్నాను ఏమైనా జరిగినా వాళ్ళకి ఏమైనా కావాలన్నా నాకు ఫోన్ చెయ్యమని చెప్పాను.

రాజీ : ఇవన్నీ నీకెలా తెలుసు

స్వప్న : వాడికి తెలియకుండా వాడిని ఫాలో చేస్తున్నావ్ అంటే నువ్వు చందుని కలవలేదు. ఏంటి ఇదంతా

మౌనిక : అదేంటే చందు నా మరిది.. ఇంతక ముందు కూడా నేను ఇలానే..

రాజీ : నువ్వు చందుని లవ్ చేస్తున్నావా

మౌనిక కొంచెం భయంగా రెండు అడుగులు వెనక్కి వేసింది, స్వప్నకి, రాజీకి అర్ధం అయిపోయింది.

రాజీ : రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం వెళ్ళు.. అని స్వప్న ని తీసుకుని తమ రూంలోకి వెళ్ళిపోయింది.

రాత్రి ఇటు మౌనిక అటు రాజీ, స్వప్న ఎవ్వరు నిద్రపోలేదు.

పొద్దున్నే మౌనిక లేచి ఆఫీస్ కి రెడీ అవుతూ కిచెన్ లోకి వచ్చింది, స్వప్న సోఫాలో నిద్రపోతుంటే రాజీ పక్కన కూర్చుంది. మౌనిక ఏమైంది అన్నట్టు చూసింది. రాత్రి అంత జరిగినా ఏం జరగలేదన్నట్టు ప్రవర్తించడంతో రాజికి కోపం వచ్చింది. మౌనిక స్వప్నని లేపి లోపలికి వెళుతుంటే రాజీ పిలిచింది.

మౌనిక : ఏంటే

రాజీ : కూర్చో

మౌనిక : ఆఫీసి కి టైం అవుతుంది

రాజీ : నేను లీవ్ పెడుతున్నా, స్వప్న కూడా పెట్టుకుంటుంది.. నువ్వు కూడా లీవ్ పెట్టుకో.. మాట్లాడాలి

మౌనిక : పిచ్చేమైనా లేసిందా

రాజీ : అవును చందు గురించి మాట్లాడాలి.. నా లైఫ్ మ్యాటర్.. ముందు ఫ్రెష్ అయ్యి రా, స్వప్న నువ్వు కూడా

ఇద్దరు బాత్రూంలో దూరారు కానీ తరవాత ఏం జరుగుతుందా అన్న ఆలోచన. రాజీ చందుని ఎక్కడ ప్రేమిస్తున్నానని చెపుతుందో అని స్వప్న కంగారు పడుతుంటే మౌనిక మాత్రం త్వరగా స్నానం చేసి రెడీ అయ్యి రాజీ ముందు కూర్చుంది.. స్వప్న కూడా వచ్చింది.

రాజీ : నేను చందుని లవ్ చేస్తున్నా.. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా

మౌనిక : అలాగా

రాజ్ : స్వప్న కూడా చందునే లవ్ చేస్తుంది అని స్వప్నని చూసింది

మౌనిక : స్వప్నా...

స్వప్న : అవును

రాజీ : నీకేమైనా ఇబ్బందా

మౌనిక : లేదు, మీ ఇద్దరిలో ఎవరు చేసుకున్నా నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను, అలాంటి వాడు దొరకాలంటే అదృష్టం ఉండాలి.

రాజీ : మరి నువ్వు..?

మౌనిక : నేనేంటి ?

రాజీ : నువ్వు కూడా లవ్ చేస్తున్నావా

మౌనిక : లేదు

రాజీ : నాకు కుటుంబం అయినా ఇంకేదైనా మీ ఇద్దరే అందుకే మీకు చెప్పాను, స్వప్నకి కూడా అంతే అందుకే ఓపెన్ అయ్యింది.. కానీ నీకు మేము అలా కాదు అని నాకు ఈరోజే అర్ధం అయ్యింది.. ఇట్స్ ఓకే అని లేచింది.

రాజీ లేచిన వెంటనే మౌనిక తన చెయ్యి పట్టుకుంది, రాజీ ఏడుస్తున్న మౌనికని చూసి వెళ్లి పక్కన కూర్చుని తన ఒడిలోకి తీసుకుని ఓదార్చింది.

రాజీ : చెప్పవే.. వాడంటే నీకు ఇష్టం లేదూ..

మౌనిక : ప్రాణం

రాజీ : మరి ఎందుకు దాస్తున్నావ్.. హ్మ్

మౌనిక : నేను వర్జిన్ కాదు, వాడి వయసు దాన్ని కాదు.. నాలాంటి మొగుడు వదిలేసిన దాన్ని వాడు చేసుకున్నా ఆనందంగా ఉండలేడు.. అస్సలు వాడి మనసులో ఎవరైనా ఉన్నారేమో

రాజీ : పిచ్చి పూకు మొహందాన.. సరే అవన్నీ నాకు తెలీదు కానీ వాడికి గర్ల్ ఫ్రెండ్ అయితే లేదు ఇంకా కాళీగానే ఉన్నాడు.

మౌనిక : మీ ఇద్దరిలో ఎవరో ఒకరు వాడిని చేసుకోండి

రాజీ : నువ్వు త్యాగం చేస్తావా.. అవేం అవసరంలేదు.. నీకు వాడంటే ఇష్టం అవునా

మౌనిక : అవును

రాజీ : సరే ఇక ఆలోచిద్దాం.. స్వప్న, మౌనిక.. మనం ముగ్గురం వాడిని ఇష్టపడుతున్నాం.. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను దీనికి ఆల్రెడీ పరిష్కారం ఆలోచించాను కానీ ఇప్పుడే చెప్పను. స్వప్న నీ దెగ్గర ఐడియాలు ఏమున్నాయి

స్వప్న : నా దెగ్గరేం లేవు.. కానీ నాక్కూడా వాడే కావాలనిపిస్తుందే నాకేం అర్ధంకావట్లేదు.. అని మోకాళ్ళ మీద కూర్చుని రాజీ ఇంకో తొడ మీద తల పెట్టింది

రాజీ ఇద్దరి తలల మీద చెయ్యి వేసి ఏం ఫ్రెండ్షిప్పే మనది, అంతులేనిదీ ఎవ్వరికి అర్ధంకానిది. సరె ఒక పని చేద్దాం చీటీలు వేద్దాం ఎవరికి పడితే వాళ్ళకే చందుగాడు.. ఏమంటారు

స్వప్న : వేద్దాం.. నేను రాస్తాను అని లేచి గబగబా వెళ్ళింది

రాజీ : మౌనిక పేరు కూడా రాయి

మౌనిక : మధ్యలో నేనెందుకు మళ్ళీ

రాజీ : నీకేం తెలీదు నువ్వు ఊరుకో.. ఏదో పెద్ద త్యాగం చేస్తుందట.. ఏం అవసరం లేదు.. ఒసేయి నువ్వు రాసావా

స్వప్న : ఇదిగో వెయ్యండి

రాజీ : నువ్వే వేయి

ఓకే అని స్వప్న చేతులు అటు తిప్పి ఇటు తిప్పి తీయమని కింద వేసింది

రాజీ : మౌనిక నువ్వు తియ్యి

మౌనికకి ఆట కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి, ముందుకు వచ్చి అందులోనూ తన పేరే రావాలని కళ్ళు మూసుకుని దణ్ణం పెట్టుకుంటూ ఒక చీటీ తీసి రాజీకి ఇచ్చింది.. రాజీ తెరిచి చూసింది అందులో ఉన్న పేరు స్వప్న అని చదవగానే మౌనిక మొహం వాడిపోయింది. స్వప్న మాత్రం ఎగిరి గంతేస్తూ వెంటనే కౌగిలించుకుని గెంతుతూ కింద పడ్డ చీటీలు తీసుకుని వెళుతుంటే రాజీ ఆగవే అని పిలిచింది. స్వప్న ఆగలేదు

రాజీ : మౌనిక పట్టుకోవే దాన్ని.. అనగానే మౌనికకి డౌట్ వచ్చి పరిగెత్తి స్వప్నని గట్టిగా పట్టుకుంది రాజీ వెంటనే వెళ్లి స్వప్నని కింద పడేసి మీదెక్కి కూర్చుని చేతిలోనుంచి చీటీలు లాక్కుని తెరిచి చూసింది, మౌనిక కూడా తొంగి చూసింది.

రాజీ : నాకు తెలుసు దొంగముండ మూడు చీటీల్లో దీని పేరే రాసుకుంది.

మౌనిక : పూకుముండ ఎంత ఏడిపించావే, నిన్ను వదలను అని స్వప్న మీదెక్కి కలబడింది. స్వప్న దొరికిపోయినందుకు నవ్వుతూ తప్పించుకోవడానికి అటు ఇటు దొల్లుతుంటే రాజీ లేచి తన రెండు సళ్ళ మీదా కాలు పెట్టి తొక్కింది. మౌనిక కూడా లేచి నిలుచుని స్వప్న పూకు మీద కాలేసి తొక్కింది. స్వప్న నవ్వుతూ ఇద్దరి కాళ్లు పట్టుకుని ఇద్దరి అరికాళ్ళు తన మొహం మీద పెట్టుకుని ముద్దుపెట్టింది సారీ అంటూ.. ఇద్దరు నవ్వుతూ కాళ్లు తీసి చేతులు ఇవ్వగా స్వప్న లేచింది, ముగ్గురు సోఫాలో కూలబడ్డారు.

మౌనిక : ఇప్పుడేం చేద్దాం

రాజీ : పంటచెక్కలు వేద్దాం

స్వప్న : నేను రెడీ

రాజీ : ఈ సారి తొండి చేస్తే గొంతు మీద కాలేసి తొక్కుతా అని లేచి నిలబడింది. ఇద్దరు కూడా నిలబడి చేతులు చాపారు.

ముగ్గురు పంట చెక్కలు వెయ్యగా మౌనిక గెలిచింది. మౌనిక మొహంలో వెలుగు చూసి రాజీ మనసులో నవ్వుకుంది.

స్వప్న : అప్పుడే అయిపోలేదమ్మా మూడు సార్లు వెయ్యాలి.. రండి రండి అంది.. దానితో మౌనిక మొహం వాడిపోగా రాజీ మళ్ళీ నవ్వుకుంది.

మళ్ళీ వేశారు ఈసారి రాజీ గెలిచింది.. మళ్ళీ వెయ్యగా చివరికి మౌనిక గెలిచి, చందుని గెలుచుకుంది.. ముందు సంబరపడ్డా ఆ తరువాత మాత్రం ఇద్దరి చేతులు పట్టుకుంది.

మౌనిక : మన ముగ్గురిలో ఏ ఇద్దరు బాధపడ్డా నేను చూడలేను, ఇంకొకరిని ఏడిపించే ప్రేమ నాకు వద్దు, నాకు మీరుంటే చాలు.

స్వప్న : అవును రాజీ.. నాకూ వద్దు

రాజీ : చివరికి జరిగేది ఇదే అని నాకు తెలుసు, అందుకే పరిష్కారం ఆలోచించి పెట్టాను.. ఒక దారి ఉంది

మౌనిక : ఏంటి..?

స్వప్న : చెప్పవే

రాజీ : మనం ముగ్గురం వాడిని పెళ్లి చేసుకుందాం

స్వప్న : ఏడ్చినట్టుంది

రాజీ : మౌనికా.. స్వప్న.. నేను సీరియస్ గా చెపుతున్నాను.. ఒక్కసారి ఆలోచించండి మనం ముగ్గురం ఒకే ఇంట్లో ఒకే కుటుంబంగా అక్కా చెల్లెల్లా.. చందుకి కూడా అమ్మా నాన్న లేరు తన సొంత ఎవరో అమ్మా నాన్న తెలీదు.. అందుకే వాడు మౌనికతో ఒక కుటుంబం కోరుకున్నాడు.. మనం అనుకున్నది జరిగితే చందుకి ఒక మంచి కుటుంబం దొరుకుతుంది. నలుగురం ప్రేమ తప్పించి కుళ్ళు కుతంత్రాలు తెలియని మనుషులం, ఎవ్వరూ విడదీయలేని కుటుంబం అవుతుంది. మరిపోస పువ్వులా కలిసి ఉందామే..

స్వప్న : మరిపోస.. అదేంటి..?

రాజీ : మరిపోస పువ్వు పేరు అది.. మరిపోస పువ్వు కాండానికి మూడు రెక్కలు మాత్రమే ఉంటాయి, అంతులేని ప్రేమకి వెచ్చదనానికి ప్రతీక అది. మన నలుగురం కలిసినా అదే కదే.

మౌనిక : నాకు ఓకే.. నేను ఒప్పుకుంటున్నాను, వాడేమైనా అనుకోని.. నా కోసం కాకపోయినా మీ ఇద్దరి కోసం అయినా ఒప్పుకుంటున్నాను.

స్వప్న : మన ముగ్గురి కోసం.. రాజీ ఏం చేద్దాం చెప్పవే

ఇంతలో మౌనికకి ఫోన్ వచ్చింది.

మౌనిక : హలో.......................... ఎప్పుడు... ఎక్కడా.. పాప.. పాప ఎలా ఉంది.. నేను వస్తున్నాను.. రాజీ.. రోడ్డు మీద కారు అదుపు తప్పి గుడిసె మీదకి వెళ్లిందట తాతగారు చనిపోయారట. పాప స్పృహ తప్పిందట.

రాజీ : పదా వెళదాం..

ముగ్గురు వెళ్లేసరికి అక్కడికి చందు కూడా వచ్చి ఉన్నాడు, అడిగితే అంబులెన్సు వచ్చి తీసుకెళ్లిందని చెప్పగా అక్కడికి వెళ్లారు. చందుకి తన వదిన వాళ్ళు ఎందుకు వచ్చారని అనిపించినా ఉన్న టెన్షన్లో అవేవి పట్టించుకోలేదు. తాత చనిపోయాడని తెలిసి చాలా బాధపడ్డారు, కొంతసేపటికి పాపకి స్పృహ వచ్చింది, చందు పాపని ఎత్తుకుని పక్కకి వచ్చేసాడు.

జ్యోతి : అన్నయ్య తాతయ్య మరేమో.. నేను..

చందు : తాతయ్య ముసలివాడు అయ్యాడు కదా.. ఆయన నిన్న నా దెగ్గరికి వచ్చి.. బాబు నేను ముసలివాడిని అయ్యాను నా బంగారపు బొమ్మ జ్యోతి కాలేజ్ కి వెళ్లట్లేదు, కొత్త బట్టలు లేవు, ఆడుకోవడానికి బొమ్మలు లేవు, పడుకునేటప్పుడు దోమలు కుడుతున్నాయి అందుకే నేను కొన్ని రోజులు బైటికి వెళుతున్నా నా జ్యోతి కోసం కొత్త కొత్త బట్టలు మంచి ఇల్లు కాలేజ్ అన్ని పంపిస్తా అని నాకు చెప్పాడు.

జ్యోతి : అంటే తాతయ్య రాడా

చందు : వస్తాడు కానీ కొన్ని రోజుల తరువాత వస్తాడు.. అప్పటి వరకు నువ్వు నా దెగ్గరే ఉంటావ్.. ఓకే నా.. అదిగో నువ్వు ఏడవ కూడదు.

జ్యోతి : నాకు కొత్త బట్టలు లేకపోయినా పరవాలేదు, నేను కాలేజ్ కి వెళ్లకపోయినా పరవాలేదు, నాకు బొమ్మలు కూడా వద్దు.. ఇంకెప్పుడు దోమలు కుడుతున్నాయి అని ఏడవను.. ఆయన గుండె మీద పడుకుంటే చాలు.. అన్నయ్యా తాతయ్యని పిలువు ప్లీజ్..

ఏడుపుతో జ్యోతి గొంతు బొంగురుపోతే చందుకి కూడా ఏడుపు వచ్చి గట్టిగా జ్యోతిని వాటేసుకున్నాడు.. పిలుస్తా.. నేను రమ్మని చెప్తా తాతయ్యకి అంటూ

మౌనిక వచ్చి జ్యోతి అని పిలిచింది. మేడం తాతయ్య వెళ్లిపోయారట అని చందుని వదిలి మౌనికని కౌగిలించుకుంది.. జ్యోతి మౌనికని మేడం అని పిలవడంతో ఆశ్చర్యపోయాడు. మౌనిక జ్యోతిని ఎత్తుకుని బైటికి వెళ్లి చెట్టు కింద అటు ఇటు తిప్పుతూ మాటలు చెపుతుంటే జ్యోతి తన భుజం మీద పడుకుని కళ్ళు మూసుకుని వింటూ నిద్రపోయింది. చందు అలా వాళ్ళని చూస్తుంటే రాజీ వచ్చి చందు పక్కన నిలుచుంది.

రాజీ : అర్ధం కావట్లేదా.. చందు తల తిప్పి చూసాడు.. తనే ఆ మేడం.. నీ వదిన నిన్ను ఎప్పుడు వంటరిగా వదిలెయ్యలేదు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక కూడా రోజూ రాత్రి నీకోసం వచ్చేది.. నీ ప్రతీ అడుగు గమనిస్తూనే ఉంది. పాప కోసం నీతో పాటు తను కూడా హెల్ప్ చేసింది.

చందు నేరుగా వెళ్లి మౌనికని గట్టిగా కౌగిలించుకున్నాడు, మౌనిక ఒక చేత్తో పాపని జొ కొడుతూనే ఇంకో చేత్తో చందుని నెమ్మది చేస్తూ బుగ్గ మీద ముద్దు పెట్టింది. చందు కళ్ళు తెరిచి చూసాడు.. మౌనిక చిన్నగా నవ్వింది. ఆ రోజంతా కార్యక్రమాలు పూర్తి చేసి తిరిగి గుడిసె దెగ్గరికి వెళ్లి అక్కడ జ్యోతికి సంబంధించినవి తీసుకుని పాపతో ఇంటికి వచ్చేసారు.

పాపని ఎత్తుకున్న మౌనిక ఇంట్లోకి అడుగుపెడుతూనే మన కుటుంబంలోకి అడుగుపెట్టిన బుజ్జి జ్యోతికి వెల్కమ్ చెప్పండి అంటూ బైటే నిలబడింది, రాజి స్వప్న లోపలికి వెళ్లి హారతి తీసుకొచ్చారు, చందు పక్కకి జరగబోతే గట్టిగా వాడి చెయ్యి పట్టుకుని దెగ్గరికి లాక్కుంది. స్వప్న అది చూసి నవ్వుతూ హారతి ఇచ్చింది. రాజీ మరియు స్వప్న పాపకి ఇల్లు చూపిస్తుంటే మౌనిక చందు చెయ్యి పట్టుకుని దెగ్గరికి లాక్కుంది. చందు భుజం మీద తల పెట్టుకుంది.

మౌనిక : ఇంకెక్కడికి వెళ్లొద్దు, అప్పుడు నాకు ఇష్టంలేకపోయినా నీకు ఏది నచ్చితే అదే చెయ్యాలని నీ ఇష్టానికి వదిలేసాను కానీ ఇప్పుడు వద్దు.. ఇక్కడే ఉండు.. చందు అలాగే అని విడిపడి బైటికి వెళుతుంటే.. ఎక్కడికి అని అడిగింది.

చందు : అలా బైటికి వెళ్ళొస్తా.. లగ్గేజ్ కూడా తెచ్చుకోవాలిగా అని నవ్వాడు

మౌనిక నవ్వుతూ లోపలికి వెళ్ళింది, పాపకి తినిపించి పడుకోబెట్టింది, సాయంత్రానికి చందు కూడా వచ్చేసాడు. రాత్రికి స్వప్న రాజీ ఒక రూంలో పడుకుంటే ఇంకో రూంలో మౌనిక చందు మధ్యలో పాపతో పడుకున్నారు. వారం రోజులు గడిచాయి.. రోజూ రాత్రిళ్ళు చందు బాత్రూంకి వెళ్లి రావడం మౌనిక గమనిస్తుంది.​
Next page: Update 04
Previous page: Update 02