Update 01
సౌష్ఠవమైన శరీరంతో నిండుగా కనిపించే అమృత , పాలిపోయి ,శుష్కించి వెంటిలేటర్ సహాయంతో తన 'మరణ శయ్య’ పై పడి వుంది .నల్లటి మెరుపుతో జలపాతాన్ని ప్రతిబింబించే ఆమె కురులేవీ లేవిప్పుడామెకు.ఈశ్వర్ రాక కై శక్తినంతా కూడగట్టుకుని,తాను ఉన్న ఐ.సి.యు డోర్ వైపే దృష్టి పెట్టింది అమృత. ఇక తన 'సమయం' ఐపొవొచ్చిందని అర్థమౌతోందామెకు. ఒక్క సారి 'చివరగా' ఈశ్వర్ ని చూడాలనిపించింది ఆమెకు. ఆమె కళ్ళ ముందు మొత్తం ఈశ్వర్ తో గడిపిన క్షణాలే తిరుగుతున్నాయి. ఈశ్వర్ తో ఇంకొన్ని అందమైన క్షణాలను పంచుకోవటం కోసం ఇంకొన్ని రోజులు తనకు మిగిలి ఉండింటే బాగుండు అనిపించిందామెకు. నాస్తికురాలైన ఆమె తన ఊహ తెలిసాక మొట్టమొదటి సారిగా దేవుడిని ప్రార్థించింది ఈశ్వర్ తన కళ్ళముందుండగా తనను 'చంపమని '! అమృత తనను కోరిన మొదటి, చివరి కోరికని దేవుడు మన్నించాడు!
పౌర్ణమి నాటి నిండు చంద్రుడి లా ఉండే 'తన ' అమృత గత ఆరు నెలలుగా ఒక్కొక్కటిగా తన 'కళలను ' కోల్పోతూ వస్తున్న వైనం అతని గుండెకు భరించలేనంత నొప్పిని కలిగిస్తూ వుంది. రోజు రోజుకీ ఆమెను చూడటానికి సైతం ధైర్యం చాలట్లేదతడికి! కానీ ఆ క్షణం అమృతని చూసిన అతడికి అర్థమయ్యింది ,తన జీవితం లో ఇకపై మిగిలేది నిరవధికమైన 'అమావాస్యే ' నని!
ఈశ్వర్ తన ఒక్కో అడుగు అమృత వైపు వేస్తున్నా, అతనికి మాత్రం అమృత కు తాను దూరంగా వెళుతున్న భావన కలుగుతోంది. తన కళ్ళల్లోని కన్నీటి యవనికలు తన కంటిపాప లో కొలువై ఉన్న అమృత ప్రతిబింబాన్ని మసకగా మారుస్తున్నాయి.
ఒంటిలోని శక్తినంతా కూడగట్టుకుని మోము పై కష్టంగా ఒక చిరునవ్వు ఉంచే ప్రయత్నాన్ని చేస్తూ వుంది అమృత.'నేనిక వెళ్తున్నా. నువ్వు జాగ్రత్త.' అని ఆమె కళ్ళు చెబుతున్నాయి, అతని మనస్సు వింటూ వుంది.
***************************************
పెళ్ళింట్లో అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు....
కొందరి మనస్సుల్లో సంతోషం, కొందరి మనస్సుల్లో అసంతృప్తి, కొందరిలో ఆత్రుత, ఇంకొందరిలో అసూయ.... అందరి ఉల్లములల్లోనూ ఏదో ఒక భావోద్వేగం, ఒక్క పెళ్ళికొడుకైన ఈశ్వర్ మనస్సులో తప్ప!
అతడి అణువణువునా నిర్లిప్తత ఆవహించింది.
పెళ్ళిలో అతనికి వినిపిస్తున్న నాదస్వరం అతని చెవుల్లో పదునైన సూదులతో ఎవరో పొడుస్తున్నట్టుగా భావన కలిగించింది.
ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ.. అన్న మంత్రాన్ని మూడుసార్లు పఠిస్తున్నంత సేపూ అతను తన యొక్క సొంత స్వరాన్నే అసహ్యించుకోసాగాడు.
తన కాళ్ళు కడగబడుతున్నప్పుడు ఆమ్లం తో దహించివేయబడుతున్నట్టుగా తోచింది అతడికి
పాణి గ్రహణ సమయం లో పెళ్ళికూతురైన చిత్ర చేతిని అతని చేతిలో పెట్టినప్పుడు, ఆమె స్పర్శ అతని అణువణూవునూ జలదరింపజేయసాగింది.
అతని తలపై చిత్ర జీలకర్ర-బెల్లం ఉంచినప్పుడు , ఆమె చేయి భస్మాసుర హస్తంగా తోచింది అతడికి.
సుమంగళి పూజ సమయం లో అతని పై వెదజల్లబడ్డ అక్షతలు అతనికి శరాల వలె గుచ్చుకుంటున్నాయి.
చిత్రకు, తనకు మధ్య ఉన్న తెర తొలగించివేయబడ్డప్పుడు , ఆమె కళ్ళల్లో కనిపించిన అతని ప్రతిబింబాన్ని చూసి తనపై తనకే జాలితో కూడిన అసహ్యం కలిగిందతడికి.
చిత్ర మెడలో మంగళ సూత్రం కడుతున్నప్పుడు , అది తన మెడకు బిగుసుకుంటున్న ఉరి తాడు వలె తోచింది ఈశ్వర్ కి.
హోమాగ్ని చుట్టూ చేస్తున్న ప్రదక్షిణలు అగమ్యమైన నిశీధిలోనికి తను చేస్తున్న ప్రయాణం లా అనిపిస్తోందతడికి. అతనికి 'ముడి పడి ' ఉన్న చిత్ర అతనికి అడుగు వేయలేనంత 'బరువు’ గా తోస్తోంది.
తన స్నేహితురాలు, కొన్ని విషయాల్లో తనకు 'గురువైన’ వీణ తనకు చెప్పిన ఎన్నో విషయాలు పంతొమ్మిదేళ్ళ చిత్ర మనస్సులో మెదులుతూ వున్నాయి. మనస్సులో కాస్త బెరుకు, కాస్త సిగ్గు, కాస్త ఆనందం, కాస్త ఆతురుత కలగలిసి చిత్ర యొక్క అరచేతుల్లో స్వేదము పుట్టుకొస్తోంది. పెళ్ళై నాలుగు రోజులైనా తన భర్త ఈశ్వర్ తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు తను. ఈ రోజు సాయంత్రం తమ పెద్దలందరూ తమ తమ ఇళ్ళకు వెళ్ళ బోతున్నారు . తాను,తన భర్త ఈశ్వర్... ఇరువురు మాత్రమే ఒకే ఇంట్లో ఉండబోతున్నారు!
ఇంతలో తనకు 12 ఏళ్ళ వయసప్పటినుంచీ అన్నీ తానై ఉండిన తన మేనమామ అయిన రామచంద్రయ్య చిత్ర ను పిలిచాడు. ఆయన తనకు వీడ్కోలు చెప్పడానికే పిలుస్తున్నాడని చిత్ర ఊహించగలిగింది. చేతి లో పాతబడిన సూట్కేస్ నొకదానిని పట్టుకుని బయలుదేరటానికి సిద్దం గా ఉన్నాడు రామచంద్రయ్య.
చిత్ర ఆయనతో “మామా! అప్పుడే వోతున్నవా?” అంది.
నిజానికి చిత్ర కు తెలుసు రామచంద్రయ్య ఈ నాలుగు రోజులే కష్టంగా ఉన్నాడని. కానీ మనస్సు లో ఏదో ఒక మూల తన మామయ్య ఇంకొన్ని రోజులు తన కళ్ళెదుట ఉంటే బాగుండేది అనిపిస్తోంది చిత్ర కు.
“హా, అవ్ను బుజ్జీ. పొయ్యొస్త. గదేందో పైసల్ ఏస్తదంట సర్కార్ బ్యాంక్ అకౌంట్లల్ల. MRO office కాడికి పోయి సంతకం పెట్టిచ్కోవాలె. మస్తు పైరవీ ఉంది ఇంగా. అయ్నా నేను ఎప్పుడైనా ఊరికాడికి పోవాల్సినోడ్నే గదా! నువ్వు ఈడ జాగ్రత్త. ఈశ్వర్ తోని మంచిగ వుండు. గాయ్న ఏమన్న అన్నా గూడ నువ్వే జెర సర్దుకో. నేన్పొయ్యొస్తిగ . జాగ్రత్తనే బుజ్జీ.” ఆఖరి మాట చెప్పేటప్పుడు రామచంద్రయ్య గొంతు కాస్త గద్గరమైంది. మెల్లగా చిత్ర కళ్ళల్లో నీళ్ళు ఊరాయి. ఆయన్ని గట్టిగా కావిలించుకొని ఏడ్చింది. తడవుతున్న తన కళ్ళను తాను తుడుచుకుని , తనను కావలించుకున్న తన మేనకోడలు చిత్ర భుజాలను పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ “ గట్ల చిన్న పిల్ల లెక్క ఏడుస్తవేందే బుజ్జీ! నిన్నేం అడివిల వొదిలేస్తలేను గద! కొన్ని రోజులు పొయ్నాక పండుగకు ఊరి కాడికి రమ్మన్నా నువ్వే రావు జూడు. గిప్పుడిట్లనే ఏడుస్తవ్! తర్వాత రమ్మన్నా పనుంది, రానంటవ్ ! “ అంటూ గద్గర స్వరంతో నే ప్రయత్నపూర్వకంగా తెచ్చి పెట్టుకున్న నవ్వొకటి విసిరాడు రామచంద్రయ్య.
చిత్ర ఆయన ముఖం లోని నవ్వుకు ప్రతిగా నవ్వలేదు. కృతజ్ఞతా భావంతో , పొంగుకొస్తున్న కన్నీళ్ళ వల్ల తనకు మసకగా కనబడుతున్న రామచంద్రయ్య వైపు చూస్తూ వుంది. “ నువ్వే లేకుంటే నేనేమయిపోయేదాన్ని ?!” అని ఆమె కళ్ళు ఆయనతో చెబుతున్నాయి.
“తిక్క పిల్ల” అని చిత్ర ని దగ్గరకు తీసుకొని ఆమె నుదుటిపై వాత్సల్యం తో ముద్దాడాడు.
“పొయ్యొస్తనే బుజ్జీ!” అంటూ తన suitcase తీసుకుని గుమ్మం వైపుగా నడవబోయాడు రామచంద్రయ్య.
“కింది దాక నేన్గూడొస్త మామా.” అని తన మేనమామ వారిస్తున్నా వినకుండా ఆయన చేతిలోని suitcase ని తీసుకుని lift వైపు వడివడిగా అడుగులు వేసింది చిత్ర.
వారిరువురినీ అంతసేపూ గమనిస్తూ వున్నారు ఈశ్వర్ తల్లిదండ్రులైన సరళ, గోవింద రావులు.
“ఇలాంటి పిల్లను అనవసరంగా బాధ పెడుతున్నామా ?” చూపులతోనే తన భార్య ను అడిగాడు గోవింద రావు.
“ ఏం పరవాలేదు అంతా సర్దుకుంటుంది. “ తనూ చూపులతోనే బదులిచ్చింది సరళ.
నిజానికి 'అంతా సర్దుకుంటుందిలే ‘ అని పైకి చెబుతున్నప్పటికీ సరళ మనస్సులో మాత్రం తన కొడుకు సంసారం ఏమైపొతుందోనన్న ఆందోళన మాత్రం తిరుగుతోంది. అమృత ను మరచిపోలేకపోతున్న తన కొడుకు కు తాను వేసిన ‘ బలవంతపు బంధం’ ఎంతకాలం తెగిపోకుండా నిలుస్తుందో ఒక కనీస అంచనా కూడా ఆమెకు లేదు. పెళ్ళి చేసుకోకపోతే చస్తానని తన కొడుకు కు తను చేసిన భావోద్వేగపు బెదిరింపు బంధాన్నైతే వేయగలిగింది కానీ దాన్ని తెగకుండా చూసుకునేంత ‘బలం’ తన బెదిరింపు కి లేదని తెలుసామెకి. తను తన కొడుకు కు చేస్తున్న బలవంతపు పెళ్లి మీద ఇద్దరి జీవితాలు,రెండు కుటుంబాలు ముడిపడి ఉన్నాయని తెలిసినా, కొడుకు మీద వున్న వాత్సల్యం తనచే చిత్ర, ఈశ్వర్ లకు ముడివేసేలా చేసింది. ఒకవైపు తనను కాల్చేసే తన కొడుకు చూపులు, మరో వైపు 'నువ్వు తప్పు చేస్తున్నావ్'అని హితవు పలికే భర్త మాటలూ వెరసి సరళని బాగా గుచ్చుకుంటున్నాయి. దీనికి తోడు చిత్ర, రామచంద్రయ్యలను చూసిన ప్రతి సారీ ఆమె మనస్సులో అపరాధభావం తొణికిసలాడుతోంది.కానీ తన కొడుకు పై తనకున్న ప్రేమతోనే ఇదంతా చేశానని తనకు తాను సంజాయిషీ ఇచ్చుకుంది. ఎప్పటికైనా తన కొడుకు మారకపోడా, అమృత ని మరిచిపోయి చిత్ర ను తన జీవితం లోకి అంగీకరించకపోతాడా అని మిళుకుమిళుకు మంటున్న 'ఆశాదీపం' ఒకటి సరళ మనస్సులో ఏదో ఒక మూలన ఉంది. కానీ చిత్ర ను చూస్తే తన 'ఆశాదీపం' ములగకుండా ఉంటుందన్న నమ్మకం కలగట్లేదామెకి. అమృత తో చిత్ర ని పోల్చిన ప్రతిసారీ, ఏ విషయం లోనూ చిత్ర అమృతకు సాటి వచ్చేలా కనిపించట్లేదామెకి. తన కొడుకు మనస్సులో ఇంకా 'సజీవంగా' ఉన్న అమృత ను మరిపించి తన దారికి తెచ్చుకునేంత 'నేర్పు ' చిత్ర లో ఉన్నట్టుగా ఆమెకు కనబడట్లేదు. మీనమేషాలెంచక ఒక ప్రయత్నం చేసింది సరళ. నిజానికి గోవింద రావుకి కూడా తన కొడుకు కాపురం నిలుస్తుందన్న నమ్మకం లేదు. వాళ్ళిద్దరూ తన కొడుకు ఈశ్వర్ కాపురాన్ని కూలకుండా నిలిపే భారాన్ని వారు నిత్యం కొలిచే ఈశ్వరుడి పై ఉంచారు !
లిఫ్ట్ లో కిందికి దిగి అపార్ట్మెంట్ మెయిన్ గేట్ వద్దకు నడుస్తూ వెళ్ళారు చిత్ర, రామచంద్రయ్యలు. అపార్ట్మెంట్ మెయిన్ గేట్ దెగ్గర చిత్ర చేతిలో నుంచి తన సూట్ కేస్ తీసుకున్నాడు రామచంద్రయ్య.
" ఊరికి పొయ్నాక అత్త తోటి ఫోన్ చేపిస్తలే. ఇగ నేను పొయ్యొస్త బుజ్జీ. జాగ్రత్త. ఏమన్న గావాల్నంటే ఫోన్ జెయ్" అన్నాడు రామచంద్రయ్య.
సరేనంటూ తలూపింది చిత్ర.
" వచ్చే నెల ఎట్లా వస్త గద నేను. ఇగ పొయ్యొస్త మళ్ళ. జాగ్రత్త. పొయ్యొస్త మళ్ళ జాగ్రత్త." ఒకే మాట రెండు సార్లు చెప్పాడు రామచంద్రయ్య.
సరేనంది చిత్ర. ఆమెకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంతలో అటువైపు గా రోడ్ పై వస్తున్న ఆటో ఎక్కాడు రామచంద్రయ్య.
ఎన్నో చిన్న చిన్న ఆనందాలకు దూరమైన తన మేనకోడలంటే రామచంద్రయ్యకు జాలితో కూడిన వాత్సల్యం. తన ప్రమేయం పెద్దగా లేకుండానే జరిగిన పెళ్ళి చిత్ర జీవితం లో పడ్డ కష్టాలన్నింటికీ చరమ గీతం పలకాలన్నది ఆయన ఆకాంక్ష. కానీ ఈశ్వర్ ప్రవర్తన ఆయనకు కాస్త శంక కలిగిస్తోంది. జీవితం లో ఎంతో ప్రాముఖ్యమైన పెళ్ళి అనే అంకం జరుగుతున్నా ఈశ్వర్ ముఖం లో ఏదో నిర్లిప్తత రామచంద్రయ్యకు ప్రస్పుటంగా కనిపించింది. ఈశ్వర్ నిర్లిప్తత వెనకున్న కారణం ఏమిటో ఆరాతీయాలనివున్నా, తన స్థాయీ,స్థానం గుర్తుకు వచ్చి మిన్నకున్నాడు రామచంద్రయ్య. ఒక్కసారి తన ఆటో వైపే చూస్తున్న చిత్ర ను ఆటో లోనుండి తేరిపారా చూశాడు రామచంద్రయ్య. "దీనికి ఏమీ బాధల్లేకుండా ఉండెటట్టుగ జెర నువ్వే సూస్కొవయ్యా!" అని తన మనస్సులో తాను నిత్యం కొలిచే శ్రీరామచంద్రుడి పైనే భారం వేశాడు రామచంద్రయ్య.!
****
గోడ గడియారం 4 సార్లు గంట కొట్టింది. సరళ, గోవిందరావులు ఇద్దరూ చెరో సూట్కేస్ పట్టుకుని బయలుదేరటానికి సిద్దంగా ఉన్నారు.
"అన్ని పెట్టుకుర్రా అత్తయ్యా ? ఒక్కసారి జూడండి ఏమైనా మర్చిపోయిర్రేమో." అంది చిత్ర.
" అన్ని పెట్టుకున్నాం లే."అన్నాడు గోవింద రావు.
సరళ మౌనంగా చిత్ర వైపే చూస్తూ వుంది. ఒక్క క్షణం సరళ తన భర్త గోవిందరావు వైపు చూసింది. సరళ యొక్క చూపును అర్థం చేసుకున్నాడు గోవింద రావు. చిత్రను చూస్తున్నంత సేపూ ఏదో అపరాధభావం ఆమె కళ్ళల్లో తొణికిసలాడుతూ వుంది. చిత్ర తో చాలా మాట్లాడాలని లోలోన ఉన్నా, ఎలా ప్రారంభించాలో తెలియట్లేదామెకు.
"బస్సులనే పోతున్నరా అత్తయ్యా?" అని అడిగింది చిత్ర.
"హా. అవును." ఎట్టకేలకు నోరు మెదిపింది చిత్ర.
గోవిందరావు వైపు ఒక్కసారి చూసి, తన చూపును తిరిగి చిత్ర వైపుగా తిప్పి" చూడమ్మా...."అని ఒక్క క్షణం నిట్టూర్చి, " చూడమ్మా చిత్రా, ఈశ్వర్ ని జాగ్రత్తగా చూసుకో. వాడు పైకి అలా కనబడినా , చాలా మంచి వాడు. కొంచం సహనం తో ఉండు." అంది.
ఆమె మాట్లాడుతున్నంతా సేపూ ఒక రకమైన అపరాధభావం ఆమె స్వరం లో తొణికిసలాడినట్టుగా గుర్తించింది చిత్ర. పైకి ఆమె ఒకటి మాట్లాడుతూ, లోలోన మరేదో భావిస్తున్నట్టుగా ఆమె ముఖ కవళికల ఆధారంగా గుర్తించగలిగింది చిత్ర.
చిత్ర మనస్సులో పెళ్ళైన గత నాలుగు రోజులుగా నాటబడిన సంశయపు బీజానికి సరళ స్వరం లోని అపరాధభావం నీళ్ళు పోసినట్టయ్యింది.
గోవింద రావుకి చిత్రను చూస్తే చాలా జాలి కలిగింది. తమ కూతురైన రాధ కు పెళ్ళి చేసేటప్పుడు తమకు కాబోయే అల్లుడి గూర్చి వారు పరి పరి విధాలుగా వాకబు చేసిన వైనం ఆయనకు గుర్తుకు వచ్చింది. చిత్రలో తన కూతురు రాధ కనిపించింది ఆయనకు. పెళ్ళి చేసి పంపిన చోట తన కూతురు ఇబ్బంది పడుతూ ఉంటే తానెలా విల విల లాడిపోతాడో , అలాగే చిత్ర తరఫు వాళ్ళు కూడా బాధపడతారేమోనని అనిపించింది అతడికి.ఆయన మనస్సుని ' తప్పు చేశామన్న ' బాధ కలచి వేస్తోంది.
అప్రయత్నంగా చిత్ర తలను నిమురుతూ 'వస్తామమ్మా. నువ్వు జాగ్రత్త. ఏదైనా ఇబ్బంది అయితే మాకు ఫోన్ చేయి. సరేనా?" అన్నాడు గోవింద రావు.
గోవింద రావు కళ్ళల్లో ఒక రకమైన ఆందోళన కనిపించింది చిత్రకు. చిత్ర చూపు సరళ వైపు గా మరలింది.సరళ తన భర్తను కోపం, అపరాధభావం కలగలసిన భావొద్వేగం తో చూస్తూ వుంది.
చిత్ర మదిలో ఒక మూల 'మోసపోయానా నేను?' అన్న శంక అంకురించింది. కానీ తన అనుమానాలన్నింటినీ తన ముఖం లో కనబడనీయకుండా ఉండాలని నిర్ణయించుకుంది చిత్ర. కానీ ఎంత ప్రయత్నించినా తన మనస్సు లోని భావాలు ఆమె ముఖ కవళికలను మార్చసాగాయి.
సరళకు ఇంకా ఎక్కువ సేపు అక్కడ ఉండాలి అనిపించలేదు. నేల పై పెట్టబడి ఉన్న సూట్ కేస్ ని తీసుకుని, గోవింద రావు వంక చూస్తూ, "పదండి వెళ్దాం. టైం అవుతోంది." అంది కాస్త గంభీరమైన స్వరం తో.
గోవిందరావు సరళను అనుసరించాడు. పెద్ద దర్వాజా దాకా అప్రయత్నంగా వారికి తోడుగా వచ్చింది చిత్ర. గడప దాటుతున్నప్పుడు గోవింద రావు ఒక సారి చిత్ర వైపు చూశాడు.ఆయన చూపులో "జాగ్రత్త ఉండు. ధైర్యంగా ఉండు. సహనం తో ఉండు." అన్న సందేశం చిత్ర కు కనిపించింది.
తన మేనమామ కు వీడ్కోలు పలికినట్లుగా వారికి తోడుగా కింది వరకు వెళ్ళాలనిపించలేదు చిత్రకు. వారు తలుపు నుంచి కాస్త దూరం వెళ్ళగానే తలుపు మూసుకుంది చిత్ర. హాల్లో సోఫా పై కూలబడిపోయింది. కళ్ళు మూసుకుని తన ఇష్టమైన శ్రీకృష్ణుడిని తలుచుకుంది చిత్ర.
"ఏందయ్యా వీళ్ళు గిట్ల మాట్లాడుతున్నరు? నాకేం అర్థమైతలేదు అస్సల్." అని కృష్ణుడిని అడిగింది చిత్ర. చిన్నప్పటి నుంచి తనకు ఎప్పుడు ఆందోళన కలిగినా , కృష్ణుడిని తలచుకోవటం చిత్రకు అలవాటు.
'అంతా బాగానే ఉంటుందిలే.' అని తనకు తాను ధైర్యం చెప్పుకుంది చిత్ర.