Update 06
ఆ చిన్నబాబు మాట్లాడలేడన్న సంగతి విని చిత్ర నోట మాట రాలేదు. అప్రయత్నంగా వాడి వైపు చూసింది. వాడు మాత్రం కళ్ళ నిండా అల్లరిని నింపుకుని, చిత్ర వంక చూసి చిరునవ్వు నవ్వాడు.
తన కొడుకు కి ఉన్న లోపం గురించి చెప్పవలసి రావటం విశ్వనాథ్ కి కాస్త బాధ కలిగించిందని గుర్తించాడు ఈశ్వర్. వారి సంభాషణని వేరే తోవ లో నడపడానికి విశ్వనాథ్ తో
"సామాన్లన్నీ తెచ్చారా? ఇప్పుడే షిఫ్ట్ అవుతున్నారా?" అన్నాడు ఈశ్వర్.
"లేదు సార్ .... రేపు షిఫ్ట్ అవ్తాం. రేపు ఆఫీస్ కి లీవ్ కూడా పెట్టాను. ఈరోజు జస్ట్ మిమ్మల్ని కలిసి వెళదాం అని వచ్చాము ." బదులిచ్చాడు విశ్వనాథ్.
"oh fine fine." అన్నాడు ఈశ్వర్.
ఈశ్వర్ శ్రీజ వైపు చూసి," మీరు చూసారా రూం?....చూళ్ళేదు కదా. రండి చూద్దురు గాని." అన్నాడు ఈశ్వర్.
సరేనంటూ తలూపింది శ్రీజ.
"అభీ, రా పైకెళ్ళి మన new house చూసొద్దాం." అంటూ అభిరాం చెయ్యి పట్టుకుంది వాడి తల్లి శ్రీజ.
"ఊహూ." శబ్దం చేశాడు వాడు, తనకు చిత్ర తో ఉండాలనుందని సందేశాన్ని ఇచ్చాడు.
"ఏయ్ , అభీ, మమ్మీ చెప్పేది విను." అన్నాడు విశ్వనాథ్.
"ఉహూ." ఈసారి స్వరం లో తీవ్రత పెంచాడు అభిరాం.
"అయ్య, ఉండని గాన్లే. గీణ్ణే ఉంటడు. మీరు సూశిరండి." అంది చిత్ర నవ్వుతూ.
సరేనన్నారు ఇద్దరూ, కానీ వాళ్ళ మనస్సులో తమ సుపుత్రుడు తన అల్లరి ని చిత్రకు రుచి చూపిస్తాడని భయపడ్డారు.
వాళ్ళు వెళ్ళిన మూడు నిమిషాలకే అర్థమైంది చిత్రకి అభిరాం అల్లరి గురించి.
"ఏందో ఏమో, గీ పిలగాడు మరీ తుల్వ ఉన్నడు గద." అనుకుంది చిత్ర , వద్దని వారిస్తున్నా సోఫా కుషన్ల పై ఉన్న కవర్లను విప్పదీస్తున్న అభిరాం ని చూసి.
*****
"చిత్రా.... కాస్త టీ పెట్టగలవా?..... ఐ మీన్ నీకు వీలైతేనే." అన్నాడు ఈశ్వర్, చిత్ర చేసే ఛాయ్ బాగా నచ్చిన వాడై.
"అయ్య, వీలు గాకపోనీకె ఏముంది?.. గిప్పుడే పొయి పెట్ట్కొస్త." అంటూ వంటింటి వైపు పరిగెత్తింది చిత్ర.
ఒక్క క్షణం అనవసరంగా అడిగినట్టు అనిపించింది ఈశ్వర్ కి కానీ చిత్ర చేసే ఛాయ్ కోసం అడిగినా తప్పు లేదనిపించింది!
ఇద్దరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్న ఈశ్వర్ కి టీ కప్పు ఒకటి అందించి, తనూ మరో దాంట్లో తాగసాగింది చిత్ర. అన్నం తినేటప్పుడు చిత్ర వాడే 'ఎంగిలి ' అనే కాన్సెప్ట్ ని టీ విషయం లో వాడకపోయే సరికి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు ఈశ్వర్.
జుర్రుతున్న శబ్దం చేస్తూ తాగుతున్న చిత్ర వైపు ఒక్క సారి చూశాడు ఈశ్వర్.
"అంటే.... నేను తాగినప్పుడు గిట్ల శబ్దం వొస్తది. నేను వద్దనుకున్న గూడ వొస్తది."
"అయ్యో, పర్లేదు. ఎవరి idiosyncrasies వాళ్ళకుంటాయ్. " అన్నాడు ఈశ్వర్.
తనకు వచ్చిన ఇంగ్లీష్ కన్నా తనకు రాని ఇంగ్లీష్ చాలా ఉందని తన భర్త మాట్లాడిన ప్రతిసారీ చిత్ర గ్రహిస్తూనే వుంది.
'ఏందో ఏమో, గా సదువిన పదో తరగతి వరకన్న మంచిగ సద్వాల్సింటి. గీ మనిషి మరీ ఇంగ్లీష్ తీని సతాయిస్తున్నడు నన్ను."
" గా పిలగాని పేరేంది ?" అడిగింది చిత్ర, ఉదయం వచ్చిన అభిరాం పేరుని తెలుసుకో దలచినదై.
"ఎవరు?"
"గదే పొద్దున ఇల్లు జూద్దమని ఒచ్చిర్రు జూడు. వాళ్ళతో ఒచ్చిన బాబు పేరు" అంది చిత్ర, ' మాటలు రాని అబ్బాయి ' అన్న వచనం ను వాడటానికి ఇష్టపడక.
"బాబు పేరు.... గుర్తుకు రావట్లేదు." అన్నాడు ఈశ్వర్ , ఐదు సెకెండ్లు ఆలోచించి.
"కానీ సూడనీకె సుక్క లెక్క ఉన్నడు గద!"
" హా, అవును." అన్నాడు ఈశ్వర్ , స్వతహాగా అమృత వల్ల చిన్న పిల్లల పట్ల ఇష్టాన్ని ఏర్పరుచుకున్నాడు కాబట్టి.
"ప్చ్... ఏమన్న అనుకొనింటరా ఆళ్ళు అట్ల వాడిని పేరు అడిగినందుకు?" అంది చిత్ర, స్వరం లో కాస్త అపరాధభావం తో.
"అయ్యో, లేదు లేదు. నీకు తెలియకనే అడిగావు కదా! actually నేనే నీకు ముందు చెప్పాల్సింటి ఆ అబ్బాయి కి మాటలు రావని" అన్నాడు ఈశ్వర్.
"నిజంగ దేవుడు ఇట్ల ఎందుకు జేస్తడో ఏమో! గంత మంచిగున్న పిలగానికి అట్ల జేసిండు జూడు." అంది చిత్ర, తన జీవితాన్ని మొత్తం తన కళ్ళముందు ఉంచుకున్నదై.
"దేవుడు అనే వాడు లేడసలు! అది కొంత మంది వ్యక్తులు రాజ్యాధికారాన్ని పొందటానికి create చేసిన concept." అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు ఈశ్వర్.
ఒక్క సారి నాస్తికులను గూర్చి రామాచార్యులు అన్న మాటలను గుర్తు తెచ్చుకుని, ఇంకా ఉపశమనం పొందక, దేవుడిని తన భర్త తరఫున తను క్షమాపణ అడిగి, అప్పుడు కూడా మనస్సు కుదుటపడక పోయే సరికి,
" ఇగో జూడూ, నేను దేవుడిని చానా నమ్ముత. నా దెగ్గర దేవుడి గురించి ఎప్పుడు గిట్ల మాట్లాడకు. అర్తమైతుందా?" అంది చిత్ర హెచ్చరికగా!
ఒక్కసారిగా చిత్ర చేసిన హెచ్చరిక కు ఖంగుతిన్నాడు ఈశ్వర్.
"హం ." అంటూ అప్రయత్నంగా తన జుట్టుని చెరుపుకుని తిరిగి సరిచేసుకుని, టీ తాగటం కొనసాగించాడు.
తన భర్త ఇంకెప్పుడూ దేవుడిని గూర్చి తప్పుగా మాట్లాడకూడదని దేవుడిని బలంగా కోరుకుంది చిత్ర! తన భర్త కి అలా హెచ్చరిక చేయాల్సి రావటం ఆమెకు బాగా బాధ కలిగించింది. కానీ అతని మంచి కోరే చేశామననుకుని తనకు తానే సర్ది చెప్పుకుంది. ఒక్క సారి ఈశ్వర్ వైపు చూసింది. ఈశ్వర్ కప్పులో టీ అయిపో వస్తోందని గుర్తించింది చిత్ర. తాను చేసిన హెచ్చరిక కు పరిహారంగా ఏదో ఒకటి తన భర్త తో మాట్లాడాలి అనిపించింది చిత్రకి.
"గా పిలగానికి మన మాటలు వినిపిస్తయ్. అర్తం అయితయ్ గూడ . గానీ మాట్లాడనీకి రాదంతే." అంది చిత్ర, అభిరాం ని ఉద్దేశించి.
"హా. అవును. ఆ అబ్బాయికి alalia అనే disorder ఉంది. తనకి speech therapy ఇప్పిస్తున్నారు. But result ఏం కనిపించట్లేదు. పాపం విశ్వనాథ్ చాలా బాధపడుతుంటాడు ఎప్పుడు."
" ఓ... అంటే ఏం రోగం అది?"
"రోగం కాదు, disorder అంతే."
"ఓ." అంది చిత్ర, రెండింటికీ గల తేడా ఏంటో అర్తం కాక. కానీ ఆ బాబు గురించి చెప్పేటప్పుడు ఈశ్వర్ చూపిస్తున్న తాదాత్మ్యం చిత్ర కు బాగా నచ్చింది.
" ఆ పిలగాడు కాలేజ్ కి పోతడా?" అడిగింది చిత్ర.
"లేదు....actually వాళ్ళ అమ్మ నే చదివిస్తూంటుంది తనని. వాళ్ళకుండే special colleges లో చేర్చటం విశ్వనాథ్ కి ఇష్టం లేదు. అందుకే వాళ్ళావిడ జాబ్ మానేసి ఆ అబ్బాయినే చూస్కుంటూ ఉంటుంది." అన్నాడు ఈశ్వర్.
ఈశ్వర్, చిత్ర లు ఇద్దరూ ఒకేసారి టీ తాగడం ముగించారు. ఈశ్వర్ తన ఎంగిలి కప్పును సింక్ వైపు తీసుకుని వెళ్తూ, చిత్ర తో
"నీ కప్ ఇటివ్వు." అన్నాడు సింక్ దెగ్గరికి తీస్కెళ్ళదలచిన వాడై.
"షి..షి ఒద్దు. నేంగూడొస్త గాని ఆడికి." అంది చిత్ర.
"హం." అన్నాడు ఈశ్వర్ , విషయాన్ని పొడిగిస్తే చిత్ర ఎక్కడ భావుకమైన వాక్యాలను వల్లిస్తుందేమోనని భయపడి.
" యాలక్ బుడ్డలుండింటే ఇంగా మస్తుండు. అయిపోయినయ్....అదే నిండుకున్నయ్. "అంది చిత్ర.
"ఓ.ఇంకేమైనా కూడా కావాలంటే లిస్ట్ ఇవ్వు నాకు. తెస్తాను." అన్నాడు ఈశ్వర్.
సరేనంది చిత్ర.
"ఓకే , నేనింక వెళ్ళి నా వర్క్ చేసుకుంటా." అన్నాడు ఈశ్వర్.
బదులుగా తనకు అలవాటైన విధంగా నిండుగా నవ్వింది చిత్ర.
చిత్ర నవ్వులో ఏదో తెలియని ఔచిత్యం ఉన్నట్టుగా అభిప్రాయం కలిగింది ఈశ్వర్ కి. కానీ మరుక్షణం అమృత పట్ల తనకున్న 'విధేయత ' గుర్తుకు వచ్చి, చిత్ర ముఖం లోకి చూడకుండా తన గదిలోనికి వెళ్ళిపోయాడు ఈశ్వర్.
*****
సూపర్ మార్కెట్ కి తన తో పాటు తాను చిత్రని ఎందుకు రమ్మన్నాడో ఈశ్వర్ కి అస్సలు అర్థం కావట్లేదు! చిత్ర మాత్రం ఈశ్వర్ తనని తోడుగా రమ్మని పిలిచినందుకు గాను ఉత్సాహంతో వేగంగా నడిచే ఈశ్వర్ తో సమానంగా నడవసాగింది. తాను తిరిగి ఇంటికి వెళ్ళేవరకూ చిత్ర తో ఏలాంటి అనవసరమైన సంభాషణని చేయొద్దని నిశ్చయించుకున్నాడు ఈశ్వర్. ఒక వేళ చిత్ర తనతో ఏదైనా మాట్లాడినా తాను అవును, కాదు, తెలియదు అన్న పదాలనే వాడాలి అనుకున్నాడు.
"గా సూపర్ మార్కెట్ ల ఏదో పెద్ద సంత ల పట్టేటన్ని సామాన్లుంటయ్. గిరాకి గూడ మస్తు ఒస్తది గద రోజు." అంది చిత్ర, మౌనంగా నడవడం కాస్త విసుగ్గా అనిపించి.
"హం." అన్నాడు ఈశ్వర్, తాను చిత్రని తోడుగా సూపర్ మార్కెట్ కి ఎందుకు రమ్మన్నాడో ఇంకా అర్థం కావట్లేదు ఎంత ఆలోచించినా.
ఈశ్వర్ కి అమృత గుర్తుకు వచ్చిందేమో నని భావించింది చిత్ర. ఏదైనా మాట్లాడదామా వద్దా అని ఆలోచించసాగిందామె.
"ఇదో... కూరగాయలు గూడ కొనాలె. మళ్ళ అన్ని పైసల్ తెచ్చినవా?" అడిగింది చిత్ర.
"money అవసరం లేదు.mobile నుంచే online transfer చేస్తా." బదులిచ్చాడు ఈశ్వర్.
"ఓ..." అంది చిత్ర, సంభాషణని కొనసాగించాలనుకుని, ఏం మాట్లాడాలో అర్థం కాక ఊరుకుంది.
సూపర్ మార్కెట్ లోకి అడుగు పెట్టిన వెంటనే తన చేతిలో గబగబా ఒక ట్రాలీ తీసుకుంది చిత్ర.
"ఏందో ఏమో, గీడ తెలుగోళ్ళే గద ఎక్కువ కొనేది, మళ్ళ సామాన్లన్నింటికి ఇంగ్లీషు ల పెడ్తరు పేర్లు" అంది చిత్ర , ఈశ్వర్ తో ఫిర్యాదుగా.
" హం"
" ఇదో.... జెర నేనొక్కోటి చెప్తుంట నువ్వు గీ బుట్ట ల ఏస్తవా సామాన్లు ?" అడిగింది చిత్ర.
"హం. ఓకే."
చిత్ర వేగాన్ని అందుకోవడానికి ఈశ్వర్ కి బాగా ప్రయాస అయ్యింది.
ట్రాలీ నిండుగా నింపుకుని కౌంటర్ దెగ్గర లైన్ లో నిలుచున్నారు ఇద్దరూ. అక్కడ ఉన్న కోడి గుడ్లు చూసి చిత్ర నోరూరింది. కానీ ఈశ్వర్ ఇంతక ముందు అక్కడికి వచ్చినప్పుడు అతనికి మాంసం , గుడ్లు తినడం నచ్చదని చెప్పిన విషయం గుర్తొచ్చింది ఈశ్వర్ కి. కష్టంగా చూపుని అటువైపు నుంచి తిప్పుకుంది చిత్ర. ఈశ్వర్ చిత్ర ని గమనించాడు. తాను అమృత కోసం మాంసాహారాన్ని మానేసినట్టు, చిత్ర తన కోసం మాంసాన్ని మానేయడం నచ్చలేదతడికి అస్సలు.
వెంటనే చిత్ర తో
"చిత్రా, ఎగ్స్ కొందామా? నీకు ఇష్టం కదా! నైట్ నీకు ఇష్టమైన ఆమ్లెట్స్ వేసుకుని తిందువుకాని. " అన్నాడు 'తియ్యగా.'
తన భర్త అంత తియ్యగా మాట్లాడేసరికి చిత్ర కి చాలా ఆనందమేసింది. కానీ అతనికి అవి నచ్చవని,
"ఏమొద్దులే." అంది చిత్ర.
"అయ్యో , పరవాలేదు చిత్రా! కొందాం మనం" అన్నాడు ఈశ్వర్.
చిత్ర కి ఆమ్లెట్లు కళ్ళ ముందు మెదలసాగాయి. అప్రయత్నంగా ఆమె నాలుక లో నీళ్ళు ఊరాయి, కానీ తన భర్త తిననప్పుడు ఒక్కతే చేసుకుని తినటం ఆమెకు నచ్చలేదసలు. ఈశ్వర్ తో
"ఇదో... నాకు నిన్న, మొన్న జెరం ఒచ్చిండె గదా, మళ్ళ ఇప్పుడు గుడ్లు తింటే, జెరం ఎక్కువ గాదు ?! " అంది చిత్ర, మెరుపు లాంటి ఆలోచన వచ్చినందుకు లోలోన మురిసిపోతూ.
"ఓ సారీ సారీ, వద్దులే ఐతే. " అన్నాడు ఈశ్వర్ అయత్నకృతంగా, అనారోగ్యం అంటే తను ఏర్పరుచుకున్న భయానికి బద్దుడై.
తిరుగు ప్రయాణం లో చిత్ర, ఈశ్వర్ లు చెరో కవరు ని చేతిలో పట్టుకుని తమ అపార్ట్మెంట్ వైపు నడవసాగారు.
" ఆరు వందల సామాను గొంటిమి, మళ్ళ ఆరు రూపాయల్ బెట్టి కవర్లు కొనాల్నా? అంత అన్యాయమసలు ! " అంది చిత్ర.
చిత్ర 'పొదుపుతనం ' గురించి తెలిసినవాడై, ఆమెతో
" చూడు చిత్రా, గవర్నమెంట్ ఏదో రూల్ పెట్టింది ప్లాస్టిక్ కవర్స్ యూసేజ్ ని డిస్కరేజ్ చేయటానికి. అందుకే అలా." అన్నాడు ఈశ్వర్.
"ఏందో ఏమో..... గా వకీల్ శ్రీనివాస రావ్ ఊకె అంటుంటడు. సర్కార్ ఏది దెచ్చినా మన జేబుకే చుల్లులు పడ్తయ్ అని." అంది చిత్ర.
ఈశ్వర్ ఒక్క క్షణం భయపడ్డాడు, వకీల్ శ్రీనివాసరావ్, డబ్బుల దుబారా అనే రెండు అంశాలను కలిపి చిత్ర మాట్లాడుతున్నందుకు. తనకు ఎంత విసుగు కలగబోతుందో నని భయపడసాగాడు ఈశ్వర్.
" ఓకే చిత్రా, నెక్స్ట్ టైం నుంచి , మనం ఈ కవర్స్ నే తీసుకెళ్దాం సూపర్ మార్కెట్ కి. అప్పుడు మనం సెపెరేట్ గా కొత్తవి కొనాల్సిన అవసరం ఉండదు. ఓకేనా ?" అన్నాడు ఈశ్వర్, చాలా శాంతమైన స్వరం కలిగినవాడై.
"అట్లే" అంటూ తనకు అలవాటైన విధంగా ఈశ్వర్ కళ్ళల్లోకి చూస్తూ నిండుగా నవ్వింది చిత్ర.
ఊపిరి పీల్చుకున్నాడు ఈశ్వర్.
వాళ్ళు వెళ్తున్న దారిలో ఈశ్వర్ ఫోన్ మోగింది. తన పాకెట్ నుంచి తీసి, మాట్లాడసాగాడు ఈశ్వర్. మాట్లాడేది విశ్వనాథ్ ఏ నని గుర్తించింది చిత్ర. ఒక్క క్షణం ఆమె ఆలోచన అభిరాం వైపు మళ్ళింది. తన తల్లిదండ్రుల మరణం, అమృత మరణం, అభిరాం మాట్లాడలేకపోవడం ..... ఇవన్నీ దేవుడు మనుషుల జీవితాలతో ఆడే ఆటలుగా తోచాయి చిత్ర కి. రాను రాను ఇంకెన్ని 'ఆటలు ' ఉండబోతాయో నని వేదాంతంగా తనలో తానే నవ్వుకుంది చిత్ర. ఏది ఏమైనా తన భర్త మాత్రం బావుండాలి అని దేవుడిని కోరుకుంది చిత్ర!
"తప్పదా ? ఆయన ఫోన్ కలవట్లేదా అస్సలు?" అడిగాడు ఈశ్వర్.
"సరే, నేను ఆన్ ద వే. అపార్ట్మెంట్ కి రీచ్ అయ్యాక, సెక్రటరీ గారి తో మాట్లాడిస్తాను." అన్నాడు ఈశ్వర్ , ఐదు క్షణాల తరువాత.
ఫోన్ పెట్టేసాక, తిరిగి నడవడం ప్రారంభించాడు ఈశ్వర్.
"ఎవరు ఫోన్ జేసింది?" సమాధానం తెలిసే అడిగింది చిత్ర.
"అదే పొద్దున వచ్చారు కదా, విశ్వనాథ్ వాళ్ళు. అతను ఫోన్ చేసాడు. సెక్రటరీ ఫోన్ కలవట్లేదట. నన్ను ఒక సారి ఫోన్ చేయించమన్నాడు ఆయనతో."
"ఓ.. ఆ సెక్క్రెట్రీ ఏడుంటడు?"
"ఫ్లాట్ నెంబర్ 301."
"ఓ." అంది చిత్ర.
వాళ్ళు తమ అపార్ట్మెంట్ కి చేరుకున్నారు.తన భర్త అలా తనను ఎక్కడికెళ్ళినా వెంట తీసుకుని వెళితే బాగుండుననుకుంది చిత్ర.
"క్రిష్ణయ్యా, నేను గా అమృత లేని లోటు తీర్చగల్గుతనని ఈశ్వర్ కి అర్తమయ్యేలా జెయ్యి. ఇంగేం ఒద్దు నాకు. చానా అమాయకుడు ఈ మనిషి. నాలెక్క తట్టుకునేటోడు కాదు గీ మనిషి, జెర నువ్వు గా మనిషి తోని ఆడుకునుడు మానెయ్." అని కృష్ణుడిని కోరుకుంది చిత్ర.
లిఫ్ట్ లో 3వ ఫ్లోర్ మీట నొక్కాడు ఈశ్వర్. సెక్రెటరీ ఇంటికేనని గ్రహించింది చిత్ర. లిఫ్ట్ తలుపు తెరుచుకుంది. 301 ఫ్లాట్ దెగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఈశ్వర్ ముఖం లో ఏదో ఆందోళన ప్రస్పుటంగా కనిపించింది చిత్రకు. ఈశ్వర్ అప్రయత్నంగా తన జుట్టు చెరుపుకుని, సరిచేసి, తనకు అలవాటైన రీతిలో కాలింగ్ బెల్ ని మూడు సార్లు నొక్కాడు.
సెక్రటరీ రాంరెడ్డి తలుపు తీశాడు. ఆయన తలుపు తెరవంగానే ఈశ్వర్ ఆందోళనగా ఆయన ఇంట్లోకి పరికించి చూడటాన్ని గమనించింది చిత్ర.
ఈశ్వర్ భయపడ్డట్టుగానే ఒక పెద్ద german shepherd కుక్క ఈశ్వర్ వైపుగా పళ్ళు కొరుకుతూ గుర్రు మంటూ రాసాగింది.
రాం రెడ్డి కూతురు రూం లోపల పెట్టిన ఊఫర్ లో నుంచి వస్తున్న పోకిరి సినిమా పాటలను వింటూ తన గొంతు కలపసాగింది చిత్ర.
"హెల్లో ఈశ్వర్ గారూ.... ఏంటి ఇలా వచ్చారు? మీ missus ఆ? నమస్తే" చిత్రని చూపిస్తూ అడిగాడు రాం రెడ్డి.
"సార్ ముందు కుక్కని కట్టేయండి." అన్నాడు ఈశ్వర్.
"హేయ్ శాగీ, shut up! shut up!" అంటూ కుక్కని హెచ్చరించాడు రాం రెడ్డి.
ఈశ్వర్ తనను చూస్తూ పళ్ళు కొరుకుతున్న కుక్క పై దృష్టి పెడుతూనే రాం రెడ్డి తో మాట్లాడసాగాడు.
"అదే....విశ్వనాథ్ అని మా ఆఫీస్ లో పని చేసే అతను పైన పెంట్ హౌస్ కి షిఫ్ట్ అవుతున్నారు కదా."
"హా అవ్ను అవ్ను."
కుక్క ఈశ్వర్ ని చూస్తూ మరింత గట్టిగా పళ్ళు కొరకసాగింది.
"సార్ దాన్ని కట్టేయండి." మళ్ళీ అన్నాడు ఈశ్వర్.
కాస్త నిట్టూర్చి,ఆ కుక్క ని తీసుకెళ్ళి సోఫా కి కట్టేశాడు రాం రెడ్డి. ఈశ్వర్ వల్లే తాను కట్టివేయబడాల్సి ఒచ్చిందన్న అక్కసుతో మరింతగా పళ్ళు కొరకసాగింది శాగీ.
"ఇప్పుడు చెప్పబ్బా." అన్నాడు రాం రెడ్డి.
"అదే సార్, విశ్వనాథ్ నాకు కాల్ చేసాడు. మీ ఫోన్ కలవట్లేదట. చాలా సార్లు ట్రై చేసాడంట మీకు. ఒక సారి నన్ను మిమ్మల్ని అతని తో మాట్లాడించమని చెప్పాడు."
"ఓ.... ప్చ్ , గీ ఫోన్ తోని మస్తు తలకాయ్ నొప్పైంది. మా ఆమె జియో తీస్కోమని చెప్తుంటుంది...జియో బాగుంటుందా మరి?" అడిగాడు రాం రెడ్డి.
"yeah, signal strength మన area లో నైతే బావుంది. rural regions లో కూడా it is working good as far as i know" బదులిచ్చాడు ఈశ్వర్.
" ఊర్లు అంటే ... ఈ మధ్య ఎక్కువగా ఏం వెళ్ళట్లేలే. city లో signal వస్తే చాలబ్బా."
"then jio is a good choice."
"అయ్యో, పెళ్ళైనాక వచ్చారు first time. లోపలికి రండి. బయటనే నిలబడి మాట్లాడుతున్నా అప్పటినుండి." అంటూ చిత్ర వంక చూసి నవ్వుతూ లోనికి ఆహ్వానించాడు రాం రెడ్డి.
తలూపి, నవ్వుతూ లోపలికి వెళ్ళబోయింది చిత్ర. తన వైపు చూసి పళ్ళు కొరుకుతున్న శాగీ ని చూసి, "పర్లేదు సార్, ఇద్దరం ఇంకోసారి వస్తాం.... మీరు విశ్వనాథ్ తో ఇంకోసారి ఫోన్ మాట్లాడితే..." అన్నాడు ఈశ్వర్.
"ఓకే, ఓకే ఇటివ్వండి."
విశ్వనాథ్ నెంబర్ డయల్ చేసి, రాం రెడ్డి చేతిలో తన ఫోన్ ని పెట్టాడు ఈశ్వర్.
"చిన్ని! కొంచం చిన్నగ పెట్టుకో స్పీకర్ ని. అస్సలు వినిపిస్తలేదు ఇక్కడ. " అని తన కూతురి పై అరిచి, ఈశ్వర్,చిత్ర లతో " ఈ స్పీకర్ లని తీస్కపొయి బయట పడేస్తే శని ఒదిలిపోతది. అంత సౌండ్ ఒద్దని ఎన్ని సార్లు చెప్పినా చెవులకే ఎక్కదు!" అంటూ ఫోన్ లో "హలో" అన్నాడు రాం రెడ్డి.
చిత్ర వైపు తిరిగి ఈశ్వర్ ఆమె తో "ఒక్క 5 మినెట్స్." అంటూ సైగ చేసాడు.
"అయ్య, పర్లే, పర్లే. నాకు తొందరేమ్లే."అంటూ volume తగ్గింది కాబట్టి, కాస్త కష్టపడుతూ వినసాగింది చిత్ర.
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే పాట రెండో చరణం వచ్చే సరికి రాం రెడ్డి తన ఫోన్ సంభాషణని ముగించి ఈశ్వర్ కి ఫోన్ అందించాడు.
"చిత్రా, వెళ్దామా?" అడిగాడు ఈశ్వర్.
"రండి, వీలైనప్పుడు ఇద్దరూ కలిసి. ఈమె ఊరికి వెళ్ళింది. వాళ్ళ చెల్లెలి పాప ది ఫంక్షన్ ఉందని పోయింది. Actually నేను, మా పాప కలిసి రేప్పొద్దున్నే వెళ్ళేది ఉంది. మీరిట్లా ఆయనతో ఫోన్ మాట్లాడించటం చాలా మంచిదైంది." అన్నాడు రాం రెడ్డి.
అతని మాటలకి బదులుగా చిరునవ్వు ఒకటి చేసాడు.
'ఏందో ఏమో, గీ మనిషి నాతోని తప్ప ప్రపంచం లో అందరితోని మంచిగ నవ్వుతడు! ' అనుకుంది చిత్ర.
ఈశ్వర్ చిత్రలు వెళ్ళిపోయాక, ఈశ్వర్ అంతకుముందు ఏనాడూ అపార్ట్మెంట్ లో ఎవరితోనూ అంత సేపు మాట్లాడని వైనం గుర్తుకు వచ్చింది రాం రెడ్డికి. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుండే ఈశ్వర్ లో తేడా చాలా ప్రస్పుటంగా కనిపించింది రాం రెడ్డి కి. తన కూతురి శరీర రంగు వల్ల పెద్ద ఉద్యోగస్థుడైన అల్లుడు దొరకడేమో నన్న భయాన్ని ఏర్పరుచుకున్న రాం రెడ్డికి ఈశ్వర్, చిత్ర ల జంట కాస్త ఆశాజనకంగా తోచింది!
"గా కుక్క జెర్మన్ షెప్పర్డు గదా?" అడిగింది చిత్ర, లిఫ్ట్ బయటకు అడుగుపెడుతూ.
"హం" అని మాట ఆపుకోలేక, "నీకు ఎలా తెలుసు?" అని అడిగాడు ఈశ్వర్.
"అదా, ఆ వకిల్ శ్రీనివాస రావ్ ఇంట్ల ఉంటుండె అది. వాళ్ళమ్మకి బాలేకుంటే హైదరబాదు కి ఒచ్చిండే వాళ్ళు ఆమెని తీస్కొని. మా మామ కాడ ఒదిలి పోయిర్రు పోయేటప్పుడు ఆళ్ళు. మస్తు ఉంటుండే మా చేను ల. కొత్తోళ్ళెవరన్న ఒస్తే మస్తు మొరుగుతుండె. కానీ మా పక్క పొలమోళ్ళు సంపేశిర్రు దాన్ని అన్నం ల మందు కలిపి. ఓర్చుకోలేక పోయిర్రు దొంగముండా కొడుకులు." అంది చిత్ర ఆవేశంగా.
చిత్ర యొక్క పదజాలాన్ని చూసి కాస్త ఉలిక్కిపడ్డాడు ఈశ్వర్. తనను మనసులో చిత్ర ఏ పదజాలం తో తిట్టుకుంటోందో నన్న ఆలోచన కలిగిందతడికి.
"కుక్కలకి అట్ల బయపడగూడదు. గవి నువ్వు బయపడ్తే ఇంగా ఎక్కువ జేస్తయ్.గవి మనం భయపడ్తే మన శరీరం ల కెళ్ళి ఒచ్చే వాసనను జూశి " అంది చిత్ర.
చిత్ర తాను శాగీ ని చూసి భయపడిన విషయాన్ని గురించే ప్రస్తావిస్తుందని అర్థమైంది ఈశ్వర్ కి.
"ఏమో, నాకు దాన్ని చూస్తే చాలా భయమేస్తూ ఉంటుంది." అన్నాడు ఈశ్వర్ నిజాయితీగా.
"నీ వాసనను సూస్తదంతే గది. గంతకు మించి ఏముండదు. నువ్వు బయపడ్తివంటే నిన్ను దొంగవు అనుకుంటది గది. దానికి నువ్వు బయపడ్తె తెలుస్తదంట .నీ శరీరం ల కెళ్ళి ఏంటివో హార్మొన్లో ఏంటివో ఒస్తయంట.అప్పుడు గది నీ వాసనను జూశి నువ్వు బయపడ్తున్నవ్ అని గుర్తుపడ్తదంట. " అంది చిత్ర.
తనను 'దొంగ ' తో చిత్ర పోల్చడం కాస్త వింతగా అనిపించింది ఈశ్వర్ కి.
"మామ అప్పుడప్పుడు ఆదివారం పూట ఈనాడు పేపరు తెస్తుంటడు. అందుల ఒచ్చే ఆదివారం పుస్తకం ల సదివింటి చిన్నగున్నప్పుడు ఇది." అంది చిత్ర, ఇవ్వాల్సిందానికన్నా ఎక్కువ సమాచారాన్ని ఇచ్చే తన అలవాటుకి బద్ధురాలై.
"ఓ." అన్నాడు ఈశ్వర్ తమ ఇంటి తాళాన్ని తెరుస్తూ.
"ఏందో ఏమో, గిన్ని రోజులైతుంది. మామ ఒక్కసారి గూడ ఫోన్ చెయ్యనే లే" అంది చిత్ర, తన మేనమామ నూ, పెంట్లవెల్లి నీ, పొలాన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ.
"మరి నువ్వే చేయొచ్చుగా ఫోన్." అన్నాడు ఈశ్వర్.
"అయ్య, ఒద్దు ఒద్దులే. మామ బాగ పనిమీద ఉండింటడు. గందుకే చేస్తలేనట్టున్నడు. ఊకె పంచాయితీలవ్తుంటయ్ అప్పుడప్పుడు. అదే గాకుండగ బుడ్డలు పంట మీదికి ఒచ్చింటయ్ . కూలోళ్ళు దొర్కుతలేరు గీమద్య కాలంల."
"ఓ." అన్నాడు ఈశ్వర్.
"అందులవోను నేను పక్కన గూడలేను. నేను చేతికింద ఉండింటె నన్న గాయ్న కి చేయాడుతుండే. ఒక్కడే అయ్యింటడు పాపం మామ. గా గీత, స్వాతి లకు పని రాదు, సద్వూ రాదు.... అంటే పాపం మంచి పిల్లలే లేగాని. మామ కి ఏం సాయం జెయ్యరు. ఎప్పుడు జూడు టి.వి ల ముందు కూసుంటరు బడి కెళ్ళి ఒచ్చి. పాపం కస్తిగ అయితున్నట్టుంది మామకి ఒక్కడే చేస్కోనీకె." అంది చిత్ర, తన మేనమామ పట్ల కాస్త ఆందోళనను వెలిబుచ్చుతూ.
"హం." అన్నాడు ఈశ్వర్.
కుశల ప్రశ్నలు అడగటానికి తన తల్లిదండ్రులకు తాను ఫోన్ చేసి ఏళ్ళు గడిచిన వైనం గుర్తుకు వచ్చింది ఈశ్వర్ కి. చిత్ర తన మేనమామ నుంచి ఫోన్ కొరకు ఎదురు చూస్తున్నట్టు, తన తల్లిదండ్రులు కూడా తన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారేమోనన్న ఆలోచన కలిగింది ఈశ్వర్ కి. ఒక్క క్షణం తనకూ తన తల్లిదండ్రులకూ మధ్యన పెరిగిన దూరం తన యొక్క స్వయంకృతాపరాధం గా తోచింది ఈశ్వర్ కి. తన పుట్టింటిని ప్రేమగా తలుచుకోగలిగే చిత్ర పై ఒక్క క్షణం అసూయ కలిగింది ఈశ్వర్ కి. తనకు తలుచుకోవడానికి చనిపోయిన అమృత తప్ప ఎవరూ లేరేంటి అన్న ప్రశ్న కలిగిందతడికి! అపరాధభావం, అసూయ, బాధ కలగలిసిన భావోద్వేగం అతని ముఖం లోని కవళికలను మార్చింది.
"నేనేమన్న తప్పుగ మాట్లాడిన్నా?....ఇదో... ఏమన్న తప్పుగ అనింటే చెప్పు నాకు.సరేనా? నాకు సక్కగ మాట్లాడనీకె రాదు అప్పుడప్పుడు." అంది చిత్ర అప్రయత్నంగా, తన భర్త బాధపడటాన్ని గమనించినదై.
ఒక్క రెండు నిమిషల మౌనం వారిద్దరి మధ్య ఆవహించింది. తానేమైనా తప్పుగా మాట్లాడానేమో నని చిత్ర కాస్త కంగారు పడసాగింది. కానీ తానన్న మాటలకూ, అమృత కూ సంబంధం ఏమీ లేదన్న భావన కలిగింది చిత్రకి. తన భర్త ని అమృతే కాక ఇంకేదైనా ఆలోచన వేధిస్తోందా ? లేక తన మాటలే సరైనవి కావా? అన్న ఆలోచనలు ఆమెకు కలిగాయి.
'ఏందో ఏమో, గదేదో సిన్మాల పక్కోళ్ళ మనసుల ఏమనుకుంటున్నరో వినబడినట్టు నాకు గీ మనిషి ఏమనుకుంటుండో తెలిశింటే అయిపోవు.' అనుకుంది చిత్ర మనసులో.
అప్రయత్నంగా తన జుట్టు చెరుపుకుని, తిరిగి సరిచేసుకుని తన గదిలోనికి వెళ్ళబోయాడు ఈశ్వర్.
' ఇంగ ఇరోజు గీ మనిషి తోని ఎక్కువ మాట్లాడొద్దు.రేపు మళ్ళ ఏదన్న మాట్లాడుదం. ఎక్కువ గెల్కిచ్కుంటే అసల్కే మోసమొచ్చేటట్టుంది! ఏందో ఏమో, గీ మనిషి మామూల్ గ నా తోని మాట్లాడుతనే ఇంత మంచిగ అనిపిస్తది నాకు. అట్లాంటిది నాతోని ప్రేమగ మాట్లాడితే ఇంగెంత మంచిగుంటదో! ' అనుకుంది చిత్ర మనస్సులో.
" రాత్రికి ఉప్మా జేద్దం అనుకుంటున్న. ఒక వేళ నీకు చెపాతీలే కావాలంటె గవే జేస్త." అంది చిత్ర, సాధ్యమైనంత గంభీరంగా ముఖం పెడదామనుకుని, విఫలమై, తనకు అలవాటైన రీతిలో పళ్ళికిలిస్తూ. ఏదోటి మాట్లాడి, తన భర్తను ఆలోచనల నుండి బయటకు తీస్కొద్దామన్న ఉద్దేశం తో.
"ఏదైనా పర్లేదు నాకు. వీలైతే కాస్త త్వరగా చేయి." అన్నాడు ఈశ్వర్.
"ఉప్మా జేస్త ఐతె" అంది చిత్ర.
"ఓకే."అన్నాడు ఈశ్వర్.
నవ్వుతూ వంట గది వైపు చిత్ర, ముఖం లో కవళికలు లేకుండా, మస్తిష్కం లో ఎన్నో ఆలోచనలను నింపుకుని ఈశ్వర్ పడక గది వైపు నడవసాగారు.
"చిత్రా!" అన్న పిలుపు విని ఈశ్వర్ వైపు తిరిగింది చిత్ర.
ఒక్క క్షణం కాస్త నిట్టూర్చి, చిత్ర వైపు చూసి చూడనట్టుగా తన కళ్ళని ఉంచి, కాస్త గంభీరమైన స్వరం తో
"నాకంటూ కొన్ని issues ఉన్నాయి.అందుకే నేను ఇలా ఉంటాను అప్పుడప్పుడూ... ఇందులో నీ తప్పేం లేదు.trust me. problem నావైపే ఉంది. నువ్వు ఇలా మాట్లాడితే నిన్ను బాధపెడ్తున్నానేమో నని చాలా guilt కలుగుతూ ఉంటుంది నాకు." అన్నాడు ఈశ్వర్.
చిత్ర ఏం మాట్లాడలేదు. చిత్ర నుంచి ఏ బదులూ రాకపోయేసరికి, తన గదిలోకి వెళ్ళాడు ఈశ్వర్, తలుపు మూస్తూ చిత్రతో " వీలైతే try to make it fast. కాస్త ఆకలిగా ఉంది." అన్నాడు ఈశ్వర్.
"అట్లే." బదులిచ్చింది చిత్ర.
ఒక్క సారిగా తన భర్త తలుపు వేసుకున్న తరువాత చిత్ర కళ్ళు చెమర్చాయి.తన భర్త లో ఆమెకు ఒక పసి వాడు కనిపించాడు. ఆ క్షణం తన భర్తని ఇకపై కంటికి రెప్పలా కాపాడుకోవాలని చిత్ర నిర్ణయించుకుంది. ఏ విషయమ్లో నైనా తన మాటల ద్వారా కానీ, తన చేతల ద్వారా కానీ ఏలాంటి అతన్ని కాస్త కూడా బాధపెట్టుకూడదని ఆమె నిర్ణయించుకుంది. తన ఇష్టదైవమైన కృష్ణుడిని తలుచుకుని
"ఏందయ్యా ఇది? బంగారం లాంటోడు కదయ్యా, ఎందుకట్ల బాధపెడ్తవ్ గా మనిషిని? గంత బాధ ల గూడ నేను బాద పడ్తున్ననేమో నని ఆలోచిస్తుండు కదయ్యా? ఎట్ల బాదపెట్టబుద్ది అవ్తుంది నీకు ?" అంది చిత్ర, తన మనస్సులో ఆమె నివాసముంచుకున్న కృష్ణుడితో.
తన భర్త విషయం లో తనకు తాను ఏర్పరుచుకున్న ఒడంబడికను అతనికి ఇష్టమైన రీతిలో ఉప్మా చేయడం నుంచే ప్రారంభించింది చిత్ర.
పదహైదు నిమిషాల శ్రమ తరువాత తయారైన వేడి, వేడి ఉప్మా ని కాస్త చేతిలోకి తీసుకుని ఉప్ఫ్, ఉప్ఫ్ మంటూ ఊదుతూ నోట్లో వేసుకుంది చిత్ర. తన భర్తకి నచ్చిన రీతిలోనే అయ్యిందని నిర్ధారించుకుంది.
'ఏందో ఏమో, ఉప్పు కారం లేని గీ తిండి తినీ తినీ కాళ్ళు,చేతులు నొస్తున్నయ్ నాకు.' అనుకుంది చిత్ర మనస్సులో.
తన భర్త ఉప్మా తినే వేగాన్ని గమనించి
'పాపం చానా ఆకలిగొన్నడు.' అనుకుంది చిత్ర మనస్సులో.
"ఇంకొంచం పెట్టుకో." అని ఈశ్వర్ పళ్ళెం లో ఇంకాస్త వడ్డించింది చిత్ర. తన డైట్ ప్లాన్ కి అది విరుద్ధమైనా చిత్ర ఏమైనా అనుకుంటుందేమో నని మౌనంగా అతని పళ్ళెం లో రెండవ సారి వడ్డించబడిన ఉప్మా ని తినసాగాడు ఈశ్వర్.
"ఇదో.... నాకు ఎక్కువ సదువు రాదు. అందులవోను నీకన్నా వయసుల చానా చిన్నదాన్ని. పట్నం గూడ కొత్త. అందుకే నా వల్ల ఏమన్న ఇబ్బంది ఐతుందేమోనని అట్ల అడిగిన. ఎందుకంటే నువ్వు ఏమన్న జెప్తే తెల్సుకోని దానికి తగ్గట్టు మారుదమని. అంతే గానీ నీ వల్ల నేను ఏం ఇబ్బంది పడ్తలే. నిజంగ జెప్తున్న. అయినా నీ వల్ల అసలు నాకు బాదెందుకు అవ్తది జెప్పు?"అంది చిత్ర, తన భర్తకు తన వల్ల కలిగిన అపరాధభావాన్ని తొలగింపదలచినదై.
చిత్ర మాటలు ఈశ్వర్ కి మరింత అపరాధభావాన్ని కలిగించాయి. కానీ చిత్ర అపరాధభావానికి గురౌతుందేమో నని ముఖం పై కృత్రిమమైన చిరునవ్వొకటి ధరించాడు ఈశ్వర్.
ఈశ్వర్ ముఖం లోని చిరునవ్వుని చూసి చిత్ర మనస్సు కుదుటబడింది.
"నువ్వు నవుతుంటే మస్తుంటవ్ తెలుసా?" అని అనబోయి, మంచిగా సాగుతున్న వ్యవహారం చెడిపోతుందేమో నని భయపడి ఊరుకుంది చిత్ర.
" మనం రేపు బోయి నిమ్మకాయలు కొందం. ఉప్మా లకి నిమ్మకాయ చెట్ని మస్తుంటది. మంచి రసం రసం ఉన్నవి కొనాలె.పుల్ల పుల్లగ ఉంటది చెట్ని మంచిగ. సలికాలం నాల్కె పిడచగట్టుక పొయినట్టవ్తది, జెర పులుపు పడ్తే మంచిగనిపిస్తది.ఏమంటవ్?" అంది చిత్ర, నిమ్మకాయ్ చెట్నీ తలుచుకున్నందుకు తన నాలుక పై అప్రయత్నంగా వచ్చిన లాలాజలాన్ని మింగుతూ.
"ఓకే, తెచ్చుకుందాం." అన్నాడు ఈశ్వర్ , మళ్ళీ కృత్రిమమైన చిరునవ్వు తన ముఖం పై ఉంచాడు ఈశ్వర్.
తినడం ముగించాక తన కంచాన్ని తీసుకుని కడగటానికి సింక్ వద్దకి వెళ్ళాడు ఈశ్వర్.
'ఏందో ఏమో, గీ మనిషి అంట్లు తోమడం ఎప్పుడు మానుకుంటడో ఏమో.' అనుకుంది చిత్ర తన మనస్సులో.
ఈశ్వర్ తన వాకింగ్ కి సిద్ధం అవ్వసాగాడు. తనకు అవసరమైన దానికన్నా ఎక్కువ కాలరీలు తిన్నందుకు గాను రోజు కన్నా ఇంకాస్త ఎక్కువగా నడవాలని నిర్ణయించుకున్నాడు ఈశ్వర్.
తన కాళ్ళకి షూస్ తొడుక్కుంటున్న తన భర్త ని చూసి
'ఏందో ఏమో, మనిషి సూడనీకె నలుగురిని కొట్టెటట్టు కనబడ్తడు కండల తోని. కుక్క ని సూస్తె బయపడ్తడు.' అనుకుని పుసుక్కున బయటకి నవ్వింది చిత్ర.
చిత్ర అలా ఎందుకు నవ్విందో అర్తం కాక, తలుపు తెరుచుకుని వాకింగ్ కి బయలుదేరాడు ఈశ్వర్.