Update 09
తన లాప్ టాప్ పై ప్రోగ్రాం టైప్ చేస్తూ వున్నాడు ఈశ్వర్. ఇంతలో అతని ఫోన్ రింగ్ టోన్ మోగింది.స్క్రీన్ పై ఏదో కొత్త నెంబరు ఉంది.ఫోన్ ఎత్తి
"హలో" అన్నాడు ఈశ్వర్.
"ఈశ్వరా మాట్లాడేది?" అవతల నుంచి ఒక మగ గొంతు .
"హా! మీరు?"
"నేను రామచంద్రయ్యను బాబూ."
"రామచంద్రయ్యా?" గుర్తుపట్టలేదు ఈశ్వర్.
"రామచంద్రయ్య బాబూ, పెంట్లవెల్లి నుంచి."
"ఓ, yeah yeah sorry.చెప్పండి." అన్నాడు ఈశ్వర్.
తనచే కన్యాదానం చేయించుకున్న వ్యక్తి తన పేరు నే మరచిపోవటం ఆశ్చర్యంగా తోచింది రామచంద్రయ్యకు.
"బాగున్నావా బాబు?" అడిగాడు రామచంద్రయ్య.
"హా! బావున్నాను బాబాయ్ గారు. పిన్ని గారు, మీ పిల్లలూ ఎలా ఉన్నారు?" అడిగాడు ఈశ్వర్.
"హా, అందరూ బావున్నారు." బదులిచ్చాడు రామచంద్రయ్య.
"చిత్ర ఉందా బాబూ?" మళ్ళీ తానే అడిగాడు రామచంద్రయ్య.
"చిత్ర.... తను కూరగాయలు తేవటానికి బయటికి వెళ్ళింది. వచ్చాక ఫోన్ చేయిస్తాను."అన్నాడు ఈశ్వర్.
"అవునా. సరే సరే.మంచిది బాబూ"అన్నాడు రామచంద్రయ్య.
"ఉంటాను బాబాయ్ గారు." అని ఫోన్ పెట్టేశాడు ఈశ్వర్.
పెళ్ళప్పటి కంటే ఇందాక మాట్లాడినప్పుడు ఈశ్వర్ స్వరం లో తమ పట్ల కాస్త 'తడితనం' ధ్వనించింది రామచంద్రయ్యకు. ఈశ్వర్ దెగ్గర తన మేనకోడలు చిత్ర ఎలా ఉందోనని పెళ్ళైనప్పటినుంచీ ఆందోళన పడుతూ వస్తున్న రామచంద్రయ్యకు కొంత లో కొంత ఉపశమనం లభించింది.
పెళ్ళప్పుడు ఈశ్వర్ యొక్క నిర్లిప్తతకు కారణమేంటో తెలుసుకోవాలనిపించింది రామచంద్రయ్యకు అప్పుడే . కానీ అతని మనస్సుని బాధిస్తున్నదేంటో వాకబు చేసేంత 'స్థాయి ' తనకు లేదని ఆయనకు తెలుసు. కూసింతైనా తమ పై భారం లేకుండా జరుగుతున్న తన మేనకోడలి పెళ్ళికి ఎక్కడ ఎసరు వస్తుందోనని చాలా జాగ్రత్తగా, మిన్నకుండా ఉన్నాడు రామచంద్రయ్య. నిజానికి పెళ్ళి ఖాయమవ్వడంలో, ఈశ్వర్ యొక్క తల్లిదండ్రులతో జరిపిన మంతనాలల్లో , మిగిలిన పెళ్ళి విషయాల్లోనూ ఆయన భార్య జయమ్మే ముందుండి నడిపించింది. ఆయన కేవలం ప్రేక్షకపాత్ర వహించాడు. ఖర్చేమీ లేకుండా ఐపోతున్నందుకు తన భార్య చిత్ర కు ఆ సంబంధాన్ని కుదర్చటం లో చొరవ చూపిస్తున్న విషయం తెలుసాయనకి. కానీ ఆయన అప్పుడు ఏమీ మాట్లాడలేక పోయాడు. ఈశ్వర్ ని పెళ్ళిలో చూస్తున్నంత సేపూ ఆయన మనస్సులో ఎన్నో శంకలు అంకురించాయి.తరువాత ఊళ్ళో ఉన్నప్పుడు చిత్ర తనకు గుర్తొచ్చినప్పుడల్లా స్వార్థం కలగలిసిన తన మౌనం ఆమె జీవితాన్ని బలిచేయబోతోందా అన్న ప్రశ్న కలిగినప్పుడల్లా ఆయన మనస్సు అపరాధభావం తో నిండిపోసాగింది. చిత్రకు ఫోన్ చేద్దామని చాలా సార్లు అనిపించినా , ఆమెతో మాట్లాడటానికి ధైర్యం సరిపోలేదాయనకు. ఏమైనా మరీ ఎక్కువ ఇబ్బంది ఎదురైతే చిత్ర తనను సంప్రదిస్తునదన్న గుడ్డిధైర్యం కలిగి ఉన్నాడాయన. అన్నింటికీ మించి తాను భారం వేసిన శ్రీరామచంద్రుడు తన మేనకోడలికి అన్యాయం చేయడని ఆయన విశ్వాసం.
* * *
సంచిలో కూరగాయలు పట్టుకుని వచ్చింది చిత్ర. ఆమెకు ఎదురెళ్ళి కూరగాయల సంచి తీసుకున్నాడు ఈశ్వర్. సంచి తీసుకుంటూ " మీ ఊరు నుండి ఫోన్ వచ్చింది" అన్నాడు. ఆ మాట విన్న చిత్ర కళ్ళల్లో ఈశ్వర్ కి ఒక మెరుపు కనిపించింది. ఈశ్వర్ Received calls list లోంచి రామచంద్రయ్య కు డయల్ చేసి,ఫోన్ చిత్ర చేతికి ఇచ్చాడు . అటువైపు నుండి రామచంద్రయ్య గొంతు "హలో" అంది.
చిత్ర గొంతు కాస్త భావుకమవుతున్నట్టు గమంచించాడు ఈశ్వర్.
"మామా ......ఎట్లున్నవ్?" అడిగింది చిత్ర.
"బాగున్ననే బుజ్జీ. నువ్వెట్లున్నవ్?" అడిగాడు రామచంద్రయ్య.
"హా బావున్న మామా. అత్త, గీత, స్వాతి ... అందరు బావున్నరా?" అడిగింది చిత్ర.
" హా అందరం బాగున్నం" బదులిచ్చాడు రామచంద్రయ్య.
"ఇంగేంది మామా ? ఆరోగ్యం ఎట్లుంది?B.P సూపిచ్కుంటున్నవా సరిగ? ఉప్పు తక్వనే తింటున్నవా? సత్యం డాక్టర్ ఇచ్చే మందులు వాడుతున్నవా సరిగ? పై అల్కగనే ఉంటుందా? రాత్రి పూట చలిల తిరగడం బంద్ చేశినవా లేక అట్లనే తిరుగుతున్నవా ?" ప్రేమ, దాని వల్ల వచ్చే అధికారం కలగలిసిన స్వరం తో ప్రశ్నల వర్షం కురిపించింది చిత్ర.
చిత్ర కి తన మేనమామ పై ఉన్న ప్రేమని చూసి ఈశ్వర్ కి ముచ్చటేసింది.
"హా, బానే వున్ననే బుజ్జీ. ఉప్పు ఎక్కువేం ఏసుకుంటలే. బి . పి ఎక్కువేమ్లేదు. సత్యం గోలీలు మార్చిండె. ఇంగ రాత్రి పూట అప్పుడప్పుడు అవసరముంటే చలి ల పొవ్వ వడ్తది కదనే ఇంగ.... ఒక చలి కోటు కొన్న. మొన్న నాగర్ కర్నూల్ కి పొయినప్పుడు కొనింటి.మస్తు వెచ్చగ ఉంటది గది ఏస్కుంటె." అన్నాడు రామచంద్రయ్య.
"హా.. నేను గూడ ఈడ చలి కోటు కొన్న . ఈన ఇప్పిచ్చిండె. మస్తుంది. నాలుగు వేలంట తెల్సా?" అంది చిత్ర.
చిత్ర చెప్పింది తాను ఇప్పించిన స్వెటర్ గురించేనని గ్రహించాడు ఈశ్వర్. చిత్ర అలా తను స్వెటర్ కొనిచ్చిన విషయం వాళ్ళ మేనమామ కి చెబుతూ ఉంటే కూసింత గర్వం తో కూడిన సంతోషం కలిగింది అతడికి. ఈశ్వర్ సంగతి సంభాషణ మధ్య రావటంతో అదే అదును అనుకుని, గొంతు కాస్త సవరిచుకుని, చిత్ర తో" ఈశ్వర్ బాగ చూస్కుంటుండా? గాడేమైన ఇబ్బంది అవ్తోందా ?' అన్నాడు రామచంద్రయ్య.
"ఏం లే మామా! మంచిగున్న. ఐనా గట్లడుగుతున్నవ్ ఏంది?" అంది చిత్ర, అప్రయత్నంగా ఈశ్వర్ వైపు చూస్తూ.
రామచంద్రయ్య వాకబు చేసింది తన గురించేనని గ్రహించగలిగాడు ఈశ్వర్ తెలియని ఒక వింత భావోద్వేగం ఆవరించింది అతడిని. తాను పక్కన లేకపోతే చిత్ర మరోలా బదులిచ్చేదేమోనన్న భావన అతడికి కలిగింది ! ఎన్నో ప్రశ్నలు అతడి మస్తిష్కం లో ఉదయించాయి. చిత్ర ముందు నిలబడటానికి అతడికి ధైర్యం చాల్లేదు.
చిత్ర వైపు చూడకుండా" నాకు కొంచం పనుంది. నువ్వు మాట్లాడు." అని చిత్రకు చెప్పి గదిలోనికి వెళ్ళిపోయాడు ఈశ్వర్.
"నిజంగా బానేవున్నవా బుజ్జీ? ఆడేం ఇబ్బంది లేదు గద?" మళ్ళీ అడిగాడు రామచంద్రయ్య.
"అయ్యా!! ఏం లేదు మామా . ఐనా నీకు గా అనుమానం ఎందుకొచ్చింది? గిన్ని సాత్లు అడుగుతున్నవ్ !?" అంది చిత్ర.
ఆ మాట వినగానే రామచంద్రయ్య మనస్సు తేలికయ్యింది. ఆయన మనస్సులో వేళ్ళూనుకు పోయిన అపరాధభావం కూకటి వేళ్ళతో సహా పెకిలించబడిపోయింది.
"సంతోషమే బుజ్జీ. ఇంగో మీ అత్త మాట్లాడుతదంట జూడు" అన్నాడు రామచంద్రయ్య.
తన మేనకోడలికి ఇబ్బంది లేదని తెలుసుకున్నాక తాను ఫోన్ చేసిన ఉద్దేశ్యం తీరిపోయింది అనిపించింది ఆయనకు.
"బుజ్జీ... యినిపిస్తుందా?" అంది జయమ్మ.
" హా... యినిపిస్తుంది. ఎట్లున్నవ్ అత్తా?" అడిగింది చిత్ర.
"బాగున్ననే. నువ్వెట్లున్నవ్ ?"
"హా బావున్నత్తా."
" నువ్వు పొయ్న కాడి కెళ్ళి మస్తు గుర్తొస్తున్నవే. మీ మామకు చానా సార్లు చెప్పిన నీకు ఫోన్ జెయ్యమని. ఇరోజు చేస్త, రేపు జేస్త అని ఇంత టయిము చేశిండు." అని తన భర్త మీద ఫిర్యాదు చేసింది జయమ్మ.
చిత్ర కు మునుపెన్నడూ తన అత్త గొంతులో తన పట్ల అంత ఆప్యాయత ధ్వనించ లేదు. జయమ్మ గొంతు లోని 'తడితనం' ఆమెకు చాలా కొత్తగా, ఆనందదాయకంగా తోచింది.
'ఓ , ఏముంది లే అత్తా! ఇప్పుడు ఫోన్ చేసినవ్ గద. మాట్లాడుదం మంచిగ." అంది చిత్ర నవ్వుతూ.
ప్రపంచం తలకిందులైనా చిత్ర తన మేనమామ మీద రవ్వంత నింద కూడా పడనీయదని తెలుసు జయమ్మకి! నిజానికి చిత్ర పెళ్ళి చేసుకుని, వాళ్ళింటి నుంచి వెళ్ళాక, ఆమె లేని ఇల్లు అంత లోటుగా తనకు కనిపిస్తుందని కల్లో కూడా ఊహించలేదు జయమ్మ. చిత్ర పక్కన ఉన్నప్పుడు ఆమె విలువ తనకు తెలియలేదనిపించిందామెకు. చిత్ర పెళ్ళి గుర్తొచ్చినప్పుడల్లా చాలా అపరాధబావం కలుగుతోంది జయమ్మకు. తన కూతుళ్ళ పెళ్ళికి చిత్ర పెళ్ళి ఎక్కడ అడ్డుగా వస్తుందోనని 'చవకగా' చిత్ర పెళ్ళి అయ్యేలా చూసిన ఆమెకు చిత్ర ను తలుచుకున్నప్పుడల్లా ' తప్పు చేసానేమో ' అన్న భావన బాగా కలచివేస్తోంది. చిత్ర అక్కడ ఏం ఇబ్బంది పడుతుందోనని బాగా చింత కలుగుతోందామెకు.
" మీ ఆయ్న మంచిగ చూస్కుంటుండా బుజ్జీ?" అడిగింది జయమ్మ చాలా సూటిగా. ప్రశ్న పూర్తైన తరవాత జయమ్మ, రామచంద్రయ్యలు ఇద్దరికీ మరీ అంత 'సూటి ' గా అడిగేది లేకుండెనేమో నన్న భావన కలిగింది.
"హా... ఆయ్నకేం! మంచిగ చూస్కుంటుండు......అయ్నా ఏందత్తా నువ్వు, మామ అట్ల అడుగుతుర్రు ?" చిత్ర గొంతులో సున్నితమైన కోపం, ఆశ్చర్యం ధ్వనించాయి.
"ఏం లేదే బుజ్జీ.ఒక్క దానివే ఆడేడ్నో హైదరబాదుల ఉంటవ్ గద! అందుకే అడిగిన గంతే. ఏమనుకోవాకు. "అంది జయమ్మ కాస్త సంజాయిషీ ఇచ్చినట్టుగా క్షమాపణ కోరుతున్న స్వరం తో.
"అయ్య! గట్ల మాట్లాడతవేంది అత్తా?! నేనేమనుకుంట! నువ్వు, మామ నన్ను ఏమైన అనొచ్చత్తా. గిట్లెప్పుడు మాట్లాడకు." నొచ్చుకున్నట్టుగా చెప్పింది చిత్ర.
చిత్ర తన భర్త రామచంద్రయ్య తో పాటుగా తనను కలిపి మాట్లాడినందుకు చాలా ఆనందం వేసింది జయమ్మ కు. "కాలం ఓ ఎనిమిది సంవత్సరాలు వెనక్కి వెళితే చిత్రను తన కూతుళ్ళతో సమానంగా పెంచేదాన్ని." అని లోలోన అనుకుంది జయమ్మ. సంతోషం, బాధ లు కలగలిసిన వింత భావోద్వేగం కలిగింది ఆమెకు.
"బుజ్జీ...." అంది జయమ్మ.జయమ్మ తనను పిలిచినప్పుడు స్వరం లో అంత 'తడి ' చిత్రకు ఎప్పుడూ కనిపించలేదు.
"చెప్పత్తా..." అంది చిత్ర.
"నువ్వు బాగుంటె చాలే బుజ్జీ. అయినా నువ్వేడుంటె ఆడ అందరు సంతోషంగ ఉంటరు. మీ ఆయ్నని అడిగిన అని జెప్పు. హైదరబాద్ కి రానీకె ప్రయత్నం జేస్త నేను. నిన్ను సూడాలని పానం లాగుతోంది నాకు." అంది జయమ్మ.
"రా అత్తా. నిన్ను, మామ ని నాక్కూడ సూడాలనిపిస్తోంది."
"వస్తమే బుజ్జీ. గదేందో సర్కార్ నుంచి పైసలొచ్చేవున్నయంట. మధ్యల ఎందుకో ఆగిపొయ్నయంట. గా పని మీద మీ మామ తిరుగుతుండు. గదేందో సక్కపడ్నాక వస్తం మేం." అంది జయమ్మ.
"మామ ను వేళ కు తినమని చెప్పత్తా. ఉప్పు, కారం తక్కువెయ్యి. సత్యం డాక్టర్ దెగ్గరికి వారానికొకసారి పొయి బి.పి సూపిచ్కొమ్మను. ఆగం ఆగం తిరుగుతడూకె. పైసలొస్తయని ఆరోగ్యం చెడగొట్కుంటడు." తన మామ ఆరోగ్యం పై ఉన్న ఆందోళనను బయట పెట్టింది చిత్ర.
"గా మనిషి నేను జెప్తే యింటడా?! నువ్వుండంగ నీకు భయపడి జెర ఆరోగ్యం సూస్కుంటుండె. నువ్వు పొయ్నాంక ఇంగ ఆగం ఆగం తిరుగుతుండు." వాపోయింది జయమ్మ.
జయమ్మ మాటలు విన్నాక చిత్రకు తన మామ ఆరోగ్యం పై ఆందోళన ఎక్కువైంది.
"నువ్వు బాగా సూస్కో అత్తా మామను. ఫోన్ జేస్తుండు అత్తా. మామ జాగ్రత్త. ఏదీ ఒకసారి ఇయ్యి ఫోన్ మామకి." అంది చిత్ర కాస్త భావుకత కలిగిన స్వరం తో.
జయమ్మ ఫోన్ రామచంద్రయ్య చేతిలో పెట్టింది. కాస్త జంకుతూ ఫోన్ తీసుకున్నాడు రామచంద్రయ్య చిత్ర ఏం చివాట్లు పెడుతుందోనని !
"హలో" అన్నాడు రామచంద్రయ్య.
"ఏమి నువ్వేమో అట్ల చెప్తివి. అత్తనేమో వేరే లాగ చెప్తోంది?" అంది చిత్ర.
" మీ అత్త ఊకనే అట్ల జెప్తది. మంచిగనే వాడుతున్న గోలీలు." అన్నాడు రామచంద్రయ్య.
"మామా...."అని ఒక్క క్షణం ఆగి" జెర అత్త చెప్పినట్టు విను మామా. నువ్వు ఇంగా సోరోడివి గావు. ముసలిగైనవ్. నీకు చానా దూరం ల ఉన్న నేను. నన్ను నీ గురించి చింత చెయ్యనీకు మామా. మందులు సక్కగ వాడు. జెర ఆరోగ్యం బాగ సూస్కో." అంది చిత్ర భావుకమవుతూ.
"సరే బుజ్జీ." అన్నాడు రామచంద్రయ్య చాలా నిజాయితీగా. ఆయన పై కట్టుకున్న భార్య చెప్పిన మాటల కన్నా మేన కోడలు చెప్పిన హితవు ఎక్కువగా ప్రభావం చూపింది.
"గీత, స్వాతి లు ఎట్లుర్రు? ఉన్నరా పక్కన్నే?" అడిగింది చిత్ర.
"లేదు... వాళ్ళు అలివేలమ్మ అత్త కాడికి పోయిర్రు."
" ఓ... వాళ్ళని అడిగినట్టు చెప్పు మామా. ఫోన్ చేపియ్యి వాళ్ళతోని వాళ్ళు వొచ్చినాక. ఇద్దరి తోటి మాట్లాడీ చానా రోజులైంది. " అంది చిత్ర.
" చేపిస్త... ఉంటనే బుజ్జీ. జాగ్రత్త." తన మేన కోడలి తో ఎట్టకేలకు మాట్లాడానన్న తృప్తి కలిగిన స్వరం తో అన్నాడు రామచంద్రయ్య.
" హా సరే మామా. మళ్ళా చెప్తున్న. ఆరోగ్యం బాగ సూస్కో." అంది చిత్ర.
సరిగ్గా వారి సంభాషణ ముగిసిన మరుక్షణం గది లోనుంచి బయటకు వచ్చాడు ఈశ్వర్. చిత్ర చేతిలోని తన ఫోన్ తీస్కున్నాడు. గదిలో ఉన్న వ్యక్తికి తన సంభాషణ ముగిసిన విషయం ఎలా తెలీసిందోనని ఆశ్చర్యం కలిగింది చిత్రకి.
నిజానికి ఈశ్వర్ తలుపు చాటుగా చిత్ర యొక్క ఫోన్ సంభాషణ ని వింటూనే ఉన్నాడు. తాను చిత్ర ని బాగా చూస్కుంటున్నట్టు చిత్ర ఆమె తరఫు వాళ్ళకు చెప్పటం చాలా ఆలోచింపజేస్తోందతడిని. చిత్ర తన గూర్చి అంత 'మంచి ' గా చెప్పటం చాలా అపరాధభావాన్ని కలిగిస్తోందతడికి. ఒక్క సారిగా అతడికి చనిపోయిన అమృత స్ఫురించింది. ఈశ్వర్ కు ఒక్క క్షణం అమృత, చిత్ర ల మధ్య తాను నలిగిపోతున్నట్టుగా తోచింది !!
* * *
ఆ రోజు రాత్రి భోజనం చేశాక ఇద్దరూ వాకింగ్ కి వెళ్ళారు. చిత్ర కు అనవసరంగా ఆ 'ఖరీదైన ' స్వెటర్ ఇప్పించాననుకున్నాడు ఈశ్వర్.చిత్ర కు తన భర్త తో పెంట్లవెల్లి నుండి ఫోన్ వచ్చిన ఆనందాన్ని మరింతగా పంచుకోవాలని అనిపించసాగింది. ఐదు నిమిషాల ప్రయత్నపూర్వకమైన మౌనం తరవాత తన భర్త తో
"లాస్టుకి ఇప్పుడు చేశిర్రు మామోళ్ళు ఫోను." అంది చిత్ర.
"ఊళ్ళో అందరూ బావున్నారా?" అడిగాడు ఈశ్వర్, ఆమె మాటకి సమాధానం గా, అతనికి చిత్ర ఆ మాట అనేటప్పుడు, ఆమె గొంతులోని సంతోషం చాలా ఆకర్షణీయంగా అనిపించింది.
" హా బావున్నరు." అంది చిత్ర ఈశ్వర్ తనను తన వాళ్ళ గురించి ఈశ్వర్ అడిగాడని ఆనందపడిపోతూ.
" అత్త గూడ మంచిగ మాట్లడిండె." ఉత్సాహాన్ని కొనసాగిస్తూ చెప్పింది చిత్ర.
"ఓ.... ఆమె ఇంతకముందు నీతో సరిగా మాట్లాడకపోయేదా ?" అడిగాడు ఈశ్వర్, ప్రశ్న పూర్తయ్యాక, అనవసరంగా చిత్ర ను గాయపరిచే ప్రశ్న ను అడిగానని పించించి అతనికి.
చిత్ర జాగరుకురాలు అయ్యింది. తన మేనమామ దెగ్గర తను సంతోషంగా పెరగలేదని తన భర్త అనుకుంటాడేమో ననుకుంది చిత్ర.
"అయ్య, అట్లేమ్లే. మామలాగనే అత్త గూడ నన్ను మస్తు సూస్కుంటుండె. అత్త సొంత బిడ్డ లెక్క సూస్కుంది నన్ను"
" నిన్ను నిజంగా అంత బాగా చూస్కుంటే ఖర్చు లేకుండా జరుగుతోందని నిన్ను నా లాంటి వాడికి ఇచ్చి పెళ్ళి చేసేది కాదు. " అన్న మాట ఈశ్వర్ గొంతు దాక వచ్చి ఆగిపోయింది !!!
కృత్రిమమైన చిరునవ్వొకటి చిత్ర వైపు విసిరాడు ఈశ్వర్.
" గీత, స్వాతి లు ఇద్దరు మిస్సయ్యిండె. వాళ్ళు గూడ ఉండింటే మాట్లాడుతుంటి మంచిగ. ఓ పని ఐపోవు." అంది చిత్ర, తన సంభాషణని కొనసాగించ దలచినదై.
" మీ మామయ్య పిల్లలా వాళ్ళు?"
" హా అవ్ను. మా అలివేలమ్మ అత్త. గదే మా అత్త వాళ్ళ చెల్లి కాడికి పొయిర్రంట. వాళ్ళొచ్చినాక ఫోన్ జేపిస్త అన్నడు మామ. కానీ జేపిస్తడో లేదో ?!"అంది చిత్ర కాస్త నిరుత్సాహం కలిగిన స్వరం తో, రామచంద్రయ్య ఫోన్ చేస్తాడో లేదో నన్న సందేహం కలదై.
" మరి నువ్వే ఫోన్ చేయొచ్చుగా. వాళ్ళతో అంతగా మాట్లాడాలనిపించినప్పుడు వాళ్ళు ఫోన్ చేసే వరకు wait చేయడమెందుకు చెప్పు ?! " అన్నాడు ఈశ్వర్, చిత్ర తన పుట్టింటి పై గల మమకారాన్ని చూసి తనకు ముచ్చటేయడం వల్ల.
"ఉండన్లే నీకు ఫోన్ అవ్సరమౌతది గద. అమెరికా కెళ్ళి ఫోన్లు వొస్తుంటయ్ నీకు. మళ్ళ నా ఫోన్లు నీకు అడ్డమౌతయ్ ." అంది చిత్ర, నిజాయితీగా. పని ఒత్తిడి లో కనిపిస్తున్న తన భర్తకి లేశమైన ఇబ్బంది కూడా కలిగించగూడదన్న నిశ్చయం కలదై.
"అలా ఏం లేదులే. ఒక్కసారి నువ్వు మాట్లాడితే మరీ కొంపలేమి మునిగిపోవు." అన్నాడు ఈశ్వర్.
"ఉండన్లే. వాళ్ళే జేస్తరు గాని." అంది చిత్ర.
"సరే మనం ఇంకో ఫోన్ కొందాం. నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో నీకు ఇష్టం వచ్చినంత సేపు నువ్వు మాట్లాడొచ్చు. సరేనా?" అన్నాడు ఈశ్వర్.
"నాకు ఫోనెందుకు?! ఉండన్లే." అంది చిత్ర.
ఊరుకున్నాడు ఈశ్వర్.
వాకింగ్ ముగించుకుని ఇంటికి వెళ్ళాక తన లాప్టాప్ ని ముందు ఉంచుకుని, latest Android phones కోసం వెతకడం ప్రారంభించాడు ఈశ్వర్. అతనికి one plus 3T ఫోన్ బాగా నచ్చింది. గది లోపల ఉన్న చిత్రను కేకేసి పిలిచి, తన పక్కన కూర్చోమని చెప్పి స్క్రీన్ పైన ఉన్న ఫోన్ images చూపించాడు ఈశ్వర్.
"బావుందా ఫోన్? నచ్చిందా?" అడిగాడు.
"ఇప్పుడెందుకు ఇవన్ని..." అని ఏదో చెప్పబోయింది చిత్ర.
"బావుందా లేదా చెప్పు" అన్నాడు ఈశ్వర్.
"బావుంది."
వెంటనే ఫోన్ ఆర్డర్ పెట్టెశాడు ఈశ్వర్.
" మంగళ వారం లోపు delivery అవుతుందంట ఫోన్. " అన్నాడు ఈశ్వర్.
" ఓ సరే.... ఎంత ఆ ఫోన్ ?" వాకబుగా అడిగింది చిత్ర 'మెల్లిగా'.
"ముప్పై వేలు" అని నిజం చెప్పబోయి, 4 వేల స్వెటర్ కే చిత్ర 'క్లాసు ' పీకిన విషయం గుర్తొచ్చి
" మూడు వేలు." అని అబద్దమాడాడు ఈశ్వర్. తను అబద్దమాడాల్సినంతగా చిత్ర తనని భయపెట్టడం ఆశ్చర్యంగా తోచింది ఈశ్వర్ కి!