Update 10
గత గంట సేపటి నుండి చిత్ర టి.వి చానళ్ళను ఒక్కొక్కటిగా మారుస్తూనే ఉంది. తన భర్త ఇంట్లో లేకపోయే సరికి ఆమెకు టి.వి చూడటం కూడా విసుగ్గా అనిపించింది. తన భర్త ఇంట్లో లేడని తెలిసినా రోజూ అతను కూర్చుని పని చేసుకునే చోటు వైపు అప్రయత్నంగా తాను పదే పదే చూడటం వింతగా తోచింది చిత్ర కు.
పట్నం లో ఛానళ్ళు ఎక్కువయి ఇబ్బందవుతోందని అనిపించింది చిత్రకు. ఊళ్ళో ఉన్నప్పుడు పుల్లయ్య కేబుల్ టి.వి లో వచ్చే ఐదు ఛానళ్ళు చూడటమే సులువని పించింది ఆమెకు.
"ఏందో ఏమో, గీ మనిషి వారానికోసారి ఇట్ల ఆఫీసుకని పోతెనే ఎట్లనో అవ్తుంది. రోజు గాని పొయ్యిండంటె ఇంగ నేనెట్ల బతుకుతుంటినో ఏమో." అనుకుంది చిత్ర మనస్సులో.
తన భర్త తనకు కొనిపించిన ఫోన్ ని తేరిపారా చూస్కుంది. కనీసం ఒక్క మనిషికైనా తన భర్త ఆమెకు ఇప్పించిన ఫొన్ ని చూపించాలన్న కోరిక చిత్రకు బలంగా కలగసాగింది. తనకు ఇబ్బంది కలుగుతుందేమోనని తన కోసం ఆలోచించి మరీ తన భర్త తనకు ఇప్పించిన ఫోన్ ని ప్రదర్శించకపోతే ఆ రోజు రాత్రి ఆమెకు నిద్రపట్టనట్టుగా అనిపించింది.
"గిప్పుడొక్కసారి గా వకీలు శ్రీనివాసరావ్ భార్య రుక్మిణమ్మ ఉండాల్సింది పక్కన. మస్తు మజా ఒస్తుండె. వాళ్ళొక్కరి కాడనే సెల్ ఫోను ఉన్నట్టు మస్తు ఓవరు ఆక్శను జేస్తుండె." అనుకుంది చిత్ర మనస్సులో.
ఆ ఫోన్ ఎవరి ముందు ప్రదర్శించాలో ఆలోచిస్తున్న ఆమెకు శ్రీజ గుర్తుకు వచ్చింది. అమెతో బాటు చిత్రకు అభిరాం గుర్తుకు వచ్చాడు. వాడి కళ్ళల్లోని అల్లరి గుర్తొచ్చి చాలా ముద్దొచ్చింది ఆమెకి. తన ఇంటికి తాళం వేసుకుని , చేతిలో ఫోన్ ని పట్టుకుని శ్రీజ వాళ్ళ ఇంటికి బయలుదేరింది చిత్ర. ముందు తన భర్త ఆమెకు ఇప్పించిన స్వెటర్ కూడా వేసుకుందామనుకున్నా, మిట్ట మధ్యాహ్నం పూట స్వెటర్ వేసుకువెళితే అంతగా బావుండదన్న ఆలోచన కలిగి, స్వెటర్ వేసుకునే ప్రయత్నాన్ని విరమించుకుంది చిత్ర.
చిత్ర రాకకు సంతోషించింది శ్రీజ. అభిరాం కి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ని నేర్పిస్తూ ఉంది శ్రీజ. అభిరాం ని చూసి చిత్ర ఒక చిరునవ్వు నవ్వింది. వాడు మాత్రం " నవ్వింది చాలు, వచ్చిన పని చూస్కుని వెళ్ళు. " అని చూపులతోనే బదులిచ్చాడు.
"ఈన ఆఫీసుకి పొయ్యిండె, ఇంటికాడ బోరు కొట్టిండె. అందుకె వొచ్చిన, గిట్ల నిన్ను సూశిపోదమని." అంది చిత్ర, తన ఫోన్ ని తన రెండు చేతులతో ఆడిస్తూ.
"హా అవును, మా హస్బెండ్ చెప్పాడు, ఈశ్వర్ సర్ కి ఏదో మీటింగ్ ఉందట. ఇద్దరూ మార్నింగ్ కలిసే వెళ్ళారు ఆఫీస్ కి." తనకు తెలిసిన సమాచారాన్ని ఇచ్చింది శ్రీజ.
బదులుగా మందహాసం చేసింది చిత్ర. శ్రీజ దృష్టిలో పడేట్టుగా ఇంకాస్త ఎక్కువగా ఫోన్ ఆడిద్దామనుకుని, తనకే కాస్త సిగ్గు కలిగి, ఊరుకుంది చిత్ర.
అసంకల్పితంగా శ్రీజ చూపు చిత్ర చేతిలోని కొత్తదనం వల్ల మెరుస్తున్న ఫోన్ పై పడింది.
"ఫోన్ కొత్తదా మేడం ?" అడిగింది శ్రీజ.
చిత్రకు తనొచ్చిన పని విజయవంతమైనందుకు సంతోషం వేసింది చాలా.
"హా అవ్ను. ఇరోజే ఒచ్చింది, గదేందో అమెజానోళ్ళంట.. తెచ్చిచ్చిర్రు. సాయంత్రం ఈనొచ్చి నేర్పుతడంట ఎట్ల వాడాల్నో." అంది చిత్ర నిండుగా నవ్వుతూ.
సెల్ ఫోన్ వాడుక తెలియని వాళ్ళు కూడా ఉన్నారని చిత్రని చూసి తెలుసుకుని కాస్త ఆశ్చర్యపోయింది శ్రీజ. కానీ ఆమె మనస్సుకి చిత్ర ని చిన్నచూపు తో చూడాలనిపించలేదు. ఆమెలో ఏదో ఔచిత్యం కనబడింది శ్రీజ కు. చిత్ర, ఈశ్వర్ దంపతులు , మాటలు రాని తన కొడుకును మిగిలిన వాళ్లలా ' వింత వస్తువు ' గా చూడకుండా, ' మామూలుగా' చూసిన వైనం ఆమెకు బాగా నచ్చింది.అంతే కాక, తన భర్త పట్ల ఈశ్వర్ చూపిన మంచిదనం ఆమెకు తెలుసు. ఆ దంపతుల మీద ఒక విధమైన అభిమానం కలగసాగింది శ్రీజకు.
తను చిత్రకు ఫోన్ వాడకాన్ని నేర్పిద్దామనుకుని, చిత్ర అలా తను ఆమెకు నేర్పిస్తే నొచ్చుకుంటుందేమో నని ఊరుకుంది శ్రీజ.
" అవ్నూ , మీ ఆయ్న రోజు పోతడు ఆఫీసుకు , మా ఆయ్న లెక్క ... అదేంది... వర్కు ఫ్రం హోము జెయనీకె రాదా?" అడిగింది చిత్ర.
"ఈశ్వర్ సార్ హోదా పెద్దది మేడం, ఈన సార్ దెగ్గర సబ్ ఆర్డినేట్ గా చేస్తారు. ఈశ్వర్ సార్ కేడర్ వాళ్ళకు ఇంట్లో నుండే పని చేసే ఆప్షన్ ఉంటుంది." అంది శ్రీజ.
శ్రీజ చెప్పింది పూర్తిగా అర్థం కాకున్నా, తన భర్త హోదా పెద్దదని మాత్రం అర్థమైంది చిత్రకు. గర్వం , సంతోషం కలగలిసిన భావోద్వేగం కలిగిందామెకు.
"ఏమో గాని, ఈ మద్యన మూడు నాల్గు రోజుల కెళ్ళి ఈనకి మస్తు పనెక్కువయింది. ఏందో క్లైంట్లు అమెరికా కెళ్ళి పనెక్కువ జెప్తుర్రు అంటుండు. " అంది చిత్ర, తన భర్త మీద కాస్త బెంగ పడుతూ.
"హా, అవ్ను. మా ఆయన కూడా అదే చెప్పాడు. పాపం ఈశ్వర్ సార్ పై బర్డేన్ ఎక్కువగా పడుతోందని..... చాలా సిన్సియర్ గా పనిచేస్తాడంట సార్ , ఈన ఎప్పుడూ చెబుతుంటాడు... నిజానికి ఈన జాయిన్ అయిన కొత్తలో చాలా హెల్ప్ చేసాడంట సార్. వర్క్ లోడ్ ఒకేసారి వేయకుండా ఈన పని నేర్చుకునేవరకు సార్ ఏ చేస్కునేవారట వర్క్ మొత్తం. వేరే వాళ్ళెవరయినా ఉండుంటె ఈన చాలా ఇబ్బంది పడేవాడంట, చెబుతుంటాడు ఎప్పుడూ." స్వరం లో కృతగ్న్యతా భావం తో చెప్పింది శ్రీజ.
తన భర్తను వరసగా అంత పొగిడేసరికి చిత్రకు తట్టుకోలేనంతగా గర్వం, సంతోషం కలిగాయి.
"అందులేముంది లే." అని లోపల బాగా ఆనందపడుతున్నా, బయటికి మాత్రం అదేదో సాధారణ విషమైనట్టుగా ముఖం పెట్టింది చిత్ర.
వాళ్ళిద్దరి సంభాషణని వింటూ ఉన్నాడు అభిరాం . వాడికి వాళ్ళ సంభాషణ చాలా విసుగ్గా అనిపించింది. చిత్ర రాక వల్ల తన పై తన తల్లి యొక్క శ్రద్ద గత ఐదు నిమిషాలుగా తగ్గిందని అనిపించింది అభిరాం కి. వెంటనే ఒక్క సారి గట్టిగా తన గొంతు సవరించుకుని, తనకు అలవాటైన విధంగా చిత్ర కర్ణభేరి కి తూట్లు పడేంతలా అరవడం ప్రారంభించాడు.
తన సుపుత్రుడు తన మాట వినడని తెలిసినా, చిత్ర ముందు తన ప్రయత్నం తాను చేస్తున్నట్టుగా నైనా కనిపించాలని అభిరాం తో " అభీ, it is bad manners to make noise like that ! see, aunty thinks that you are a bad boy and she says to all people that you are a bad boy." అంది శ్రీజ.
హైదరాబాద్ లో తనకు తప్ప అందరికీ ఇంగ్లీష్ బాగా వచ్చినట్టుగా అనిపించింది చిత్రకు. వాడు చిత్ర వైపు చూసాడు, చిత్ర కు ఏం చేయాలో తెలియక, మళ్ళీ మందహాసం చేసింది. వాడు మాత్రం చిత్ర వైపు తిరిగి, " నీకు అంత సీన్ ఉందా? " అని చిత్రను చూపులతోనే అడిగాడు.
"నో... దిస్ బాయ్, వెరీ గుడ్డ్ బాయ్." అంటూ వాడి బుగ్గను పట్టుకుని మెల్లిగా గిల్లింది చిత్ర.
వాడు చిత్ర ని కిందికీ, పైకీ " ఏందీ నీ బాద?" అన్నట్టుగా చూసి, వాళ్ళమ్మ వైపు తిరిగి, తనకిష్టమైన చాక్లెట్ కోసం అరవడం ప్రారంభించాడు.
వాడు చేస్తున్న సైగలను చూసిన శ్రీజకు వాడు చాక్లెట్ కోసమే అరుస్తున్నాడని అర్థమైంది. వెంటనే వడి వడిగా ఫ్రిజ్ వద్దకు నడిచింది శ్రీజ. వాడు వాడి అరుపుకు స్వల్ప విరామాన్నిచ్చి, ఫ్రిజ్ లో చాక్లెట్ కోసం వెతుకుతున్న వాళ్ళ అమ్మ వైపు చూడసాగాడు. ఆమె శరీరభాష గమనించిన వాడికి, అక్కడ చాక్లెట్లు లేవని ఆమెకు అర్థమైందని వాడికి అర్థమైంది.
వాడు ఈ సారి తన గొంతుని మరింత బాగా సవరించుకోసాగాడు. చిత్ర, శ్రీజలు వాడి గొంతు సవరింపు విని భయపడసాగారు.
"వేట్ .... ఐ కుక్ సలాడ్?యూ ఈటా?" అంది చిత్ర, ఏదో ఆలోచన వచ్చినదై.
ఒక్క క్షణం అనుమానంగా చిత్ర వైపు చూసాడు అభిరాం, వాడికి చిత్ర అంతకముందు పెట్టిన ' కోకోనట్ సలాడ్ ' గుర్తుకు వచ్చింది. "సరే ఏదోటి తొందరగా తీసుకురా. " అన్నట్టుగా ముఖం పెట్టాడు అభిరాం.
చిత్ర శ్రీజకు సైగ చేస్తూ శ్రీజ వాళ్ళింటి వంటింటి వైపు వెళ్ళింది. శ్రీజ ఆమెను అనుసరించింది.
చిత్ర ఎడమ చేతిలో తన భర్త తనకు ఇప్పించిన కొత్త సెల్ ఫోన్ ని పట్టుకునే వంటింటిలోకి వెళ్ళింది. తన భర్త తనకు ఇచ్చిన సెల్ ఫోన్ ని వదిలి ఉండబుద్ది కాలేదామెకు.తన సుపుత్రుడి వల్ల చిత్ర ఏమైనా విసుగు తెచ్చుకుంటుందేమో నని పరికించి చూసింది శ్రీజ. కానీ చిత్ర ముఖం పై ఎలాంటి విసుగు ఛాయలు ఆమెకు కానరాక పోవడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది.
"మీ ఇంట్ల కొబ్బరుందా?" అడిగింది చిత్ర, శ్రీజ వంక చూస్తూ.
"....లేదు." ఐదు క్షణాల పాటు ఆలోచించి బదులిచ్చింది శ్రీజ.
"ఓ.." అంది చిత్ర, హాల్లో సోఫా పై కూర్చుని, గోడ గడియారం వంక చూస్తున్న అభిరాం ని చూస్తూ.
" అయ్యో, పర్లేదు మేడం , వాడు కాసేపు అరిచి, సర్దుకుంటాడు లెండి." అంది శ్రీజ, చిత్ర ఇబ్బంది పడుతుందేమో నన్న భావన కలదై.
"అయ్య, ఉండన్లె! చిన్న పిలగాడు గద, గట్ల అల్లరి జేస్తెనే ముద్దుగుంటది సూడనీకె. " అంది చిత్ర నవ్వుతూ.
శ్రీజకు మరి కాస్త సంతోషం కలిగింది, చిత్ర తన కొడుకు పట్ల చూపుతున్న ' తడితనానికి ' .
" బెల్లమూ, బుడ్డలూ ఉన్నయా ?" అడిగింది చిత్ర.
"బుడ్డలా?!" అడిగింది శ్రీజ, కాస్త అయోమయానికి గురై.
"అదే....అయ్య, బుడ్డల్ తెల్వవా?! హవ్వ! ..... అదే... పల్లీలు, పల్లీలు!"
"ఓ.... ఉన్నాయి." అంటూ పల్లీల డబ్బాకై వెదుకులాట ప్రారంభించింది శ్రీజ. గుర్తుగా వస్తువులు పెట్టుకోకుండా అనవసరంగా వెతుకుతుందని తన భర్త ఎప్పుడూ చేసే ఫిర్యాదు నిజమేననిపించింది శ్రీజకు.
తన పెంట్లవెల్లి యాస పట్నం లోని జనాలకి బాగా ఇబ్బంది కలిగిస్తోందని మరోసారి అర్థమైంది చిత్రకు. ఒక్క క్షణం తన యాస వల్ల తన భర్త ఇబ్బంది పడుతుంటాడేమో నన్న భావన కలిగింది చిత్రకు. కానీ తన భర్త తన మాటతీరు పట్ల ఒక్కసారి కూడా విసుగు అన్నది చూపించకపోవడాన్ని గుర్తు తెచ్చుకుని మురిసిపోయింది చిత్ర లోలోన. రాను రాను తన భర్త ఏం చేసినా తన అపురూపురంగా కనిపిస్తున్నాయన్న భావన కలిగి నవ్వుకుంది చిత్ర.
"ఏమైంది? ఏమైనా గుర్తొచ్చిందా? మీలో మీరే నవ్వుతున్నారు?" అడిగింది శ్రీజ, కాస్త చనువు తీసుకుని, చిత్ర చేతిలో పల్లీల డబ్బా పెడుతూ.
"ఏమ్లే ఏమ్లే... మీ పిలగానికి పల్లీలు పడ్తయా బానే ?"
"హా... వాడికి ఏవైనా అరుగుతాయి తోందరగా, అదే గా నా తలనొప్పి !"
"బెల్లం ఉందా?" అంది చిత్ర, నవ్వుతూ.
"హా..." అంటూ మళ్ళీ తన వెదుకులాట ప్రారంభించింది శ్రీజ.
"మీ అబిరాము మస్తు నచ్చిండు నాకు. గిట్ల ఒస్తుంట అప్పుడప్పుడు, ఈన ఇంట్ల లేనప్పుడు. సరేనా?" అంది చిత్ర, హాల్లో నోట్ బుక్ లోని పేజీని చించి రాకెట్ చేస్తున్న అభిరాం వైపు చిరునవ్వుతో చూస్తూ.
"అయ్యో! రండి మీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు. నాకు కూడా బోర్ కొడుతుంటుంది అప్పుడప్పుడు. కొత్త ప్లేస్ అనేసరికి భయపడ్డాను నేను. కానీ మీరున్నందుకు చాలా బెటర్ అనిపించింది నాకు." నిజాయితీగా చెప్పింది శ్రీజ.
ఎట్టకేలకు బెల్లం డబ్బాను చిత్ర చేతికి ఇచ్చింది శ్రీజ. కాస్త బెల్లం గడ్డను తీసుకుని ముక్కలు ముక్కలు గా చేయసాగింది చిత్ర. ఆ బెల్లం ముక్కల్ని పల్లీల్లో కలిపి ' సలాడ్ ' ని పూర్తి చేసింది.
శ్రీజ, చిత్ర లు ఇద్దరూ హాల్లో తాను చించిన రెండవ కాగితంతో కత్తి పడవ చేయాలో, లేక మళ్ళీ రాకెట్ చేయాలో తేల్చుకోలేక సతమౌతున్న అభిరాం వద్దకు వెళ్ళారు.
" ఈట్ దిస్...దిస్...దిస్..."
"గ్రౌండ్ నట్ సలాడ్." అంటూ చిత్ర అవస్థను గమనించి వాక్యాన్ని పూర్తి చేసింది శ్రీజ.
"టేక్ అండ్ ఈట్ ." అంటూ అభిరాం చేతికి స్టీలు కప్పునూ, చెంచానూ ఇచ్చింది చిత్ర.
వాడు ఆ ' సలాడ్ ' ని స్పూన్ తో కాస్త తోడుకుని నోట్లో పెట్టుకున్నాడు.
చిత్ర వైపుగా తిరిగి " పర్లేదు, బాగానే చేసావ్ ! " అన్నట్టుగా హావభావాన్ని ప్రకటించాడు.
శ్రీజ, చిత్రలు ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు.
అభిరాం టి.వి పెట్టుకుని డోరేమాన్ కార్టూన్ చూడసాగాడు.
శ్రీజ, చిత్ర లు ఇద్దరూ పిచ్చాపాటీ బెడ్ రూం లోకి వెళ్ళి మాట్లాడుకోసాగారు. శ్రీజ తన మాటల్లో తన కొడుకు అభిరాం కి మాటలు రావడానికి చేసిన ప్రయత్నాలూ, అవన్నీ విఫలమైన విషయాలూ అన్నీ చెప్పసాగింది. చిత్రకు అభిరాం విషయమై చాలా జాలి కలిగింది. కానీ తను జాలి పడ్డట్టుగా బయటపడితే శ్రీజ నొచ్చుకుంటుందేమో నని ఊరుకుంది చిత్ర.
" అయినా గీ మద్య మనం వార్తలల్ల సూస్తనే ఉన్నం గద, సయింటిస్టులు ఏదోటి చేస్తరు గానిలే అబిరాము కోసము." అంది చిత్ర, ఏమని మాట్లాడాలో తెలియక.
" ఆశ పోతోంది మేడం రోజురోజుకి. భయం వేస్తుంటుంది కూడా అప్పుడప్పుడు. మా ఆయన నా కన్నా ఎక్కువ బెంగ పెట్టుకున్నాడు వాడి మీద. వీడు చాలా చాలా మొండి. ఎప్పటికీ మేమిద్దరం ఉండం కదా మేడం, మా తరవాత వాడి పరిస్థితేంటో ఆలోచిస్తేనే భయమేస్తూ ఉంటుంది." అంటూ చమర్చిన తన కళ్ళను తుడుచుకుంది శ్రీజ, ఎన్నో రోజుల నుండి తన మనస్సు పొరల్లో ఉన్న బాధను బయటపెట్టడానికి చిత్ర సరైన వ్యక్తిగా తోచింది శ్రీజకు.
చిత్ర ఆమెను దెగ్గరికి తీసుకుని,
" సూడు స్రీజా, మీరప్పుడే చేతులెత్తేస్తె ఎట్ల జెప్పండి? మీ వోడు మస్తు మంచిగ బతుకుతడు. మస్తు ఉషారుండు మీ అబిరాము." అంది చిత్ర.
శ్రీజ ఇంకా బాధలోనే ఉందని అర్థం చేస్కుంది చిత్ర. ఏదైనా మాట్లాడి విషయాన్ని మరల్చాలనుకుంది. వెంటనే ఆమెకు తన చేతిలో ఉన్న ఫోన్ కనిపించింది.
" స్రీజా, గీ ఫోను ఎట్ల వాడాల్నో జెర సూపిస్తవా? ఈన ఒచ్చే వరకు ఆగబుద్ది అవ్తలే. " అంది చిత్ర.
తన భర్త తనకు విపులంగా సెల్ ఫోన్ వాడకాన్ని గురించి చెబుతుంటే విందామని కలలు కన్న తను ఇలా శ్రీజ తో అనడం తాను చేస్తున్న గొప్ప త్యాగం గా భావించుకుంది చిత్ర. ఒక వేళ శ్రీజ తనకు అర్థమయ్యేలా వివరించినా కూడా, తన భర్త దెగ్గర ఏమీ రానట్టుగా నటించి , మళ్ళీ తన భర్త తో చెప్పించుకోవొచ్చులే నని తనకు తాను సర్ది చెప్పుకుంది.
శ్రీజ తన కళ్ళు తుడుచుకుని, చిత్ర చేతుల్లోనుంచి ఫోన్ తీసుకుని, ఫోన్ ని పరికించి చూడసాగింది.
" వన్ ప్లస్ త్రీ టి... నైస్ చాయిస్ . ఐ ఫోన్ కన్నా నన్నడిగితే ఆండ్రాయిడ్ ఫోన్సే బెటర్. చాలా లిమిటేషన్స్ ఉంటున్నాయి ఐ ఫోన్స్ లో ఈ మధ్య. అన్ని ఆప్స్ దొరకవు.డౌన్లోడ్ చేస్కోవాలన్నా తలనొప్పి. బాగా కాస్ట్లీ కూడా అయ్యాయి అవి. ఇదైతే తర్టీ థౌసండ్ లోనే వస్తుంది. " అంది శ్రీజ.
"ఏందీ? ! " అంది చిత్ర, నోరు తెరిచి.
"అదే.. ఈ ఫోన్ బాగుంది అని చెప్తున్నా." అంది శ్రీజ, చిత్రకు అర్థం కాని విషయాలేవేవో చెప్పి, ఆమె నొచ్చుకునేలా చేశానేమో నన్న భావన కలిగిందామెకు.
"ఇది ముప్పైవేలా ఫోను? మూడు వేలు కాదా?" అడిగింది చిత్ర.
" అయ్యో, కాదు. మూడు వేలకి ఈ ఫోన్ బాటరీ కూడా రాదు." అంది శ్రీజ, చిత్ర అడిగిన 'వింత ' ప్రశ్నకు కాస్త ఆశ్చర్యపోతూ.
"ఓ..." అంది చిత్ర.
శ్రీజ చిత్రకు ఫోన్ వాడకం లోని బేసిక్స్ చెప్పసాగింది. చిత్ర కు మాత్రం తన భర్త ఫోన్ ఖరీదు మూడు వేలే నని చెప్పిన విషయమే గుర్తుకు రాసాగింది.
***
రాత్రి భోజనాన్ని ముగించుకుని వాకింగ్ కు బయలుదేరారు ఈశ్వర్, చిత్ర లు.
"ఇదో...నీకు ఏమన్న విసుగు నేను గీన తెప్పిస్తే నువ్వు నన్ను తిట్టొచ్చు . అర్తమవ్తుందా? నేనేమనుకోను. " అంది చిత్ర.
" అసలు నిన్ను ఎందుకు తిడతా నేను?" ఆశ్చర్యంగా అడిగాడు ఈశ్వర్, అసంబద్దంగా చిత్ర తన సంభాషణని ప్రారంభించేసరికి.
"ఏమ్లే.... ఊకెనే అన్న."
"హం."
ఒక ఐదు నిమిషాల తరువాత చిత్ర మళ్ళీ మాట్లాడటం ప్రారంభించింది.
"ఇదో....."
"చెప్పు."
"నేను పెరిగిన కాడ పైసలు ఎక్కువ లేకుంటుండె. అందుకే పైసలు ఎక్కువ కర్సయితుంటె జెర బయం నాకు. అంతకుమించి ఏం లేదు. మనసు ఒప్పుకోదు పైసలన్ని కర్సయితుంటె. గంతే గానీ నిన్ను ఇబ్బంది పెట్టాలని నేననుకోలె. అర్తమైతుందా?" అంది చిత్ర, కాస్త గద్గర స్వరం తో.
"హేయ్ ?! ఏమైంది? " ఈశ్వర్ కి అసలు చిత్ర ఏ విషయమై ఇలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదసలు.
"ఏమ్లే... ఊకెనే అన్న.... మీటింగుకి పొయింటిరంట గద. ఎట్లయ్యిండె మీటింగు?" అడిగింది చిత్ర.
"హం.....పర్లేదు."
" శ్రీజ కాడికి పొయ్యింటి సాయంత్రం. గామె చెప్పిండె నీకు ఇయాల మీటింగుందని."
"ఓ.."
***
ఈశ్వర్, చిత్ర లు ఎవరి గదుల్లో వాళ్ళు పడుకోవడానికి వెళ్ళారు.
చిత్ర తనతో మాట్లాడిన అసందర్భపు మాటల వెనక ఉన్న ఆంతర్యం ఏంటో అర్థం కాక అయోమయంగా ఆలోచించసాగాడు ఈశ్వర్.
" ఏందయ్యా క్రిష్నయ్యా, గింత బంగారు లెక్కనున్న మనిషిని ఇస్తివి నాకు మొగణి గ. మళ్ళ మా ఇద్దరి మద్య గా అమృత ని ఎందుకు పెడ్తివయ్యా నువ్వు? నాకు గా మనిషి కి చానా దెగ్గర కావాలనుందయ్యా. చానా చానా దెగ్గర కావాలనుంది......ఒక్కసారి గా మనిషి ని గట్టిగ పట్టుకుని , గాయ్నంటె ఎంత ఇష్టమో నాకు చెప్పాలనుందయ్యా. గాయ్న ఒళ్ళ పడ్కోని, ఏదో జోలి చెప్తుంటే వినాలనుందయ్యా నాకు,.....నన్ను దూరం జెయ్యకయ్యా గా మనిషి నుంచి. చానా ఇష్టమౌతున్నడు రోజు రోజుకి గా మనిషి. ఏడుపొస్తుందయ్యా నాకు. గా మనిషి కి గింత దెగ్గరగా ఉంటు గూడ, దూరంగ ఉండాల్నంటె. ఎంత గట్టిగుందమనుకున్నా అప్పుడప్పుడు నా తోని అవ్తలేదయ్యా..... అవ్తలేదు " అని మనస్సులో అనుకుంటూ, తన కంట్లోంచి రాలిపడ్డ కన్నీళ్ళను తుడుచుకుంది చిత్ర.