Update 20
న్యూస్ లో A3 మాల్ ఓనర్ వీరేంద్ర,తన భార్య జాహ్నవి తో కలిసి ఉండగా అక్కడ రిపోర్టర్స్ ఆయన్ని ప్రశ్నలు వేస్తుండగా ఆయన సమాధానాలు ఇస్తున్నారు.
రిపోర్టర్ 1 : వీరేంద్ర గారు మీ అమ్మాయి గత కొన్ని రోజుల నుంచి కనబడట్లేదు కదా దాని గురించి ఏమన్నా తెలిసిందా
రిపోర్టర్ 2 : మీ అమ్మాయి ఎవరినో ప్రేమించింది అని తెలిసింది నిజమేనా
రిపోర్టర్ 3 : sp సందీప్ ఈ కేసు చూస్తున్నట్టు ఉన్నారు ఎంతవరకు వచ్చింది
వీరేంద్ర : ముందు నన్ను మాట్లాడనిస్తారా
రిపోర్టర్స్ : సరే చెప్పండి
వీరేంద్ర : గత కొన్ని రోజులుగా మీ న్యూస్ లో చూపిస్తున్నట్టు మా అమ్మాయి కనిపించకుండా పోయిన మాట నిజమే కానీ తను మిస్ అవ్వలేదు
రిపోర్టర్ 4 : అంటే తను ప్రేమించిన అబ్బాయితో లేచిపోయిందా
వీరేంద్ర : ( కొంచెం సీరియస్ గా) లేచిపోలేదు వెళ్ళిపోయింది
రిపోర్టర్ 4 : రెండూ ఒకటే కదా సర్
వీరేంద్ర : చూడండి తను ఒక అబ్బాయిని ప్రేమించింది తనొక పేదవాడు అందుకే మేము ఒప్పుకోమని మాకు చెప్పడానికి భయపడి అతనితో వెళ్ళిపోయింది
రిపోర్టర్ 1 : సర్ మరి sp సందీప్ గారు ఆ మర్డర్ అయిన అమ్మాయి మీ అమ్మాయి అని అంటున్నట్టు తెలిసింది
వీరేంద్ర : హ అవును అతను మమ్మల్ని సంప్రదించారు అందుకే ఇప్పుడు ఈ సమావేశం
రిపోర్టర్ 2 : అంటే ఆ హత్య చేయబడినది మీ అమ్మాయేనా
వీరేంద్ర : ఏం మాట్లాడుతున్నారు మీరు బ్రతికున్న మా అమ్మాయిని చంపేస్తున్నారా ? తను మా అమ్మాయి కాదు
రిపోర్టర్ 3 : అది మీరు ఎలా చెప్పగలరు ?
వీరేంద్ర : ఎందుకంటే నిన్న మా అమ్మాయి నాకు ఫోన్ చేసింది కాబట్టి
రిపోర్టర్స్ : నిజమా
వీరేంద్ర : అవును.మా అమ్మాయి నాకు ఫోన్ చేసి మాట్లాడింది
రిపోర్టర్ 2 : తను మీ అమ్మాయి అని సాక్ష్యం ఏంటి ?
రిపోర్టర్ 4 : అసలు తను ఎక్కడుందంటా ?
వీరేంద్ర : నేను తన తండ్రిని ఫోన్ చేసింది తనో కాదో నాకు తెలీదా.తను ఎక్కడుందో తెలీదు ఆ అబ్బాయిని మేము ఏమైనా చేస్తామని తను భయపడుతుంది అందుకే తనెక్కడుందో తెలియనీయలేదు
రిపోర్టర్ 1 : కథ బాగా చెప్తున్నారు అండి
వీరేంద్ర : ఇదేమి కథ కాదు అయినా అలా చెప్పడానికి నాకేం పని. తనకి నా మీద నమ్మకం కలిగినప్పుడు తనే తిరిగి వస్తుంది అప్పటివరకు మేము ఎదురుచూస్తాం.తన ఆనందమే మాకు కావాలి దయ చేసి మీరు కానీ సెక్యూరిటీ ఆఫీసర్లు కానీ మా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవద్దు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం.మా అమ్మాయి రాగానే నేనే ఇంకొక సమావేశం పెట్టి చెబుతా అంతవరకూ మమ్మల్ని వదిలేయండి.మేము కేసు కూడా వాపస్ తీసుకుంటున్నాము అందుకే ఈ మీడియా సమావేశం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
మీడియా సమావేశం తర్వాత వీరేంద్ర,జాహ్నవి ఇంటికి వచ్చాక
జాహ్నవి : వీరూ, మీడియా ముందు నువ్వు అలా చెప్పడం నాకు నచ్చలేదు.
వీరేంద్ర : అంటే
జాహ్నవి : మీరు కేసు వాపస్ తీసుకోవడం నాకు నచ్చలేదు
వీరేంద్ర : ( సీరియస్ గా ) ఏం చేయమంటావ్ మరి
జాహ్నవి : తను దొరికేవరకు వెతికించాల్సింది లేక ఆ sp చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాల్సింది
వీరేంద్ర : జాను మతి ఉండే మాట్లాడుతున్నావా
విశ్వ : అన్నయ్య , వదిన అన్నదాంట్లో తప్పేముంది మీరు ఇలా తగ్గడం నాకు నచ్చలేదు
వీరేంద్ర : మరి ఏం చేయమంటావ్ విశ్వ.ఒక కూతురి కోసం మిగిలిన ఇద్దరి కూతుర్లని ప్రమాదంలోకి నెట్టేయలేను కదా
విశ్వ : ఏమంటున్నారు అన్నయ్య
వీరేంద్ర : ఈ కేసు వాపస్ తీసుకోకపోతే అన్వికి పట్టిన గతే మిగతా ఇద్దరికీ పడుతుందని బెదిరించారు రా
విశ్వ : ఎవరు ?
వీరేంద్ర : తెలీదు
విశ్వ : మన శత్రువులు ఎవరైనా అయ్యి ఉండొచ్చు అది సెక్యూరిటీ ఆఫీసర్లకు చెబితే మంచిది కదన్నయ్యా
వీరేంద్ర : విశ్వ వాళ్ళు చాలా ప్రమాదకారులు అది నాకు అర్థమైంది.అన్వి అసలు బ్రతికి ఉందో లేక ఆ సందీప్ అన్నట్టు తను చనిపోయిందో నాకు తెలీదు కానీ తను చనిపోయి ఉంటే మిగిలిన ఇద్దరి ప్రాణాలు రిస్క్ లో పెట్టలేను.ఒకవేళ తను బ్రతికి ఉంటే ముగ్గురి ప్రాణాలకి ముప్పు తేలేను
జాహ్నవి : ( కోపంగా ) అంటే ఏంటి వీరు తనని అలా ప్రమాదంలోనే ఉంచేయమంటావా
వీరేంద్ర : అంతే
జాహ్నవి : ఎవరికోసమో నా కూతురిని అలా వదిలేయలేను
వీరేంద్ర : జాహ్నవి
జాహ్నవి : నాకు తెలుసు వీరేంద్ర వాళ్ళు ఐశ్వర్య ని చంపేస్తా అని బెదిరించారు అందుకే నువ్వు కేసు వాపస్ తీసుకున్నావ్
వీరేంద్ర : అవును అయితే ఏంటి
విశ్వ : ఏమంటున్నావ్ అన్నయ్య నా కూతురి కోసం నీ కూతురిని అలా వదిలేయడం నాకు నచ్చలేదు
జాహ్నవి : అలా అడుగు విశ్వ , నేను ఇప్పుడు సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్తున్నా నా కూతురిని వెతికించడానికి
వీరేంద్ర : ( కోపముగా ) ఇంకోసారి అన్వి కోసం సెక్యూరిటీ ఆఫీసర్లను సంప్రదిస్తే నా శవాన్ని చూడాల్సి వస్తుంది
జాహ్నవి : వీరూ
వీరేంద్ర : వాళ్ళు ఐశ్వర్య నే కాదు అక్షర ని టార్గెట్ చేసారు అందుకే నేను తగ్గాల్సి వచ్చింది.అసలు మన అన్వి చనిపోయి ఉంటే ఉన్న ఇద్దరినీ కూడా దూరం చేసుకోమంటావా
జాహ్నవి : ఎప్పటి వరకు ఇలా
వీరేంద్ర : సమయం మనది అయ్యేంతవరకు
జాహ్నవి : అప్పటివరకు అన్వి బ్రతికి ఉందో లేదా మనల్ని విడిచి వెళ్ళిపోయిందో తెలియకుండా ఇలా బ్రతుకుతూ ఉండాలా
వీరేంద్ర : ఉండాలి తప్పదు
జాహ్నవి : ఈ బాధ ఇంకెన్నాళ్లు
వీరేంద్ర : ఏమో అది కొన్నాళ్ళు కావొచ్చు లేదా జీవితకాలం కావొచ్చు
జాహ్నవి : దేవుడా అది ఏం పాపం చేసిందని ఇలా చేసావ్
వీరేంద్ర : పాపాలు పిల్లలే చేయక్కర్లేదు తల్లిదండ్రులు చేసినా ఆ పాపం పిల్లలకి చుట్టుకుంటుంది
జాహ్నవి : ( చాలా కోపంగా) ఏమంటున్నావ్ వీరేంద్ర
వీరేంద్ర : తెలిసిందే.నువ్వు చేసిన పనులు ఎలాంటివో నీకు తెలియంది కాదు ఆ పాపం ఈరోజు నా బిడ్డకి తగిలింది.నువ్వు చేసిన తప్పుల వల్ల ఎంతమంది కన్నీళ్లు కార్చారో ఆ కర్మ నీవు అనుభవించాల్సిందే నీతో పాటు నీ భర్త అయ్యినందుకు నేను కూడా
జాహ్నవి ఏదో అనబోయేంతలో వీరేంద్ర ఇంక చాలు అన్నట్టు చేయి పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయాడు.ఇక్కడ జాహ్నవి ఏడుస్తూ సోఫాలో కూర్చుని ఉండిపోయింది. తనని ఓదార్చడానికి రాబోయిన ఐశ్వర్య ని కోపంగా చూసి ఆపేసింది. ఐశ్వర్య వల్లే తన భర్త తన కూతురిని వెతికించడం ఆపేసాడని తన అభిప్రాయం అందుకే ఆమె ఐశ్వర్య పై కోపంగా ఉంది కానీ తనకి తెలియని విషయం ఏమిటంటే తాను పెంచి పోషించిన విషసర్పమే తన కూతురిని కాటేసిందని.
వీరేంద్ర కుటుంబ విషయానికి వస్తే వీరేంద్ర తండ్రి రమణ చాలా పేదవాడు. రమణ కి ఇద్దరు కొడుకులు వీరేంద్ర , విశ్వ . వీరేంద్రకి చిన్నప్పటి నుంచి చదువంటే ఇష్టం కానీ తన కుటుంబ పరిస్థితుల వల్ల చదువు మానేసి తన తమ్ముణ్ణి చదివించడం మొదలుపెట్టాడు.ఇది తెలుసుకున్న ఒక పెద్దాయన తనని చదివించాడు. ఈ క్రమంలోనే జాహ్నవి ని ప్రేమించడం పెళ్లి చేసుకోవడం జరిగి ఇద్దరు పిల్లలు పుట్టగా అతని తమ్ముడికి పెళ్లి జరిగి ఒక కూతురు పుట్టింది.
వీరేంద్ర ( 51) :
భార్య జాహ్నవి ( 46 )
పెద్ద కూతురు అక్షర (22)
చిన్న కూతురు అన్విత (20 )
విశ్వ (45) :
భార్య అనిత (39)
కూతురు ఐశ్వర్య (19)
అన్నదమ్ములిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కొన్నేళ్ళకి వీరేంద్ర ఒక చిన్న బిజినెస్ మొదలుపెట్టగా అది తన చిన్న కూతురు అన్విత పుట్టాక తనకి చాలా లాభాలను తెచ్చిపెట్టింది. అలా కాలక్రమేణా తన బిజినెస్ ని తన తమ్ముడి సహాయంతో విస్తరించి ఒక టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ గా స్థిరపడ్డాడు.
వీరేంద్ర తన తమ్ముడి కూతురిని కూడా తన సొంత కూతురిలాగే చూసుకుంటాడు.ఏనాడూ వాళ్ల మధ్య తేడాని చూపించలేదు.తన అదృష్టానికి,ఎదుగుదలకి తన కూతుర్లే కారణమని భావించిన వీరేంద్ర వాళ్ళ పేర్లలో మొదటి అక్షరాన్ని తీసుకుని A౩ మాల్ ని స్థాపించాడు.
ఇక ప్రస్తుతానికి వస్తే లోపలికి వెళ్లిన వీరేంద్ర తను సీక్రెట్ గా దాచిన ఒక ఫోటోని తీసి చూస్తూ ఎక్కడ ఉన్నారు సర్ మీరు ? ఎన్నాళ్ల నుంచో వెతికిస్తున్నా మీ కోసం కానీ ఒక చిన్న క్లూ కూడా తెలియట్లేదు అసలు ఏమయిపోయారు,చిన్ని ఏమయిపోయింది,ఎక్కడికి వెళ్లిపోయారు అనుకుంటున్నాడు.ఇన్నాళ్లు మీ అవసరం రాలేదు కానీ ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. నాకు చాలా భయమేస్తుంది సర్ ఆ రోజు మీరు చెప్పిన విషయం జరుగుతుందేమో అని కానీ నాకు ఏం చేయాలో తెలియట్లేదు.అన్విత కనిపించట్లేదు ఆ sp సందీప్ చనిపోయిన ఆ అమ్మాయే అన్విత అంటున్నారు.నాకు అతను చెప్పేది నిజమే అనిపిస్తుంది.అది నిజమయితే మీరు అన్నట్టు ఈ కుటుంబాలలో మళ్ళీ ప్రమాదాలు సంభవించబోతున్నాయా.నాకేమి అర్ధం కావట్లేదు దాని కోసమైనా మిమ్మల్ని త్వరగా పట్టుకోవాలి అని అనుకుంటున్నాడు.అప్పుడే తలుపు చప్పుడయితే ఆ ఫోటో ని యధావిధిగా అక్కడే పెట్టేసి వెనక్కి తిరగగా అక్కడ ఐశ్వర్య నిల్చుని ఉంది.
ఐశ్వర్య : పెద్దనాన్న
వీరేంద్ర : ఏంటి ఐషు
ఐశ్వర్య : బాధపడుతున్నారా
వీరేంద్ర : బాధ ఏమి లేదే అయినా నాకేమి బాధ ఉంటుంది
ఐశ్వర్య : మీ గురించి నాకు తెలీదా పైకి ఎంత గంభీరంగా ఉన్నా లోపల చాలా మృదుస్వభావి
వీరేంద్ర : ( నవ్వుతూ ) నా గురించి బాగా తెలుసుకున్నావ్ అందుకే నువ్వంటే నాకు ఇష్టం
ఐశ్వర్య : ఏం కాదు మీకు అన్వి అక్క అంటే ఇష్టం
వీరేంద్ర : ( అన్వి పేరు రాగానే వాడు సైలెంట్ అయిపోతాడు ) హు
ఐశ్వర్య : అయ్యోరామా మిమల్ని ఓదార్చడానికి వచ్చి మళ్ళీ బాధపెడుతున్నానా
వీరేంద్ర : ఏం లేదులేరా అయినా నన్ను కాదు వెళ్లి మీ పెద్దమ్మని ఓదార్చు
ఐశ్వర్య : అదే చేయబోయా కానీ నా వంక కోపంగా చూసింది అందుకే ఇక్కడికి వచ్చేసా
వీరేంద్ర : మీ పెద్దమ్మ అంతేనమ్మా
ఐశ్వర్య : ఏం కాదు మీరు చేసింది నాకే నచ్చలేదు ఇంకా తనకి అలా కోపం రావడంలో తప్పేమీ లేదు
వీరేంద్ర : ( హు తన గురించి మీకు తెలియదమ్మా తనకి తన అనే స్వార్థం తప్పా ఇంకేమీ కనపడదు ) వాళ్ళు అక్షర గురించి కూడా బెదిరించారు అమ్మా అది మీ పెద్దమ్మకి ఎంత చెప్పినా నమ్మక నీ మీద కోపం పెంచుకుంటుంది.
ఐశ్వర్య : పెద్దమ్మ బాధలో ఉండి అలా ప్రవర్తిస్తుంది చూస్తూ ఉండు తన కోపం కొన్ని రోజుల్లో పోతుంది
వీరేంద్ర : చూద్దాం
ఐశ్వర్య : అయినా అక్కని వెతికించకుండా అలా వదిలేస్తే ఎలా
వీరేంద్ర : అసలు తను బ్రతికే ఉందంటావా
ఐశ్వర్య : అంటే ఆ సెక్యూరిటీ అధికారి చెప్పింది నిజమంటారా
వీరేంద్ర : నాకు అదే నిజమనిపిస్తోంది
ఐశ్వర్య : (కొంచెం బాధగా ) అదే నిజమయితే అక్కని చంపిన వాళ్ళకి శిక్ష పడకుండా వదిలేస్తారా
వీరేంద్ర : ఏం చేయమంటావ్ మరి అన్విని ఎలాగో కోల్పోయా మీ ఇద్దరిని అయినా రక్షించుకోవాలి కదా
ఐశ్వర్య : అది కాదు పెద్దనాన్న సీక్రెట్ గా అయినా చేయించొచ్చు కదా
వీరేంద్ర : నేను సెక్యూరిటీ ఆఫీసర్లను కలిస్తే వాళ్ళకి డౌట్ రావొచ్చు రా
ఐశ్వర్య : సెక్యూరిటీ అధికారి కాకపోతే ఇంకెవరైనా డిటెక్టివ్ అయినా సరే
వీరేంద్ర : ( హ్మ్మ్ ఇదే మంచిది.అన్వినే కాకుండా తన గురించి కూడా తెలుసుకోవాలి ) సరేరా అలానే చేద్దాం కానీ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దూ ఇంట్లో కూడా
ఐశ్వర్య అలాగే పెదనాన్న అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోగా వీరేంద్ర డిటెక్టివ్ గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు
*************************************
బ్యాక్ టు సెక్యూరిటీ అధికారుల మీటింగ్ :
ప్రభాకర్ : ( టీవీ లో వీరేంద్ర ఇంటర్వ్యూ చూసాక ) ఏంటయ్యా ఇది
సెక్యూరిటీ అధికారి 2 : ఆ వీరేంద్ర చెబుతుంది నిజమేనేమో సర్..ఈ సందీప్ కేసు ని మిస్-గైడ్
చేస్తున్నాడేమో
సందీప్ : మరి వీరేంద్ర గారు కేసు వాపస్ తీసుకుంటాం అంటున్నారు కానీ వాళ్ళ అమ్మాయి ఎక్కడ ఉందో తెలీదు అంటున్నారు ఆయన చెప్పింది నిజమే అని ఎలా అంటారు సర్
సెక్యూరిటీ అధికారి 1 : సర్ మీరు సందీప్ ని తప్పు పడుతున్నారు కానీ ఇక్కడ చాలా కేసెస్ లో ఇలానే జరుగుతుంది దానికి మీ సమాధానం
మిగిలినవారు : అవును అది నిజమే
ప్రభాకర్ : అసలు ఏం జరుగుతుంది
సందీప్ : ఏమో సర్ కానీ ఏదో జరుగుతుంది మనకి తెలియకుండా
ఇంతలో బయట నుంచి ఒకరు వచ్చి ప్రభాకర్ కి ఒక అమ్మాయి అర్జెంట్గా కలవాలి అంటుంది అని ఇంకా ఏదో చెబుతాడు. ఆయన ఆమెని కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పి తిరిగి తన మీటింగ్ కొనసాగించాడు.
ప్రభాకర్ : అంటే ఇప్పుడు జరుగుతున్న నేరాలకు ఒకడే భాద్యుడు అంటావా
సందీప్ : అయ్యుండొచ్చు సర్
సెక్యూరిటీ అధికారి 2 : ఏంటి సైకో కిల్లర్ అంటారా అయితే
ప్రభాకర్ : మీరు కాసేపు సైలెంట్ గా ఉంటారా ( దెబ్బకి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ నోరు మూసేస్తాడు )
సందీప్ : సర్ ఇది అనుకున్నంత చిన్న కేసు ఏమీ కాదు అనిపిస్తుంది దీని వెనుక ఎవరో ఉన్నారనిపిస్తుంది
ప్రభాకర్ : నాకు అనుమానంగానే ఉంది. సరే దీని గురించి ఇంకోసారి మీట్ అయ్యి మాట్లాడుకుందాం
సరే అని చెప్పి అందరూ వెళ్లిపోతుంటే సందీప్ మరియు ఇంకో ఇద్దరినీ ఆయనకి బాగా నమ్మకస్తులైన వారిని ఉండమని చెబుతారు. అందరూ వెళ్లిపోయాక
సందీప్ : ఏమైంది సర్
ప్రభాకర్ : ఏంటి
సందీప్ : మీరు ఇందాక బయట నుంచి మీ డ్రైవర్ వచ్చి ఏదో చెప్పిన దగ్గర నుంచి చాలా టెన్షన్ గా కనిపిస్తున్నారు
ప్రభాకర్ : హ్మ్మ్ అందుకేనయ్యా నువ్వంటే నాకిష్టం సూర్య బయట ఒక అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంది తనని రమ్మను
సూర్య : ఓకే సర్
సందీప్ : ఎవరు సర్ ఆ అమ్మాయి
ప్రభాకర్ : తెలీదు కానీ నా మనవరాలు ఏదో ప్రమాదంలో ఉంది అది చెప్పడానికి వచ్చాను అని చెప్పింది
సందీప్ : ఈ విషయం ఇంత ఆలస్యంగా చెపుతున్నారు ముందు పదండి తను ఎటువంటి ప్రమాదంలో ఉందో
ప్రభాకర్ : కాసేపు ఆగవయ్యా
సందీప్ : కానీ
ప్రభాకర్ : తను ఎటువంటి ప్రమాదంలో లేదు.ఇంటి దగ్గర ఉంది
సందీప్ : మరి ఆ అమ్మాయి అలా ఎందుకు చెప్పింది
ప్రభాకర్ : రానివ్వు కనుక్కుందాం
ఇంతలో ఆ అమ్మాయి లోపలికి వస్తుంది
ప్రభాకర్ : రా అమ్మాయి ఇప్పుడు చెప్పు నా మనవరాలు ప్రమాదంలో ఉంది అని చెప్పి అర్జెంట్ గా కలవాలి అన్నావ్
అమ్మాయి : సారీ సర్ మీ మనవరాలు ఎటువంటి ప్రమాదంలో లేదు
ప్రభాకర్ : మరి అలా అబద్ధం ఎందుకు చెప్పావ్ సెక్యూరిటీ ఆఫీసర్లతో అలా చెప్పకూడదని తెలీదా
అమ్మాయి : సారీ సర్ ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి అందుకే మిమ్మల్ని కలవడానికి ఇలా అబద్ధం చెప్పవలసి వచ్చింది
ప్రభాకర్ : మీ పేరు
అమ్మాయి : భవ్య
ప్రభాకర్ : సరే విషయం ఏంటి చెప్పు
భవ్య : ( అక్కడున్న ముగ్గురి వైపు చూస్తూ ) మీతో సీక్రెట్ గా చెప్పాలి సర్
ప్రభాకర్ : ( ఆమె సందేహం అర్ధమయ్యి ) పర్లేదు వాళ్ళని నమ్మొచ్చు
భవ్య : సర్ ఈ నగరంలోని అమ్మాయిలు చాలా ప్రమాదంలో ఉన్నారు
సందీప్ : ఏమంటున్నారు మిస్ భవ్య
భవ్య : నిజం సర్ కావాలంటే మీకు రీసెంట్ గా మిస్సింగ్ కేసెస్ , మర్డర్ కేసెస్ పెరిగి ఉండొచ్చు
సూర్య : అవును అది నిజమే
భవ్య : అవన్నీ చేస్తుంది ఒక్కరే అంటే నమ్ముతారా
సందీప్ : మాకు అదే డౌట్ గా ఉంది ఇప్పుడు మీరు అదే చెబుతుంటే నిజమే అనిపిస్తుంది
కిశోర్ : అంటే ఏమైనా సైకో కిల్లర్ నా
భవ్య : కాదు
ప్రభాకర్ : ఇవన్నీ మీకెలా తెలుసు
భవ్య : సర్ నేనొక జర్నలిస్ట్ ని
ప్రభాకర్ : ఓహ్
భవ్య : నేను ఒక మూడేళ్ళ నుంచి దీనిపైనే పని చేస్తున్నా
సందీప్ : మూడేళ్ళ నుంచా కానీ ఇక్కడ ఈ టైపు కేసెస్ గత 4 లేదా 5 నెలల నుంచే జరుగుతున్నాయి మీరేదో పొరబడుతున్నట్టు ఉన్నారు
భవ్య : ఇక్కడ జరగలేదు కానీ ఇదివరకు ముంబై లో ఇలాంటివి జరిగాయి ఒకసారి చెక్ చేసుకోండి
ప్రభాకర్ : కిశోర్ ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ అమ్మాయి చెప్పింది నిజమైతే చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఆ కేసెస్ మళ్ళీ విచారణ చేయండి
భవ్య : ఏం ఉపయోగం ఉండదు సర్ అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా మీకు సహకరించరు
ప్రభాకర్ : ఎందుకు
భవ్య : ఇప్పుడు మీరు ఇలాంటి సిట్యువేషన్ నే ఎదుర్కొంటున్నారు కదా
సందీప్ : అవును
ప్రభాకర్ : చూడు అమ్మాయి కొంచెం క్లారిటీగా చెప్పు
భవ్య : సర్ వాళ్ళు ఎందుకు సహకరించరు అంటే ఆ క్రిమినల్స్ వాళ్ళని బెదిరించారు కాబట్టి
సందీప్ : ఏంటి వాళ్ళు బెదిరిస్తే వీళ్ళు మాకు చెప్పాలి కదా అలా కాకుండా వాళ్ళకి బెదిరి ఇలా మాకు సహకరించకపోతే ఎలా
భవ్య : ( కొంచెం ఆవేశంగా బాధగా ) ఏం చేయగలరు. వారు నిసహ్హయులు ఒకవేళ మీకు చెప్పిన ఏం చేయగలరు వాళ్ళ ప్రాణాలు అయినా కాపాడలేరు ఇంకా చెప్పాలంటే మీలోనే కొంతమంది వాళ్ళకి సహాయం చేస్తారు
ప్రభాకర్ : ( ఆమెలోని బాధని గమనించి ) ఏమైంది భవ్య మీ బాధని మాతో పంచుకో
సందీప్ : సర్ ఏమంటున్నారు
ప్రభాకర్ : తను ఏదో బాధలో ఉంది
సందీప్. ఏం జరిగింది చెప్పు భవ్య
( ఇక్కడ భవ్య తన గురుంచి తన మాటల్లో చెబుతుంది )
మూడేళ్ళ క్రితం నేను ఉద్యోగరీత్యా ముంబైలో పనిచేసేదాన్ని.అటువంటి సమయంలోనే నాకు ఇలాంటి మిస్సింగ్ కేసెస్ గురుంచి న్యూస్ వచ్చేది కానీ ఏమయ్యేదో తెలీదు కానీ కొన్ని రోజులకి ఆ మిస్ అయ్యిన అమ్మాయిల కుటుంబాలు కేసు వాపస్ తీసుకునేవి లేదా సెక్యూరిటీ ఆఫీసర్లకు సహకరించేవారు కాదు.అనుమానమొచ్చి నేను సీక్రెట్ గా ఒక ఎంక్వయిరీ చేయడం ప్రారంభించాను.అటువంటి సమయంలోనే నాకు నా చెల్లెలు కనిపించటం లేదని తెలిసింది.
నేను తన గురించి ఎంక్వయిరీ చేస్తూనే సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇచ్చాను.నా ఎంక్వయిరీ లో తెలిసింది ఏంటంటే తను కొద్దిరోజులుగా ఒక ఆటో డ్రైవర్ తో క్లోజ్ గా ఉంటుందని,అదే విషయాన్నీ సెక్యూరిటీ ఆఫీసర్లకు చెప్పాను.అప్పుడే నాకు ఒక cd తో పాటు ఒక బెదిరింపు మెస్సేజ్ వచ్చింది.అది ఏంటంటే కేసు వాపస్ తీసుకోకపోతే నా ఫ్యామిలీని చంపేస్తా అని కానీ నేను కేసు వాపస్ తీసుకోలేదు.దానికి జవాబుగా వాళ్ళు నా తల్లిదండ్రులు,తమ్ముడిని చంపేశారు.
కొన్నిరోజులకి సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా మా చెల్లి ఎవడితోనో వెళ్లిపోయిందని అది తట్టుకోలేక నా ఫ్యామిలీ చనిపోయిందని కేసు క్లోజ్ చేసేసారు.అప్పటినుంచి నేను నా చెల్లి గురుంచి వెతుకుతూనే ఆ క్రిమినల్ గురించి తెలుసుకుంటూ ఉన్నాను
సందీప్ : మరి మీ చెల్లి జాడ ఏమైనా తెలిసిందా
భవ్య : లేదు
సందీప్ : ఆ cd లో ఏముంది
భవ్య : .......
సందీప్ : నాకు అర్థమైంది అందులో మీ చెల్లిని బలవంతం చేసారు
భవ్య : ......
సందీప్ : చెప్పండి మీరు చెప్పే చిన్న విషయమైనా ఆ నేరస్తుడిని పట్టుకోవడానికి ఉపయోగపడవచ్చు
భవ్య : లేదు ఆ వీడియోలో తను ఇష్టపూర్వకంగానే సెక్స్ లో పాల్గొంది
సూర్య : ఏమిటి అది ఎలా
సందీప్ : డ్రగ్స్
ప్రభాకర్ : కరెక్ట్ వాళ్ళు అమ్మాయిలని కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు ఇట్స్ క్లియర్ లీ విమెన్ ట్రాఫికింగ్ కేసు.భవ్య ఆ నేరస్తుడి గురించి నీకు తెలిసింది చెప్పు
భవ్య : సర్ తన గురించి నాకేమీ తెలీదు కానీ తనని mr.v అని పిలుస్తారు అది తెలుసు ఇన్ని రోజులలో నేను తనని చేరుకోలేకపోయాను
సందీప్ : ( mr.v నిన్ను ఎలా అయినా నేను చేరుకుంటా ) ఇప్పుడు మనం పట్టుకుందాం ఇంకేమైనా వివరాలు
భవ్య : సర్ వాళ్ళు అమ్మాయిలని ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తారు తరువాత వాళ్ళని లొంగదీసుకుని ఈ ఘాతుకానికి పాలుపడతారు
సూర్య : ఇప్పటి రోజుల్లో చాలా ప్రేమ జంటలు ఉన్నాయి ఎవరిని అని అనుమానించగలం
భవ్య : నిజమే కానీ వాళ్ళు స్టూడెంట్స్ కాదు వాళ్ళు ఎక్కువగా షాప్స్ లో పనిచేసేవాళ్ళు ,ఆటో డ్రైవర్స్ ఇలా ఉంటూ అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నారు
కిశోర్ : అలా ఎందుకు
భవ్య : సర్ వాళ్ళ టార్గెట్ ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఇలాంటి ఫ్యామిలీస్ లో తల్లిదండ్రులు ఎక్కువగా తమ పిల్లలకి గొప్ప సంబంధాలు చూడాలి అనుకుంటారు కానీ తమ పిల్లలను ఇలా తమ కంటే తక్కువ బ్రతుకు బ్రతుకుతున్న వాళ్ళకి ఎందుకు ఇస్తారు అదే వాళ్ళకి కావాలి మీ ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పి వాళ్ళని తీసుకెళ్లడానికి
సందీప్ : అలాగంటే ధనవంతులు ఇలా అసలు ఒప్పుకోరు మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయట్లేదు
భవ్య : సర్ ధనవంతులు అయితే వాళ్ళకి ఉన్న పలుకుబడి వల్ల ఏమైనా సమస్యలు రావొచ్చు అదే మిడిల్ క్లాస్ అయితే ఇలాంటి సమస్యలు రావు ఇంకా బాగా పేదవాళ్ళు అంటారా ఇలాంటి ప్రేమలు వాళ్ళ ఇళ్లలో ఒప్పుకుంటే అప్పుడు వాళ్ళు అనుకున్నది జరగదు అందుకే వాళ్ళ టార్గెట్ మిడిల్ క్లాస్
ప్రభాకర్ : నువ్వనేది నిజమే కానీ మరి వీరేంద్ర గారి అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేసినట్టు
భవ్య : అదే నాకు తెలియట్లేదు సర్ కానీ ఇప్పటివరకు ఇలాంటి కేసెస్ అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో జరిగినవే ఇదొక్కటి మాత్రం ఇలా
సందీప్ : సర్ నేరస్తులకు తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే తను ఒక రూంలో ఫ్రెండ్స్ తో కలిసి ఉంటుంది వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్లే
ప్రభాకర్ : మే బి
భవ్య : ఇంకో విషయం సర్ వాళ్ళ టార్గెట్ ఎక్కువగా 16 నుంచి 21 వయస్సు మధ్యలో ఉన్నవాళ్లే
కిశోర్ : అలా ఎందుకు
భవ్య : సర్ ఆ వయస్సు టీనేజ్ ఆ వయస్సులో ఏం చేసిన తప్పుగా అనిపించదు అది ప్రేమ అయినా సరే ఇంకేదైనా సరే
ప్రభాకర్ : ఓకే మరి ఇప్పటివరకు మమ్మల్ని రీచ్ అవ్వని నువ్వు ఇప్పుడే ఎందుకు రీచ్ అయ్యావ్
భవ్య : సర్ ముంబైలో జరిగిన ఈ నేరాలు రెండేళ్ల ముందు ఎందుకో తెలీదు సడన్ గా ఆగిపోయాయి కానీ ఇప్పుడు ఆ విధమైన నేరాలు ఇక్కడ జరుగుతున్నాయి
సందీప్ : మరి మొదటి నేరం జరిగినప్పుడే నువ్వు మాకు ఇది ఎందుకు చెప్పలేదు
భవ్య : సర్ మీ వాళ్లలో కూడా తన మనుషులు ఉన్నారు కాబట్టి నా ప్రాణాలు రిస్క్ లో పెట్టలేను కదా
సందీప్ : మరి ఇప్పుడు మాతో చెబుతున్నావ్
భవ్య : సర్ నేనొక జర్నలిస్ట్ ని ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేనా
ప్రభాకర్ : హ్మ్మ్ దీనిపై నేను పై అధికారులతో మాట్లాడి ఒక టీం ఏర్పాటు చేస్తాను
సందీప్ : సర్ ఇది ఒక సీక్రెట్ ఆపరేషన్ అయితే బాగుంటుంది అని నా అభిప్రాయం
ప్రభాకర్ : ఎందుకు
సందీప్ : ఇది ఓపెన్ గా చేస్తే వాళ్ళు జాగ్రత్త పడిపోయే అవకాశం ఉంది అందుకే
ప్రభాకర్ : ఓకే అదే చేద్దాం
సందీప్ : ఓకే సర్.భవ్య గారు మీరు కూడా మాకు సహాయం చేయాలి
భవ్య : సరే సర్