Update 029

వెంటనే మహారాణి మోహిని తనకు నమ్మకమైన సైనికాధికారులందరినీ పిలిపించింది.
అందరిని సమావేశ పరికి రాజుగారు కోటలోకి వచ్చిన తరువాత ఏం చేయాలి….ఎలా దాడి చేయాలో అంతా పధకం ప్రకారం వివరంగా చెప్పి పంపించింది.
కాని మహారాజు ప్రయాణంలో ఉండగానే గూఢచారుల ద్వారా తిరుగుబాటు సంగతి గజ సింగ్ కి తెలిసిపోయింది.

వెంటనే గజసింగ్ తన ఇద్దరు కుమారులను పిలిపించి తిరుగుబాటు సంగతి చెప్పి కోటలోకి వెళ్ళిన తరువాత ఏం చేయాలి అనేది ఒక పధకం వేసుకుని మళ్ళీ ప్రయాణం సాగించి కోట లోపలికి వెళ్ళారు.
కోట లొపలికి వెళ్ళిన మహారాజు గజసింగ్ కి, అతని ఇద్దరు కుమారులకు మహారాణి మోహిని ఘనంగా స్వాగతం పలికింది.
అందరు ఎవరి పధకం ప్రకారం వాళ్ళు పావులు కదుపుతున్నారు.
మహారాజు అంతఃపురం లోకి వెళ్ళీ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత రాజ కుటుంబం మొత్తం పూజ గదిలోకి వెళ్ళి పూజ చేయడం మొదలు పెట్టారు.
పూజ చేస్తుండగా మోహిని తన పరిచారిక అయిన మంధర వైపు చూసింది….మంధర వెంటనే తమ సైన్యాలకు సైగ చేసింది.
ఇది ముందే ఊహించిని గజసింగ్ చిన్నగా తల తిప్పి తన కొడుకు రంజిత్ సింగ్ వైపు చూసాడు.
రంజిత్ సింగ్ వెంటనే మోహిని గమనించకుండా అక్కడ నుండి బయటకు వచ్చి కోటలో రహస్యంగా దాక్కున్న తన సేనలకు సైగ చేసి తిరుగుబాటుని అణిచివేయడానికి సైన్యాన్ని సమాయత్త పరిచాడు.
దాంతో రెండు పక్షాలు భీకరంగా యుధ్ధం చేసుకున్నాయి….కాని రంజిత్ సింగ్ సైన్యం తిరుగుబాటుదారుల్ని నాలుగు వైపులా చుట్టుముట్టడంతో….ఒక్కసారిగా ఊహించని పరిణామానికి తిరుగుబాటు దారులు తేరుకునె లోపు రంజిత్ సింగ్ సైన్యం వాళ్ళను ఊచకోత కోసేసింది.

ఇక్కడ పూజగదిలో గజసింగ్ పూజ చేస్తుండగా మోహిని ఒక్కసారిగా తన బొడ్లోని కత్తిని తీసి మెరుపు వేగంతో గజ సింగ్ గుండెల్లో దించింది.
కత్తికి విషం పూసి ఉండటంతో గజసింగ్ అక్కడికక్కడె ప్రాణాలు విడిచేసాడు.
వెంటనే గజ్ సింగ్ రెండవ కొడుకు దల్బీర్ సింగ్ తేరుకుని మోహినిని బంధించేసాడు.
బయట తిరుగుబాటుని పూర్తిగా అణిచివేసిన తరువాత రంజిత్ సింగ్ లొపలికి వచ్చి జరిగింది తెలుసుకుని మహారాణి మోహినిని సంకెళ్లతో బంధించి కారాగారంలో పడేసాడు.
దాంతో రంజిత్ సింగ్ తమ దారిలో ఉన్న అడ్డంకి మొత్తం తొలగిపోవడంతో అతని రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు.
రంజిత్ సింగ్ తన మహల్ లో ఉండగా మహామంత్రి వచ్చి….
మహామంత్రి : మీరు మహారాణీ మోహినిని కారాగారంలొ వేసారు…..కాని….
రంజిత్ సింగ్ : కాని….కాని ఏంటి మంత్రి గారు….

మహామంత్రి : కాని ఆమె కారాగారంలో ఉన్నంత మాత్రాన మీ స్రామ్రాజ్యం పూర్తి రక్షణలో ఉన్నట్టు కాదు మహారాజా….
రంజిత్ సింగ్ : మీరు ఏం చెబుతున్నారో మాకు అర్ధం కావడం లేదు మంత్రి గారు…ఏం చెప్పాలనుకుంటున్నారో వివరంగా చెప్పండి.
మహామంత్రి : నా గూఢచారులు తెచ్చిన సమాచారం ప్రకారం మోహిని తంత్ర, మంత్ర, క్షుద్ర విద్యలలో ఆరితేరిపోయింది….అందుకని ఆమెను ప్రాణాలతొ ఉంచడం ఏమాత్రం మంచిది కాదు….
రంజిత్ సింగ్ : సరె…..అయితే ఈ ప్రమాదం నుండి గట్టెక్కడానికి ఉపాయం ఆలోచించి…అమలు పరచండి….
మహామంత్రి అలాగే అని తల ఊపి అక్కడనుండి వెళ్ళిపోయాడు.
************
కారాగారంలో మోహిని అక్కడ గట్టు మీద కూర్చుని కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నది.
అంతలొ ఆమె పరిచారిక మంధర వచ్చి….
మంధర : నమస్కారం మహారాణి….
Next page: Update 030
Previous page: Update 028