Update 030

మంధర మాట విన్న మోహిని కళ్ళు తెరిచి….
మోహిని : రంజిత్ సింగ్ రాజ్యాభిషేకం అయిపోయిందా…..

మంధర : మీకు ఎలా తెలుసు….
మోహిని : నాకు అంతా తెలుసు…..అంతే కాక నాకు ఈరోజు చివరి రాత్రి అని కూడా తెలుసు….
మంధర : మీరు కనక ఒప్పుకుంటే నేను మన నమ్మకస్తుల ద్వారా మిమ్మల్ని ఇక్కడ నుండి తప్పించేస్తాను….
మోహిని : లేదు మంధర…..(అంటూ తన చేతిలో ఉన్న తాయెత్తు ఆమెకు చూపిస్తూ) ఈ తాయెత్తు నా దగ్గర ఉన్నంత వరకు నాకు అపాయం లేదు మంధర….కాని నాకు మాత్రం వాళ్ళు నన్ను చంపేయాలనే అనుకుంటున్నాను….
మంధర : లేదమ్మా….అలా జరగటానికి వీల్లేదు….నేను మిమ్మల్ని అలా చావనివ్వను….

మోహిని : అరే పిచ్చిదానా….ఎప్పటి వరకైతే ఈ తాయెత్తు నా దగ్గర ఉంటుందో నన్ను ఎవరూ చంపలేరు….నన్ను చంపలేకపోతే వీళ్ళు నన్ను ఇక్కడే కారాగారంలో బంధీగా ఉంచుతారు….కాని వాళ్ళకు ఒక్క విషయం తెలియదు మంధరా….శరీరాన్ని మాత్రం కారాగారంలొ ఉంచగలరు….కాని ఆత్మని బంధించలేరు కదా….నేను నా పగ తీర్చుకోవాలంటే….నేను ఈ శరీరాన్ని వదిలి ప్రేతాత్మని కావాల్సి ఉంటుంది….ఎలాంటి ప్రేతాత్మ అంటే దాన్ని ఎదుర్కోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి….దాన్ని ఎదుర్కోవడం సంగతి అలా ఉంచి దాని నుండి రక్షించుకొవడం కూడా అసాధ్యమే అవుతుంది….ఎంత ప్రమాదకరమైన ప్రేతాత్మలా మారతానంటే….రంజిత్ సింగ్ తరువాత రాబోయే తరాలు నా పేరు తలుచుకుంటేనే గడగడ వణికిపోవాలి….(అంటూ తన చేత్తో మంధర చేతిని పట్టుకుని ఆమె చేతిలో ఆ తాయెత్తుని పెట్టి) ఈ పనిలొ నువ్వు నాకు సహాయం చేస్తావా…..
మంధర : సహాయమా….కాని ఏం చేయాలి….మీ కోసం ఏదైనా చేస్తాను….
మోహిని : నా మాటలు చాలా జాగ్రత్తగా విను….వీళ్ళు నన్ను చంపేసి నా శరీరాన్ని కాల్చేసిన తరువాత…నువ్వు నా అస్థికలను తీసుకుని దాచిపెట్టెయ్….ఆ దాచిపెట్టే చోటు ఎవరికి తెలియకూడదు….నా అస్థికలు ఎప్పటి దాకా అయితే నదిలొ కలకుండా ఉంటారో అప్పటి దాకా నా ఆత్మకు ముక్తి అనేది ఉండదు…..ఎప్పటి దాకా అయితే నాకు ముక్తి లభించదో అప్పటి దాకా నేను ఈ రాజ కుటుంబానికి నా ప్రేతాత్మ నుండి విముక్తి ఉండదు….

అంతా విన్న తరువాత మంధర అక్కడ నుండి వెళ్ళి పోయి మోహిని చనిపోయిన తరువాత ఆమె అస్థికలను రహస్యంగా దాచేసింది.
(ప్లాష్ బ్యాక్ అయిపోయింది)
మొత్తం రికార్డర్ లో విన్న తరువాత రాము దాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తున్నాడు.
సుమిత్ర : ఇప్పుడు మోహిని ప్రేతాత్మని అంతం చేయాలంటే మనం ఆమె అస్థికలు ఎక్కడ ఉన్నాయో వెదికి వాటిని నీళ్లల్లో కలిపితే దాని పీడ శాశ్వతంగా అంతమైపోతుంది.
మహేష్ : కాని ఈ అస్థికలు ఎక్కడ దాచిపెట్టారు అనేది ఎలా తెలుస్తుంది….

రాము : అదే నేను ఆ మంధర ప్లేసులో ఉన్నట్టయితే ఆ అస్థికలను రాజమహల్ లో అక్కడే దాచిపెడతాను….
సుమిత్ర : అవును….నాక్కూడా అస్థికలు అక్కడే ఉన్నాయని అనిపిస్తున్నది….కాని రాజమహల్ కి పగలు పూట వెళ్ళి అక్కడ వెదకడం కుదరదు….అంతే కాక ఆ రాజమహల్ నది మధ్యలో ఉన్నది….మనం పడవలో వెళ్ళాల్సి ఉంటుంది….​
Next page: Update 031
Previous page: Update 029