Update 033

ఆ మాట వినగానే సుమిత్ర వెనక్కు తిరిగి రాము వైపు ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు అన్నట్టు విసుగ్గా చూసింది.
కాని మహేష్ మాత్రం వెంటనే, “ఏడు కుండలు ఉంటాయి….” అన్నాడు.
రాము ఆ శిల్పాల్లో ఉన్న కుండల వైపు చూసి, “కాని ఇక్కడ ఎనిమిది ఉన్నాయి….” అన్నాడు.
దాంతో సుమిత్ర, మహేష్ కూడా అక్కడకు వచ్చి ఆ కుండల వైపు చూసారు…..ఆ కుండల్లో పై కుండ మాత్రం చెక్కిన శిల్పాల్లా కాకుండా నిజం కుండ పెట్టినట్టు వేరేగా ఉన్నది.
రాము వెంటనే అక్కడ ఉన్న సుత్తి, శానం తీసుకుని అక్కడ ఉన్న స్టూల్ ఆ బొమ్మల దగ్గర వేసి ఆ కుండని తీయడానికి తన చేతిలో ఉన్న శానాన్ని పెట్టి దాని మీద సుత్తితో కొట్టబోయాడు….

కాని అంతలో వాళ్ళు నిల్చున్న చోట నుండి కొద్దిదూరంలో ఎవరో అరుస్తున్నట్టు వినిపించడంతో ముగ్గురూ అటు తిరిగి చూసారు.
వాళ్ళు చూస్తుండగానే వాళ్ళకు కొద్ది దూరంలో వాళ్ళు ఎక్కి వచ్చిన పడవ తాలూకు తాళ్ళు పడ్డాయి.
అది చూసి మహేష్ భయంతో, “అరేయ్….నువ్వు ఇక్కడ కుండ మీద చెయ్యి పెట్టగానే….ఆ ప్రేతాత్మ వచ్చేసిందిరా….అదేనా…. సుమిత్రా,” అంటూ సుమిత్ర వైపు చుస్తూ అడిగాడు.

సుమిత్ర మహేష్ వైపు చూసి, “నీకు ఇంకా డౌట్ గా ఉన్నదా….అదే వచ్చేసింది….(అంటూ రాము వైపు తిరిగి) రామూ….నేను పడవ దగ్గరకు వెళ్తాను….పడవ వెళ్ళిపోయిందంటే మనం ఇక్కడ నుండి వెళ్ళలేము….నువ్వు ఎట్టి పరిస్థితుల్లోను దాని అస్థికలు ఉన్న కుండను ప్రేతాత్మకు చిక్కనివ్వకు….దాన్ని ఇక్కడ నదిలో కలిపితేనే దానికి ముక్తి లభిస్తుంది….నువ్వు కానివ్వు….” అంటూ అక్కడనుండి పరిగెత్తుకుంటూ కింద పడి ఉన్న తాడు తీసుకుని వెళ్ళింది.
దాంతో రాము తన చేతిలొ ఉన్న సుత్తి తో అక్కడ కుండ చుట్టూ జాగ్రత్తగా శానంతో చెక్కి వాటిని కింద పడేసి కుండని బయటకు తీసాడు.
సుమిత్ర పరిగెత్తుకుంటూ రాజ్ మహల్ నుండి బయటకు వచ్చి తాము బోట్ కట్టేసిన చోటకు వచ్చింది….కాని అప్పటికే అది నదిలో దూరంగా వెళ్ళిపోయింది.

అలా గట్టు మీద నిల్చున్న సుమిత్ర ఏం చేయాలో తోచక అలాగే చూస్తుంటే….కింద నుండి ఒక చెయ్యి పైకి వచ్చి సుమిత్ర కాలిని పట్టుకుని కిందకు లాగింది.
సుమిత్ర ఒక్కసారిగా కింద పడిపోయింది….ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ఆ మోహిని ప్రేతాత్మగా మారిపోయి సుమిత్ర కాళ్ళను పట్టుకుని నదిలోకి ఈడ్చుకు పోయింది.
లోపల రాజ మహల్ లొ రాము తన చేతిలో ఉన్న కుండని కింద పెట్టి దాని పైన మూతని తీసి చూసాడు.
లోపల అస్థికలు ఉందటంతో రాము మళ్ళీ కుండ మీద మహేష్ ఇచ్చిన కర్చీఫ్ ని జాగ్రత్తగా కట్టేసి చేతుల్లోకి తీసుకుని పైకి లేవగానే ఎదురుగా సుమిత్ర రావడం చూసారు.
రాము : సుమిత్రా….అస్థికలు దొరికాయి….
సుమిత్ర : సరె….పదండి వెళ్దాం….
అంటూ వెనక్కు తిరిగి బయటకు నడుస్తుండటంతో రాము, మహేష్ కూడా ఆమె వెనకాల నడవడం మొదలుపెట్టారు.

కాని మహేష్ కి మాత్రం మనసులో ఎక్కడో డౌట్ గా ఉన్నది….ఇంత ప్రశాంతంగా ఉండటం చూసి చుట్టూ చూస్తూ నడుస్తూ సుమిత్ర వైపు చూసాడు.
ఎప్పుడూ గలగల మాట్లాడె సుమిత్ర ఏం మాట్లాడకుండా నడుస్తుండే సరికి డౌట్ వచ్చి రాము వైపు చూసి…..
మహేష్ : అరేయ్….సుమిత్ర ఏంటిరా….మాట్లాడకుండా మెదలకుండా నడుస్తున్నది….
Next page: Update 034
Previous page: Update 032