Update 050

దాంతో రాము ఒకరకమైన హిప్నాటిజం లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయాడు.
అప్పటిదాకా అతని ఒంటి మీద ఉన్న దెబ్బలు మొత్తం మాయమైపోయాయి.
బాబా సుమిత్ర వైపు చూసి, “ఈశ్వరుడు ప్రతి మనిషిని ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన పని మీదనే ఈ లొకానికి పంపిస్తాడు…. రాము ఈ భూమి మీదకు రావడానికి అనేక కారణాల్లో రేణుక చెర విడిపించడం కూడా ఒక కారణం….ఇప్పుడు రాము తన శరీరంతో రేణుక ఉన్న కాలానికి వెళ్తాడు…..” అంటూ బాబా రాము దగ్గరకి వచ్చి, “అయితే విను….ఇక్కడ నీకు ఏదైతే వినిపిస్తున్నదో, అర్ధమవుతున్నదో దాన్ని నువ్వు మనస్పూర్తిగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టు….” అన్నాడు.

బాబా ఏం చెబుతున్నాడో అర్ధంకాక రాము, “మీరు చెప్పేది నాకు అర్ధం కాలేదు….” అన్నాడు.
“అంటే….రేణుక బాధను నీ బాధలాగా అనుభవించు….ఆమెకు ఏదైతే జరిగిందో అది నీకు జరిగినట్టు ఫీల్ అవ్వు…..రేణుక ఆత్మ బాధతో నీ బాధ కూడా కలిస్తే మొత్తం ప్రపంచమే మారిపోతుంది…కాలం మారిపోయిద్ది….” అంటూ బాబా రాము కళ్ళల్లోకి తీక్షణంగా చూసాడు.
రాము కూడా పైకి లేచి బాబా కళ్ళల్లోకి చూసాడు….అలా చూస్తున్న రాముకి బాబా కళ్ళల్లోనుండి ఏదో శక్తి తన ఒంట్లోకి పాకినట్టు అయింది.
బాబా రాము కళ్ళల్లోకి అలాగే తీక్షణంగా చూస్తూ, “లోపలికి వెళ్ళు….” అంటూ విల్లా మెయిన్ డోర్ వైపు చూసాడు.
దాంతో రాత్రి నుండి మూసుకుపోయిన విల్లా తలుపులు తెరుచుకున్నాయి.

విల్లా తలుపులు బాబా చూసిన చూపుకి వాటంతట అవే తెరుచుకోవడంతో రాము ఏం జరుగుతున్నదో….అసలు ఈ బాబా ఎవరో అర్ధం కాక మళ్ళీ బాబా వైపు తల తిప్పి చూసాడు.
బాబా కూడా రాము వైపు తిరిగి అతని కళ్ళల్లోకి చూస్తూ, “ఇక…..లోపలికి….వెళ్ళు,” అన్నాడు.
ఏదో హిప్నటైజ్ చేసినట్టు రాము అక్కడ నుండి విల్లా వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు.
అలా వెళ్తున్న రాముని చూస్తూ బాబా, “నీ వల్లే అవుతుంది…..ఇది నీ ఒక్కడి వల్లే పూర్తవుతుంది…” అంటూ తన చేతిలో ఉన్న హుక్కా నోట్లో పెట్టుకుని గట్టిగా రెండు సార్లు పీల్చి పొగను రాము వైపుకు ఊదాడు.

అప్పటి దాకా నీరసంగా, భయంగా వెళ్తున్న రాముకి వెనకనుండి బాబా వదిలిన హుక్కా పొగ అతని ముక్కుకి తగిలి మెదడులోకి వెళ్లగానే రాము వెళ్తున్న వాడల్లా ఒక్కసారిగా ఆగిపోయి అతని ప్రమేయం లేకుండానే కళ్ళు మూతలు పడిపోయాయి.
కళ్ళు మూతలు పడగానే రాము చెవులకు తాను వీడియోలో విన్న పియానో పాట వినిపించడం మొదలయింది.
అలా రాము పియానో పాటను వింటూ విల్లా లోపలికి వెళ్ళి బెడ్ రూమ్ లో ఉన్న పియానో ముందు కూర్చుని తాను కూడా అదే పాటను ప్లే చేయడం మొదలుపెట్టాడు.
రాము అలా పియానో ప్లేచేస్తూ లెటర్ లో రేణుక రాసిన విషయాలను, సుందర్ రేణుకని రేప్ చేయడానికి ట్రై చేసినప్పటిది, ఆ సమయంలో ఆమె బాధతో పెట్టిన కేకలు, సుందర్ చనిపోయిన తరువాత అతని ప్రేతాత్మ రేణుకని క్రూరంగా రేప్ చేయడం, రేణుక బెడ్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోవడం అంతా కళ్ళు మూసుకుని పియానో ప్లే చేస్తున్న రాము మనసులో అంతా తన ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుండటంతో బాధతో అతని కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి.

అలా బాధపడుతూనే రాము పియానో ప్లే చేస్తూ అలాగే ముందుకు వాలిపోయి పియానో మీద పడిపోయాడు.
పియానో మీద పడిపోయిన రాము అలా నిద్ర పోయి….కిటికీ లోనుండి తన మీద ఎండ పడటంతో చిన్నగా పియానో మీద నుండి తల పైకి ఎత్తి చూసాడు.​
Next page: Update 051
Previous page: Update 049