Update 061

సుందర్ రెండడుగులు వేయగానే అతని తల నుండి రక్తం ధారగా కారడం మొదలయింది.
అప్పటికే రాము కూడా లోపలికి వచ్చి సుందర్ తల మీద నుండి రక్తం కారుతుంటే ఏం చేయాలో తెలియక అలాగే చూస్తున్నాడు.
సుందర్ అలా తల నుండి రక్తం ధారగా కారడం చూసి రేణుక కూడా భయంతో గోడకు ఆనుకుని అలాగే చూస్తున్నది.
సుందర్ చిన్నగా అలాగే ఇంకో రెండడుగులు ముందుకు వేసి రేణుక మీద పడి పోయాడు.
రేణుక భయంతో సుందర్ ని తన మీద నుండి కిందకు తోసింది…..అప్పటికే సుందర్ చనిపోయి కింద పడిపోయాడు.
తన మీద నుండి సుందర్ ని తోసేసిన తరువాత రేణుక ఏడుస్తూ రాము వైపు చూసింది.

ఏది జరక్కుండా ఆపుదామని వారం రోజుల నుండి రేణుక వెన్నంటే ఉండి కాపాడుకుంటూ వచ్చాడో….అదే జరిగే సరికి రాముకి కూడా ఏం చేయాలో తోచక తల మీద తగిలిన దెబ్బ విపరీతంగా బాధ పెడుతుంటే నిస్సహాయంగా అలాగే వెనక్కి అడుగులు వేస్తూ గది లోనుండి బయటకు వచ్చి కారిడార్ లో కూర్చుండిపోయాడు.
గదిలో ఉన్న రేణుక రాము ఏమీ మాట్లాడకుండా ఉండే సరికి ఆమె కూడా ఏంచేయాలో తెలియక రాము వైపు ఏడుస్తూ చూస్తున్నది.
బయట కూర్చున్న రాము అలాగే పక్కకు వాలిపోయి సృహ తప్పి పడిపోయాడు.
***********
తరువాత మెలుకువ వచ్చి చూసే సరికి తను హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్నట్టు, తన తలకు కట్టు కట్టినట్టు గమనించాడు రాము.

తల మీద తగిలిన దెబ్బకు రాముకి తల చాలా భారంగా ఉన్నట్టు అనిపించడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసాడు.
ఎదురుగా బెడ్ పక్కనే చైర్ లో రేణుక కూర్చుని ఉన్నది….ఆమె పక్కనే సునీత నిల్చుని ఉన్నది.
వాళ్ళిద్దరూ కంగారుగా రాము ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అన్నట్టు ఆత్రంగా చూస్తున్నారు.
రేణుక కళ్ళల్లో అయితే నీళ్ళు కారుతున్నాయి.
రాము కళ్ళు తెరవడం చూసి రేణుక ఆనందంగా దగ్గరకు వచ్చి అతని చేయి పట్టుకుని నిమురుతూ, ఇంకో చేతిని రాము మొహం మీద పెట్టి చిన్నగా నిమురుతూ, “ఇప్పుడు ఎలా ఉన్నది రాము,” అనడిగింది.

సునీత కూడా సంతోషంగా, “ఎలా ఉన్నది రాము….రెండు మూడు రోజుల్లో నువ్వు లేచి తిరుగుతావని డాక్టర్ గారు చెప్పారు,” అన్నది.
కాని రాము తల మీద తగిలిన దెబ్బతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు.
రాము తన కళ్ళు బలవంతంగా తెరిచి రేణుక వైపు చూస్తూ, “అతను….అతను….ఇక్కడే ఉన్నాడు….వాడు....ఇప్పుడు….వాడు ఇప్పుడు ప్రేతాత్మ అయిపోయాడు,” అంటూ చిన్నగా మాట్లాడుతున్నాడు.
రాము ఏం చెబుతున్నాడో అర్ధం కాని రేణుక, “రాము….ఏం మాట్లాడుతున్నావు….నువ్వు ఏం చెబుతున్నావో మాకు అసలు అర్ధం కావడం లేదు,” అనడిగింది.
సునీత కూడా రాము మాట్లాడుతున్నది అర్ధం కాక అలాగే చూస్తున్నది.​
Next page: Update 062
Previous page: Update 060