Update 071
రేణుక : అదంతా నాకు తెలియదు రాము….ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో తెలియదు….కాని నువ్వు పరిచయం అయిన మొదటి రోజు నిన్ను వదిలి ఇంటికి వెళ్ళిన తరువాత ఏదో చాలా వెలితిగా అనిపించింది…రాత్రి కూడా పడుకుంటే నిద్ర రాలేదు. నువ్వు మళ్ళీ కనిపిస్తే బాగుండు అని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా….తరువాత చిన్నగా నీతో ఉన్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించేది….
రాము : నా గురించి నీకు ఏమీ తెలియదు కదా…..
రేణుక : మీ అబ్బాయిలు అమ్మాయి అందంగా ఉంటే చాలు ప్రేమలో పడిపోతారు…కాని అమ్మాయిలు మాత్రం అబ్బాయి అందంగా లేకపోయినా మంచి మనసు, నడవడిక ఉంటే చాలు….
రాము : మరి నాలో అవన్నీ కనిపించాయా….
రేణుక : అవును….ఆడది మగాడు తనను చూసే చూపుల విధానాన్ని బట్టే వాడు ఎలాంటి వాడు అన్న అంచనా వేస్తుంది. మొదటి రోజు నువ్వు నాపక్కన నడిచేప్పుడు కనీసం నావంక కూడా చూడలేదు…
చాలా మర్యాదగా మాట్లాడావు…తరువాత నీ బిహేవియర్ చూసి నిన్ను ఇష్టపడ్డాను…
రాము : అబ్బో నా గురించి చాలా తెలుసుకున్నావే….చాలా తెలివైన దానివి….
రేణుక : అవును కదా….
రాము : అంటె ఇప్పుడు చెప్పిన అనాలసిస్ ప్రకారం నేను అందంగా లేనా….
రేణుక తన ఎత్తి రాము వైపు చిలిపిగా చూస్తూ….
రేణుక : నా అంత అందంగా లేకపోయినా….ఫరవాలేదు….నా పక్కన బాగానే ఉంటావు….
అంటూ తన నాలుకని బయట పెట్టి వెక్కిరిస్తున్నట్టు నవ్వుతూ అన్నది.
రాము : నిన్నూ…..
అంటూ రాము రేణుకను ఇంకా దగ్గరకు లాక్కుని ఆమె నుదురు మీద ముద్దు పెట్టాడు.
అలా వాళ్ళిద్దరు నవ్వుతూ, తుళ్ళుతూ మాట్లాడుకుంటుండగా రాము జేబులో నుండి అతని సెల్ ఫోన్ కింద పడింది.
రాము దాన్ని చేతిలోకి తీసుకుని దాని మీద ఉన్న మట్టిని దులుపుతున్నాడు.
రాము చేతిలో ఉన్న సెల్ చూసి రేణుక, “ఇలాంటిది మా నాన్నగారి దగ్గర కూడా ఉన్నది…కాకపోతే చాలా పెద్దది…ఇంత చిన్న టైప్ రైటర్ ఇప్పటి వరకు నేను చూడలేదు,” అన్నది.
రేణుక సెల్ ఫోన్ గురించి అలా అనగానే రాముకి నవ్వాగలేదు….ఒక్క నిముషం ఆగకుండా నవ్వున తరువాత రేణుక వైపు చూసి…
రాము : ఇది టైప్ రైటర్ కాదు….ఇది టెలిఫోన్….
రాము అలా చెప్పగానే రేణుక అతని మాట నమ్మనట్టు చూస్తూ….
రేణుక : అవునా….నేను నీ కన్నా యాభై ఏళ్ళు వెనక వాళ్ళం అయుండొచ్చు….కాని నాకు తెలివి లేదనుకోకు…
రాము : లేదు రేణుక….నేను నిజమే చెబుతున్నాను….దీన్ని మా కాలంలో సెల్ ఫోన్ అంటారు….2010 లో అందరి దగ్గర ఇలాంటివే ఉంటాయి….జస్ట్ అవతలి వాళ్ల నెంబర్ ప్రెస్ చేసి….మాట్లాడటమే….అంతే సింపుల్….