Update 089

సునీత (సుందర్ ప్రేతాత్మ) అలా గిలగిలలాడిపోవడం కొయ్యబారిపోయి అలాగే కదలకుండా చూస్తున్న రేణుక చెయ్యి పట్టుకుని రాము బయటకు లాక్కెళ్ళి గది బయట నుండి గడి వేసి అక్కడ నుండి పరిగెత్తుకుంటూ హోటల్ బయటకు వచ్చి వెంటనే కారులో కూర్చుని స్టార్ట్ చేసి పోనిచ్చాడు.
గదిలో ఉన్న సునీత (సుందర్ ప్రేతాత్మ) అలాగే తన వీపులో ఉన్న కత్తిని భరిస్తూ రాము రేణుకని తీసుకెళ్లాడన్న కోపంతో తలుపు దగ్గరకు వచ్చి గట్తిగా అరుస్తూ తీయడాని ట్రై చేస్తూ గట్టిగా తలుపుని లాగుతున్నది.
కొద్దిసేపటికి సునీత (సుందర్ ప్రేతాత్మ) తలుపు పగలకొట్టుకుని బయటకు వచ్చింది.
కాని అప్పటికే రాము, రేణుక కారులో చాలా దూరం వెళ్ళిపోయారు…..బయటకు వచ్చిన సునీత (సుందర్ ప్రేతాత్మ) కు వీళ్ళిద్దరూ…..ముఖ్యంగా రేణుక కనిపించకపోయేసరికి కోపంతో గట్టిగా అరిచింది.
**********

రాత్రంతా ఆపకుండా ప్రయాణం చేసిన తరువాత రాము కారుని ఎవరికీ కనిపించకుండా అక్కడ అడవిలో ఒక పొద లోపల ఆపాడు.
అప్పటికే ఇద్దరూ బాగా అలిసిపోయి ఉండటంతో ఒకరిని ఒకరు కౌగిలించుకుని ఒళ్ళు తెలియకుండా నిద్ర పోయారు.
అలా నిద్ర పోయిన కొద్దిసేపటికి రాము పక్కన రేణుక కనిపించకపోవడంతో వెనక సీట్లో ఉన్నదేమో అని చూసాడు.
కాని రేణుక వెనక సీట్లో కూడా లేకపోవడంతో రాము చుట్టూ చూస్తూ, “ఈ అడవిలో ఎక్కడకు వెళ్ళింది,” అనుకుంటూ కారు దిగి నాలుగడుగులు ముందుకు వేసి, “రేణూ…..రేణు,” అంటూ పిలుస్తూ ఆమె కోసం వెదుకుతున్నాడు.
కాని రేణుక కనిపించకపోయేసరికి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా ఆ దారి వెంబడి పరిగెత్తుకుంటూ ముందుకువెళ్ళాడు.
అలా కొద్దిదూరం పరిగెత్తిన తరువాత దూరంగా రేణుక వెళ్తూ కనిపించడంతో అలాగే, “రేణూ…రే…ణూ…ఆగు…ఎక్కడికి వెళ్తున్నావు ఆగు….” అంటూ ఆమె దగ్గరకు వెళ్ళి, “రేణూ….ఎక్కడికి వెళ్తున్నావు,” అనడిగాడు.

రేణుక ఏమీ మాట్లాడకుండా అలాగే నడుస్తుండటంతో…రాము అసహనంగా ఆమె వైపు చూస్తూ, “నేను నీతోనే మాట్లాడుతున్నాను. రేణూ ఎక్కడకు వెళ్తున్నావు,” అన్నాడు.
అంతలా అడిగినా రేణుక ఏమీ మాట్లాడకుండా నడుస్తుండటంతో రాముకి కోపం వచ్చె ఆమెను రెండు భుజాల మీద చేతులు వేసి తన వైపుకి తిప్పుకుని, “ఎక్కడికి వెళ్తున్నావు….అడుగుతుంటే మాట్లాడవేంటి,” అని గట్టిగా అడిగాడు.
దాంతో రేణుక రాము వైపు చూస్తూ, “నీ నుండి దూరంగా వెళ్తున్నాను….” అన్నది.
“ఎందుకు….రేణూ….అలా నన్ను వదిలి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు….” అనడిగాడు రాము.
“ఎందుకంటే…ఏదైతే జరుగుతున్నదో దానికంతటికి కారణం నేనే అని నాకు అర్ధమయింది…జరుగుతున్నది మనం ఆపలేమని కూడా నాకు బాగా అర్ధమయింది….ప్రొఫెసర్ సుందర్ చనిపోవాలి కాబట్టి అతను చనిపోయాడు….కాని కిషన్, సునీత వీళ్ళిద్దరిని నువ్వు రక్షించలేకపోయావు….” అన్నది రేణుక.
“అంటే నువ్వు నానుండి దూరంగా వెళ్ళి నిన్ను నువ్వు రక్షించుకోగలననుకుంటున్నావా….” అంటూ రెట్టించిన కోపంతో అడిగాడు రాము.​
Next page: Update 090
Previous page: Update 088