Update 090

అది విన్న రేణుక రాము కళ్ళల్లోకి చూస్తూ, “నన్ను నేను రక్షించుకోవడానికి వెళ్ళడం లేదు…..నేను నిన్ను రక్షించుకోవడానికి ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను….” అంటూ తనను పట్టుకున్న రాము చేతులను విడిపించుకుని అక్కడ నుండి కదిలింది.
రాము ఒక్క క్షణం ఏం చెయ్యాలో అర్ధం కాలేదు….వెనక్కు తిరిగి అలా వెళ్ళిపోతున్న రేణుక వైపు చూస్తూ వెంటనే ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా, “రేణూ……” అంటూ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళాడు.
రాము తన ముందుకు వచ్చి నిల్చోవడంతో రేణుక ఆగి రాము వైపు ఏంటన్నట్టు చూసింది.

రాము రేణుక కళ్ళల్లోకి చూస్తూ, “రేణు…..నువ్వు చెప్పింది నిజమే….జరిగేది ఎవరూ ఆపలేరు….కాని ఎవరైనా 2010 నుండి యాభై ఏళ్ళు కాలంలో వెనక్కి 1960 కి ఎవరైనా రాగలుగుతారా….ఒక్కసారి ఆలోచించు…నన్ను ఆ కాలం నుండి ఈ కాలంలో ఏ శక్తి తీసుకొచ్చిందో నాకు తెలియదు….ఏ శక్తి మనిద్దరిని కలిపిందో అది కూడా నాకు తెలియదు….కాని ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెబుతాను…..నేను ఇక్కడికి వచ్చింది మాత్రం జరుగుతున్నది మార్చడానికే అని మాత్రం చెప్పగలను,” అన్నాడు.
ఆ మాట వినగానే రేణుక రాము కళ్ళల్లొకి చూస్తూ, “ఒకవేళ నా కారణంగా నీకు ఏదైనా జరిగితే….నన్ను నేను జీవితంలొ ఎప్పటికీ క్షమించుకోలేను రాము,” అంటూ తన చేతిని రాము మొహం మీద వేసి అతని బుగ్గల మీద నిమురుతున్నది.

“నువ్వు చెప్పింది కరెక్టే….కాని నేను ఉండగా నీకు ఏదైనా జరిగితే ఆ మరుక్షణమే నేను బ్రతికిఉండను….నీతో పాటే చనిపోతాను,” అంటూ తన మొహం మీద ఉన్న రేణుక చేతి మీద చెయ్యి వేసి పట్టుకున్నాడు.
ఆ మాట వినగానే రేణుక కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి….అలాగే రాము వైపు చూస్తూ, “ఎందుకు రాము….ఎందుకలా…నా గురించి నీకు అంత శ్రధ్ధ దేనికి….నాకు అంత ఇంపార్టెంన్స్ దేనికి,” అని అడిగింది.
రాము ముందుకు జరిగి రేణుక దగ్గరకు వచ్చి తన రెండు చేతులను ఆమె భుజం మీద వేసి దగ్గరకు లాక్కుంటూ తన చేతులను రేణుక భుజాల మీద నుండి పైకి తీసుకొచ్చి మెడ వెనక ఒక చెయ్యి వేసి నిమురుతూ, ఇంకో చేతిని ఆమె జుట్టులోకి పోనిచ్చి నిమురుతూ ఆమె మొహం మీద మొహం పెట్టి కళ్ళల్లోకి చూస్తూ, “రేణూ….నాకదంతా తెలియదు….నీ మీద ప్రేమో….ఆకర్షణో నాకు తెలియదు….కాని నాకు మాత్రం నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించడం లేదు….ఎప్పుడూ నీతోనే ఉండాలి అనిపిస్తున్నది….కాని ఒకటి మాత్రం నాకు తెలుసు….ఇప్పుడు నాకు నేనంటె కూడా నువ్వే ఇక్కువ ఇష్టంగా అనిపిస్తున్నది. ఇదే ఫీలింగ్ ప్రేమ అయితే….నాకు నువ్వంటే చెప్పలేనంత ప్రేమ…..రేణూ….నిన్ను చూస్తుంటే నీకంటే అయిన వాళ్ళు ఇష్టం అయిన వాళ్ళు ఎవరు లేరనిపిస్తున్నది….” అంటూ తన పెదవులను ఆమె పెదవుల దగ్గరకు తీసుకొస్తున్నాడు.
రాము పెదవులు తన మీదకు రావడం చూసి రేణుక కూడా తన మొహాన్ని ముందుకు తీసుకొచ్చి పెదవులతో రాము పెదవులను మూసేసింది.
అలా కొద్దిసేపు ఇద్దరూ ఒకరి పెదవులను ఒకరు ముద్దు పెట్టుకుంటూ ఎంతసేపు అలా ఉన్నారో కూడా తెలియలేదు.
***********​
Next page: Update 091
Previous page: Update 089